http://himabinduvulu.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
Updated: 44 min 50 sec ago

నటించాలని వుంది

Sun, 09/05/2010 - 06:20
నాకు నటించాలని వుంది.కాని నిజ జీవితంలో చేతకావడం లేదు .చిన్నప్పటినుంచి చేతకానిది ఇప్పుడు నేర్చుకుందాం అనుకున్న లెక్కలు నేర్చుకున్నంత కష్టంగా వుంది .అదేంటోగాని వున్నది వున్నట్లు మాట్లడడం నా బలహీనత అలా అని ఇతరుల మనోభావాల్ని గాయపరచాలి అనుకోనుఅస్సలు ప్రయత్నించను అలాగే ఎదుటివారు అలానే వుండాలి అనుకుంటాను.అంత అంటూ వుంటారు నా ముఖం సులువుగా చదివేయోచ్చని నా స్టేట్ఆఫ్ మైండ్ తెలిసిపోతుందట.సంతోషాన్ని,భాద ని,కోపాన్ని,రంగు రంగులాగా చుపించేస్తనట.ప్చ్ ఇవ్వేమి ఎదుటివారు చదవకుండా నటించడం నేర్చుకోవాలి.ఇవ్వాళ్ళ రేపు ఉద్యోగంలో కాని సామాజిక సంభందాల్లో నటించడం చాలా అవసరం అని నెమ్మది నెమ్మదిగా అవగతం అవుతుంది ఇంత లేటు వయస్సులోనయిన కొంతయిన నేర్చుకోక తప్పదేమో .
స్కూల్లోను కాలేజీల్లో ను రంగస్థలం మీద నటించి ప్రత్యెక బహుమానాలే పొందాను నా నటన తో ప్రేక్షకుల కళ్ళలో నీళ్ళు తెప్పించిన సందర్బాలు వున్నాయి . కాని నిజజీవితంలో నటించడం రానందుకు నా మనసు తడి చూడాలి అనుకుంటారు కొందరు.అందుకే అలాటి వారికొరకైననేను 'నటించడం'నేర్చుకోవాలి.
Categories: Middle

ఈ రోజు నాదే

Wed, 09/01/2010 - 05:49
''రేపటి సెలవు రోజు నాది కదా ''అంటూ రాబోయే ఆఫ్ ని తలచుకుంటూ ,ఆ రోజు చేయవలసిన పనులు లిస్టు చెబుతుంటే నాకు అసలు అర్ధం అయ్యేది కాదు ఇంతల సెలవురోజు కొరకు ఎదురు చూస్తారా అని .
పది ఏళ్ళు నా సమయం నా చేతి లో వుండేది నా పై కమిషనర్ భాగ్యనగరం లో వుండటం మా పై జిల్లా కలెక్టర్ కి ఎటువంటి నియంత్రణ లేకపోవడం ఒక విధంగా స్వేచ్చగా వుద్యోగం వెలిగింది.ఇప్పుడు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు నా సమయం నా చేతిలో లేకుండా పోయింది,కదలాలి అంటే పెర్మిషన్ ,జ్వరం వచ్చిన ఇష్టం వచ్చినట్లు ఇంట్లో వుండే పనిలేదు అందరికి సెలవయిన మాకు ఉంటుందో ఉండదో అని ఆలోచన ....హమ్మో సెలవు అంటే ఎంత ప్రియమో ప్రాక్టికల్గా అర్ధం అవుతుంది ...ఈ రోజు కృష్ణాష్టమి ఈ రోజు వేరే పనేమీ ,ప్రోగ్రాం కాని లేదు ..ఈ రోజు నాదే .
Categories: Middle

మా బెజవాడ అందమైన నగరం

Sat, 08/07/2010 - 11:39



మా బెజవాడ అందమైన నగరం.సహజసిద్దంగా కొండ కొనలమద్య ఏర్పడింది.ఎంతో ప్రశాంతంగా ,ఆహ్లాదంగా సహజ సౌందర్యం తో మా నగరాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు.ఈ జిల్లాలో పుట్టినందుకు ఈ ఊర్లో నా చదువు సంధ్యలు జరిగినందుకు నా ఊరు ఇదే అని చెప్పుకోవడానికి గర్వపడతాను.ఉదయం సాయంత్రం రాత్రుళ్ళు అలా మేడ పయికి ఎక్కి చుట్టూ ప్రకృతిని చుస్తే ................ఈ జన్మకి ఇది చాలు అన్పిస్తుంది .


Categories: Middle

హై వే వస్తుంది (విజయవాడ -హైదరాబాద్ )

Sat, 08/07/2010 - 10:58
కొన్ని నెలల క్రితం హై వే ఎప్పుడు వస్తుందో అని భాద పడిపోతూ నా బ్లాగ్ లో నా వ్యధ వెళ్ళబోసుకున్నాను.మొత్తానికి నా కోరిక నాలాటి ప్రజల కోరిక ముఖ్యంగా విజయవాడ వాసుల కోరిక తీరుతుంది.కొన్నాల్లక్రితం పని మొదలు పెట్టినట్లున్నారుజనావాసాలు లేని చోట్ల చాల పనిపూర్తయ్యిందిట్రాఫిక్ జామ్ అయ్యిన చోట్ల ప్రక్కనే వేస్తున్న గ్రావెల్ రోడ్ లోకి దిశ మార్చుకుని వాహనాలన్నీ వెళ్లి పోతున్నాయి బహుశ ఈ యాడాది చివరికల్లా ఫోర్వే ముస్తాబు అయ్యే సూచనలు కనబడుతున్నాయి.నిన్న ఉదయం వెళ్ళే ప్పుడు సాయంత్రం వచ్చేప్పుడు ఆనందంగా చూస్తువచ్చాను.ఇక ఇంట్లోవాళ్ళు టెన్షన్ పడరు బుల్లి కారు ప్రయాణం అంటే అలానే బోల్డంత సమయం కలసి వస్తుంది .
అంతా బానే వుంది కాని ఒక విషయం మనస్సు ని కలచివేసింది.ఎన్నో తరాలకి సాక్షిబూతంగా నిలబడి గుర్రాలకి,ఎడ్ల బండ్లకి,గోర్రేలకి,మేకలకి,పశువుల కాపర్లకి,పశుపక్షాదులకి సేద తీర్చి,ఆవాసమై నీడనిచ్చిన ఆ మహా వృక్షాలు అన్నీ నేలకొరిగిచిద్రమై వాటి ఆనవాళ్ళు మొదళ్ళుగత వైభవానికి సాక్షిగా ఇంకా దారిపొడవునా దర్శనం ఇచ్చాయి కొన్ని చోట్ల ప్రోక్ల్యినర్ ఆ భారికాయాల్ని లారి కి ఎత్తి పెడ్తుంటే నా కళ్ళలో అప్రయత్నంగానే నీళ్ళుమనస్సంతా భారం అయ్యింది ...కానిమానవ ప్రాణాలు మరింత నష్టపోకుండా వుండాలి అంటే ఈ హై వే తప్పదు.
అంతే కదా కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలి ..................
Categories: Middle

ఆషాడం -గోరింటాకు

Mon, 07/26/2010 - 12:04
ఆషాడం లో గోరింట పుట్టింటికి వెళ్తుందట ,అని మా నాయనమ్మ చెబుతుండేది అందుకే అడిగినంత పండుతుందట ,అందుకని తప్పనిసరిగా శాస్త్రనికయినా పెట్టుకోవాలనేది ,ఇప్పుడు ఇలా గుర్తుచేయడానికి దగ్గరుండి మా అందరికి పెట్టడానికి నాయనమ్మ లేదు కాని ఆషాడం రాగానే ఆ మాటలు పదే పదే గుర్తొస్తాయి .
మా అమ్మ కూడా అంతే తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటుంది ,లేత చిగురుటాకులు తెప్పించి కాటుకలా రుబ్బించి మా అందరికి పంపిస్తుంది .చిన్నప్పుడైతే ఇష్టంగా పెట్టుకునేవాళ్ళం ,పెద్దయ్యాక ఆ ఇంటరెస్ట్ లు తగ్గిపోయాయి కాని అమ్మ మాత్రం వెంటపడి మరచిపోకుండా మా చేత గోరింటాకు పెట్టిస్తుంది .
నిన్న ఆదివారం సాయంత్రం అమ్మ గోరింటాకు పంపి మరల మేం ఎక్కడ పెట్టుకోకుండా మరచిపోతామో అని రాత్రి ఫోన్ చేసి మరీ గుర్తు చేసి మా చేత చేతికి రంగులు అద్దించింది ,ప్రొద్దున్నే నిద్రకళ్ళ తో లేచి అరచేతులు చూసుకుంటే యంత మురిపెంగా అనిపించిందో చిన్నప్పుడు నాది బాగా పండింది అంటే నాది పండింది అని పోటీలు పెద్దోల్ల దగ్గర తీర్పులు ...... ఆ పచ్చివాసనలో ఎన్నెన్నిజ్ఞాపకాలో ........
Categories: Middle

మార్పు

Thu, 07/08/2010 - 14:07
కొన్ని నెలల క్రితం తెగ భాదపడి పోయేదాన్ని ''బ్లాగులకి "తెగ ఎడిక్ట్ అయిపోతున్నాను అని ఎలా తగ్గించాల అనికూడా ఆలోచనలు చేయడం ,వాటిని ఆచరించడానికి ప్రయత్నించడం కూడా జరిగింది .బ్లాగుల వలన నేను రెగ్యులర్ గా చదివే పుస్తకాలు ,నవలలు కూడా తగ్గాయి అలానే కొన్ని పెర్సనల్ రిలేషన్స్ మీద కూడా ప్రభావం పడింది .ఎట్టకేలకు నా ప్రయత్నం లేకుండానే ఈ మధ్యకాలం లో బయటకి రాగలిగాను .కారణం విపరీతమైన పని ఒత్తిడి ,ఉదయం ఇంటినుండి బయట పడ్డాను అంటే ఇల్లు చేరేవరకి వేరే ధ్యాస వుండటం లేదు .ప్రయాణం లో ఒక మూడుగంటలు చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది .ప్రస్తుతానికి అయితే వృత్తీపరమైన జి.ఓలు సంభందిత సమాచారం చదువుకోవడం తో గడుపుతున్నాను ,ఒక నెలపోతే ప్రయాణం లో బోల్డన్ని పుస్తకాలు చుట్టి రావచ్చు.కళ్ళ ఎదురుగా ఇంటా-బయట సిస్టం వున్నా ఓపెన్ చేసిన ఇదివరకు వలె కూడలో,హారమో ,జల్లెడో,మాలికో చూడాలని అనిపించడం లేదు .నాకు అర్ధం అయ్యింది ఏవిటంటే చేతికి ,మనసుకి తగినంత పనిలేకపోతే రకరకాల ఎడిక్షన్స్ వస్తాయని :-) అంటే ఇన్నాళ్ళు పనిపాట లేకుండా కాలక్షేపం చేసానుఅని అంతా అనుకునే ప్రమాదం వుందని తెలుసు ,బట్ అదేమికాదు ,ఇప్పుడు ఇంకా భాధ్యతలు మరింతపెరగడం మాత్రమె ఈ మార్పుకి కారణం .ఎనీ హౌ ఈ బంగారులోకం మాయ నుండి బయటకి రాగలిగాను .:-)
Categories: Middle

సొగసు చూడ తరమా !

Sat, 06/26/2010 - 13:40
రెండ్రోజుల క్రిందట ఒక మిత్రుని వివాహం జరిగితే వాళ్ళ ఊరు వెళ్లాను .నిజంగా మరో కేరళ చూసినట్లుంది. కేరళ వెళ్ళినపుడు 'అయ్యో మనవైపు ఇంత అందంగా లేవే' అని తెగ భాద పడిపోయాం.అప్పుడప్పుడు ఈ ప్రాంతం వెళ్ళడం జరిగింది కాని ,ఎప్పుడు ఆఫీసు హడావిడి ,పని ఆలోచనలతో పూర్తిగా ఎంజాయ్ చేయలేక పోయేదాన్ని .చుట్టూ పచ్చగా కొబ్బరి తదితర చెట్లతో ,సన్నటి వర్షపు తుంపర్ల తో ఆ సౌందర్యాన్ని వర్ణించడం సాహసమే సుమా అనిపించింది . దేవుడికి ఇంత బయాస్ ఎందుకో కొన్నిటిని మాత్రమె అధ్బుతంగా సృష్టించి మరి కొన్నిటిని నిర్లక్ష్యం చేయడం ,వెళ్ళేప్పుడు మసక చీకటిలో 'గోదారి 'అందాలు వచ్చేప్పుడు కళ్ళార్పకుండా వయ్యరాలుపోతు వంపులు తిరిగి వెళ్తున్న కాలువలు ,పొలాలు వాటికి కాపలా గా క్రమశిక్షణ గల సైనికుల్ల కొబ్బరి చెట్లు .... అద్బుతమయిన కోనసీమ .అప్రయత్నంగా నా నోటినుండి ఈ పాటా ..."బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు ...................ప్రభు మాకేల నీయవూ ..
Categories: Middle

WEDDING BELLS

Tue, 06/22/2010 - 12:05
మా అమ్మ 'బుల్లి ఫ్రెండ్ 'పెళ్లి వెళ్తున్నాము మేము పడి పడి అరటిపువ్వు ,పనసపొట్టు తినాలని మరీమరీ .యేబట్టలు కట్టాల అని ఆలోచించి చించి షాపింగులు చేస్తున్నాము విరగబడి ప్రతి యేడు ఇలా పిలవాలి మళ్ళిమళ్ళి... అడ్వాన్సు విషెస్ టు అవర్ బిలవేడ్ ఫ్రెండ్ By chinni daughter
Categories: Middle

అడుగులో అడుగులు

Sat, 06/19/2010 - 23:36
మీ 'అడుగులో 'అడుగులు వేస్తూ మీరు చూపిన బాటలో నడుస్తున్నాం నాన్న! పసితనం లో మాతో వల్లే వేయించిన 'సుమతీ ,వేమన ,బాస్కర 'శతకాలకి భాష్యం వెదుకుతూనే మా వెనుక నడిచే వారికి దిశానిర్దేశం చేస్తున్నాం నాన్న! నానమ్మ ద్వారా మీరందిపుచ్చుకున్న 'మానవత్వం' అనే ఆస్తిని మేమందుకుని ఇంతింతని అంత చేసి ముందు తరాలకి అందించగాలమనే మొక్కవోని విశ్వాసం తో ముందుకు సాగుతున్నాం మేము "ఆరుగురం ".
Categories: Middle

మనసు మాట వినదే..ప్చ్

Wed, 06/16/2010 - 12:28
ఈ పది సంవత్సరాలలో నేను పోగు చేసుకున్న ఆస్తి (డైరీలు ,జి.వో లు ,పేపర్ క్లిప్పింగ్స్ కార్డ్స్ ,డిపార్టుమెంటు పేపర్స్ ,నానాజాతి సమితి (కథలు ,కవితలు )మొత్తం సర్దితే పెద్ద అట్టపెట్టేడు అయ్యాయి ,అవసరం లేనివి చింపగా)బద్రంగా ఇంట్లోకి చేర్చాను రెండుగంటల క్రితం .నా సంస్థానం ,నా సింహాసనం వైపు చివరిచూపు చూస్తున్నపుడు మసకబారిన నా కళ్ళకి మొత్తం అలికేసినట్లు అక్కడేమో కనబడలేదు .ఇన్నాళ్ళు ఇరవయ్యినాలుగు గంటలు నన్నంటిపెట్టి వున్నా నా మొబైల్ నంబర్ వేరేవారికి ఇవ్వడానికి నా ప్రాణం విలవిల లాడింది ..ప్రాణం లేని వాటిమీద నాకెందుకు ఈ మమకారం ఎందుకో అర్ధం కావడం లేదుదేవుడా త్వరగా వీళ్ళందర్నీ ,ఇక్కడ వున్నా అనుబంధాలని మరచిపోయే వరమివ్వు .
Categories: Middle

ప్రయాణం

Mon, 06/14/2010 - 21:49
పాత ప్రపంచం వదిలి కొత్త ప్రపంచంలోకి నా అడుగులు .............అన్యమనస్కంగా ................
Categories: Middle

రింగ్ టోన్స్

Sat, 06/12/2010 - 08:14
"అందంగా లేనా అసలేమి కానా నీ ఈడు జోడుకానా అలుసైపోయన " అని నేను అనడం లేదు ..మా అమ్మాయిగారి మొబైల్ కి కాల్ చేస్తే శ్రావ్యంగా వినిపిస్తుంది .ఈ రింగ్ టోన్స్ వున్నాయి చూడండీ ఒక్కోసారి మనల్ని మత్తులో పడేస్తుంటాయి ...ఎంతో అర్జెంటు పనిమీద కాల్ చేస్తామా అవతల మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే స్వరమో ,రాగమో వినబడగానే మైమరచి వినేసి అవతలి వాళ్ళు లైన్ లోకి రాగానే ఎందుకు కాల్ చేసేమో గుర్తురాక తరువాత చేస్తాంలే అన్న సందర్భాలు ,దగ్గర వాళ్ళయితే గుర్తురావడంలేదు అయిన ఇలా పాటలు పెట్టి చంపడం ఎందుకు అని క్లాసు తీసుకోవడం (అక్కడికి నేనేదో బుద్దిమంతురాలు అయినట్లు ) తరుచు జరుగుతూనే వుంటాయి .అసలు ఈ రింగ్ టోన్స్ అందుబాటులోకి వచ్చిన క్రొత్తలో మా పిల్లకాయలు వాటి మీద ప్రయోగాలు చేసేవారు.నాకు వాటి మీద అవగాహనా నిల్ అన్నమాట (ఉదా ;బ్లాగ్స్ చాటింగ్ లా ) ఒకసారి ఏమి జరిగిందంటే ..జిల్లాలోకి క్రొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ కి ,నాకు ,జాయింట్ కలెక్టర్ కి కలిపి ఒక పనిని అప్పటి కలెక్టర్ గారు అస్సిగ్న్మేంట్ ఇచ్చారు .ఆ పని నిమిత్తం సబ్ కలెక్టర్ నాతో చర్చించడానికి కాల్ చేసారు ,ఉదయంపూట ,నేను వంట హడావిడి లో వుండి ఆన్సర్ చేయలేదు తీరికగా తరువాత చుస్తే ఆయన నుండి పది పైన మిస్సేడ్ కాల్స్ వున్నాయి ...కంగారుపడి ఆయనకీ కాల్ బాక్ చేస్తే ...సీరియస్ టోన్ తో "రండి ఆఫీసు కి "అన్నారు .కాస్త తేడాగా అనిపించినా హడావిడిలో పట్టించుకోకుండా పావుగంటలో అక్కడ వున్నాను ..అప్పటికే మాతో పాటు పనిచేసే ఇంకొక డిపార్టుమెంటు అధికారి వున్నాడు ...నన్ను చూడగానే "అదేవిటి మేడం ఫోన్ ఆన్సర్ చేయరు పైగా ఆ పాటలు "అన్నాడు ...అర్ధం కాని లుక్ అతనికేసి ఇచ్చి సబ్ గారి చాంబర్ లోకి వెళ్లాను .నన్ను చూడగానే ముఖం అదోలా పెట్టేసుకుని "ఏమిటండి మీరొక భాద్యత గల అధికారి గా బిహేవ్ చేయండి "అన్నాడు ..నేనేమో తాపిగా అదేంటి సర్ అలా అంటారు ప్రయర్ గా చెబితే టైం కి వచ్చేదాన్నిగా అయినా ఈ రోజు లోకల్ గా వున్నాను నిజానికి క్యాంప్ లో ఉండాల్సింది "అని అంతే సీరియస్ అన్నాను (కొత్తవాడు పయిగా పిల్ల వాడు ;-))" మీతో ఎంతో మంది సీనియర్ అధికారులు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటారు ఫోన్ లో ఇలాటి రింగ్ టోన్స్ పెట్టుకోవడం మర్యాద ఉందా ?"అని ముఖం అదోలా పెట్టుకుని ....నాకు అస్సలు అర్ధం కాలేదు..."ఏంటి సర్ మీరు అంటున్నది "అయోమయంగా నేను ."మీ మొబైల్ ఫోన్ కి వున్నా రింగ్ టోన్ గురించి నేను మాట్లాడుతున్నాను "అని తను .ఒక్కసారే నా బుర్ర తిరిగిపోయింది ...అప్పుడు వెలిగింది ,నా కూతురు ఏదో ప్రయోగం చేసింది అని .ఇక నా నోట మాట లేదు ....అవమానం మనసులో వంద ఆలోచనలు ...ఏం పాట పెట్టి ఉంటుందా అని ...ఆయన సమాదానం కోసం కూడా చూడకుండా వస్తాను సర్ అని విసురుగా బయటికి వచ్చేసాను వెళ్ళిన పని వదిలేసి .ఇంటికి వచ్చి లాండ్ లైన్ నుండి నా మొబైల్ కి రింగ్ ఇచ్చి విన్నాను ....హింది పాట లవ్ సాంగ్ విరహం తో ఆలపిస్తాడు(గుర్తురావడం లేదు ).ఇక చూడండీ ఇల్లు రణరంగం చేసేసాను మా అమ్మాయిని పిచ్చి పిచ్చిగా తిట్టేసాను కనీసం నాకు చెప్పి చేయొచ్చుగా అని ఎలా పెట్టావో అలానే పీకేయమని దానిని తీయడం రాదనీ తను ...మొత్తానికి నా ఎయిర్టెల్ ఫ్రెండ్ ద్వారా స్టాప్ చేయించాను . కొన్నాళ్ళ తరువాత నీ -నా బేదం లేకుండా రింగ్ టోన్స్ వాడకం విరివిగా మొదలయ్యింది .నాకు తప్పు అని క్లాస్స్ తీసుకున్న సదరు ఆఫీసర్ కూడా తక్కువేం తినలేదు ..దాదాపు రెండేళ్ళు నా ఆఫీసు మొబైల్ కి నార్మల్ రింగ్ వుండేది ...తరువాత తరువాత నచ్చిన పాటలు పెడుతూ వచ్చాను .నచ్చితే బాగుంది అంటారు లేకపోతె ఏంది తల్లి ఆ పాటలు అనేవాళ్ళు వున్నారు పాట సెలెక్షన్ జాగ్రత్తగా చేస్తుంటాను అయిన మా అమ్మాయి అప్పుడప్పుడు తనకి నచ్చినవి మారుస్తున్టది..నన్ను టీజ్ చేయడానికి . ఈ మద్య మా కజిన్ ఒకడు ఇలా అన్నాడు "అవతలి వాళ్ళ కోసం మనం నచ్చిన పాటలు ఎందుకు సెట్ట్చేయాలి , మనం వింటామాపెడతామా ?మన కోసం కాల్ చేసే వాళ్ళ కోసం నెలకి ముప్పయి రూపాయిలు కట్టి మరి వినిపించాల,మనం వినేది వుండదు దండగ కదా అందుకనే ఇంతవరకి నేను వాటి జోలికి వెళ్ళను"అన్నాడు నవ్వుతు ..నిజమే కదా ఎవ్వరో వినడానికి మనం నెల నెల ముప్పయ్యి రూపాయలు పాటకి పదిహేను రూపాయలు .హమ్మ వెధవ ఆలోచించే మాట అన్నాడే అనుకున్నాను .అయిన మనం మార్చామా !ఉహూ ..."పెదవే పలికిన మాటల్లో తియ్యని మాటే అమ్మ " అని వినొచ్చు నాకు ఎవరయినా కాల్ చేస్తే :-):-).
Categories: Middle

ఇదీ అసలు కథ

Thu, 06/03/2010 - 13:44
ట్రింగ్ ట్రింగ్ ...ట్రింగ్ ట్రింగ్ అంటూ ల్యాండ్ ఫోన్ ఒకటే గగ్గోలు ..చేతిలో చదువుతున్న పుస్తకం తీసి ప్రక్కన పడేసి టైం చూసాను ఇంచుమించు చిన్న ముల్లు పెద్దముల్లుపన్నెండు దగ్గర కలుసుకుంటున్నాయి...ఈ టైం లో ఎవరు చేస్తారా అనుకుంటూ ఫోన్ వైపు కదిలి నంబర్ డిస్ప్లే వైపు చూసాను .....రెండు వీదులవతల వున్నా అమ్మ నుంచో లేక ఇంటి పైన ఉంటున్న చెల్లి ఇంటి నుండో అని ఊహిస్తూ ..నా ఊహ నిజం చేస్తూ అమ్మ నుండే ...ఏంటమ్మా ఈ టైములో ఒకింత కంగారుగా అడిగాను .సాయంత్రం మొదలైన తలనొప్పి ఇప్పటివరకు తగ్గలేదని ,బి.పి టాబ్లెట్ వేసుకున్న అలానే వుందని , క్రోసిన్ టాబ్లెట్ పడితేనే తగ్గోచ్చని ,వేసుకుందాం అంటే ఇంట్లో లేవని కాస్త ఇంట్లో వుంటే పంపమని సారాంశం .గబగబా మందుల డబ్బా వెదికి క్రోసిన్ షీట్ దొరకబుచ్చుకుని ఈయన గాని మెలకువగా వుంటే పంపిద్దాం అని బెడ్రూం తలుపు తెరచి చూసాను గాడంగా నిద్రపోతున్న తనని చుస్తే లేపాలి అనిపించక స్టాండ్ మీదున్న చున్ని తీసి బుజాలపై పడేసుకుని మెయిన్ డోర్ తీసి లాక్ చేసి అమ్మ వాళ్ళింటి వైపు కదిలాను .బజారు నిర్మానుష్యంగా వుంది .మా వీది కి అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు ,అమ్మ వాళ్ళ ఇల్లు రెండు వీధులు దాటితే వస్తుంది ఆ కాలనీ అంతా చెట్లతో వీధిలో వున్నా దీపాల కాంతికూడా సరిగ్గా పడదు ,కొంచెం దూరం నడిచానో లేదో పక్క బజార్ నుండి ఒక అమ్మాయి గాజులు గలగలా లాడించుకుంటూ నా ముందు నడుస్తూ వెళ్తుంది.హమ్మయ్య నాకు ఒక తోడున్నారు కదా అనుకుంటూ కాలికి అడ్డం పడుతున్న నెయిటితో అవస్థపడుతూ కాస్త వేగంగా నడిచే ప్రయత్నం చేస్తూ ముందు వెళ్తున్న అమ్మాయి వైపు చూసాను నడక వింతగా అనిపించింది భూమి మీద కాళ్ళు ఆని ఆననట్లు వున్నాయి ....తేరిపార చూద్దును కదా కాళ్ళు వెనక్కి తిరిగి వున్నాయి ...అంతే గుండె జల్లుమని గొంతులో కేక గొంతులోనే వుండగా ఆమెను దాటుకుని వేగంగా పరుగు పెట్టాను..నా వెనుక కొంత దూరం వస్తున్నట్లు గాజుల సవ్వడి ఎక్కడిలేని ధైర్యం తో అమ్మ వాళ్ళ గేటు లో అడుగు పెట్టాను .ఇంటిముందున్న లాన్ ని దాటుకుంటూ గుమ్మం వైపు చూడగా గుమ్మంలో అమ్మ నాకోసం ఎదురుచూస్తూ ......అయ్యో నువ్వు వచ్చావేంటి తల్లి అబ్బాయి లేడా.....అయిన ఏవిటా చెమటలు అంత కంగారుగా వున్నవేంటి అంటూనే నా చేతిలో టాబ్లెట్స్ తీసుకుంది ,నేను ఒగురుస్తూ దారిలో జరిగిన విషయం చెప్పాను వీధిలోకి చూస్తూ ...."అమ్మఆ అమ్మాయి కాళ్ళు వెనక్కి తిరిగి వున్నాయి ,దేయ్యలకేగా అలా వుండేది "అన్నాను . అమ్మ నా వైపు తేరిపార చూస్తూ ......అవునా ఎలా ఉన్నాయమ్మ ...ఇలా ఉన్నాయా అంటూ చీర కుచ్చిళ్ళు కొంచెం పైకి జరిపింది ..... ఒక్కసారే కెవ్వున కేక వేసి వెనక్కి పరుగు తీశాను వెనక్కి తిరిగి వున్నా ఆ పాదాలను చూసి ......నా కేకలకి చెళ్ళుమని బుజం ఒక్కదెబ్బ వేసి లేపెసారు మావారు ...త్రుళ్ళి పడి లేచి చుట్టూ చూసాను .....మంచం మీద వున్నాను ....మంచి నీళ్ళు త్రాగి పడుకో పీడకల వచ్చినట్లుందని నీళ్ళ సీస చేతికిచ్చారు .........(ఇదండి మనం చుసిన దయ్యం ....పిచ్చి కథలు విని ఇలా కలవరపడటం అలవాటే )
Categories: Middle

వీడుకోలే -వీడలేని స్నేహమైన

Tue, 06/01/2010 - 01:36

"సాయంకాలం" తో మొదలయిన మన ప్రయాణం నిన్నటి" హిమబిందు" దగ్గర సేద తీర్చుకుంది .ఈ అయిదు సంవత్సరాల గమనం లో ఎన్నో మలుపులు సరదాలు సంతోషాలు ,అలకలు అల్లర్లు వేదాంతం ,విషాదం ఎన్నని చెప్పగలను ,నన్ను నేను మరచిపోయిన నాకు జీవితం ఇది అని చూపించి బ్రతుకు ప్రయాణం లో గమ్యం వెదుక్కుంటూ తరలిపోతున్న స్నేహమా నిన్ను మరువగాలనా !
"పాదమెటు పోతున్నా పయనం ఎందాకయినా అడుగు తడబడుతున్న తోడు రానా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులని తుడిచిన నేస్తామా ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచినా స్నేహమా "
Categories: Middle

WHO WILL CRYWHEN YOU DIE?

Fri, 05/28/2010 - 10:33
నిజంగా నా కోసం వీళ్ళంతా ...వీళ్ళుఅంతా నా వాళ్ళేనా ! ఇంతమందిని బాధ పెడుతుందా నా ఎడబాటు ...నాకోసం ఇంతమంది ...ఇంకా డైజస్ట్ కావడంలేదు ఎప్పటికైనా ఇటువంటి సందర్భం వస్తుందని తెలుసు కాని దానిని ఇలా ఎదుర్కుంటాను అని ఊహించలేదు.మనకి ఏదైనా జరిగిన ,ఎడబాటు కలిగిన మన కుటుంబ సభ్యులు ,బంధువులు ,ఆప్తమిత్రులు కన్నీరుపర్య్వంతం అవడమే తెలుసు ...కాని ఇంతలా ఏమి కాని నాకోసం వెక్కిళ్ళు పెట్టి కళ్ళన్నీ కెంపులు చేసుకుని బెంగగా ,జాలిగా చూస్తున్న ఈ అమ్మాయిలూ ,.ఈ అబ్బాయిలు మాత్రం ...వీళ్ళ మొహం లో ఇంత వేదన ,నైరాశ్యం మునుపు ఎన్నడు చూడలేదే.!.ఎవరు వీళ్ళు .యేమవుతానని నాకోసం ఇంత దిగులు .ఇంకా ఎవరికోసం మేం పని చేయాలనీ అంటున్నారు పిచ్చివాళ్ళు నేనే అంటే నాకంటే సెంటిమెంట్ ఫూల్స్ లా వున్నారు .చెదిరిన నా మనసుకి సూటిగా వారి వైపు చూడలేని నా కళ్ళు ,మూగబోయిన నా గొంతు చెప్పకనే చెప్పాయి వీళ్ళు అందరు ఎప్పటికి నావాళ్ళేనని . .
Categories: Middle

ఆదివారం అబిడ్స్ లో వెయిటింగ్

Mon, 05/24/2010 - 15:25
చాలా సంవత్సరాల తరువాత పని పాట లేకుండా వచ్చేపోయే జంటలని ,జనాన్ని ,బస్సుల్నిచూస్తూ అభాగ్యనగరం లో అబిడ్స్ సెంటర్ లో ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగున్నర వరకి గడిపాను.ఉదయం ఇంటి దగ్గర నుండి బయలుదేరేప్పుడే చదువుతానికి ఏమైనా పుస్తకాలు పెట్టుకోమని ఇంట్లో వాళ్ళు చెప్పిన నా మనస్సు పుస్తకం మీద చచ్చిన లగ్నం కాదని ముందే తెలిసి ఒక్క న్యూస్ పేపర్ మాత్రం వెంట తెచ్చుకున్నాను .మా పాప రాసే ఒక పరీక్ష కి మనం ఎస్కార్ట్ అన్నమాట .ఉదయం రెండుగంటలు మద్యాహ్నం రెండుగంటలు జరిగే ఈ పరీక్ష మద్యలో మూడుగంటలు విరామం .ఇంటికి వెళ్లి రావడానికి ముప్పావుగంట సమయం వృధా అందుకే పూర్తి సమయం అక్కడే గడపడానికి నిర్ణయించుకుని మావాళ్ళని పంపించేసాను సాయంత్రం వచ్చి పిక్ అప్ చేసుకోమని ఒక ఆర్డర్ పడేసాను నన్ను చూసి మా పిన్ని కొడుకు ఇంటర్ చదివేవాడు నాతో ఉంటానని ఆగిపోయాడు ..పరీక్ష హాల్లోకి తొమ్మిది గంటలకే అంతా పరుగులు తీసారు .క్యాంపస్ లో చెట్టు కిందో లేక వరండాలోనో కూర్చుందామని ప్లాన్ చేసుకున్నాను ..ఈ లోపు అక్కడికి సెక్యురిటి కి వచ్చిన పోలీసు అధికార్లు హింది ఉర్దుల్లో ఏమేమో మాట్లడేసుకుంటున్నారు ..మనకి కొంచెం కొంచెం మాత్రమె అర్ధం అవుతాదాయే (ఇదర్ ఆయియే లాటివన్నమాట ) పేరెంట్స్ ని ఇతరులను పంపించేద్దాం అని అనుకుంటున్నట్లు అనిపించి వెళ్లి అడిగాను" మేము ఇక్కడే కూర్చుంటాం "అని ."ఎగ్జం ఇస్టాట్ అయ్యింది మీరు ఉరుకున్ద్రి "అని నా వైపు జాలిగా చుస్తూపక్కనే వున్నా ఒక సెక్యురిటి హెచ్చరించాడు .ఓహో మనం పరీక్షలు రాసేవాళ్ళ కనబడుతున్నామా అని కాసింత మనసులో మురిసిపోయి (మా బంగారం పుణ్యానా దాని వెనుక పరుగులు తీస్తూ నెల రోజుల్లో నాలుగు కేజీలు తగ్గిపోయానయ్యే) అబ్బే నేను రాయడం లేదు మా వాళ్ళు లోపలి వెళ్ళారు ఇక్కడ వెయిట్ చేస్తాము అని ,నాలాటి వాళ్ళు చాలా మంది చేరారు ,కాని కాంపస్ లో ఉండటానికి వీలు లేదనేసారు. .ఉస్సృమంటూ నిట్టూర్చి నా కూడా వున్నా మా కజిన్ తో రోడ్ ఎక్కాను .ఎదురుగా mcdonald's వుంది కాని అది పదకొండు గంటలకి ఓపెన్ చేస్తారాయే ,ఏ ఇంటికి పోవాలన్నా చాలా దూరం ...కాలేజి బయటనున్న బస్సు స్టాపులో కూర్చున్నాం వచ్చేపోయే బస్సుల్ని చూడొచ్చని...అలా కూర్చున్నామో లేదో బస్సులు ఆగే ప్రదేశం అంతా మురుగు కాల్వ ఒక్కసారే ఏరులా పొంగి ప్రవాహం ....అదే నీళ్ళలో దిగి ప్రయాణికులు బస్సు ఎక్కడం దిగటం ...భయంకరమైన దుర్గంధం నీళ్ళు చిమ్మి పైకి మా మీద పడేంత ,అక్కడినుండి లేచి కొంచెం ప్రక్కకి నడిచేసరికి జార్జ్ చర్చి అని పూరాతన భవనం కనబడింది జనం లోపలి కి బయటికి తిరుగుతున్నారు అప్పుడే వాళ్ళ ప్రార్ధనలు అయ్యినట్లున్నాయి ..లోపలికి పోయి ఏదొక చెట్టుకింద కూర్చోవచ్చులేమ్మని ఇద్దరం లోపలి కి వెళ్లి ఆ ప్రాంగణం లో వాళ్ళ కోసం వేసివున్న ప్లాస్టిక్ చైర్స్ లో కూర్చున్నాం .నేను సీరియస్ గా సాక్షి పేపర్ తో ,వాడేమో వాడి మొబైల్ లో గేమ్స్ ఆడుతూ ....వాళ్ళేమో ప్రార్ధనలు అయ్యి ఆడవాళ్ళు గుంపులుగా కబుర్లు గోల గోల ...పది దాటేక ఓపిక నశించి మరల రోడ్ మీదికి వచ్చేసరికి ఎదురుగా macdonald's తెరచి వుంది ..హమ్మయ్య ఏ.సి లో కూర్చోవచ్చని రోడ్ కస్టపడి దాటి (మనకి అసలే భయం )లోపలి కి వెళ్లేసరికి ..ఇంకా సర్విస్ స్టార్ట్ కాలేదు వెయిట్ చేస్తామంటే కూర్చోండిఅని నమ్రతగా......అదే మాకు కావాల్సింది అంటూ ఆనందంగా సెటిల్ అయ్యి ....ఇక చూడండి టి.వి లో వచ్చే మాధవన్ సినిమా సఖి చూస్తూ వాళ్ళ స్పీకర్ల హోరులో నుండి వచ్చే పాశ్చాత్య సంగీతం వింటూ ఇటు సినిమా డైలాగులు వినబడక ...చీమల దండులా నెమ్మదిగా జంటలుగా వస్తున్న టీనేజి పిల్లల్ని చూస్తూ ...బురకాల్లో వచ్చిన హిందూ గాళ్స్ ని చూస్తూ .....చేసే పనిని ఆ మాత్రం దైర్యం లేక తెగువ చూపిస్తున్న అమ్మాయిల్ని చూసి మెచ్చుకోవాలో నోచ్చుకోవాలో అర్ధం కాని పరిస్థితి ...మొత్తం ఫ్లోటింగ్ ఈ వయస్సు వారిదే ....అసలు వీళ్ళు ఖర్చు పెట్టడానికి ఇంతింత డబ్బులు ఎలా వస్తున్నాయో ,పేరెంట్స్ ఎందుకు ఇంతింత ఇస్తున్నారో ...ఏ మాత్రంఆ పిల్లలు కష్టపడకుండా వచ్చిన డబ్బు ఇలా దుర్వినియోగం....ఆ అమ్మాయిలూ మరల లేచి బయటికి వెళ్ళే ముందు నల్లటి ముసుగులు తగిలించుకుని వెళ్తుంటే నాకు సంభంధం లేకపోయినా మనస్సు చివుక్కుమంది .ఈ మాటలు నా డాటర్ తో అంటుంటే అయ్యో మమ్మీ ఇక్కడ ఇది చాల సహజం చాలామంది ఇలానే చేస్తారు ...ముస్లిమ్స్ వాడే పరదాలు మన వాళ్లకి ఇలా పనికివస్తాయి అంది .పూర్వం యవనులు అరబ్బులు ,టర్కిష్ వారినుండి మన స్త్రీలను కాపాడుకొవాడానికి వాడిన పరదా నేటి ఆధునిక యుగం లో ఇంకొకరకంగా............ఇలా..ప్చ్...సాయంత్రం వరకి మాకు వేదికగా ఉపయోగపడిన రెస్టారెంటుకి ఒక వెయ్యిరూపాయలు మూల్యం చెల్లించి (నానా గడ్డి తిన్నందుకు :-)) బయటపడ్డాం. ....-0-.........
...



























Categories: Middle