http://cckrao2000.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
......................................పనికి వచ్చే పరిజ్ఞానం (560కు పైగా పోస్టులు, 34 విభాగాలు)
Updated: 36 min 31 sec ago

జూలై 2010-4 (July 2010-4)

Thu, 07/29/2010 - 14:25
  • 2010 సంవత్సరపు లోకమాన్యతిలక్ అవార్డు ఎవరికి లభించింది--షీలా దీక్షిత్.
  • పాకిస్తాన్‌లో ఘోరవిమాన ప్రమాదం ఏ నగర సమీపంలో జరిగింది--ఇస్లామాబాదు.
  • ఇటీవల మరణించిన బ్లాక్‌బాక్స్ రూపకర్త--డేవిడ్ వారెన్.
  • గాలె టెస్టులో 800 వికెట్లు సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించిన శ్రీలంక బౌలర్--ముత్తయ్య మురళీధరన్.
  • ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ది అభివృద్ధి బృందంలో సభ్యులుగా ఎంపికైన భారత పారిశ్రామికవేత్త--ముఖేష్ అంబానీ.
  • 2010 జాతీయ హాకీ చాంపియన్ టైటిన్ సాధించిన జట్టు--హర్యానా.
  • జూలై 20న మరణించిన భారత మాజీ అటార్నీ జనరల్--మిలాన్ కుమార్ బెనర్జీ.
  • లైంగిక ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా చేసిన భారత మహిళల హాకీ జట్టు కోచ్--కౌశిక్.
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్య సమాచార కమీషనర్‌గా ఎవరు ఎన్నికయ్యారు--జన్నత్ హుస్సేన్.
  • అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 7వ జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది--కొచ్చి.

ఇవి కూడా చూడండి ... జూలై 2010-1, 2, 3,

విభాగాలు: 2010,

Categories: Middle

కాసు బ్రహ్మానందరెడ్డి (Kasu Brahmananda Reddy)

Wed, 07/28/2010 - 14:15

(కాసు బ్రహ్మానందరెడ్డి జన్మదినం సందర్భంగా)

  • కాసు బ్రహ్మానందరెడ్డి ఎప్పుడు జన్మించారు--జూలై 28, 1909.
  • కాసు బ్రహ్మానందరెడ్డి జన్మించిన గ్రామం--చిరుమామిళ్ళ (గుంటూరు జిల్లా, నాదెండ్ల మండలం).
  • ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనంతరం నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో కాసు బ్రహ్మానందరెడ్డి చేపట్టిన శాఖ--పంచాయతీరాజ్ శాఖ.
  • కాసు బ్రహ్మానందరెడ్డి ఏ సం.లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు--1977.
  • ఏ ఆర్థిక సంఘానికి కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షుడిగా కొనసాగినారు--6వ ఆర్థిక సంఘము.
  • కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు--1964 ఫిబ్రవరి 29.
  • కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగిన ఉద్యమం--జైతెలంగాణ ఉద్యమం.
  • జైతెలంగాణ ఉద్యమం ఫలితంగా కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవిని ఎప్పుడు కోల్పోయారు--1971 సెప్టెంబరు.
  • కాసు బ్రహ్మానందరెడ్డి ఏ రాష్ట్రానికి గవర్నరుగా వ్యవహరించారు--మహారాష్ట్ర.
  • కాసు బ్రహ్మానందరెడ్డి ఎప్పుడు మరణించారు--మే 20, 1994.

