http://geetalu.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
ఇప్పుడు 1000 పైగా మేలి ముత్యాలు ఇక్కడ లభ్యం
Updated: 54 min 48 sec ago

ఐతే

Thu, 06/10/2010 - 20:30
తారాగణం: మోహిత్, శశాంక్, అభిషేక్, జనార్ధన్, సింధు తులాని
గాత్రం: కీరవాణి
సంగీతం: కళ్యాణి మాలిక్
దర్శకత్వం: ఏలేటి చంద్రశేఖర్
నిర్మాత: గుణ్ణం గంగరాజు, వెంకట్ డేగా
సంస్థ: జస్ట్ ఎల్లో
విడుదల: 2003





పల్లవి:

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎపుడూ ఓ వానా నువ్వొస్తానంటే

నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలీబాబా మనకే ఉంటే
అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లావుద్దీన్ జీనీ ఉంటే
చూపదా మరి ఆ మాయా దీపం మన ఫేటే ఫ్లైట్ అయ్యే రన్‌వే

చరణం1:

నడి రాత్రే వస్తావే స్వప్నమా
పగలంతా ఏం చేస్తావ్ మిత్రమా ఆ ఆ ఆ
ఉరికినె ఉరిస్తే న్యాయమా
సరదాగ నిజమైతే నష్టమా
మోనాలిసా మొహమ్మీదే
నిలుస్తావా ఓ చిరునవ్వా ఇలా రావా

చరణం2:


వేకువనే మురిపించే ఆశలు
వెనువెంటనే అంతా నిట్టూర్పులూ
లోకంలో లేవా ఏ రంగులు
నలుపొకటే చూపాలా కన్నులూ
ఇలాగేనా ప్రతీ రోజూ
ఎలాగైనా ఏదో రోజు మనదై రాదా

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

పులి బెబ్బులి

Tue, 06/08/2010 - 20:30
తారాగణం:కృష్ణంరాజు,చిరంజీవి,జయప్రద
గాత్రం:బాలు,సుశీల
సంగీతం: రాజన్ నాగేంద్ర
దర్శకత్వం :కె.యస్.ఆర్.దాస్
విడుదల:(1983)




పల్లవి:

పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
మౌనమే గానమై మాధుమాస వేళలో
మౌనమే గానమై మాధుమాస వేళలో
ఆ ఆ ఆ పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
మౌనమే గానమై మాధుమాస వేళలో
మౌనమే గానమై మాధుమాస వేళలో
ఆ ఆ ఆ పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది

చరణం1:

నవ్వగనె నవయవ్వనమె పువ్వులు రువ్విందిలే
తానే విరితేనై తానాలు ఆడిందిలే
నిన్ను గని ఎద కోయిలగ రాగాలు తీసిందిలే
నాలో ఎలమావి ఉయ్యాలలూగిందిలే
చెలిమికిదే చైత్రమనీ నా ఆశ పూసింది అందాల బృందావిహారాలలో
పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది

చరణం2:

అందమిదే మకరందమిదే నా జీవితానందమే
నాలో కెరటాలై ఉప్పొంగి పోయిందిలే
బంధమిదే సుమగంధమిదే ఏ జన్మ సంబంధమో
నాలో విరితావి వెద జల్లిపోయిందిలే
జాబిలిగా వెన్నెలగా ఈ జంట కలిసింది కార్తీక పూర్ణిండు మాసాలలో ఆ ఆ ఆ ఆ

పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
మౌనమే గానమై మాధుమాస వేళలో
మౌనమే గానమై మాధుమాస వేళలో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

ప్రేయసీ నన్ను ప్రేమించు

Sun, 06/06/2010 - 20:30
తారాగణం: ప్రభుదేవా,శరత్‌కుమార్,జయాశీల్,ఐశ్వర్య
గాయకులు: ఉన్నిమీనన్
సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్
దర్శకత్వం: ఎళిల్
నిర్మాణ సంస్థ : రోజా కంబైన్స్
విడుదల : 2000



పల్లవి:

కల్లల్లోన నినుగాంచానే కన్నమ్మా
కనురెప్పలనయనా మూయగలేనే చిలకమ్మా
కనురెప్పల నీడలొ కాపురముండవే చిట్టెమ్మ
అరె నీవుంటె సంతోషం నీవేగా నా ప్రాణం
నీవాడే పలుకుల్లో వున్నాదే సంగీతం
నీ పువ్వులాంటి నవ్వులు చాలే చంద్రముఖి
నువు లేనినాడు నేను లేనే ప్రాణసఖి

చరణం1:

నిజం నేస్తమా ప్రియరాగమా
నిన్ను చూసి నన్నే మారిచానులే
అదేం మొహమో అదేం దాహమో
నువ్వులేని నిమిషం యుగమాయనే
ఎడారంటి గుండెల్లో వలపు వాన కురిసింది
నీ వెచ్చని వెచ్చని ఊపిరిలో నా జీవితముంది సఖి
నీ అందాలు చేసే సవ్వడులే నా ఆశలు శ్వేతమయి

కల్లల్లోన నినుగాంచానే కన్నమ్మా
కనురెప్పలనయనా మూయగలేనే చిలకమ్మా
కనురెప్పల నీడలొ కాపురముండవే చిట్టెమ్మ

చరణం2:

స్వాతి మేఘమా ఇంత మౌనమా
నా ప్రాణమంతా నీవే సుమా
మనో వీణను పలికించనా
జడలోని పువ్వై గుభాళించనా
కలలోని కలలాగ ఓడిని చేరు ప్రియురాలా
నీ కల్లల్లోని వెలుగై నే కలకాలం వుంటానే
తియతీయని ఊహల పల్లకిలో నిను ఎత్తుకుపోతానే

కల్లల్లోన నినుగాంచానే కన్నమ్మా
కనురెప్పలనయనా మూయగలేనే చిలకమ్మా
కనురెప్పల నీడలొ కాపురముండవే చిట్టెమ్మ
అరె నీవుంటె సంతోషం నీవేగా నా ప్రాణం
నీవాడే పలుకుల్లో వున్నాదే సంగీతం
నీ పువ్వులాంటి నవ్వులు చాలే చంద్రముఖి
నువు లేనినాడు నేను లేనే ప్రాణసఖి

||
Categories: Middle

మరో చరిత్ర

Thu, 06/03/2010 - 20:30
సాహిత్యం: ఆత్రేయ
గాత్రం: వాణీజయరాం





పల్లవి:

విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలేనని
విరహాన వేగిపోయి విలపించే కధలు ఎన్నో
విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలేనని
విరహాన వేగిపోయి విలపించే కధలు ఎన్నో
విలపించే కధలు ఎన్నో

చరణం1:

ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల
విరహ బాధను మరచి పోవగా నిదుర పోయెను ఉర్మిళ
అనురాగమే నిజమని మనసొకటి దాని ఋజువనీ
తుది జయము ప్రేమదేనని బలి అయినవి బ్రతుకులెన్నో
విధిచేయు వింతలన్నీ

చరణం2:

వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ ఇలలో
కులము మతమో ధనము బలమో గొంతు కోసెను తుదిలో
అది నేడు జరుగ రాదని ఎడడబాసి వేచినాము
మన గాధె యువతరాలకు కావాలి మరో చరిత్ర
కావాలి మరో చరిత్ర


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

బుల్లెమ్మ బుల్లోడు

Tue, 06/01/2010 - 20:30
గాత్రం: ఎస్.జానకి
సాహిత్యం: రాజశ్రీ




పల్లవి:

రాజా పిలుపు నాదేనురా
నీ నీడగా నీ తోడుగా
నీ వెంట ఉంటనురా
నిను వీడి పొలేనురా
రాజా పిలుపు నాదేనురా
నీ నీడగా నీ తోడుగా
నీ వెంట ఉంటనురా
నిను వీడి పొలేనురా
రాజా రాజా

చరణం1:

నీ ముందు నే నిలిచినా నిను చేరుకోలేనురా
ఏ చోట నేనున్నా నీ కోసమే నేనురా
మరుజన్మలోనైనా నీదాననౌవాతానురా
ఈ బంధము అనుబంధము
కడలేని కధరా దొరా ఓ ఓ
కడలేని కధరా దొరా
రాజా రాజా

చరణం2:

పల్లవి లేని పాటనురా పగలే చూడని రేయినిరా
కరిగిన కల నేనురా కదలని శిలనైతిరా
పల్లవి లేని పాటనురా పగలే చూడని రేయినిరా
కరిగిన కల నేనురా కదలని శిలనైతిరా
ఈ బంధము అనుబంధము
కడలేని కధరా దొరా
కడలేని కధరా దొరా
రాజా రాజా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

బొమ్మరిల్లు

Sun, 05/30/2010 - 20:30
గాత్రం: శ్రీనివాస్,గోపికాపూర్ణీమ
సాహిత్యం: భాస్కరభట్ల




పల్లవి:

బొమ్మను గీస్తే నీలా ఉంది
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లే పాపం అని దగ్గరకెళ్తే
దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది
సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలని నాకూ ఉంది
కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది

చరణం1:

చలిగాలి అంది చెలికి ఒణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ
శ్రమ పడిపోకండి తమ సాయం వద్దండీ
పొమ్మంటావే బాలిక ఉంటానంటే తోడుగా
అబ్బో ఎన్త జాలిరా తమరికి నామీద
ఏం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది
నీ వైపే నన్నే లాగింది

చరణం2:

అందంగా ఉంది తన వెంటే పదిమంది
పడకుండా చూడు అని నా మనసంటుంది
తమకే తెలియంది నా తోడై ఒకటుంది
మరెవరో కాదండి అది నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
హయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోసం ఎన్నాళ్ళుగా వేచుంది
నా మనసు ఎన్నో కలలు కంటుంది

బొమ్మను గీస్తే నీలా ఉంది ఉహు
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది అహహహ
సర్లే పాపం అని దగ్గరకెళ్తే
దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

శ్రీరామదాసు

Fri, 05/28/2010 - 20:30
గాత్రం: శంకర్ మహదేవన్,విజయ్ యేసుదాసు
సాహిత్యం: శ్రీ వేదవ్యాస



పల్లవి:

అల్లా ఆ ఆ ఆ
శ్రీరామా ఆ ఆ ఆ

శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు
కళ్యాణగుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
ఆనందనందనుడు అమృతరసచందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం

చరణం1:

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జెగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘనమూర్తి
ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏమూర్తి యునుగాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి

తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీరామనామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం

మాపాప మపనీప మపనీప మపసనిప మాపామ శ్రీరామ
మాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపనిమపమ కోదండరామ
మపరిసనిసాని పానిపమ సీతారామ
మపనిసరిసారి సరిమరిసనిపమ ఆనందరామ
మ మ రిమరిమ రిసమ
రామ జయరామ
సరిమ రామ సపమ రామ పావనామ

చరణం2:

ఏ వేల్పు ఎల్ల వేల్పులని గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పు
ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసుల కైమోడ్పు

తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీరామనామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle