http://himabinduvulu.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
Updated: 37 min ago

ఆషాడం -గోరింటాకు

Mon, 07/26/2010 - 12:04
ఆషాడం లో గోరింట పుట్టింటికి వెళ్తుందట ,అని మా నాయనమ్మ చెబుతుండేది అందుకే అడిగినంత పండుతుందట ,అందుకని తప్పనిసరిగా శాస్త్రనికయినా పెట్టుకోవాలనేది ,ఇప్పుడు ఇలా గుర్తుచేయడానికి దగ్గరుండి మా అందరికి పెట్టడానికి నాయనమ్మ లేదు కాని ఆషాడం రాగానే ఆ మాటలు పదే పదే గుర్తొస్తాయి .
మా అమ్మ కూడా అంతే తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటుంది ,లేత చిగురుటాకులు తెప్పించి కాటుకలా రుబ్బించి మా అందరికి పంపిస్తుంది .చిన్నప్పుడైతే ఇష్టంగా పెట్టుకునేవాళ్ళం ,పెద్దయ్యాక ఆ ఇంటరెస్ట్ లు తగ్గిపోయాయి కాని అమ్మ మాత్రం వెంటపడి మరచిపోకుండా మా చేత గోరింటాకు పెట్టిస్తుంది .
నిన్న ఆదివారం సాయంత్రం అమ్మ గోరింటాకు పంపి మరల మేం ఎక్కడ పెట్టుకోకుండా మరచిపోతామో అని రాత్రి ఫోన్ చేసి మరీ గుర్తు చేసి మా చేత చేతికి రంగులు అద్దించింది ,ప్రొద్దున్నే నిద్రకళ్ళ తో లేచి అరచేతులు చూసుకుంటే యంత మురిపెంగా అనిపించిందో చిన్నప్పుడు నాది బాగా పండింది అంటే నాది పండింది అని పోటీలు పెద్దోల్ల దగ్గర తీర్పులు ...... ఆ పచ్చివాసనలో ఎన్నెన్నిజ్ఞాపకాలో ........
Categories: Middle

మార్పు

Thu, 07/08/2010 - 14:07
కొన్ని నెలల క్రితం తెగ భాదపడి పోయేదాన్ని ''బ్లాగులకి "తెగ ఎడిక్ట్ అయిపోతున్నాను అని ఎలా తగ్గించాల అనికూడా ఆలోచనలు చేయడం ,వాటిని ఆచరించడానికి ప్రయత్నించడం కూడా జరిగింది .బ్లాగుల వలన నేను రెగ్యులర్ గా చదివే పుస్తకాలు ,నవలలు కూడా తగ్గాయి అలానే కొన్ని పెర్సనల్ రిలేషన్స్ మీద కూడా ప్రభావం పడింది .ఎట్టకేలకు నా ప్రయత్నం లేకుండానే ఈ మధ్యకాలం లో బయటకి రాగలిగాను .కారణం విపరీతమైన పని ఒత్తిడి ,ఉదయం ఇంటినుండి బయట పడ్డాను అంటే ఇల్లు చేరేవరకి వేరే ధ్యాస వుండటం లేదు .ప్రయాణం లో ఒక మూడుగంటలు చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది .ప్రస్తుతానికి అయితే వృత్తీపరమైన జి.ఓలు సంభందిత సమాచారం చదువుకోవడం తో గడుపుతున్నాను ,ఒక నెలపోతే ప్రయాణం లో బోల్డన్ని పుస్తకాలు చుట్టి రావచ్చు.కళ్ళ ఎదురుగా ఇంటా-బయట సిస్టం వున్నా ఓపెన్ చేసిన ఇదివరకు వలె కూడలో,హారమో ,జల్లెడో,మాలికో చూడాలని అనిపించడం లేదు .నాకు అర్ధం అయ్యింది ఏవిటంటే చేతికి ,మనసుకి తగినంత పనిలేకపోతే రకరకాల ఎడిక్షన్స్ వస్తాయని :-) అంటే ఇన్నాళ్ళు పనిపాట లేకుండా కాలక్షేపం చేసానుఅని అంతా అనుకునే ప్రమాదం వుందని తెలుసు ,బట్ అదేమికాదు ,ఇప్పుడు ఇంకా భాధ్యతలు మరింతపెరగడం మాత్రమె ఈ మార్పుకి కారణం .ఎనీ హౌ ఈ బంగారులోకం మాయ నుండి బయటకి రాగలిగాను .:-)
Categories: Middle

సొగసు చూడ తరమా !

Sat, 06/26/2010 - 13:40
రెండ్రోజుల క్రిందట ఒక మిత్రుని వివాహం జరిగితే వాళ్ళ ఊరు వెళ్లాను .నిజంగా మరో కేరళ చూసినట్లుంది. కేరళ వెళ్ళినపుడు 'అయ్యో మనవైపు ఇంత అందంగా లేవే' అని తెగ భాద పడిపోయాం.అప్పుడప్పుడు ఈ ప్రాంతం వెళ్ళడం జరిగింది కాని ,ఎప్పుడు ఆఫీసు హడావిడి ,పని ఆలోచనలతో పూర్తిగా ఎంజాయ్ చేయలేక పోయేదాన్ని .చుట్టూ పచ్చగా కొబ్బరి తదితర చెట్లతో ,సన్నటి వర్షపు తుంపర్ల తో ఆ సౌందర్యాన్ని వర్ణించడం సాహసమే సుమా అనిపించింది . దేవుడికి ఇంత బయాస్ ఎందుకో కొన్నిటిని మాత్రమె అధ్బుతంగా సృష్టించి మరి కొన్నిటిని నిర్లక్ష్యం చేయడం ,వెళ్ళేప్పుడు మసక చీకటిలో 'గోదారి 'అందాలు వచ్చేప్పుడు కళ్ళార్పకుండా వయ్యరాలుపోతు వంపులు తిరిగి వెళ్తున్న కాలువలు ,పొలాలు వాటికి కాపలా గా క్రమశిక్షణ గల సైనికుల్ల కొబ్బరి చెట్లు .... అద్బుతమయిన కోనసీమ .అప్రయత్నంగా నా నోటినుండి ఈ పాటా ..."బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు ...................ప్రభు మాకేల నీయవూ ..
Categories: Middle

WEDDING BELLS

Tue, 06/22/2010 - 12:05
మా అమ్మ 'బుల్లి ఫ్రెండ్ 'పెళ్లి వెళ్తున్నాము మేము పడి పడి అరటిపువ్వు ,పనసపొట్టు తినాలని మరీమరీ .యేబట్టలు కట్టాల అని ఆలోచించి చించి షాపింగులు చేస్తున్నాము విరగబడి ప్రతి యేడు ఇలా పిలవాలి మళ్ళిమళ్ళి... అడ్వాన్సు విషెస్ టు అవర్ బిలవేడ్ ఫ్రెండ్ By chinni daughter
Categories: Middle

అడుగులో అడుగులు

Sat, 06/19/2010 - 23:36
మీ 'అడుగులో 'అడుగులు వేస్తూ మీరు చూపిన బాటలో నడుస్తున్నాం నాన్న! పసితనం లో మాతో వల్లే వేయించిన 'సుమతీ ,వేమన ,బాస్కర 'శతకాలకి భాష్యం వెదుకుతూనే మా వెనుక నడిచే వారికి దిశానిర్దేశం చేస్తున్నాం నాన్న! నానమ్మ ద్వారా మీరందిపుచ్చుకున్న 'మానవత్వం' అనే ఆస్తిని మేమందుకుని ఇంతింతని అంత చేసి ముందు తరాలకి అందించగాలమనే మొక్కవోని విశ్వాసం తో ముందుకు సాగుతున్నాం మేము "ఆరుగురం ".
Categories: Middle

మనసు మాట వినదే..ప్చ్

Wed, 06/16/2010 - 12:28
ఈ పది సంవత్సరాలలో నేను పోగు చేసుకున్న ఆస్తి (డైరీలు ,జి.వో లు ,పేపర్ క్లిప్పింగ్స్ కార్డ్స్ ,డిపార్టుమెంటు పేపర్స్ ,నానాజాతి సమితి (కథలు ,కవితలు )మొత్తం సర్దితే పెద్ద అట్టపెట్టేడు అయ్యాయి ,అవసరం లేనివి చింపగా)బద్రంగా ఇంట్లోకి చేర్చాను రెండుగంటల క్రితం .నా సంస్థానం ,నా సింహాసనం వైపు చివరిచూపు చూస్తున్నపుడు మసకబారిన నా కళ్ళకి మొత్తం అలికేసినట్లు అక్కడేమో కనబడలేదు .ఇన్నాళ్ళు ఇరవయ్యినాలుగు గంటలు నన్నంటిపెట్టి వున్నా నా మొబైల్ నంబర్ వేరేవారికి ఇవ్వడానికి నా ప్రాణం విలవిల లాడింది ..ప్రాణం లేని వాటిమీద నాకెందుకు ఈ మమకారం ఎందుకో అర్ధం కావడం లేదుదేవుడా త్వరగా వీళ్ళందర్నీ ,ఇక్కడ వున్నా అనుబంధాలని మరచిపోయే వరమివ్వు .
Categories: Middle

