http://blogsodari.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
తప్పులుంటే మన్నించి , ఒప్పులుగా సరిదిద్ది,చప్పున బదులీయండీ
Updated: 36 min 10 sec ago

బ్లాగ్ మగ మహారాజులు-3

Sun, 05/16/2010 - 01:42
పడమటి గోదావరి రాగం : పేరు వింటేనే గల గల పారుతున్న గోదావరి సవ్వడులు వినిపించేస్తున్నాయి కదా.. మరైతే ఎందుకాలస్యం ?
బ్లాగాడిస్తా : పేరులోనే ఉన్నది రవి గారి టాలెంటు.అనుభూతులు,జ్ఞాపకాలు, పేరడీలు ఒకటేమిటి అన్ని పసందయిన పోస్ట్లే
నాగ మురళి బ్లాగ్ : క.ఖ గ.ఘ మీదఒక పద్యం చెప్పండి. తెలియడం లేదా.!సరే నాగ మురళి గారు పిలుస్తున్నారు వినండి .
విహారి: అనుభవాలు,అంతరంగాలు అన్నీ సరదా పరదాల పందిరిలో చెప్తారట వీరు.
త్రివిక్రమ్: అవి-ఇవి అన్నీ చెబుతా అంటున్నారు వీరు
ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు: నైతిక జర్నలిజం ధ్యేయంగా ,నిజాయితీ పరులకు వెన్నుదన్నుగా వీరి కబుర్లు ఉంటాయంట .
దార్ల : దళిత అమ్మ కవిత్వానికి ఆహ్వానం పంపుతున్నారు వీరు
శాస్త్ర విజ్ఞానం : ముత్యం ఎలా పుడుతుందో తెలుసా ? ??? తెలియదా!!! అయితే ఇక్కడ ఎన్నో సంగతులు ఉంటాయి చదవండి .
అనంతం : కొన్ని జ్ఞాపకాలు ,కొన్ని అనుభవాలు,కష్టం ,సుఖం, హాస్యం అవి ఇవి అన్నీ కలగలిపిన వీరి బ్లాగు చదవ వలసిందే .పైగా చాలానాళ్ళ విరామం తరువాతా వ్రాస్తున్నారు కూడాను .
అంతర్యానం: నానిలంటే ఏమిటో తెలుసా?? సాయి కిరణ్ కుమార్ గారు చెప్తున్నారు చూడండి.
ఓ తెలుగు రాడికల్ : తెలుగు వీరాభిమాని ,తెలుగు వీర పండితులకు శత్రువు అంట వీరు అదేంటో చూడండి.
ఊక దంపుడు : ఊరక ఉండకుండా పనికొచ్చేది చేయకుండా ఇక్కడ ఊక దంపుడు దంపుతున్నా అంటున్నారు వీరు .
నా స్వగతం: వీరు స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం,అనర్గళం అనితర సాద్యం వీరి మార్గం అంట చూడండి .
రామ-చిలక -పలుకులు : ఈయన మెచ్చిన ,నచ్చిన విశేషాల కలగూర గంప అంట వీరి బ్లాగు .
రే రాజ్ రివ్యూస్ : రివ్యూలు తక్కువ రాతలు ఎక్కువ అని అంటున్నారు .అదేమో చూడండి .
పుల్లాయన కబుర్లు: పోలవరం కబుర్లు వింటారా వీరి బ్లాగ్ చూడవలసిందే .
పక్కింటబ్బాయి: మీ పక్కింట్లో కాదులెండి వాళ్ళ పక్కింటి వాళ్లకు పక్కింటి అబ్బాయంటా.
మనసు మాట వినదు:హాయిగా ఆరుబయట పడుకుని ఆకాశం లో రంగులను ఆస్వాదిద్దాం అనిపిస్తుంది కాని మనసు మాట వినడం లేదంట పాపం వీరికి .
అంతర్మధనం (చంద్ర మౌళి):ఆయనకు నచ్చింది వ్రాస్తారు అంట ,నచ్చిన వాళ్ళు చదువుతారు లేక పొతే చదవరని ఆయనే అనేస్తున్నారు .
రిషి : తిట్టుకుంటూనో ,విసుక్కుంటూ నో తెలుగు చానెళ్ళు,సినిమాలు చూసి వాళ్ళని ఎం చెయ్యాలో తెలయక పళ్ళు నూరుకుని టాప్ మని ఇక్కడ పోస్ట్ వ్రాసేస్తారు అంట వీరు .
సహచరుడు : నూరు పూలు వికసిన్చినా ,వేయి ఆలోచనలు సంఘర్షించినా ఏమి జరిగిన సరే పోస్ట్ వ్రాస్తారట వీరు .
కొత్త వంతెన : ఈ మధ్యే బ్లాగ్ లోకం లో వంతెన వేసారు తన కవితలతో వీరు .
అనుదీప్ : కేవలం వీరి ఫీలింగ్స్ చెప్పుకోవడానికే ఈ బ్లాగ్ తెరిచారు అట వీరు .
సామాన్యుడు : వీరు సామాన్యుడు అంట మన అందరిలాగే. వీరి కబుర్లు ఇక్కడ వినండి .
తాతావారి డైరి : వీరి డైరి విశేషాలు చూడండి .
టూకీగా: మన రాజకీయ అవగాహనారాహిత్యం గురించి చెప్తున్నారు ఇక్కడ .
అశోక్ : పల్లె జానపదాలు గురించి చెప్తున్నారు ఇక్కడ విడియో లింకులతో
ఉగాది పచ్చడి: తెలుగువారు చేసే ఈ షడ్రుచుల పచ్చడి మాదిరిగానే వీరి బ్లాగ్ విశేషాలు ఉంటాయేమో చూద్దాం ..
మీ కోసం : ప్రపంచం లో అదృష్టవంతుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా ?? చదవండి అయితే .
తువ్వాయి: వీరి మనసులో భావాలను అందరితో పంచుకోవాలని వచ్చారట వీరు .
Categories: Middle

బ్లాగ్ మగ మహారాజులు - 2

Sun, 05/09/2010 - 22:45
చేగోడీలు.కం : ఈ చేగోడీలు కర కర లాడటమే కాదు ,పక పక పగలబడి నవ్విస్తాయి .నాదీ హామీ

నాతోనేను నా గురించి : ఈ బ్లాగరు నాతో నేను నాగురించి అని చెప్పి తనతో మనలను మన పర్మిషన్ లేకుండానే తీసుకు వెళతారు .తస్మాత్ జాగ్రత్త .

వికాసం : కవితలు,కధలు,భావుకత,ఫిలాసఫీ ఇలా అన్ని రకాలు ఉన్న బ్లాగ్ చూడాలంటే వీరి బ్లాగ్ ఒకసారి పలకరిన్చవలసిందే.

ఏటి గట్టు : ఏటిగట్టున మనల్ని కూర్చోపెట్టి టక్కున ఏడిపిస్తూ ,పక్కున నవ్విన్చేసే బ్లాగరు శేఖర్ గారు .

విధాత తలపు :సినిమా,మీడియా,రాజకీయాలు ఏదైనా సరే తన వ్యంగ్యాస్త్రాలతో చటుక్కున ఆకట్టుకునే బ్లాగరు వీరు.

బ్లాగాగ్ని :కూడలి,తెవికీ,పొద్దు కనిపించే మూడు సింహాలైతే ,కనిపించని ఆ నాలుగో సింహమే ఈ సార్ అంట .అదేంటో మీరే చూడండి.

ఆత్మానందం :సినిమాలకు,వాటి పాటలకు పేరడీలు ,అర్ధాలు ,మరెన్నో విషయాలు హాస్యం గా వ్రాసే వీరు పండంటి బ్లాగుకు పది సూత్రాలు చెపుతున్నారు చూడండి .

మా ఊరు: ఎవరి ఊరు వారికి గొప్ప ,అలాగే నా ఊరు నాకు అంటున్నారు మా వూరు బ్లాగరు చూడండి వారి ఊరు విశేషాలు .

సరదాకి : ఒక ఆహ్లాదమైన పోటో ,అంతకంటే ఆహ్లాదమైన వ్యాఖ్య చూడాలంటే ఈ బ్లాగు చూడాల్సిందే.