విభాగాలు: వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, రాజకీయాలు, మహారాష్ట్ర,

Categories: Middle

అలాన్ బోర్డర్ (Allan Border)

Tue, 07/27/2010 - 14:25

(అలాన్ బోర్డర్ జన్మదినం సందర్భంగా)

  • అలాన్ బోర్డర్ ఏ క్రీడలో ప్రసిద్ధుడు--క్రికెట్.
  • అలాన్ బోర్డర్ ఏ దేశస్థుడు--ఆస్ట్రేలియా.
  • అలాన్ బోర్డర్ టెస్టులలో చేసిన పరుగుల సంఖ్య--11174 (2005 వరకు ప్రపంచ రికార్డు).
  • అలాన్ బోర్డర్ రికార్డుకు ముందు అత్యధిక పరుగుల రికార్డు ఎవరి పేరిట ఉండేది--సునీల్ గవాస్కర్.
  • 2005లో అలాన్ బోర్డర్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును ఎవరి అధికమించారు--బ్రియాన్ లారా (వెస్టీండీస్).
  • ఇప్పటికీ అలాన్ బోర్డర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డులు--వరుసగా అత్యధిక టెస్టులకు ప్రాతినిధ్యం వహించడం, అత్యధిక టెస్టులకు నేతృత్వం వహించడం.
  • అలాన్ బోర్డర్ పేరిట ఉన్న ఆస్ట్రేలియా తరఫున టెస్టులలో అత్యధిక పరుగుల రికార్డును ఎవరు అధికమించారు--రికీపాంటింగ్ (2009లో).
  • అలాన్ బోర్డర్ టెస్టులలో చేసిన సెంచరీల సంఖ్య--27.
  • అలాన్ బోర్డర్ ఆత్మకథ--Beyond Ten Thousand: My Life Story.
  • అలాన్ బోర్డర్ కు విజ్డెన్ క్రికెటర్‌గా గౌరవం ఎప్పుడు లభించింది--1982.

ఇవి కూడా చూడండి ... ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు.

విభాగాలు: వ్యక్తులు, క్రీడలు, క్రికెట్, ఆస్ట్రేలియా,

Categories: Middle

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project)

Mon, 07/26/2010 - 14:25
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉన్నది--గోదావరి నది.
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో కలదు--నిజామాబాదు జిల్లా.
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏ మండలంలో ఉన్నది--బాల్కొండ.
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్వపుపేరు--పోచంపాడు ప్రాజెక్టు.
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర నిర్మించిన ప్రాజెక్టు--బాబ్లీ ప్రాజెక్టు.
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్తు వలన నీటిని పొందే థర్మల్ విద్యుత్ కేంద్రం--రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం.
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల పేర్లు--కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలు.
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించారు--1963.
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సమీపంలోని పెద్ద పట్టణం--నిర్మల్ (ఆదిలాబాదు జిల్లా).
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రాన్ని ఎప్పుడు ప్రారంభించారు--1983.

విభాగాలు: ఆంధ్రప్రదేశ్, ప్రాజెక్టులు, నిజామాబాదు జిల్లా, గోదావరి నది.

Categories: Middle

షిర్డీ సాయిబాబా (Shirdi Saibaba)

Sun, 07/25/2010 - 14:20

(గురుపూర్ణిమ సందర్భంగా)

  • సాయిబాబా దివ్యక్షేత్రం ఎక్కడ కలదు--షిర్డీ.
  • షిర్డీ ఏ రాష్ట్రంలో ఉన్నది--మహారాష్ట్ర.
  • గురుపూర్ణిమ ఎప్పుడు జరుపుకుంటారు--ఆషాడశుద్ధ చతుర్థశి నాడు.
  • సాయిబాబా షిర్డీలో నివశించిన ప్రదేశం--ద్వారకామాయి.
  • సాయిబాబాకు తొలిసారిగా పూజలు ఎప్పుడు చేశారు--1909 (ఆషాడశుద్ధ చతుర్థశి నాడు).
  • సాయిబాబాకు తొలిసారిగా సాయి పేరుతో పలికినది--మహల్సాపతి (పూజారి మరియు సాయి మహాభక్తుడు).
  • సాయిబాబా షిర్డీలో తొలిసారిగా ఎప్పుడు కాలుపెట్టారు--1854.
  • సాయిబాబా తన జీవితాన్ని ఎప్పుడు చాలించారు--1915 అక్టోబరు 15 (విజయదశమినాడు).
  • షిర్డీలో సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్టించారు--1954.
  • సాయిబాబా మందిరానికి సంబంధించిన ట్రస్ట్--సాయి సంస్థాన్ ట్రస్ట్.

