http://jaajipoolu.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
Updated: 36 min 48 sec ago

ఇంకొన్ని ముచ్చట్లు -2

Sun, 07/18/2010 - 21:40
క్రికెట్కి వెళ్ళివచ్చిన తరువాత రోజున ఎప్పటిలాగే ఇద్దరం సరదాగా కాయగూరలు కొనడానికి మార్కెట్కి వెళుతుంటే మా ఆయన హఠాత్తుగా బుజ్జీ! నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా ..అసలు తాంబూళాల్లో అయితే సూపరు..ఆ రోజు నువ్వు కట్టుకున్న గ్రీన్ చీరలో అదిరిపోయావు ..రోజూ ఆ ఫొటోసే ముందేసుకుని కూర్చునేవాడిని ..దిష్ఠి తగులుతుందని మా అమ్మ తిట్టేది.. అనేసరికి నా కాళ్ళు అలా నేలకు రెండు ఇంచుల పైకి తేలడం మొదలు పెట్టాయి.. పెళ్ళయి అన్ని నెలల తరువాత భార్య అందాన్ని భర్త సమయమూ, సంధర్భం లేకుండా పొగుడుతున్నాడంటే దానివెనుక అనేకానేక కుట్రలు,కుతంత్రాలు ఉంటాయన్న కఠోర సత్యం అప్పటికి నాకింకా తెలియదన్నమాట..

ఆ పళం గా ముద్దొచ్చినపుడే అన్నీ అడిగేయాలని మొదలు పెట్టేసాను..మరి ఆ రోజు కట్టుకున్న ఎర్రంచు పట్టు చీరలో ఎలా ఉన్నాను?? ఆ తరువాత కట్టుకున్న వంగపండు కలర్ చీర నాకు నప్పిందా??... పెళ్ళికి ముందు నేను మీ కాలేజ్ లోనే చదివుంటే మీరు నన్ను ప్రేమించేవారా? ఒకవేళ ప్రేమిస్తే నేను ఒప్పుకోక పోతే ఏమి చేసేవాళ్ళు ??లాంటి ప్రశ్నలన్నీ చక చక అడిగి ,టక టకా నాకు కావలసిన సమాధానాలను రాబట్టేసుకుని తెగ మురిసిపోయాను ..( మరి మామూలు రోజుల్లో గనుక అలాంటి ప్రశ్నలు అడిగితే మరి ఇంతమంచి నిజాలు బయటకు చెప్తారేంటి :D )

అప్పుడు మాశ్రీవారు మెల్లిగా వల విసిరారు..బుజ్జీ ,మొన్న వెళ్ళిన క్రికెట్ మేచ్ భలే ఉందికదా!.. భలే ఎంజాయ్ చేసామే !అంటూ.. సరిగ్గా ఆయన ఊహించినట్లుగానే ..పాపం ఇంత పొగిడారు కదా మనం కూడా నాలుగు పొగిడేస్తే ఓ పని అయిపోతుంది అని .. అవునండీ చా..లా ఎంజాయ్ చేసాం.. అసలు ఎంతమందికి వస్తుంది చెప్పండి అటువంటి అవకాశం ..పైకి వద్దు ,వద్దు అన్నా గాని ఎంత మంది అతిరధమాహరధులను చూడగలిగాను.. మీరెంత మంచివారండి అంటూ దొరికిపోయాను ..అందుకే బుజ్జీ మళ్ళీ ఎంజాయ్ చేద్దామని' ఫైనల్ మేచ్ 'కి కూడా టికెట్స్ తీసుకున్నాను ..రేపు రెడీ అయిపో అన్నారు సింపుల్ గా .. ఆ..అంటూ నిలువు గ్రుడ్లేసుకుని అమ్మా!!,నేను రాను ..నా వల్ల కాదు అని మొదలు పెట్టాను..కానీ అప్పటికే నోరుజారడంవల్ల ఇక తప్పలేదు..

ఆ మరుసటి రోజు మళ్ళీ ప్రొద్దున్నే లేచి తిండీ,నీళ్ళు గట్రా మూట గట్టుకుని గ్రౌండ్ కి బయలుదేరాం...దారిలో ఎప్పటిలాగే పెద్ద క్యూ..చాలామంది సార్ ప్లీజ్ ఎక్స్ ట్రా టిక్కెట్స్ ఉంటే ఇవ్వండి అని బ్రతిమాలుతున్నారు.. నేను ఎప్పటిలాగే ఫోజు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళాను..మళ్లీ ఒక చోట ప్లేస్ చూసుకుని ఇలా కూర్చున్నామో లేదో ఆట మొదలైంది ...వెస్ట్ ఇండీస్ బౌలింగ్ అనుకుంటా.. ఒక్కొక్కరూ తాడిచెట్లలా ఇంత పొడవున్నారు..వాడు ఆడమ్స్ ,వీడు వాల్ష్ ఏవేవో పేర్లు చెబుతున్నారు మా ఆయన.. అందరికీ ఇంచుమించుగా గుండే ..ఒక్కళ్ళకూ పెద్ద జుట్టులేదు.. ఒకవేళ ఉన్నా దువ్వెన ఎలా దిగుతుంది ఆ రింగుల జుట్టులో అనుకుంటూ చూస్తున్నా..

ఈలోపల ఆకాశం మేఘావృతం అయిపోవడం మొదలైంది.. ఏమండీ గొడుగు కూడా తెచ్చుకోలేదు అన్నాను భయం గా ఆకాశం చూస్తూ.. నేను ఎంత నెగిటివ్ గా ఆలోచిస్తానో మా ఆయన అంత పాజిటివ్ గా ఆలోచిస్తారు..అబ్బే ఏమీ కాదు అవి దొంగ మబ్బులు.. గాలి ఎలా వీస్తుందో చూసావ్ కదా ..తేలిపోతాయి.. అలా అన్నారో లేదో 'టప్' మని ఒక చినుకు నాపై పడింది ..నేను మా ఆయన వైపు చూసాను ..అది 'చిరుజల్లు ' అన్నారు .. అంతే దభ,ధభా మని వర్షం మొదలైపోయింది.. అందరూ పరుగులు పెడుతున్నారు ... అప్పటికప్పుడు ఆట కోసం వేసిన షల్టర్లు ఏ మాత్రం రక్షణ ఇవ్వడంలేదు..అయినా జనాలు వాటి క్రిందే నించుంటున్నారు దారిలేక.. అక్కడ ప్లేస్ లేక నా చున్నీయే గొడుగులా కప్పుకుని అక్కినేని,బి.సరోజల్లా చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెట్టాం ..

ఎంత గుబురు చెట్టయితే ఏం లాభం ..వర్షం వర్షమేగా.. ఫుల్ గా.. ముద్ద ముద్దగా తడిచిపోయాం.. నా క్రొత్త డ్రెస్ బురద బురద అయిపోయింది ... అదొక్కటేనా ప్రొద్దున్నే పావుకేజీ 'కొబ్బరి నూని 'తలకు పట్టించి మరీ వచ్చానేమో నాకు పండగే పండగ ...చిరాకొచ్చేస్తుంది..ఇదంతా అవసరమా!!..వద్దు ,వద్దన్నా వినిపించుకోరుకదా కోపంగా అరిచాను ... నీకసలు టేస్ట్ తెలియదు బుజ్జి ..ఎంచక్కా పైన వర్షం ,ప్రక్కన నేను ఉన్నా..ఎంత రొమాంటిక్ గా ఆలోచించచ్చు .. మా ఆయన ఏడిపిస్తుంటే తిట్టుకుంటూ నించున్నా కాసేపటికి వర్షం ఆగింది ..ఇంక నావల్ల కాదు ఇంటికి వెళిపోదాం అన్నాను.. నోరుముయ్యి ఓవర్లు కుదిస్తారు.. చూసి వెళదాం అన్నారు ..

ఆయన అన్నట్లే ఓవర్లు తగ్గించారు..అందరూ తడిచిన బట్టలు పిండుకుని,బెంచ్ లు తుడుచుకుని కూర్చుంటున్నారు..ఆ తరువాత వాళ్ళేం ఆడుతున్నారో నేనేం చూస్తున్నానో నాకేం అర్ధం కాలేదు ...ఆ చల్లగాలికి వణుకొచ్చేస్తుంది జ్వరం వచ్చినట్లు.. కాసేపు జరగలేదు ఆట.. మళ్ళీ భోరున వర్షం..ఛీ ఆ వచ్చే వానేదో ఫుల్ గా ఒకేసారి వచ్చి ఏడచ్చుగా ఇలా సగం, సగం వచ్చి ఎటు కాకుండా చేస్తుంది ..శుబ్బరంగా మేచ్ డ్రా అయిపోయేది..పీడా పోయేది అని వందసార్లు తిట్టుకుని ఉంటాను..చివరకు మేచ్ రేపటికి 'పోస్ట్ పోన్' అయింది "అందరూ ఇంటికి వెళ్ళిపోయి రేప్పొద్దిన్నే వచ్చేయండహో" అని ఎనౌన్స్ చేసేసరికి మా ఆయన,నేను ఇద్దరం గతుక్కుమన్నాం..

ఆ రాత్రి పడుకుంటున్నపుడు మొదలయ్యాయి తిట్లు నాకు.. అంతా "నీవల్లే" ..వచ్చినప్పటి నుండి మేచ్ ఆగిపోవాలి ,ఆగిపోవాలి అని గొడవ గొడవ చేసావ్ కదా ..అలాగే జరిగింది ..ఇప్పుడు సంతోషమే కదా అని ఉడికిపోతూ 'గయ్' మన్నారు.. ఇది మరీ బాగుంది ..నేను ఆగిపోవాలి అంటే ఆగిపోతుందా అన్నాను ఆవలిస్తూ.. ఎందకు ఆగదు ..కొంతమంది నోటి పవరు అంతే.. మళ్ళీ రేపు అంటే ఎలా వెళతాను అక్కడికి..మా బాస్ ని ఈ సారి లీవ్ అడిగితే డైరెక్ట్ గా ఇంటికి పంపేస్తాడు..తిరిగే లేదు ..డబ్బులన్నీ వేస్టు అన్నారు దిగాలుగా ... పాపం జాలేసింది నాకు ..

పోని మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా అమ్మేయండి ..ఒక ఉచిత సలహా పడేసాను.. ఉహు నాకు మన ఇండియన్స్ అంత క్లోజ్ గా తెలియదు.. మా ఆఫీస్ లో అందరూ చైనీస్ యే..వాళ్ళూ చూడరు ..అదీ వీక్ డేస్ లో అస్సలు వెళ్ళరు అన్నారు నిట్టూరుస్తూ.. పోనీ మీకు ఎవరు టిక్కెట్టు అమ్మారో వాళ్ళకే తిరిగి ఇచ్చేయండి 'వద్దు' అని అన్నాను ..చెత్త సలహాలు ఇచ్చావంటే తంతాను అన్నారు విసుగ్గా.. అయితే ఏం చేద్దామంటారు ??అన్నాను కళ్ళుమూసుకుని.. పోని ఒక పనిచేస్తే?? అన్నారు ఉత్సాహంగా .. నేను నిద్రలోకి జారుకుంటూ' ఊ ' అన్నాను.. రేపు ప్రొద్దున్న మన ఇద్దరం అక్కడికి వెళదాం ..నువ్వు మేచ్ చూస్తూ ఉండూ.. మా ఆఫీస్ ప్రక్కనే కాబట్టి నేను ఆఫీస్ కి వెళ్ళీ, మళ్ళీ కరెక్ట్ గా మధ్యాహ్నం లంచ్ టైముకు నీదగ్గర కి వచ్చేస్తా..అన్నం తినేసాక మళ్ళీ వెళ్ళీ ,మళ్ళా సాయంత్రం ఒక గంట ముందే పర్మిషన్ తీసుకుని వచ్చేస్తా ..అప్పుడు ఇద్దరం కాసేపు మేచ్ చూసి ఇంటికి వెళ్ళిపోదాం సరేనా అన్నారు..

అంతే నా నిద్రమత్తు టక్కున మంత్రం వేసినట్లు మాయమై పోయి ఉలిక్కిపడి.. ఏంటీ !!మళ్ళీ రావాలా ?..అదీ ఒక్కదాన్నే చూడాలా?.. నావల్ల కాదు ..టిక్కట్స్ మిగిలితే చింపి చెత్త బుట్ట లో వేసుకోండి ..నాకు కుదరదు అన్నాను.. అది కాదు బుజ్జీ ..పోనీ ఒక పనిచేద్దాం, అక్కడకు వెళ్ళాక ఎవరన్నా కొనుక్కుంటే వాళ్ళకు అమ్మేసి ఇంటికి పంపించేస్తాను నిన్ను అన్నారు బ్రతిమాలుతూ.."పైకి నా నోరు కనబడుతుంది కాని చివరకు అన్నీ మావారు చెప్పినట్లే జరుగుతాయి ..అయినా సరే ఎందుకు వాదిస్తానో నాకు ఇప్పటికీ అర్ధం అయ్యి ఏడవదు. ."

ఆ ప్రొద్దున్న నాకు అస్సలుబాలేదు..బాగా చిరాగ్గా,విసుగ్గా ఉండటం వల్ల ఏమండీ ఈ టైంలో నావల్ల కాదు మీరు వెళ్ళండి అని బ్రతిమాలినా లాక్కువెళ్ళిపోయారు ..చేసేదిలేక మళ్ళీ సరంజామాతో బయలుదేరాను కనీసం ఎవరన్నా టిక్కెట్టు కొనకపోతారా అన్న ఆశతో ..మేము వెళ్ళే సరికి బయట బోలెడుమంది ఉన్నారు ..హమ్మయ్యా అనుకుని దగ్గరకు వెళ్ళాం..మేము ఇంకా ఏమీ అనకముందే "సార్ టిక్కెట్స్ కావాలా?" అన్నాడు ఆ అబ్బాయి.. మేము మొహమొహాలు చూసుకున్నాం.. సగం రేట్ కి ఇచ్చేస్తా తీసుకోండి అన్నాడు అతను.. ప్రక్కన చూస్తే అందరూ సార్ సార్ టిక్కెట్స్ కావాలా ??అని బ్రతిమాలుతూ అడుగుతున్నారు .. అందరూ ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అయి ఉన్నారు.. నేను బిక్క మొహం వేసుకుని మా ఆయన వైపు చూసాను.. నువ్వెళ్ళి కూర్చో నేను లంచ్ కొచ్చేస్తానే అని మాహా ఆనందంగా వెళ్ళారు మా ఆయన..

మళ్ళీ ఆట మొదలైంది ..నాకేం తోచడం లేదు..కాసేపు ఆట చూసాను ఉహు ఏమి ఆడుతున్నారో ఏమి అర్ధం కావట్లేదు ..సరే అని ఇంకాసేపు ఫొటోస్ తీశాను.. చూపమని అడక్కండీ ..మనమసలే ఫొటోస్ తీయడంలో క్వీనులం కదా ..అంచేత సాగరసంగమం సినిమాలో కమలహాసన్ కు 'భంగిమా' అంటూ ఫొటోస్ తీసే కుర్రాడిలా మా గొప్పగా తీశాను.. మరి కాసేపు ఫోర్ లైన్ దగ్గర తచ్చాడాను.. ఆ తరువాత పెన్ తీసుకుని నా అర చేతి లో ముగ్గులు పెట్టుకున్నాను.. ఇంక ఆ తరువాత ఏం చేయాలో అర్ధం కాలేదు ..గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నాను..ఎండమండిపోతుంది ..ఎలాగో ఒకలా లంచ్ టైం వరకూ గడిపేసాను ..సరిగ్గా లంచ్ టైముకు మావారు వచ్చారు ..హమ్మయ్యా ప్రాణం లేచోచ్చినట్లు అనిపించింది.. ఆ తరువాత గంట టైము ఎలా గడించిందో తెలియదు.. మళ్లీ వస్తానే అని మావారు బేగ్ పట్టుకుని వెళ్ళిపోయారు .. మళ్లీ ఒంటరిగా కూర్చున్నా ..

అప్పుడు మొదలైంది 'పడమటికి' దిగుతున్న సూర్యుని ఎండ మొహానికి కొడుతూ ..అసలే చిరాకు,విసుగు దానిమీద చిర చిర లాడుతూ వేడి.. అన్నటికంటే ఎక్కువగా దాహం వేసి బాగా వాటర్ తాగానేమో నాకు నరకం కనబడిపోతుంది..ఎక్కడన్నా 'రెస్ట్ రూములు' ఉన్నాయేమో అని చూసాను.. ఉహు కనబడలేదు .. ఎండ వేడికి కళ్ళు తిరుగుతుంటే కాస్త నీడ పట్టుకువెళ్లి కూర్చున్నా .. జింబాబ్వే మేచ్ కంటే ఫైనల్ మేచ్ కే జనాలు తక్కువగా ఉన్నారు..నిన్నటి వర్షం దెబ్బ అనుకుంటా..వెస్ట్ ఇండీస్ వాళ్ళు వీర ఉతుకుడు ఉతుకుతున్నారు మన ప్లేయర్లను ..అందరూ "అయ్యో"," ఓ" ..అంటూ మూలుగుతూ తెగ బాధ పడిపోతున్నారు..నా గోల నాది ..

చాలా విసుగ్గా అనిపించింది..దేవుడా ఏమిటి నాకీ పరీక్షా అనుకుంటుంటే ...." ఒరే రాత్రి తాగింది దిగలేదా ఏంట్రా ..అలా ఆడుతున్నారు" అంటూ మన తెలుగు మాటలు వినిపించాయి ... హమ్మయ్యా అనిపించింది..కాస్త మాటల్లో పడితే టైము తెలియదు కదా అని ఆనందం గా ప్రక్కకు చూసాను .. పాతికేళ్ళ లోపు అబ్బాయిలు ఒక అయిదుగురు నా ప్రక్కన కూర్చున్నారు..ఇందాక నేను గమనించలేదు కాని నా ప్రక్కన ఉన్న అబ్బాయి చేతిలో ఈనాడు పేపర్ ఉంది ..హుం నీరసం వచ్చింది ..అందరూ అబ్బాయిలే ..ఏం మాట్లాడుతాం అని నిట్టూర్చి వాళ్ళ మాటలు వింటున్నా.. అబ్బాయిల సంగతి తెలియనిదేముంది..ఎంచక్కా బోలెడు తిట్లు చెవుల త్రుప్పువదిలేటట్లు తిడుతున్నారు మన ఆటగాళ్లను.. ఒక్కోసారి నవ్వొస్తుంది..ఒక్కోసారి అబ్బా ఏంట్రా బాబు వీళ్ళు అనిపిస్తుంది..

నా ప్రక్కనున్న అబ్బాయికి ఎందుకు అనుమానం వచ్చిందో ..అరే..ఆగండిరా ..అమ్మాయుంది అన్నాడు.. అంతే అప్పటివరకు ఆటలో లీనం అయి వాళ్ళను తిడుతున్నవాళ్ళు కాస్తా నా వైపు తిరిగారు.. దాని మొహం అది తెలుగుది కాదురా తమిళ్ పొన్ను ..మొహానికి ఆ విభూధి కనిపించడంల్లా వాళ్ళు అలాగే పెడతారు అని ఒకడు ..అబ్బెబ్బే అది మలయాళీ పెణ్ కుట్టి అని మరొకడు ...కాదేహే ఖచ్చితంగా కన్నడ భామ ..నేను రాసిస్తా కావాలంటే ..వాళ్ళే ఇంత డేరింగ్ గా ఒక్కళ్ళే ఊరి మీదకు తిరుగుతారు ... మహా ఖతర్నాక్ లు అని మరొకడు.. ఏంట్రా ఆకాశంలోకి చూస్తుంది గుడ్డిదానిలాగా ..కళ్ళు లేవా అని మరొకడు..ఒక్కటి కాదు వాళ్ళిష్టం ...

మాములుగా అయితే సైలెంట్ గా విని ఉరుకునేదాన్ని..మనకసలే బోలెడు ధైర్యం ఎక్కువకదా..కాని ఆ రోజు నాకున్న చిరాకు కి, విసుగుకి ఎవరోకరిని బాగా తిట్టాలన్నంత కసి గా ఉందేమో ఇంక వాళ్ళ పని అయిపొయింది..' ఠాట్' నేను విభూది పెడితే నీకేంటి ,ఒంటరిగా వస్తే నీకేంటి ఇంకోసారి ఏమన్నా అన్నారో పోలీసులకు కాల్ చేస్తాను ఖబడ్దార్ అని ఒక పది నిమిషాలు ఆపకుండా తిట్టిపడేసాను .. తిట్టేసాక గాని భయంవేయలేదు..అయినా చుట్టూ జనాలు ఉన్నారు కాబట్టి కాసింత ధైర్యం గా అక్కడే కుర్చుని చూస్తున్నా.. దెబ్బకి వాళ్ళు సైలెంట్ ..

నా ప్రక్కన ఉన్న అబ్బాయి కొంచెం సేపయ్యాకా మీరు "తెలుగా" అండీ అన్నాడు.. నేను ఏం మాట్లాడకుండా నా భయాన్ని కనబడనివ్వకుండా సైలెంట్గా ఎక్కడకో చూసుకుంటున్నా.. నేనేమి అనలేదు కదండీ ..అప్పటికీ వాళ్ళను వద్దని వారిస్తున్నాను కదా అన్నాడు మెల్లిగా.. నేనేం మాట్లాడకపోయేసరికి నేను మిమ్మల్ని 'సిస్టర్' అని పిలవచ్చా అన్నాడు ... నాకెందుకో నవ్వు వచ్చింది.. అయినా సీరియస్ గా మొహం పెట్టి అంటే అక్కా?చెల్లా? అన్నాను ... మీ వయసు ఎంత ?అన్నాడు వెంటనే. మొన్నే ఇరవై వచ్చింది అన్నాను ..అయితే నాకు ఇరవై మూడు చెల్లెమ్మా అన్నాడు.. నాకు ఎవరూ అన్నయ్యలు లేరేమో ఎవరైనా చెల్లెమ్మా అంటే చాలు పట్టుకోలేరు నన్ను ..ఇంక మొదలు పెట్టేసాను కబుర్లు ...

అలా కాసేపు అతని ఫ్రెండ్స్ కి రక్త సంబంధం,చెల్లెలి కాపురం ,పుట్టింటి పట్టు చీర లాంటి సెంటిమెంట్ సినిమాలను ఫ్రీగా చూపెట్టాకా మాటలో మధ్యలో చెప్పాడు తను ..అతని పేరు నాయుడు అంటా ..వైజాగ్ వాళ్ళ ఊరు.. ఇక్కడ పని చేస్తే బోలెడు డబ్బులు ఇస్తారని మభ్య పెట్టి ,ఒక ఏజెంట్ లక్షన్నర రూపాయలు తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు అంటా.. పాపం పాస్పోర్ట్ గట్రా అతనే తీసుకుని వెట్టిచాకిరి చేయిస్తున్నాడు. .అసలే ఎండకన్నెరగకుండా పెరిగాడేమో రాత్రి పగలు పని చేయాలంటే నరకం గా ఉంది ..వెనకకు వెళ్ళే దారిలేదు ..సంపాదించినదంతా ఏజెంట్ లాగేసుకున్టున్నాడు..జ్వరమోచ్చినా, నెప్పోచ్చినా చూసే నాధుడు లేడు అని చాలా బాధపడ్డాడు..

షిప్ లో పని ..పాపం పని అలవాటు కాక ఏక్సిడెంట్ లో చిటికెనవేలు'కట్' అయ్యి తీసేశారు అంట..మా అమ్మకి చెప్పలేదు ..ఏడుస్తుంది ..కాకపొతే ఇన్సురెన్స్ ,మూడు నెలలు లీవు ఇచ్చారనుకో..ఒక్కడినే ఇంట్లో ఉంటే అసలేం తోచడం లేదు అన్నాడు..నాకు జాలేసింది .. వెంటనే మా ఆయన "ఆఫీస్ ఫోన్ నెంబర్ "ఇచ్చేశాను తోచక పొతే ఆయనకు కాల్ చేయి అన్నయ్యా అని.. ఆ తరువాత మా ఆయన ఒకటే తిట్లు.. ఎవడే వాడు?? , నిమిషానికి ఒక సారి కాల్ చేస్తాడు ..బావా ఏం చేస్తున్నావు?,బావా ఎలా ఉన్నావు?,బావా చెల్లి ఏం కూర వండింది ?అనుకుంటూ ...అరె బాబు, నాకు పని ఉంది పది నిమిషాలు ఆగరా అంటే .. కరెక్ట్ గా పదినిమిషాలు సెకన్లతో సహా లెక్కగట్టి మళ్లీ ఫోన్ చేసి బావా పని అయిపోయిందా ఏదన్నా మాట్లాడు అంటాడు ...ఇంకోసారి ఎవరికన్నా ఫోన్ నెంబర్లు,ఇంటి అడ్రేస్లు ఇచ్చావో కాళ్ళు విరక్కోడతా అని వార్నింగ్ ఇచ్చారనుకోండి అది వేరే విషయం అన్నమాట ...

అలా కాసేపు కబుర్లలో పడ్డాగాని నా బాధలకు తోడూ ఎండవల్ల తల తిరిగిపోవడం ,వికారం మొదలయిపోయి కాసేపు మౌనంగా ఉండిపోయాను ..ఈ లోపల వెస్ట్ ఇండీస్ ఓవర్లు అవ్వక ముందే గెలిచేసింది.. అప్పటికే చాలామంది మూటాముల్లె సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయారు .. మేన్ ఆఫ్ ది మేచ్ నో ఏదో ఇస్తున్నారు.. అన్నయ్యా వాళ్ళు వెళ్ళారు గ్రౌండ్ లోకి .. నేను మా ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నా.. ఇంతకీ రారు అంతకి రారు ...గ్రౌండ్ టక టక ఖాళి అయిపోతుంది ... నాకు కోపం ,ఏడుపు రెండు వచ్చేస్తున్నాయి ..

ఏమ్మా! ఇంకా బావ రాలేదా ?అన్నాడు నాయుడన్నయ్య.. ఉహు అన్నాను అప్పటికే కళ్ళల్లో నీళ్ళు ఊరుతున్నాయి.. మరి ఇంటికి వెళ్ళిపోతావా అన్నాడు.. లేదన్నయ్యా వచ్చేస్తారు అన్నాను.. అసలు నాకు దారి తెలిస్తే కదా వెళ్ళడానికి ..అదెక్కడో ఊరికి మూలగా ఉంది గ్రౌండ్ ... సరే ,ఇంక పదరా అనవసరం గా డబ్బులు తగలేట్టుకుని వచ్చాం ప్రక్కన అబ్బాయి అన్నాడు.. సరే నేను వెళ్ళనా అన్నాడు అన్నయ్య.. ఉహు వద్దు మా ఆయన వచ్చేవరకు ఉండవా అని గొంతువరకూ వచ్చింది ..కాని ఎవరో తెలియదు ,ఏం పనో ఏమో అనుకుని.. పర్లేదు ,మీరు వెళ్ళండి అన్నాను చిన్నగా నవ్వుతూ... తను వెళ్ళబోతూ నా వెనుక ఉన్న తమిళియన్స్ ని చూసి ..ఇక్కడ ఎందుకు చెప్పు ..బయట ఎంట్రెన్స్ దగ్గర వెయిట్ చేయకూడదూ అన్నాడు.. ఏమోలే, మళ్లీ ఆయన వెదుక్కుంటారు.. పర్వాలేదు ఇక్కడే ఉంటా.. వచ్చేస్తారు అన్నాను..నాకసలు నడిచే ఓపిక కూడలేదు నిజానికి.. సరే ,జాగ్రత్త ..ఎక్కువ సేపు ఇక్కడ ఉండకు ..అవసరం అయితే బయట వెయిట్ చేయి అని వెళ్ళిపోయాడు..

తను వెళ్లిపోయాకా చాలా దిగాలుగా అనిపించింది.. అక్కడే కూర్చుని వెళ్ళిపోతున్న జనాలను,దాదాపుగా ఖాళి అయిన గ్రౌండ్ను చూస్తూ ఉంటే గట్టిగా నవ్వులు వినబడ్డాయి ..ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే ..ఎప్పుడోచ్చారో తెలియదు మచ్చా, మాపుళే అంటూ దాదాపు పదిమంది వరకు అబ్బాయిలు.. బీరు సీసాలు గట్రా లు తెచ్చుకుని నవ్వులు నా వైపు చూస్తూ ..భయం వేసింది .. అప్పట్లో తమిళ్ కొద్దిగా కూడా అర్ధం అయ్యేదికాదు ..అసలేం అంటున్నారో తెలియదు ..మన తెలుగబ్బాయిలను చూసి తెగ పోజుగా తిట్టేసాను కాని వాళ్ళను చూస్తేనే భయం వేసింది..నాయుడన్నయ్య ఎందుకు చెప్పాడో అప్పుడర్ధం అయి పరుగు పరుగున బయటకు వచ్చేసాను ..

బయట కూడా పెద్దగా జనాలు లేరు ..అందరూ వెళ్ళిపోతున్నారు ...ఇంక నా వల్ల కాక నేను ఇంటికి వెళ్ళిపోదామని ఒకరిద్దరిని 'సిమే' కి వెళ్ళే బస్ ఎక్కడ ఎక్కాలి అని అడిగాను .. తెలియదంటే తెలియదన్నారు ... దూరంగా ఏదో బస్ స్టాప్ కనబడితే అక్కడికి పరుగుపెట్టి అడిగాను .. వాళ్ళూ తెలియదు అన్నారు .. ఈ లోపల ఈయన గ్రౌండ్కి వచ్చేసారేమో ..వెతుక్కున్టున్నారేమో అని అటు పరుగులు తీసా మళ్లీ .. అక్కడా ఎవరు లేరూ.. ఎటు బ్లూ షర్ట్ కనబడితే అటు వెళ్లి చూసేదాన్ని ... దాదాపు గా జనాలు పలచబడ్డారు.. అప్పుడు మొదలైంది ఏడుపు వరదలా... ఎవరన్నా చూస్తున్నారేమో,నవ్వుతారేమో ఇంకేం లేదు ..ఏడుస్తూనే ఉన్నా,కళ్ళు తుడుచుకుంటునే ఉన్నా....

అలా అక్కడే ఒక చోట ఆగి నించుని చూస్తుంటే ప్రక్కన ఎవరో షూ లేస్ కట్టుకుంటున్నారు మెట్లపై కూర్చుని..యాదాలాపం గా అతని వైపు చూసాను.. అతను అతనేనా ?? అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటే తను ఒక నిమిషం నా వైపు చూసాడు ఆక్చర్యంగా ..నిజానికి వేలాదిమంది అభిమానులు అతనిని చూడగానే పరుగులు పెట్టి చుట్టుముడతారు ...బహుసా నేనేనేమో అతని కెరీర్లో ఏడుపుమొహం వేసుకుని ,మొహమంతా కాటుక పులుముకొని ,కనీసం చిరునవ్వు కూడా నవ్వకుండా నించుంది .."అతనే సచిన్ టెండూల్కర్ "... అప్పటికి అతని వయసు పాతికలో ఉంటుందేమో ...అప్పుడే ఫ్రిజ్ లో తీసిన ఫ్రెష్ యాపిల్ లా ఎంత బాగున్నాడో. అంత ఎండలో రోజంతా ఆడినా అసలు అలసట లేకుండా అంత తెల్లగా ఎలా ఉన్నాడో నాకు ఇప్పటికీ అర్ధం కాదు ...

కాస్త దూరంలో క్రికెటర్లు హోటల్ కు వెళ్ళే బస్ ఉంది ... విచిత్రం ఏంటంటే అసలు సేక్యూరిటినే లేదు..ఎవరో ఒకరిద్దరు పోలీసులున్నారంతే ..ఇంకా పెద్ద విచిత్రం ఎగబడి చూసే జనాలు అసలు లేరు ..బహుసా ఆ రోజుల్లో మన ఇండియన్స్ తక్కువ అవ్వడం వల్ల అనుకుంటా ..ఇప్పుడయితే భారీ బందోబస్తు చేయాలి ... ఒక్కొక్కరు నా ప్రక్క నుండే కిట్లు పట్టుకుని బస్ ఎక్కారు.. గంగూలి ,ద్రావిడ్ ,వెంకటేష్ ప్రసాద్ ...(అలా చూస్తారేంటి కాస్త కుళ్ళుకోండీ ..అన్నీ నేనే చెప్పాలి )ఎవరెవరో గుర్తు లేదు ఇంకా...కానీ చాలా మంది బస్ ఎక్కుతూ మన అవతారాన్ని ఒకమారు దర్శించి ఎవర్తిరా ఇది అన్నట్లు అయోమయం మొహం పెట్టి ఎక్కారు..

అంటే మా అనిల్ నన్ను చూడలేదు లెండి ..లేకపోతే తప్పకుండా నా కోసం ఆగి పోయేవాడు :) ..ఆ టైములో వాళ్ళను ఆటోగ్రాఫ్ అడుగుదాం అనిగాని ఫొటోస్ తీద్దాం అనిగాని నాకేం అనిపించలేదు..నా ఏడుపు నాది ..మా ఆయన తెగ తిడతారు ఆ విషయం మీద ఇప్పటికీ.. అలా క్రికెటర్లు అందరూ వెళ్లిపోయాకా పూర్తిగా నిర్మానుష్యం అయిపొయింది ఆ ప్లేసు ..ఇంక ఏడ్చే ఓపిక లేకా మెల్లిగా టెండూల్కర్ కూర్చున్న మెట్ల మీదే కూలబడి గడ్డి పీకుతూ ఉన్నా.. పది నిమిషాలు పోయాకా వచ్చారు మా శ్రీవారు తాపీగా .. అరేయ్ ,ఇక్కడ ఉన్నావా .. నేను గ్రౌండ్ లో వెదుకుతున్నా ..అసలేమైంది అంటే ఆఫీస్లో చా..లా ..పని ఉంది ..దానికి తోడూ ట్రాఫిక్ జామ్ అయ్యింది అంటూ ... ఆ తరువాత ఏం జరిగింది అనేది మీ ఉహా శక్తికి వదిలేస్తున్నా ...అన్నీ ఇక్కడ చెప్ప కూడదంట లలితగారు చెప్పారు... అందుకే ఉష్.. గప్చిప్ అని ..
Categories: Middle

ఇంకొన్ని ముచ్చట్లు ..

Sat, 07/10/2010 - 06:59
వెనుకటికెవరో నాలాంటి వాడిని "దేవుడిని ఇక నమ్మనని ప్రొద్దున్నే అని సాయంత్రం గుడికొచ్చావేం"? అని అడిగితే..మరీ శివరాత్రి పూటే నమ్మటం మానేస్తే దేవుడికి కోపం వస్తుందేమో రేపటినుండి మానేస్తా అన్నాడంట"..అలాగా.. 'ఛీ.ఛీ' నాకు క్రికెట్ అనే పదం అంటేనే పరమ చిరాకు అని దాని మీదే పోస్ట్ లు వేస్తున్నా వరుసగా.. :)

సరే కధలోకి వచ్చేస్తే నేను సింగ పూర్ వెళ్ళిన నెలరోజుల లోపే ఒక రోజు సాయంత్రం పని అయిపోయాకా మావారి గురించి ఎదురు చూస్తూ ,ఇండియానుండి తెచ్చిన ఆంధ్ర భూమి పత్రికను క్రింద తారీఖు ,వారం,పేజ్ నెంబర్లతో సహా వదల కుండా ముప్పయ్ మూడోసారి సీరియస్ గా చదువుతుంటే తలుపు తీసుకుని లోపలికి వచ్చారు మావారు..ఎప్పటిలా బేగ్ ఆ మూలన, షూస్ ఇంకో మూలనా పడేసి మంచానికి అడ్డంగా పడిపోయి.."అసలు భార్యంటే ఎలా ఉండాలి ..భర్త ఇంటికి రాగానే ..అయ్యో ఎంత అలసిపోయారో ,మంచి నీళ్ళు కావాలా?(వాటర్ బాటిల్ ప్రక్కనే ఉంటుంది ..అయినా సరే) కాళ్ళు పట్టామంటారా "అంటూ ఎంత ఇదై అదై పోవాలి..మనకసలు అలాంటివేమీ లేవు..సత్య భామ పోజులివ్వడం తప్ప అని రొటీన్ గా శివాలెత్తి పోకుండా ..ఎంతో సౌమ్యంగా నా ప్రక్కనే చేరిపోయి బుజ్జీ!! అని గారంగా పిలిచారు ...నాకు కుడికన్ను అదురుతుండగా 'ఆ.. ఏంటీ' అన్నాను ...నీకో విషయం తెలుసారా ..సింగపూర్లో ఇంటర్నేష్నల్ క్రికెట్ మేచ్ జరుగుతుంది ఫలానా రోజున ..ట్రయాంగిల్ సిరీస్ అన్నారు ఉత్సాహంగా ..'అయితే' ?? అన్నాను భృకుటి ముడిచి ..అయితే అని సింపుల్గా అంటావేంటీ.. మళ్ళా ,మళ్ళా ఈ అవకాశం వస్తుందో లేదోఅని .. అని ఆగారు..'లేదోఅని ' రెట్టించాను.. నీకు ,నాకు టికెట్స్ తీసుకున్నాను అన్నారు మెల్లగా..

అంతే ఒక్క సారిగా 'గయ్' మన్నాను..మొన్నే కదా పొదుపు -వాటి లాభాలు-పాటించవలసిన పద్దతులు అనే విషయం మీద అరగంట క్లాస్ పీకాను ..పైగా ఒకప్రక్కన చెల్లెలి పెళ్ళికి కొంచెం డబ్బు ఇవ్వాలన్నారు.. ఇంకోప్రక్క అప్పు చేసి వచ్చాను అన్నారు ..మరో ప్రక్క ఇల్లూ,వాకిలీ లేదు .. ఇప్పుడిలా అంటే ఏమిటర్ధం?..అని తిట్టిపడేసాను.. అబ్బా !అవన్నీ నేను చూసుకుంటాను.. నీకు తెలుసుగా నాకు క్రికెట్ ఎంత ఇష్టమో ..ఈ టికెట్స్ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా..పైగా బోలెడు మంది క్రికెటర్స్ వస్తున్నారు..పైగా నీకిష్టం అయిన కూంబ్లె కూడా వస్తున్నాడు అన్నారు..ఉహు..వద్దు వాడికీ పెళ్ళి అయిపోయింది ..నాకు అయిపోయింది నేను చూడను అన్నాను మొండికేస్తూ..

ఎవర్తివే నువ్వు ..ఇలా వేపుకుతింటున్నావ్ అని కాసేపు గొణుక్కున్నా నా వీక్నెస్ బాగ తెలుసు కాబట్టి ప్లేట్ మార్చేసారు .. అది కాదు బుజ్జి..ఇప్పుడూ ..నువ్వు మేచ్ కి వచ్చావు అనుకో .. టి.వి లో నువ్వు కనబడతావు కదా ..అప్పుడు మీ అమ్మా,నాన్నలు ఎంత సంబరపడిపోతారు ..పైగా మీ బంధువులందరూ మీ నాన్నకు ఫోన్ చేసి మన బుజ్జి టివిలో కనబడింది అంటే మీ నాన్న ఎంత గొప్పగా ఫీల్ అవుతారో తెలుసా ..ఇంకా నువ్వెలా ఉన్నావో కూడా మీ నాన్నకు ఫ్రీగా కనబడుతుంది ..వాళ్ళెంత ఆనంద పడిపోతారో ఊహించూ అని ఒక సెంటిమెంటు సినిమా కళ్ళముందు చూపించేసరికి' సరే' అని ఒప్పేసుకున్నాను.. ఆ వెంటనే మా వాళ్ళకు ఫోన్ చేసి ఆ రోజున ఏం డ్రెస్ వేసుకుంటున్నానో ,ఏ రంగు గాజులో,ఎటువంటి జూకాలో ,ఏ రంగు రబ్బర్ బేండ్ తలకు పెట్టుకుంటున్నానో ప్రతీదీ వదలకుండా చెప్పేసాను..

మొత్తానికి అనుకున్న రోజు వచ్చింది..కల్లాంగ్ స్టేడియం లో మేచ్.. ఆ రోజు మావారు లీవ్ పెట్టేసుకున్నారు.. మంచినీళ్ళు,తిండి గట్రా పేక్ చేసుకుని ఇద్దరం బయలుదేరాం .. మేము వెళ్ళేసరికి చాంతాండంత 'క్యూ' ఉంది.. బోలెడు మంది బయట సార్,సార్ ఎక్స్ ట్రా టికెట్ ఉంటే ఇవ్వండి అని బ్రతిమాలుతున్నారు .. చూసావారా ..నేను చెబితే నమ్మేవా..మనకు భలే లక్కీగా దొరికాయి టిక్కేట్స్ అన్నారు.. నేను అలా ఫోజులు కొట్టే సందర్భాలను అస్సలు మిస్ చేసుకోను.. స్టైల్ గా వాళ్ళను చూస్తూ మాకు టికెట్స్ ఉన్నాయి తెలుసా అని లుక్కులిస్తూ లోపలికి వచ్చేసా..ఒక బెంచ్ పైన చోటు చూసుకుని ఇద్దరం సర్ధుకు కూర్చున్నాం .. కూర్చున్నదగ్గరనుండీ నా చూపులు ఎన్ని కెమారాలున్నాయి?? ఎక్కడెక్కడ ఉన్నాయి?? వెదుక్కోవడమే సరిపోయింది..

ఏమండీ!! మరేమో టి.వి లో మన మీద కొచ్చి షూట్ చేసినట్లు కనబడుతుంది కదా ..మరేమో ఇక్కడ ఎక్కడో ఫోర్ లైన్ లో కెమేరాలు కనబడుతున్నాయేంటీ? అన్నాను ఆరాగా.. అంటే అందులో 'జూం' ఉంటుంది కదా ..అక్కడి నుండి తీసినా కనబడతాం అన్నమాటా అన్నారు...ఓ..మరి అక్కడి నుండి తీస్తే .. వాళ్ళు మనల్నే తీస్తున్నట్లు మనకెలా తెలుస్తుంది??.. పైగా చాలా మంది ప్రేక్షకులు వాళ్ళు టి.వీలో కనబడగానే టాటాలు చెప్పేసి ..నవ్వేస్తుంటారు..వాళ్ళకెలా తెలిసిపోతుంది ??అన్నాను అనుమానంగా.. అంటే అక్కడ ఎదురుగా ఒక పెద్ద టీ.వి ఉంటుంది అందులో మేచ్ కనబడుతుంది ..దానిలో చూసి.. వాళ్ళను చూసుకుని కనిపెట్టేస్తారు అన్నమాట అన్నారు..మరి ఇక్కడ టీ.వి ఎక్కడ ఉంది?? అన్నాను అటు,ఇటు చూస్తూ.. 'యెహె పో' ..ముందు మేచ్ చూడు అన్నారు చిరాగ్గా..

మేచ్ మొదలైపోయిందా అప్పుడే అన్నాను బోలెడు ఆక్చర్యపోతూ ..అప్పుడే రెండు ఓవర్లు కూడా అయిపోయాయి..ఏం చూస్తున్నావ్ అన్నారు.. గ్రౌండ్ వైపు చూసాను.. ఎక్కడో అర అంగుళం అంతమనుషులు కనబడుతున్నారు.. ఎవరు బేటింగో ?ఎవరు బౌలరో ?ఏంటో? ఏమీ అర్ధం కావడంలేదు ..గ్రౌండ్ లో మేచ్ అంటే ఇంత భయంకరం గా కనబడుతుందా?? ఆ మాత్రందానికి ఇన్ని డబ్బులు పెట్టుకుని చూడాలా మేచ్ అన్నాను..ఇంతలో ఎవరో 'ఫోర్' అన్నారు.. అబ్బా మధ్యలో మాట్లాడకు.. 'ఫోర్' అంటా మిస్ అయిపోయా అన్నారు మా ఆయన.. తిక్క కోపం వచ్చింది.. ఇదే టివీ లో అయితే అన్ని ఏంగిల్స్ లోనూ పది సార్లు చూపుతాడు విసుక్కుంటూ అన్నాను..

ఈ లోపల జనాలందరూ 'ఓ'అని మూలిగారు.. ఏమైంది? అన్నాను ..అవుటయ్యారు అన్నారు మా ఆయన .. ఎవరూ? అన్నాను .. గంగూలీ అనుకుంటా? అన్నారు..ఎలా? అన్నాను ..ఏమో బౌల్డేమో?.. కాదు..కాదు'కేచ్' అనుకుంటా అన్నారు ..ఈసారి మా ఆయనను చూసి జాలేసింది.. ఇక్కడ పెద్ద టి.వి ఉంటుంది ..అందులో మనం కనబడతాం అన్నారూ అన్నాను ... అంటే చిన్న గ్రౌండ్ కదా అలాంటి ఎక్విప్మెంట్స్ లేవనుకుంటా అన్నారు..మరి నాకు నేను ఎలా కనబడతాను ?..పైగా చెత్తలా ఉంది ఈ గ్రౌండ్ ..నాకేం నచ్చలేదు..ఇండియాలోనే మంచి,మంచి గ్రౌండ్లు ఉంటాయి ..ఇక్కడ టాయిలెట్స్ కూడా సరిగాలేవు అన్నాను విసుక్కుంటూ.. అంటే సింగపూర్లో క్రికెట్ ఎవరూ చూడరు కదా ..పుట్ బాల్ కు ఉన్న క్రేజ్ క్రికెట్కు ఇక్కడ ఉండదు..అందుకే ఆపధర్మంగా ఈ గ్రౌండ్ ఏర్పాటు చేసి ఉంటారు అన్నారు... అలాంటప్పుడు మరి ఇక్కడ ఎందుకు మేచ్ లు పెట్టారు చెత్తలాగా విసుగ్గా అన్నాను..

ఇంక దీనితో లాభం లేదనుకున్నారేమో ..బుజ్జీ ఒక పని చేయి .. ఆ ఫోర్ లైన్ ఉంది కదా అక్కడ నించో ..ఎవరన్నా నీ వైపుకు బాల్ ఫోర్ కొట్టారనుకో ..అప్పుడు అన్ని కెమెరాలు నిన్ను కూడా బాల్ తో పాటు కవర్ చేస్తాయి అని నా నస వదిలించుకునే ఒక సలహా పడేసారు..నాక్కూడా నిజమే అనిపించేసి అమాయకంగా ఆ లైన్ లో నించుని కెమెరాల వైపే చూస్తూ నించున్నా.. కానీ ఇటు మనవాళ్ళు గాని అటు జింబాంబ్వే వాళ్ళు గాని ఒక్కడన్నా ఫోర్ కొట్టిన పాపాన పోలేదు .. ఎంత ఆశగా చూసానంటే ..అబ్బే..రెండు టీముల్లో ఒక్కడికి కూడా జాలి లేదు.. ఎవరూ నేను ఉన్న వైపు ఫోర్ కాదు కదా కనీసం డబల్స్ కూడా కొట్టలేదు ఆట మొత్తానికి..

కాసేపయ్యాకా ,మా ఆయన బయటకువెళ్ళారు ఇప్పుడే వస్తానని.. డ్రింక్స్ ఏవో తాగుతున్నారు ఆటగాళ్ళు.. నాకు చాలా బోర్ గా అనిపించింది.. అలా చూస్తుంటే గంగూలి ,ద్రవిడ్ అనుకుంటా అటు వెళుతూ కనబడ్డారు..నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది.. వాళ్ళదగ్గర ఆటోగ్రాఫ్ అడిగితే మా వారికి చూపిస్తే ..భలే సంతోషపడిపోతారు కదా అనుకుని అటు పరిగెత్తాను.. ఈ లోపలే నన్ను తోసుకుంటూ ఒక యాబై మంది ..సార్ ఆటో గ్రాఫ్ ప్లీజ్ అంటూ వాళ్ళ మీద పడ్డారు..వాళ్ళు కొంతమందికి ఇస్తున్నారు,మరి కొంతమందికి సారీ చెబుతున్నారు.. ఇంకేం వెళతాం..హూం అని భారీ గా నిట్టూర్చీ వెనక్కి తిరిగాను..

' హెల్లో' ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగాను.. ఫోర్ లైన్లోనుండి జింబాంబ్వే ప్లేయర్ ఎవరో నావైపే చూస్తున్నాడు.. నేను అటు,ఇటు చూసాను ..నన్నా? కాదా అని.. మళ్ళీ పిలిచాడు దగ్గరకు రమ్మని సైగ చేస్తూ..నా ఇంగ్లీష్ పాండిత్యం మీకు తెలిసిందే కదా ...'ఆ అంటే ఈ 'రాదు నన్ను ఎందుకు పిలుస్తున్నాడో ఏంటో??అని భయం భయం గా దగ్గరకు వెళ్ళాను.. ఆటో గ్రాఫ్ కావాలా అన్నాడు సైగ చేస్తూ..ఊ..ఉహుహు అన్నాను ఏమనాలో తెలియక ..బుక్ ఇవ్వు అన్నాడు ... నా దగ్గర ఉన్న బుక్ గబుక్కున అతనికి ఇచ్చాను.. 'పెన్ ' అన్నాడు సైగ చేస్తూ..హేండ్ బేగ్ గభ గభ చూసాను .. అక్కడ అవతల మళ్ళా మేచ్ మొదలై పోతుంది..అతను కంగారు పడుతున్నాడు..నా దగ్గర పెన్ లేదు.. జాలేసి పెన్ లేదు ...వద్దులే ..పర్వాలేదు అని సైగ చేసాను..అతను నవ్వి మరెవరినో పెన్ అడిగి సైన్ చేసాడు.. అతనికి ధేంక్స్ చెప్పి వచ్చి పేరు చూసాను ..ఆ పేరు గుడ్విన్ ..నాకు జింబాంబ్వే క్రికెటర్స్ లో తెలిసిన ఒకే పేరు అది..

అలా మొత్తానికి మేచ్ మొత్తం బోరు,బోరుగా చిరాకు చిరాకుగా జరిగింది..ఆ మేచ్ లో మనవాళ్ళు గెలిచారు(ట) ..అయిపోయాకా అందరూ పొలోమని ఇళ్ళకు పారిపోయారు ..మా ఆయన మాత్రం గ్రౌండ్ లోకి తీసుకువెళ్ళారు.. ' రవి శాస్త్రి ' కోసం.. నాకేంటో రవి శాస్త్రి అంత ఇష్టం ఉండడు..జిడ్డుగాడు.. చెత్తలా ఆడతాడు అని మ ఇంట్లో పెద్ద పేరు.. అలా అంటే మా ఆయన ఒప్పుకోరు ..సిక్స్ సిక్స్ లు కొట్టిన ఘనత శాస్త్రిదేనే మనవాళ్ళలో అని వాదిస్తారు..సర్లే పోని ముచ్చట పడుతున్నారు కదా అని వెళ్ళాను..అప్పటికే ఎవరి మీదో ధుమ ధుమలాడుతున్నాడు అయ్యగారు.. మొహం పింక్ కలర్ లో కందిపోయి ఉంది ..కాని చాలా బాగున్నాడు..మొన్న టి.వీ లో చూస్తే జుట్టు పీకేసిన కోడిలా చాలా భయంకరం గా ఉన్నాడు పాపం.. ఈ లోపల కెమేరా ఆన్..స్టార్ట్ అని అరిచారు ఎవరో ..అంతే కోల్గేట్ మాడల్ లా తీయగా నవ్వుతూ ఏంటో చెబుతున్నాడు ..అప్పుడు చాలా ఆక్చర్యం వేసింది ..వెంట వెంటనే మూడ్ మార్చుకోవాలంటే కష్టం కదా అనుకున్నా..

