http://geetalu.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
ఇప్పుడు 1000 పైగా మేలి ముత్యాలు ఇక్కడ లభ్యం
Updated: 29 min 55 sec ago

డార్లింగ్

Thu, 07/29/2010 - 20:30
తారాగణం: ప్రభాస్, కాజల్
గాత్రం: సూరజ్, ప్రశాంతిని
సాహిత్యం: అనంత్ శ్రీరాం
సంగీతం: జి.వి.ప్రకాష్
దర్శకత్వం: కరుణాకరన్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల: 2010



పల్లవి:

ఇంకా ఎదో ఇంకా ఎదో
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు
ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేదీ నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు

ఇంకా ఎదో ఇంకా ఎదో
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు

చరణం1:

మేఘాల ఒళ్ళోనే ఎదిగిందనీ
జాబిల్లి చల్లేనా జడివాననీ
ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ
నీకు పూరేకులే గుచ్చుకోవే మరీ
తీరమే ఓరినా తీరులో మారునా
మారదూ ఆ ప్రాణం

ఇంకా ఎదో ఇంకా ఎదో
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు

చరణం2:

వెళ్ళెళ్ళు చెప్పేస్తే ఏమవ్వదూ
లోలోన దాగుంటే ప్రేమవ్వదూ
అమృతం పంచడం నేరమే అవదురా
హాయినే పొందడం భారమే అవదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా
ఇప్పుడే ఆ అందం

ఇంకా ఎదో ఇంకా ఎదో
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు
ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేదీ నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

మరణ మృదంగం

Tue, 07/27/2010 - 20:30
గాత్రం: బాలు,చిత్ర



పల్లవి:

సరిగమ పదనిస రసనస
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనస
ఇది కనివిని ఎరుగని గుసగుస
ముద్దు పెట్టు ముద్దు పెట్టు పద
ముద్దులేక పొద్దుపోని కథ
ముద్దుకాటు పడ్డ కన్నె ఎద
దిద్దుకున్న ముద్దబంతి కథ
సరిగమ పదనిస రసనస
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనస
ఇది కనివిని ఎరుగని గుసగుస

చరణం1:

రెండు హృదయాల పిట్టపోరు తీరనంటుంది ఎందుకో
దొంగ యోగాల కొంగగారు గాలమేసేది ఎందుకో
చేతికందాక జాబిలి చుక్కతో నాకు ఏం పనీ
తట్టుకున్నాక కౌగిలి ఏమి కావాలొ చెప్పనీ
కస్సుమన్న దాని సోకు పసిగా ఉంటుందీ
తుమ్మెదొచ్చి వాలినాక పువ్వేమంటుందీ
సిగ్గొ చీనీలపండు బుగ్గో బత్తాయిపండు అల్లో నేరేడుపండు నాది
అరె నా నా నా నా నా నేనే కాదంటున్నానా

సరిగమ పదనిస రసనస
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనస
ఇది కనివిని ఎరుగని గుసగుస
ముద్దు పెట్టు ముద్దు పెట్టు పద
ముద్దులేక పొద్దుపోని కథ
ముద్దుకాటు పడ్డ కన్నె ఎద
దిద్దుకున్న ముద్దబంతి కథ
సరిగమ పదనిస రసనస
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనస
ఇది కనివిని ఎరుగని గుసగుస

చరణం2:

వయసు వడగళ్ళ వాన నీరు వంటపట్టింది ఎందుకో
నన్ను దులిపేసి వలపు గాలి నిన్ను తాకింది తట్టుకో
లేత అందాల దోపిడి ఇప్పుడే కాస్త ఆపనీ
ఆపినా ఆగి చావదు అందచందాల ఆ పని
ఇంతదాక వచ్చినాక ఇంకేమౌతుంది
లబ్జు లబ్జు మోజు మీద లంకే అవుతుంది
అబ్బో నా బాయ్ ఫ్రెండు ముద్దిస్తె నోరు పండు వాటేస్తె ఒళ్ళుమండునమ్మ
అరె నా నా నా నా నా నేనే కాదంటున్నానా

సరిగమ పదనిస రసనస
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనస
ఇది కనివిని ఎరుగని గుసగుస
ముద్దు పెట్టు ముద్దు పెట్టు పద
ముద్దులేక పొద్దుపోని కథ
ముద్దుకాటు పడ్డ కన్నె ఎద
దిద్దుకున్న ముద్దబంతి కథ
సరిగమ పదనిస రసనస
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనస
ఇది కనివిని ఎరుగని గుసగుస

