http://parnashaala.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
I am a fish separate from CROWD. Still trapped in my own. But,Its just BIGGER and BETTER. That's all.
Updated: 34 min 4 sec ago

స్నేహాల గిలిగింతల సాక్షిగా

Mon, 07/26/2010 - 07:12
‘ఉడాన్’ చిత్రంలోని కవితకు తెలుగు స్వేఛ్ఛానువాదం;



క్షణాల లాను పై
చెదిరి పడిన జ్ఞాపకాలు
ఆ జ్ఞాపకాల మీదుగా
నా నగ్నపాదాల నడక.
చాలా దూరం వచ్చేశాను.
ఇప్పుడు కనీసం గుర్తులేదు
చెప్పులెక్కడొదిలానో...

వచ్చిప్పుడు పాదాలు సుకుమారంగా ఉన్నాయి
ఇప్పుడూ ఆ సౌకుమార్యం వీడిపోలేదు
చక్కిలిగిలిపెట్టే మనస్నేహాల గిలిగింతల సాక్షిగా
బహుశా ఎప్పటికీ వీడదుకూడా

నిజంగా...
చెప్పులెక్కడొదిలానో ఇంకా గుర్తులేదు
కానీ, అనిపిస్తుంది
వాటి అవసరం ఇప్పట్లో లేదని

****
Categories: Right

నిజంలోంచీ కలలోకి, కలలోంచీ కలల్లోకి : INCEPTION

Tue, 07/20/2010 - 02:24
“ Dreams feel real while we’re in them. It’s only when we wake up that we realize something was actually strange”
- Cobb in INCEPTIONనీ కలల్లోకి నేను జొరబడగలిగితే…!
నీకే తెలియని నీ ఆలోచనల్ని నేను దొంగిలించగలను.
నేనే నీ మనసులో ఒక కొత్త ఆలోచనను నింపాలంటే?!
నీ కలల్లోంచీ నిన్ను మరో కల కనేలా ఉసిగొల్పాలి.
అది సాధ్యమా?‘సాధ్యమే…నిజంలోంచీ కలవరకూ, కలనుంచీ ఒక సామూహిక స్వప్నం వరకూ….
సామూహిక స్వప్నం నుంచీ మరో కలలోకి అలాఅలా జారడం సాధ్యమే. మనసులోని ఆలోచనల్ని దొంగిలించడమే కాదు కొత్త ఆలోచనల్ని సృష్టించడమూ సాధ్యమే’ అంటాడు దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ ‘ఇన్సెప్షన్’ చిత్రంలో.
కానీ సమస్యల్లా, నిజంలా అనిపించే కలలో “జీవించిన”తరువాత నిజానికీ కలకూ బేధం మిగిలుంటుందా అనేదే. దానికి సమాధానం అంత సులభంగా దొరకదు.

మరి సమాధానం లేని సమస్యని అవసరంకోసం ఆహ్వానిస్తే…పరిణామాలు ఎలా ఉంటాయి? అనేదే ఈ సినిమా.
మ్యాట్రిక్స్ సినిమా తరువాత cinematic imagination ని మరోస్థాయికి తీసుకెళ్ళిన చిత్రమిది. ఈ సినిమాను ఒకసారి చూసి సమీక్షించడం, రెండుసార్లు చూసి విశ్లేషించడం లాంటి సాహసాలు చెయ్యడానికి నేను పూనుకోకూడదని తెలిసొచ్చి, కేవలం “చూడండి” అని చెప్పడానికి ఇది రాస్తున్నాను.

చూడబోయే ముందు ఒక్క మాట, ఈ సినిమా ఒకసారి చూస్తే అద్భుతమైన కలలా ఉంటుంది. థియేటర్ బయటొచ్చిన తరువాత అనుభవం లీలగా తెలిసొస్తుందిగానీ, వివరాలు గుర్తుకు రావు. ఎంత అర్థమయ్యిందో అస్సలు అంచనాకు రాదు. అందుకే, ఈ సినిమాని నిజంలా ఫీలవ్వాలంటే కనీసం మరో మూడుసార్లు చూడాలి. అందుకు మీరు రెడీగా ఉంటే GO AHEAD…SEE IT…DREAM IT.





****
Categories: Right

గాయపడిన పక్షి ప్రయాణం – ఉడాన్ (సమీక్ష)

Sun, 07/18/2010 - 09:23
గత పదిహేనేళ్ళుగా  ప్రి-టీన్స్, టీన్స్ ని విస్తృతమైన మార్కెట్ సెగ్మెంటుగా హాలీవుడ్ గుర్తించి వారికోసం సినిమాలు తియ్యడం మనకు తెలిసిందే. చాలా వరకూ వాటిల్లో చాలా వరకూ టీన్ సెక్స్ కామెడీలు ఉన్నా, టీనేజి సమస్యలు వారి మానసిక స్థితులు మొదలైన ప్రశ్నల గురించి చర్చించిన చిత్రాలు కూడా చాలా ఉన్నాయనేది కాదనలేం.  అత్యధిక కలెక్షన్లు చేసిన సినిమాలలో నిలబడున్న ‘హ్యారీపోట్టర్’ ఈ కోవలోకే రావడం గమనార్హం. కానీ, భారతీయ సినిమాల్లో ఈ సెగ్మెంట్ ప్రేక్షకులకు ఇప్పటివరకూ సరైన ప్రాముఖ్యత దక్కలేదు. అడపాదడపా ‘చిత్రం’, ‘కొత్తబంగారు లోకం’ వంటి చిత్రాలు వచ్చినా అవి ప్రేమ ప్రధానమైన చిత్రాలుగా మాత్రమే మిగిలిపోయాయిగానీ టీనేజి ఆశల్ని, ఆలోచనల్ని, సమస్యల్నీ, ఆశయాల్నీ, ఐడెంటిటీని చూపించడంలో పూర్తిగా విఫలమయ్యాయి.

నాగేష్ కుక్కునూర్ తీసిన ‘రాక్ ఫోర్డ్’  ఆ దిశగా ఒక మంచి ప్రయత్నమనుకుంటే, విక్రమాదిత్య మోత్వానీ చిత్రం ‘ఉడాన్’ ఒక అర్థవంతమైన హృద్యమైన గుర్తుండిపోయే  కొనసాగింపు అనుకోవాలి.

పూర్తి సమీక్ష కోసం నవతరంగం చూడండి. 

****
Categories: Right

ఐ లవ్ ‘పైరసీ’

Thu, 07/15/2010 - 11:49
AVS గారి బ్లాగు పుణ్యమా అని పైరసీ చర్చలు మళ్ళీ మొలయ్యాయి.

ఈ పైరసీ గురించి చర్చ వచ్చినప్పుడల్లా నేను ఏవైపుండాలో నాకు అర్థం కాదు.
ఎందుకంటే, నాకు హాలీవుడ్ మరియూ ప్రపంచ సినిమాలు చూడాలంటే పైరసీనే గతి. భారతదేశంలో కూడా ధియేటర్లో ఆడని “గొప్ప సినిమాలు” చూడాలంటే పైరసీనే ఇప్పటికీ గతి. ఒరిజినల్ కొనాలంటే జేబు పర్మిట్ అస్సలు చెయ్యదు. సాధారణంగా తెలుగు సినిమాల్ను థియేటర్లో చూసే నేను చాలా సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ బయట ఉండటం వలన మళ్ళీ పైరసీ వలనే చూసే అవకాశం లభించింది. ఇప్పుడు కొన్ని సెలెక్టివ్ సినిమాలు థియేటర్లో చూడటమే తప్ప, తెలుగు సినిమాలు చూసే ఖర్మను తప్పించుకు తిరుగుతుంటాను.  నాకు బెంగాలీ, తమిళ్, మళయాళం, మరాఠీ, కన్నడ వంటి ఇతర ప్రాంతీయభాషాచిత్రాలు చూసే అలవాటు, అవి ఎలాగూ మనకు థియేటర్లో దొరకవు కాబట్టి పైరసీ తప్పలేదు.

పైరసీ చట్టవ్యతిరేకమే. శిక్షార్హమే. కానీ వేరే దారీ!? నాకైతే ఏమీ కనిపించలేదు. అందుకే కొంత గిల్టీగా ఫీలైనా ఐ లవ్ పైరసీ...

"కొంత గిల్టీ" అని ఎందుకంటున్నానంటే, భారతదేశంలోని పైరసీ చట్టం Copyright Act,1994 కి అనుబంధంగా వచ్చింది. ఇందులో క్లియర్గా;
Infringement of cinematograph films – section 51 read with section 14(d) of the Act
Copyright protection in films extends to
- making a copy of the film;
-taking a photograph of any image forming a apart of the film;
-selling, giving in hire or offering for sale or hire any copy of the film, irrespective of its
earlier sale or hire; and
-communicating the film to the public.

అని ఉందే తప్ప పైరేటడ్ కాపీలు కొనడం (buying) లేదా, కలిగి ఉండటాన్ని (processing) నేరంగా పరిగణించలేదు. పైగా ఇదే చట్టంలో "free use" అనే మరో తిరకాసు ఉంది. Certain uses of copyrighted works are not considered to infringe upon the rights of the copyright owner and so one does not require permission from the copyright owner. These uses are known as 'Fair Use'. Such uses are exceptions to copyright that allow limited use of
copyright works without the permission of the copyright owner. For example, limited use of works may be possible for research and private study, criticism or review, reporting current events, judicial proceedings, teaching in schools and other educational establishments etc. However ‘Fair Use’ is not a defence incase of infringement of film copyright. అంటూ కొంత వెసులుబాటు కలిపిస్తుంది. నేను చేసేది చాలావరకూ fair use అని నా నమ్మకం :)


ఇక తెలుగు సినిమాల విషయంలో నాకెందుకో  ఆ గిల్టీఫీలింగ్ కొంత తక్కువ. ప్రేరణ పేరుతో గ్లోరిఫైడ్ కాపీలు కొడితేగానీ తయారుకాని కథలు,సీన్లు, సంభాషణలు, ఫైట్ల మధ్య పైన చెప్పిన కాపీరైట్ చట్టాల్ని దర్జాగా ఉల్లంఘిస్తున్న సినీపరిశ్రమ పైరసీ గురించి మాట్లాడితే కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఒకసారి సినీ పరిశ్రమ పెద్దల ఇళ్ళలో తొంగిచూస్తే. ప్రతి ఇంట్లోంచీ కనీసం వెయ్యి హాలీవుడ్ పైరస్ DVD లు బయటికి తియ్యచ్చు. ఇలా "ఎదుటి మనిషికీ చెప్పేటందుకె నీతులు ఉన్నాయి" అనుకునే ముందు పరిశ్రమ తమ గురివింద ఛందాన్ని కొంత తెలుసుకుని సంస్కరించుకున్న తరువాత ప్రేక్షకుల్ని అంటే బాగుంటుంది. అనిపిస్తుంది.

పైరసీ అనేది ఒక parallel industry. పరిశ్రమ తమ జాగ్రతల్లో ఉండనంతవరకూ ఇది కొనసాగుతుంది. ఇక్కడ ప్రేక్షకులమీద పడి ఏడిస్తే లాభం ఉండకపోవచ్చు. ఒక వార్త ప్రకారం  దావూద్ ఇబ్రహీం వ్యాపారాల్లో ఈ మధ్యకాలంలో పెద్దస్థాయిలో డబ్బులు సంపాదించిపెడుతున్న వ్యాపారం “పైరసీ”. ముఖ్యంగా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల పైరసీ చేసే తను సంవత్సరానికి దాదాపు 400 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడట. మొత్తానికి ఇది బిలియన్ డాలర్ల వ్యాపారమనైతే తేలింది. కానీ ట్విస్ట్ ఏమిటంటే ఈ డబ్బుతను టెర్రరిస్టు కార్యకలాపాలకు వినియోగిస్తున్నాడని ఒక సంస్థ రిపోర్టు. ఇక్కడ గిల్టీ విషయం ఏమిటంటే, పైరసీ సీడీ కొన్న ప్రతి ప్రేక్షకుడూ టెర్రరిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించినట్టన్నమాట….ఇప్పుడేం చెయ్యాల్రో దేవుడా! ఐ లవ్ పైరసీ !!

****
Categories: Right

అభివృద్ధి టెర్రరిస్టు

Wed, 07/14/2010 - 07:08


"శ్రీకాకుళం జిల్లా సోంపేటలో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగటంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.మరో 60 మంది గాయపడ్డారు. వీరిలో ఎక్కువమంది పోలీసులు"    - ఈనాడు 

ఎవరికోసం ఈ అభివృద్ధి?  
ఎందుకోసం చేస్తున్నారు?
ఎవరు చేస్తున్నారు ఈ టెర్రరిజం?