అతని మాటలు అయిపోగానే మేము ఎదురుగా నించున్నాం..మావారి దగ్గర పెన్ తీసుకుని ఆటోగ్రాఫ్ అడిగాను.. అసలే మావారి ఫేవరెట్ ప్లేయర్ కదా..అప్పటికి సింగపూర్లో క్రికెట్ అంత గా పట్టించుకునేవారు కాదు కాబట్టి మాకు చాలా ఫ్రీగా ఉంది..జనాలు లేకుండా.. రవి ఒక సారి నవ్వి సంతకం పెట్టి పెన్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు.. దానితో మావారు గోల గోల..అది ఈయనగారి సెంటిమెంట్ పెన్ అంట ..కాసేపు అయ్యాకా పోనిలే రవి నా పెన్ తీసుకున్నాడు అని తెగ ఆనందపడ్డారు.. అయ్యో ఎంత అమాయకం అండి కాసేపటిలో యే చెత్త బుట్టలోనో పడేస్తాడు అనుకున్నా మనసులో.. అలా క్రికెటర్లను అందరిని చూసుకుని ఇంటికొచ్చేసాము..ఇంటికి వచ్చాకా నేను కనబడ్డానా అని తెగ ఆత్రుతగా అడిగాను..అంటే కనబడ్డావనుకుంటా..నువ్వే అనుకుంటా..చూసామనుకుంటా అని నన్ను తృప్తిపరిచే మాటలు మావాళ్ళు మొదలు పెట్టారు..కొద్దిగా నిరాశగా అనిపించినా పోనిలే బాబు ఒక పని అయిపోయింది మా ఆయన కల తీరిందికదా అనేసుకున్నా అమాయకంగా

కాని కధ అక్కడితో అయిపోలేదు మొదలయ్యింది :)
Categories: Middle

నేనూ-నా సాహసాలు

Fri, 06/11/2010 - 08:16
చేతులకి గోరింటాకు పెట్టేసుకో అన్నంత ఈజీగా మావారు బ్యాంక్ కు వెళ్లి లెటర్ తెచ్చేసేయి అని చెప్పేసి హాయిగా పడుకున్నారు గాని నాకు ఒకటే భయం,ఆలోచనలు.. అక్కడకు ఎలా వెళ్ళాలి?.. సరే, ఏదో రకంగా వెళ్ళినా ఎలా మాట్లాడాలి? ఏమని మాట్లాడాలి?..నాతో ఒక్క మాట మాట్లాడని సందీప్ గాడిని చూస్తేనే భయం తో త..త్త...త్త, మ..మ్మ..మ్మా అంటున్నా కదా ..ఇంక ఆ జెట్ స్పీడ్ పిల్ల తో ఎలా మాట్లాడాలి??.. పైగా బ్యాంక్ అంటే బోలెడు మంది ఉంటారు..గ్రామర్ తప్పులు మాట్లాడితే అందరూ కోవై సరళను చూసినట్లు చూసి నవ్వుతారేమో ...ఇటు చూస్తే ఈ మనిషి దగ్గర సామ ,దాన ,బేధ ,దండో పాయాలు ఏవీ పని చేసేలా లేవు.. హే భగవాన్ ఏమిటినాకు ఈ పరీక్ష??అని పరి పరి విధంబుల బాధపడిన పిమ్మట ఇక వెళ్ళాలనే నిర్ణయించుకున్నాను..

ఆ వెంటనే ఆయన్ని లేపేసి ..ఏమండీ ..ఇప్పుడూ.. బ్యాంక్ కు వెళ్ళామనుకోండి.. అక్కడ వాళ్ళను ఏమని అడగాలి అన్నాను ... ఆ.. కాఫీలు తాగారా ..ప్రొద్దున మీ ఇంట్లో ఏం టిఫిన్ వండారు అని అడుగు అని దుప్పటి ముసుగేసారు .. అబ్బా చెప్పండి ..లేక పొతే నేను వెళ్ళను అన్నాను బాసింపట్టు వేసుకు కూర్చుని ..అబ్బా..నాకెక్కడ దొరికావే..నిద్ర పోనివ్వవు ..ఇందాక చెప్పాను గా ... అదే ..మీ బ్యాంక్ నుండి నిన్న ఎవరో అమ్మాయి నాకు ఫోన్ చేసింది.. ఏదో లెటర్ పంపారట ...మా వారి మాటలకు అడ్డు తగులుతూ .. ఉహు ..హు .. ఇంగ్లీష్ లో చెప్పండి అన్నాను శ్రద్దగా వింటూ ... సరే ..వన్ ఆఫ్ యువర్ బ్యాంక్ పీపుల్ కాల్డ్ మీ ఎస్టర్ డే ....................మావారు చెప్తుంటే జాగ్రత్త గా వినడం మొదలు పెట్టాను.. అయిపోగానే అహ..హా ఇందాక సరిగ్గా వినలా ..ఇంకోసారి చెప్పండి అని ఓసారి..ముచ్చటగా మూడో సారి ..ఇదే ఇదే లాస్ట్ సారి అని బోలెడు తిట్ల మధ్య ఆయన చెప్పింది జాగ్రత్త గా విని ఆ రాత్రంతా నిద్రలో కూడా 'వన్ ఆఫ్ యువర్ బ్యాంక్ పీపుల్ '.. 'వన్ ఆఫ్ యువర్'.. అంటూనే నిద్ర పోయా..

ప్రొద్దున లేవగానే ఆఖరి ప్రయత్నంగా గార ,నయగారాలు చూపబోయాను కాని అక్కడున్నది ఎవరూ.. మా ఆయన .. నోరుమూసుకుని తీసుకురా అని ఆఫీస్కి వెళ్ళిపోయారు.. చేసేదేమీ లేకా దేవుడా నువ్వే దిక్కు అని తయారయ్యి పేపర్ మీద మా ఇంటి అడ్రెస్సు, బయట తప్పి పొతే కాల్ చేయడానికి చిల్లర నాణాలు గట్రా గట్రా సరంజామాతో బయటకు వచ్చాను.. పట్టపురాణికి మల్లే నా ఏకాంత మందిరాన్ని వదిలి బయటకు రాని నేను అలా వేళగాని వేళలో ఒక్కదాన్నే బయటకు వెళుతుంటే మా ఇంటి ఓనరు ,సందీప్ గాడు దెబ్బకి షాక్ ... ఎక్కడికి? అంది మా ఓనర్ ...నాకు కొంచెం ఆనందం వేసేసింది ...బ్యాంక్ కి వెళుతున్నా అన్నాను స్టైల్ గా ... ఒక్కదానివేనా? దారి తెలుసా అంది ఆక్చర్యంగా ... ఓ ..యా ... అది పెద్ద విషయం కాదు .. MRT లో టాన్జుంగ్ పాగార్ వెళ్లి ,కేపిటల్ టవర్ మీదుగా స్ట్రైట్ గా వెళ్ళడమే..సింపుల్ ... ఫోజుగా అంటూ క్రీగంట వాళ్ళను చూస్తూనే టకటక బయటకు వచ్చేసి లిఫ్ట్ అద్దం లో నా మొహం చూసుకుని ఛీ..ధూ నీకిది అవసరం అంటావా .... అని సత్కరించుకున్నా..

బయటకు వచ్చానే గాని ఎలా వెళ్ళాలి ? దేవుడా..దేవుడా.. అని అలా నడవడం మొదలు పెట్టాను.... తెలియదు తెలియదు అనుకుంటున్నా గాని రోజూ అటే వెళుతుండటం వల్ల బాగానే దారి తెలిసినట్లు అనిపించింది ...మెల్లిగా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసా ..బయట చిన్న చిన్న పిల్లలు చారిటీ ఇవ్వమని డిబ్బీలు చూపుతున్నారు.. డబ్బులు వేస్తే ఒక స్టిక్కర్ ఇస్తున్నారు ..అంటే ఇంకెవ్వరు చారిటి అడగరు అది అంటిన్చుకుంటే... ఇక్కడ స్కూల్ పిల్లలు ఇటువంటి కార్యక్రమాలకు చురుకుగా పాల్గొంటారు .. లోపలికి వెళ్ళగానే ఎదురుగా సిగరెట్టు కాల్చడం ,ఆహారం తినడం , డురియన్ అనే ఫ్రూట్ తీసుకువెళ్ళడం గాని చేస్తే జరిమానా అని బోర్డ్ ఉంది ... అవన్నీ నాదగ్గర ఉన్నాయేమో అని చెక్ చేసుకున్నా ..లేవు..

అన్నట్టు డురియన్ ఫ్రూట్ అనగానే చిన్న విషయం గుర్తొచ్చింది ..మన పనస పండులా ఉండే దీన్ని సింగ పురియన్స్ ఎంత ఇష్టపడతారో ,ఇండియన్స్ అంత దూరం పారి పోతారు ..ఎందుకంటే దీని స్మెల్ చూడగానే వికారం,తలనెప్పి వచ్చేస్తుంది అట ...నేనసలే ఎలాంటి దాన్ని అంటే బెంజి కారు ఎక్కించినా వేక్...వేక్ మని డోక్కుంటా... 'కేబ్ ' ఎక్కే విషయం లో నాకు ,మా ఆయనకు కాంతారావు కత్తి యుద్దమే.. ఇదంతా విని నేను ఆ పండు చూడగానే కెవ్వున అరిచి పారిపోతాననుకున్నారా ..హి హి హి అక్కడే డురియన్ పైన కాలు వేసారు ..నాకు ఆ పండు అంటే మహా ఇష్టం .. అదేంటో మావారు బాబోయ్ ,అమ్మోయ్ అని కర్చీఫ్ ముక్కు కు అడ్డం పెట్టుకుని తెగ కష్ట పడిపోతుంటారా ..నేనేమో ఎంచక్కా రెండు పేకేట్స్ కొనుక్కుని తింటూ మరీ ఇంటికొస్తా.. ఇదిగో అలా అసహ్యం గా చూస్తే నేను తరువాత కధ చెప్పనంతే ..


సరే స్టేషన్ కంట్రోల్ దగ్గర కార్డ్ పెట్టి తలుపులు తెరుచుకోగానే లోపలికి వెళ్ళాను... ట్రైన్ ఎక్కే ప్లేస్ దగ్గర అటు ,ఇటు మేప్ లు ఉన్నాయి ..'బూన్ లే' వైపు ఎక్కవలసిన ట్రైన్ ఎక్కాను గాని..కరెక్టేనా అనుకుని నెక్స్ట్ స్టాప్ 'తానామెరా' ఎనౌన్స్ చేసేవరకు భయం భయంగా విని హమ్మయా అనుకుని ఊపిరి పీల్చుకున్నా ...అప్పట్లో ఇండియన్స్ చాలా తక్కువ ఉండేవారు ..ఇప్పుడూ ఎటు చూసిన వారే అనుకోండి.. ఇక్కడి చైనా వాళ్ళు చిన్నపిల్లలగా ఉన్నపుడు ఎంత బాగుంటారో ...కాని అదేంటో పాపం పెద్ద అవ్వగానే చపాతికి కళ్ళు,ముక్కు అతికించినట్లు తప్పడిగా అయిపోతారు.. కాని తలవెంట్రుకల నుండి ,కాలి గోళ్ల వరకు ఎంత శ్రద్ద తీసుకుంటారో ...

అలా ట్రైన్ లో నుండి బయట కు త్రొంగి చూస్తుంటే భలే అనిపించింది.. ఈ దేశం మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఒక్కలాగే ఉంటుంది ... ఫలానా వూరు ఎక్కువ ,తక్కువ అని ఉండదు ... ఈ లోపల ఒక ముసలావిడ నా ఎదురుగా వచ్చి నించుంది.. ఇక్కడ రూల్ గుర్తు వచ్చి లేచి సీట్ ఇచ్చేసా.. నాకేంటో చాలా గొప్ప పని చేసేసా అన్న ఫీలింగ్ వచ్చేసింది ... ఈ లోపల బయట అంతా చీకటి పడిపోయింది ..అంటే అండర్ గ్రౌండ్ లో కోచ్చేసాం అన్నమాట ....మళ్లీ 'వన్ ఆఫ్ యువర్ బ్యాంక్ పీపుల్ ' అని పాఠం అప్పచేప్పుకున్నా కాసేపు ... నేను దిగవలసిన ప్లేస్ రాగానే దిగిపోయాను .. బయటకు రాగానే మావారు 'కేపిటల్ టవర్' ఎటో అడగమన్నారు కదా అని గుర్తు వచ్చింది ..మెల్లిగా అటు వెళుతున్న అబ్బాయిని 'కేపిటల్ టవర్ ' అన్నాను.. గో స్ట్రయిట్ అన్నాడు చిన్నగా నవ్వి ..

ఇక్కడ ఇంగ్లీష్ విషయం లో అనవసరంగా భయపడ్డాగాని నిజానికి సింగపూర్ లో వాడేది ఎక్కువగా సింగ్లీష్ ... ఇంగ్లీష్ భాషాభిమానులు ఎవరైనా ఉంటే ఈ పేరా వదిలేసి చదవండి..ఆనక తట్టుకోలేక కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నాది పూచి కాదు ... సింగ్లీష్ అనేది పూర్తిగా నాలాంటి వాళ్ళకోసం ప్రత్యేక శ్రద్ద తో రాసినది.. ఇప్పుడు నువ్వు డిన్నర్ తిన్నావా ? అని అడగాలనుకోండి ..మన ఇంగ్లీష్ లో అసహ్యంగా 'డిడ్ యు హేవ్ యువర్ డిన్నర్' అని ఇంత గ్రామరేసుకుని అడుగుతామా.. అదే సింగ్లీష్ లో అయితే 'డిన్నర్ ఫినిషా ' అని సింపుల్గా అనేస్తాం అన్నమాటా.. అదొక్కటేనా' యు గో వేరా' ? 'ఈట్ ఎ రెడియా '? డూ వాట్ ఆ ? అబ్బో ఇలాంటివి చాలా ఉన్నాయి..గ్రామర్ గట్రాలు పీకి పడేసి చివర్లో 'ఆ'లు ... 'లా'లు పెట్టేస్తే సరిపోతుంది..మొత్తం సింగపూర్ అంతా 'కెన్'.'.కేనాట్ 'ల పై ఆధార పడి ఉంటుంది ..ఓ సారి మా తోడికోడలు ఏదో డ్రెస్ కొని 'ఈజ్ ఇట్ వాషబుల్' అంది .. పాపం పది సార్లు చెప్పినా వాడికి అర్ధం కావడం లేదు .. నన్ను పిలిచి విషయం చెప్పగానే 'వాషింగ్ కెన్నా' అన్నా అంతే కెన్ లా ,కెన్ లా అని ఆనందం గా చెప్పాడు.. పాపం ఇంత చక్కని భాషను వద్దు అని ఇక్కడి ప్రభుత్వం ఇంగ్లీషే మాట్లాడమని ప్రజలను వేపుకు తింటుంది ..హేమిటో


సరే అలా 'కేపిటల్ టవర్ ' మీదుగా వెళుతుంటే ఒక చోట బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ కనబడింది ...అప్పటివరకు మర్చిపోయిన భయం మళ్లీ కౌగలించుకుంది ... లోపలికి వెళ్ళగానే చాలా మంది అనేక కౌంటర్ ల దగ్గర నిలబడి ఉన్నారు.. అక్కడే నించుని కాసేపు ధైర్యం చెప్పుకుంటుంటే ఒక ఆమె పిలిచి ఎస్ ,వాట్ కెన్ ఐ డూ ఫర్ యు మేడం అంది ... అంతే మళ్లీ మర్చిపోతానేమో అని రాత్రి నేర్చుకున్న పాఠం టక టక టక అప్పచెప్పేసాను.. మరి ఏమనిపించిందో ఆమెకు అర నిమిషం నావైపు చూస్తూనే ఉంది.. ఇంకేం అడక్కే బాబు అని దీనం గా చూసాను .. ప్రక్కనే ఉన్న లెటర్ తీసి నా చేతిలో పెట్టింది మారు మాట్లాడకుండా..దేవుడా ! గట్టిగా ఊపిరి పీల్చుకుని ఇంకో మాట మాట్లాడే అవకాశం ఆమెకు ఇవ్వకుండా బయటకు పరుగో పరుగు ...

తరువాత చేతిలో లెటర్ చూసుకుని ఒకటే ఆనందం...కళ్ళ లో నీళ్ళు వచ్చేసాయి ..చిన్నపుడు పెన్సిల్ ముక్క కొనాలన్నా నా ఫ్రెండ్ ని ముందు పెట్టి నువ్వు అడుగు, నువ్వు అడుగు అని వెనుక నిన్చునేదాన్ని ..అలాంటి నేనేంటి ?,ఇంత దూరం రావడం ఏమిటి,?ఇలా ఒక్కదాన్నే పని పూర్తి చేయడమేమిటి?? దారంతా నవ్వేసుకుంటూ ,ఎగురుకుంటూ స్టేషన్ కొచ్చేసాను.. అక్కడ ఫోన్ లు చూడగానే ..ప్రొద్దున నన్ను మావారు పెట్టిన నస గుర్తువచ్చి కోపం వచ్చేసింది ..అందుకే మా ఆయన్ని ఏడిపించాలనిపించింది .. ఏమండీ..నేను తప్పిపోయాను ..ఎక్కడున్నానో తెలియడం లేదు ... అని ఏడుస్తూ ఇంకో ముక్క మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేసి ఒక పది నిమిషాల తరువాత కాల్ చేసి చెప్దాం అని ఫోన్ దగ్గరకు వెళ్లాను.. కానీ!! హుమ్..అసలే ఆఫీస్లో చాలా బిజీగా ఉంటున్నా అంటున్నారు ..ఇప్పుడు ఇలా చెపితే టెన్షన్ పడిపోతారేమో ..పాపం లే అనిపించి నిజం చెప్పేసా ...


అదేమరి ... ఇంత సున్నిత మనస్కులు అయితే ఎలా అండి... వెళ్లి కళ్ళు కడుక్కుని రండి ..ఇలాంటి త్యాగాలు నేను చాలానే చేసాను ...మళ్లీ వీలున్నపుడు చెప్తానే :)
Categories: Middle

కొంచెం ఇష్టం ...కొంచెం కష్టం

Sun, 05/30/2010 - 23:52
'సిమే 'లో ఉన్నది కొద్ది రోజులే అయినా ,ఆ రోజులని భారతదేశపు చరిత్రలో గుప్తుల యుగంని స్వర్ణ యుగం తో పోల్చినట్లు , నా డైరీలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గరోజులు .. అతి ముఖ్యం గా వ్రాయవలసింది నా నిద్ర గురించి..అప్పట్లో నిద్రా దేవి చాన్స్ దొరికిందంటే చాలు జోల పాడటానికి రెడీగా నా వెనుకేతిరుగుతూ ఉండేది..ప్రొద్దున్న ఆరు గంటలకు నిద్రలేచి వంట చేసి,టిఫిన్ పెట్టి ,లంచ్ బాక్స్ తో మా ఆయన్ని 7 గంటలకల్లా ఆఫీసుకు పంపగానే స్నానపానాదులు ముగించుకుని ,పూజ చేసుకుని ఎనిమిది కల్లా టిఫిన్ తినేసేదాన్నా .. అంతే మంచమెక్కి పడుకున్నానంటే మళ్ళా లేవడం, లేవడం మద్యహ్నం ఒంటిగంటకే... భోజనం చేసి మా బెడ్ రూం లోనే ఉన్న పోర్టబుల్ టివి లో ఆ నాలుగు భాషల్లో వచ్చే (తమిళ్,ఇంగ్లిష్,మలయ్,చైనీస్ ) చానెల్స్ ని ఒక రెండు గంటలు చూస్తూ చూస్తూ మళ్లీ నిద్ర పోయి ,అయిదు కల్లా నిద్రలేచేదాన్ని..ఆ తరువాత కాసింత అన్నం ,కూర వండేసి స్నానం,పూజ అయ్యేసరికి మావారు గుమ్మంలో ఉండేవారు ...

ఇద్దరం అలా MRT (రైల్వే స్టేషన్ ) వరకు కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్లి ,అక్కడే ఉన్న చిన్న మార్కెట్ లో మరుసటి రోజుకు కావలసిన కూరగాయలను కొనేవాళ్ళం.. ఒక్కో వంకాయా మోచేతి వరకు ఇంత పెద్దది ఉంటే ,అమ్మ బాబోయ్ !!!మన ఇద్దరికీ ఒక్క వంకాయ తో రెండు పూటలా కూర వచ్చేస్తుందండి అని తెగ మురిసి పోయేదాన్ని.. ఆ హైబ్రిడ్ కాయలు రుచి, పచి ఉండవని తరువాత తెలిసిందనుకోండీ ... ఆ తరువాత ఇద్దరం మళ్లీ కబుర్లేసుకుని ... మావారు తన కాలేజ్ లో ఆయన గారిని ఆరాధించిన అమ్మాయిల దగ్గరనుండి ,అనేకానేక సాహసాల వరకు .. బోలెడు కోతలు కసా బిసా మని కోసేస్తున్నా( ఏమో ఇప్పుడు తలుచుకుంటే అలాగే అనిపిస్తుంది మరి ) అమాయకం గా నమ్మేస్తూ ఇంటికోచ్చేసేదాన్ని ...

అప్పుడు ఎంచక్కా భోజనం తింటూ 'చెస్ ' ఆడుకునేవాళ్ళం .."ఎవరు గెలిచేవారు?? "లాంటి సుత్తి ప్రశ్నలు అడక్కండి..నాకు కోపం వస్తుంది..అసలు నన్ను అడిగితే ,మనం ఓడిపోతేనే కదా ఎదుటి వాళ్ళు గెలిచేది ...అదే మనం గెలిస్తే వాళ్ళు గెలవగలరేంటీ???అదీ పాయింటు ... అందుకే ఒక యాబై సార్లు ఆడితే ,నలబై తొమ్మిది సార్లు నేనే ఓడిపోయేదాన్నిఅన్నమాట .ఆ తరువాతా మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో పది అయ్యేసరికి గాఢ నిద్రలో తేలియాడాల్సిందే... అమ్మాయిలందరికీ కుళ్ళు వచ్చేస్తుంది కదూ ..మరదే, ఒకానొక సమయం లో అసలు ప్రపంచం లో నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరేమో అని పొరపాటున అనేసుకున్నా కూడా..కాని, మళ్లీ అలాంటి మాటలు అనకుండా విధి చాలా జాగ్రత్తలు తీసుకుంది మరెందుకో ???...

సరే విషయంలో కొచ్చేస్తే అంతా బాగానే ఉంది కాని ...ఎప్పుడూ కధలో హీరో ,హీరోయిన్లే ఉంటే బోరు కొడుతుందని అనుకున్నాడో ఏమో ..నాకో విలన్ తయారయ్యాడు..వాడి పేరు సందీప్ ..గుజరాతి.. మా ఓనర్ వాళ్ళింట్లో మరొక రూం లో పేయింగ్ గెస్ట్ ...మరి అతను స్టూడెన్టో లేక జాబ్ చేసేవాడో తెలియదు కాని ఎక్కువగా ఇంట్లోనే ఉండేవాడు ... అతను ,నేను ఒక్క మాట కూడా మాట్లాడుకోకపోయినా వాడిని చూసి తెగ భయపడిపోయేదాన్ని ..ఇంతా చేసి వాడు ఏం చేసేవాడయ్యా అంటే నన్ను చూసి 'కిసుక్కున' నవ్వడం.. 'ఓస్' .. ఈ మాత్రందానికే అంత భయపడిపోవడం ఎందుకో అని అనేయకండి మరి... పూర్తిగా వినండి ...

మా ఇంట్లో నాలుగు బర్నర్ల స్టవ్ ఉంది అని చెప్పాకదా ... అదేమో ,బటన్స్ ఎక్కడో ఉండేవి,దాని బర్నర్లు ఎక్కడో ఉండేవి..దేనిది దేనిదో మా చెడ్డ కన్ఫ్యూజ్ అయిపోయేది నాకు...పైగా స్టవ్ వెలిగించడానికి లైటర్ రూపంలో మరొక బటన్ ..అసలే నిద్ర మత్తులో వంటేమో.. సరిఅయిన నాబ్ తిప్పి ,లైటర్ బటన్ ప్రెస్ చేసి స్టవ్ వెలిగించే సరికి, నాకు తాతలు దిగివచ్చేవారు కొద్ది రోజుల పాటు.. సరిగ్గా అదే సమయానికి కిచెన్ దగ్గర బాత్రుం లోకి వెళుతూ నా పాట్లు చూసి, అసలేమాత్రం మర్యాద లేకుండా కిచ, కిచమని నవ్వుతూ వెళ్ళేవాడు ఆ అబ్బాయి .. అదొక్కటేనా ..ఆ వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడం మరొక యజ్ఞం ... దాన్ని 'ఆన్ ' చేయడానికి దాని చుట్టూ మినిమం ౩ సార్లు ప్రదిక్షణలు చేయవలసి వచ్చేది ... అన్నిటికన్నా కష్టమైన పని బట్టలు ఆరబెట్టడం ... అంత పొడవు కర్రల పైన బట్టలు ఆరబెట్టి ,దాని చివర్లు పట్టుకుని బయట ఉన్న హోల్స్ లోకి వాటిని గ్రుచ్చేసరికి కర్ర తోపాటు నేనూ .. తుఫాన్ వచ్చినపుడు తాడి చెట్టులా ఆ మూలకు ,ఈ మూలకు ఒరిగిపోయేదాన్ని... అయినా ఏ మాత్రం కరుణించకుండా ప్రతి సన్నివేశానికి ఫక్కున నవ్వుతూనే ఉండేవాడు దొంగమొహం గాడు..

అయ్యో ...వీటన్నిటిని కూడా క్షమించేయగలను ...కాని, మావారి ఫ్రెండ్స్ నుండి ఫోన్ వచ్చినపుడు మాత్రం వాడి మొహం చూస్తే ..'ఎర్రగా' పదికి తగ్గకుండా వాతలు పెట్టేయాలన్నంత కసి వచ్చేసేది ..నాకసలే A for apple .. B for boy అని అరటిపండు వలిచినట్లు ముద్దుగా ,స్పష్టం గా మాట్లాడితేనే ఒక పట్టాన ఇంగ్లీష్ అర్ధం అయ్యి చావదు ... అలాంటిది పీస్ పీస్ పావలా కాస్ టైపులో ఏదో యాసలో మాట్లాడితే అసలు అర్ధం కాదు.. అప్పుడప్పుడే మాయదారి క్రికెట్ క్లబ్బులు అలవాటు పడుతుండటం వల్ల మెల్లి,మెల్లిగా ఫ్రెండ్స్ మొదలయ్యారు మా ఆయనకు..సాయంత్రం అయిదయిందంటే చాలు .. పొలోమని 'కాల్ 'చేసి ఆయన గురించి వాకబు చేసేవారు.. అప్పటికి మొబైల్ లేకపోవడం వల్ల 'లేండ్ ఫోనే' గతి ..తప్పక హాల్లో కొచ్చి మాట్లాడేదాన్ని... అత్త తిట్టినందుకు కాదుగాని తోడికోడలు నవ్వినందుకు అని .. వాళ్ళ ఇంగ్లీష్ అర్ధమవ్వనందుకు కాదుగాని ఎక్కడ వీడు నవ్వుతాడో అని భయమేసిచచ్చేది ...

మా ఆయన ఆఫీస్ కి వెళ్ళాడు అని ఒక్క ముక్క చెప్పడానికి .. వాడు చూస్తున్నాడు అన్న టెన్షన్లో he ..she .. go ..went ..to.. office అంటూ స్త్రీ,పురుష లింగ భేదాలు లేకుండా భూత ,భవిష్య ,వర్త మాన కాలాలన్నిటిలోను సమాధానం చెప్పేదాన్ని వాడి వైపు చూస్తూ... వాడు కూడా యే మాత్రం మేనర్స్ లేకుండా అక్కడే సోఫాలో కూర్చుని నవ్వు భయటకు రాకుండా పెదాలు బిగించి నన్ను ఎంత కుళ్ల బెట్టాలో అంతా పెట్టేవాడు ... పోనీ ఎదుటి వాళ్ళన్నా ..అయ్యో పాపం ,పిల్ల మాట్లాడటానికి కష్టబడుతుంది ..మనం ఎందుకు బాధ పెట్టడం అని కొంచెమన్నా ఇంగితం తో ఆలోచించాలా!! ..అబ్బే ...మీ ఆయన ఆఫీసుకు వెళ్ళాడా ??..ఇంకా రాలేదా ?? ఎప్పుడొస్తాడు? నువ్వెవరు? అంటూ ఒకటే ప్రశ్నల వర్షం.. రోజు వచ్చే ఫోన్లే..ఎప్పుడూ అడిగే ప్రశ్నలే ..అయినా వాడిని చూడగానే నోట్లోంచి మాట వచ్చేది కాదు..


ఈ బాధ పడలేక రోజూ అర చేతిలో ముఖ్య మైన ప్రశ్నలకు సమాధానం రాసుకుని ఫోన్ రాగానే క్రీగంట వీడిని చూస్తూ .. ఒక ప్రక్క చేతిని చూస్తూ సమాధానాలు చెప్పేదాన్ని.. ఈ తెలివి తేటలు ఎక్జామ్లో చూపించి ఉంటే నా సామిరంగా కాలేజ్ ఫస్ట్ వచ్చేసేదాన్ని కదా... హుమ్(భారి నిట్టూర్పు) ... అయితే మా ఆయన ఫ్రెండ్స్ ఏమన్నా తక్కువ తిన్నారా?? ఆన్సర్ షీట్ లో లేని క్రొత్త ప్రశ్నలన్నీ కని పెట్టి మరీ అడిగేవారు .. నాలుగు రోజులయ్యే సరికి చిరాకొచ్చేసి " ఇంకోసారి మీ ఫ్రెండ్స్ నుండి ఇంటికి ఫోన్ వచ్చిందో మర్యాద దక్కదంతే "అని 'ఘాట్టిగా ' వార్నింగ్ ఇచ్చేసా మా ఆయనకు ... వెంటనే యే మాత్రం తడుముకోకుండా" కాళ్ళు విరగ కొడతా అరిచావంటే "అని ముద్దుగా సమాధానం ఇచ్చేసారు మా ఆయన కూడా..అలాంటి కధకు సంభందం లేని విషయాలను మనం పెద్దగా పట్టిన్చుకోకూడదన్నమాట ..

సరే ..ఇదిలా జరుగుతుండగా ఒక రోజు మద్యాహ్నం యధాప్రకారం నేను సుష్టుగా తిని, బెస్టుగా పడుకున్న తరుణం లో ఎవరో తలుపులను టక,టకా మని కొడుతున్న శబ్దం.. టైం చూస్తే నాలుగే అయ్యింది.. ఎవరబ్బా ??అనుకుని తలుపు తీస్తే ఎదురుగా సందీప్ ..."ఫోన్ "అని చెప్పి సోఫాలో కూర్చున్నాడు ... ఈ టైములో ఎవరూ? సాదారణంగా మా ఆయన ఆ టైమ్లో చేసేవారు కాదు నేను పడుకుంటానని.. రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుని 'హలో' అన్నాను ..అంతే "కోరమండల ఎక్స్ ప్రెస్ " ఒకటి ఆడ గొంతు తో ఇటు నుండి అటు ఆగమేఘాల మీద వెళ్ళిన శబ్దం.. నాకు ఇప్పటికీ తెలియని విషయం ఏమిటంటే, ఈ "సింగపూరియన్స్" ఎవరో వెనుక తరుముకొస్తున్నట్లు అంత హడావుడిగా ఎందుకు మాట్లాడుతారో ??? ...చేసేది ఏమి లేకా ...సారి ..కమ్ ఎగైన్ అన్నాను ... మళ్లీ" కోరమండల ఎక్స్ ప్రెస్ " ఈ సారి అటు నుండి ఇటు పరిగెత్తింది కాని ఒక్క ముక్క అర్ధం కాలేదు..

వద్దు ,వద్దు అనుకుంటూనే భయం భయం గా సోఫా వైపు చూసాను ..వాడు మాత్రం తన పాత్రకు ఏ మాత్రం అన్యాయం చేయకుండా తెగ నవ్వేసుకుంటున్నాడు 'టివి' చూస్తూ ...దొంగ సచ్చినోడా నీకేం పనిరా ఇక్కడ ?లోపలి పోయి ఏడచ్చుగా అని తిట్టుకున్నాగాని.. ఏం చేయాలో అర్ధం కాలేదు ... పోనీ ,ఫోన్ పెట్టేస్తే? ఉహు లాభం లేదు ..మళ్లీ కాల్ చేస్తుంది.. ఏం చేయాలి ఇప్పుడు?? ... అనుకుంటుండగానే అయిడియా తళుక్కుమంది ...

ఇందాకా ఆ అమ్మాయి ' బేంక్ ఆఫ్ ఇండియా' నుండి కాల్ చేస్తున్నా అంది..అంటే ' ఇండియన్' అయి ఉండచ్చు... కాబట్టి కొద్దో గొప్పో హిందీ తెలిసి ఉండచ్చు..మనకసలే హిందీ సినిమాలు చూసిన లోక జ్ఞానం సూపరు ఉంది కాబట్టి.. విషయం ఏంటో అర్ధం అయితే చాలు మేనేజ్ చేసేద్దాం అనుకుని చీకట్లో రాయి విసురుతూ .."ఆప్ కో హిందీ మాలుమ్ హై" అన్నాను గుస గుసగా ... నా మాట ఇంకా పూర్తి కానే లేదు ..ఇందాక చెప్పిన స్పీడ్ కి 'డబల్ 'వేసుకుని మరీ మాట్లాడింది ఆపకుండా పదినిమిషాలు ...చివర్లో హై ,హో ,హు లు తప్పించి ఒక్క ముక్క అర్ధం అయితే ఒట్టు ... సైన్స్ ఎక్జాం రోజున సోషల్ చదువుకు వెళ్ళిన విధ్యార్దిలా తయారయ్యింది నా పరిస్థితి.. ఓరి దేవుడోయ్ ..నాకెక్కడ దొరికావే బాబు ...అనుకుని ,సోఫా వైపు చూసే ధైర్యం లేక, చివరకు నా ఓటమి అంగీకరిస్తూ... నాకు అర్ధం కావడం లేదు ..మా ఆయన ఫోన్ నెంబర్ ఇస్తా ఆయనకు చెయ్యండి అని చెప్పి గదిలో కొచ్చి ఒక గంట కుళ్లిపోయి,ఉడికి పోయి ఆ ఫళంగా కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకున్నా ...

సాయంత్రం మా ఆయన రాగానే ఏమండీ ..ఇందాకా ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది.. మీ నెంబర్ ఇచ్చాను ..ఏమిటండి సంగతి అన్నాను .. ఆ ..అవునే మర్చిపోయా..బేంక్ లో NRI ఎకౌంటు ఒకటి ఓపెన్ చేశా ..దానికి సంబంధించి ఏదో లెటర్ పంపిందంట ...అది అడ్రెస్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వెనక్కు వచ్చేసిందంట ...వచ్చి కలెక్ట్ చేసుకోమంది.. రేపు నువ్వు వెళ్లి తీసుకొచ్చేయి అన్నారు సింపుల్ గా ... ఒక్కోసారి మా ఆయనను చూస్తే ..క్షణం క్షణం లోని వెంకటేష్ గుర్తు వస్తాడు ...అందులో హీరో గోడలు,మేడలు,మిద్దెలు ఎక్కేసి ..శ్రీదేవిని ..ఆ వచ్చేయి ,దూకేయ్, ఎక్కేయ్ అని సింపుల్గా చెప్పేస్తుంటాడు....

అలాగా.. దేశం కాని దేశం లో ..వచ్చి పది రోజులు కాక మునుపే ..ఒక్కదాన్నీ బయటకు వెళ్లి రమ్మంటే అసలేమనుకోవాలి ఈ మనిషిని ... పైగా నా అంత ధైర్యవంతురాలితో అనవలసిన మాటలేనా అవి అని అడుగుతున్నా... అంతే.. అదేమాట మాట అడిగేశాను ఆవేశంగా ఆయన్ని ...మా ఆయనేమన్నా తక్కువ తిన్నారేంటి ... ఛీ నోర్ముయ్ ..ఎప్పుడు నాకేం తెలియదు తెలియదు అనుకుంటే ఎప్పటికీ ఏమీ తెలియదు ...ఇంకెప్పుడు నేర్చుకుంటావ్.. మొన్న ఫలానా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ శ్రీలంక ఎయిర్ లైన్స్ లో ఇద్దరు పిల్లలతో రెండు విమానాలు మారి మరీ వచ్చేసింది ఇక్కడకు తెలుసా ..మళ్లీ ఒక్క ఇంగ్లీష్ ముక్కరాదు...వాళ్ళందరూ రావడం లేదూ... ఇక్కడ నాకు తెలియదు ..రాదు అంటే కుదరదు ... రేపు వెళ్లి తీసుకు వచ్చేసేయ్ అని కరాఖండిగా చెప్పేసారు ...(ఆ ఫ్రెండ్ కూడా ప్రతిదానికి నాతో పోల్చి ఆ అమ్మాయితో పనులు చేయిన్చేసు కుంటాడంట..ఒకసారి ఆ అమ్మాయే చెప్పింది )

ఇంకొక అమ్మాయితో పోల్చేసరికి పౌరుషం వచ్చేసింది కాని భయం దాన్ని అదిగమించేస్తుంది .తిరగబడి లాభం లేదని ..అది కాదండి,మరి... నాకు బొత్తిగా దారి తెలియదు ..ఒక్కసారేగా ట్రైన్ ఎక్కించారు..ఎటు వెళ్ళాలో ఏమో అన్నాను బ్రతిమాలే పొజిషన్ కొచ్చేసి ... ఇక్కడ అడ్రెస్స్ కనుక్కోవడం చాలా ఈజీ బుజ్జి.. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్తామా ...అక్కడ ఎక్కడ పడితే అక్కడ మేప్ లు ఉంటాయి .. అప్పుడు 'బూన్ లే 'కు( ఇప్పుడు లాస్ట్ స్టాప్ 'జూ కూన్' వరకు పెంచాడు) వెళ్ళే వైపు వచ్చిన ట్రైన్ ఎక్కావనుకో ' టాన్జుంగ్ పాగర్ ' దగ్గర దిగిపో... అక్కడ 'స్టేషన్ కంట్రోల్ 'దగ్గర కేపిటల్ టవర్ కు వెళ్ళే దారి ఎక్కడో కనుక్కుని ,అటు నుండి తిన్నంగా వెళ్ళిపోతే ' బేంక్ ఆఫ్ ఇండియా 'అని బోర్డ్ కనబడుతుంది.. వెళ్లి తెచ్చేసేయ్ ..సరేనా అన్నారు ...

చెప్పద్దూ... నాకు అరచేయి పిడికిలి బిగించి మా ఆయన్ని వంగో పెట్టి గిబుక్కు ,గిబుక్కుమని కొట్టాలన్నంత కసి వచ్చేసింది కాని ,పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం తో ఈ సారి ఏడుపు మొహం తో ..ఒక వేళ 'తప్పిపొతే' ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించాను... ఎహే ఎందుకు తప్పిపోతావ్ ... అంతగా అయితే దారిలో ఏదో ఒక టాక్సీ పట్టుకుని ఇంటి అడ్రెస్ చెప్పి వచ్చేసేయ్ అన్నారు ముసుగుతన్ని ... కలకంటి కంట కన్నీరు ఒలికినా కనికరం కలగదే ఈ కఠిన మానవుడికి అని అతిలోక సుందరి రేంజ్ లో తిట్టుకుని ఏమ్ చేయాలా అని ఆలోచనలో పడ్డాను ...
Categories: Middle

జోరుగా హుషారుగా షికారు పోదమా !!!

Tue, 05/11/2010 - 06:40
సింగపూర్లో నా మొదటి సాహసం ఉప్మా చేసి పెట్టడం.అంతకన్నా విచిత్రం మా ఆయన కిక్కురుమనకుండా తినడం..మా ఇంట్లో అందరూ,ఉప్మా అనేపదాన్ని ఏకగ్రీవంగా నిషేదించడమే కాకుండా ఆ పదం వింటేనే ఆమడ దూరం పారిపోతారు మరి ..అంతా బ్రెడ్ ముక్కల మహిమ ..
టిఫిన్ చేసాక మా ఇంటి ఓనర్ ని పరిచయం చేసారు ( ఈవిడ గురించి మరెప్పుడన్నా బోలెడు చాడీలు చెప్పేసుకున్దామే) .ఆ గుమ్మం వరకు వచ్చి' టాటా' చెపుతుంటే ,ఏం క్రిందవరకు రావచ్చుగా అన్నారు. ఇలా నైటీ తోనా?? అన్నాను ..ఏం పర్లేదు, ఇక్కడ ఎవరూ పట్టించుకోరు అన్నారు...ఆహా ..ఎన్నెన్ని విచిత్రాలు జరుగుతున్నాయి ఈ రోజు .. పెళ్లి అయిన క్రొత్తలో ,క్రొత్తలో ఏంటి నా మొహం.. పెళ్ళికి ముందే .. ఎంతో గోముగా ఏమండీ !! నేను పెళ్ళయ్యాకా డ్రెస్ లు వేసుకోవచ్చా ??అంటే మాట మార్చేసేవారు తెలివిగా.. అయినా పట్టువదలని విక్రమార్కిని లా పెళ్ళయ్యాక అడిగితే ..అదికాదు ,మరేమో మా తరం లో నేనే పెద్ద కొడుకుని,నువ్వే పెద్ద కోడలివి.. అందుకే నువ్వు చీరలలోనే కంటిన్యూ అయిపో అని నన్నే ఏమార్చేసిన మా ఆయన.. నైటీ లో బయటకు వచ్చేయమని చెప్పడమా ??ఎంత విచిత్రం అనుకుంటూ క్రిందకు వచ్చేసా..

రాత్రి గమనించలేదు గాని అదంతా ఒక కాలనీ లా ఉంది . చుట్టూ చెట్లతో ఏదో పార్క్ లో ఇల్లు కట్టినట్లే .. ఎటు చూసినా అపార్ట్మెంట్లు.. ప్రతి అపార్ట్మెంట్ క్రింద కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు ,టేబుళ్లు..వాటి పై చదరంగపు గడులు.. ముసలి వాళ్ళు ఆడుకోవడానికి అంట ...ఇంకా ఎవరి లెటర్ బాక్స్ లు వాళ్లకు వరుసగా ఉన్నాయి..

ప్రతి బ్లాక్ (అపార్ట్మెంట్) కి ఒక ప్లే గ్రౌండ్ ..పిల్లలకు దెబ్బలు తగలకుండా మెత్తని నేల.. నాలుగైదు బ్లాక్ లకు ఒక జిం .. ఒక పార్క్ .. వాకింగ్ లు ,వ్యాయామాలు గట్రా చేసుకోవడానికి.. మొత్తం దేశం అంతా ఇలాగే ఉంటుందా?? అన్నాను.. ఆ .. సింగపూర్లో ఏ మూలకు వెళ్ళినా ఇలాగే ఉంటుంది .. ప్రతి ఊరు ఒక్కలాగే ఉంటుంది.. ఇక్కడి ప్రభుత్వం ప్రజల హెల్త్ కి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంది అన్నారు..



ఈ లోపల ఒకటే సౌండ్స్ ..గడ్డి కట్ చేసే వాళ్ళు , రోడ్లు శుబ్రం చేసేవాళ్ళు ,నేలను కడిగేవాళ్ళు .. ఎవరి గోల వాళ్ళది.. ఇక్కడ అంతా బాగానే ఉంటుంది కాని ఈ శబ్ధ కాలుష్యం ఎక్కువ అని నవ్వారు ... హుమ్ అని నిట్టుర్చాను ...ఎవరో అపార్ట్మెంట్ క్రింద ఉన్న తలుపులు తెరిచి, లోపల ఉన్న బాక్సులను తీసి క్రొత్తవి పెడుతున్నారు .. అవేంటి?? అన్నాను .. అవి చెత్త బాక్స్ లు.. ఎవరి వంటగది లోపల వాళ్లకు ఒక డస్ట్ బిన్ డోర్ ఉంటుంది . దాన్ని తెరిచి తుక్కు పడేస్తాం.. అవి క్రింద ఈ బాక్స్ లలో పడతాయి.. వీళ్లు ప్రొద్దున్న ,మద్యాహ్నం క్లీన్ చేస్తారు అన్నారు..

అబ్బా.. ఎటు వంటి కష్టం లేకుండా భలే అమర్చుకున్నారండి అన్నీ అన్నాను.. ఈ లోపల రోడ్ వచ్చేసింది ... సరే ఇంక నువ్వు వెళ్ళు ,బస్ స్టాప్ కి వెళతా నేను..సాయంత్రం ఒక గంట ముందు వచ్చేస్తాను అలా బయటకు వెళదాం అన్నారు ..' ఊ' అని టాటా చెప్పి వెనక్కి తిరిగి అయోమయం లో పడిపోయాను .. అన్ని అపార్ట్మెంట్లు ఒకలాగే ఉన్నాయి ..అవే లెటర్ బాక్స్ లు ,అవే కుర్చీలు,టేబుళ్లు ..ఇందులో మా ఇల్లు ఏది??అటు ,ఇటు చూసా కంగారుగా .. ఎవ్వరూ లేరు ..



నేను ఎవరితోనైనా వెళుతుంటే, కబుర్లు చెప్తూ అనుసరించేస్తుంటా కాని ఎటు వెళుతున్నానో గమనించను .అదే నాతో వచ్చిన పెద్ద చిక్కు ..ఇక్కడ అదేంటో అర్ధం కాదు ఇన్ని కుటుంభాలు ఉన్నా ఒక్కరూ కనబడరు .చిన్నపిల్లల ఏడుపు కాని ,అరుపులు కాని.. ఉహు .. అలా వెతుక్కుంటూ వెళ్ళడం మొదలు పెట్టాను.. మా ఆయన ఆఫీస్ ఫోన్ నెంబర్ కూడా ఇంట్లోనే ఉండిపోయింది ..పైగా చేతిలో పైసా లేదు ఫోన్ చేద్దామన్నా.. రాత్రి మా అపార్ట్మెంట్ నెంబర్ ఎంతో చెప్పారు గుర్తు లేదు.. ఏడుపోచ్చేస్తుంది .. ఎలారా భగవంతుడా అని చూస్తుంటే ఆ ముందు రోజు మెట్లదగ్గర పడి ఉన్న సిగరెట్టు ముక్కలు, చెత్త కనబడ్డాయి.. హమ్మయ్యా !!!ఊపిరి పీల్చుకున్నాను ..


సాయంత్రం మావారు రాగానే ఎక్కడికి వెళదాం ??బీచ్ కి వెళదామా అన్నారు.. సరే అన్నాను.. ఆరైనా చీకటి పడకపోయే సరికి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ బస్ స్టాప్ వరకు వచ్చేసాం.. సింగపూర్ లో మరొక మెచ్చుకో తగిన విషయం .. షెల్టర్లు .. ఉన్నట్లు ఉండి వర్షం వచ్చినా తడవకుండా ఇంటికి వెళ్ళిపోవడానికి వీలుగా ఈ షెల్టర్లు ఉంటాయి.. అలాగే ప్రయాణ వాహనాలు కూడా చాలా వీలుగా ఉంటాయి.. ఎక్కడకు వెళ్ళాలన్నా ప్రతి అయిదు ,పది నిమిషాలకు ఒక బస్ కాని ,ట్రైన్ కాని ఉంటుంది .. పైగా ఏ బస్ ఎన్ని నిమిషాలకు ఏ స్టాప్ కి వెళుతుందో,ఎన్ని నిమిషాలకు బస్ వస్తుందో ఇన్ఫర్మేషన్ క్షణాల్లో తెలుసుకోవచ్చు..ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోవడం ఇక్కడి ప్రజలకు ఇష్టం ఉండదనుకుంటా .. ఈలోపల మా వారు బుజ్జీ, ఈ కార్డ్ ఇక నీ దగ్గరే ఉంచుకో అన్నారు ఒక నీలంరంగు కార్డ్ ఇస్తూ ..ఏమిటి ఇది అన్నాను దాన్ని చూస్తూ..ఇదిఫేర్ కార్డ్ ..ఇక్కడ ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా ఇది ఉండాల్సిందే..బస్ లోను,ట్రైన్ లోను ఉపయోగిస్తాం ..మనకులా కండక్టర్ లు ఉండరు అన్నారు ..




ఈ లోపల బస్ వచ్చింది .. ఎక్కిన వాళ్ళందరూ అక్కడ ఒక చిన్న బోర్డ్ పైన ఈ కార్డ్ చూపుతున్నారు..అందులో నుండి 'కీ'అని సౌండ్ వస్తుంది ..ఏమిటండీ అది?? అన్నాను.. దీనిలో డబ్బులుంటాయి ..ఇది ఆ మిషన్ దగ్గర చూపితే అది ఏ స్టాప్ లో ఎక్కావో లెక్క గట్టి, దిగే స్టాప్ లో మళ్లీ చూపినపుడు అన్ని డబ్బులు కట్ చేస్తుంది అన్నారు..నాకు భలే విచిత్రం అనిపించింది ..

ఒకవేళ మనం కార్డ్ తేవడం మర్చిపోతే ??అన్నాను.. అప్పుడు బస్ డ్రైవర్ని అడిగి ఎంత డబ్బులు అవుతాయో అన్నీ అక్కడున్న పెట్టెలో వేయాలి ..అప్పుడు టికెట్ ఇస్తాడు అన్నారు..ఒక వేళ డబ్బులుకుడా మర్చిపోతే?? అన్నాను.. అప్పుడు బయటికి పోమ్మా ..అని మెడ పట్టుకుని తోసేస్తాడు అన్నారు నా తలపై చిన్నగా కొడుతూ..అబ్బా ..ఊరికే అడుగుతున్నాను బాబు ఇంకేం మాయాజాలాలు ఉన్నాయో అని అన్నాను..

బస్ లో చాలామంది చైనా వాళ్ళు ఎక్కుతున్నారు ,దిగుతున్నారు ..ఒక్క రైనా డ్రైవర్ కళ్ళు కప్పి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారేమో అని చూస్తున్నా ..ఒక్కళ్ళు కూడా అలా చేయడం లేదు..ఆఖరికి డబ్బై ఏళ్ళ ముసలాయన కూడా మెల్లిగా కార్డ్ టేప్ చేసి వస్తున్నాడు ..నాకు చాలా ఆక్చర్యం అనిపించింది..

ఏమండి ,ఒక వేళ టికెట్ తీసుకోకుండా డ్రైవర్ కి తెలియకుండా ట్రావెల్ చేసాం అనుకోండి అప్పుడేమవుతుంది?? అన్నాను.. ఏంటే ,ఇందాకడ నుండి చూస్తున్నా, కొంపదీసి అలా చేద్దామని అనుకుంటున్నావా ఏంటి ??కంగారుగా అన్నారు.అబ్బా ,అడిగి తెలుసుకుంటున్నా అండీ అన్నాను.. ఒక్కోసారి టికెట్ కలెక్టర్ వస్తాడు ..అతను మన కార్డ్ చెక్ చేస్తాడు అన్నారు.ఒక వేళ మనం టేప్ చేయకపోతే పోలీసులకు చెప్పేస్తాడా?? అన్నాను.. లేదు.. ఛీ !! నీదీ ఒక బ్రతుకేనా అన్నట్లుగా ఒక లుక్ ఇస్తాడు అంతే అన్నారు..'ఓస్ 'ఈ మాత్రం దానికే వీళ్లు ఇంత భయపడిపోతున్నారా!! హుమ్.. ఎలాగైనా ఈ దేశం ఇంత అభివృద్ది చెందడం లో ప్రజల పాత్ర ఎంతైనా ఉంది అనిపించేసింది ..

మా ఆయన కాసేపటికి నీ ప్రక్కన ఉన్న బటన్ నొక్కు అన్నారు.. ఏంటండి ఇది అన్నాను.. అది నొక్కితే డ్రైవర్ దగ్గర లైట్ వెలుగుతుంది ..అంటే రాబోయే స్టాప్ లో మేము దిగిపోతున్నాం ఆపు అని చెప్పడం.. అదే స్టాప్ లో ఎవరూ దిగడం ,ఎక్కడం చేయలేదనుకో ముందుకి వెళ్లి పోతాడన్నమాట ..టైం వేస్ట్ కాకుండా ప్రతి సీట్ దగ్గర ఈ బటన్స్ ఉంటాయి అన్నారు..భలే ఉంది అనుకునేంతలో స్టాప్ వచ్చింది దిగిపోయాం..



అలా నడుచుకుంటూ బీచ్ దగ్గరకు చేరుకున్నాం ..'ఈస్ట్ కోస్ట్ పార్క్ ' ..సైకిలింగ్ చేసేవాళ్ళు ,గుజ్జన గూళ్ళు కట్టే వాళ్ళు, సముద్రం లో విన్యాసాలు చేసేవాళ్ళు , అలలతో ఆడేవాళ్ళు ..చాలా మంది రకరకాల వ్యాపకాలలో ఉన్నారు .. రా ..ఆ రాళ్ళ పై కూర్చుందాం అన్నారు.. నాన్న గుర్తు వచ్చారు.. ఎప్పుడన్నా సముద్ర తీరం వెళితే దూరం నుండి చూపించి అదే సముద్రం,ఇవే అలలు అని చూపించేవారు.. లోపలికి దిగని చ్చేవారు కాదు.. ఈ మాత్రం దానికి ఇంట్లో టివిలో చూడచ్చు కదా ..ఇంత దూరం రావాలేంటి ? నా ఆఖరు చెల్లి విసుక్కునేది..ఎందుకో నవ్వొచ్చింది ..వద్దులే ఇక్కడే కూర్చుందాం అన్నాను ..

నాకెందుకో అంత అందం గా అనిపించలేదు ఇక్కడ .. ఇండియాలో అయితే మనిషంత అలలు ఎగసి పడతాయి..ఇక్కడ నదిలో కెరటాల్లా అలా పాదాలకు తాకుతున్నాయి అంతే.. చాలా మంది చైనీయులు పిల్లలతో చేరారు .. ఏ జంట చూసినా అబ్బాయిలు పిల్లలని ఎత్తుకోవడమే ..అమ్మాయిలు కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు.. వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పగలైనా ,రాత్రి అయినా ఆ హుషారు అలా మెయింటైన్ చేస్తారు ..పైగా ప్రొద్దున నుండి రాత్రి వరకు తల పైన ఒక్క వెంట్రుక చెరగకుండా జాగ్రత్త పడతారు.. పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నా ఇక్కడి అమ్మాయిలకు అసహ్యం గా, ఎబ్బెట్టుగా ఉండదు.. వారి శరీర సౌష్టవం అలా ఉంటుంది కాబోలు..

ఆ ప్రక్కన ఏదో ఫుడ్ కోర్ట్ జనాలతో కళ కళ లాడుతుంది .. నాకు ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏమిటంటే .. ప్రజలు ఫుడ్ కోర్ట్ ఉంటే చాలు ఈగల్లా ముసిరిపోతారు.. ఇంక ఎప్పటికి తిండి దొరకని వారిలా ఏ మార్కెట్ లలో చూసినా , షాపింగ్ మాల్స్ చూసినా,హోటల్స్, ఎటు చూసినా జనాలే.. ఇంట్లో ఉదయం పూట ఎవరూ ఉండరు ..అందుకే అంత నిశ్శబ్దం గా ఉంటుంది అపార్ట్మెంట్స్ దగ్గర..కాకపొతే తిండికి,అందానికి,ఆరోగ్యానికి వీరిచ్చే ప్రాధాన్యత ఇంకెవరు ఇవ్వరేమో ...

అలా కాసేపు నడుచుకుంటూ వెళుతుంటే కొందరు నవ్వుతూ పలకరిస్తున్నారు ..ఇంకొందరు మనం తగిలితే మైల పడిపోతాం అన్నట్లు తప్పుకు వెళుతున్నారు.. యువజంటలు మాత్రం ఈ లోకాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు .. ఇదేంటండి !!వీళ్ళకు అమ్మా,నాన్న చూస్తారేమో అని భయం ఉండదా!! అన్నాను.. వాళ్లకు తెలియక పొతే కదా భయపడటానికి.. ఇక్కడ ఒక వయసు వచ్చేసరికి అమ్మాయి ,అబ్బాయిలు ఎవరో ఒకరిని పార్టనర్ గా ఎన్నుకుంటారు..తల్లిదండ్రులు చూడరు.. ఒకవేళ చూసుకోక పొతే వాళ్లకు సరి అయిన పాట్నర్స్ దొరకడం కష్టం అవుతుంది ... అందుకని తల్లిదండ్రులే ఎవరినన్నా ప్రేమించన్డో అని పోరతారు అన్నారు ..

ఇదేమి సంస్కృతీ అండీ బాబు.. మరి చదువులు, చట్టుబండలు ఎలా సాగుతాయి ఇలా చిన్న వయసులోనే ప్రేమించేస్తే ??అన్నాను.. అందుకే గా ఇక్కడ మనలాంటి వాళ్ళు బ్రతకగలుగుతుంది.. ఇంటర్ అవ్వగానే ఇక్కడ తప్పని సరిగా మిలటరీ లో చేరాలి ..రెండు సంవత్సరాలు గవర్నమెంట్ బాగా తర్ఫీదు ఇస్తుంది.. ఈ లోపల వాడికి చదువు మీద ఇంటరెస్ట్ పోతుంది..వీడి మీద బెంగతో ఆ పిల్ల చదువు ఆపేసి ఏ చిన్న ఉద్యోగంలోనో సెటిల్ అయిపోతుంది.. అందుకే ఇక్కడ అతి తక్కువ మంది ఉంటారు పెద్ద లెవల్ లో ఉన్నవాళ్ళు అన్నారు..



అక్కడి నుండి ఇద్దరం MRT (రైల్వే స్టేషన్ )కి వెళ్లాం..నాకు బస్ కంటే ట్రైన్ బాగా నచ్చింది.. చల్లగా ,విశాలంగా ,శుభ్రంగా ఉంది.. టికెట్స్ తీసుకోవాలన్నా,కార్డ్స్ లో డబ్బులు ఫిల్ చేయాలన్నా అన్నీ మిషన్ల ద్వారానే.. బస్ లోగాని, ట్రైన్ లో గాని తినడం,తాగడం నిషేధం ..

అన్నిటికంటే నచ్చిన విషయం ముసలివాళ్ళు,చిన్నపిల్లల తల్లులు,ప్రెగ్నెంట్ అయిన వారు వస్తే లేచి సీట్ ఇచ్చేస్తున్నారు.. ఇక్కడ ఎంత దూరం వెళ్ళాలన్నా గంటన్నరలో వెళ్ళిపోతాం..చిన్న దేశం కదా .. సరదాగా అనిపించింది..అలాగే ట్రైన్ కూడా.. అయితే అండర్ గ్రౌండ్ లోనో లేదా బ్రిడ్జ్ పైనా తప్ప రోడ్ మీద ప్రయాణం చేయదు ..ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ..కొన్ని చోట్ల భూగర్భం లో రెండు అంతస్తుల్లో రైల్వే మార్గాలు వేసి
ఉన్నాయి .. చక్కని ప్లానింగ్ ఉన్న దేశం..బస్సు స్టేషన్ ,రైల్వే స్టేషన్ ఎప్పుడూ ప్రక్క ప్రక్కనే ఉంటాయి. ఏ ఊర్లో అయినా సరే ..ఆతరువాత మావారు పని చేసిన ఆఫీస్ చూపించి 'రాఫిల్స్ ప్లేస్' తీసుకు వెళ్ళారు .. ఆకాశాన్ని అంటేంత బిల్డింగులు గట్రా అలా చూస్తూ ఉండి పోయాను..
Categories: Middle

అదో మరపురాని రోజు...

Thu, 05/06/2010 - 05:56

'సిమే' .. సింగపూర్లో నేను విడిది చేసిన మొట్టమొదటి ప్రదేశం.. ఉన్నది కొద్ది నెలలే అయినా మరుపురాని అనేక అనుభూతులకు నిలయం ... చాలా రోజులతరువాత మా వారిని చూసానన్న ఆనందం వల్లో ఏమో 'కేబ్ 'ఎక్కగానే ఇంక ఊరు చూడటం మానేసి కబుర్లలో పడిపోయాను .. అదికాదు బుజ్జీ, మరేమో క్రొత్తగా జాయిన్ అయ్యాను కదా..పైగా జీతం కూడా ఎక్కువ కాదు.. ఇంకా చెల్లి పెళ్లికనీ కొంత డబ్బు ఇస్తా అన్నాను అందుకనీ ..అని ఆగారు మావారు ...అందుకనీ?? రెట్టించాను .. అందుకనీ ఇల్లు షేరింగ్ కి తీసుకోవలసి వచ్చింది అన్నారు నసుగుతూ .. షేరింగ్?? అంటే ?? అన్నాను అర్ధం కాక .. అంటే మనం ఓనర్ తో కలసి ఉంటాం ... మనకొక బెడ్ రూం ఇస్తారు ..కిచెన్ ఇద్దరం ఉపయోగించుకోవచ్చు ..వాషింగ్ మిషన్,ఫ్రిజ్ అన్నీ కూడా ... నాకు విసుగొచ్చింది.. ఎలా అండి!!! మీరేమో ఆఫీస్ కి వెళ్ళిపోతారు.. ఎవరో ,ఏమిటో తెలియని వాళ్ళతో ఎలా కలసి ఉండేది ?? పైగా వాళ్ళ బాష ,నా భాష ఒకరికొకరికి అర్ధం కావద్దూ అన్నాను దీనంగా.. ఆ విషయం లో బెంగ పెట్టుకోవద్దులే ..వాళ్ళు మన తెలుగు వాళ్ళే.. అందుకే కాసింత అద్దె ఎక్కువైనా'సరే 'అనేసా అన్నారు... నిజ్జంగానా !!!బోలెడు ఆనందం వేసేసింది ... ఇన్నాళ్ళు ఎలారా బాబు ఒక్కదాన్నే ఈ దేశం కాని దేశం లో అని తెగ ఫీల్ అయిపోయేదాన్ని..

మాటల మధ్యలోనే ఇంటికోచ్చేసాము.."అంకుల్ " 6 $ అన్నాడు టాక్సీ డ్రైవర్ .. నాకు' మహేష్ బాబు 'చాచి పెట్టి కొట్టినట్లు అనిపించింది.. ఆ టాక్సీ డ్రైవర్ కి దాదాపు అరవై పైనే ఉంటాయి .. ఇదేంటండి మరీ విడ్డూరం, మీరు అంకులేంటీ!!! అన్నాను.. అదా ,అలా అపార్ధం చేసేసుకోకు ..ఇక్కడ అపరిచిత వ్యక్తులని అంకుల్,ఆంటీ అని పిలుస్తారు అన్నారు ... హుమ్..గొప్ప పనిచేస్తారు అనుకుంటుంటే ..అమ్మా ,నాన్నా గుర్తువచ్చారు.. ఏమండీ! ఇంటికి వెళ్ళగానే పోన్ చేద్దాం అన్నారూ అన్నాను..అప్పటికి మావారి దగ్గర మొబైల్ లేదు ..(ఇది జరిగి మరి దాదాపు పదేళ్ళు అవుతుంది ) సరే పదా ,అని నన్ను ఆ బిల్డింగ్ క్రిందకు తీసుకు వెళ్ళారు..

ఒక చోట ఒక టెలిపోన్ బాక్స్ ఉంది .. ఇదేంటండి ఇక్కడ ఎవరూలేరూ , ఎవరిదీ ఈ పోన్ అన్నాను.. గవర్నమెంట్ ది.. ఇక్కడ అన్ని బిల్డింగ్ ల క్రింద టెలిపోన్ బాక్స్ లు ఉంటాయి అంటూ ఒక కార్డ్ తీసి ఏవేవో నెంబర్స్ నొక్కారు ... ఇదేంటి అన్నాను ఆక్చర్యం గా .. ఇవి పోన్ కార్డ్స్ లే అని.. అమ్మా,నాన్నకు ,అత్తయ్యమావయ్యకు కాల్ చేసి చెప్పారు నేను క్షేమం గా చేరాను అని .. అక్కడి నుండి నడుచుకుని వస్తుంటే మెట్లదగ్గర బోలెడు సిగరెట్టు ముక్కలు ,పేపర్లు ... ఇదేంటి ఇంత చెత్త ఉంది ఇక్కడ?? అసలు ఇక్కడ ఎంత శుభ్రంగా ఉంటుంది అంటే మన మొహం అద్దంలో చూసినట్లు ఉంటుంది అన్నారూ,పైగా ఇందాకా ఎక్కడపడితే అక్కడ చేత్తవేయకు పైన్ వేసేస్తారు అన్నారూ అని సాగదీసి అడిగాను ..అబ్బా,మాట వరసకు అంటే నిజంగా మొహం చూసేసుకున్టావా ..ఎవరో నీలాంటి వాళ్ళే తర్కంగా వేసి ఉంటారు.. అయినా ఏం పెట్టావే బాబు ,ఈ బేగ్ ఇంత బరువుంది అని విసుక్కున్టూ ఒక ఇంటి ముందు ఆగి తలుపు తీసారు ...

మెల్లిగా లోపలికి అడుగు పెట్టి చూసాను .. ఎంత బాగుందో.. చక్కగా ,నీట్ గా విశాలంగా,ఖరీదైన పర్నిచర్ తో నాకు చాలా నచ్చేసింది హాల్.. అబ్బా !!!భలే ఉందండి ఇల్లు అటు ,ఇటు తిరుగుతూ అన్నాను.. ఉష్ ..ష్ మెల్లిగా మెల్లిగా మాట్లాడు.. లోపల ఇంకా జనాలున్నారు అని చెప్పాను కదా అన్నారు కంగారుగా.. హుమ్..మళ్లీ అదొకటి ఉంది కదూ అనుకుంటుంటే మా రూం తలుపులు ఓపెన్ చేసారు .. ఇదేంటండీ ,ప్రతి రూం కి తాళాలు ఉంటాయా అన్నాను.. ఊ.. డోర్ పడగానే ఆటోమేటిక్ గా లాక్ అయిపోతాయి జాగ్రత్త ..తాళం నీదగ్గరే పెట్టుకోయేం అన్నారు.. నాకన్నీ విచిత్రంగా విచిత్రం గా అనిపిస్తున్నాయి..

విశాలమైన బెడ్ రూం ..తెల్లని కప్ బోర్డ్స్ .. ఆ ప్రక్కనే అటాచ్డ్ బాత్ రూం .. అలా చూస్తూ మంచం చూడగానే తిక్క కోపం వచ్చింది.. దుప్పటి అనేది కనబడకుండా అడ్డం గా టవల్స్ ,వైర్లు,పుస్తకాలు,బట్టలు .. మీరున్నారు కదా ,హంస తూలికా తల్పం ఇచ్చినా అడ్డంగా తువ్వాలు ఆరబెడతారు తిట్టుకుంటూ వాటిని సర్దడం మొదలు పెట్టాను.. అంతేలేవే పాపం ఇన్నాళ్ళు ఎలా తిన్నాడో, ఏంటో.. అబ్బే ఏమీ లేదు..క్రొత్త జాబ్ ..ఎంత వర్కో తెలుసా అన్నారు.. కడుపు తరుక్కుపోయింది ..అసలు ఆయనకు కోడిగ్రుడ్లు ఉడకపెట్టడం కూడా రాదు.. పాపం ఏం తిన్నారో ఇన్నాళ్ళు?? .. దాదాపు ఎనిమిది కేజీలు తక్కువ కాకుండా తగ్గిపోయారు ...నేను పూర్తిగా బాధ పడకముందే అబ్బా!! అవన్నీ ఇప్పుడు సర్దేయాలా, రేపు నేను ఆఫీస్ కి వెళ్ళగానే ఖాళినే కదా .. పద ఆకలి వేస్తుంది భోజనం చేసేద్దాం అన్నారు.. అయ్యో ఇంకా తినలేదా ??వంట చేయనా అన్నాను.. అక్కరలేదు ,నేను వండేసా ఇద్దరికీ .. అంటే అన్నం ,పెరుగు,పచ్చడి అన్నారు.. అబ్బో అన్నం కూడా వండటం వచ్చేసిందా అన్నాను నవ్వుతూ.. అదేమన్న బ్రహ్మ విద్యేంటి.. ఒక కప్పు బియ్యం, రెండుకప్పుల నీళ్ళునూ అంటూ నన్ను కిచెన్ లోకి తీసుకు వెళ్ళారు ...

నేనెప్పుడు అంత ఆధునికమైన వంట గది చూడనే లేదు .. స్టవ్ అయితే నాలుగు బర్నర్లు ఉన్నాయి ... ఇదెలా వెలిగిస్తారండి అన్నాను లైటర్ కోసం చూస్తూ .. లైటర్ అక్కరలేదే ఈ బటన్స్ నొక్కగానే ఆటోమేటిక్ గా వెలుగుతాయి అని చూపించారు .. విమానం శబ్దం వినగానే కిటికీ దగ్గర కొచ్చి నించున్నా.. ఎయిర్ పోర్ట్ ఇక్కడ దగ్గర... ప్రతి పది నిమిషాలకొకటి వెళుతుంది అన్నారు ..ఓ ..అనుకుంటూ యాదాలాపంగా ముందుకు చూసాను ..ఎదురు అపార్ట్మెంట్ ముందు అన్నీ బోలెడు కర్రలు గ్రుచ్చి ఉన్నాయి... ఏమిటండి అవి అన్నాను.. ఇక్కడ అపార్ట్మెంట్ పైకి వెళ్ళనివ్వరు కదా బట్టలు ఆరబెట్టడానికి ..అందుకనీ కర్రల పై ఆరబెట్టి అలా పెడతారు ..వర్షం వస్తే ఇదిగో వంటగది పైన అలా తగిలిస్తారు అని చూపించారు ... హమ్మయ్యో !!!భలే తెలివండి వీళ్ళకు అన్నాను..

భోజనం ఇక్కడ వద్దులే మళ్లీ ఎవరన్నా వస్తే ఇబ్బందిగా ఉంటుంది..బెడ్ రూం లో తినేద్దాం అన్నారు ..సరే అని కంచాలు,గ్లాసులు అన్నీ మోసుకు వెళ్లాం..అన్నం ,ఆవకాయ పచ్చడి వేసుకుని పెరుగు కోసం గిన్నెపై మూత తీస్తే బ్రౌన్ గా ఉంది పెరుగు.. ఇదేంటండి ఈ కలర్ లో ఉంది అన్నాను అయోమయం గా చూస్తూ.. అలాగే ఉంటుందిలే నువ్వు తిను అన్నారు ... కొంచెం వేసుకుని అన్నంలో కలుపుకుని ఒక్క ముద్ద పెట్టుకున్నానో లేదో' యాక్ ' తీపి పానకం ... అబ్బా!! ఏంటండీ ,ఇదేం పెరుగండి బాబు అన్నాను.. మరి చాక్లెట్ పాలతో తోడుపెడితే తియ్యగా ఉండదేంటి అన్నారు తను మాములుగా తినేస్తూ.. బాబోయ్ చాక్లెట్ మిల్కా !!!దానితో పెరుగా అన్నాను అసహ్యం గా మొహం పెట్టి...మరేం చేయను, నాకేమో ఇక్కడ ఎక్కడ ఏముంటాయో తెలియదు..మా ఆఫీస్ లో అందరు చైనా వాళ్ళే ..వాళ్లకు మన ఫుడ్ గురించి అసలు తెలియదు.. అందుకే ఇలా ఏది పెడితే అది తినేస్తున్నా అన్నారు.. నాకు కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి ..మా ఇంట్లో ఆయనకు నచ్చని కూర చేస్తే చిన్నపాటి యుద్ధం జరిగిపోయేది.. పాపం అనిపించింది ..పోనీ ఇంటి ఓనర్ తెలుగువాళ్ళే అంటున్నారుగా వాళ్ళని అడగచ్చుగా ఏ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో అన్నాను.. ఆ మాట ఆయనకు ఎందుకో నచ్చలేదు ..కాస్త మొహం చిరాగ్గా పెట్టి ..అది సరేగాని మన భాషే అని ఆమెతో ఒకటే సోది వేయకు ..నీ పని ఏదో నువ్వు చూసుకో.. సరేనా అన్నారు...ఎందుకనీ అన్నాను విసుగ్గా.. నాకసలే నోరు కట్టుకుని కుర్చోవాలంటే మహా చిరాకు.. ఎందుకని అంటే ఏం చెప్పను..ఇదేమన్నా మన ఊరు అనుకున్నావా .. ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి అన్నారు .. హుమ్.. అని నిట్టూర్చి పచ్చడి కలుపుకుని ఎలాగో భోజనం తినేసాను..

ఇండియా నుండి అంట్లు తోముకునే పీచు తో సహా తెచ్చా అని గొప్పలు పోతుంటే ...అదే మరి తెలివి తక్కువతనం అంటే ...ఇక్కడ ఎవరూ తినరా ,గిన్నెలు తోముకోరా భలే ఆలోచిస్తావ్ అని కాసేపు ఏడిపించారు.. నేను మాత్రం ఉరుకుంటానా .. చాక్లెట్ మిల్క్ తో పెరుగు చేసుకుంటారు కాబట్టే తెచ్చాను అని తిరగబడిపోయాను అనుకోండి అది వేరే విషయం ..ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా' ఢాం ' అంటూ సౌండ్ వచ్చేసరికి కంగారు పడిపోయాను ...ఓరి దేవుడోయ్ ..ఏంటండి అది అన్నాను కిటికీ లోనుండి బయటికి చూస్తూ ... ఎప్పుడు ముసిరిందో తెలియదు మబ్బు..నల్లగా కమ్మేసింది.. ఒకటే మెరుపులు ,ఉరుములు ,వర్షం... అవి కూడా మామూలు పిడుగులు కాదు..భయంకరం గా ప్రక్కనే పడుతున్నట్లు..చెవులు చిల్లులు పడుతూ ... నేను ఎప్పుడూ వినలేదు అంత సౌండ్ .. ఇదేంటండి ఇప్పటివరకు వెన్నెల పుచ్చ పువ్వులా విరగ కాసింది ..ఎప్పుడు మబ్బేసింది అన్నాను అయోమయంగా .. ఇక్కడ అంతే ,అప్పటి కప్పుడు ఎండ మండిపోతుందా ..రెండో నిమిషంలో వర్షం వచ్చేస్తుంది ...ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎండాకాలం,వర్షాకాలం అని సీజన్ ఉండదు మనకులా .. ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.. వారం లో ఒకటి రెండు సార్లు వర్షం తప్పనిసరిగా పడుతుంది అన్నారు.. అవునా అన్నాను ఆక్చర్యం గా ...

నాకు అన్ని విషయాలు చాలా క్రొత్తగా ,అయోమయంగా అనిపించాయి.. అలా ఎప్పుడు నిద్రలో జారుకున్నానో తెలియదు .. తెల్లవారు జామున బుజ్జీ లే ..లే అని ఎవరో పిలుస్తున్నట్లు.. అంత ఘాడ నిద్ర లో లేపుతుంటే చాలా ఏడుపోచ్చేస్తుంది.. ఏంటండీ అన్నాను విసుగ్గా ... ఆరయ్యింది ...వంట చేస్తానన్నవుగా లేచి బాక్స్ పెట్టు అన్నారు.. నాకసలే తెల్లవారు జామున విపరీతంగా నిద్ర పడుతుంది ..అందులోను అంత చల్లని వాతావరణం లో లేవడమే? అమ్మో నావల్ల కాదు .. రేపటినుండి వండుతా .. ఈ రోజు బయట తినేయండి ..ముసుగు కప్పెసా..కాని అవతల ఉన్నది ఎవరూ..జాలి,దయ అనే పదాలకి అర్ధం తెలియని మా ఆయన ... ఓయ్ ..నిన్నేమో పెద్ద పతివ్రతా శిరోమణి లా ..ఇంకేముందండి ,నేను వచ్చేసానుకదా..వండి ఉద్దరించేస్తా అని కబుర్లు చెప్పావ్.. లే..లే అని ఒకటే గోల ...

ఏడుపు మొహం వేసుకుని లేచి కిటికీ లోంచి చూసాను..చిమ్మ చీకటి ..అబ్బా ..ఇంకా ఆరయ్యి ఉండదు అండీ.. చూసారా ఎంత చీకటిగా ఉందో అన్నాను మళ్లీ పడుకుంటూ.. నీ మొహం ఇక్కడ సెవెన్ అయితే గాని తెల్లారదు ... రాత్రి సెవెన్ దాటితే గాని చీకటి పడదు .. నిజానికి ఇక్కడి గవర్నమెంట్ షేర్ మార్కెట్ కోసం ఇలా టైం ముందుకు జరిపిందంట.. ఇంక లే, అని నసపెట్టి తను హాయిగా పడుకున్నారు .. ఛీ, వీళ్ళకు పనిపాట ఏం ఉండదు అనుకుంటా.. దిక్కుమాలిన దేశం తిట్టుకుంటూ లేచి బయటకు చూసాను ఆ సరికే చాలా అపార్ట్మెంట్లో లైట్లు దేదీప్యమానం గా వెలిగిపోతున్నాయి.. చాలా మంది హడావుడిగా ఆ పాటికే పరుగులు పెడుతున్నారు.. నిన్న సామాను సర్దుతా అంటే ఒప్పుకోలేదు ఇప్పుడు వంట ఎలా చేయను నా మొహం ..ఆ చీకట్లో కావలసిన సామాను తడుముకుని వంటగదిలోకి వెళ్లాను..
Categories: Middle

అలా వచ్చాను అన్నమాట ఈ దేశానికి ...

Thu, 04/29/2010 - 22:14

దూరపు కొండలు నునుపనీ ..చిన్నప్పుడు విమానం చూసి ఎంత ముచ్చట పడిపోయానో, తీరా అచ్చంగా లోపలికి వెళ్లి చూస్తే ఓస్!! ఇంతేనా అనిపించేసింది .. అచ్చంగా మన ఆర్టీసీ బస్ లాగే ఉంది ..ఇంకా అదే బెటరేమో ..ఇది మరీ ఇరుగ్గా ఉంది.. ఒకేసారి ఎదురు ,బొదురుగా మనుషులు నడిస్తే కష్టమే .. పైగా సినిమాల్లోనూ ,కధల్లోనూ చెప్పిన ప్రకారం ఎయిర్ హోస్టెస్ అంటే సన్నంగా ,తీగల్లా దేవకన్యల్లా ఉంటారని అనేసుకునేదాన్ని ... ఇక్కడ చూస్తే అందరూ నలబయ్ పైబడిన వాళ్ళే ..పైగా ఒక మోస్తరు లావుగా ,నీలం రంగు చీర కట్టుకుని అతి మాములుగా ఉన్నారు..


ఇంతలో అందులో ఒక ఆవిడ నా టికెట్ చూసి ,ఫలానా నెంబర్ సీట్ లో కూర్చో మని చెప్పేసరికి అదెక్కడో తెలియక వెదకడం మొదలు పెట్టాను ..నాతో పాటు వచ్చిన ఆయన ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు.. అక్కడక్కడే తచ్చాడుతుంటే ఇంక దీనికి చెప్పినా లాభం లేదనుకుందేమో ..నవ్వుతూ నన్ను తీసుకెళ్ళి ఒక సీట్ చూపించి వెళ్ళిపోయింది ఒక ఎయిర్ హోస్టెస్ .. ఇదేం విమానం రా బాబు అనుకుని నా బేగ్ పెట్టడానికి ఏదైనా ప్లేస్ ఉందేమో చూసా ..ఉహు అన్ని కేబిన్లు నిండిపోయాయి..ఆ ఇరుకులోనే కాళ్ళ దగ్గర పెట్టుకుని ప్రక్కకు చూసాను ...ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి తెల్లగా ,పొడవుగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్నాడు ... నాకు నీరసం వచ్చేసింది ...ఎవరన్నా తెలుగువాళ్ళు ఉంటే ఏదో ఒక మాటల్లో పడి కాస్త భయం తగ్గించుకునేదాన్ని.. ఆ అవకాసం లేదు ఇప్పుడు .. నీడ పట్టున కూలింగ్ గ్లాసెస్ ఏమిటిరా తింగరి మొహం అని కసిగా తిట్టుకుని ఆ ప్రక్కన చూసాను.. ఎవరో ఒక అతను కిటికీ ప్రక్కనే కూర్చుని ప్లైట్ ఎక్కిందే నిద్రపోవడానికి అన్నట్లు కళ్ళు మూసుకుని గాఢ నిద్రలో జారుకుంటున్నాడు..

నాకు మా ఆయన మాటలు గుర్తుకువచ్చాయి..బుజ్జీ, ప్లైట్ లో నుండి చూస్తే భలే ఉంటుంది తెలుసా!!! క్రింద సముద్రం ,అలలు అన్నీ మాంచి కలర్ ఫుల్ గా కనబడతాయి.. ఏదో వింత లోకం లో ఉన్నట్లు ఉంటుంది ... అని .. అవన్నీ చూడాలని ఎంతో ఆశ పడితే ఇంకెవరో అక్కడ కూర్చోవడమే కాకుండా ,హాయిగా పడుకుని ఆ సీట్ ఉపయోగం లేకుండా చేసేస్తాడా.. అసలు విమానం లో కిటికీ ప్రక్కన సీట్ లలో 80 % అమ్మాయిలకు రిజర్వేషన్ కలిపిస్తూ ఒక చట్టం చేసి పడేయాలి అనుకుని తెగ బాధపడిపోతుంటే ..మేడం ప్లైట్ స్టార్ట్ హోరాహా హై ...ఆప్ అపినీ సీట్ బెల్ట్ బాంద్ కీజియే అంది మళ్లీ నీలం రంగు చీర అమ్మాయి..

బెల్టా!! ఏం బెల్టు ??అనుకుని అటు ఇటు చూసుకుంటే కనబడింది ...హమ్మయ్య అనుకుని బెల్ట్ పట్టుకుని లాగుతుంటే రాదే??? ..అది ఎలా పెట్టాలో తెలియకా అటు ,ఇటు త్రిప్పి చూస్తుంటే ..ఎక్స్ క్యూజ్ మీ ..ఆ బెల్ట్ నాది అన్నాడు ప్రక్కనున్న వాడు నాతో హిందీలో ...సారి ,అని ఒక కొస అతనికి ఇచ్చేసి నా బెల్ట్ కోసం వెదుకుతుంటే ...ఇక్కడుంది అంటూ చూపించాడు.. చిన్న చిరునవ్వు నవ్వేసి కాస్త విశ్రాంతిగా సర్దుకు కూర్చున్నా ... వెంటనే నా ముందు ఉన్న చిన్న టివి లో ఒక అమ్మాయి వచ్చింది .. ప్లైట్ లో గాలి ఆడకపోతే ఏం చేయాలి ... ప్రమాదం వస్తే ఎలా దూకాలి అంటూ .. అప్పుడప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్న నాకు భయం తో మళ్లీ చమటలు పట్టేసాయి ...

మెల్లిగా ప్లైట్ బయలుదేరడం మొదలైంది.. వేగం గా.. వేగంగా ...ఇంకా వేగంగా ... పైకి వెళుతుంటే చెవి లో హోరు,గొంతు అంతా మంట ,తల కాస్త బరువుగా ..అనిపించడం మొదలైంది.. ఎందుకో చాలా భయం వేసింది.. కళ్ళు గట్టిగా మూసేసుకుని చెవులు చేత్తో మూసుకుని ..దేవుడా దేవుడా .. కాపాడవా.. ప్లీజ్ ..ప్లీజ్ ...ఏదో తెలిసీ, తెలియని వయసులో ఏదో అనుకుంటే దాన్ని ఇలా నిజం చేసి ఇంత భయం పెట్టేస్తావా .. ప్లీజ్ ప్లీజ్ కాపాడు అని ఒక అయిదు నిమిషాలు జపం చేసి మెల్లిగా కళ్ళు తెరిచాను.. చెవిలో హోరు గొంతు మంట తగ్గింది.. అసలు ఎక్కడికీ వెళుతున్న ఫీలింగే లేదు.. మెల్లిగా ఊపిరి పీల్చుకున్నాను..

పస్ట్ టైమా అన్నాడు నా ప్రక్కవాడు..కొద్దిగా సిగ్గుగా అనిపించింది.. ఇంకొంచెం కోపం గా కూడా అనిపించింది అలా అడిగేసరికి .. 'ఊ' అన్నాను సీరియస్ గా మొహం పెట్టి ... ప్లైట్ ఆకాశం లోకి వెళ్ళడం పాపం అప్పటివరకు బుద్దిగా కూర్చున్న ప్రయాణికులు అటు ,ఇటు తెగ తిరుగుతున్నారు.. వారిలో మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు కనబడతారేమో అని ఆశగా చూస్తున్నా.. ఈ ఫ్లైటేనా వాళ్ళు ఎక్కింది ???..కొంప దీసి నేను హడావుడిలో వేరే ఫ్లైట్ ఎక్కేయలేదు కదా అని కూడా భయం వేసింది...

ఎదురుగా నీలం చీర అమ్మాయి ఒక ట్రాలీ లో రక రకాల జ్యూస్ లు,స్నేక్స్ పొట్లాలు పట్టుకుని వస్తుంది.. అవి చూడగానే బాగా దాహం వేసింది.. ఏదో సినిమాలో హీరోయిన్ చాక్లెట్స్ ఇస్తే హేపీ బర్త్ డే చెప్తుంది ..అప్పుడు అందరూ నవ్వుతారు.. నేనేమన్నా అలాంటి ఎర్ర బస్సునేంటి??అలా లేకిగా తీసుకోవడానికి .. ఒక స్టైల్ మెయింటైన్ చేయాలి .. అసలే నా ప్రక్క నోడు నన్ను తిమ్మాపురం తింగరబుచ్చిలా చూస్తున్నాడు అని గాట్టిగా అనేసుకునేంతలో ఆ అమ్మాయి నా దగ్గర కొచ్చింది .. ఆరెంజ్ ,కోక్ ,ఫ్రూటి ఏం కావాలి మేడం అనగానే ..నో థేంక్స్ అన్నాను కొంచెం స్టైల్ గా .. ఆ అమ్మాయ్ నా ప్రక్కన వాడిని అడిగింది.. వాడు ఒక కోక్ ,రెండు ఫ్రూటి లు ,రెండు వేరుశనగ పేకెట్లు తీసుకున్నాడు..ఆక్చర్యం!!! ఎవరూ పట్టించుకోలేదు.. లెక్క ప్రకారం వాడిని చూసి నవ్వాలి కదా ???? అలా ఎలా వదిలేసారు అందరూ అని కాసేపు బాధ పడిపోయి నోరుమూసుకుని కూర్చున్నా.. వాడిని ఎవరూ ఏమి అనలేదు అనో ,లేక నేను అనవసరం గా లేని గొప్పలకు పోయి జ్యూస్ త్రాగాలేదనో.. ఏంటో ఒక రకమైన కోపంగా ఉంది..


కాసేపు అయ్యాకా వాడు మెల్లిగా మాట్లాడటం మొదలు పెట్టాడు..హిందీ సినిమాల ప్రభావం వల్లో ,లేక సింపుల్ ఇంగ్లిష్ వాడటం వల్లో మొత్తానికి బాగానే అర్ధం అవుతుంది నాకు భాష .. పేర్లు,ఊర్లూ చెప్పు కోవడం అయ్యాకా .. ఎక్కడికి వెళుతున్నారు? అన్నాడు ... సింగపూర్ వెళ్ళే ప్లైట్ ఎక్కి ఎక్కడికీ అంటాడేమిటి వీడి బొంద అనుకుని ..సింగపూర్ అని చెప్పి.. మళ్లీ అదే ప్రశ్న వాడిని వెయ్యకపోతే బాగోదని మరి నువ్వో అన్నాను.. నేను అమెరికా అన్నాడు గర్వం గా .. ( ఏమిటో ఈ అమెరికా వెళ్ళే వాళ్ళు తెగ పోజులు కొట్టేస్తూ ఉంటారు ..అక్కడికి మావి వేరే దేశాలు కానట్టు :)) అంతే నాకు ఒక్క సారిగా వణుకొచ్చేసింది.. ఇది ..ఇది సింగపూర్ వెళ్ళే ప్లైట్ కదా అన్నాను గొంతు తడారిపోతుంటే... వాడొక క్షణం నా వైపు అయోమయం గా చూసి .. అవును సింగపూర్ ఫ్లైట్ నే.. కాని నేను అక్కడి నుండి వేరే ఫ్లైట్ లో అమెరికా వెళ్తా అన్నాడు నా పరిస్థితి అర్ధం చేసుకుంటూ.. హమ్మయ్యా!!! అని అనుకుని అయినా మళ్లీ అడిగా .. నిజమేనా ..సింగపూర్ ఫ్లైటేనా అని..


కాసేపు అయ్యాకా మళ్లీ వస్తుంది నీలం రంగు అమ్మాయి ట్రాలీ తోసుకుంటూ.. హమ్మయ్యా ..ఈ సారి మిస్ కాకూడదు.. రాగానే గభ గభా .. ఒక గ్లాస్ చూపించా.. నా ప్రక్కన అబ్బాయి ఒకటి తీసుకున్నాడు.. అబ్బా, వీడిది కడుపా ,కంబాల చెరువా ఏది పడితే అది తోసేస్తున్నాడు పొట్టలోకి అనుకుంటుంటే.. వాడు అనుమానం గా నా వైపు చూస్తూ 'హాట్ డ్రింక్ 'అన్నాడు .. ఇంత చల్లగా ఉంటే హాట్ అంటాడేమిటి అని వాడి వైపు చూసి ,లేదే ..నాకు చల్లగా ,కూల్ గా ఉంది అన్నాను.. ఈ సారి వాడు నాన్చ లేదు ..అది 'విస్కీ' అన్నాడు ... దెబ్బకి టక్కున ఎదురుగా ఉన్న ట్రేలో పెట్టేసా.. అప్పటి వరకు కోక్,పెప్సి లాంటివి 'సాఫ్ట్' అని వీటిని 'హాట్' అంటారని తెలియదు ..పైగా ప్లైట్ లో మందు కూడా ఇస్తారా ??? అని చూస్తుంటే .. కావాలంటే నీకు కోక్ తెప్పిస్తా ..అది నాకిచ్చేస్తావా అన్నాడు ... ఓరి నీ కక్కుర్తి తగలబడ అనుకుని.. ఓకే ..ఓకే తీసేసుకో నాకే డ్రింకులు వద్దు అన్నాను..

నాన్న గుర్తు వచ్చి నవ్వు వచ్చింది.. మమ్మలిని ఏ ట్రైన్ లోనే ఎక్కిస్తే ప్రతి బోగి కి వంక పెట్టేవారు.. ఇందులో ఎవడో సిగరెట్ కాలుస్తున్నాడు.. అందులో స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అని నాలుగైదు బోగీలు మార్చేవారు.. ఇలా అయితే మనం గూడ్స్ బండిలో వెళ్ళాలి అని అమ్మ విసుక్కునేది.. అలాంటింది ఒక తెలియని అబ్బాయి ప్రక్కన కూర్చుని మందు కూడా తాగుతున్నాడు అని తెలిస్తే ???...హుమ్ నిట్టూర్చి మళ్లీ కిటికీ వైపు చూసాను యాదాలాపం గా ... దూరం నుంచి సరిగా కనబడటం లేదు .. మబ్బుల మద్య లో నుండి వెళుతుంది అంటే ఏవో దూది పింజలు ఎగురుతున్నట్లు కనబడుతుంది అనుకున్నా..ఉహు ఆ జాడే లేదు.. కాస్త దూరం గా ఇంకేదో కనబడుతుంది.. కొంచెం అనుమానం గా తల పైకి ఎత్తి చూసా ... అనుమానం లేదు ప్రక్కనే వేరే ప్లైట్ వెళుతుంది..

అదేంటి ప్రక్క ,ప్రక్కనే రెండు ప్లైట్లు వెళతాయా ? అమ్మో ఎంత డేంజర్.. ఎంత సేపు చూసినా ఆ ప్లైట్, ఈ ప్లైట్ ప్రక్క ప్రక్కనే వెళుతున్నాయి.. ఏదో ఒకటి ముందుకి వెళ్ళడం లేదు..కొంచెం సిగ్గుగానే అనిపించినా భయం దాన్ని అధిగమించేసింది.. మెల్లిగా ప్రక్కనున్న అతనితో .. మరి మన ఫ్లైట్ ప్రక్కనే ఇంకొక ప్లైట్ వెళుతుంది డేంజర్ కదా అన్నాను .. వాడు వెంటనే ఫైలెట్ కి చెప్తాడని.. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే చెప్పినందుకు అందరూ అభినందిస్తారని మరొక వైపు సంతోషం కూడా అనుకోండి ... అతను అయోమయంగా నా వైపు చూసి కిటికీ వైపు చూసాడు.. నేను చూపించాను.. అతను హి..హి అని నవ్వుతూ అది ప్లైట్ కాదు ..ప్లైట్ వింగ్ ..అంటే రెక్క ..దాని ప్రక్కనే కూర్చున్నాం కదా అందుకే అలా అనిపించింది అన్నాడు..


ఛీ....ఛీ ఎంత అవమానం .. ఇంకో సారి వీడితో మాట్లాడకూడదు అని మూతి బిగించుకుని కూర్చున్నా ... కాసేపటి లో భోజనాలు.. అమ్మో ఫ్లైట్ లో ఎక్కితే ఎన్ని పెడతారో అనుకుంటూ వెజ్ కావాలని చెప్పాను.. ఎందుకొచ్చిన గొడవ మళ్లీ వాడెం పెడతాడో..నేనేం కంగారు పడతానో కదా అని వెజ్ నే అడిగా ... రసగుల్లా.. పప్పు అన్నం..ఏదో కూర..ఒక బన్..వెన్న ..పళ్ళ ముక్కలు..ఇంకా ఏంటో పెట్టింది.. సగం, సగం తినేసి వదిలేసా.. కాసేపటికి లైట్స్ ఆఫ్ చేసేసారు అందరూ కిటికీ లు మూసేసి పడుకుంటున్నారు.. నేను అలా టైం చూస్తూ కూర్చున్నా ... కొంచెం సేపయ్యాకా కిటికిలోనుండి బయటకు చూస్తావా అని అడిగాడు ఆ అబ్బాయి.. ఎలా?? అన్నాను..ఒక ప్రక్క నుండి భయం వీడితో వెళితే సేఫేనా ?? ఎక్కడికి తీసుకు వెళతాడు ఫ్లైట్ లోనే కదా ..ఏం కాదు అని ధైర్యం చెప్పేసుకున్నా..

కమ్.. అని వెనుక వైపు ఖాళి గా ఉన్న సీట్ల వైపు తీసుకు వెళ్లి చూడు అన్నాడు.. క్రింద అంతా మబ్బులు ..పైకి చూసా ..పైన కూడా మబ్బులే.. రెండు ఆకాశాల మద్యలో ఉన్నట్లు.. ఎలాంటి ఆధారం లేకుండా.. మనిషి ఎంత గొప్పవాడు అయిపోయాడు.. మన పూర్వికులు పుష్పక విమానం,ప్రియదర్శిని అనే లాంటి వాటినే ఇప్పుడు విమానాలు,కంప్యూటర్లు లాగా తయారు చేసారు.. అంటే వాళ్ళు గొప్పా? వీళ్లు గొప్పా? అంటే పురాణాలన్నీ భవిష్యత్తుని ఊహించే రాసినవా?? ఏంటో కాసేపు వరకు వేదాంతమో ,వైరాగ్యామో ఏంటో ఏంటో.. నాక్కూడా మొదటి సారి చూసినపుడు భలే అనిపించింది ఆ అబ్బాయి ఏంటో కబుర్లు చెప్తున్నాడు..

కాసేపయ్యాకా నీలం రంగు బెల్ట్ వేసుకోమని హెచ్చరించింది.. అబ్బ స్కూల్లో టీక్చర్ల లా వీళ్లు ఎవరురా బాబు అనుకుని మా సీట్లలోకి వచ్చిపడ్డాం.. అందరూ బ్లాంకెట్లు కప్పుకుని పడుకున్నారు.. నాక్కూడా నిద్ర వచ్చింది.. పడుకుందాం అనుకునేంతలో మళ్లీ ప్లైట్ క్రిందకు దిగుతుంది ..కాసేపట్లో వచ్చేస్తాం అన్నాడు ఆ అబ్బాయి ... ఒక్క సారిగా లైట్లు వెలిగాయి అందరూ సర్దుకుని కూర్చున్నారు..చీకటి పడిపోయింది.. టైం ఎంతో చెప్తున్నారు ఎనౌన్సుమెంట్ లో ... ఆగాకా బయటకు వస్తూ ఆ అబ్బాయి టాటా చెప్పేసి హడావుడిగా వెళ్ళిపోయాడు.. ఈ లోపల ఏ మూలన కుర్చున్నారో మా ఆయన ఫ్రెండ్ బయటకు వచ్చాడు .. ఇంక అక్కడి నుండి అతని వెనుక బయలుదేరా...


"చాంగి ఇంటెర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ "అనే అక్షరాలు చూస్తేనే ..ఆ గాలి తాకితేనే నాకు ఎంతో పరిచయం ఉన్న ప్రదేశానికి వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది.. ఎటు చూసినా పూల మొక్కలు,అందమైన తటాకాలు ఏదో ఉద్యానవనం లో ఉన్నట్లు.. మొదటి సారిగా escalator ఎక్కినపుడు పడబోయాను ... కొంచెం భయం వేసినా తరువాతా అది ఎక్క కుండా ప్రక్కనుండి నడిచేదాన్ని.. దారిలో అనేక దేశాల ఎయిర్ హోస్టెస్ అచ్చం గా దేవకన్యల మాదిరి.. ముట్టుకుంటే మాసిపోతారేమో అన్నట్లు ... అన్ని వింతలు చూడాలని అనిపించినా.. మళ్ళీ దారి మిస్ అయిపోటానేమో అనే టెన్షన్ లో అస్సలు చూడలేదు..


మళ్ళీ పాస్ పోర్ట్, వీసా గట్రాలు చెక్ చేసాక ..ఆ అమ్మాయి మీవారు ఏం చేస్తుంటారు? అని అడిగింది.. అప్పటి వరకు బాగానే ఉన్నా ఆ భాష మళ్ళీ క్రొత్తగా అనిపించి తడబడుతూ సమాధానం చెప్పి బయటకు వచ్చాకా హమ్మయ్యా వచ్చేసానురా భగవంతుడా అనుకుని నా బేగ్ మోసుకుంటూ లగేజ్ కలెక్ట్ చేయడానికి వెళుతుంటుంటే ఎదురుగా చేతులు ఊపుతూ గాజు తలుపుల వెనుక నించుని ఎవరో.. ఎక్కడో చూసినట్లుగా అనిపించింది .. ఇంకెవరు!! మా ఆయనే ..ఇదేంటి ?కుంపట్లో కాల్చిన కుమ్మొంకాయలా ఇలా నల్లబడి పోయారేమిటబ్బా ???పైగా సన్నబడి పోయారు కూడా ..మెట్లు దిగుతూ అనుకునేంతలో ..ఢాం, ఢాం అంటూ పెద్ద శబ్ధం ..కాసేపు ఏమైందో తెలియదు .. ఇహ లోకం లోకి వచ్చాకా ఆఖరి మెట్టు పైన కూర్చుని నేను.. ఆర్యూ ఓకే ?ఒక ఆమె అడుగుతుంది .. పడ్డాను.. కాని ఎలా? హౌ ? అని అనుకునేంతలో నా క్రొత్త చెప్పులు ఇప్పటివరకూ భరించాను ..ఈ జారుడు నేల పైన ఇంక నా వల్ల కాదు అని వెక్కిరించాయి..

ఎదురుగా అప్పటివరకూ చేతులు ఊపుతూ ప్రక్కన ఫ్రెండ్స్ అందరికీ నన్ను పరిచయం చేస్తున్న మా ఆయన ..గొప్ప పని చేసావులే ఇంక రా అన్నట్లు మొహం పెట్టారు.. బిక్క మొహం వేసుకుని బయటకు వచ్చాను .. :)
Categories: Middle

అలా వచ్చాను అన్నమాట ఈ దేశానికి ...

Thu, 04/29/2010 - 05:20



దూరపు కొండలు నునుపనీ ..చిన్నప్పుడు విమానం చూసి ఎంత ముచ్చట పడిపోయానో, తీరా అచ్చంగా లోపలికి వెళ్లి చూస్తే ఓస్!! ఇంతేనా అనిపించేసింది .. అచ్చంగా మన ఆర్టిసి బస్ లాగే ఉంది ..ఇంకా అదే బెటరేమో ..ఇది మరీ ఇరుగ్గా ఉంది.. ఒకేసారి ఎదురు ,బొదురుగా మనుషులు నడిస్తే కష్టమే .. పైగా సినిమాల్లోనూ ,కధల్లోనూ చెప్పిన ప్రకారం ఎయిర్ హోస్టెస్ అంటే సన్నంగా ,తీగల్లా దేవకన్యల్లా ఉంటారని అనేసుకునేదాన్ని ... ఇక్కడ చూస్తే అందరూ నలబయ్ పైబడిన వాళ్ళే ..పైగా ఒక మోస్తరు లావుగా ,నీలం రంగు చీర కట్టుకుని అతి మాములుగా ఉన్నారు..


ఇంతలో అందులో ఒక ఆవిడ నా టికెట్ చూసి ,ఫలానా నెంబర్ సీట్ లో కూర్చో మని చెప్పేసరికి అదెక్కడో తెలియక వెదకడం మొదలు పెట్టాను ..నాతో పాటు వచ్చిన ఆయన ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు.. అక్కడక్కడే తచ్చాడుతుంటే ఇంక దీనికి చెప్పినా లాభం లేదనుకుందేమో ..నవ్వుతూ నన్ను తీసుకెళ్ళి ఒక సీట్ చూపించి వెళ్ళిపోయింది ఒక ఎయిర్ హోస్టెస్ .. ఇదేం విమానం రా బాబు అనుకుని నా బేగ్ పెట్టడానికి ఏదైనా ప్లేస్ ఉందేమో చూసా ..ఉహు అన్ని కేబిన్లు నిండిపోయాయి..ఆ ఇరుకులోనే కాళ్ళ దగ్గర పెట్టుకుని ప్రక్కకు చూసాను ...ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి తెల్లగా ,పొడవుగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్నాడు ... నాకు నీరసం వచ్చేసింది ...ఎవరన్నా తెలుగువాళ్ళు ఉంటే ఏదో ఒక మాటల్లో పడి కాస్త భయం తగ్గించుకునేదాన్ని.. ఆ అవకాసం లేదు ఇప్పుడు .. నీడ పట్టున కూలింగ్ గ్లాసెస్ ఏమిటిరా తింగరి మొహం అని కసిగా తిట్టుకుని ఆ ప్రక్కన చూసాను.. ఎవరో ఒక అతను కిటికీ ప్రక్కనే కూర్చుని ప్లైట్ ఎక్కిందే నిద్రపోవడానికి అన్నట్లు కళ్ళు మూసుకుని ఘాడ నిద్రలో జారుకుంటున్నాడు..

నాకు మా ఆయన మాటలు గుర్తుకువచ్చాయి..బుజ్జీ, ప్లైట్ లో నుండి చూస్తే భలే ఉంటుంది తెలుసా!!! క్రింద సముద్రం ,అలలు అన్నీ మాంచి కలర్ ఫుల్ గా కనబడతాయి.. ఏదో వింత లోకం లో ఉన్నట్లు ఉంటుంది ... అని .. అవన్నీ చూడాలని ఎంతో ఆశ పడితే ఇంకెవరో అక్కడ కూర్చోవడమే కాకుండా ,హాయిగా పడుకుని ఆ సీట్ ఉపయోగం లేకుండా చేసేస్తాడా.. అసలు విమానం లో కిటికీ ప్రక్కన సీట్ లలో 80 % అమ్మాయిలకు రిజర్వేషన్ కలిపిస్తూ ఒక చట్టం చేసి పడేయాలి అనుకుని తెగ బాధపడిపోతుంటే ..మేడం ప్లైట్ స్టార్ట్ హోరాహా హై ...ఆప్ అపినీ సీట్ బెల్ట్ బాంద్ కీజియే అంది మళ్లీ నీలం రంగు చీర అమ్మాయి..

బెల్టా !!ఏం బెల్టు ??అనుకుని అటు ఇటు చూసుకుంటే కనబడింది ...హమ్మయ్య అనుకుని బెల్ట్ పట్టుకుని లాగుతుంటే రాదే??? ..అది ఎలా పెట్టాలో తెలియకా అటు ,ఇటు త్రిప్పి చూస్తుంటే ..ఎక్స్ క్యుజ్ మీ ..ఆ బెల్ట్ నాది అన్నాడు ప్రక్కనున్న వాడు నాతో హిందీలో ...సారి ,అని ఒక కొస అతనికి ఇచ్చేసి నా బెల్ట్ కోసం వెదుకుతుంటే ...ఇక్కడుంది అంటూ చూపించాడు.. చిన్న చిరునవ్వు నవ్వేసి కాస్త విశ్రాంతిగా సర్దుకు కూర్చున్నా ... వెంటనే నా ముందు ఉన్న చిన్న టివి లో ఒక అమ్మాయి వచ్చింది .. ప్లైట్ లో గాలి ఆడకపోతే ఏం చేయాలి ?... ప్రమాదం వస్తే ఎలా దూకాలి అంటూ .. అప్పుడప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్న నాకు భయం తో మళ్లీ చమటలు పట్టేసాయి ..

మెల్లిగా ప్లైట్ బయలుదేరడం మొదలైంది.. వేగం గా.. వేగంగా ...ఇంకా వేగంగా ... పైకి వెళుతుంటే చెవి లో హోరు,గొంతు అంతా మంట ,తల కాస్త బరువుగా ..అనిపించడం మొదలైంది.. ఎందుకో చాలా భయం వేసింది.. కళ్ళు గట్టిగా మూసేసుకుని చెవులు చేత్తో మూసుకుని ..దేవుడా దేవుడా .. కాపాడవా.. ప్లీజ్ ..ప్లీజ్ ...ఏదో తెలిసీ, తెలియని వయసులో ఏదో అనుకుంటే దాన్ని ఇలా నిజం చేసి ఇంత భయం పెట్టేస్తావా .. ప్లీజ్ ప్లీజ్ కాపాడు అని ఒక అయిదు నిమిషాలు జపం చేసి మెల్లిగా కళ్ళు తెరిచాను.. చెవిలో హోరు గొంతు మంట తగ్గింది.. అసలు ఎక్కడికీ వెళుతున్న ఫీలింగే లేదు.. మెల్లిగా ఊపిరి పీల్చుకున్నాను..

పస్ట్ టైమా అన్నాడు నా ప్రక్కవాడు..కొద్దిగా సిగ్గుగా అనిపించింది.. ఇంకొంచెం కోపం గా కూడా అనిపించింది అలా అడిగేసరికి .. 'ఊ' అన్నాను సీరియస్ గా మొహం పెట్టి ...ప్లైట్ ఆకాశం లోకి వెళ్ళడం పాపం అప్పటివరకు బుద్దిగా కూర్చున్న ప్రయాణికులు అటు ,ఇటు తెగ తిరుగుతున్నారు.. వారిలో మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు కనబడతారేమో అని ఆశగా చూస్తున్నా.. ఈ ఫ్లైటేనా వాళ్ళు ఎక్కింది ???..కొంప దీసి నేను హడావుడిలో వేరే ఫ్లైట్ ఎక్కేయలేదు కదా అని కూడా భయం వేసింది...

ఎదురుగా నీలం చీర అమ్మాయి ఒక ట్రాలీ లో రక రకాల జ్యూస్ లు,స్నేక్స్ పొట్లాలు పట్టుకుని వస్తుంది..అవి చూడగానే బాగా దాహం వేసింది.. ఏదో సినిమాలో హీరోయిన్ చాక్లెట్స్ ఇస్తే హేపీ బర్త్ డే అని చెప్తే అందరూ నవ్వుతారు.. నేనేమన్నా అలాంటి ఎర్ర బస్సునేంటి??అలా లేకిగా తీసుకోవడానికి .. ఒక స్టైల్ మెయింటైన్ చేయాలి .. అసలే నా ప్రక్క నోడు నన్ను తిమ్మాపురం తింగరబుచ్చిలా చూస్తున్నాడు అని గాట్టిగా అనేసుకునేంతలో ఆ అమ్మాయి నా దగ్గర కొచ్చింది .. ఆరెంజ్ ,కోక్ ,ఫ్రూటి ఏం కావాలి మేడం అనగానే ..నో దెంక్స్ అన్నాను కొంచెం స్టైల్ గా .. ఆ అమ్మాయ్ నా ప్రక్కన వాడిని అడిగింది.. వాడు ఒక కోక్ ,రెండు ఫ్రూటి లు ,రెండు వేరుశనగ పేకెట్లు తీసుకున్నాడు..ఆక్చర్యం ఎవరూ పట్టించుకోలేదు.. లెక్క ప్రకారం వాడిని చూసి నవ్వాలి కదా ???? అలా ఎలా వదిలేసారు అందరూ అని కాసేపు బాధ పడిపోయి నోరుమూసుకుని కూర్చున్నా.. వాడిని ఎవరూ ఏమి అనలేదు అనో ,లేక నేను అనవసరం గా లేని గొప్పలకు పోయి జ్యూస్ త్రాగాలేదనో.. ఏంటో ఒక రకమైన కోపంగా ఉంది..

కాసేపు అయ్యాకా వాడు మెల్లిగా మాట్లాడటం మొదలు పెట్టాడు..హిందీ సినిమాల ప్రభావం వల్లో ,లేక సింపుల్ ఇంగ్లిష్ వాడటం వల్లో మొత్తానికి
బాగానే అర్ధం అవుతుంది నాకు భాష .. పేర్లు,ఊర్లూ చెప్పు కోవడం అయ్యాకా .. ఎక్కడికీ వెళుతున్నారు అన్నాడు ... సింగపూర్ వెళ్ళే ప్లైట్ ఎక్కి ఎక్కడికీ అంటాడేమిటి వీడి బొంద అనుకుని ..సింగపూర్ అని చెప్పి.. మళ్లీ అదే ప్రశ్న వాడిని వెయ్యకపోతే బాగోదని మరి నువ్వో అన్నాను.. నేను అమెరికా అన్నాడు గర్వం గా .. ( ఏమిటో ఈ అమెరికా వెళ్ళే వాళ్ళు తెగ పోజులు కొట్టేస్తూ ఉంటారు ..అక్కడికి మావి వేరే దేశాలు కానట్టు :)) అంతే నాకు ఒక్క సారిగా వణుకొచ్చేసింది.. ఇది ..ఇది సింగపూర్ వెళ్ళే ప్లైట్ కదా అన్నాను గొంతు తడారిపోతుంటే...వాడొక క్షణం నా వైపు అయోమయం గా చూసి .. అవును సింగపూర్ ఫ్లైట్ నే.. కాని నేను అక్కడి నుండి వేరే ఫ్లైట్ లో అమెరికా వెళ్తా అన్నాడు నా పరిస్తితి అర్ధం చేసుకుంటూ.. హమ్మయ్యా!!! అని అనుకుని అయినా మళ్లీ అడిగా .. నిజమేనా ..సింగపూర్ ఫ్లైటేనా అని..

కాసేపు అయ్యాకా మళ్లీ వస్తుంది నీలం రంగు అమ్మాయి ట్రాలీ తోసుకుంటూ.. హమ్మయ్యా ..ఈ సారి మిస్ కాకూడదు.. రాగానే గభ గభా .. ఒక గ్లాస్ చూపించా.. నా ప్రక్కన అబ్బాయి ఒకటి తీసుకున్నాడు.. అబ్బా, వీడిది కడుపా ,కంబాల చెరువా ఏది పడితే అది తోసేస్తున్నాడు పొట్టలోకి అనుకుంటుంటే.. వాడు అనుమానం గా నా వైపు చూస్తూ హాట్ డ్రింక్ అన్నాడు .. ఇంత చల్లగా ఉంటే హాట్ అంటాడేమిటి అని వాడి వైపు చూసి, లేదే ..నాకు చల్లగా ,కూల్ గా ఉంది అన్నాను.. ఈ సారి వాడు నాన్చ లేదు ..అది విస్కీ అన్నాడు ... దెబ్బకి టక్కున ఎదురుగా ఉన్న ట్రేలో పెట్టేసా.. అప్పటి వరకు కోక్,పెప్సి లాంటివి సాఫ్ట్ అని వీటిని హాట్ అంటారని తెలియదు ..పైగా ప్లైట్ లో మందు కూడా ఇస్తారా ???అని చూస్తుంటే .. కావాలంటే నీకు కోక్ తెప్పిస్తా ..అది నాకిచ్చేస్తావా అన్నాడు ... ఓరి నీ కక్కుర్తి తగలబడ అనుకుని.. ఓకే ..ఓకే తీసేసుకో నాకే డ్రింకులు వద్దు అన్నాను..

నాన్న గుర్తు వచ్చి నవ్వు వచ్చింది.. మమ్మలిని ఏ ట్రైన్ లోనే ఎక్కిస్తే ప్రతి బోగి కి వంక పెట్టేవారు.. ఇందులో ఎవడో సిగరెట్ కాలుస్తున్నాడు..అందులో స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అని నాలుగైదు బోగీలు మార్చేవారు.. ఇలా అయితే మనం గూడ్స్ బండిలో వెళ్ళాలి అని అమ్మ విసుక్కునేది.. అలాంటింది ఒక తెలియని అబ్బాయి ప్రక్కన కూర్చుని మందు కూడా తాగుతున్నాడు అని తెలిస్తే ???...హుమ్ నిట్టూర్చి మళ్లీ కిటికీ వైపు చూసాను యాదాలాపం గా ... దూరం నుంచి సరిగా కనబడటం లేదు .. మబ్బుల మద్య లో నుండి వెళుతుంది అంటే ఏవో దూది పింజలు ఎగురుతున్నట్లు కనబడుతుంది అనుకున్న..ఉహు ఆ జాడే లేదు.. కాస్త దూరం గా ఇంకేదో కనబడుతుంది.. కొంచెం అనుమానం గా తల పైకి ఎత్తి చూసా ... అనుమానం లేదు ప్రక్కనే వేరే ప్లైట్ వెళుతుంది..అదేంటి ప్రక్క ప్రక్కనే రెండు ప్లైట్లు వెళతాయా ?

అమ్మో ఎంత డేంజర్.. ఎంత సేపు చూసినా ఆ ప్లైట్ ఈ ప్లైట్ ప్రక్క ప్రక్కనే వెళుతున్నాయి.. ఏదో ఒకటి ముందుకి వెళ్ళడం లేదు..
కొంచెం సిగ్గుగానే అనిపించినా భయం దాన్ని అధిగామించేసింది.. మెల్లిగా ప్రక్కనున్న అతనితో .. మరి మన ఫ్లైట్ ప్రక్కనే ఇంకొక ప్లైట్ వెళుతుంది డేంజర్ కదా అన్నాను .. వాడు వెంటనే ఫైలెట్ కి చెప్తాడని.. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే చెప్పినందుకు అందరూ అభినందిస్తారని మరొక వైపు సంతోషం కూడా అనుకోండి ... అతను అయోమయంగా నా వైపు చూసి కిటికీ వైపు చూసాడు.. నేను చూపించాను.. అతను హి..హి అని నవ్వుతూ అది ప్లైట్ కాదు ..ప్లైట్ వింగ్ ..అంటే రెక్క ..దాని ప్రక్కనే కూర్చున్నాం కదా అందుకే అలా అనిపించింది అన్నాడు..

ఛి..ఛి ఎంత అవమానం .. ఇంకో సారి వీడితో మాట్లాడకూడదు అని మూతి బిగించుకుని కూర్చున్నా ... కాసేపటి లో భోజనాలు.. అమ్మో ఫ్లైట్ లో ఎక్కితే ఎన్ని పెడతారో అనుకుంటూ వెజ్ కావాలని చెప్పాను.. ఎందుకొచ్చిన గొడవ మళ్లీ వాడెం పెడతాడో..నేనేం కంగారు పడతానో కదా అని వెజ్ నే అడిగా ... రసగుల్లా.. పప్పు అన్నం..ఏదో కూర..ఒక బన్..వెన్న ..పళ్ళ ముక్కలు..ఇంకా ఏంటో పెట్టింది.. సగం సగం తినేసి వదిలేసా.. కాసేపటికి లైట్స్ ఆఫ్ చేసేసారు అందరూ కిటికీ లు మూసేసి పడుకుంటున్నారు.. నేను అలా టైం చూస్తూ కూర్చున్నా ... కొంచెం సేపయ్యాకా కిటికిలోనుండి బయటకు చూస్తావా అని అడిగాడు ఆ అబ్బాయి.. ఎలా?? అన్నాను..ఒక ప్రక్క నుండి భయం వీడితో వెళితే సేఫేనా ?? ఎక్కడికి తీసుకు వెళతాడు ఫ్లైట్ లోనే కదా ..ఏం కాదు అని ధైర్యం చెప్పేసుకున్నా..

కమ్.. అని వెనుక వైపు కాళి గా ఉన్న సీట్ల వైపు తీసుకు వెళ్లి చూడు అన్నాడు.. క్రింద అంతా మబ్బులు ..పైకి చూసా ..పైన కూడా మబ్బులే.. రెండు ఆకాశాల మద్యలో ఉన్నట్లు.. ఎలాంటి ఆదారం లేకుండా.. మనిషి ఎంత గొప్పవాడు అయిపోయాడు.. మన పూర్వికులు పుష్పక విమానం,ప్రియదర్శిని అనే లాంటి వాటినే ఇప్పుడు విమానాలు,కంప్యూటర్లు లాగా తయారు చేసారు.. అంటే వాళ్ళు గొప్పా? వీళ్లు గొప్పా? అంటే పురాణాలన్నీ భవిష్యత్తుని ఊహించే రాసినవా??ఏంటో కాసేపు వరకు వేదాన్తమో,వైరాగ్యామో ఏంటో ఏంటో..
నాక్కూడా మొదటి సారి చూసినపుడు భలే అనిపించింది ఆ అబ్బాయి ఏంటో కబుర్లు చెప్తున్నాడు..

కాసేపయ్యాకా 'నీలం రంగు' బెల్ట్ వేసుకోమని హెచ్చరించింది.. అబ్బ స్కూల్లో టీక్చర్ల లా వీళ్లు ఎవరురా బాబు అనుకుని మా సీట్లలోకి వచ్చిపడ్డాం.. అందరూ బ్లాంకెట్ లు కప్పుకుని పడుకున్నారు.. నాక్కూడా నిద్ర వచ్చింది.. పడుకుందాం అనుకునేంతలో మళ్లీ ప్లైట్ క్రిందకు దిగుతుంది ..కాసేపట్లో వచ్చేస్తాం అన్నాడు ఆ అబ్బాయి ... అప్పుడే వచ్చేసామా ??అసలు తెలియనే లేదు జర్నీ.. ఒక్క సారిగా లైట్లు వెలిగాయి అందరూ సర్దుకుని కూర్చున్నారు..చీకటి పడిపోయింది.. టైం ఎంతో చెప్తున్నారు ఎనౌన్సుమెంట్ లో ... ఆగాకా బయటకు వస్తూ ఆ అబ్బాయి టాటా చెప్పేసి హడావుడిగా వెళ్ళిపోయాడు..

ఈ లోపల ఏ మూలన కుర్చున్నారో మా ఆయన ఫ్రెండ్ బయటకు వచ్చాడు .. ఇంక అక్కడి నుండి అతని వెనుక బయలుదేరా..."చాంగి ఇంటెర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ "అనే అక్షరాలు చూస్తేనే ..ఆ గాలి తాకితేనే నాకు ఎంతో పరిచయం ఉన్న ప్రదేశానికి వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది.. ఎటు చూసినా పూల మొక్కలు,అందమైన తటాకాలు ఏదో ఉద్యానవనం లో ఉన్నట్లు.. మొదటి సారిగా escalator ఎక్కినపుడు పడబోయాను ... కొంచెం భయం వేసినా తరువాతా అది ఎక్క కుండా ప్రక్కనుండి నడిచేదాన్ని.. దారిలో అనేక దేశాల ఎయిర్ హోస్టెస్ అచ్చం గా దేవకన్యల మాదిరి.. ముట్టుకుంటే మాసిపోతారేమో అన్నట్లు ... అన్ని వింతలు చూడాలని అనిపించినా.. మళ్ళీ దారి మిస్ అయిపోటానేమో అనే టెన్షన్ లో అస్సలు చూడలేదు..

మళ్ళీ పాస్ పోర్ట్, వీసా గట్రాలు చెక్ చేసాక ఆ అమ్మయి మీవారు ఏం చేస్తుంటారు అని అడిగింది.. అప్పటి వరకు బాగానే ఉన్నా ఆ భాష మళ్ళీ క్రొత్తగా అనిపించి తడబడుతూ సమాధానం చెప్పి బయటకు వచ్చాకా హమ్మయ్యా వచ్చేసానురా భగవంతుడా అనుకుని నా బేగ్ మోసుకుంటూ లగేజ్ కలెక్ట్ చేయడానికి వెళుతుంటుంటే ఎదురుగా చేతులు ఊపుతూ గాజు తలుపుల వెనుక నించుని ఎవరో??.. ఎక్కడో చూసినట్లుగా అనిపించింది ..ఇంకెవరూ మా ఆయనే ఇదేంటబ్బా కుంపట్లో కాల్చిన కుమ్మొంకాయలా ఇలా అయిపోయారు..పైగా ఎంత సన్నబడిపోయారో మెట్లు దిగుతూ అనుకునేంతలో ..డాం డాం అంటూ పెద్ద శబ్ధం ..కాసేపు ఏమైందో తెలియదు .. ఇహ లోకం లోకి వచ్చాకా ఆఖరి మెట్టు పైన కూర్చుని నేను..

ఆర్యూ ఓకే ఒక ఆమె అడుగుతుంది .. పడ్డాను.. కాని ఎలా? హౌ ? అని అనుకునేంతలో నా క్రొత్త చెప్పులు ఇప్పటివరకూ భరించాను ..ఈ జారుడు నేల పైన ఇంక నా వల్ల కాదు అని వెక్కిరించాయి..ఎదురుగా అప్పటివరకూ చేతులు ఊపుతూ ప్రక్కన ఫ్రెండ్స్ అందరికీ నన్ను పరిచయం చేస్తున్న మా ఆయన ..గొప్ప పని చేసావులే ఇంక రా అన్నట్లు మొహం పెట్టారు.. బిక్క మొహం వేసుకుని బయటకు వచ్చాను .. :)
Categories: Middle

నేనూ ప్లైట్ ఎక్కేసానోచ్చి,,,

Wed, 04/21/2010 - 00:04

ఏదో సామెత ఉందిలే ...కొందరిని చూస్తే మొట్ట బుద్ది వేస్తుంది అంట..అలా నా మొహం చూడగానే తిట్టబుద్ది వేస్తుందేమో ??.. ఈ విషయం నాకు ఎయిర్ పోర్ట్ లో ఆ రోజే తెలిసొచ్చింది..అమ్మా వాళ్లకు టాటా చెప్పి మళ్లీ వెనక్కు చూడకుండా మా ఆయన చెప్పిన వాళ్ళిద్దరి వెనుక బయలు దేరాను.. అప్పటి వరకు తాపీ ధర్మారావులా ఉన్నవాడు కాస్తా హడావుడిగా పరుగులు పెట్టడం మొదలు పెట్టాడు మావారి ఫ్రెండ్ ..

నాకేమో నా లగేజ్ తో చాలా కష్టం గా ఉంది.. మరి వంట్లో బాగోక పోవడం వల్ల వచ్చిన నీరసమో లేక నేను మహా బలవంతురాలిని అవ్వడం వల్లనో కాని నాకు పట్టపగలే అరుందతి నక్షత్రం తో సహా బోలెడు చుక్కలు కనిపించ సాగాయి ...దానికి తోడు కొత్త దేశం మోజుతో కళ్ళకు పెట్టుకునే కాటుక నుండి ,కాళ్ళ కు వేసుకున్న చెప్పులవరకు అన్ని క్రొత్తవే కొన్నానేమో ..నా చెప్పులు అలవాటులేక ఊరికే,ఊరికే జారిపోవడం మొదలు పెట్టేసరికి నా సామిరంగా పండగే పండగ ...

ముందు లగేజ్ వెయిట్ వేయించి ,చెకిన్ అయ్యి .. ఆ తరువాత అతని వెనుక క్యూలో నించున్నా..నాకసలు ఏమి తెలియదేమో అతను ఎక్కడ పాస్ పోర్ట్ ,వీసా ,టిక్కెట్స్ చూపుతున్నాడో అక్కడ నేనూ పరుగులు పెట్టి చూపుతున్నా.. ఈ లోపల ఒక ఆవిడ ప్రక్కకు పిలిచి మెటల్ డిటెక్టర్ తో చెక్ చేయడం మొదలు పెట్టింది.. ఒక ప్రక్క చెక్ చేస్తూ ..మేడం ఏదో మీ దయ ..పిల్లా పాపలున్నారు ఒక యాబై ఇవ్వండి అంది .. నాకేం అంటుందో అర్ధం కాక ఆమె వైపు అయోమయం గా చూసాను.. ఆమె మళ్లీ అదే మాట అనేసరికి ,ఎయిర్ పోర్ట్ లో ఇలా కూడా అడుగుతారా అని ఆక్చర్యం తో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటే ..ఆ పరికరం నుండి ..కీ .. .కీ మని సౌండ్ వస్తుంది ..

ఒక్కసారిగా భయం వేసింది ..ఇదేంటి!! ఏమన్నా మారణాయుధాలు తీసుకు వెళితే డిటెక్టర్ వల్ల పట్టుపడిపోతారు అని మా ఆయన అన్నట్లు గుర్తు ..కొంపదీసి డబ్బులు ఇవ్వలేదని ఇలా భయ పెడుతుందా అనిపించింది .. ఆమె మళ్లీ ఇంకో పరికరం తీసింది... దానితో చెక్ చేస్తుంటే ..మళ్లీ కీ..కీ మంటుంది.. మేడం పిన్నులేమన్నా పెట్టారా అడిగింది ఆమె ... అప్పుడు గుర్తువచ్చింది నా మంగళ సూత్రానికి ఎప్పుడూ చీర కోసం సేప్టిపిన్నులు పెట్టి ఉంచుతా .. హమ్మయ్య అదా సంగతి ..ఊపిరి పీల్చుకున్నా..మేడం మిగిలిన వాళ్ళను చెక్ చెయ్యాలి తొందరగా ఇవ్వండి ..ఆమె కంగారుగా అంది.. నా దగ్గర యాబై లేవండి అన్నాను మెల్లిగా .. ఏంటి మేడం ..చిల్లర లేక పోతే వంద అన్నా ఇవ్వండి.. మీకు వంద అంటే ఎంత చెప్పండి ..ఆమె వదల లేదు.. ఉహు ఇరవయ్యే ఉంది అని తీసి చూపించా ..అప్పుడు ఆమె చూసిన చూపు ఇప్పటికి గుర్తు వచ్చినా విరక్తి వచ్చేస్తుంది ...

మొత్తానికి ఆ ఇరవై ఆమెకు చదివించుకుని బయట పడ్డాను.. ప్లైట్ లోపలికి వెళ్ళడానికి పిలుపు కోసం అందరం కూర్చుని వెయిట్ చేస్తున్నాం.. ఆ అమ్మాయికి మర్చిపోయిన ఏడుపు మళ్లీ గుర్తు వచ్చినట్లుఉంది .. మళ్లీ మొదలు పెట్టింది.. ఆ అబ్బాయి జాలిగా ఓదారుస్తున్నాడు.. అటే చూస్తే బాగోదని చూపు తిప్పుకున్నా ... అమ్మా ,నాన్న ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు ..ఇంకో నాలుగైదు గంటల్లో వేరే దేశం వెళ్ళిపోతున్నా లాంటి ఆలోచనలు మళ్లీ బెంగ పెట్టేస్తున్నాయి.. దేవుడా ,దేవుడా ప్లీజ్ ధైర్యం ఇవ్వవా అనుకుంటూ కళ్ళు మూసుకుని కూర్చున్నా ..

ఏదో కలకలం వినబడితే గబుక్కున కళ్ళు తెరిచా..ఎదురుగా ఆ అబ్బాయి లేడు.. అందరూ హడావుడి గా క్యూలో నించుంటున్నారు.. అతని వెనుక అప్పటికే ఒక అయిదుగురు ఉన్నారు .. ఆ బేగ్ పట్టుకుని పడుతూ లేస్తూ వాళ్ళ వెనుక నించున్నా..అందరి టికెట్స్ ,వీసాలు మళ్లీ చెక్ చేస్తూ లోపలి పంపుతున్నాడు ఒక అతను..నేను కూడా చూపిస్తుంటే' సెక్యూరిటి చెకింగ్ కా టేగ్ కహా హై 'అన్నాడు ..ఒక్క ముక్క అర్ధం కాలేదు.. అంటే ??అన్నాను అయోమయం గా ..నన్ను పక్కకు ఉండమని చెప్పి మిగిలిన వాళ్ళను చెక్ చేస్తూ సెక్యూరిటి చెకింగ్ చేయిన్చుకురండి అన్నాడు హిందీ లో .. ఏంటి సార్ అన్నాను భయం గా.. మా ఆయన ఫ్రెండ్ వెళ్ళిపోయాడు లోపలికి ..

ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో ఏం అర్ధం కావడం లేదు ..అతను సమాధానం ఇవ్వడం లేదు.. ఇచ్చినా అర్ధం కావడం లేదు.. ఏడుపొచ్చేస్తుంది ... అసలు పంపుతారా నన్ను లోపలికి ??...అమ్మా ,నాన్న ఉన్నారా బయట ??? వెళ్ళిపోయి ఉంటారు .. కనీసం ఫోన్ చేద్దామన్న పైసాలేదు ..ఏం చెయ్యాలి ??? దానికి తోడు ఈ బేగ్ ఒకటి ఎటు పరిగెట్టుకుని వెళ్ళడానికి వీలులేకుండా.. అందరూ వెళ్ళిపోతున్నారు .. సార్ ఏంటి సార్ మళ్లీ అడిగాను కళ్ళ లో నీళ్ళు తిరుగుతుంటే ..'ఉస్ సే పూచో 'అని అటు వెళుతున్న ఒక ఆమెను చూపించాడు .. ఆమె హడావుడిగా అటు ఇటు తిరుగుతుంది.. ఆవిడ దగ్గరకు పరుగులు తీసా.. ..మేడం సెక్యూరిటి చెకింగ్ అంటున్నారు..టేగ్ అంటున్నారు .. ఎక్కడ మేడం అన్నాను ... ఏంటీ!!!! సెక్యూరిటి చెక్ చేయించకుండా ఎలా వచ్చ్చావ్ ఇక్కడికి అంది విచిత్రం గా చూస్తూ ...నాకసలు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు ..ఎక్కడో ఏదో మిస్ అయ్యింది ...మా ఆయన ఫ్రెండ్ మీదా బాగా కోపం వచ్చింది ..అలా ఎలా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ??

ఫస్ట్ టైం మేడం నాకు ఏమి తెలియదు అన్నాను భయం గా ...అలాంటప్పుడు అన్నీ తెలుసుకుని రావాలి.. ఫ్లైట్ టైం అయిపోతుంది పద పద అంది.. ఆమె వెనుక పరుగు పెట్టాను ..బేగ్ బాగా బరువు ఉండటం వల్ల ఆమెను అందుకోలేక పోతున్నా ...తమ్ముడు ,అమ్మ మాటలు గుర్తొచ్చి బాగా తిట్టుకున్నా..ఏంటి??మళ్లీ ఏమైంది అంది ఆమె విసుగ్గా..బేగ్ వైపు చూసాను ... ఆమె బేగ్ ని మరొక వైపు పట్టుకుని .. ఏంటమ్మా ఏం మోసుకోచ్చేస్తున్నావ్.. అసలు నిన్ను ఎలా పంపారు ఇంత బరువుతో లోపలికి .. 7 కేజిలకంటే ఎక్కువ తీసుకురాకూడదు తెలుసా అంది ... ఉహు అన్నాను .. బాగా తెలివి మీరిపోయారు.. చిన్న బేగ్ అంటే ఎవరికీ అనుమానం రాదనీ ఇలాంటి తెలివి తేటలు ఉపయోగిస్తారు అంటూ తిడుతూనే ఉంది .. ఉక్రోషం,కోపం తో చెంప తడిచిపోతుంది కాని ఏమి చేయలేను..

అందరూ వెళ్లిపోయారని కాబోలు చెక్ చేసేవాళ్లిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు ...ఆవిడ వాళ్ళతో ఏదో చెప్పి వెళ్ళిపోయింది .. వాడికేదో డవుట్ వచ్చినట్లుంది ..ఏంటమ్మా ,ఏది ఆ బేగ్ ఓపెన్ చేయి అన్నాడు అందులో ఒకతను ... అవును ,కీ ఎక్కడుంది ??? నా హేండ్ బేగ్ వెతకడం మొదలు పెట్టా ..కంగారు వల్ల కనిపించడం లేదు ...వాళ్ళేమో చిరాకు పడుతున్నారు ..చివరికి దొరికాక బేగ్ ఓపెన్ చేసి చూసారు ...హుమ్ కారం,పసుపు, పచ్చళ్ళు ఈ ఆడోళ్ళు మారరు ..అంతరిక్షానికి పంపినా అప్పడాల పేకెట్ మోసుకు వెళతారు .. కానియ్ అని ప్రక్కనున్న వాడితో జోకాడు వాడు.. నాకు వళ్ళుమండి పోతుంది కాని బలవంతం గా నవ్వాను .. అక్కడి నుండి బయట పడి వస్తుంటే నా పేరు ఎనౌన్స్ చేస్తున్నారు ..భయం తో ఒకటే కంగారు ,ఏడుపు ...అందరూ నా వైపు చూస్తున్నా సరే ఒక చేత్తో కన్నీళ్ళు తుడుచుకుంటూ మరొక చేత్తో బేగ్ మోసుకుంటూ పరుగులు పెట్టా ... నన్ను చూడగానే ఎయిర్ హోస్టెస్ కమ్,కమ్ అంది హడావుడిగా .. హమ్మయ్యా ప్లైట్ లో కొచ్చేసాను..మరికొన్ని విశేషాలు తరువాత పోస్ట్ లో ..
Categories: Middle

నా విదేశీ పయనం

Wed, 04/14/2010 - 01:37

అన్నీ తెలిసిన వాళ్ళకన్నా చెప్పచ్చు ...ఏమీ తెలియని వాళ్ళకైనా చెప్పచ్చు.. నాకులా తెలిసీ , తెలియని వాళ్లకు చెప్పడం చాలా కష్టం .. ఈ మాట నేననలేదు .. మా ఆయన తరుచూ నా గురించి చెప్పే మాటలు ఇవి .. విదేశాలకు వెళ్ళే చాన్స్ వచ్చింది అనే ఆనందం అర నిమిషం అయినా పడలేదు..ఏ మూలనో ఉన్న బెంగ మాత్రం చుట్టు ముట్టేసింది.. ప్రక్కింటికి వెళ్ళాలంటే పది మంది తోడు లేనిదే వెళ్ళని నేను ఒంటరిగా కొన్ని వేల కిలో మీటర్లు దూరంగా వెళ్ళిపోవాలా !!!!!పైగా ఎక్జాంస్ లో బట్టీ పట్టి రాసిన నాలుగు ఇంగ్లిష్ ముక్కలు తప్ప ,ఎవరితోనూ గట్టిగా నాలుగు మాటలు మాట్లాడెరుగనే ..దేవుడా ...నా వల్ల అయ్యే పనేనా!!! అని రోజూ దిగాలు పడిపోయేదాన్ని...

దానికి తోడు మా ఆయన చెప్పిన కబుర్లు అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఒకటే టెన్షన్ తెప్పించేవి.. "బుజ్జీ,ఇక్కడ ఎయిర్ పోర్ట్ ఎంత పెద్దదో తెలుసా !!! నేను మొదటి సారి కన్ఫ్యూజ్ అయిపోయి అమెరికా కి వెళ్ళే మరొక ప్లైట్ వైపు వెళ్ళిపోయా.. బయటకు ఎలా రావాలో తెలియదు ... ఇక్కడి వాళ్ళ భాష మనకి ,మన భాష వాళ్లకు అర్ధం అయి చావదు.. డ కి 'ద' అని, ట కి 'త' అని మార్చి పలుకుతారు నత్తి వాళ్ళ లాగా ...ఇప్పుడూ ..."టూ డాలర్స్ తర్టి ఫైవ్ సెంట్స్" అనాలనుకో.. వాళ్ళేమో "తూ దాలర్స్ తర్తి ఫైవ్ సేన్త్స్" అని పలుకుతారు..అబ్బా ...బయటకు వచ్చేసరికి గంట పట్టింది" .....

ఇలాంటి కబుర్లు మొదట్లో నవ్వులాటగా అనిపించేది కాని ..తరువాత ,తరువాత అదే విషయం నాకన్వయించుకుని భయపడేదాన్ని ...నేను సింగ పూర్ లో విమానాశ్రయం లో తప్పడిపోయినట్లు.. అలా ఏదో అమెరికాయో ,ఆస్ట్రేలియాయో వెళ్ళే విమానం ఎక్కేసినట్లు ( ఎవరిని పడితే వాళ్ళను ఎక్కిన్చుకోవడానికి అది ఆర్టిసి బస్సు లెక్క కాదని అప్పటికి తెలియదన్నమాట ) ఇంకేదో దేశానికి వెళ్ళిపోయి ,భాష రాక ,తిండి లేక ఏంటో ఏంటో అయిపోయినట్లు ఒకటే ఆలోచన.. దానికి తోడు ఆ రాత్రి శ్రీదేవిది ఏదో హిందీ సినిమా చూసాను ...ఆమె ఇలాగే ఏదో దేశానికి వెళుతుంటే ఎవరోతన బేగ్ లో డ్రగ్స్ పెట్టేస్తారు... ఆ తరువాత నానా బాధలు పడి హీరో సహాయం తో బయట పడుతుంది ... ఇంకేంటి ఈ పాటికి మీకర్ధం అయిపోయి ఉండాలి సీన్ ...

ఆ మరుసటి రోజు నాన్న దగ్గరకు వెళ్లి నాన్నా!! ఉహు నేను వెళ్ళను అన్నాను దీనంగా... అసలు నేనుఈ మాట ఎప్పుడు అంటానా అని ఎదురు చూస్తున్న నాన్న .. అలాగే తల్లీ.. రేపు మీ ఆయనకు చెప్పేద్దాం అన్నారు నన్ను దగ్గరకు తీసుకుని ... ఎప్పటి నుండి మమ్మల్ని గమనిస్తుందో తెలియదు గాని అమ్మ 'కయ్ 'మంది... బాగుందండి మీ ఇద్దరి వరుసా ...అదంటే చిన్నపిల్ల ...దానికి ధైర్యం చెప్పడం మానేసి ...మీరూ అలాగే మాట్లాడుతారే... ఆ అబ్బాయి అక్కడ ఎన్నాళ్ళు ఉంటాడో ఏమో ... అంత ఇష్టం లేని వాళ్ళు ముందే చెప్పచ్చుగా వెళ్ళద్దని..ఇలా భార్యాభర్తలను ఎన్నాళ్లని విడదీస్తారు ...అని మొదలుపెట్టేసింది.. అసలు నువ్వు దాని కన్నతల్లి వేనా!!నా కూతురిని అంత దూరం పంపించేయమంటావా.. ఏం అక్కరలేదు..అప్పుడప్పుడు వచ్చి చూసి వెళతాడులే ... నాన్న ఊరుకోలేదు ....మా అమ్మ మాత్రం ఊరుకుందా.. ఇది మరీ బాగుంది ..మేము రాలేదా మావాళ్ళను వదిలి..పైగా ఎప్పుడన్నా పుట్టింటికి వెళితే, ఒక్క రోజు ఎక్కువ ఉంటే చాలు మీరు ,మీ అమ్మగారు అలిగేసేవారు ... ఇలా చేస్తారు కాబట్టే మగవాళ్ళకు కూతురి మీద అంత మమకారం పెడతాడు దేవుడు ... రేపు వాళ్ళాయన అడిగితే ఏం చెప్తారు అని తిరిగి వాదించింది అమ్మ..

కాసేపు వాద, ప్రతివాదనలు అయ్యాకా సరేలేమ్మా ..ఒక్కదానివే వెళ్ళద్దు ..మీ ఆయన్ను వచ్చి తీసుకు వెళ్ళమంటాను అన్నారు నాన్న ... ఆ మాట అన్నాకా కాసింత ధైర్యం అనిపించింది... అన్నట్లు గానే నాన్న మరుసటి రోజు మా వారి తో ఫోన్ లో విషయం మాట్లాడారు కూడా...అది కాదు బాబు ..అమ్మాయికి చిన్నప్పటి నుండి ఒక్కరితే ఎక్కడికీ వెళ్ళడం అలవాటు లేదు .. నువ్వొచ్చి తీసుకు వెళ్ళరాదు..టికెట్ నేను కొంటా అన్నారు ...అటు మా ఆయన ఏమన్నారో తెలియదు కాని నీతో మాట్లాడుతాడట అని ఫోన్ నాకిచ్చారు ...'హలో 'అనడం పాపం ..మొదలు పెట్టేసారు మా ఆయన దండకం ...నీకసలు బుద్దుందా ...నిన్న గాక మొన్న జాబ్ లో జాయిన్ అయ్యాను, వెంటనే లీవ్ అంటే ఇంటికి పొమ్మంటారు..నీకూ,మీ నాన్నకు బాగా ఆటలుగా ఉంది..అక్కడ ఫ్లైట్ లో ఎక్కితే ఇక్కడ నేను రిసీవ్ చేసుకుంటాను ..మద్యలో నిన్నెవడు ఎత్తుకుపోతాడు.. వేషాలు వెయ్యకుండా నోరుమూసుకుని రా అని తిట్టి పడేసారు ... అది కాదండి ..మరీ ..నాకేమో బొత్తిగా ఇంగ్లిష్ లో మాట్లాడటం రాదు అన్నాను గునుస్తూ .. అవును మరీ ..ఇక్కడ రాగానే నీకు ఎక్జాం పెడతారు కదా మొహం చూడు అని పెట్టేసారు ఫోన్ ..

బోలెడు కోపం వచ్చింది కాని ఏం చెయ్యను ...నాన్నకు చెప్పానంటే 'ఆయ్'.. నా కూతురిని అలా అంటాడా ..నేను పంపను అని మొండికేస్తారు ఎలారా బాబు అనుకుంటుండగా సాయంత్రం మళ్ళా ఫోన్ వచ్చింది ...నా ఫ్రెండ్ ఒక అబ్బాయి పెళ్లి కోసం ఇండియా కొచ్చాడు ...అతను వచ్చే నెల ఇక్కడికి వస్తున్నాడు ..అతనితో వచ్చేసేయ్ సరేనా అన్నారు.. 'హమ్మయా' అనిపించింది.అక్కడి నుండి మొదలైంది హడావుడి ..సూట్కేస్ కొనడం ..బట్టలు కొనుక్కోవడం వగైరాలు..ముఖ్యం గా తాళం కప్పలు..శ్రీదేవి సినిమా మహాత్యం ...

అమ్మా!! లగేజ్ ౩౦ కేజీల కంటే ఎక్కువ ఉండ కూడదట అన్నాను బట్టలు సర్దుతున్న అమ్మతో ...ఇది మరీ బాగుందే.. సూట్ కేసే 10 కేజీలు బరువుంది ..ఇంకేం పెట్టను ఇందులో అంది అమ్మ విసుక్కుంటూ .. ఏముంటాయిలే ... నావి అయిదు రకాల చీరలు ,ఒక అయిదు రకాల డ్రెస్సులు ,మరో అయిదు నైటీలు ఇంతేగా .. పైగా ఒక చిన్న బేగ్ హేండ్ లగేజ్ కూడా తెచ్చుకోవచ్చట అన్నాను.. మరీ.. వంట సామాను ఏమి వద్దా ..అక్కడ కప్పలు, పంది మాంసం తింటావా అంది అమ్మ.. యాక్ ..అవును కదా ..క్రొత్త కాపురం .. అందులోను ఒక సారి... మా ఆయన తిండికి చాలా ఇబ్బంది అయిపోతుంది , ఈ బ్రెడ్డు ,జాము తినలేకపోతున్నా అన్నారు...మద్యాహ్నం బయట ఏదో నూడిల్స్ గట్రా తినేసి కడుపు నింపుకుంటున్నారట.. నావల్ల కాదు బాబోయ్ ఆ తిండి అనిపించింది.. మరేం చేద్దాం అన్నాను అమ్మతో.. ఏముంది మీ ఇద్దరేగా ... నాలుగు నెలలకు సరిపడే వంట సామాగ్రి నేను సర్దుతాగా నువ్వు కంగారు పడకు అమ్మ హామీ ఇచ్చేసింది ... లగేజ్ మాత్రం ౩౦ కేజీలు మించకూడదు సుమా ... అమ్మకు మళ్లీ చెప్పాను..


వర్షాకాలమేమో అప్పుడే చక్కగా మబ్బులు పట్టి చినుకులు స్టార్ట్ అయ్యాయి ..నేను హైదరాబాద్ కి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాను .. తమ్ముళ్ళు,పిన్నులు,చిన్నాన్నలు,పెద్దమ్మ,పెదనాన్న అందరు స్టేషన్ కి వచ్చారు ...మనస్సు భారం అయిపోతుంటే నిట్టూర్చి క్రింద బేగ్ (హేండ్ లగేజ్) తీసుకోబోయాను ... ఆక్చర్యం ..బేగ్ లేవలేదు నేను పైకి లేచా..ఇదేంటి ..ఇంత బరువుంది ..మళ్లీ ప్రయత్నించా ..ఉహు అస్సలు లేవలేదు ... ఏం పెట్టావమ్మా ఇందులో అన్నాను అయోమయం గా ... మరీ సూట్ కేస్ ౩౦ కేజీలు మించద్దు అన్నావు కదే.. అందుకే హేండ్ బేగ్ లో రెండు కేజీల మినపప్పు,రెండు కేజీల పెసరపప్పు, రెండు కేజీల ఇడ్లి రవ్వ ,పంచదార,చింత పండు,మషాలా పొడి,కారం,పసుపు,తాలింపు సామాను ...చివరాకరికి అంట్లు తోమే పీచు కూడా పెట్టేసా ఇందులో ... అమ్మ గర్వం గా చెప్పింది..

అయ్య బాబోయ్ అమ్మా !!నేనసలు మోయ్యగలనా అన్నాను కోపంగా... ఊరుకో, నువ్వు మొయ్యడం ఏమిటి లోపల కూలీలు ఉంటారుగా అంది.. 'ఒక వేళ లేకపోతే 'అరిచాను.. ప్రక్కన ఉన్న మా తమ్ముడి వైపు చూస్తూ ,ఇదేంట్రా ఇలా అంటుంది... బోడి ట్రైన్ ప్లాట్ ఫాం మీదే బోలెడు కూలీలు ఉంటారు .. ఎయిర్ పోర్ట్ లో ఉండరా అంది.. అవునక్కా ఒక వేళ లేరనుకో ప్రక్కనున్న వాళ్ళను ఎవరినన్నా హెల్ప్ చెయ్యమంటే ఆ మాత్రం చెయ్యరా ..అయినా మీ ఆడవాళ్ళకు బోలెడన్ని సదుపాయాలు.. మా మగవాళ్ళం 100 కేజీల బస్తా మోసినా ఎవడూ చూడడు కాని,అమ్మాయి నెమలి పించం పట్టుకున్నా మోయలేరేమో అని గిన్జుకుంటారు బోలెడు మంది ...నీకంత శ్రమ ఎవరూ ఇవ్వరులే ,అయినా బావ గారి ఫ్రెండ్ వస్తాడు గా ఆయన మోస్తాడులే ..ఆ మాత్రం హెల్ప్ చెయ్యడా అన్నాడు.. వీడొకడు , నిరంతర స్త్రీ ద్వేషి ..ప్రపంచం లో బాధలు,కష్టాలు అబ్బాయిలు మాత్రమే పడుతున్నారని 'ఘాట్టి' ఫీలింగ్ ... ఇంక తప్పక సరే అని బయలు దేరాను ...


హైదరాబాద్ చేరుకొని హోటల్ లో విడిది అయ్యాకా ఎయిర్ పోర్ట్ చేరుకున్నా ... రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు.. నాన్న అస్తమాను నా బెర్త్ దగ్గర కొచ్చి దుప్పటి కప్పడం,తల నిరమడమే సరిపోయింది ... కాసింత కదిలిస్తే చాలు ఏడ్చేయడానికి సిద్దంగా ఉన్నారు ..ఏంటో!!! అమ్మా ,నాన్నకళ్ళ నీళ్ళు పెడితే నేను తట్టుకోలేను..అదీ నాగురించి ..అందుకే పెళ్లి కాగానే అప్పగింతల సీన్ ఎక్కడ పెడతారో అని చూపు తిప్పకుండా మా ఆయనతో కబుర్లు చెప్తూనే ఉన్నా..కార్ లో కూడా గబుక్కున టాటా చెప్పేసి మొహం తిప్పేసాను.. ఇప్పటికీ మా ఆయన దెప్పుతారు నీకసలు మీవాళ్ళంటే ప్రేమ ఉందా అని .. మీకేం తెలుసు నా బాధ అని అనుకుంటాను ...ఇప్పుడు మళ్లీ అదే సీన్ ...రాత్రి నుండి ఏమి తెలియనట్లు ఈ చీర ఎందుకు కట్టుకున్నావ్.ఆ డ్రెస్ ఎందుకు పెట్టావ్ అని లోడ లోడా కబుర్లు చెప్పి నటించేస్తున్నా .... అమ్మ మాత్రం నా కోసం పైకి అస్సలు తేలదు..నా బేల తనం బాగా తెలుసు ...


నాన్నా,అమ్మా విజిటర్ పాస్ తీసుకున్నారు .. ఇంతకూ మావారు చెప్పిన ఫ్రెండ్ ఇంకా రాలేదు.. నాకసలే ఆ పరిసరాలు చూస్తుంటే టెన్షన్ టెన్షన్ గా ఉంది..కొంపదీసి ఈ రోజు జర్నీ కేన్సిల్ చేసుకోలేదు కదా ఆ అబ్బాయి అని అనిపించింది.. కంగారు పడుకులే వస్తాడు అని నాన్నచెప్తూ, నీ దగ్గర డబ్బులు ఏమన్నా ఉన్నాయా అమ్మా అన్నారు.. అప్పుడు గుర్తు వచ్చింది ..20 రూపాయలు తప్పా పైసా లేదు.. ఉహు అన్నాను.. నాన్న 5000 తీసి నా చేతిలో పెట్టాబోయారు ...ప్రక్క నున్న అతను' ఎందుకండీ అవి ..ఆ దేశం లో మన కరెన్సీ నాలుక గీసుకోవడానికి కూడా పని చెయ్యదు , ప్లైట్ లో ఎలాగు ఫుడ్ గట్రా వాళ్ళే పెడతారు ,అక్కడ చేరగానే మీ అల్లుడు రిసీవ్ చేసుకుంటారు ..అనవసరం అన్నాడు ' ...నాన్న, నేను మోహ మొహం చూసుకున్నాం ... పోనీ ఒక 1000 రూపాయిలయినా తీసుకో అన్నారు.. వద్దులే నాన్న ..నాకేం అవసరం తిరిగి ఇచ్చేశాను.. అదే నేను చేసిన పెద్ద తప్పని నాకు తెలియదు ...


ఈ లోపల మావారికి తెలిసిన ఫ్రెండ్ వచ్చాడు ... కొత్తగా పెళ్లి అయిన కళ కొట్టొచ్చినట్లు కనబడుతుంది ... ప్రక్కనున్న వాళ్ళావిడ చెయ్యి అర నిమిషం కూడా వదలకుండా ,ఆప్యాయం గా ఆమె కళ్ళ లో చూస్తూనే ఉన్నాడు..క్రొత్త గా పెళ్లి అయిన వాళ్ళను చూస్తే భలే నవ్వొస్తుంది నాకు.. అంగుళం దూరం కూడా విడిచి ఉండలేనట్లు ఉంటారు..అదే ఒక సంవత్సరం అయ్యిందో మినిమం రెండు అడుగులు దూరం కొలుచుకుని మరీ నడుస్తారు ..ఇంకా పిల్లలు గట్రా పుడితే ..హుమ్ ఎందుకు అడుగుతారు లెండి :).. మా అమ్మాయి బాబు అని పరిచయం చేసారు నాన్న ..అర సెకను నా వైపు చూసి చిన్నగా నవ్వి (?) మళ్లీ తన గొడవలో పడిపోయాడు ...పాపం మా నాన్న, నా గురించి చెప్పడానికి( అంటే మా అమ్మాయికి ఏమీ తెలియదు.. కాస్త జాగ్రత్త గా వాళ్ళాయన దగ్గరకు తీసుకు వెళ్ళు ..గట్రా గట్రా ) బాగా ప్రిపెరయ్యి వచ్చారేమో ఆ అబ్బాయి అవకాసం ఇవ్వక పోయేసరికి సతమతమైపోతున్నారు..అబ్బా పర్లేదులే నాన్నా అని వారించాను..

వచ్చి అరగంట అయినా వాళ్ళు అసలు తెమలరే ...అక్కడే కబుర్లు వాళ్ళ వాళ్ళ తోటి ..నాకేమో టైం అయ్యే కొద్ది టెన్షన్ ..ఈ లోపల ఉన్నట్లుండి సీన్ మారిపోయింది .. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని జాలిగా చూస్తున్నాడు.. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మను ,నాన్నను పట్టుకుని భోరున ఏడుస్తుంది..అప్పగింతలు ...అంటే బయలుదేరుతున్నాం అన్నమాట.. నాకు కంగారోచ్చేసింది నాన్నను తలుచుకుని ...ఇప్పటి వరకు ఎంత జాగ్రత్తగా విషయం ఏమార్చాను.. నాన్న వైపు చూసాను.. నాన్న ఆ అమ్మాయి తండ్రిని ఓదార్చడం లో బిజీ గా ఉన్నారు .... అంత టెన్షన్ లోను నవ్వొచ్చింది..

అమ్మ కళ్ళు తుడుచుకుంటుంది .. చూసావా ...ఆ అబ్బాయి నా లగేజ్ మోసేస్తాడు అన్నావ్ ...అతనే బోలెడు బేగ్ లు మోసుకొచ్చాడు.. నువ్వస్సలు తిన్నమైనదానివి కాదు... వెనక్కి తీసుకు పో అన్నాను ... నోరుముయ్యి.. ఆ ఫ్లైట్ వరకు మోయలేవేంటి ... కాసేపు కష్టపడితే నాలుగు నెలలు హాయిగా ఉంటావ్ అంది .. సరేలే దిగగానే ఫోన్ చేస్తా గాని నే వెళ్ళగానే ఇద్దరూ ఇక్కడ గాన కచేరి పెట్టకండి ...హోటల్ కి వెళ్ళండి .. నాన్న జాగ్రత్త ..అమ్మకి మాత్రం వినబడేలా అని గభ,గభా లోపలికి నడిచా.. కాని లోపలి వెళ్ళాకా ఆ కచేరి నేను ఇస్తా అని అనుకోలేదు .. :)
Categories: Middle