గీతాచార్య : వీరికి ఉన్న బ్లాగులు ఒకటా రెండా? అన్ని పేరుగలవే .అవేంటో ఒకమారు చూడండి .

లీలా మోహనం : మురళి కృష్ణా రారా అంటూ తన బ్లాగ్ ఆ నవనీత చోరునికే అంకితం చేసారు .చక్కని కృష్ణుని బొమ్మలు వేయడం ఆయనకే సొంతం

నవీన భారతావనిలో నా పౌరోహిత్యం : వీరు వృత్తి రిత్యా పురోహితులు అంట ..వారి ఆద్యాత్మిక చింతనలు మనతో పంచుకోవాలనుకున్తున్నారు . చూడండి .

బృందావనం లో : నేనే కృష్ణుడు ,నేనే రాధను నా మనసే బృందావనం అని అంటున్నారు ఈ విశ్వ ప్రేమికుడు ..

ఆలోచనాస్త్రాలు : వీరి ఆలోచనాస్త్రాలు ప్రపంచం పై సందిస్తా అని అంటున్నారు గాయపడకుండా పట్టుకోండి.

ఆకాశ వీధిలో : వీరు వెన్నెల కోసం జాబిలిని,నవ్వుల కోసం చిన్నారులను,ప్రేమ కోసం అమ్మ వడినివెదుకుతున్నారు అంట .మరి కోనసీమ ముచ్చట్లు ఎవరి కోసం చెపుతున్నారో తెలుసుకోండి .

సుత్తి నా సొత్తు : వీరు మంచివారు ,మనసున్న వారు కాని సుత్తి వారి సొత్తు కాబట్టి వినమంటున్నారు.విందామా అదేమిటో .

నేనొక గురువింద గింజ : విన్నారుగా వీరు ఒక గురువింద గింజ అంట ,మరి వారి గొడవేమిటో చుసేయ్యండి .

సవ్వడి: ఏటి ఒడ్డున ఇసుకలో , వెన్నెల లో పచ్చిక పై ఆడటం వీరికి ఇష్టం అంట .వారి మేనకోడలి ముచ్చట్లు మీరు వినవలసిందే .

అదన్నమాట సంగతి : జపాన్ విశేషాలు తెలుసుకోవాలని ఉందా ,మరి ఇంకేం ఈ బ్లాగు చూసేయండి.

సాహితి యానం: అమ్మ చేతి వంట, సంక్రాంతి చలి, వానలో పిల్లల సంబరాలు ఎంత బాగుంటాయో ఈ బ్లాగు అంత బాగుంటుంది .

అర్జునిడి బాణాలు : ఒక క్షణం సర్వం త్యజించిన యోగిని మరు క్షణం భవ బంధాలకు బానిసను అనే వీరి కవితా బాణాలకు పదునేక్కువ.

దీప్తిధార : అనేక విషయాలను చర్చించే వీరి బ్లాగు పై విమర్శనాఅస్త్రాలు ఎక్కువే .ఎందుకో తెలుసుకోండి

మారు తీయం : ఇది సాక్షాత్తు సిని నటుడు శ్రీ గొల్ల పూడి మారుతీరావు గారు బ్లాగు. చెప్పడానికేముంది . వెళ్లి చూసేయండి .

ఏకాంత వేళ - ఉప్పొంగే భావాలా :మరి వారి ఏకాంత సమయం లో ఉప్పొంగిన భావాలను మనము తెలుసుకుందామా ?

ఆకాశ రామన్న : ఎవరి రామన్నా ? ఏమా కధ ? ఎన్ని ఉత్తరాలు వ్రాసారో ఒక సారి చూస్తే పోలా

అంచేత నేను చెప్పొచ్చేది ఏమిటంటే : ఆయన అంతగా చెపుతుంటే వినరేమిటి ?మీరు మరీను .

ఆరుద్ర : మళ్లీ నేను వచ్చేసా అని పలకరిస్తున్నారు వీరు .ఒక సారి ఎక్కడికి వెళ్ళారో కనుక్కోండి.

అంతర్వాహిని : గుండె లోతుల్లో నుండి చెప్పే వీరి కబుర్లు చదవని బ్లాగర్లు అరుదేమో .