అర్థరహిత అభివృద్ధి నమూనాను “భలే భలే” అని మోస్తున్న మధ్యతరగతి కళ్ళన్నీ పల్లకి ఎక్కే క్షణం కోసం మాత్రమే చూస్తున్నన్నినాళ్ళూ ప్రభుత్వాలు ఈ మారణహోమాల్ని చేస్తూనే ఉంటాయి. బలయ్యే సామాన్యుల కష్టాలు “అనాగరికంగా” వాళ్ళ పోరాటాలు “నక్సలిజంగా” చాలా కన్వీనియంట్గా పేర్లు పెట్టి ఈ దారుణాల్ని మహదర్జాగా కానిస్తూనే ఉంటారు. 

అందుకే alternate media అవసరం. ప్రత్యామ్న్యాయ ధృక్కోణాలు అవసరం. ఒక అభివృద్ధి డిబేట్ పెద్దస్థాయిలో అవసరం.



****
Categories: Right

తమిళ జాతీయ గీతం

Tue, 07/13/2010 - 00:57
మొన్న జరిగిన World Classical Tamil Conference కోసం ఎ.ఆర్. రెహమాన్ కూర్చిన తమిళ జాతీయ గీతం వీడియో ఇది. ఇది చూసి మనం నేర్చుకోవలసింది ఏమీ లేకపోయినా, కాసేపు సిగ్గుపడదామని పెడుతున్నాను. చూడండి.




****
Categories: Right

చలం చెప్పని కథ - కథాజగత్

Mon, 07/12/2010 - 01:12
కథాజగత్ లో నాకు బాగా నచ్చిన కథ "చలం చెప్పని కథ" .


చలం లాంటి భావ తీవ్రత మరొకరి కుంటే అతని పేరు ‘చైతన్య’ అవుతుంది.
అలాంటి చైతన్య చలం లాంటి చలం, మన చలమే అని అనుకునేలా ఉన్న ఒక చలం గురించి ‘తన కథ’ చెబితే "చలం చెప్పని కథ" అవుతుంది. చైతన్య చలం టెలిగ్రాం పిలుపు అందుకుని ప్రయాణమవడంతో సాగే చైతన్యస్రవంతి ఈ కథ. 
కథాజగత్ లో ప్రచురింపబడిన ఈ కథ ఆచార్య జయధీర్ తిరుమలరావు గారు రాశారు.

ఈ కథనచ్చడానికి నా అభిమాన రచయిత చలం ఒక కారణమైతే. ‘ఆ చలం’ కాడంటూనే కథకుడు ‘మన చలం’ వ్యక్తిత్వాన్నీ, భావజాలాన్నీ, సిద్ధాంతాలనీ అలవోకగా చిన్నచిన్న వాక్యాలో కుదించి రసజ్ఞతను సిద్ధింపజెయ్యడం మరో కారణం.


చలం లాంటి చలం గురించి కథే అయినా, మహారచయిత చలం జీవితాన్ని, రచనల్నీ, ఆలోచనల్నీ, అనుభవాల్నీ, భావాల్నీ అర్థం చేసుకుని జీర్ణించుకున్న తీరు ఈ కథలో మనకు కనిపిస్తుంది. అలాగే కొంత బౌద్ధమత ఆలోచనా సరళి గోచరిస్తుంది.


చలాన్ని మేధతో మధించే కన్నా, మన రక్తంలో... మనలోని ప్రైమోడియల్ సహజత్వపు శక్తుల్లోకి రంగరించుకుంటేనే అనుభవించడానికి సాధ్యమౌతుంది. ఈ ‘చలం చెప్పని కథ’లో కూడా అదే స్ఫూర్తి, ఆరాధన, భావతీవ్రతా నింపడంలో కథకుడు సఫలీకృతుడయ్యారు.




 "కోర్కెలు ఒక వ్యక్తి మనసులో జనించి అవి తీరకపోగా - అతనిలో  అలజడి జీవితం ప్రారంభమవుతుంది. ఎంత నొక్కిపెట్టినా అవి మనః పొరలలో చిక్కుకుని - ఎండల్లో ఎండి మాడిన గడ్డి వర్షంలో తలెత్తినట్లు - కొన్ని పరిస్థితులలో మళ్ళీ మొలకెత్తక మానవు. ఆశల్ని చంపుకోవడం మంచిదే. ఆశల్ని మనసులో పుట్టకుండా చేయడమే ఇంకా మంచిది.  

    నిజానికి వ్యక్తిలో కోరికలు సహజంగా నెరవేరేవే ఎక్కువగా జనిస్తుంటాయి. కాని వాటిలో ఎక్కువభాగం ఈ సంఘం, ఆచారాలు, కట్టుబాట్లు - వీటికే బలి అవుతుంటాయి. అతి సులభంగా నేరేరే ఆశలు ఏ విలువాలేని సంఘం కాలరాస్తే అతడిలో అరాజకత్వం తలెత్తుతుంది. అతణ్ణి లోకం శత్రువుగా భావిస్తుంది. జీవితంలో ఓడిపోయినవాడు ఒంటరిగా సంఘాన్ని ఎదిరించలేనివాడు ఓటమిని అంగీకరించి రాజీ కుదుర్చుకుంటాడు. అతడిని మాత్రం నీతిమంతుడంటుంది సంఘం. ఇలాంటి నీతిమంతుల సంఘంలో చలాని కన్నీ చూక్కెదురే. అలాటి ఈ సంఘంలో జీవించడం చేతకానివాడు చలం."అంటూ చలం నేపధ్యాన్ని అర్థం చేసుకుంటూనే...

"అతని వాదనను 'వ్యతిరేకత' అని చాలామంది అనుకున్నప్పటికి అది వ్యతిరేకత కాదు. తరతరాలుగా నాటుకున్న పాతకాలపు ఆచారాల్ని కాలరాయటమే!" అని సమర్ధిస్తాడు రచయిత.
     "జీవితానికి ముందు అంధకారమే. వర్తమానం అంధకారమే. భవిష్యత్తు ఇంకా అంధకారమే. అలాంటి జీవితంలో కాంతిరేఖల్లా అక్కడక్కడ సౌందర్యం ప్రసాదిస్తున్న కాంతికిరణాలు ప్రేమ చల్లదనాన్ని నింపుకుని చలం జీవితంలో వెలుగు నింపాయి. అదే అతని సర్వస్వం జ్ఞాపకంగా దాచుకోగలిగిన నిధులు." అంటూ చలం ప్రేమతత్వాన్ని మూడు వాక్యాల్లో ఆవిష్కరించి మనల్ని బద్ధుల్ని చేశాడు రచయిత.

చివరిలో... చైతన్య మరో చలం అయ్యాడనిపించే చెళుకు, ఒక అద్భుతమైన "ట్విస్ట్" అని చెప్పొచ్చు.
ఇలా రాస్తూ పోతే మొత్తం కథని ఇక్కడే కాపీ చేసెయ్యాలి. కాబట్టి...

ఆ కథ ఈ లంకెలో చదవండి. అనుభవించండి.


*****
Categories: Right

ఫలించనిదానికి పోరాటమెందుకు?

Wed, 07/07/2010 - 04:18
మొన్న సోమవారం పెట్రోల్ ధర పెంపుకు నిరసనగా బంద్ కు పిలుపునిస్తే నా స్నేహితుడొకరన్న మాట ;
"ప్రభుత్వం ఎలాగూ తగ్గించదు. ఈ బంద్ చేసి వీళ్ళు బావుకునేదేముంది" అని.
అప్రయత్నంగా తల ఊపి అంగీకారాన్ని తెలిపినా, ఎందుకో నామీద నాకే అనుమానం వచ్చింది.
"అంతేనా!?" అనిపించింది.

మిత్రుడు కొణతం దిలీప్ తన ‘కొమరం భీమ్’ సమీక్షలో...
"ధరలు పెరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు హర్తాళ్ కు పిలుపు ఇస్తే దాని వల్ల దేశంలో వాణిజ్య రంగానికి 10,000 కోట్ల నష్టం జరిగిందని లెఖ్ఖలు వేసే రోజులివి…

ఆన్లైన్ పిటీషన్లో ఓ సంతకం పారేస్తే చాలు సమస్యలు తీరిపోతాయని నమ్మే తరమిది. ఎర్రని ఎండలో చేసే ధర్నాలు ఎందుకోసమో చెప్పేదెవరు? జీన్స్, టీషర్టులు వేసుకుని రోడ్డుపై కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహిస్తే మీడియా హడావిడి చేసే కాలమిది. అడవి బిడ్డల కాగడాల పోరును అర్థం చేసుకునేదెవరు? గెలుపుకు మెట్లు అయిదున్నాయో అయిదొందలున్నాయో పుస్తకాలు రాసి మరీ చెప్పేవారున్నారు, కానీ ఓడిపోతామని తెలిసీ ప్రాణాలకు తెగించి పోరాడే వారి గురించి ఎవరు చెప్తారిప్పుడు?


అని ప్రశ్నించగానే, ఒక కడివెడు చన్నీళ్ళు నెత్తిన కుమ్మరించినట్లయ్యింది.

ఏదైనా సాధించాలని పోరాడతాం, ఏంతో కొంతైనా సాధించేందుకు పోరాడతాం. ఏమీ కాకున్నా, కనీసం నిరసన తెలుపడానికి, మా హక్కుల్ని కాలరాస్తున్నారనో, మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనో, మా జీవితాల్ని కష్టాలపాలు చేస్తున్నారనో, అన్యాయమైపోతున్నామనో అరవడానికి పోరాడతాం. మరి అన్ని పోరాటాలూ గెలిస్తేనే అర్థవంతం అనుకుంటే ఈ పోరాటాలకు అర్థమేముంది?

నిజంగా గెలుపే పోరాటానికి గమ్యమా?

బంద్ పిలుపు రాగానే పెట్రోల్ ధరల్ని ఎలా నియంత్రించచ్చో ప్రజల మీద ఎలా భారంపడకుండా ఉంచచ్చో చర్చించకుండా మీడియా అంతా ‘జన జీవనం అతలాకుతలం అయిపోతోంది’ అని కథనాలు బోలెడు వినిపించేశాయి. మెట్రోపాలిటన్ నగరాల జనాల్ని ముఖ్యంగా టీవీకి పనికొచ్చే బైట్స్ ఇచ్చే జనాల అభిప్రాయాలతో మీడియా ఊదరగొట్టేసింది. ఇందులో కుట్రలేదంటే ఎట్లా నమ్మేది? అసలు విషయాన్నీ, పనికొచ్చే చర్చల్నీ వదిలేసి బంద్ కు గల అసలు కారణాల్ని గాలికొదిలి "బంద్ అన్యాయం" అంటున్న మీడియా అసలు కీలకం ఏమిటి?

మొన్న ‘మిస్టర్ స్మిత్ గోస్ టు వాషింగ్టన్’ అనే ఒక సినిమా చూశా...అందులో హీరో అంటాడు...
"I guess this is just another lost cause, .... they were the only causes worth fighting for. And he fought for them once, for the only reason that any man ever fights for them. Because of just one plain simple rule: 'Love thy neighbor.' And in this world today, full of hatred, a man who knows that one rule has a great trust...  fight for the lost causes harder than for any others. Yes, you even die for them..."


అందుకే అడుగుతున్నా, ఫలించని దానికి పోరాటమెందుకనే ప్రశ్న ఎంతవరకూ సబబు?

****
Categories: Right

మా డిపార్ట్మెంట్ ఇండియాలో బెస్టోచ్ !

Thu, 07/01/2010 - 00:30
సెంట్రల్ యూనివర్సిటీలోని మా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, భారతదేశంలోని అత్యుత్తమ కమ్యూనికేషన్ స్కూల్స్ లో ఒకటిగా ఔట్ లుక్ పత్రిక సర్వేలో నిర్ధారించింది.
I am proud of it. Happy to be part of a great Legacy. 

****
Categories: Right

నన్నయ ఆదికవేనా?

Sun, 06/27/2010 - 08:09
తమిళ భాషకు "క్లాసికల్ భాష" హొదా కట్టబెట్టినప్పుడు చాలా మంది తెలుగు భాషాభిమానుల గుండెలు మండాయి.
‘తమిళానికి ఉన్నదేమిటి? తెలుగుకు లేనిదేమిటి?’ అని చాలా చర్చలు జరిగాయి.

ఈ చర్చల్లో చాలావరకూ తమిళులు ఎలా తమ రాజకీయ influence ను ఉపయోగించి మార్గదర్శకాల్ని తమకు అనువుగా ఏర్పరుచుకుని లాభం పొందారో చర్చించడం జరిగిందేతప్ప, కొన్ని మూలప్రశ్నల్ని మనవాళ్ళు చాలా కన్వీనియంట్ గా అడగలేదు. కనీసం మనల్ని మనం ప్రశ్నించుకోలేదు. ఆ తరువాత ఎలాగూ ఆ గైడ్ లైన్స్ మారి తెలుగు, కన్నడ, మళయాళాల్ని చేర్చడంతో సమస్య తీరింది. కానీ ఆ అడగని ప్రశ్నలు మళ్ళీ ఎవరూ అడగలేదు.

 "ఆదికవి" నన్నయ్య 11 శతాబ్ధం వాడుకాబట్టి తెలుగు qualify కాలేదు  మొదట్లో,
కానీ అసలు ప్రశ్న ఏమంటే నిజంగా మన ఆది కవి ఆదికవేనా?
అంతకు మునుపు తెలుగులో సాహిత్యం లేదా?
బౌద్దజైనమతాలు బ్రహ్మాండగా విలసిల్లిన తెలుగునేలలో వీరు తెలుగు సాహిత్యాన్ని సృష్టించలేదా?
తమిళం తరువాత కన్నడం అత్యంత ప్రాచీనం అని గుర్తించిన మనకు కన్నడ కవులందరి పుట్టుకలో లేదా సాహిత్య సృజనో తెలుగునేల మీద జరిగిందనేది సత్యంకాదా?
మరలాంటప్పుడు, వాళ్ళు తెలుగు సాహిత్యం సృష్టించలేదా? ఒకవేళ సృష్టించి ఉన్నా దాన్ని మనం పట్టించుకోలేదా?

లభ్యతలో ఉన్నది బహుశా నన్నయ రాసిన ఆధ్రహాభారతం కావచ్చుగాక, అంత మాత్రానికి మనం సరిపెట్టుకుని ఆదికవి అని ఆయన్ను, ఆదికావ్యం అని ఆంధ్రమహాభారతాన్నీ కీర్తించి మన (భాషా)గొయ్యి మనమే తవ్వుకోవడం నిజంగా అవసరమా? లేక మనకు చేతనైన భాషా పరిశోధన అంతేనా?!
కన్నడ భాషా పండితులు చక్కగా ‘లభ్యమైన గ్రంథాల్లో కవిరాజామార్గ మొదటిది’ అని చాలా diplomatic గా రాసుకుంటే, మనమే బోరచాపుకుని ఆిదివి, ఆదికావ్యం అనే fixation లో ఉండిపోయి అసలుకి ఎసరు పెడుతున్నామేమో!

****
Categories: Right

ఆర్య- ద్రవిడ సిద్ధ్జాంతము : కొన్ని చర్చలు

Fri, 06/25/2010 - 02:28
Senior CCMB scientist Kumarasamy Thangarajan said there was no truth to the Aryan-Dravidian theory as they came hundreds or thousands of years after the ancestral north and south Indians had settled in India.

The study analysed 500,000 genetic markers across the genomes of 132 individuals from 25 diverse groups from 13 states. All the individuals were from six-language families and traditionally “upper” and “lower” castes and tribal groups. “The genetics proves that castes grew directly out of tribe-like organizations during the formation of the Indian society,” the study said. Thangarajan noted that it was impossible to distinguish between castes and tribes since their genetics proved they were not systematically different.

The study was conducted by CCMB scientists in collaboration with researchers at Harvard Medical School,
ఉత్తర(UP,Bihar)-దక్షిణ(Tamilandu,Kerala)-తూర్పు (West Bengal,Orissa)-పశ్చిమ(Pujab,Haryana)-ఇంకా north east వైపుకు కువెళితే భారతీయుల మధ్య, శరీరనిర్మాణం, సాంస్కృతిక విధానాల్లో తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.కాబట్టి మనది mixed race అనేది కాదనలేని సత్యం.

1947 కు మునుపు భారతదేశం అనేది ఒక దేశంకూడా కాదు. It was a "great idea" and it still is. రాజకీయంగా,భౌగోళికంగా ఒకటైనంత మాత్రానా, ‘అందరూ ఒకటే’ అనే సిద్ధాంతం కూడా చెల్లదు.కాబట్టి ఆర్య-ద్రవిడులే కాదు, నానా జాతుల సమాహారం భారతదేశం. అదే భిన్నత్వంలో ఏకత్వం.

ఈ భావనని అర్థం చేసుకోకుండా, ఎవడో కుట్ర చేసాడనికి మనం కుట్రలు అల్లుకుంటూ వామపక్ష చరిత్రకారులమీదా, మ్యాక్స్ ముల్లర్ మీదా పడి ఏడిస్తే ఏంలాభం?

"బయట" "లోపల" అనేవి చారిత్రాత్మకంగా సమస్యాత్మకమైన నిర్వచనాలు.ఆప్ఘనిస్తాన్ అవతలినుంచీ బర్మాలోని చిట్టగాంగ్ వరకూ, వీలైతే ధాయిలాండ్ వరకూ, హిమాలయాలనుంచీ శ్రీలంకవరకూ "అఖంఢ భారతం"గా కొన్ని సిద్ధాంతాల ఆధారంగా వాదించొచ్చు, కొంత వరకూ నిరూపించొచ్చుకూడా.

ఇక శరీరాల్లో తేడాలంటారా,ఒక సారి మణిపూర్ వెళ్ళి తరువాత బీహార్ రండి. లేకపోతే పంజాబ్ నుంచీ తమిళనాడుకి ప్రయాణం కట్టండి. తేడాలు మీకు కొట్టొచ్చినట్టు కనబడతాయి.

మనకంటూ హిస్టరీ ఉన్నట్టా లేనట్టా అనే బాధ అసంబద్ధం."మనదంటూ" ఒకప్పుడు ఏమీలేదు. ఎందుకంటే ఒక definitive దేశంగా మనం మారిందే 1947 లో, అంతవరకూ ఒదొక notionally unified culture అంతే!

Recorded history కన్నా ముందు, ఎవరు ఎక్కడికి ఖండాంతరాల వలస వచ్చారు అన్నదానికి ఒకదానుకొకటి పొంతనలేకుండా వంద సిద్ధాంతాలు ప్రతిపాదించొచ్చు. కాని దానివల్ల మన వర్తమానానికొచ్చే నష్టంగానీ, విరగ్గాసే లాభంగానీ లేదనే నా ఉద్దేశం.

తమిళనాడు neo-political-cultural nationalism ఒక ప్రత్యేకమైన case దాని గురించి చర్చించాలంటే అదొక పెద్ద కథ అవుతుంది.

1857-1947 వరకూ జరిగిన స్వాతంత్రోద్యమ కాలంలో ఏకీకృతమైన "భారతీయ భావన" కల్పించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఉమ్మడి శతృవు బ్రిటిష్ వాళ్ళు గనక, ఆ దమనపాలనకు వ్యతిరేకంగా ఒకటిగా పోరాడే ప్రయత్నం జరిగిందేతప్ప స్వాభావికంగా ఒకరమన్న స్పృహ అప్పటికీ ఇప్పటికీ లేదు. అంతేకాకుండా,విస్తీర్ణంలో మిక్కిలైనవీ, జనాభా రీత్యాకూడా బాహుళ్యమైనవీ అయిన లెక్కకు మించి రాజ్యాలూ, సంస్థానాలూ వారి పనుల్లో వారున్నారేతప్ప స్వాంతంత్ర్యోద్యమ స్పూర్తికూడా వీరిని అంటలేదు.

మైసూర్, ట్రావెంకూర్, హైదరాబాద్, కాశ్మీర్, జునాగడ్, జైపూర్,బార్మేర్,ఉదైపూర్,బికానేర్,జోధ్పుర్,north-east రాజ్యాలూ, భోపాల్ మరియు ఇతర మధ్యభారతంలోని పలు విశాలమైన సంస్థానాలు ప్రత్యేకరాజ్యాలుగా స్వాతంత్ర్యానంతరం వరకూ మిగిలాయి.

బ్రిటిష్ పాలనలో, మిగతా భారతదేశంకూడా ప్రెసిడేంసీల మయమేతప్ప ఒక సంఘటిత పాలనా యూనిట్ కూడా కాదు.గోవా,యానాం,పాండిచ్చేరి వంటి భాగాల్లో ఫ్రెంచ్ వారు, పోర్చుగీసువారుకూడా పరిపాలించే వారు.ఈ భాగాల్నన్నింటినీ ఒక రాజకీయపటంగా మార్చడానికి దాదాపు 1975(సిక్కిం భారతదేశంలో కలిసే)వరకూ పరిశ్రమించాల్సివచ్చింది.

నిజానికి 1947 లో స్వతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశం ఒక దేశంగా మనగలుగుతుందనే ఆశ ప్రపంచదేశాల్లో ఎవరికీ లేదు. ఎందుకంటే ,భారతదేశం అనేది అప్పటికి కేవలం ఒక గొప్ప ఆలోచన మాత్రమే. ఇప్పటికీ అది మన ఆలోచనల్లో స్థిరపడిందేతప్ప, నిజమై ఆవిష్కరింపబడలేదు. కాకపోతే, ఈ దేశం ఇంకా రాజకీయంగా, భౌతికంగా ఒకటిగా ఉందంతే.మానసికంగా we are a fragmented country still.

ప్రస్తుతం ద్రవిడ-ఆర్య సిద్ధాంతాలను కుట్రలంటున్నవాళ్ళ discourses లో "అనుకుంటున్న" భారతీయత సాంస్కృతికపరమైన భారతీయత(cultural nationalism)కానీ, స్వాతంత్ర్యోద్యమ సమయంలో వచ్చిన చైతన్యం రాజకీయ భారతీయత(political nationalism)కు చెందిన సృహ. కేవలం rhetoric కోసం ఈ రెంటినీ కలగాపులగం చేసి వాడుకుని, ఒక emotional issue చేస్తున్నారుగానీ అవి రెండూ వేరు.

భారతీయరాజకీయ భావనకూడా భారతదేశం మొత్తం ఏకస్థాయిలో లేదు. ఉదాహరణకు కాశ్మీర్ లో ఉండే భారతీయ భావన యొక్క తీవ్రత,definition వేరుగా ఉంటే, గోవా లో దాని స్వరూపం విభిన్నంగా ఉంటుంది.సిక్కింలో దాని రూపం వేరుగా ఉంటే పంజాబ్ లో పరిస్థితి మారుతుంది.

అందుకే మనలో భిన్నత్వంలో ఏకత్వం ఎంతో ఏకత్వంలో భిన్నత్వమూ ఇప్పటికీ అంతేకాబట్టి India as one nation with ONE PEOPLE అనే అపోహనుంచీ దూరమవ్వాలని నా అభిప్రాయం.

కాలానుగుణంగా లభ్యతలోఉన్న ఆధారాలూ,ఆలోచనల ప్రాతిపదికన సిద్ధాంతాలు ప్రతిపాదించబడతాయి, తుంగలోతొక్కివేయబడతాయి.అంగీకరించబడతాయి, వ్యతిరేకించబడతాయి.

అదే విధంగా అనుకూల సిద్ధాంతాలను నెత్తికెక్కించుకోవడం,ప్రతికూలంగా అనిపించినదాన్ని పట్టించుకోకపోవడం సమాజాలూ,interest groups చేసే పని. వాటిని context of time లో చూసి అర్థం చేసుకోవాలేతప్ప వాటి ఆధారంగా వర్తమానాన్ని నిర్ణయిస్తామంటే కొంచెం ఆలోచించాల్సిందే!


ఉదాహరణకు ఆర్య-ద్రవిడ అనుకూల సిద్దాంతాన్ని సాంస్కృతిక-రాజకీయ లబ్ధికోసం తమిళులు ఎలా ఉపయోగించుకున్నారో, దాని ప్రతికూల సిద్ధాంతాల్ని బీజేపీ తన హిందుత్వ అజెండాకోసం ఉపయోగించుకుంటోంది. కానీ ఈ సిద్ధాంతాలను గుడ్డిగా నమ్మి మనం మనవర్తమానాన్ని సమస్యాత్మకం చేసుకోవడం అర్థరహితం. మన బాధ్యత వాటి నేపధ్యం ఆధారంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి "రాజకీయాలకు" దూరంగా ఉండటానికి ప్రయత్నించడం ఒక్కటే.

ఇతరుల లాభానికి మనం తెలిసీతెలియకుండా పావులవకుండా ఉండటం మరియూ విషయాన్ని కూలంకషంగా తెలుసుకుని, విజ్ఞత ఉపయోగించి విచక్షణతో వ్యవహరించడాన్ని ఫలాయనమని నేను అనుకోను.

ఆ discretion మనకొచ్చే చర్చలు లాభదాయకమేతప్ప, playing in to those politics to jeopardizes our present is always useless. అందుకే, dispassionate గా విషయం తెలుసుకోవడానికి చర్చలు కావాలిగానీ, ఏదో ఒక తరఫున emotional rhetoric లో భాగమవ్వడానికి కాదు.

****
Categories: Right

‘రావణా’యణం – సమీక్ష

Wed, 06/23/2010 - 03:05
సామాజిక-రాజకీయ అంశాల్ని వ్యక్తిగత నేపధ్యాల్లో మలిచి ఎపిక్ (epic) స్థాయి సినిమాల్ని తీసే దర్శకుడు మణిరత్నం. ‘రోజా’ మొదలు ‘దిల్ సే’ వరకూ అలా జరిగిన ప్రయాణంలో మనందరం మణిరత్నం సినీతిహాసాల్లో భాగమయ్యాము. వ్యక్తిగత సమస్యల్ని ఒక సామాజిక కోణంలోంచీ చూపడమూ మణిరత్నంకున్న మరో పార్శ్వం. ‘మౌనరాగం’ నుంచీ ‘సఖి(అలైపాయుదే)’ వరకూ అదీ మనం చూసి మురిసిపోయాము. అలాంటిది ఏకంగా రామయణం లాంటి ఒక ఎపిక్ ని తీసుకుని ముగ్గురు మనుషుల మధ్యనున్న సంబంధాలు, అనుబంధాలూ, ఘర్షణ నేపధ్యంలో ఒక కొత్త కోణాన్ని ‘రావణ్’ ద్వారా ఆవిష్కరిస్తాడని అందరూ ఆశించడం సహజం.
ఈ ఆసక్తిని, అనురక్తిని రావణ్ ద్వారా మణిరత్నం నిలుపుకున్నాడా, లేదా అనేది పెద్ద ప్రశ్న.

‘వీరా’ అనే దళిత నాయకుడు ప్రతీకారం కోసం ‘దేవ్’ అనే పోలీస్ ఆఫీసర్ భార్య ‘రాగిణి శర్మ’ని కిడ్నాప్ చెయ్యడంతో సినిమా ప్రారంభమౌతుంది. ఆ తరువాత వీరా రాగిణితో ఏలా ప్రవర్తించాడు? దేవ్ రాగిణిని రక్షించుకోగలిగాడా? చివరికి వాళ్ళ ముగ్గురి కథ ఏమయ్యింది అనేది రావణ్ చిత్ర కథాంశం.

రామాయణాన్ని వ్యక్తుల కథగా చూస్తే అందులోనూ చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ముఖ్యంగా భార్యనెత్తుకెళ్ళిపోయిన రాక్షసుడ్ని చంపే రాజు కథగా చూస్తే అందులో మహత్తరంగా అనిపించే విషయమూ ఉండదు. అందుకే మంచీ – చెడుల మధ్య పోరాటంగా దాన్ని కీర్తించి, సమాజంలో విలువల స్థాపనకు ఉపయోగించుకుని ఇతిహాసంగా మార్చేశాం. అయితే, మంచీ చెడుల మధ్య గీతలు మసకబారుతున్న ఈ కాలంలో రాముడిలో దైవత్వం ఎంత మిగిలుంటుంది? రావణుడిలో రాక్షసత్వానికి సహేతుకమైన కారణం ఉండదా? వంటి ప్రశ్నలు ఉదయించడం చాలా సాధారణం. అసలే రావణుడిని హీరోగా ఎప్పుడో నిర్ణయించేసిన ద్రవిడ సంస్కృతి, సాహిత్యాల నేపధ్యమున్న మణిరత్నం ఈ ఆధునిక రామాయణాన్ని, రావణాయణంగా ఎలా మలిచాడో చూడాలనే ఆసక్తితో రావణ్ సినిమా చూస్తే నిరాశ తప్పదు.

సాంకేతికపరంగా ఉన్నతంగా ఉన్నా, హృదయం లేని అందమైన గాజుబొమ్మ తరహాగా మాత్రమే రావణ్ మిగిలిపోయింది. చెప్పాలనుకున్న కథలోని లోపం, కథావిస్తరణలోని బహీనతలూ, స్క్రిప్టులోని బలహీనతల్ని భారంగా మోస్తూ, కేవలం నటనతో సినిమాను నిలబెట్టలేని నటీనటుల నటన వెరసి రావణ్ ఒక ఎపిక్ సైజ్ డిసాస్టర్ అని చెప్పొచ్చు.

కాల్పనిక లోకంలో జరుగుతున్నకథా లేక భౌతిక లోకంలోనా అనే విషయంకూడా అర్థంకాకుండా కథావిస్తరణ క్రమం కనిపిస్తుంది. అది వ్యక్తుల కథా లేక వ్యక్తిత్వాలు-సిద్దాంతాల ఘర్షణా అనే విషయంలో క్లారిటీ లేక సినిమా తడబడుతుంది. వీరా౦- దేవ్ – రాగిణిల కథకు ఒక బలమైన సామాజిక-రాజకీయ-సైద్ధాంతిక నేపధ్యం ఇవ్వగలిగుంటే వాళ్ళ అస్తిత్వాలతో పాటూ సినిమాకూ ఒక ఆర్థం ఉండేది. ఆఖరి 20 నిమిషాల్లో కథ కొంచెం పుంజుకున్నట్లు అనిపించినా, ప్రస్తుతం  over indulgent idea గా మాత్రం మిగిలిపోయింది.


బలహీనమైన స్క్రిప్టుని, బలం లేని డైలాగుల్ని అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, విక్రం లు తమ శాయశక్తులా ఒక వీశమెత్తు పైకి లేవదీయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కొన్ని సీన్లు చూస్తుంటే వీరా పాత్ర ప్రవర్తనకూ, తన histrionics కూ, ఫిలాసఫీకీ సినిమాలో అసలు స్థానమే లేనప్పుడు అభిషేక్ ఎంత గింజుకుంటే మాత్రం ఏమిటి అనిపిస్తుంది. ఐశ్వర్యా రాయ్ చాలా సినిమాలకన్నా ఈ సినిమాలోని కొన్ని సీన్లలో అందంగా ఉంది. ఆ అందమూ నోరుమూసుకున్నంతరకే. వాచకం లేని తన నటన నోరు తెరిచి డైలాగ్ చెప్పినపుడు పంటికిందరాయే. ఉన్నంతలో విక్రం సహజంగా నటించాడు. ఉపపాత్రల్లో రవికిశన్, గోవిందా బాగాచేస్తే,  ప్రియమణి ఫరవాలేదనిపించింది.

సంతోష్ శివన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, రెహమాన్ సంగీతాలు బాగున్నా, సినిమాకు పెద్దగా ఉపయోగకరం కాలేదు. దర్శకత్వపరంగా చాలా ఛాలెంజింగ్  ఫిల్మ్ అనిపించినా, మణిరత్నం నుంచీ ఏ conceptual integrity, subtext ఆశిస్తామో అది ఏమాత్రం ఈ సినిమాలో కనిపించకపోవడం ఆశ్చర్యంతో పాటూ ఆవేదనను కలిగిస్తుంది.

****
Categories: Right

అవి నా వ్యాఖ్యలు కాదు

Fri, 06/18/2010 - 08:28

గత రెండ్రోజులుగా నా మెయిల్ ఐడి బ్లాగ్ ప్రొఫైల్ ఉపయోగించుకుని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
నా శైలిని కూడా imitate చేసి రాస్తున్న ఈ వ్యాఖ్యలు నావి కావు.

****
Categories: Right

ఆఫ్గనిస్తాన్ పై అమెరికా ఎందుకు దాడి చేసిందో తెలిసిపోయిందోచ్ !

Mon, 06/14/2010 - 04:14
దీర్ఘకాలిక ప్రయోజనం లేకుండా అమెరికా ఏమీ చెయ్యదనే సత్యం మళ్ళీ నిజమయ్యింది.

సద్దాం హుస్సేన్ ను చంపాలన్నా, బిల్ లాడెన్ కోసం వెతకాలన్నా అది అన్యాయాలు చేశాడనో లేక అమెరికాను బాంబులుపెట్టి పేల్చాడనో కాదు. మూలకారణం అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేశారని. మరొ కారణం...సహజ వనరులు. ‘సద్ధాం విషయంలో పెట్రోల్ అయితే లాడెన్ విషయంలో ...ఏమిటి?’ అనే ప్రశ్నకు ఇప్పుడే సమాధానం దొరికింది.

అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో ట్రిలియన్ డాలర్ల విలువచేసే ఖనిజనిక్షేపాల్ని కనుగొనింది. ఇనుము, రాగి, కోబాల్ట్, బంగారంతో పాటూ ల్యాప్ టాపులు, బ్యాటరీలు వంటి వాటిని తయారుచెయ్యడానికి వాడే లిథినియం లాంటి ఖనిజాలు ఈ లిస్టులో ఉన్నాయి. వీటిని కనుగొనడంతో ఆఫ్ఘనిస్తాన్ పరిశ్రమ భవిషత్తేమోగానీ అమెరికా పంటమాత్రం పండిందనే చెప్పుకోవాలి.

http://www.nytimes.com/2010/06/14/world/asia/14minerals.html?hp=&pagewanted=all

**** 
Categories: Right

చేతబడి నేర్చుకుందాం - సంస్కృతిని ఉద్దరిద్ధాం

Sun, 06/13/2010 - 10:54
భారతీయ ‘చేతబడి శాస్త్రం’ అద్భుతమైనది. కారణం అది దేవుడి పేరుతో జరిగే ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమంచిన మహనీయులు తయారుచేసిన తంత్రపద్దతి కావడమే.

భారతీయ చేతబడి శాస్త్రం నిజంగా అద్బుతమైనది అనడానికి ఎన్నో ఋజువులు అడుగడుగునా కనిపిస్తాయి. చూచే దృష్టి మనకు ఉండాలి. ఇటువంటి మహోన్నత జ్ఞానాన్ని మనకిచ్చిన ఉద్యమకారులకు నిజంగా మనం ఋణపడి ఉన్నాం. హేళనాత్మక దృష్టివల్లా,గర్వం వల్లా, తెలిసినా తెలియకపోయినా ప్రతిదాన్నీ ఎగతాళి చెయ్యడం అలవాటు అయినందువల్లా ఇటువంటి దెయ్యవిద్యలను ఉపయోగించుకోలేక మనమే నష్టపోతున్నాం.

మనవైన చేతబడిని ‘విచ్ క్రాఫ్ట్’ పేరుతో పాశ్చాత్యులు నేర్చుకుని మనకే తిరిగి నేర్పే స్థాయిలో ఉన్నారు. చైనీయులూ జపనీయులూ కూడా ‘వూడూ’ అనే పేరుతో ఇలాంటి విద్యల్ని సంరక్షించుకుంటున్నారు. తమ ప్రాచీన విద్యలనూ సంస్కృతినీ అమితంగా అబిమానిస్తూ గౌరవిస్తూ ఆచరిస్తూ ఎంత అభివృద్ది చెందారు.
 
రండి...మనమూ మన చేతబడిని నేర్చుకుని సంస్కృతిని ఉద్దరిద్దాం !


****

P.S. This post is a total Bullshit. ఇదొక చెత్త పోస్టు. ఎవరూ నమ్మకండి.

***
Categories: Right

మహాభారతానికి ఆధారాలు

Fri, 06/11/2010 - 00:55
నేను నిజంగా ఏదో ఆధారాలు సంపాదించానని అనుకున్నారా !
అబ్బే అలాంటిదేమీ లేదు.

ఈ దేశంలో నిజాలని నిరూపించడానికన్నా, నమ్మకాల్ని అపోహలని నిరూపించడానికి ఆధారాలు కావాలి.
మానవాళికి పనికొచ్చే  ప్రయోగాలకన్నా, మతం నుంచీ మనుషుల్ని రక్షించే పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే ఈ దేశం ఇలాగే ఉంటుంది.


మహాభారతం యొక్క చారిత్రకత సందేహాస్పదం అంటూ JNU ప్రొఫెసర్ S.S.N. మూర్తి రాసిన ఒక పరిశోధనా పత్రం మీ కోసం ఇక్కడ. 

proof of Mahabharata

****
Categories: Right