http://ekantham.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలొ సృష్టి జరుగుతుందని...
Updated: 56 min 59 sec ago

నిరీక్షణ { గీతాంజలి ~ 18 }

13 hours 39 min ago
నా స్వామి ప్రేమకై కేవలం నిరీక్షణలో గడుపుతున్నాను,
నను చాలించుకుని ఇక ఆతని పరమవడానికి.
అందుకే అది ఇంత ఆలస్యమైనది, అందుకే నేను ఇట్టి పొరబాట్లకి నిందార్హుడునవుతున్నాను

ఇతరులు వారి నియమాలతో కట్టుబాట్లతో నను ధృఢంగా బంధించ వస్తారు;
కానీ వారిని ఎప్పుడూ దాటవేస్తాను,
ఎందుకంటే నా స్వామి ప్రేమకై కేవలం నిరీక్షణలో గడుపుతున్నాను,
నను చాలించుకుని ఇక ఆతని పరమవడానికి.

పరులు నను నిందిస్తారు, నను సోమరి అంటారు;
వారి నిందా సమంజసమే నేను సందేహించను.

సంత వారం గడిచిపోయింది. పని కావాల్సినవాళ్ళకి జరగాల్సినదంతా జరిగిపోయింది.
ఎవరైతే వచ్చి నను పిలువ వృథా ప్రయత్నం చేసారో, వారు కోపంతో వెనుదిరిగారు.
నా స్వామి ప్రేమకై కేవలం నిరీక్షణలో గడుపుతున్నాను,
నను చాలించుకుని ఇక ఆతని పరమవడానికి.


చావా కిరణ్ అనువాదం ఇక్కడ


I am only waiting for love to give myself up at last into his hands. That is why it is so late and why I have been guilty of such omissions.

They come with their laws and their codes to bind me fast; but I evade them ever, for I am only waiting for love to give myself up at last into his hands.

People blame me and call me heedless; I doubt not they are right in their blame.

The market day is over and work is all done for the busy. Those who came to call me in vain have gone back in anger. I am only waiting for love to give myself up at last into his hands.
Categories: Middle

ఆనతినీయరా { గీతాంజలి ~ 17 }

Wed, 09/08/2010 - 04:18
ఈ జగపు జాతరకి నాకు ఆహ్వానం అందింది, దానితో నా జన్మ ధన్యమైనది. నా కన్నులు కన్నాయి, చెవులు విన్నాయి

ఈ వేడుకలో నా పని నా వాయిద్యాన్ని స్వరపరచడం, మరి నేను చేయగలిగినదంతా చేసాను

ప్రభూ, ఇప్పుడు నేను అడుగుతున్నాను, చివరికి నేను బయలుదేరి నీ రూపాన్ని కాంచి మౌనంగా ప్రణమిల్లే సమయము ఆసన్నమైనదా అని?


చావా కిరణ్ అనువాదం ఇక్కడ


I have had my invitation to this world's festival, and thus my life has been blessed. My eyes have seen and my ears have heard.

It was my part at this feast to play upon my instrument, and I have done all I could.

Now, I ask, has the time come at last when I may go in and see thy face and offer thee my silent salutation?
Categories: Middle

అసంకల్పిత గానం { గీతాంజలి ~ 16 }

Sun, 09/05/2010 - 14:23
నేను ఇక్కడ నీ పాటలు పాడటానికే ఉన్నాను. నీ ఈ కొలువులో నా ఆసనం ఒక మూలన

నీ సమక్షంలో నాకు చేయ పనే లేదు; నా కొరగాని జీవితం వ్యర్థ రాగాలుగా మాత్రమే ప్రేలగలుగుతుంది

నిశి రాతిరిలో చీకటి మందిరాన నీ మౌన ఆరాధనకి ఘడియ మ్రోగినపుడు, నా ప్రభూ నన్ను ఆజ్ఞాపించు, నీ ముందు నిలబడి పాడటానికి.

వేకువ గాలులలో దివ్య తంత్రులు శృతి చేయబడుతున్నపుడు, నీ సన్నిధికి ఆజ్ఞాపించి నన్ను అనుగ్రహించు



చావా కిరణ్ అనువాదం ఇక్కడ



I am here to sing thee songs. In this hall of thine I have a corner seat.

In thy world I have no work to do; my useless life can only break out in tunes without a purpose.

When the hour strikes for thy silent worship at the dark temple of midnight, command me, my master, to stand before thee to sing.

When in the morning air the golden harp is tuned, honour me, commanding my presence.
Categories: Middle

నీ బదులు { గీతాంజలి ~ 15 }

Sun, 08/29/2010 - 11:40
నీవు పలుకకపోతే నీ మౌనాన్నే నా హృదయం నిండా నింపుకుని ఓర్చుకుంటాను

నేను కదలకుండా రాత్రిలా నక్షత్రాలనే కళ్ళుగా చేసుకుని జాగురుకతతో

తలవంచుకుని సహనంతో ఎదురుచూస్తాను

తప్పకుండా తెలవారుతుంది, అంధకారం అంతర్ధానమవుతుంది

అపుడు నీ స్వరం దివ్యమైన తరంగిణిలా నింగిని చేధించుకుని జాలు వారుతుంది

నీ మాటలు నా ప్రతి పక్షి గూటి నుండి పాటల్లా రెక్కలు విచ్చుకుంటాయి

నీ రాగాలు నా వనాల్లో పువ్వుల్లా వెల్లువిరుస్తాయి


చావా కిరణ్ అనువాదం ఇక్కడ


If thou speakest not I will fill my heart with thy silence and endure it.
I will keep still and wait like the night with starry vigil
and its head bent low with patience.
The morning will surely come, the darkness will vanish,
and thy voice pour down in golden streams breaking through the sky.
Then thy words will take wing in songs from every one of my birds' nests,
and thy melodies will break forth in flowers in all my forest groves.
Categories: Middle

నీ తిరస్కృతి { గీతాంజలి ~ 14 }

Sat, 08/28/2010 - 01:28
నా కోరికలు అనేకం, నా మొర దైన్యం

కానీ నిత్యమూ నన్ను నీ నిండు తిరస్కారాలతో కాపాడుతూనే ఉన్నావు;

ప్రబలమైన నీ కరుణతో నా జీవితమంతా రూపుదిద్దావు

దిన దినము నువ్వు నన్ను సాధు యోగ్యుడిగా చేయుచున్నావు

నన్ను అతివిస్తారమైన కోరికల అపాయాల నుండి కాపాడుతున్నావు.

అడగకుండానే నువ్వు నాకు ప్రసాదించిన శ్రేష్టమైన కానుకలు

ఈ నింగీ, వెలుగు, ఈ దేహము, ప్రాణము ఇంకనూ బుద్ధి.

కొన్ని సమయాల్లో నేను నిస్త్రాణంగా నిలిచి ఉన్నాను

మరి కొన్ని సార్లు మేలుకొని నా లక్ష్యం కోసం ఆతురతతో వెతికాను;

కానీ నువ్వు మాత్రం నిర్దయగా నా కంట పడక దాగి ఉన్నావు

దిన దినమూ నువ్వు నన్ను నీ పూర్తి అంగీకారానికి యోగ్యుడిగా చేయుచున్నావు

నన్ను పదేపదే తిరస్కరిస్తూ, దుర్గుణాల అపాయాల నుండి, చంచలమైన కోరికల నుండి కాపాడుతూ...


చావా కిరణ్ అనువాదం ఇక్కడ


My desires are many and my cry is pitiful,
but ever didst thou save me by hard refusals;
and this strong mercy has been wrought into my life through and through.
Day by day thou art making me worthy of the simple,
great gifts that thou gavest to me unasked---this sky and the light, this body and the
life and the mind---saving me from perils of overmuch desire.
There are times when I languidly linger
and times when I awaken and hurry in search of my goal;
but cruelly thou hidest thyself from before me.
Day by day thou art making me worthy of thy full acceptance by
refusing me ever and anon, saving me from perils of weak, uncertain desire.
Categories: Middle

దివ్య దర్శనం { గీతాంజలి ~ 13 }

Fri, 08/27/2010 - 08:57
ఏ పాట అయితే పాడటానికి వచ్చానో అది నేటికీ పాడలేదు

నా కాలాన్నంతా నా వాయిద్యానికి తంతులు వేయడంలోను తీయడంలోను గడిపేసాను

సమయం ఇంకా రాలేదు, పదాల పొందికా కుదరలేదు

నా హృదయంలో వేదనాభరిత కోరిక మాత్రం మిగిలి ఉంది

ఇంకా మొగ్గ విచ్చుకోలేదు; గాలి మాత్రం భారంగా కదులుతుంది

నేను అతని రూపమూ ఎరుగను, అతని స్వరమూ ఎరుగను

నేను విన్నది నా వాకిట ముంగిట ఆతని మృదువైన అడుగుల జాడ మాత్రమే

పగలంతా నేల మీద అతని పీఠం పరచడంలోనే గడిచిపోయింది

కానీ దీపం వెలిగించలేదు అందుకే అతన్ని లోపలకి ఆహ్వానించలేను

అతనిని కలుసుకోవాలనే ఆశతో బతుకుతున్నాను; కానీ దర్శనం ఇంకా జరగలేదు.




The song that I came to sing remains unsung to this day.
I have spent my days in stringing and in unstringing my instrument.
The time has not come true, the words have not been rightly set;
only there is the agony of wishing in my heart.
The blossom has not opened; only the wind is sighing by.
I have not seen his face, nor have I listened to his voice;
only I have heard his gentle footsteps from the road before my house.
The livelong day has passed in spreading his seat on the floor;
but the lamp has not been lit and I cannot ask him into my house.
I live in the hope of meeting with him; but this meeting is not yet.
Categories: Middle

దివ్య ధామము ... { గీతాంజలి ~ 12 }

Tue, 08/24/2010 - 15:43
నా యాత్ర తీసుకునే సమయమూ దాని దారీ నిడుపాటి

నేను తొలి కిరణాల వెలుగు రథం మీద బయలుదేరి లోకాల అరణ్యాల గుండా నా యానాన్ని కొనసాగించాను, నక్షత్రాలపై గ్రహాలపై నా జాడ వదలి

అది నిను సమీపించగలిగే సుదూరమైన మార్గము, క్లిష్టమైన ఆ తర్ఫీదు శుద్ధ ఏకరాగ ముగ్ధతని పరిచయం చేస్తుంది

యాత్రికుడు తన వాకిలి చేరడానికి ప్రతి అన్య వాకిలిని తట్టాల్సిందే, మరి అన్ని బాహ్య లోకాలని తిరగాల్సిందే చివరకి లోపలి కోవెల చేరడానికి

నా నయనాలు దశదిశలా శోధించాయి, వాటిని మూసి "ఇక్కడే ఉన్నావు ప్రభూ" అని చెప్పే ముందు

"ఎక్కడ ఉన్నావు ప్రభూ?" అనే నా ప్రశ్నా రోదనలు, "ఇదిగో నేను" అనే వెల్లువెత్తే హామీతో, వేన ప్రవాహాల కన్నీళ్ళలా కరిగి ఈ లోకాన్ని ప్రళయంలో ముంచెత్తుతాయి





The time that my journey takes is long and the way of it long.

I came out on the chariot of the first gleam of light, and pursued my voyage through the wildernesses of worlds leaving my track on many a star and planet.

It is the most distant course that comes nearest to thyself, and that training is the most intricate which leads to the utter simplicity of a tune.

The traveller has to knock at every alien door to come to his own, and one has to wander through all the outer worlds to reach the innermost shrine at the end.

My eyes strayed far and wide before I shut them and said `Here art thou!'

The question and the cry `Oh, where?' melt into tears of a thousand streams and deluge the world with the flood of the assurance `I am!'
Categories: Middle

మానస గిరి

Thu, 08/19/2010 - 06:12




చిందరవందరగా మనసు
ఒక రూపు రాని అదుపు లేని ఆలోచనలు ఎన్నో
మదిస్తాయి మరిపిస్తాయి మొరపెడతాయి
అపుడపుడూ ఆశ్చర్యంగా ఒకదానితో ఒకటి అల్లుకుంటాయి
అందమైన కవితలవుతాయి
అక్కడక్కడా వ్రేళ్ళూనుకుని నిటారుగా నిలబడి
ఆ కొండ ఏటవాలుని వెక్కిరిస్తున్న సరుగుడు చెట్లలా
నా మనసుని వెక్కిరిస్తాయి
చూడడానికి అన్ని చెట్లూ ఒకేలా ఉంటాయి
అయితే అవ్వనీ కొండ నిండుగా ఉన్నాయి
కొండని కొలవాలనుకునే వాళ్ళకి ప్రతి చెట్టూ కొలువే
ప్రతి చెట్టూ కొండని అధిరోహించడానికి స్పూర్తే
కొండ ఎదుగుతుందట తెలుసా
ఎంత ఎదుగుతుంటే అన్ని చెట్లు
ఎవరు అధిరోహిస్తారో ఆ కొండని?
ఆక్రమించి చదును చేస్తే బాగుండు..
Categories: Middle

మనసు మాట వినదు

Tue, 08/10/2010 - 05:12
నీరెండలో చలి కాచుకుంటూ ఉంటాను
ఏ చిలిపి మేఘమో సూరుడికి అడ్డం పడుతుంది
ఒక్కసారిగా వణికిపోతాను

మండుటెండలో పొలంలోని కొలనులో బట్టలిప్పి స్నానానికి దిగుతాను
ఇంతలో దట్టమైన మేఘాలు అల్లుకుంటాయి
బట్టలు తడిపేస్తాయి

అటుగా ఏదో అందం కదులుతుంటుంది చూడబోతాను
గాలి వీస్తుంది అది జారుకునేంత వరకూ
కళ్ళల్లో దుమ్ముని చూస్తాను

ఎండా వానా ఒకేసారి కాపు కాస్తాయి
ఎవరో ఎవరితోనో కలుస్తారు
అయోమయాతిశయంలో నేను

నడిచి నడిచి అలసి ఆగిపోతాను దాహంతో
దూరంగా తడి కనపడి పరుగులుతీస్తాను
నా నిట్టూర్పులు ఎండమావుల్లో కలిసిపొతాయి

ఏకాంత వనం లో ఎద ఏదో రాగం ఆలపిస్తూ ఉంటుంది
ఇంతలో ఆలోచనలు సీతాకోకచిలుకలైపోతాయి
పట్ట బుద్ధీ కావు ఒక్క చోటా నిలవవూ
.
.
.

ప్రకృతి లీలలు అంతుబట్టవు
మనసేమో మాట వినదు...
Categories: Middle

అనుజడి

Sat, 07/31/2010 - 14:16



స్తబ్ధుగా తను
ఎప్పుడు కుండపోతా అన్నట్టు ఆకాశం
దట్టమైన ఆ మేఘాలు ఎక్కడి నీటితో అల్లుకున్నాయో?
ఏ ఆలోచనల ఆవిరి ఆమె కళ్ళలో ముసురుకుందో?
ఏ పవనమో వీచి ఏ మేఘాన్నో కరిగించింది..
జన జనా వాన
చెట్లపైనా
గుట్లపైనా
ఏం జరిగిందో మరి ఆ కళ్ళూ కరిగాయి
టపా టపా కన్నీరు
చెక్కిళ్ళపైనా
గుండెలపైనా
జన జనా వాన
టప టపా కన్నీరు

ఒక్కసారిగా ఆగిపోయాయి

మళ్ళీ ఏం జరిగిందో మరి
జన జనా వాన
టప టపా కన్నీరు

మళ్ళీ ఆగిపోయాయి

వాన కురిసింది కన్నీరు కురిసింది
వాన కురిసింది కన్నీరు కురిసింది

ఏ ఆలోచనల ఆవిరి తన కళ్ళలో ముసురుకుంది?

ఈ జడి ఈ రోజు ఆగేనా?
Categories: Middle

బెంగతో తపిస్తున్నా..

Wed, 07/28/2010 - 13:08




చందమామ, చావిడి నాకోసమే ఎదురుచూస్తున్నాయి…
నా తోడు నాతో ఉంటే ఈ సాయంత్రం చల్ల గాలిలో సరాగాల సరిగమలే కదా..

~~~~~~~~~~~~~~





ఎదురుగా చందమామ
ఏం ఆలోచిస్తున్నావు అంది?
మౌనమే నా సమాధానం…
చూసావా నువ్వెక్కడికెళ్తే నేనక్కడ నీతో ఉన్నాను అంది
ఏం ఆలోచిస్తున్నానో తనకి తెలుసు అన్నట్టు కొంటెగ రెట్టిస్తూ…
అప్రయత్నంగానే మౌనం వీడిపోయింది
అన్నాను చందమామతో…
నువ్వు ఎక్కడికొచ్చినా ఆకాశంలోనే నీ గూడు
తను రాలేకపోయినా నా ఎదలోనే తన గూడు
ఎక్కడికెళ్ళినా ఆ నది నిన్ను తనలో నిలుపుకున్నట్టు అని..
చందమామ నవ్వుతుంది.. మురిపెంగా…
నది ఎదలో ఆ నవ్వులు మరింత మెరిసాయి…


~~~~~~~~~~~~~~





చందమామని జల్లెడతో పట్టాలని ఆ ఆనకట్ట ఆకాశానికేగుతుంది…
ఎంత ఎత్తులో ఉందని ఆ నది చందమామని పట్టింది?


~~~~~~~~~~~~~





నీకూ నాకూ మధ్య ఆ తెరలు ఈ దూరం తరిగే వరకే!


~~~~~~~~~~~~~~~






ఎన్ని సంద్రాలు దాటినా
ఎన్ని దారులు మారినా
నా గమనమూ నువ్వే
నా గమ్యమూ నువ్వే

ఎన్ని భాషలు నేర్చినా
ఎంత మందిని కలిసినా
నా ఊహలు నువ్వే
నా జాబిలి నువ్వే

~~~~~~~~~~~~~~~


నా ఫ్రెండ్, పెళ్ళానికి దూరంగా డబ్లిన్ లో విరహంతో,బెంగతో ఒంటరిగా ఏం చెయ్యాలో తెలియక కేమెర తో ఫోటోలు తీసుకుంటున్నాడు. ఇందులో ఫోటోలు వాడు తీసినవే. వాళ్ళిద్దరి కోసం నా రాతలు జోడించాను.
Categories: Middle

మేఘాలు

Tue, 07/27/2010 - 09:55





ఒక్కోసారి స్తబ్దుగా అల్లుకుంటాయి
ఒక్కోసారి ఉరుములు, మెరుపులతో విజృంభిస్తాయి
ఒక్కోసారి వాయు వేగంతో విన్యాసాలు చేస్తాయి

ఎప్పుడు కరుగుతాయో
ఎప్పుడు కలవరపెడతాయో
ఎప్పుడు మురిపిస్తాయో

అంతే చిక్కవు
కానీ ఎప్పుడూ కవ్విస్తూనే ఉంటాయి

మేఘాలు ఆడవే అయి ఉంటాయి.
Categories: Middle

వర్షం

Mon, 07/26/2010 - 03:31
అసలైతే ఆ చెట్టు కొమ్మలు చేతికందేవే కావు
వాన కురిసింది
వొంగిన ఆ కొమ్మలు పిల్లల చేతుల్లో పుల్లలవుతున్నాయి.

అసలైతే ఆతను నిబ్బరానికి చిరునామా
కన్నీళ్ళు కురిసాయి
కుంగిన ఆతను పది మందిలో పలుచన అయ్యాడు
Categories: Middle

ఆకాశ కుసుమం

Sat, 07/17/2010 - 14:22


చూస్తున్నాను
మెల్లగా మబ్బు పరదా కప్పేసుకుంటుంది ఆకాశం
గతపు ఆనవాళ్ళ చుక్కలని దాచేస్తూ
అడిగాను ఎందుకని?
అంది "I need some space" అని

పరదా చాటున ఆకాశం
ఏదీ మైమరపించిన నీ విశాలత్వం?
Categories: Middle

నిదురపో నేస్తం...

Sat, 07/03/2010 - 14:50


ఇవి ఈ మధ్య నా ఊహలు చెప్పిన ఊసులు...
కొన్ని అమ్మాయి ఊహలని అబ్బాయి చెప్తున్నట్టు, కొన్ని అమ్మాయికి అబ్బాయి చెప్పే ఊసులు..

~~~~~~~~~~~~~~~

కోటీ కలలా నీ కళ్ళూ
కోటీ చుక్కాలా నీలాంబరాలూ
చుక్కాలున్నాచోటే చందురూడూ
చిక్కేను నీ కనుల ఓ నిండూ పున్నమీ నాడూ

~~~~~~~~~~~~~~~

అడగాలేదని నేనూ అడగాలేదని
అలిగినా నీ కళ్ళు మండే గోళాలు
పలకనీ నీ పెదవులు పట్టు కర్రలు
బుంగా మూతీ నీ బుగ్గలు కఠిన పాషాణాలు
అడగాలేదనీ అలకెందుకే
అడుగుతాననీ తెలిసీ కులుకెందుకే
నీ అలకనీ నేనూ ఓర్చలేనూ
ఇదిగో అడుగుతున్నాను నేను ప్రేమతో
చెలీ, కనికరించి నను కాసుకో!

~~~~~~~~~~~~~~

కలత చెందకు నేస్తం
కలలు కనే కళ్ళని కనికరించు నేస్తం
కలలు నిజమాయే వేళ రాలేదని
కను రెప్పల కౌగిలిని కనుపాపలకి దూరం చెయ్యకు నేస్తం
నిజమయ్యే కలలని నిండుగా చూపించేందుకు
ఆ కనుపాపలకి విరామం కావాలి నేస్తం
కలత చెందకు నేస్తం
నిదురపో నేస్తం

~~~~~~~~~~~~~~

కనుల కొలనులో కౌముది నిలిచే వేళలో
మనసు నీరధిలో అలలు నిను తలచే వేళలో
కలల తీరానికి నను చేర్చమని
నను ఈ అలల తాకిడి నుండి తప్పించమని
నెలరాజుని నిలదీస్తున్నాను..

~~~~~~~~~~~~~~

అడిగినా సరే అడగాలేదని అంటావు
నువ్వడిగిందే ముందూ అంటావూ
నేననడిగింది కానే కాదంటావు
వేడుకోలుకి వేళేనా ఇది?
నీ దోబూచులాటలో దారేది?
చెలీ చెప్పుకుంటున్నానూ
ఇలా వచ్చి ఆలకించూ..

~~~~~~~~~~~~~~

మౌనమే నీ బాష అయినపుడు
నీ ఉనికిలో ఒదిగిపోతా
నీరవ నిశీధిలో చంద్రాన్ని కనుగున్నట్టు
నిను చూస్తూ నీ ఒడిలో నిదురపోతా

~~~~~~~~~~~~~~
Categories: Middle

శూన్యత

Fri, 06/18/2010 - 09:12
మేఘ మాల పరుగులు తీస్తుంది
వాటి వెనక తారలూ తళుక్కుమంటున్నాయి
నెలవంక అంత నిండుగా ఉంది ఏంటో!
ఆకు ఆకు మాట్లాడుకోటానికి చిరుగాలి సాయం చేస్తుంది
ప్రశాంతత అంతా ఆవరించి ఉంది
మాములుగా అయితే ఈ బాహ్య స్థితి నాలో ఓ భావ ప్రపంచాన్నే సృష్టిస్తుంది
కానీ ఇప్పుడేంటి?
పట్టుకుందామంటే ఒక్క ఆలోచన లేదు!
గడచిన క్షణం ఏం పలికించింది నాలో?
ఈ క్షణం? ఏమీ లేదు
అంతా శూన్యం
Categories: Middle

అమ్మమ్మ

Mon, 06/14/2010 - 04:29
నాకు గుర్తే లేదు
నువ్వే అమ్మవి మమ్మీ అమ్మ కాదు అన్నానంట
కానీ మమ్మీని అమ్మని ఒప్పుకోడానికి ఎన్నేళ్ళు పట్టిందో
నాకింకా గుర్తే

నా చిట్టి చేతులు నీ కోసం ఎన్ని పనులు చెయ్యాలనుకునేవి
పొయ్యిలో పుల్లల్ని, రోటిలో పిండిని ఎగతోయడం
నీళ్ళు పట్టడం, పిడకలు చెయ్యడం
నువ్వు ఏం చేస్తే అదీ నేనూ

మనింటికి కొత్తవాళ్ళెవరు వచ్చినా నా చోటు నీ కొంగు చాటే
ఆడి ఆడి పరుగున వచ్చి నీ ఓడిలో ముడుచుకుని ఒదిగిపోయేవాడిని
నువ్వు తల నిమురుతుంటే అలసట మాయమయ్యేది
నీ ఒడి వాసన నాకింకా గుర్తే అమ్మా

ఆరుబయట నులకమంచమ్మీద నక్షత్రాలని లెక్కబెడుతూ
సమాధానాలు తెలియని ప్రశ్నలెన్ని ఉన్నా
నీ మీద చేయి వేసుకుని పడుకున్న అప్పటి కన్నా
భద్రంగా నేనెప్పుడైనా ఉన్నానా?

నీ మాటల్లో ఎంత ఆపేక్ష నా గురించి చెప్పేప్పుడు
వీడికి నేనే లెక్కలు నేర్పించానని
వీడిని నేనే కాపాడుకున్నానని
వీడు నా పక్కలోనే పడుకుంటాడు అని

నువ్వు జబ్బు పడి ఎముకలైపోయినప్పుడు నిను చూడటానికి వచ్చాను
నను చూడగానే రా నా పక్కన పడుకో అన్నావు
నే పడుకోలేదు, ఏ చిన్న కదలికతో నీ మీద ఒరిగిపోతానేమోనని భయం
కానీ ఇప్పుడనిపిస్తుండి నీ పక్కనే పడుకునుండాల్సింది
Categories: Middle

...ఎంత?

Wed, 06/09/2010 - 13:10

ఎదురుచూపు కనుగిలుపుల కను రెప్పల బరువెంత?
తీరని దాహపు గొంతు గుటకల మంటెంత?
చేరువవని గమ్యపు పరుగు రొప్పి వేగమెంత?
ఆరని ఆశల మనసు అలుపెంత?
.
.
.
ఏకాంతాన పార్క్లో జంటకి చిక్కిన బెంచి విలువెంత?
ఎడబాటుని చెరిపే ఆలింగనపు దగ్గరతనమెంత?
.
.
Categories: Middle

ప్రియోదయం చూడాలని

Fri, 06/04/2010 - 13:05

ఏ కోడో కూస్తుందని
నీ ఉనికిని చాటుతుందని
ఎటు సాగినా
మెలకువ నను వీడలేదు
నే నడకా ఆపలేదు
నిద్ర నన్నావహించనంటుంది
నడక పరుగవుతానంటుంది
దిక్కులు తెలియకుండా సాగుతుంది నా పయనం
నీ దిక్కుకి చేరుకోవాలని
నీలో నా మనోదయాన్ని చూడాలని
Categories: Middle