ఇవి కూడా చూడండి ... సత్యసాయిబాబా,

విభాగాలు: హిందూదేవతలు, మహారాష్ట్ర,

Categories: Middle

ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan)

Fri, 07/23/2010 - 14:25
  • ఇటీవల ముత్తయ్య మురళీధరన్ సాధించిన ఘనత--టెస్టు క్రికెట్‌లో 800 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా అవతరించాడు.
  • ముత్తయ్య మురళీధరన్ ఏ దేశస్థుడు--శ్రీలంక.
  • ఎవరిని ఔట్ చేయడం ద్వారా ముత్తయ్య మురళీధరన్ కు 800వ వికెట్టు లభించింది--ప్రజ్ఞాన్ ఓజా (భారత్) (గాలె టెస్టులో).
  • ముత్తయ్య మురళీధరన్ యొక్క తొలి టెస్ట్ వికెట్టు ఎవరిది--మెక్‌డర్మట్ (ఆస్ట్రేలియా).
  • మురళీధరన్ తరువాత టెస్టులలో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు ఎవరు పేరిట ఉంది--షేర్‌వార్న్ (ఆస్ట్రేలియా).
  • మురళీధరన్ 800 వికెట్లను ఎన్ని టెస్టులు ఆడి సాధించాడు--133.
  • ఏ బౌలింగ్ శైలి వల్ల ముత్తయ్య మురళీధరన్ పలుమార్లు న్యాయసవాళ్ళు ఎదుర్కొన్నాడు--దూస్రా.
  • ముత్తయ్య మురళీధరన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏ జట్టు తరఫున ఆడినాడు--చెన్నై సూపర్ కింగ్స్.
  • ముత్తయ్య మురళీధరన్ తొలి వన్డే పోటీ 1993లో ఏ దేశంతో ఆడినాడు--భారత్‌పై.
  • ముత్తయ్య మురళీధరన్ ఎన్ని మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులతో టెస్ట్ క్రికెట్‌లో ప్రథమస్థానంలో నిలిచిఉన్నాడు--11.

ఇవి కూడా చూడండి ... శ్రీలంక క్రికెట్ జట్టు.

విభాగాలు: వ్యక్తులు, క్రీడలు, క్రికెట్, శ్రీలంక,

Categories: Middle

దాశరథి కృష్ణమాచార్య (Dasarathi Krishnamacharya)

Thu, 07/22/2010 - 11:00

(దాశరథి కృష్ణమాచార్య జన్మదినం సందర్భంగా)

  • దాశరథి కృష్ణమాచార్య ఎప్పుడు జన్మించాడు--జూలై 22, 1925.
  • దాశరథి జన్మించిన గ్రామం--వరంగల్ జిల్లా మరిపెడ మండలం చిన్నగూడూరు.
  • దాశరథి ఏ రంగంలో ప్రసిద్ధి చెందినారు--కవిత్వం, తెలంగాణ విమోచనోద్యమం.
  • దాశరథి యొక్క ముఖ్య కొటేషన్--నా తెలంగాణ కోటి రతనాల వీణ.
  • 1977 నుంచి 1983 వరకు దాశరథి నిర్వహించిన రాష్ట్ర పదవి--ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి.
  • దాశరథి రచించిన తొలి కవితా సంకలనం--అగ్నిధార.
  • ఏ రచనకు గాను దాశరథికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది--తిమిరంలో సమరం.
  • రాష్ట్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన దాశరథి రచన--కవితాపుష్పకం.
  • హైదరాబాదు నిజాంను విమర్శించుతూ దాశరథి చేసిన కవితా వ్యాఖ్య--ఓ నిజాము పిశాచమా! కానరాడు నిను బోలిన రాజు మాకెన్నెడేని.
  • దాశరథి ఎప్పుడు మరణించాడు--నవంబరు 5, 1987.

విభాగాలు: వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్, వరంగల్ జిల్లా,

Categories: Middle

జూలై 2010-3 (July 2010-3)

Wed, 07/21/2010 - 14:25
  • పశ్చిమబెంగాల్‌లో 148 మంది ఘోర రైలుప్రమాదం ఏ స్టేషన్‌లో జరిగింది--బీర్బం జిల్లా సెయింథియా.
  • రూపాయికి కొత్తగా ప్రకటించిన గుర్తును ఎవరు తయారుచేశారు--డి.ఉదయ్ కుమార్.
  • ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు--ఇమ్రాన్ ఖాన్.
  • జాతీయ రహదారుల పేర్లలో మార్పు వలన దేశంలో పొడవైన 7వ నెంబరు హైవేకు లభించిన కొత్త సంఖ్య--44.
  • బ్రిటీష్ గ్రాండ్ ప్రి ఫార్మూలా వన్ రేసును గెలుచుకున్నది--మార్క్ వెబర్.
  • ఈజిప్టు ఓపెన్ టెబుల్ టెన్నిస్ టైటిల్ సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు--ఆచంట శరత్ కమల్.
  • శ్రీహరికోట నుంచి 5 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రాకెట్--PSLV C-15.
  • ఫార్చూన్ పత్రిక ప్రకటించిన ప్రపంచంలోని 500 అతిపెద్ద కంపెనీలలో భారత్ తరఫున అత్యున్నత స్థానం పొందిన కంపెనీ--ఇండియన్ ఆయిల్ కంపెనీ (125వ స్థానం).
  • YMCA పేరును ఏ విధంగా మార్పుచేయబడింది--వై.
  • అత్యధిక సంఖ్యలో కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించిన హైకోర్టు న్యాయమూర్తి--టి.గోపాల కృష్ణ.

ఇవి కూడా చూడండి ... జూలై 2010-1, 2

విభాగాలు: 2010,

Categories: Middle

ప్రపంచ కప్ ఫుట్‌బాల్ 2010-2 (World Cup Football 2010-2)

Mon, 07/19/2010 - 14:25
  • ప్రపంచ కప్ ఫుట్‌బాల్ 2010లో ఉపయోగించిన జబూలానీ బంతిని తయారుచేసిన కంపెనీ--అడిదాస్.
  • జర్మనీ ఆడిన అన్ని మ్యాచ్‌లకు జోస్యం చేప్పిన జీవి--ఆక్టోపస్ (పాల్).
  • 2010 ప్రపంచ కప్ సాకర్ మస్కట్--జకుమి.
  • 2010 ప్రపంచ కప్ ఫూట్‌బాల్ అధికారిక గీతం--వాకా వాకా.
  • ప్రపంచ కప్‌లో భాగంగా మొత్తం ఎన్ని మ్యాచ్‌లు నిర్వహించబడ్డాయి--64.
  • 64 మ్యాచ్‌లు ఎన్ని వేదికలపై నిర్వహించబడ్డాయి--10 (9 నగరాలు- దక్షిణాఫ్రికా).
  • ప్రపంచ కప్ టోర్నీలో అత్యధికంగా 5 గోల్స్‌ను ఎందరు ఆటగాళ్ళు చేశారు--నలుగురు.
  • 2010 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఉత్తమ ఆటగాడు అవార్డు ఎవరికి లభించింది--డీగో ఫోర్లాన్ (ఉరుగ్వే).
  • గోల్డెన్ బూట్ అవార్డు ఎవరికి లభించింది--థామస్ ముల్లర్ (జర్మనీ).
  • 2010 ప్రపంచ కప్ సాకర్ టోర్నీలో ఆసియా నుంచి ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య--3.

ఇవి కూడా చూడండి ... ప్రపంచ కప్ ఫుట్‌బాల్, ప్రపంచ కప్ ఫుట్‌బాల్ 2010

విభాగాలు: క్రీడలు, ఫుట్‌బాల్, 2010,

Categories: Middle

ఉదయగిరి (Udayagiri)

Sun, 07/18/2010 - 07:10
  • ఉదయగిరి ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది--శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది పట్టాభిషేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
  • ఉదయగిరి ఏ జిల్లాలో ఉన్నది--శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
  • ఉదయగిరి కోటను ఎవరు నిర్మించారు--గజపతి రాజులు.
  • 1343లో ఉదయగిరిని జయించి విజయనగర సామ్రాజ్యంలో కలిపినది--కంపరాయలు (1464లో మళ్ళీ గజపతులు వశపర్చుకున్నారు).
  • 1512లో ఎవరిని ఓడించి శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకున్నాడు--గజపతిరాయలను ఓడించి.
  • శ్రీకృష్ణదేవరాయల దండయాత్ర సమయములో గజపతులరాజు--ప్రతాపరుద్ర గజపతి.
  • శ్రీకృష్ణదేవరాయలు ముచ్చటపడి ఉదయగిరి నుంచి హంపికి తీసుకువెళ్ళిన విగ్రహం--బాలకృష్ణుడి విగ్రహం.
  • ఉదయగిరి వశపర్చుకున్నాక శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి ప్రతినిధిగా ఎవరిని నియమించాడు--తిమ్మరుసు కుమారుడు కొండముసురయ్యను.
  • 1626లో ఉదయగిరి దుర్గాన్ని స్వాధీనం చేసుకున్న గోల్కొండ ప్రతినిధి--మీర్ జుమ్లా.
  • 1978, 1983లలో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకుడు--ఎం.వెంకయ్య నాయుడు.

విభాగాలు: ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, పట్టణాలు,

Categories: Middle

జూలై 2010-2 (July 2010-2)

Sat, 07/17/2010 - 14:25
  • వీరప్ప మొయిలీ రచించిన "తెంబారే" నవలను "కాలం అంచున" పేరుతో తెలుగులోకి అనువదించినది--దివ్యసునీతారాజ్.
  • తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విధ్వాంసుడిగా ఎవరు నియమించబడ్డారు--మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
  • కడప జిల్లా పేరును ఏ విధంగా మార్చారు--వైఎస్సార్ జిల్లాగా.
  • న్యాయశాస్త్రంలో వివిధ అంశాలపై 100 పుస్తకాలు రచించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి--పి.శంకర నారాయణ.
  • సంస్కృత శ్లోకాలతో అంబేద్కర్ జీవిత చరిత్రను రచించినది--ప్రభాకర్ జోషి.
  • శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ప్రజలు దేనికొరకు ఉద్యమించారు--థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకంగా.
  • రూపాయికి చిహ్నం రూపొందినది--డి.ఉదయ్ కుమార్.
  • ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్‌లో రెండోస్థానం పొందిన భారతీయురాలు--సైనా నెహ్వాల్.
  • ఆంధ్రప్రదేశ్‌లో హిందీ భాషవ్యాప్తికి కృషిచేసి ఇంటీవల మరణించిన సాహితీవేత్త--వేమూరి రాధాకృష్ణమూర్తి.
  • ఇటీవల అమర్త్యాసేన్‌కు డాక్టరేట్‌తో సత్కరించిన బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయం--క్వీన్స్ విశ్వవిద్యాలయం.

విభాగాలు: 2010,

Categories: Middle

సోంపేట (Sompet)

Fri, 07/16/2010 - 14:09
  • సోంపేట ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది--పోలీసుల కాల్పులు, ప్రతిపక్షాల ఆందోళన.
  • సోంపేట ఏ జిల్లాలో ఉంది--శ్రీకాకుళం.
  • సోంపేటలో నిర్మించతలపెట్టినది--థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు.
  • థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ఏ కంపెనీ నిర్మించాలని తలపెట్టింది--నాగార్జున కన్‌స్ట్రక్శన్ కంపెనీ.
  • సోంపేట థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి పర్యావరణ అనుమతి ఎప్పుడు లభించింది--2009 డిసెంబరు 9.
  • సోంపేటలో ఎన్ని మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు న్ర్మించాలని తలపెట్టారు--2640 మెవా.
  • ఇటీవల పర్యావరణ అనుమతి రద్దుచేయుటకు కారణం--పర్యావరణ ప్రాధాన్యమున్న భూములున్నందున.
  • థర్మల్ ప్రాజెక్టును ఏ ప్రాంతంలో నిర్మించాలనే ప్రతిపాదన ఉండేది--బీల ప్రాంతం.
  • సోంపేట, ఇచ్ఛాపురం మధ్య ఉన్న కవిటిపేరు--ఉద్దానం.
  • సోంపేట దేనికి ప్రసిద్ధి--కొబ్బరి పీచుపరిశ్రమకు.

విభాగాలు: ఆంధ్రప్రదేశ్, పట్టణాలు, 2010, శ్రీకాకుళం జిల్లా,

Categories: Middle

కడప జిల్లా (Kadapa Dist)

Thu, 07/15/2010 - 14:25
  • కడప జిల్లా పేరును ఏ విధంగా మార్చారు--వైఎస్సార్ జిల్లా (ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 613).
  • కడప జిల్లాలో లభించే ముఖ్య ఖనిజాలు--బెరైటీస్, అస్బెస్టాస్, సున్నపురాయి.
  • కడప పూర్వపు పేరు--గడప.
  • కడప జిల్లాలో ప్రవహించే ముఖ్యనది--పెన్నానది.
  • కడప జిల్లాలో పెన్నానది ఒడ్డున ఉన్న ప్రముఖమైన కోట--గండికోట దుర్గం.
  • కడప జిల్లాలో అన్నమాచార్యుల జన్మస్థలమైన గ్రామం--తాళ్ళపాక.
  • కడప జిల్లా ఒంటిమిట్టలోని దేవాలయం--శ్రీకోదండరామ దేవాలయం.
  • కడప జిల్లాలోని పర్వతశ్రేణులకు పేరు--వెలికొండలు.
  • కడప జిల్లాలో మగ్గురాయికి పేరుగాంచిన ప్రాంతం--మంగంపేట.
  • కడప జిల్లా కలెఖరుగా పనిచేసి, తెలుగుభాషకు సేవచేసిన ఆంగ్లేయుడు--సి.పి.బ్రౌన్.

విభాగాలు: ఆంధ్రప్రదేశ్,

Categories: Middle

ప్రెంచి విప్లవం (French Revolution)

Wed, 07/14/2010 - 14:25

(బాస్టిలీ పతనమైన దినం సందర్భంగా)

  • ప్రెంచి విప్లవం ఏ సం.లో ప్రారంభమైనది--1789.
  • ప్రెంచి విప్లవం సందర్భంగా ధ్వంసం చేయబడిన జైలు--బాస్టిలీ జైలు.
  • బాస్టిలీ పతనం ఏ రోజున జరిగింది--జూలై 14.
  • ఫ్రెంచి విప్లవం సందర్భంగా ప్రాన్సులో ప్రముఖ నేతగా ఆవిర్బవించినది--నెపోలియన్.
  • ప్రెంచి విప్లవం ఎప్పుడు అంతమైంది--1793.
  • ప్రెంచి విప్లవంతో సంబంధం ఉన్న భారత రాజ్యాంగ పీఠికలోని పదాలు--స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం.
  • ప్రెంచి విప్లవంలో సగభాగం అని పిలువబడినవాడు--వోల్టేర్.
  • ప్రెంచి విప్లవం ప్రారంభంలో ప్రాన్సు రాజు--లూయీ-16.
  • ప్రెంచి విప్లవ సమయంలో ప్రముఖస్థానం పొందిన జాకోబిన్ల కేంద్రస్థానం--పారిస్.
  • ప్రాన్సు రాజవంశానికి వ్యతిరేకంగా కార్డీలియన్ క్లబ్‌ను స్థాపొంచినది--డాంటన్.

విభాగాలు: చరిత్ర, ప్రాన్సు,

Categories: Middle

పూరీ జగన్నాథ దేవాలయం (Puri Jagannath Temple)

Tue, 07/13/2010 - 14:25
  • పూరీ జగన్నాథ ఆలయం ఏ రాష్ట్రంలో ఉన్నది--ఒరిస్సా.
  • పూరీ జగన్నాథ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు--అనంతవర్మచోడ.
  • జగన్నాథ దేవాలయం ఏ శతాబ్దంలో నిర్మించబడింది--12వ శతాబ్దం.
  • జగన్నాథ దేవాలయం ఏ శైలిలో నిర్మించబడింది--కళింగ శైలిలో.
  • పూరీ జగన్నాథ ఆలయం దేనికి ప్రసిద్ధి--రథయాత్రకు.
  • జగన్నాథ రథయాత్ర ఎప్పుడు నిర్వహిస్తారు--ఆషాడ శుద్ధ విదియ (జూన్/జూలై).
  • జగన్నాథ రథానికి పేరు--నందిఘోష.
  • జగన్నాథస్వామి పెంపుడుతల్లి--గుండిచాదేవి.
  • పూరీ జగన్నాథ స్వామి సోదర, సోదరీలు--బలభద్ర, సుభద్ర.
  • జగన్నాథ దేవాలయంలో విగ్రహాలు దేనితో చేయబడి ఉంటాయి--చెక్కతో.

విభాగాలు: ఒరిస్సా, దేవాలయాలు,

Categories: Middle

ప్రపంచ కప్ ఫుట్‌బాల్ 2010 (World Cup Football 2010)

Mon, 07/12/2010 - 14:25
  • 2010 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత--స్పెయిన్.
  • ఫైనల్లో స్పెయిన్ ఎవరిపై విజయం సాధించింది--నెదర్లాండ్స్.
  • స్పెయిన్ ప్రపంచ కప్ సాకర్ టైటిల్ సాధించడం ఇది ఎన్నవసారి--తొలిసారి.
  • స్పెయిన్ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టైటిల్ సాధించిన ఎన్నవ దేశంగా అవతరించినది--8వ.
  • 2010 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఫైనల్ పోటీ వేదిక--జొహన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా)
  • ఫైనల్లో గోల్ చేసిన ఏకైక ఆటగాడు--ఇనియెస్టా (స్పెయిన్).
  • నెదర్లాండ్స్ ఫైనల్లో ఓడిపోవడం ఇది ఎన్నవసారి--మూడవసారి.
  • 2010 ప్రపంచ కప్ టోర్నమెంటులో అత్యధిక గోల్స్ చేసిన జట్టు--జర్మనీ.
  • 2010 ప్రపంచ కప్ సాకర్ టోర్నమెంటులో మొత్తం ఎన్ని గోల్స్ నమోదైనవి--145.
  • 2010 సాకర్ టోర్నీలో మూడనస్థానం పొందిన జట్టు--జర్మనీ.

ఇవి కూడా చూడండి ... ప్రపంచ కప్ ఫుట్‌బాల్,

విభాగాలు: క్రీడలు, ఫుట్‌బాల్, 2010,

Categories: Middle

జనాభా (Population)

Sun, 07/11/2010 - 12:53

(ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా)

  • ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం--చైనా.
  • భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం--ఉత్తర ప్రదేశ్.
  • ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జనాభా కల జిల్లా--పశ్చిమ గోదావరి జిల్లా.
  • భారతదేశంలో అత్యధికంగా నగర జనాభా ఉన్న రాష్ట్రం--మహారాష్ట్ర.
  • ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశం--నైజీరియా.
  • 1994లో జనాభా విషయంపై ఏర్పాటు చేసిన కమిటీ--ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ.
  • ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ జనాభా లేని జిల్లా--హైదరాబాదు.
  • భారతదేశంలో అత్యధిక జనాభా కల నగరం--ముంబాయి.
  • పంజాబ్‌లో అత్యధిక జనాభా కలిగిన నగరం--లూధియానా.
  • ఈశాన్య రాష్ట్రాలలో అత్యధిక జనాభా కలిగిన నగరం--గౌహతి.

ఇవి కూడా చూడండి ... ప్రపంచ జనాభా దినోత్సవం.

విభాగాలు: భూగోళశాస్త్రము,

Categories: Middle