కన్నగాడు : ఉప్పి గాడితో చట్టా పట్టాలు వేసి చెప్పే వీరి కబుర్లు చక్కని హాస్యం తో చక్కగా ఉంటాయి .

నా కవితలు: నేను ,నా ఏకాంతం తరుచు పలకరించుకుంటాం అని చెప్పే వీరి కవితలు మనల్ని కుడా ఏకాంతం లో పలకరిస్తుంటాయి .

నెలబాలుడు : మదిలో మెలిగే ఆలోచనలే ఈ నెలబాలుడి బ్లాగోతం అంట.
ఈ సారి ఇంకొంతమంది





Categories: Middle

బ్లాగ్ మగ మహారాజులు

Sat, 05/08/2010 - 04:58
సాహితి బ్లాగర్ మాలా కుమార్ గారు అంతర్జాలం లో అతివల గురించి వ్రాస్తున్నారు..కాని మన బద్దకపు మహారాజులు మగవారి బ్లాగుల గురించి వ్రాయకపోవడం వల్ల ఆ బాధ్యతనేను తీసుకున్నాను.

తోట రాముడు : తెలుగు బ్లాగ్ లోకపు మొదటి హాస్య చక్రవర్తి వీరు..బ్లాగు జంద్యాల అనే బిరుదాంకితులు.. వీరి బ్లాగు చదివి నవ్వని వారు ఉండరేమో ..

నాన్న : మీరు అన్ని బ్లాగుల్లో తల్లి ప్రేమ గురించి చదివి ఉంటారు..మరి తండ్రి ప్రేమను చూడాలంటే ..భాస్కర్ గారి బ్లాగ్ చదవాల్సిందే ... ఇందులో పుత్రోత్సం ఒక్కటే కాదు అనేక విషయాలు ఉంటాయి.. భాస్కర్ గారి మరొక అభిమానం చూరగొన్న బ్లాగ్ నలభీమ పాకం ..ఈయన చెప్పే వంటల గురించి మగవారి కంటే ఆడవాళ్లే ఎదురు చూస్తారు కాబట్టి ఒక మారు చూడవలసిందే..

పర్ణ శాల: సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే ఎవరూ పట్టించుకోరు ..అదే పడమట ఉదయిస్తాడు అంటే సంచలనం.అలాంటి సంచలనాలు ,వాడి గా వేడి గా చర్చలు కావలంటే మహేష్ గారి బ్లాగ్ చూడండి.

తెలుగోడు : సూటిగా సుత్తిలేకుండా చెప్పే ఓ తెలిగోడి గోడే ఈ తెలుగోడు . అబ్రకదబ్ర అంటూ ఏం మాయ చేస్తారోగాని ,ఈ బ్లాగు లోకి పొరపాటున వెళ్ళామా అలవాటు పడిపోతాము .

రౌడీ రాజ్యం: పేరు చూసి మోసపోయేరూ ,ఇతను మనసున్న రౌడీ ,ఏదో మీ బుర్రలు తిందామని అని చల్లగా చెప్పినా, వాడిగా వేడిగా బ్లాగ్ లోకపు అసమానతనలు ఏండగట్టే వీరి పై విమర్సలు,పొగడ్తలు కోకొల్లలు.

ఆంధ్రామృతం : పూజ్యులు చింతా రామక్రిష్ణ గారి ఈ బ్లాగు ఆసాంతం చదివితే అమృతం తాగినట్లే.. ఆశుపద్యాలు,సీమ పద్యలు వాటి తాత్పర్యాలు మొదలైనవి చదివితే జన్మ ధన్యమే.

హరిసేవ: దుర్ఘేశ్వర గారి ఈ బ్లాగ్ పూర్తిగా భగవంతుని గురించి చెప్పే బాల్గు.ఆద్యాత్మికత ,దైవ నమ్మకం ఉన్నవారు చూడతగ్గ బ్లాగ్ .

చాకిరేవు: ప్రస్తుత రాజకీయాలను ఉతికి ఆరవేసే బ్లాగు ఈ చాకి రేవు .

వెంకటూన్స్ : కార్టూన్లు ... చూడండి.. చదవండి.. వినోదించండి అంటూ రోజుకొక కార్టున్ తో అలరించే బ్లాగ్ ఇది.

జీవని: సేవా లోకానికి స్వాగతం అంటూ దీనులను,దిక్కులేని వారికి, అనాధ పిల్లలను అక్కున చేర్చుకుంటూ,మనల్ని కూడా ఒక చేయివేసి కాపాడమని చెప్తూ మనలోని మానవత్వాన్ని వెలికి తీసే అవకాసం ఇచ్చే అమ్మలాంటి బ్లాగు ఈ జీవని .

మంచు.పల్లకి : ఈయన ఏవో కొన్ని ఉద్యమాలు చేస్తున్నారంట వాటి సూచనలు కూడా చెబుతున్నారు అవేంటో చూడండి మరి.

వికటకవి :అట్టాంటి ఇట్టాంటి హీరో కాదంట వీరు , ఈ యువతరానికే ప్రతినిధి అంట .అవునో కాదో తేల్చండి మరి.

రవి గారు :మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని.. అని వారే అంటున్నారు .అదేదో చూడండి.

సాహిత్య అవలోకనం: ఒక్క మాటలో చెప్పాలంటే వీరు తెలియని బ్లాగర్లు ఎవరూ ఉండరు.ఒక బ్లాగర్ కోసం ఏకంగా ఒక బ్లాగ్ ను ప్రాభించిన ఘనత వీరికొక్కరికే ఉంది. తెలుగు బ్లాగర్లు వీరు పోస్ట్ లు వ్రాసినా,వ్రాయకున్నా తట్టుకోలేని పరిస్తితుల్లో ఉన్నారు.ఒక్క మాటలో చెప్పలేని బ్లాగ్ .చదివి ఎవరికి వారు తెలుసుకోవలసిందే.

శరత్ 'కాలమ్' : వీరి పైన ఉన్న విమర్శలు మరే బ్లాగర్ పైనను లేవు. ఎందుకో ఏమిటో వారినే అడిగి తెలుసుకోండి.

నెమలికన్ను: ప్రతి బ్లాగరు ఒక్కసారి అయినా ఈ బ్లాగ్ను చూడాల్సిందే . అంత చక్కని బ్లాగ్.

చదువరి: అనేక రాజకీయ,సామాజిక అంశాలను అద్భుతమైన శైలి తో వ్రాశి అందరిని అలరించడం ఈ బ్లాగరు గొప్పతనం.

విశ్వామిత్ర...మరో ప్రపంచం:పప్పు శ్రీనివాస్ గారి ఈ బ్లాగు మరో ప్రపంచంలోకి పరుగులు పెట్టిస్తుంది. చక్కని హాస్యం వీరి సొంతం .

జోకాభి రామాయణం : ఆర్ధిక మాంద్యం అంటే ఏమిటి? అమెరికాకి జలుబు చేస్తె ప్రపంచానికి తుమ్ములెందుకు ? లాంటి అనేక ప్రశ్నలు కు అరటిపండు వలిచినట్లు జవాబులు కావాలా అయితే అరిపిరల సత్య ప్రసాద్ గారి బ్లాగులు మొత్తం చూడాల్సిందే.

ఆడపిల్ల.అగ్గిపుల్ల.సబ్బుబిళ్ళ: మనసు బాగోలేదా??హాయిగా నవ్వుకోవాలి ఉందా? మరి ఆలోచిస్తారే మన అశ్విన్ చిటికలో మీ బాధలు తీరుస్తాడు.

కొత్తపాళి: కళాకారులైన వీరు తనదైన శైలి తో తెలుగు బ్లాగరుల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించారు .

PANI BABU -MUSINGS :బ్లాగింగుకు ,వయసుకు సంబంధం లేదని నిరూపిస్తున్నారు మన పణిగారు ..వీరి కబుర్లు కొత్తావకాయ తో వేడి అన్నం తిన్నట్లే

నల్లమోతు శ్రీధర్ : కంప్యూటర్ కు సంభందించి ఏమైనా సందేహాలు ఉన్నాయా ??మన శ్రీధర్ గారి బ్లాగ్ చూడండి అనేక విషయాలు తెలుస్తాయి


మరి కొన్ని వీలు చిక్కినపుడు
Categories: Middle