ప్రయాణం

Mon, 06/14/2010 - 21:49
పాత ప్రపంచం వదిలి కొత్త ప్రపంచంలోకి నా అడుగులు .............అన్యమనస్కంగా ................
Categories: Middle

రింగ్ టోన్స్

Sat, 06/12/2010 - 08:14
"అందంగా లేనా అసలేమి కానా నీ ఈడు జోడుకానా అలుసైపోయన " అని నేను అనడం లేదు ..మా అమ్మాయిగారి మొబైల్ కి కాల్ చేస్తే శ్రావ్యంగా వినిపిస్తుంది .ఈ రింగ్ టోన్స్ వున్నాయి చూడండీ ఒక్కోసారి మనల్ని మత్తులో పడేస్తుంటాయి ...ఎంతో అర్జెంటు పనిమీద కాల్ చేస్తామా అవతల మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే స్వరమో ,రాగమో వినబడగానే మైమరచి వినేసి అవతలి వాళ్ళు లైన్ లోకి రాగానే ఎందుకు కాల్ చేసేమో గుర్తురాక తరువాత చేస్తాంలే అన్న సందర్భాలు ,దగ్గర వాళ్ళయితే గుర్తురావడంలేదు అయిన ఇలా పాటలు పెట్టి చంపడం ఎందుకు అని క్లాసు తీసుకోవడం (అక్కడికి నేనేదో బుద్దిమంతురాలు అయినట్లు ) తరుచు జరుగుతూనే వుంటాయి .అసలు ఈ రింగ్ టోన్స్ అందుబాటులోకి వచ్చిన క్రొత్తలో మా పిల్లకాయలు వాటి మీద ప్రయోగాలు చేసేవారు.నాకు వాటి మీద అవగాహనా నిల్ అన్నమాట (ఉదా ;బ్లాగ్స్ చాటింగ్ లా ) ఒకసారి ఏమి జరిగిందంటే ..జిల్లాలోకి క్రొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ కి ,నాకు ,జాయింట్ కలెక్టర్ కి కలిపి ఒక పనిని అప్పటి కలెక్టర్ గారు అస్సిగ్న్మేంట్ ఇచ్చారు .ఆ పని నిమిత్తం సబ్ కలెక్టర్ నాతో చర్చించడానికి కాల్ చేసారు ,ఉదయంపూట ,నేను వంట హడావిడి లో వుండి ఆన్సర్ చేయలేదు తీరికగా తరువాత చుస్తే ఆయన నుండి పది పైన మిస్సేడ్ కాల్స్ వున్నాయి ...కంగారుపడి ఆయనకీ కాల్ బాక్ చేస్తే ...సీరియస్ టోన్ తో "రండి ఆఫీసు కి "అన్నారు .కాస్త తేడాగా అనిపించినా హడావిడిలో పట్టించుకోకుండా పావుగంటలో అక్కడ వున్నాను ..అప్పటికే మాతో పాటు పనిచేసే ఇంకొక డిపార్టుమెంటు అధికారి వున్నాడు ...నన్ను చూడగానే "అదేవిటి మేడం ఫోన్ ఆన్సర్ చేయరు పైగా ఆ పాటలు "అన్నాడు ...అర్ధం కాని లుక్ అతనికేసి ఇచ్చి సబ్ గారి చాంబర్ లోకి వెళ్లాను .నన్ను చూడగానే ముఖం అదోలా పెట్టేసుకుని "ఏమిటండి మీరొక భాద్యత గల అధికారి గా బిహేవ్ చేయండి "అన్నాడు ..నేనేమో తాపిగా అదేంటి సర్ అలా అంటారు ప్రయర్ గా చెబితే టైం కి వచ్చేదాన్నిగా అయినా ఈ రోజు లోకల్ గా వున్నాను నిజానికి క్యాంప్ లో ఉండాల్సింది "అని అంతే సీరియస్ అన్నాను (కొత్తవాడు పయిగా పిల్ల వాడు ;-))" మీతో ఎంతో మంది సీనియర్ అధికారులు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటారు ఫోన్ లో ఇలాటి రింగ్ టోన్స్ పెట్టుకోవడం మర్యాద ఉందా ?"అని ముఖం అదోలా పెట్టుకుని ....నాకు అస్సలు అర్ధం కాలేదు..."ఏంటి సర్ మీరు అంటున్నది "అయోమయంగా నేను ."మీ మొబైల్ ఫోన్ కి వున్నా రింగ్ టోన్ గురించి నేను మాట్లాడుతున్నాను "అని తను .ఒక్కసారే నా బుర్ర తిరిగిపోయింది ...అప్పుడు వెలిగింది ,నా కూతురు ఏదో ప్రయోగం చేసింది అని .ఇక నా నోట మాట లేదు ....అవమానం మనసులో వంద ఆలోచనలు ...ఏం పాట పెట్టి ఉంటుందా అని ...ఆయన సమాదానం కోసం కూడా చూడకుండా వస్తాను సర్ అని విసురుగా బయటికి వచ్చేసాను వెళ్ళిన పని వదిలేసి .ఇంటికి వచ్చి లాండ్ లైన్ నుండి నా మొబైల్ కి రింగ్ ఇచ్చి విన్నాను ....హింది పాట లవ్ సాంగ్ విరహం తో ఆలపిస్తాడు(గుర్తురావడం లేదు ).ఇక చూడండీ ఇల్లు రణరంగం చేసేసాను మా అమ్మాయిని పిచ్చి పిచ్చిగా తిట్టేసాను కనీసం నాకు చెప్పి చేయొచ్చుగా అని ఎలా పెట్టావో అలానే పీకేయమని దానిని తీయడం రాదనీ తను ...మొత్తానికి నా ఎయిర్టెల్ ఫ్రెండ్ ద్వారా స్టాప్ చేయించాను . కొన్నాళ్ళ తరువాత నీ -నా బేదం లేకుండా రింగ్ టోన్స్ వాడకం విరివిగా మొదలయ్యింది .నాకు తప్పు అని క్లాస్స్ తీసుకున్న సదరు ఆఫీసర్ కూడా తక్కువేం తినలేదు ..దాదాపు రెండేళ్ళు నా ఆఫీసు మొబైల్ కి నార్మల్ రింగ్ వుండేది ...తరువాత తరువాత నచ్చిన పాటలు పెడుతూ వచ్చాను .నచ్చితే బాగుంది అంటారు లేకపోతె ఏంది తల్లి ఆ పాటలు అనేవాళ్ళు వున్నారు పాట సెలెక్షన్ జాగ్రత్తగా చేస్తుంటాను అయిన మా అమ్మాయి అప్పుడప్పుడు తనకి నచ్చినవి మారుస్తున్టది..నన్ను టీజ్ చేయడానికి . ఈ మద్య మా కజిన్ ఒకడు ఇలా అన్నాడు "అవతలి వాళ్ళ కోసం మనం నచ్చిన పాటలు ఎందుకు సెట్ట్చేయాలి , మనం వింటామాపెడతామా ?మన కోసం కాల్ చేసే వాళ్ళ కోసం నెలకి ముప్పయి రూపాయిలు కట్టి మరి వినిపించాల,మనం వినేది వుండదు దండగ కదా అందుకనే ఇంతవరకి నేను వాటి జోలికి వెళ్ళను"అన్నాడు నవ్వుతు ..నిజమే కదా ఎవ్వరో వినడానికి మనం నెల నెల ముప్పయ్యి రూపాయలు పాటకి పదిహేను రూపాయలు .హమ్మ వెధవ ఆలోచించే మాట అన్నాడే అనుకున్నాను .అయిన మనం మార్చామా !ఉహూ ..."పెదవే పలికిన మాటల్లో తియ్యని మాటే అమ్మ " అని వినొచ్చు నాకు ఎవరయినా కాల్ చేస్తే :-):-).
Categories: Middle

ఇదీ అసలు కథ

Thu, 06/03/2010 - 13:44
ట్రింగ్ ట్రింగ్ ...ట్రింగ్ ట్రింగ్ అంటూ ల్యాండ్ ఫోన్ ఒకటే గగ్గోలు ..చేతిలో చదువుతున్న పుస్తకం తీసి ప్రక్కన పడేసి టైం చూసాను ఇంచుమించు చిన్న ముల్లు పెద్దముల్లుపన్నెండు దగ్గర కలుసుకుంటున్నాయి...ఈ టైం లో ఎవరు చేస్తారా అనుకుంటూ ఫోన్ వైపు కదిలి నంబర్ డిస్ప్లే వైపు చూసాను .....రెండు వీదులవతల వున్నా అమ్మ నుంచో లేక ఇంటి పైన ఉంటున్న చెల్లి ఇంటి నుండో అని ఊహిస్తూ ..నా ఊహ నిజం చేస్తూ అమ్మ నుండే ...ఏంటమ్మా ఈ టైములో ఒకింత కంగారుగా అడిగాను .సాయంత్రం మొదలైన తలనొప్పి ఇప్పటివరకు తగ్గలేదని ,బి.పి టాబ్లెట్ వేసుకున్న అలానే వుందని , క్రోసిన్ టాబ్లెట్ పడితేనే తగ్గోచ్చని ,వేసుకుందాం అంటే ఇంట్లో లేవని కాస్త ఇంట్లో వుంటే పంపమని సారాంశం .గబగబా మందుల డబ్బా వెదికి క్రోసిన్ షీట్ దొరకబుచ్చుకుని ఈయన గాని మెలకువగా వుంటే పంపిద్దాం అని బెడ్రూం తలుపు తెరచి చూసాను గాడంగా నిద్రపోతున్న తనని చుస్తే లేపాలి అనిపించక స్టాండ్ మీదున్న చున్ని తీసి బుజాలపై పడేసుకుని మెయిన్ డోర్ తీసి లాక్ చేసి అమ్మ వాళ్ళింటి వైపు కదిలాను .బజారు నిర్మానుష్యంగా వుంది .మా వీది కి అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు ,అమ్మ వాళ్ళ ఇల్లు రెండు వీధులు దాటితే వస్తుంది ఆ కాలనీ అంతా చెట్లతో వీధిలో వున్నా దీపాల కాంతికూడా సరిగ్గా పడదు ,కొంచెం దూరం నడిచానో లేదో పక్క బజార్ నుండి ఒక అమ్మాయి గాజులు గలగలా లాడించుకుంటూ నా ముందు నడుస్తూ వెళ్తుంది.హమ్మయ్య నాకు ఒక తోడున్నారు కదా అనుకుంటూ కాలికి అడ్డం పడుతున్న నెయిటితో అవస్థపడుతూ కాస్త వేగంగా నడిచే ప్రయత్నం చేస్తూ ముందు వెళ్తున్న అమ్మాయి వైపు చూసాను నడక వింతగా అనిపించింది భూమి మీద కాళ్ళు ఆని ఆననట్లు వున్నాయి ....తేరిపార చూద్దును కదా కాళ్ళు వెనక్కి తిరిగి వున్నాయి ...అంతే గుండె జల్లుమని గొంతులో కేక గొంతులోనే వుండగా ఆమెను దాటుకుని వేగంగా పరుగు పెట్టాను..నా వెనుక కొంత దూరం వస్తున్నట్లు గాజుల సవ్వడి ఎక్కడిలేని ధైర్యం తో అమ్మ వాళ్ళ గేటు లో అడుగు పెట్టాను .ఇంటిముందున్న లాన్ ని దాటుకుంటూ గుమ్మం వైపు చూడగా గుమ్మంలో అమ్మ నాకోసం ఎదురుచూస్తూ ......అయ్యో నువ్వు వచ్చావేంటి తల్లి అబ్బాయి లేడా.....అయిన ఏవిటా చెమటలు అంత కంగారుగా వున్నవేంటి అంటూనే నా చేతిలో టాబ్లెట్స్ తీసుకుంది ,నేను ఒగురుస్తూ దారిలో జరిగిన విషయం చెప్పాను వీధిలోకి చూస్తూ ...."అమ్మఆ అమ్మాయి కాళ్ళు వెనక్కి తిరిగి వున్నాయి ,దేయ్యలకేగా అలా వుండేది "అన్నాను . అమ్మ నా వైపు తేరిపార చూస్తూ ......అవునా ఎలా ఉన్నాయమ్మ ...ఇలా ఉన్నాయా అంటూ చీర కుచ్చిళ్ళు కొంచెం పైకి జరిపింది ..... ఒక్కసారే కెవ్వున కేక వేసి వెనక్కి పరుగు తీశాను వెనక్కి తిరిగి వున్నా ఆ పాదాలను చూసి ......నా కేకలకి చెళ్ళుమని బుజం ఒక్కదెబ్బ వేసి లేపెసారు మావారు ...త్రుళ్ళి పడి లేచి చుట్టూ చూసాను .....మంచం మీద వున్నాను ....మంచి నీళ్ళు త్రాగి పడుకో పీడకల వచ్చినట్లుందని నీళ్ళ సీస చేతికిచ్చారు .........(ఇదండి మనం చుసిన దయ్యం ....పిచ్చి కథలు విని ఇలా కలవరపడటం అలవాటే )
Categories: Middle

వీడుకోలే -వీడలేని స్నేహమైన

Tue, 06/01/2010 - 01:36

"సాయంకాలం" తో మొదలయిన మన ప్రయాణం నిన్నటి" హిమబిందు" దగ్గర సేద తీర్చుకుంది .ఈ అయిదు సంవత్సరాల గమనం లో ఎన్నో మలుపులు సరదాలు సంతోషాలు ,అలకలు అల్లర్లు వేదాంతం ,విషాదం ఎన్నని చెప్పగలను ,నన్ను నేను మరచిపోయిన నాకు జీవితం ఇది అని చూపించి బ్రతుకు ప్రయాణం లో గమ్యం వెదుక్కుంటూ తరలిపోతున్న స్నేహమా నిన్ను మరువగాలనా !
"పాదమెటు పోతున్నా పయనం ఎందాకయినా అడుగు తడబడుతున్న తోడు రానా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులని తుడిచిన నేస్తామా ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచినా స్నేహమా "
Categories: Middle

WHO WILL CRYWHEN YOU DIE?

Fri, 05/28/2010 - 10:33
నిజంగా నా కోసం వీళ్ళంతా ...వీళ్ళుఅంతా నా వాళ్ళేనా ! ఇంతమందిని బాధ పెడుతుందా నా ఎడబాటు ...నాకోసం ఇంతమంది ...ఇంకా డైజస్ట్ కావడంలేదు ఎప్పటికైనా ఇటువంటి సందర్భం వస్తుందని తెలుసు కాని దానిని ఇలా ఎదుర్కుంటాను అని ఊహించలేదు.మనకి ఏదైనా జరిగిన ,ఎడబాటు కలిగిన మన కుటుంబ సభ్యులు ,బంధువులు ,ఆప్తమిత్రులు కన్నీరుపర్య్వంతం అవడమే తెలుసు ...కాని ఇంతలా ఏమి కాని నాకోసం వెక్కిళ్ళు పెట్టి కళ్ళన్నీ కెంపులు చేసుకుని బెంగగా ,జాలిగా చూస్తున్న ఈ అమ్మాయిలూ ,.ఈ అబ్బాయిలు మాత్రం ...వీళ్ళ మొహం లో ఇంత వేదన ,నైరాశ్యం మునుపు ఎన్నడు చూడలేదే.!.ఎవరు వీళ్ళు .యేమవుతానని నాకోసం ఇంత దిగులు .ఇంకా ఎవరికోసం మేం పని చేయాలనీ అంటున్నారు పిచ్చివాళ్ళు నేనే అంటే నాకంటే సెంటిమెంట్ ఫూల్స్ లా వున్నారు .చెదిరిన నా మనసుకి సూటిగా వారి వైపు చూడలేని నా కళ్ళు ,మూగబోయిన నా గొంతు చెప్పకనే చెప్పాయి వీళ్ళు అందరు ఎప్పటికి నావాళ్ళేనని . .
Categories: Middle

ఆదివారం అబిడ్స్ లో వెయిటింగ్

Mon, 05/24/2010 - 15:25
చాలా సంవత్సరాల తరువాత పని పాట లేకుండా వచ్చేపోయే జంటలని ,జనాన్ని ,బస్సుల్నిచూస్తూ అభాగ్యనగరం లో అబిడ్స్ సెంటర్ లో ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగున్నర వరకి గడిపాను.ఉదయం ఇంటి దగ్గర నుండి బయలుదేరేప్పుడే చదువుతానికి ఏమైనా పుస్తకాలు పెట్టుకోమని ఇంట్లో వాళ్ళు చెప్పిన నా మనస్సు పుస్తకం మీద చచ్చిన లగ్నం కాదని ముందే తెలిసి ఒక్క న్యూస్ పేపర్ మాత్రం వెంట తెచ్చుకున్నాను .మా పాప రాసే ఒక పరీక్ష కి మనం ఎస్కార్ట్ అన్నమాట .ఉదయం రెండుగంటలు మద్యాహ్నం రెండుగంటలు జరిగే ఈ పరీక్ష మద్యలో మూడుగంటలు విరామం .ఇంటికి వెళ్లి రావడానికి ముప్పావుగంట సమయం వృధా అందుకే పూర్తి సమయం అక్కడే గడపడానికి నిర్ణయించుకుని మావాళ్ళని పంపించేసాను సాయంత్రం వచ్చి పిక్ అప్ చేసుకోమని ఒక ఆర్డర్ పడేసాను నన్ను చూసి మా పిన్ని కొడుకు ఇంటర్ చదివేవాడు నాతో ఉంటానని ఆగిపోయాడు ..పరీక్ష హాల్లోకి తొమ్మిది గంటలకే అంతా పరుగులు తీసారు .క్యాంపస్ లో చెట్టు కిందో లేక వరండాలోనో కూర్చుందామని ప్లాన్ చేసుకున్నాను ..ఈ లోపు అక్కడికి సెక్యురిటి కి వచ్చిన పోలీసు అధికార్లు హింది ఉర్దుల్లో ఏమేమో మాట్లడేసుకుంటున్నారు ..మనకి కొంచెం కొంచెం మాత్రమె అర్ధం అవుతాదాయే (ఇదర్ ఆయియే లాటివన్నమాట ) పేరెంట్స్ ని ఇతరులను పంపించేద్దాం అని అనుకుంటున్నట్లు అనిపించి వెళ్లి అడిగాను" మేము ఇక్కడే కూర్చుంటాం "అని ."ఎగ్జం ఇస్టాట్ అయ్యింది మీరు ఉరుకున్ద్రి "అని నా వైపు జాలిగా చుస్తూపక్కనే వున్నా ఒక సెక్యురిటి హెచ్చరించాడు .ఓహో మనం పరీక్షలు రాసేవాళ్ళ కనబడుతున్నామా అని కాసింత మనసులో మురిసిపోయి (మా బంగారం పుణ్యానా దాని వెనుక పరుగులు తీస్తూ నెల రోజుల్లో నాలుగు కేజీలు తగ్గిపోయానయ్యే) అబ్బే నేను రాయడం లేదు మా వాళ్ళు లోపలి వెళ్ళారు ఇక్కడ వెయిట్ చేస్తాము అని ,నాలాటి వాళ్ళు చాలా మంది చేరారు ,కాని కాంపస్ లో ఉండటానికి వీలు లేదనేసారు. .ఉస్సృమంటూ నిట్టూర్చి నా కూడా వున్నా మా కజిన్ తో రోడ్ ఎక్కాను .ఎదురుగా mcdonald's వుంది కాని అది పదకొండు గంటలకి ఓపెన్ చేస్తారాయే ,ఏ ఇంటికి పోవాలన్నా చాలా దూరం ...కాలేజి బయటనున్న బస్సు స్టాపులో కూర్చున్నాం వచ్చేపోయే బస్సుల్ని చూడొచ్చని...అలా కూర్చున్నామో లేదో బస్సులు ఆగే ప్రదేశం అంతా మురుగు కాల్వ ఒక్కసారే ఏరులా పొంగి ప్రవాహం ....అదే నీళ్ళలో దిగి ప్రయాణికులు బస్సు ఎక్కడం దిగటం ...భయంకరమైన దుర్గంధం నీళ్ళు చిమ్మి పైకి మా మీద పడేంత ,అక్కడినుండి లేచి కొంచెం ప్రక్కకి నడిచేసరికి జార్జ్ చర్చి అని పూరాతన భవనం కనబడింది జనం లోపలి కి బయటికి తిరుగుతున్నారు అప్పుడే వాళ్ళ ప్రార్ధనలు అయ్యినట్లున్నాయి ..లోపలికి పోయి ఏదొక చెట్టుకింద కూర్చోవచ్చులేమ్మని ఇద్దరం లోపలి కి వెళ్లి ఆ ప్రాంగణం లో వాళ్ళ కోసం వేసివున్న ప్లాస్టిక్ చైర్స్ లో కూర్చున్నాం .నేను సీరియస్ గా సాక్షి పేపర్ తో ,వాడేమో వాడి మొబైల్ లో గేమ్స్ ఆడుతూ ....వాళ్ళేమో ప్రార్ధనలు అయ్యి ఆడవాళ్ళు గుంపులుగా కబుర్లు గోల గోల ...పది దాటేక ఓపిక నశించి మరల రోడ్ మీదికి వచ్చేసరికి ఎదురుగా macdonald's తెరచి వుంది ..హమ్మయ్య ఏ.సి లో కూర్చోవచ్చని రోడ్ కస్టపడి దాటి (మనకి అసలే భయం )లోపలి కి వెళ్లేసరికి ..ఇంకా సర్విస్ స్టార్ట్ కాలేదు వెయిట్ చేస్తామంటే కూర్చోండిఅని నమ్రతగా......అదే మాకు కావాల్సింది అంటూ ఆనందంగా సెటిల్ అయ్యి ....ఇక చూడండి టి.వి లో వచ్చే మాధవన్ సినిమా సఖి చూస్తూ వాళ్ళ స్పీకర్ల హోరులో నుండి వచ్చే పాశ్చాత్య సంగీతం వింటూ ఇటు సినిమా డైలాగులు వినబడక ...చీమల దండులా నెమ్మదిగా జంటలుగా వస్తున్న టీనేజి పిల్లల్ని చూస్తూ ...బురకాల్లో వచ్చిన హిందూ గాళ్స్ ని చూస్తూ .....చేసే పనిని ఆ మాత్రం దైర్యం లేక తెగువ చూపిస్తున్న అమ్మాయిల్ని చూసి మెచ్చుకోవాలో నోచ్చుకోవాలో అర్ధం కాని పరిస్థితి ...మొత్తం ఫ్లోటింగ్ ఈ వయస్సు వారిదే ....అసలు వీళ్ళు ఖర్చు పెట్టడానికి ఇంతింత డబ్బులు ఎలా వస్తున్నాయో ,పేరెంట్స్ ఎందుకు ఇంతింత ఇస్తున్నారో ...ఏ మాత్రంఆ పిల్లలు కష్టపడకుండా వచ్చిన డబ్బు ఇలా దుర్వినియోగం....ఆ అమ్మాయిలూ మరల లేచి బయటికి వెళ్ళే ముందు నల్లటి ముసుగులు తగిలించుకుని వెళ్తుంటే నాకు సంభంధం లేకపోయినా మనస్సు చివుక్కుమంది .ఈ మాటలు నా డాటర్ తో అంటుంటే అయ్యో మమ్మీ ఇక్కడ ఇది చాల సహజం చాలామంది ఇలానే చేస్తారు ...ముస్లిమ్స్ వాడే పరదాలు మన వాళ్లకి ఇలా పనికివస్తాయి అంది .పూర్వం యవనులు అరబ్బులు ,టర్కిష్ వారినుండి మన స్త్రీలను కాపాడుకొవాడానికి వాడిన పరదా నేటి ఆధునిక యుగం లో ఇంకొకరకంగా............ఇలా..ప్చ్...సాయంత్రం వరకి మాకు వేదికగా ఉపయోగపడిన రెస్టారెంటుకి ఒక వెయ్యిరూపాయలు మూల్యం చెల్లించి (నానా గడ్డి తిన్నందుకు :-)) బయటపడ్డాం. ....-0-.........
...



























Categories: Middle

నేను చేసిన తప్పేవిటి? -బంగారు

Wed, 05/12/2010 - 12:08

ఈ రోజు నేను ఏమి చేసిన అమ్మ( చిన్ని) తప్పులు పడుతుంది ...హ్మం ...ఏంచేయాలి :-(నేను ఏమి చేసిన ముద్దు ముద్దుగా గారం చేస్తూ నన్ను చూడ వచ్చిన వారందరికీ నేను చేసే పనులు గొప్పగా చెప్తూ నన్ను వాళ్ళ ముందు ప్రదర్శనలు ఇమ్మని బ్రతిమాలి లాలిచ్చి నాతో పనులు చేయించుకుని ఇప్పుడేమో హు...అయిన నేను గమ్మున వుంటానా!అమ్మ కి ఘాట్టిగా ఇచ్చాను ...నాకు సపోర్టుఅక్క ( చిన్ని వాళ్ళమ్మాయి) డాడీ వచ్చారు ...అయిన లెక్కచేయలేదు ,వాళ్ళని నోరుమూసుకోమంది..వాళ్ళని వాళ్ళ పని చూసుకోమంది ,నా పని ఆవిడ చూస్తోందట...యెం చూస్తుందో నేను చూస్తాను .అసలు నేను చేసిన తప్పేమిటో చెప్పండి .....తనని పని చేసుకోనివ్వకుండా కాళ్ళ కి అడ్డం పడుతున్ననట .ఒక్కర్తే పని చేసుకుంటుంది అని జత వెళ్ళడం తప్పా!అమ్మకన్నా ముందు నడవాలని పోటి పడ్తు ముందుకి వెళ్ళడం తప్పేమిటో .....ముందు వెళ్ళాను అనే ఆనందం తో కాళ్ళ దగ్గర అందిన చీర కుచ్చిళ్ళ తో ఆడుకున్నాను ...అది తప్పట .మరి తను నాకు అందేట్లు ఎందుకు కట్టాలో..హ్మం ....తిట్టిన ఏమనకుండా తనకి తోడుగా పనయ్యేదాకా వున్నానా ...అస్సలు కృతజ్ఞత లేదు.అమ్మ ఎక్కడుందో కాలి మువ్వలు మనకి పట్టించేస్తాయి .ఏదో పుస్తకం చదువుతుంది కదా తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని తన కుర్చీ పక్కనే కాళ్ళ దగ్గర కూర్చున్నాను ,నా కళ్ళు మువ్వల మీద పడ్డాయి భలే వున్నాయని చూద్దామని ఒకటి పీకాను అమ్మ పుస్తకం లో వుండి నన్నేమి గమనించలేదు సరికాద ఇంకోటి తీద్దామనుకుని కాలిపట్టి లాగబోయి కాలు కొరికాను అది తప్పంటా...ఇంకా నయం గట్టిగ కొరకలేదు .అప్పుడు చూసింది నేను ముందు తీసిన మువ్వని ...నేను నేల మీద పడిన మువ్వని తీద్దాం అనుకునే లోపు తనే తీసేసుకుని నా చెంప మీద ఒక్కటిచ్చింది ,చిన్నదాన్ని అని కూడా చూడకుండా :-(మువ్వ తింటే నేను చచ్చిపోతానంటా...అంటే ఏంటో ?అలిగేసి హాల్లోకి వచ్చి డాడీ కాళ్ళ దగ్గర కూర్చుని నా దారిన నేను టి.వి లో క్రికెట్ వస్తుంటే డాడీ తో పాటు చూస్తూ కూర్చున్నాను .ఇంతలోనే అమ్మ వచ్చేసి "నీకు కూడా ఆ పిచ్చి పట్టిందా,మంచి అలవాట్లు నేర్చుకో "అని నన్ను అక్కడి నుంచి లేపేసింది ,డాడీ వంక చుర చుర చూస్తూ ...మా ఇద్దర్ని కలిపే తిట్టిందని నా అనుమానం .అమ్మ అసలే కోపంగా వుందని అక్కడనుంచి లేచి వెళ్లి అక్క చదువు కుంటుంటే ప్రక్కనే కూర్చున్నాను ,అక్క కి నేనంటే ఎంతో ప్రేమ ,పరీక్షలయ్యాక నాతోనే ఆడతానని చెప్పిందిలే . అక్క లా చదువుదామని అక్కతో గొంతు కలిపాను,అమ్మ చుస్తే మురిసిపోతదని .. ....అంతే "అసలు నీకు బుద్దివుందా ?అక్కని చదుకోనియవాఎందుకు గోల చేస్తున్నావ్ "అంటూ కోప్పడింది .నాకొకటి అర్ధం అయ్యింది అమ్మకి కొంచెం తిక్క వుందని ...నేనేమి చేసిన తప్పేనా...?...ఏమి చేయలబ్బా :-(
Categories: Middle

సెంటి -మెంటల్

Mon, 05/10/2010 - 13:12
ఈ వారం అంతా "గులాబి "రంగు దుస్తులే ధరించాలి అనుకున్నాను ...ప్చ్ సందిగ్ధం లో పడ్డాను .ఇలా గులాబి రంగు వాడమని ఎవరు చెప్పారు అంటే నిన్న ఆదివారం" ఫన్ డే "లో రాసి వుంది .అసలు సాక్షి ఆదివారం పేపర్ పొరపాటున మిస్ కాను చివరి ఆ రెండు పేజీలు చదివి మనకి అనుకూలంగా రాసి వుంటే ఇక మనల్ని పట్టలేమో ...ఏమైనా తేడాగా రాసుంటే" అసలు నమ్మాలో వద్దో కూడా అర్ధం కావడం లేదు" అనేస్తాను :-)ఇంతకి ఏవిటా పేజి ఏమా కథ అని చదివే వారికీ సందేహం రావచ్చు .,అవి "టారో, రాశి ఫలం .అదేంటో నా నక్షత్ర ప్రకారం ,అలానే పుట్టిన తేది ఒకటే రాశి ని సూచిస్తాయి .ఇలా హరోస్కోప్ చదవడం ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పీటర్ విడాల్ చదవడం తో అలవాటయ్యాయి ,తరువాత లిండాగుడ్ మాన్ పుస్తకాలు అలా సరదాను పెంచాయి .జ్యోతి ,ఆంధ్రభూమి వార పత్రికల్లో వార ఫలాలు చదవడం అలవాటు అయ్యాయి .అసలు కథలోకి వెళితే టారో లో ప్రతి వారం మనకి కలిసి వచ్చే రంగు సూచిస్తారు .ఆ రంగులు మనం ధరిస్తే మనపై గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటాయని నమ్మకం .అట్లా ఆ వారం మనం వాడాల్సిన రంగులు గుర్తుపెట్టుకుని పూలు (ఫ్లవర్వాజ్ లోకి )ఆ రంగుకు దగ్గర ఉండేట్లు చూసుకోవడం చేస్తుంటాను .ఒక్కోసారి వరుసగా ఒకే రంగు సూచిన్చొచ్చు .అప్పుడు వుంటాది నా పని :-) ఆ మద్య వరుసగా కలసి వచ్చే రంగు తెలుపు అని రాస్తే రెండు మూడు వారాలు ధవళ వస్త్రాలు ధరించడం జరిగింది ,ఏదో ముఖ్యమైన ఫంక్షన్ కి ఫ్యామిలీ తో వెళ్తూ పార్టీవేర్ తెలుపులో తీయగానే ...అసలీ రంగు వదలవా ఏమైంది నీకు అని క్లాసు చెప్పించుకున్నాను ....అయిన మనం నోరు మెదపలేదు చెప్తే "ఫూల్"అనిపించుకోవాలని .అలానే కాషాయం వరుసగా రెండు సార్లు ....హబ్బ ఆ రంగులో ఎక్కువ చీరలు లేక భలే కష్టపడ్డాను దగ్గర గా వుండేవి కట్టి నడిపెసాను.నిన్న రాసిన దాన్లో గులాబి రంగు కలిసి వచ్చేది అని చదివాక తీరికగా బౌల్స్ లో గులాబి పూలు వేసి అక్కడక్కడ సర్ది వర్డ్రోబ్ లో వారం కి సరిపోయే పింక్ సారిస్ తీసి వేరేగా సర్దుకున్నాను .నిన్న గులాభి రంగు చీర కట్టిన కాసేపటికి మా అమ్మ తో కాసేపు ఫోన్ లో ఫైటింగ్ పెట్టుకున్నాను .మద్యాహ్నం మా తమ్ముడు వస్తే వాడి తో సరదాగా కబుర్లు చెబుతూనే వాడిని ఫటమని తిట్టేసాను .సాయంత్రం మా పార్వతిని(పని ) పిలిచిమరి పని ఎలా శుబ్రంగా చేయాలో ఘాట్టిగా క్లాస్స్ తీసుకున్నాను .మా అమ్మాయి చదువుకుంటుంటే మద్య మద్యలో తను చదవలేనప్పుడు ప్రక్కనే కూర్చుని చదివి పెడతాను మద్య మద్యలో ప్రశ్నలు వేస్తాను ....నిన్న తను వెంటనే కొన్నిటికి జవాబులు ఇవ్వలేదని నీవల్ల కాదులే అని అనవసరంగా తిట్టేసాను .ఇక చివరిగా మా ఇంటాయనతో (శ్రీవారు)తో కూడా గొడవ అయ్యింది ..ఎప్పుడు అస్సలు బాక్ రిప్లై ఇవ్వను ...తీక్షణంగా ఒక లుక్ లుక్కి ప్రక్కకి వెళ్ళిపోయే నేను ఎదురు నిలబడి మాటకి మాట అన్నాను ....బహుశ డైజస్ట్ అయ్యుండదు :-) నాకేమైనా బ్లడ్ ప్రేస్సర్ షూట్ అయ్యిందేమోనని డౌట్ కాని ఆ చాయలేమి మనల్ని ఇంకా చేరలేదు .నాకు నేను ఆలోచించుకున్నాను ..ఎందుకింత రెబిలియాస్ గా ప్రవర్తిస్తున్నానో అని ......నో డౌట్ గులాబి రంగు ప్రభావం అని అనుకున్న ....సరయితే రెండో రోజు కూడా చూద్దాం అనిపించింది .ఆఫీసు కి సమయం కంటే రెండుగంటలు ఆలస్యంగా వెళ్లాను .,ఇంటి నుండి ఆఫీసుకి వెళ్ళేదారిలో మా లేన్ నుండి కార్ మెయిన్ రోడ్ ఎక్కుతున్నప్పుడు ఆర్ .టి .సి . సిటీ బస్సు వాయు వేగం తో వచ్చి నూలుప్రోగంత దూరం లో ఆగింది ,ఇక అయిపోయాను అనుకుంటూ తల త్రిప్పెసుకున్నాను ...కాని ఏదో అదృష్టం ఘోరప్రమాదాన్ని తప్పించింది .అది తప్పినా అయిదు నిమిషాల్లో మా ఆఫీసు ప్రాంగణం లో హెయిర్ పిన్ బెండ్ లాటిది వుంటాది ,అక్కడ వాటర్ కాన్స్ తో ఆటో వస్తు కార్ ని కొట్టాల్సింది సడెన్ బ్రేక్ తో ఆపుకున్నాడు .ఆఫీసు రూం లో నా టేబుల్ పైనున్న ఫోటో ఫ్రేం (నా ఫోటో వుంటుంది )గంట క్రితం పడి పగిలిపోయింది ...తీసి గాజుపెంకులు క్లీన్ చేస్తున్నారు .నాకు చాలా భాద అన్పించింది సుమారు అయిదేళ్ళ నుండి వుంది ,ఉద్యోగాసోపానం ఇయర్ బుక్ , ఎగ్జిబిషన్లో నాచేత రిలీజ్ చేయిన్చినపుడు సురేష్ గారు ప్రెజెంట్ చేసింది ,మంచి కొటేషన్స్ తో వుండే ఫ్రేం అది. కొన్ని నచ్చి మనం అపురూపంగా చుసుకున్టున్నప్పుడు ఏమైనా జరిగితే భరించలేము ఇలా ఎందుకు జరుగుతుది అని కాసేపు ఆలోచించగా నాకు హటాత్తుగా 'గులాబి ' గుర్హోచ్చింది .ఆఫీసు లో ఎక్కువ సేపు గడపకుండా ఇంటికి వచ్చేసి ఆహ్లాదమైన నీలం లోకి మారిపోయాకగాని నా మనస్సు శాంతించలేదు .ఈ వారం పొరపాటున గులాభి రంగు బట్టలు కాని గులాభి రంగులోని పూలు కాని అంటరాదని ఘట్టిగా తీర్మానించేసుకున్నా ......ఏం చేద్దాం నేనో "సెంటి -మెంటల్ "............
Categories: Middle

సతుల్,సుతుల్ ,హితుల్ పోనీ !

Fri, 05/07/2010 - 14:18
పోనీ ,పోనీ ,పొతే పోనీ !సతుల్,సుతుల్ ,హితుల్ పోనీ !పొతే పోనీ !
రానీ, రానీ వస్తే రానీ !కష్టాల్ ,నష్టాల్ ,కోపాల్ ,తాపాల్ ,శాపాల్ రానీ !వస్తే రానీ !తిట్లూ ,రాట్లూ, పాట్లూ,రానీ !రానీ , రానీ
కానీ,కానీ !గానం ,ధ్యానం !హాసం ,లాస్యం !కానీ ,కానీ !కళా రవీ!పవీ!కవీ!
(నా చేత శ్రీ శ్రీ ఇదంతా రాయించాడు ..)
Categories: Middle

నిద్ర కరువయ్యింది

Sat, 05/01/2010 - 14:33

గత పదిరోజులనుండి మా ఇంట్లో వాళ్లకి కంటిమీద కునుకు వుండటం లేదు .దీనికంతటికి కారణం మా ఇంట్లోకి వచ్చిన కొత్త ప్రాణి .అది చేసే అల్లరి అంత ఇంత కాదు .వయస్సు చూస్తేనేమో నిండా మూడు వారాలు కూడా లేవు ఎన్నాళ్ళ నుంచో పాప గొడవ చేస్తున్న ఇంట్లో చూసేవాళ్ళు లేరు కష్టం అని వాయిదా వేస్తూ వచ్చాను అదీ కాక దానికి ఏదైనా అయితే తట్టుకునే శక్తి లేదని (మా చిన్నప్పటినుండి మాతో పాటు ఎన్నో పెరిగి కళ్ళ ముందు పోయాయి )నచ్చ చెప్పుకుంటూ వచ్చాను ..కాని అనుకోకుండా ఒక రోజు చెల్లి రెండిటిని వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందని తీసుకువచ్చి తానొకటి మాకు ఒకటి ఇచ్చింది.బుజ్జిది రోజులపిల్ల అల్లరి చేయదేమోననుకున్న ..హమ్మ మమ్మల్ని నిన్చోనియదు ,కూర్చోనీయదు మేము ,ఎక్కడుంటే అది అక్కడే ...హాల్లో ఒక మూల అమ్మగారికి పడక ఏర్పాటు చేసాను ..ఉహు ...నిద్రపోతున్నట్లే వుండి గంటకోసారి కుయ్యో కుయ్యోమని అరుపులు ..తీసుకొచ్చి గదిలో పడుకోబెట్టాలి ,దానికేమో మద్యలో చలివేసి మళ్లీ అరుపులు మనం అపుడు తీసికెళ్ళి హాల్లో పడుకోబెట్టి అది నిద్రపోయేవరకు ఉండి చప్పుడు చేయకుండా వచ్చి నిద్రపోవాలి ,మరల అరగంటలో దానికి మెలకువ మల్లిపోయి బుజ్జగించి మన గదిలోకి తెచ్చి నిద్రపుచ్చాలి కాసేపటికి దానికి చలి ....అట్టాతెల్లారిపోయి ఇంకేం నిద్రపోతాం అని అమ్మాయిని వరండ లోకి తీసుకొచ్చి ఆడుకుంటూ దాన్ని ఏమార్చి పోయి టి తయారుచేసుకోవాలి ....మన చీర కుచ్చిళ్లో ,పైటకొంగు తోనో అది నోట కరచిమనల్ని కవ్విస్తూ ఆడుతుంటే మనం చచ్చినట్టు ఒంతమ్మ బంగాలు వదులమ్మ అని ముద్దుగా బతిమాలుకోవాల్సిందే ..లేకపోతె మా అమ్మాయితో పడలేము తనతో పాటు సమానంగా చూడట్లేదు ..అది "కుక్క "ని చీప్గా చూస్తున్నారు అంటుంది ..వచ్చిన పది రోజుల్లోనే మా ముగ్గురి మనసు దోచేసింది .ఈ "బంగారాని కి" ఇంకా పేరు స్థిరపడలేదు ..ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పిలుస్తున్నాం ...
Categories: Middle

నా అభిరుచులు

Thu, 04/29/2010 - 13:02
తరుచు మనం అటు ఇటు తిరిగే క్యాంపు ల ఉద్యోగం కావడంతో ఆయ ఊర్లలో ప్రశస్తమైన పండ్లు ,పూలు అలాగే స్వీట్స్ ఏంటో కనుక్కుని నచ్చిన వాటిని తిరిగి వచ్చేప్పుడు తీసుకోస్తుంటాను..మరచిపోతానేమోనని ముందే ఎవరికైన చెప్తాను వెళ్ళేప్పుడు గుర్తుచేయమని .పూలు విషయం కి వస్తే విశాఖపట్నం లో "సింహాచల సంపెంగ "పూలు లేకుండా తిరుగు ప్రయాణం చేయాలంటే నా మనసొప్పదు .ఎక్కువగా రైల్వే స్టేషన్ లో దొరుకుతాయి ,బయట మార్కెట్ లోను దొరుకుతాయి .బోల్డన్ని గుత్తులు కొని తెచ్చుకుంటాను .తెలుపు పసుపు రంగుల్లో వుండే ఈ పూలు తరగని సువాసననిస్తాయి .సింహాచలం లో మొక్కలు కూడా అమ్ముతారు మనం మొక్క కూడా పెట్టాం కాని ఇంతవరకు పూయలేదు చెట్టు పెరగనే లేదు . మచిలీపట్టణం లో మంగినపూడి బీచ్ దారిలో అమ్మే మొగలిపోత్తుల కొరకు ఆరాటపడతాను . నెల్లూరు వెళ్ళినపుడు పినాకిని లో ప్రయాణం చేస్తే చెన్నయి నుండి తెచ్చి అమ్మే 'చెంబెలిపూలు 'తప్పకుండా కొంటాను ,అరటి నార తో మాలలు కట్టి అమ్ముతారు ..అలానే చెట్టు సంపెంగ పూలు తో పినాకిని పరిమళాలు వెదజల్లుతది,పెదవడ్లపూడి వచ్చేసరికి గంపలు గంపలు మల్లెలు విరజాజులు చేరతాయి ...ఇవన్ని పిచ్చపిచ్చగా కొనిస్తానని వేరేచేప్పక్కరలేదు . పండ్ల విషయానికి వస్తే ఏలూరులో దొరికే జామకాయ ఇంకెక్కడా దొరకదేమో అనిపిస్తుంది ,అక్కడి కాయలు తిని ఇంకెక్కడా తినాలన్పించదు.అలానే తేగలు నిడదవోలు ,చాగల్లు లోరుచి ఇంకోటి కనిపించదు.అలానే రేగుపళ్ళు గోదావరి జిల్లాలోనే బాగుంటాయి .సీతాఫలాలు తప్పకుండా రాజమండ్రి ,జంగారెడ్డిగూడెం నల్లజర్ల పరిసర ప్రాంతాల్లోనే బాగుంటాయి ,ఒక బుట్టడు మనతో ప్రయాణం చేయాల్సిందే .చక్కెరకేళి లు రావులపాలెం లో చాలా బాగుంటాయి ..మామిడిపళ్ళు మా జిల్లా లోనే కాకుండా ప్రకాశం జిల్లా లో 'ఉలవపాడు ' అనే ప్రాంతం కాయలు చాల స్వీట్ గా బాగుంటాయి,ఒంగోలు వెళ్ళినపుడు తోటకి పంపించి మరి తెచ్చుకుంటాను .సీసన్ అయ్యాక మార్కెట్ లో ఎక్కువ దొరికేయి ఉలవపాడు కాయలే .ఇక స్వీట్ విషయానికి వస్తే మచిలీపట్టణం వెళ్తే 'హల్వా ''లడ్డు ''తిరుగు ప్రయాణం లో ఉండాల్సిందే .చాల ప్రసిద్ది తాతారావు స్వీట్స్ అంటే .కాకినాడ వెళ్లి వచ్చేప్పుడు మన కూడా 'కోటయ్యకాజ", తాపేశ్వరం కాజాలు ,ఆత్రేయపురం పూతరేకులు వస్తాయి ..ఈ రోజు ఒంగోలు వెళ్లాను .ఆఫీసు పనికన్నా ముందు అల్లురయ్య మైసూర్ పాక్ కి ఆర్డర్ పంపాను .అక్కడ ఆర్డర్ చేస్తేనే మనకి దొరుకుతుంది .ఒంగోలులో చాల ప్రసిద్ధిగల స్వీట్ అది .పది యేళ్ళ క్రితం మొదటిసారి అరటిఆకులో నెయ్యోడ్తూ పొట్లం కట్టారు ,ఇప్పుడు మామూలు స్వీట్ డబ్బాలో పెడుతున్నారు ,కొంచెం క్వాలిటీ తగ్గిందనుకోవచ్చు ..ఇలా ఊరుకో స్వీట్ తెచ్చుకుని నేనే మొత్తం తింటాను అనుకుంటున్నారా !మా పాప నేను కొంచం మాత్రం తీసుకుని మా బందుమిత్రులకి తినిపిస్తాను :-)
Categories: Middle

మా ఇంట్లో సాయి సంకీర్తన

Fri, 04/23/2010 - 14:19



నేను అనుకున్న రీతిలో మూడున్నర గంటలు ప్రశాంతంగా సాయి సంకీర్తన జరిగింది .ఊహించిన దానికన్నా సాయిభక్తులు తరలివచ్చారు .సంకీర్తన నేర్పి మాకు సన్మార్గం చూపించిన ఆచార్య దేవులు శ్రీ పోనమల కోటేశ్వర రావు గారికి వందనాలు.దాదాపు పదిహేను సంవత్సరాలు నుండి వారే మా ఇంట సాయి సంకీర్తన చేసేవారు .చక్కని స్వరం వినే కొద్ది వినాలి అనిపిస్తుంది కొంచెం వృద్దాప్యం తో స్వరం లో కొంచెం బిగువు సడలింది .అయిన క్రొత్తవారు గుర్తించలేరు .ఈ రోజు పూజ మొత్తం నా కూతురి మీదే నడిచింది .బాబాని చక్కగా అలంకరించింది .ఇలా ........................................
Categories: Middle

కృతజ్ఞతలు

Thu, 04/22/2010 - 16:03
నాకు ఎవరైనా సహాయం చేయగానే వారికి తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను .ఆ సహాయాన్ని జీవితకాలం లో మరచిపోను ,వారి ఋణం తీర్చుకునే అవకాశం కోసం చూస్తాను .కొన్ని సమస్యలు ఎంత ప్రయత్నించిన పరిష్కారం కావు అటువంటి సమయం లో భగవంతుని పై భారం వేసి నువ్వే పరిష్కరించాలి అని అతి వినయంగా కోరుకుంటాను. వినయం అని ఎందుకు అన్నాను అంటే సమస్యలు వచ్చినపుడే 'దేవుడు'అనేవాడు మనకి గుర్తొస్తారు కాబట్టి .నిజానికి చిన్నప్పుడు నాకు భక్తి తక్కువే ,ఏదో పండుగాపబ్బాలకి అమ్మ ప్రక్కనే పూజ అయ్యేవరకి ఓపికగా కూర్చునేవాళ్ళం త్వరగా అయితే టిఫిన్ గట్రా తినేసేయ్యోచ్చని అన్నీ అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే .వినాయక చవితి రోజు మరీ విసుగోచ్చేసేది ,పుస్తకం లో పేజీలు లేక్కపెట్టేదాన్ని అమ్మ గమనించకుండా .అమ్మ పురాణాలు నీతి కథలు తీరిక వేళల్లో ముఖ్యంగా సెలవల్లో ,ఆదివారాల్లో మా ఆరుగురు పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని ఒకే పళ్ళెం లో అందరికి అన్నం కలిపి తినిపిస్తూ చెప్పేది .నాకు కొందరు దేవుళ్ళు గా మనసుకి అనిపించేవారు కాదు ...వారు మన చరిత్రలో రాజులు లేక ఒక తెగకి నాయకులు లా అనిపించేవారు ,అలా అని అమ్మ తో అంటే తప్పు అనకూడదు అనేది .ఏడెనిమిది తరగతులుకి వచ్చాక మిషనరీ స్కూల్స్ లో చేరడం హాస్టల్ లో ఉండటం తో అక్కడ తప్పనిసరిగా ఆదివారం ఉదయం ప్రేయర్ సర్విస్ వుండేది మానితే పనిష్మెంట్ వుండేది నిశభ్దంగా ఆ గంట గడిపేవాళ్ళం ఆ పూట బ్రేక్ ఫాస్ట్ ఏమి చేసి ఉంటారా అని .,అవకాశం వచ్చినప్పుడల్లా సిస్టర్స్ దేవుడి గురించి ,ఆ మదర్ గొప్పదనం గురించి చెప్పేవారు ,లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించే ఎక్కువ చెప్పేవారు ....ఇప్పుడు బాగుంటే చాలుగా పోయాక మనకి యెం తెలుస్తుంది ,అనుక్షణం చనిపోయాక వెళ్ళే స్వర్గం గురించి మనకి ఎందుకు వేదన అని అనుకునేదాన్ని ...ఇప్పుడుకూడా :-)తరువాత తరువాత పరీక్షలప్పుడు దేవుడు గుర్తు రావడం మరల కనుమరుగవడం నా టీన్స్ లో పరిపాటయ్యింది .కొన్ని సంవత్సరాలు అసలు దేవుడే లేడు అనుకుని నమస్కరించడం మానేసాను.సాటి మనిషికి హాని చేయకుండా ,దూషణ నెరపకుండాచేయగలిగిన సహాయం చేస్తూ, దయ కలిగి వుంటే చాలు మనకి తెలీని స్వర్గం నరకం గురించి ఆలోచించడం అనవసరం అనుకున్నాను కొన్ని విపత్కర పరిస్థితుల్లో మనస్సును ప్రశాంతత వైపు మళ్ళించడానికి 'భావాతీతధ్యానం 'వైపు దృష్టి సారించాను.గురువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాను .నా ఆలోచన పరిధి విస్తారమయ్యింది(బహుశ వయస్సు కారణం కావచ్చు )మనకి తెలియని ఒక అధ్బుతమైన శక్తి ఒకటి మనల్ని నడిపిస్తుంది అని నమ్మకం ఏర్పడింది ,ఆ శక్తి కి ఎవరికి తోచిన విధం గా ఆ పేరుతో పిలుస్తారు కాబోలు అనుకుంటాను .ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి సమాధానాలు దొరికిన పుస్తకాల్లో వెదుక్కుంటాను తరుచు మా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళ సంభాషణలో దొరుకుతుంటాయి నాకు కావలసిన శక్తి ,ధైర్యము కోసం ఆ భగవంతుని అడుగుతుంటాను గురువు సహాయం తో ....నాకు నిరంతరం తోడుగా అన్ని వేళలునన్ను హెచ్చరించి మానవత్వం నాలో నశించకుండా కాపాడే దైవ సమానుడు "శ్రీ సాయి"ఎంతటి జటిల సమస్య వచ్చిన వివేకం తో మెలిగి ఆ సమస్యను తొలగిపోయేలా చేసుకొనడానికి నాకు ఎంతగానో సహాయపడుతుంటారు .రెండేళ్ళ క్రితం నన్ను చుట్టుముట్టిన సమస్య విడిపోయి మనస్సుకి ప్రశాంతత చేకూరింది .నన్ను నడిపిన గురువుకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ రోజు సాయంత్రం ఇంట్లో అయిదు నుండి ఎనిమిదిన్నర వరకి సాయి సంకీర్తన ఏర్పాటు చేసాను .సాయి ని అనుసరించేవారంతా ఆహ్వానితులే ....అనంతరం ఫలహారం కూడా .....................
Categories: Middle

ఒక్క నిమిషం

Wed, 04/21/2010 - 06:14
దాదాపు అన్ని స్కూళ్ళ లోను కాలేజిలలోను ఫైనల్ పరీక్షలు అయ్యిపోయి వేసవి సెలవలు మొదలయ్యాయి .పదవతరగతి రాసిన పిల్లల విషయంలో ఇప్పటికే తల్లిదండ్రులు అప్పోసప్పో చేసేసి ఏదొక కార్పోరేట్ కాలేజి లో సీట్ రిజర్వ్ చేసేసుకుని వుంటారు .ఆ పిల్ల భవిష్యత్తు దాదాపు స్కెచ్ వేసినట్లే రెండేళ్ళు రెసిడెన్స్ కాలేజి ఆనక "ఎంసెట్"లాంగో షార్ట్ టేర్మో..తరువాత ఇంజినీర్ ,డాక్టర్ ..ఆ తరువాత "డాలర్ ".......గ్రామాల్లోను ,పట్టణాల్లోను ఇదే బాట .ముఖ్యంగా మా కోస్తా వారి ప్లాన్ ఈ విధం గానే వుంటుంది .పిల్లల కి చదువు చెప్పించడం సామాన్యులకి తలకి మించిన బరువుగానే తోస్తుంది ,అయిన వున్నా కుంటా ,సెంటు తెగనమ్మి పిల్లలికి చదువు చెప్పిస్తు కార్పోరేట్ కాలేజీలను కుభేరుల్ని చేస్తున్నారు స్థోమత వున్నవారు ఏవిదం గా చేసిన పెద్ద నష్టపోయేది ఏముండదు ,ఎటొచ్చి లేని వారి పరిస్థితే ఆలోచించాలి .దాదాపు గ్రామాల్లోనే 70 % నివసిస్తున్నారు చాలావరకు వ్యవసాయం ,కూలిపనులు చేసేవారే ఎక్కువ ,వారంతా గ్రామం లో వున్నా ప్రభుత్వ బడిలో తమ పిల్లల్ని చదివిస్తూ ఆ పైన చదివించలేక ఎటువంటి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందో తగిన సమాచారం లేక ఆ ఊరి పెద్దో ,మోతుభారి రైతో ,లేక అక్కడి ఉపాధ్యాయుని సలహా చేత తమని మించిన బరువైన ఇంజినీరో ,డాక్టరీ నో చదివించాలని తము తిని తినక పిల్లల్ని పట్టణాల్లో రెసిడెన్సీ కాలేజీల్లో చేర్పిస్తున్నారు .పిల్లలు చదివి ఉద్యోగాలు తెచ్చుకుని వాళ్ళు సెటిల్ అయ్యి పెద్దవారిని మంచి చెడు చూసుకునే సమయానికి వారు తలకి మించిన అప్పులతో ఆరోగ్యం క్షీణించి వృద్దాప్యం తో ఒంటరిగాకాలం వెళ్ళబుచ్చడం జరుగుతుంది .పైన పేర్కొన్న చదువులే కాక ఎన్నో రకాల వృత్తివిద్యలు వున్నట్లు బహు కొద్దిమందికి మాత్రమె తెలుసు .పదవతరగతి పూర్తి కాగానే ఒకటి లేక రెండు సంవత్సరాల సర్టిఫికట్ కోర్సు చేయగానేవెంటనే ఉపాధి లభిస్తుంది దానిని ఆధారం చేసుకుని ఆ పై డిప్లోమ ,ఇంజినీరింగు డిగ్రీ చేయడానికి ఎంతో అవకాశం వుంది .దాదాపు ఇటువంటి వృత్తి విద్యలు 65trades మన రాష్ట్రం లోనే పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో లభిస్తున్నాయి .అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే డిప్లోమ కోర్సుల తో త్వరితగతిన ఉపాధి పొందవచ్చును తన కుటుంబం కి ఆసరాగా నిలబడుతూనే పై చదువులు చదవను వచ్చు.ఇవే కాక పారామెడికల్ కోర్సులు చేసి వెంటనే ఉపాధి పొందవచ్చును .పదవతరగతి ,ఇంటర్ చదివిన తరువాత పై చదువులు గాని ,ఏదైనా ఉపాధి సంభందిత సమాచారం పొందాలంటే మీ జిల్లా లోని ఉపాధి కార్యాలయం లో ఉన్నటువంటి ఒకేషనల్ గైడెన్స్అధికారిని సంప్రదించినట్లయితే తగిన సమాచారము ,సలహాను పొందవచ్చును .అభ్యర్ధి అభిరుచి సాంఘిక స్థోమత బట్టి అభ్యర్దికి లభించే అవకాశాలు ,స్కాలర్షిప్పులు,మార్గదర్శకాలు పొందవచ్చును .తగిన సమాచారం కోసం ఈ క్రింద పేర్కొన్న వెబ్ సైట్ చూడవచ్చును .http://www.det.ap.gov.in
పైన రాసిన సమాచారం చదివిన ఏ ఒక్కరైన (ముఖ్యం గా ఉపాద్యాయులు ) తమకి తెలిసిన పిల్లలకి తెలిపినచో వారి జీవితానికి ఎంతోకొంత సహాయపడినవారు అవ్వుతారు .మనం వెచ్చించే అర నిమిషం చాలు చిన్ని సలహా జీవితాన్నే ఉన్నత స్థితికి మార్చొచ్చు .
Categories: Middle