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

రాగం

Sun, 07/25/2010 - 20:30
గాత్రం: కళ్యాణి మీనన్, సుధ రఘునాథన్




ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మాతే మలయధ్వజ పాండ్య సంజాతే
మాతే మలయధ్వజ పాండ్య సంజాతే
మాతంగ వదన గుహ
మాతే మలయధ్వజ పాండ్య సంజాతే
మాతంగ వదన గుహ
మాతే మలయధ్వజ పాండ్య సంజాతే
మాతంగ వదన గుహ
సహోదరి శంకరిఈ
సహోదరి శంకరిఈ చాముండేశ్వరి
చంద్రకలాదరి తాయే గౌరీ

మాతే మలయధ్వజ పాండ్య సంజాతే
మాతంగ వదన గుహ
మాతే మాతే మాతే మాతే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

విలన్

Thu, 07/22/2010 - 20:30
తారాగణం: విక్రం, పృధ్విరాజ్, ఐశ్వర్యారాయ్
గాత్రం: కార్తీక్
సాహిత్యం: వేటూరి
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
దర్శకత్వం: మణిరత్నం
సంస్థ: మద్రాస్ టాకీస్
విడుదల: 2010



ఈ భూమిలోన ఎప్పుడంట నీ పుటక
నా బుద్ధిలోన నువ్వు చిచ్చు పెట్టాక
ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా
ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనా
ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా
ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనా
ఈ చిన్న అగ్గిపుల్ల భగ్గుమంటే ఇంకా
ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వదా

పల్లవి:

ఉసురే పోయెనె ఉసురే పోయెనె
కదిలే పెదవులు చూడగనే
ఓ ప్రేమకు తపించి వేడుతువున్నా
మనసును ఇవ్వవే మగనాల
అందని తీరాన నీవున్నా హత్తుకుపొవే దరిచేరి
అగ్గిపండు నువ్వని తెలిసి
అడుగుతువున్న ఉడుకు రుచి

చరణం1:

ఒంటికి మనసుకు ఆమడ దూరం కలిపేదెట్టా తెలియదుగా
మనసే చెప్పే మంచి సలహా
మాయ శరీరం వినదు కదా
తపనే తొలిచే నా పరువము బరువు కదా
చిలిపి చిలకే మరి నను గాలి కొలికె కదా
ఈ మన్మథ తాపం తీరునా
ఈ పూనకాల కోడిపెట్ట తీర్చునా
ఈ మాయదారి పిచ్చి తీర్చి మన్నించెనా
చందురుడు సూరిడు చుట్టి ఒక్కచోట చేరిపోయే
సత్యమసత్యము నేడు చీకటింటి నీడలాయే

ఉసురే పోయెనె ఉసురే పోయెనె
కదిలే పెదవులు చూడగనే
ఓ ప్రేమకు తపించి వేడుతువున్నా
మనసును ఇవ్వవే మగనాల
అందని తీరాన నీవున్నా హత్తుకుపొవే దరిచేరి
అగ్గిపండు నువ్వని తెలిసి
అడుగుతువున్న ఉడుకు రుచి

చరణం2:

ఇది కొత్త కాదు పాతబడ్డ జగతికి
తను కాచుకోదు కళ్లులేని కట్టడిది
మనం చట్టమంటూ గీసుకున్న గిరి ఇది
దాని బొక్కలెన్నో లెక్కపెట్టి చూడు మరి
మబ్బులు విడిచిన సూర్యుని చూసి
మొగ్గలు విచ్చును తామర
దూరం భారం చూడనిదొకటే
నీకు పుట్టిన ప్రేమరా
పాపం వీరా అన్న తేడా తెలియదులే
పామే అయినా ఇక వెనకడుగుండదులే
చితి మంటలు రేగిన వేళలో
నా కన్నుల చల్లని నీ రూపే
నే మట్టి కలిసినా మదిలో నీవే
చందురుడు సూరీడు చుట్టి ఒక్కచోట చేరిపోయే
సత్యమసత్యము నేడు చీకటింటి నీడలాయే

ఉసురే పోయెనె ఉసురే పోయెనె
కదిలే పెదవులు చూడగనే
ఓ ప్రేమకు తపించి వేడుతువున్నా
మనసును ఇవ్వవే మగనాల
అందని తీరాన నీవున్నా హత్తుకుపొవే దరిచేరి
అగ్గిపండు నువ్వని తెలిసి
అడుగుతువున్న ఉడుకు రుచి

ఉసురే పోయెనె ఉసురే పోయెనె
కదిలే పెదవులు చూడగనే
ఓ ప్రేమకు తపించి వేడుతువున్నా
మనసును ఇవ్వవే మగనాల
అందని తీరాన నీవున్నా హత్తుకుపొవే దరిచేరి
అగ్గిపండు నువ్వని తెలిసి
అడుగుతువున్న ఉడుకు రుచి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

వాగ్దానం

Tue, 07/20/2010 - 20:30
తారాగణం: నాగేశ్వరరావు, కృష్ణకుమారి, చలం
గాత్రం: ఘంటసాల, సుశీల
సాహిత్యం: దాశరథి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాత: కె.సత్యనారాయణ
దర్శకత్వం: ఆచార్య ఆత్రేయ
సంస్థ: కవిత చిత్ర
విడుదల: 1961




పల్లవి:

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈనాటి పున్నమి ఏనాటి పునీమో
జాబిలి వెలిగేను మనకోసమే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈనాటి పున్నమి ఏనాటి పునీమో
జాబిలి వెలిగేను మనకోసమే
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
అందుకుందాము అందని ఆకాశమే
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా

చరణం1:

ఆ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
ఆహాహా ఆ
ఆ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
మేఘాలలో వలపు రాగాలలో
మేఘాలలో వలపు రాగాలలో
దూరదూరాల స్వర్గాల చేరుదమా

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా

చరణం2:

ఈ పూల దారులు ఆ నీలి తారలు
తీయని స్వప్నాల తేలించగా
ఆహాహా ఆ ఆ
ఈ పూల దారులు ఆ నీలి తారలు
తీయని స్వప్నాల తేలించగా
అందాలను తీపి బంధాలను
అందాలను తీపి బంధాలను
అందుకుందాము డెందాలు పాలించగా

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

మేజర్ చంద్రకాంత్

Sun, 07/18/2010 - 20:30
గాత్రం: ఏసుదాసు, చిత్ర
సాహిత్యం: కీరవాణి




పల్లవి:

ఓ ఓ ఓ ఓ ముద్దుతో ఓనమాలు నేర్పించనా
ఓ ఓ ఓ ఓ సిగ్గుల్లో ఆనవాలు చూపించనా
భామా ఆ ఆ కౌగిళ్ళ బళ్ళోకి రా రా
ప్రేమా ఆ ఆ ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మ ఓ ఓ ఓ ఓ
ముద్దుతో ఓనమాలు నేర్పించనా ఓ ఓ ఓ ఓ
సిగ్గుల్లో ఆనవాలు చూపించనా

చరణం1:

ఎంచక్క నా మనసే నీకోసం పలకను చేశానమ్మా
ఓపిగ్గ అ ఆ ఇ ఈ దిద్దే పనితనమే నీదమ్మా
గాలికి సరిగమ నేర్పిన రాగములో
ఈలలు వేసిన అల్లరి చదువులలో
వందేళ్ళు వల్లిస్తే చాలు ఎన్నో శృంగార నైషధాలు
ప్రేమా ఆ ఆ నీ మౌనమొక భాషాగా చేసుకున్నాక
ఓ ఓ ఓ ఓ ముద్దుతో ఓనమాలు నేర్పించనా
ఓ ఓ ఓ ఓ సిగ్గుల్లో ఆనవాలు చూపించనా

చరణం2:

తెచ్చాను పెద్ద బాలశిక్ష మెదడుకి పెద్ద మేత
వేసాను ముద్దు పాలశిక్ష పెదవుల తీపిరాత
వరసలు కలిసే వచనం వింటావా
చొరవలు పెరిగే సరదా చూస్తావా
మధుర శృతుల లీల ఇది మదన లయల గోల
రోజూ ఉ ఉ అధరాల ముంగిళ్ళ ఎంగిళ్ళ కళ్ళాపి ఓ ఓ ఓ ఓ
ముద్దుతో ఓనమాలు నేర్పించనా ఓ ఓ ఓ ఓ
సిగ్గుల్లో ఆనవాలు చూపించనా

భామా ఆ ఆ కౌగిళ్ళ బళ్ళోకి రా రా
ప్రేమా ఆ ఆ ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మ
ఓ ఓ ఓ ఓ ముద్దుతో ఓనమాలు నేర్పించనా
ఓ ఓ ఓ ఓ సిగ్గుల్లో ఆనవాలు చూపించనా


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

బొమ్మరిల్లు

Thu, 07/15/2010 - 20:30
తారాగణం: సిద్దార్థ్,జెనీలియా,ప్రకాష్‌రాజ్,జయసుధ
గాత్రం: సాగర్,సుమంగళి
సాహిత్యం: సీతారామశాస్త్రి
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాత: దిల్‌రాజు
దర్శకత్వం: భాస్కర్
సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల: 2006




పల్లవి:

నమ్మక తప్పని నిజమైనా
నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా
నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపుల నొదిలేనా ఓ
ఎందరితో కలిసున్నా
నేనొంటరిగానే ఉన్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన ఓ
కన్నులు తెరిచే ఉన్నా
నువ్వు నిన్నటి కలవే అయినా
ఇప్పటికీ ఆ కలలో నే ఉన్నా
నమ్మక తప్పని నిజమైనా
నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ

చరణం1:

ఈ జన్మంతా విడిపోదీ జంట
అని దీవించిన గుడిగంటను
ఇక నా మది వింటుందా
నా వెనువెంట నువ్వే లేకుండా
రోజూ చూసిన ఏ చోటైన నను గుర్తిస్తుందా
నిలువున నను తడిమి అలా
వెనుదిరిగిన చెలిమి అల
తడి కనులతో నిను వెతికేది అలా

నమ్మక తప్పని నిజమైనా
నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ

చరణం2:

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో
ఎన్నాళ్ళైన ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా
సిరివెన్నెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా

నమ్మక తప్పని నిజమైనా
నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా
నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపుల నొదిలేనా ఓ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

మరో చరిత్ర

Tue, 07/13/2010 - 20:30
సాహిత్యం: ఆత్రేయ
గాత్రం: జానకి





పల్లవి:

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే
చిలిపి పనులకు కోటి దండాలు
పదహారేళ్ళకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే
చిలిపి పనులకు కోటి దండాలు
వెన్నెలల్లే విరియ బూసి, వెల్లువల్లే ఉరకలేసే
పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే
చిలిపి పనులకు కోటి దండాలు

చరణం1:

పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు
పాటలు పాడిన చిరు గాలులకు
పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు
పాటలు పాడిన చిరు గాలులకు
తెరచాటొసగిన చెలులు శిలలకు
తెరచాటొసగిన చెలులు శిలలకు
దీవెన జల్లులు చల్లిన అలలకూ
కోటి దండాలు శతకోటి దండాలు

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే
చిలిపి పనులకు కోటి దండాలు

చరణం2:

నాతో కలిసి నడచిన కాళ్ళకు
నాలో నిన్నే నింపిన కళ్ళకు
నిన్నే పిలిచే నా పెదవులకు
నీకై చిక్కిన నా నడుమునకూ
కోటి దండాలు శతకోటి దండాలు

చరణం3:

భ్రమలో లేపిన తొలి జాములకు
సమయం కుదిరిన సందె వేళలకు
నిన్నూ నన్ను కన్నవాళ్ళకు
నిన్నూ నన్ను కన్నవాళ్ళకు
మనకై వేచే ముందునాళ్ళకూ
కోటి దండాలు శతకోటి దండాలు
కోటి దండాలు శతకోటి దండాలు

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే
చిలిపి పనులకు కోటి దండాలు
కోటి దండాలు శతకోటి దండాలు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

బుల్లెమ్మ బుల్లోడు

Sun, 07/11/2010 - 20:30
గాత్రం: బాలు,రమోలా
సాహిత్యం: రాజశ్రీ




పల్లవి:

బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మ మాటాడు చిలకమ్మ
నీకు నాకు జోడి రాశాడు ఆ బ్రహ్మ
నీకు నాకు జోడి రాశాడు ఆ బ్రహ్మ
నవ్వులలోన పువ్వులు రువ్వే కొంటె చిట్టెమ్మ
నవ్వులలోన పువ్వులు రువ్వే కొంటె చిట్టెమ్మ
నువ్వేలే నా రాణి నీమీద ఒట్టమ్మ
బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మ మాటాడు చిలకమ్మ
నీకు నాకు జోడి రాశాడు ఆ బ్రహ్మ

చరణం1:

ఏయ్ అలా చూస్తావే
ఎలా ఉంది ఒళ్ళు
కావాలా నోర్ముయ్ ఛీపో
నోటితో నువు పొమ్మంటున్నా చూపు నన్నే రమ్మంటుంది
కన్నెపొగరు వద్దంటున్నా మనసు నన్నే కావాలంటుంది
ఈ కోపం ఈ పంతం అంతా నాటకం

బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మ మాటాడు చిలకమ్మ
నీకు నాకు జోడి రాశాడు ఆ బ్రహ్మ

చరణం2:

ఏయ్ మీద పడతావే
ఒంటరిదాన్ననా వెంటపడుతున్నావ్
హా నన్నే పట్టుకుంటావా నీకెన్ని గుండెలు ఛీపో
గుండెలోన గాలమేసి ఒడుపుగా నువు దోచావు నన్ను
అడుగు దాటి కదలనీను నీడలాగ ఉంటాను నేను
నీ అలక నా పులక పెనవేసుకోవాలి

బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మ మాటాడు చిలకమ్మ
నీకు నాకు జోడి రాశాడు ఆ బ్రహ్మ
హోయ్ నీకు నాకు జోడి రాశాడు ఆ బ్రహ్మ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

నువ్వు నేను ప్రేమ

Thu, 07/08/2010 - 20:30
తారాగణం: సూర్య, జ్యోతిక, భూమిక
సాహిత్యం: వేటూరి
గాత్రం: నరేష్ అయ్యర్, శ్రేయా ఘోషల్
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
దర్శకత్వం: కృష్ణ
విడుదల: 2006





పల్లవి:

ప్రేమించే ప్రేమవా ఊరించే ఉహావా
ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే
నే నీవే హృదయం అన్నదే
ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఉహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే

రంగు రంగోలి గోరింటే నువుపెట్టే
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి
ఘల్ ఘల్
రంగు రంగోలి గోరింటే నువుపెట్టే
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెలముందు

చరణం1:

పూవైనా పూస్తున్నా నీ పరువంగానే పుడతా
మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురై
నీవే నా మదిలో ఆడ
నీనే నీ నటనై రాగా
నా నాడుల నీడకు నడకలో నిశబ్దం ఉందే హో
తోడే దొరకని నాడు విలవిలలాడే ఒంటరి నేను

ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఉహావా
నే నేనా అడిగా నన్ను నేనే
నే నేనా అడిగా నన్ను నేనే
ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఉహవా

చరణం2:

నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా
నా పొదరింటికి వేరే అతిధులు రాతరమా
తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా
నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించ తరమా
నీవు సంద్రం చేరి గల గలా పారే నది తెలుసా

ప్రేమించే ప్రేమవా ఊరించే ఉహావా
ప్రేమించే ప్రేమవా పువల్లే పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే
నే నీవే హృదయం అన్నదే
ప్రేమించే ప్రేమవా ఊరించే ఉహావా
ప్రేమించే నా ప్రేమవా పూవల్లే పూవల్లే

రంగు రంగోలి గోరింటే నువుపెట్టే
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి
ఘల్ ఘల్
రంగు రంగోలి గోరింటే నువుపెట్టే
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెలముందు
రంగు రంగోలి గోరింటే నువుపెట్టే
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి
ఘల్ ఘల్
రంగు రంగోలి గోరింటే నువుపెట్టే
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెలముందు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

ప్రేమ

Tue, 07/06/2010 - 20:30
గాత్రం: ఎస్.పి.శైలజ




పల్లవి:

ఎక్కడ ఎక్కడ పోతావురా
ఇక్కడ ఇక్కడ నేనుండగా
ఎక్కడ ఎక్కడ పోతావురా
ఇక్కడ ఇక్కడ నేనుండగా
నా కథాకమామీసు నీకు అటో ఇటో తెలుసు
సరేనని సరాసరి దగ్గర దగ్గర రా
i love you...i love you
i love you...i love you

ఎక్కడ ఎక్కడ పోతావురా
ఇక్కడ ఇక్కడ నేనుండగా

చరణం1:

వయసింత ఎదిగింది అనుకోకురా
మనసెంతో నునుపైన చిగురాకురా
పరువాన్ని బంధించి ఉంచానురా
సరదాల్ని పరదాల్లో దాచానురా
నీకై ఉన్నాను తపించి
నేనే వచ్చాను తెగించి
ఉన్నానురా నేనొంటిగా
ఉంచానురా ఇన్నాళ్ళుగా
ఇక పగ్గాలన్నీ తెంచేశాను రారా

ఎక్కడ ఎక్కడ హే హే
ఇక్కడ ఇక్కడ నేనుండగా
నా కథాకమామీసు నీకు అటో ఇటో తెలుసు
సరేనని సరాసరి దగ్గర దగ్గర రా
ఎక్కడ ఎక్కడ పోతావురా
ఇక్కడ ఇక్కడ నేనుండగా

చరణం2:

చేతుల్తో మెడ చుట్టూ చుట్టేయరా
అది తాళిబొట్టల్లే ఉంటుందిరా
కౌగిళ్ళో నన్నట్టే పట్టేయరా
నా కంటి వగలన్ని చూస్తావురా
నువ్వే నాకొక వరంగా
ఉన్నా క్షణమొక యుగంగా
ఇంకెంతని ఆగేదిరా
ఈ వయసుకో తోడేదిరా
ఇక సిగ్గు ఎగ్గు ఒగ్గేశాను రా రా

ఎక్కడ ఎక్కడ పోతావురా
ఇక్కడ ఇక్కడ నేనుండగా
ఎక్కడ ఎక్కడ పోతావురా
ఇక్కడ ఇక్కడ నేనుండగా
నా కథాకమామీసు నీకు అటో ఇటో తెలుసు
సరేనని సరాసరి దగ్గర దగ్గర రా
i love you...i love you
i love you...i love you

ఎక్కడ ఎక్కడ పోతావురా
ఇక్కడ ఇక్కడ నేనుండగా
ఎక్కడ ఎక్కడ పోతావురా
ఇక్కడ ఇక్కడ నేనుండగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

శ్రీరామదాసు

Sun, 07/04/2010 - 20:30
గాత్రం: శంకర్ మహదేవన్
సాహిత్యం: రామదాసు



పల్లవి:

ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైన పలుకవే
రామచంద్రా నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా

చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామంచంద్రా
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకానికీ బట్టె పదివేల మొహరీలు రామచంద్రా
సీతమ్మకూ చేయిస్తినీ చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకానికీ బట్టె పదివేల వరహాలు రామచంద్రా
కలికి తురాయి నీకు కొలుపుగా జేయిస్తినీ రామచంద్రా

నీ తండ్రి దశరధ మహరాజు పంపెనా
లేక నీ మామ జనక మహరాజు పెట్టెనా
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా

~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

స్వర్గసీమ

Sat, 07/03/2010 - 20:30
గాత్రం: భానుమతి




ఓ ఓ ఓ ఓహొహొ ఓహొహొ ఓహొహొహొహొ పావురమా
ఓ ఓ ఓ ఓహొహొ పావురమా
ఓ ఓ ఓ ఓహొహొ పావురమా
తెరతేలే పావురమా
ఒహొహొహొహొ అహహహహ అహహహహ పావురమా
తెరతేలే పావురమా
ఒహొహొహొహొ పావురమా
కరుణ యవ్వనము ఉహుహుహు పొంగిపొరలు ఉహు ఉహుహుహు
కరుణ యవ్వనము పొంగిపొరలనా వలపుకౌగిలిని ఒలలాడదా నే నే ఓఓఓ
ఓహొహొ ఓహొహొ పావురమా
తనకుతానై వలచి పిలిచే తనికూహమని చులకనచేయకుమా
ఓఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఒహొహొహొ పావురమా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


||
Categories: Middle

ఆ నలుగురు

Thu, 07/01/2010 - 20:30
తారాగణం: రాజేంద్రప్రసాద్, ఆమని, రాజా
గాత్రం: బాలు
సాహిత్యం: చైతన్య ప్రసాద్
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నిర్మాత: శ్రీమతి సరితా పట్రా
దర్శకత్వం: చంద్ర సిద్దార్థ
సంస్థ: ప్రేమ్ మూవీస్
విడుదల: 2004




నలుగురు మెచ్చినా నలుగురు తిట్టినా
విలువలే శిలువగా మోశావు
అందరు సుఖపడే సంఘమే కోరుతూ
మందిలో మార్గమే వేశావు
బతికిన నాడు బాసటగా
పోయిన నాడు ఊరటగా
అభిమానం అనురాగం చాటేదీ
ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు

పోయిరా నేస్తామా పోయిరా ప్రియతమా
నీవు మా గుండెలో నిలిచావు
ఆత్మయే నిత్యము జీవితం సత్యము
చేతలే నిలుచురా చిరకాలం
నలుగురు నేడు పదుగురిగా
పదుగురు వేలు వందలుగా
నీ వెనుకే అనుచరులై నడిచారు
ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

ఆ నలుగురు

Tue, 06/29/2010 - 20:30
తారాగణం: రాజేంద్రప్రసాద్, ఆమని. రాజా
గాత్రం: బాలు
సాహిత్యం: చైతన్య ప్రసాద్
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నిర్మాత: శ్రీమతి సరితా పట్రా
దర్శకత్వం: చంద్ర సిద్దార్థ
సంస్థ: ప్రేమ్ మూవీస్
విడుదల: 2004




ఒక్కడై రావడం ఒక్కడై పోవటం
నడుమ ఈ నాటకం విధి లీల
వెంట ఏ బంధము రక్త సంబంధము
తోడుగా రాదుగా తుది వేళ
మరణమనేది ఖాయమని
మిగిలెను తీపి గాయమని
నీ బరువు నీ పరువు మోసేది
ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు


రాజని పేదని మంచని చెడ్డని
భేధమే ఎరుగని యమపాశం
కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము
హద్దులే చెరిపెనే మరుభూమి
మూటలలోని మూల ధనం
చేయదు నేడు సహగమనం
మన వెంట కడ కంట నడిచేదీ
ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

ఆ నలుగురు

Sun, 06/27/2010 - 20:30
గాత్రం: బాలు, ఆర్పి.పట్నాయక్, ఉష
సాహిత్యం: చైతన్య ప్రసాద్




పల్లవి:

గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ
ఆటలే ఆడిన పాపాయి
ఇంతలో ఎంతగా ఎదిగెనో వింతగా
వధువుగా మారే మా అమ్మాయి
wish you happy married life
All the best for rest of life
ఆనందాల వేళ ఇది
అభినందనల మాల ఇది
గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ
ఆటలే ఆడిన పాపాయి


మనం చేస్తున్నాం అనుకుంటాం కాని అదంతా ఒట్టిదే
Marriages are made in Heaven


చరణం1:

స్వర్గం లోనే పెళ్ళి చేసేసి దేవుడే పంపుతుంటే
మళ్ళీ ఇట్టా మేళతాళాల వేడుకే ఎందుకో
మీలాంటోళ్ళే నేలపై చేరి రాతలే మార్చుతుంటే
వేళాకోళం కాదు పెళ్ళి అని చాటుదామందుకే
ఆ మూడుముళ్ళే వేస్తే ఏడడుగులు నడిపించేస్తే
కాదయ్యా కళ్యాణము
మనసులనే ముడివేయలి నూరేళ్ళు జత నడవాలి
అపుడేగా సౌభాగ్యము

wish you happy married life
All the best for rest of life
ఆనందాల వేళ ఇది
అభినందనల మాల ఇది
గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ
ఆటలే ఆడిన పాపాయి

పెళ్ళైన కొత్తలో మా ఆయన నన్ను బంగారం అనేవాడు
ఇప్పుడు బోషాణం అంటున్నాడు

చరణం2:

రోజు తింటే నేతి గారైనా చేదుగా మారిపోదా
మోజే తీరితే కాపురం కూడా కొట్టదా బోరుగా
ఏడే కదా స్వరములుండేవి కోటి రాగాలకైనా
కూర్చేవాడికి నేర్పు ఉండాలి కొత్తగా పాడగా
సంగీతపు సాధనలాగ సరదా పరిశోధనకాగా
చెయ్యాలి సంసారము
ఉంటాయి కలిమి లేమి వెంటాడే కష్టము సుఖము
కలబోతే సుఖసారము

wish you happy married life
All the best for rest of life
సుందరం సుమధురం జీవితం ఓ వరం
ఆటలా పాటలా సాగాలి
మంజులం మోహనం జంటగా జీవనం
ఈ క్షణం శాశ్వతం కావాలి
wish you happy married life
All the best for rest of life
ఆనందాల వేళ ఇది
అభినందనల మాల ఇది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

మగధీర

Thu, 06/24/2010 - 20:30
తారాగణం: రాంచరణ్‌తేజ,కాజల్,శ్రీహరి
గాత్రం: ఆనూజ్ గురువర,రీట
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
నిర్మాత: అల్లు అరవింద్
సంస్థ: గీతా ఆర్ట్స్
విడుదల: 2009




పల్లవి:

పంచదార బొమ్మ బొమ్మా పట్టుకొవద్దనకమ్మ
మంచుపూల కొమ్మ కొమ్మా ముట్టుకొవద్దనకమ్మ
చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మ
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపొతే వృధాయే ఈ జన్మ
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపొతే వృధాయే ఈ జన్మ

చరణం1:

పువ్వు పైన చెయ్యిస్తే కసిరి నన్ను తిట్టిందే
పసడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంట
ఈ పువ్వు చుట్టు ముళ్ళంట
అంటుకుంటే మంటే ఒళ్ళంతా
తీగ పైన చెయ్యిస్తే తిట్టి నన్ను నెట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందే
మెరుపు వెంట ఉరుమంట
ఉరుము వెంట వరదంట
నే వరద లాగ మారితే ముప్పంట
వరదైన వరమని వరిస్తానమ్మ
మునకైన సుఖమని ముడేస్తానమ్మ

నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపొతే వృధాయే ఈ జన్మ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం2:

గాలి నిన్ను తాకింది
నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా
గాలి ఊపిరి అయ్యింది
నేల నన్ను నడిపింది
ఏవిటంట నీలోని గొప్ప
వెలుగు నిన్ను తాకింది
చినుకు కూడా తాకింది
పక్షపాతమెందుకు నాపైన
వెలుగు దారి చూపింది
చినుకు లాల పోసింది
వాటితోటి పొలిక నీకేల
అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మ
నీ చితిలో తోడై నేనొస్తానమ్మ

నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపొతే వృధాయే ఈ జన్మ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

మేజర్ చంద్రకాంత్

Tue, 06/22/2010 - 20:30
గాత్రం: బాలు, చిత్ర
సాహిత్యం: జాలాది




పల్లవి:

సుఖీభవ సుమంగళి సుఖీభవ
సుశీలవై చిరాయువై సుఖీభవ
ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని
నిండుగా నూరేళ్ళుగా ఉండిపొమ్మని
సుఖీభవ సుమంగళి సుఖీభవ
సుశీలవై చిరాయువై సుఖీభవ

చరణం1:

శతమానం భవతి అని నిన్ను దీవించి
గతకాలం స్మృతిలోనే బ్రతుకు సాగించి
ఆ కుంకుమరేకుల కెంపులు పూయగా
ఆ పూసిన పువ్వుల నోములు పండగా
కదలి రావమ్మా ఆ

ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని
నిండుగా నూరేళ్ళుగా ఉండిపొమ్మని
సుఖీభవ సుమంగళి సుఖీభవ
సుశీలవై చిరాయువై సుఖీభవ

చరణం2:

అనురాగం కోవెలలో ఆది దంపతులై
కనులారా మిము చూసే జన్మ ధన్యమై
ఒక జీవిత కాలం చాలని ప్రేమలో
సుఖశాంతులు విరిసే చల్లని తల్లిగా
నిలిచిపోవమ్మా ఆ

ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని
నిండుగా నూరేళ్ళుగా ఉండిపొమ్మని
సుఖీభవ సుమంగళి సుఖీభవ
సుశీలవై చిరాయువై సుఖీభవ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

పద్మవ్యూహం

Sun, 06/20/2010 - 20:30
గాత్రం: సుశీల
సాహిత్యం: రాజశ్రీ




పల్లవి:

కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం

చరణం1:

వానాగిపోయిననూ ఆకుపై చుక్కందం
అల చెదిరిపోయిననూ దరినున్న నురుగందం
చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం
చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం
శ్రీవారి చూపులకు ఎప్పుడు నేనందం

కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం

చరణం2:

అందాల వన్నెలకే అపురూప కురులందం
అనురాగ ముద్దరలే చెరిగిన బొట్టందం
మగువలో ప్రేమొస్తే మనుగడే ఓ అందం
మగువలో ప్రేమొస్తే మనుగడే ఓ అందం
నా తోడు నీవుంటే చీకటే ఓ అందం

కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

ఉయ్యాల జంపాల

Sat, 06/19/2010 - 20:30
గాత్రం: పి.సుశీల
సాహిత్యం: ఆరుద్ర




పల్లవి:

రుక్మిణమ్మ రుక్మిణమ్మ
కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ
రుక్మిణమ్మ రుక్మిణమ్మ
కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ
రుక్మిణమ్మ రుక్మిణమ్మ
కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ
రుక్మిణమ్మ రుక్మిణమ్మ
కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ

చరణం1:

కన్నెపిల్ల మనసు మీ అన్నకేమి తెలుసు
కన్నెపిల్ల మనసు మీ అన్నకేమి తెలుసు
శిశుపాలుడి కన్న శ్రీకృష్ణుడు మిన్న
శిశుపాలుడి కన్న శ్రీకృష్ణుడు మిన్న
రమణి ప్రేమ సొంపు నువు రాయబారమంపు
రమణి ప్రేమ సొంపు నువు రాయబారమంపు
చిలకచేత కబురుపంప చెలుడు రాకపోడమ్మ
బాలరుక్కమ్మా

రుక్మిణమ్మ రుక్మిణమ్మ
కోరుకున్న మగనికొరకు నోచాలమ్మ
రుక్మిణమ్మ రుక్మిణమ్మ
కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ

చరణం2:

గౌరి పూజచేసి ఆ గర్భగుడిలో వేచి
గౌరి పూజచేసి ఆ గర్భగుడిలో వేచి
ఎదురు చూడవమ్మ నీ బెదురు మానవమ్మ
ఎదురు చూడవమ్మ నీ బెదురు మానవమ్మ
రమ్మమైనవాడు ఒక రథము తెచ్చినాడు
రమ్మమైనవాడు ఒక రథము తెచ్చినాడు
తేరుమీద ప్రియునితోను తేలి సాగిపోవమ్మా
బాలరుక్కమ్మా ఆ ఆ ఆ

రుక్మిణమ్మ రుక్మిణమ్మ
ఎంత మంచి నోము నువ్వు నోచావమ్మా
రుక్మిణమ్మ రుక్మిణమ్మ
కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ

చరణం3:

అట్లతద్దె రోజు మా ఆడపిల్లల మోజు
అట్లతద్దె రోజు మా ఆడపిల్లల మోజు
అంతా గుమిగూడి సై ఆట పాటలాడి
అంతా గుమిగూడి సై ఆట పాటలాడి
తదియ చంద్రుచూసి మా తనివి తీరనోచి
తదియ చంద్రుచూసి మా తనివి తీరనోచి
అట్లతద్దె నోమునోచ అందగాడె మొగుడమ్మా
బాలరుక్కమ్మా ఆ ఆ ఆ

రుక్మిణమ్మ రుక్మిణమ్మ
ఉయ్యాల జంపాల ఊగాలమ్మ
ఉయ్యాల జంపాల ఊగాలమ్మ
ఉయ్యాల జంపాల, ఉయ్యల జంపాల
ఉయ్యాల జంపాల, ఉయ్యల జంపాల
ఉయ్యాల జంపాల, ఉయ్యల జంపాల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle