http://gollapudimaruthirao.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
Updated: 17 min 16 sec ago

సహజీవనం

Sat, 09/04/2010 - 16:45
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకి ఒక క్రిమినల్ కేసులో శిక్షవేసింది న్యాయస్థానం. పార్టీ వర్గాలు శివమెత్తారు. ఊళ్ళనిఅల్లకల్లోలం చేశారు. 2000 ఫిబ్రవరి 2 వ తేదీన ధర్మపురిలో కొందరు నాయక భక్తులు - కోయంబత్తూరు వ్యవసాయవిశ్వవిద్యాలయం బస్సుకి నిప్పంటించారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు - 44 మంది ఉన్నారు. కాలుతున్న మంటల్లోంచిబయటపడలేక ముగ్గురమ్మాయిలు - కోకిలావని, గాయత్రి, హేమలత అక్కడికక్కడే కాలి బూడిదయిపోయారు. ఇందుకుకారణమయిన ముగ్గురు స్వామి భక్తులు నెడుం చెళియన్, రవీంద్రన్, మునియప్పన్ అరెస్టయారు. విచారణలు జరిగాక - సేలంకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ అన్ని కోర్టులూ వీరికి మరణ శిక్షను ఏకగ్రీవంగా అంగీకరించాయి. మొన్ననే సుప్రీం కోర్టు ఈ శిక్షనుఖరారు చేసింది - పదేళ్ళ తర్వాత.
పూర్తిగా చదవండి

Categories: Middle

బూతు క్రీడ

Sun, 08/29/2010 - 01:29
మొదట 'కండోం'కి అర్ధం తెలుగు పాఠకులకు చెప్పాలి. గర్భ నిరోధానికి, సెక్స్ వ్యాధులు రాకుండా జాగ్రత్తపడడానికి ఉపయోగించే రబ్బరు తొడుగు. ఇంతకంటే వీధిన పడడం నాకిష్టం లేదు.పూర్తిగా చదవండి
Categories: Middle

గురి తప్పిన నిరసన

Sun, 08/22/2010 - 02:27
నిన్నకాక మొన్న - స్వాతంత్రదినోత్సవం నాడు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద ఒక మాజీ పోలీసు ఉద్యోగి బూటువిసిరాడు. అంది కొన్ని అడుగుల దూరంలో తప్పిపోయింది. ఇతను ఉద్యోగంలోంచి ఏవో కారణాలకి బర్త్ రఫ్ అయాడు. పాకిస్తాన్ వరదల్లో అల్లాడుతూంటే బ్రిటన్ లో పర్యటిస్తున్నందుకు నిరసనగా లండన్ లో ఒక పాకిస్థానీ తమ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీగారిమీద బూటు విసిరాడు. అదీ గురితప్పిందిపూర్తిగా చదవండి..
Categories: Middle

మంచితనం కూడా అంటువ్యాధే

Sat, 08/14/2010 - 22:30
పధ్నాలుగు సంవత్సరాలుగా మా అబ్బాయి స్మారకార్ధం జాతీయ బహుమతి కార్యక్రమాలు జరుపుతున్నా - ఏనాడూ నేను కాలం రాయలేదు. రాయవలసిన అవసరం లేదని నేను భావించాను. కన్నీళ్ళలోంచి ఓదార్పుని వెదుక్కోవడం - నా దురదృష్టం నాకిచ్చిన విముక్తి. అది నా వ్యక్తిగతం. అయితే నిన్న నాకు ఒకాయన ఉత్తరం రాశాడు. ఆయన మొన్న జరిగిన 13వ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ బహుమతి ఉత్సవానికి హాజరయాడు. ఆయనెవరో నాకు తెలీదు. ఆయన్ని నేనెప్పుడూ కలుసుకోలేదు. నిన్నకూడా కలుసుకోలేదు.పూర్తిగా చదవండి
Categories: Middle

Gollapudi Srinivas Memorial Film Award Function

Fri, 08/13/2010 - 11:52

Categories: Middle

నా మాట

Wed, 08/11/2010 - 01:32



నా పేరు శ్రీనివాస్ గొల్లపూడి

మిమ్మలనలరించాలీ

ఆడీ పాడీ..,

మీ నవ్వులు మీ గుబులూ

తెరపైన చూపించే

డైరెక్టరునవ్వాలని..

నే..కోరుకున్నా!

´´´

మొదలెట్టానొక చిత్రం

'ప్రేమ'ను కావ్యంగ ఎంచి

కొన్ని పుటలు లిఖించాక

ఆపదొచ్చెనను వరించి

'మృత్యు 'వన్న పక్షి ఒకటి

నా మీదే వాలిందీ

అలలలోన ముంచివేసి

నా ప్రాణంగైకొందీ

చెమరించని కళ్ళులేవు

దుఃఖించని గుండెలేదు

'అయ్యో ' అని విలపించని

బంధుమితృలొకరు లేరు

ఎగసి పడే సంద్రంలో

నడీ మధ్యన నావలాగ

నా కావ్యం మిగిలింది

నన్ను చూసి నవ్వింది

´´´

అది చూసినవాళ్ళు

గుండె పగిలి ఏడ్చారు

ఇలా ఇలా ఈ కావ్యం

మిగలకూడదన్నారు.!

´´´

వందనాలు ఓ నాన్నా

తోడు నీవు నిలిచావూ

నేను 'వదిలి ' వచ్చిన పని

నీవు పూర్తిచేశావూ..!

గుండెముక్కలౌతున్నా

మెగాఫోను పట్టావూ

నేను కన్న 'తీపికలను '

కావ్యంగా మలిచావు..!

´´´

నేను 'పొంద 'లేనిదాన్ని

ఇతరులు అయినా పొందే

అవకాశం ఇవ్వాలని

ప్రతిన ఒకటి పూనావూ!.

నాలాగే సరికొత్తగ

చలన 'చిత్ర 'లోకంలో

తమ 'ప్రజ్న 'ను చూపుకుంటె

అదే చాలునన్నావు!

´´´

నా పేరిట.. నా గుర్తుగ

'పురస్కార ' మొకటి చేయ

సంకల్పము చేశావూ

తగిన 'వనరు 'లిచ్చావు!

దిగులు..గుబులు ఇంకేలా

'నా ' కోరిక తీరగా

వత్సరానికొక రోజున

నేను 'మిమ్ము 'కలువగా!

ఇసుక మేడ కూలినచో

బాధపడుట దండగ

కలల అలల ఊయలలో

'ఆత్మ' తేలుచుండగా!

´´´

వత్సరానికొకరోజున

మరలా ప్రభవించనా

'ప్రతిభ ' చూపు 'దర్శ'కులను

ఆకసానికెత్తనా!

´´´

నేనున్నా లేకున్నా

నా వారలు ఉన్నారు!

మీ శ్వాసలో ...మీ గెలుపులో

నన్ను 'చూసు'కుంటారు!

´´´

ఇరుకు ఇరుకు శరీరాన

'నాడు ' నేను బ్రతికున్నా..

విశ్వవ్యాప్తమై 'నేడు'

మీలో జీవిస్తున్నా!

సెలవా మరి ఇక ఉంటా

మరోసారి కలుస్తా

మిమ్మలనలరించేలా

'మరో 'కలని నే తెస్తా...!

ఇట్లు

మీ శ్రీనివాస్ గొల్లపూడి

విన్నది

భువన చంద్ర

Categories: Middle

తాళం చెవుల కథ

Sun, 08/08/2010 - 16:19

దేశంలో ప్రజాభిప్రాయం రెండుగా చీలిపోయిన అతి విచిత్రమైన సంకట పరిస్థితి గతవారమే తలెత్తింది. స్థూలంగా చెప్పుకుందాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మరో నలభై రోజుల్లో కామన్వెల్తు క్రీడలు జరగనున్నాయి. ఇందుకుగాను రకరకాలయిన కార్యక్రమాలకి 65 వేల కోట్లు ఖర్చవుతున్నాయి. ఇందులో సూటిగా క్రీడల కయ్యే ఖర్చు కొంత, క్రీడలు కారణంగా రోడ్లు, నగరం, వసతుల ఏర్పాట్ల ఖర్చులు కొన్ని. క్రీడలు కారణంగా ఇవన్నీ మెరుగవుతాయి. కనుక కొంత ఖర్చు - 'వీరయ్య పెళ్ళిలో పేరయ్యకి జందెం పోచ' సామెతగా కలిసి వస్తుంది.
పూర్తిగా చదవండి


Categories: Middle

చట్టం బలవంతుడి తొత్తు

Sun, 08/01/2010 - 14:53
చాలా సంవత్సరాల క్రితం ఇండియా పాకిస్థాన్ ల మధ్య యుద్ధం ముగిసాక దూరదర్శన్ లో ప్రతి ఆదివారం అద్భుతమయిన సీరీస్ ని ప్రసారం చేశారు. యుద్ధంలో మరణించిన జవాన్ల కథలు. ప్రతీవారం అంత గొప్ప యువత దేశం కోసం ప్రాణాలర్పించినందుకు గర్వపడి, అంత గొప్ప బిడ్డని పోగొట్టుకున్నందుకు ఆ కుటుంబంతో కంటతడి పెట్టుకోని వారం ఉండేది కాదు. దూరదర్శన్ చరిత్రలో ప్రసారం చేసిన గొప్ప సిరీస్ లో అవి ఒకటి.పూర్తిగా చదవండి
Categories: Middle

13th- Gollapudi Srinivas National Award Function

Sat, 07/31/2010 - 01:12



Categories: Middle

వెన్నెల కాటేసింది

Tue, 07/27/2010 - 23:33
నలభై సంవత్సరాల క్రిందట నేను వ్రాసిన నవల ఇది. క్రిందటి సంవత్సరం 'కౌముది ' లో సీరియల్ గా వచ్చినప్పుడు ఈ తరం పాఠకులనుంచి వచ్చిన స్పందన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇందుక్కారణం సున్నితమైన మానవ సంబంధాలకున్న బలం.. అని నాకనిపించింది. బ్లాగు మిత్రులకి కూడా దీన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ పోస్టు వ్రాస్తున్నాను.
ఈ నవల వెనుక నున్న చిన్న నేపథ్యం గురించి ఒక్క సారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ..ఇందులోని సుబ్బులు పాత్రకి మాత్రుక - నా పధ్నలుగో యేట నా ఆలోచనల్లో దొరికింది. మేము అద్దెకుండే ఇంట్లో ఒక వాటాలో ఉండే వారింటికి ఓ అమ్మాయి వచ్చింది. నా వయస్సేనేమో. ప్రేమా దోమా తెలీని దశ అది. ఒక వేళ మనస్సులో ఏదో ఆకర్షణ ఉన్నా - దానికి ఇతమిథమైన రూపం లేదు. తీరా ఆమె కొన్నాళ్ళుండి వెళ్ళిపోయాక ఓ పద్యం రాసుకున్నాను
పోయితివి నీవు నను వీడిపోయి ఎటకో
యేను నీ పదఛాయల వేగలేక
వేడి నిట్టూర్పు కెరటాల నీడలందు
జీర్ణమయిపోవు దుఃఖంపు జీరనైతి..
మరో పదేళ్ళకి సుబ్బులు ప్రాణం పోసుకుని నా నవలలో పాత్రయింది.
మీరూ చదవండి..!
Categories: Middle

కోమాలో మన దేశం

Sun, 07/25/2010 - 14:47
కొన్ని రోజుల కిందట భారత పరిశ్రమ సమాఖ్య యూరోపు విభాగపు డైరెక్టర్ మోహన మూర్తి అనే ఆయన జర్మనీలో ఒక చర్చ కార్యక్రమంలో పాల్గోన్నారట. ఆ చర్చలో పాల్గొన్న వారంతా ఈ మూర్తి గారిని చూసి "ఏం బాబూ! మీ దేశం కోమాలో ఉందా? కళ్ళు తెరుస్తోందా ?" అని వెక్కిరించి ముక్కుమీద వేలేసుకున్నారట. వాళ్లు చెప్పే వివరణలు వింటూ ఈయన తెల్ల మొహం వేసారట. మూర్తి గారికి సరైన అనుచరులు లేరు. నన్ను తీసుకెళ్ళి వుంటే - యూరోపు ప్రముఖుల కళ్ళు తెరిపించే లాగ - మనవాళ్ళు "కళ్ళు" తెరుచుకునే ఉన్నారని చెప్పి ఒప్పించేవాడిని.
పూర్తిగా చదవండి
Categories: Middle

మతం..హితం..

Sat, 07/17/2010 - 15:59
ఆ మధ్య పూణే వెళ్ళాను. అక్కడొక వింత దృశ్యం నన్నాకర్షించింది. నిజానికి ఎవరినయినా ఆకర్షించేదృశ్యమది. స్కూటర్ల మీద తిరిగే అమ్మాయిలందరూ కళ్ళుమాత్రం కనిపించేలాగ ముఖమ్మతా గుడ్డల్ని చుట్టుకుని ఉన్నారు. సరే. ఆరోగ్య సూత్రాల ప్రకారం బొగ్గుపులుసు వాయువుని పీలుస్తున్నారనుకుందాం. కళ్ళు మాత్రమే కనిపించే ఈ ముసుగు దేనికి? రోడ్డు మీద దుమ్ము దూసర వారు ముక్కుపుటాల్లోకి వెళ్ళకుండా ఈ జాగ్రత్తట. ఇది చాలా విడ్డూరమైన దృశ్యం. మా మిత్రుడిని అడిగాను. ఆయన నవ్వి కొన్నాళ్ళ క్రితం ఇదే అనుమానం కొత్తగా వచ్చిన నగర కమీషనర్ సత్యపాల్ సింగ్ గారికి వచ్చిందట. ఆయన ఏదో సభలో 'టెర్రరిస్టుల్లాగ ' అమ్మాయిల ముఖాలకి ఈ ముసుగులేమిటి?" అన్నారట. అంతే. ముసుగుమాట వదిలేసి 'టెర్రరిస్ట్ ' అనే మాటని ఆడపిల్లలు పట్టుకున్నారట. "మమ్మల్ని టెర్రరిస్టులంటారా? " అని రెచ్చిపోయారట.పూర్తిగా చదవండి..
Categories: Middle

మొదటి వసంతం పూర్తిచేసుకున్న 'మారుతీయం '

Fri, 07/16/2010 - 21:35
ఈ బ్లాగ్ ప్రాంభమయి సంవత్సరమయిందని నా మిత్రులు కిరణ్ ప్రభగారు గుర్తుచేశారు. అసలు ఈ బ్లాగ్ ని వారింట్లోనే (కాలిఫోర్నియాలో) ఆయనే డిజైన్ చేసి ప్రారంభించారు. దాదాపు 40 ఏళ్ళ కిందట పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు ఆంధ్రజ్యోతిలో కాలం రాయమన్నప్పుడు భయపడ్డాను. కారణం - అప్పుడు తలమునకలుగా సినిమాల్లో నటిస్తూండడం. కొంతకాలం తర్వాత నండూరి రామమోహన రావుగారు వత్తిడి చేసి, పురాణం మద్దతుని సంపాదించి నన్ను దినపత్రికలో రాసేటట్టు చేశారు. క్రమంగా ఆ రుచి మరిగి ఇప్పటిదాకా ఆ పనిని నిరంతరాయంగా చేస్తూ వస్తున్నాను. పుట్టిన మనిషికి ఊపిరి పీల్చడం లాగ - ఆలోచించే మనిషికి తన ఆలోచనల్ని చెప్పుకునే వేదిక 'ఊపిరి'లాంటిది. అయితే ఈ బ్లాగ్ వ్యవహారం నాకు లొంగుతుందా అని భయపడ్డాను. ఆ పనీ తానే చేస్తానన్నారు. మరొక ముఖ్యమయిన సందేహం - కొన్ని బ్లాగులు చూసినప్పుడు ఊసుపోని వ్యవహారంగా - అనవసరంగా, అర్ధంలేని కబుర్లతో కాలక్షేపంగా కనిపించింది. అది నా వంటికి పడని విషయం. కాగా అంత తీరికా, అలాంటి అభిరుచీ బొత్తిగా లేనివాడిని. కనుక - ఈ బ్లాగులో కనిపించే విషయాల్ని 'ఫిల్టర్ ' చేసే బాధ్యతా ఆయనే తీసుకున్నారు. ఇప్పుడు - సంవత్సరం తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు - అలాంటి ఊకదంపుడికి తొలిరోజుల్లో ప్రయత్నాలు జరిగి, కయ్యానికి కాలుదువ్వే పనులు కొందరు చేసినా - వాటిని ఇక్కడ మినహాయించడాన్ని గమనించి మానుకోవడమో, తప్పుకోవడమో చేశారు. అది ఆరోగ్యకరమైన పరిణామం. ఈ సంవత్సరం పొడుగునా ఈ బ్లాగు చదివేవారికి - నిజమైన, సహేతుకమైన, సలక్షణమైన సందేహాలో, విమర్శలో చేసినప్పుడు నా స్పందనని గమనించే ఉంటారు.
ఈ వార్షికోత్సవంలో నాతో నా ఆలోచనలు పంచుకునే సహృదయులందరికీ - ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని పాటిస్తున్నందుకు నా అభినందనలు, కృతజ్నతలు. అంతకు మించి - ఈ బ్లాగు వెర్రితలలు వేస్తోందనిపిస్తే ఎప్పుడో తప్పుకునేవాడిని.
కొత్త ఆలోచన వచ్చినప్పుడు, కొత్తగా వేదన కలిగినప్పుడు, ఓ ప్రాణ మిత్రుడు శెలవు తీసుకున్నప్పుడు ఓ అన్యాయం సమాజానికి జరిగిందని బాధ కలిగినప్పుడు - వెతుక్కునే స్నేహితుని ప్రతిస్పందనే ఈ బ్లాగు పరమార్ధమని నేను నమ్ముతాను. ఈ సంవత్సరం పాటూ నాతో అలాంటి ఆలోచనలనే పంచుకున్న మీ అందరికీ నా అభినందనలు. కృతజ్నతలు. మనిషి ఏకాంతంలో ఆలోచించినా తన చుట్టూ ఉన్న సమాజంలోనే, సమాజంతోనే స్పందిస్తాడు ఆ గుండె చప్పుళ్ళకు 'మారుతీయం' వేదిక కావాలని నా ఆశ. ఈ ఆశతోనే మరో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదాం.
Categories: Middle

అయ్యో!ఆహా..!

Sun, 07/11/2010 - 11:32
ఈ మధ్య చాలా చోట్ల చాలా రకాలయిన హత్యలు జరిగిపోతున్నాయి. వాటి గురించి వింటేనే గుండె బరువెక్కి వేదన కలుగుతుంది.మొన్నటికి మొన్న అజాద్ మరణం గురించి పేపర్లో చూశాం. అలాగే హేమచంద్ర అనే పాత్రికేయుడి మరణం. వారి తల్లిదండ్రులు,సమీప బంధువులు, స్నేహితులూ కార్చిన కన్నీరు, వారికి జరిగిన దుర్ఘటన, నిండు ప్రాణాలు బలయిపోయిన దైన్యత - ఇవన్నీఆయా పత్రికల పుణ్యమాంటూ తెలిశాయి. ఎన్నో వ్యాసాలు ఉదారంగా రాశారు. అవన్నీ జరిగిన దుర్ఘటన, జరగకూడని అన్యాయాన్నివివరించాయి. పత్రికలు వారి తల్లిదండ్రులు, సానుభూతిపరులు ఫోటోలను చక్కగా ప్రచురించారు. ఇవన్నీ వారికి నిజమైన నివాళి.మనకూ బాధకలిగించిన సందర్భమది.పూర్తిగా చదవండి..

Categories: Middle

లయ

Sun, 07/04/2010 - 15:34
ఇవాళ్టితో వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్ షిప్పు పోటీలు ముగుస్తాయి. గత రెండు మూడు సంవత్సరాలుగా - ఈ టెన్నిస్ పోటీలుచూడడానికి టీవీకి అతుక్కు పోవడానికి మరో ముఖ్యమయిన కారణం ఉంది.అది "రోలెక్స్" వాచీ ప్రకటన స్పాట్. (ఇప్పటిది కాదుఇంతకుముందు చేసింది ఇప్పుడు వేస్తున్నారు) అది అద్బుతం. ప్రపంచ స్థాయి ఆటగాడు రోజర్ ఫెడరర్ ని అంతే ప్రపంచ స్థాయికెమెరామన్, దర్శకుడు - ప్రపంచ స్థానంలోనే 30 సెకన్ల చిత్రాన్ని నిర్మించాడు. ఇంత కంటే వివరించడానికి నాకు మాటలు చాలవు.మీరు చూడాలి . వెలుగు నీడల్లో ఫెడరర్ బంతిని కొట్టే భంగిమలు ప్రయత్నించినా నిర్ణయించగలిగేవికావు. ఒక మహా 'కళాకారుడు ' (గమనిచండి - ఆటగాడు అనడంలేదు) ఒక తన్మయ దశలో అలవోకగా చేయగలిగేవి. ఆ శరీరం కదలికలో సంగీతం పలుకుతుంది.ఆ సంగీతాన్ని - వెలుగునీడల సమ్మేళనంగా - స్పాట్లో ఆఖరి ఫేడవుట్లో బంధించారు - అద్బుతం.పూర్తిగా చదవండి

Categories: Middle

పేదరికం పెట్టుబడి

Sun, 06/27/2010 - 13:47
ప్రతి మంగళవారం మా పెద్దబ్బాయి వడపళనిలో కుమారస్వామి గుడికి వెళుతుంటాడు. ఆ గుడి ముందు ఓ 65 సంవత్సరాల ముసిలావిడ బిచ్చమెత్తుకుంటుంటుంది. నాకోసారి ఆమెని చూపించాడు. ఆమెకి ఓ వసతిని కలిపించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఆమెకి కావలసిన చీరలు కొనిపెట్టాడు.
పూర్తిగా చదవండి
Categories: Middle

ప్రపంచ సమరం

Sun, 06/20/2010 - 15:45
1994 జులై 2. ప్రపంచ బంతి ఆట పోటీలలో కొలబియా ఆటగాడు ఆంద్రీ ఎస్కాబార్ తన దేశం తరపున ఆడుతూ, ఆటలో పొరపాటున తన దేశానికే గోల్ చేసుకున్నాడు. ఆట మీద కొన్ని కోట్ల పందాలు నడిచాయి. ఊహించని నష్టాలతో లోపయకారీ వ్యాపారులంతా ఉక్కిరిబిక్కిరయారు. హాంబర్ట్ కాస్త్రో మురోజ్ అనే అభిమాని - దక్షిణ అమెరికా రన్నింగ్ కామెంటరీ చెప్పేవాళ్ళు అరిచినట్టు 'గో....ల్’ అని అరుస్తూ పన్నెండు బులెట్లు ఎస్కాబార్ మీద పేల్చాడు. ప్రపంచం షాక్ అయిపోయింది. లక్షా ఇరవై వేలమంది అతని అంత్యక్రియలకి హాజరయారు. కొలంబియాలో ఎస్కాబార్ శిలావిగ్రహాన్ని ప్రతిష్టించారు.
పూర్తిగా చదవండి
Categories: Middle

డెబ్బై చేపల కథ

Sun, 06/13/2010 - 05:03
హారీ పోటర్ కథలతో పెరిగిన ఈ తరంవారికి (తండ్రుల విషయంకూడా నాకు అనుమానమే) - బహుశా వాళ్ళ తాతలు చెప్పిన 'ఏడు చేపల' కథా తెలియదు. ఆ రోజుల్లో ప్రతీ అమ్మమ్మా ప్రతీ మనుమడికీ ఇలాంటి కథలూ, ముఖ్యంగా ఈ కథ చెప్పేది. తుంటిమీద కొడితే పళ్ళు రాళుతాయి - అన్న సామెతకి దగ్గరగా ఉన్న కథ ఏడుచేపక కథ అని ఇప్పటి వారికి అర్ధమయితే నా పబ్బం గడుస్తుంది.
పూర్తిగా చదవండి
Categories: Middle

అపకీర్తి 'కీర్తి '

Sat, 06/05/2010 - 20:59
ఈ ప్రపంచంలో అపకీర్తికి దక్కే కీర్తి అనన్య సామాన్యం. అప్రతిహతం. అనితర సాధ్యం. అపూర్వం. అది కాలధర్మం. నేటి లోక ధర్మం. ప్రస్థుతం నడుస్తున్న సమాజ ధర్మం. ఈ నిజాన్ని సమర్ధించడానికి నా దగ్గర బోలెడన్ని సాక్ష్యాలున్నాయి.
పూర్తిగా చదవండి
Categories: Middle

నేనెరిగిన వేటూరి

Sun, 05/30/2010 - 13:38
1988 లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం సి.నారాయణరెడ్డిగారికిచ్చారు. ఆ నాటి సభలో నేను ప్రధాన వక్తని. ఎందరో పముఖులు హాజరయిన సభ. మిత్రులు సినారె గురించి మాట్లాడుతూ ఒక పాట రచనని సమగ్రంగా విశ్లేషించాను. ఆ పాట: "చేరేదెటకో తెలిసి, చేరువకాలేమని తెలిసి, చెరిసగమౌతున్నామెందుకో తెలిసి, తెలిసి" 'ప్రేమబంధం' పతాక సన్నివేశంలో ఆఖరి పాట. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు.
పూర్తిగా చదవండి
Categories: Middle