http://swapnaraagaleena.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
Utopia కోసం కలలే కంటున్నా!
Updated: 59 sec ago

ఈ ప్రదేశాల్లో వుంటున్న వారెవరయినా వీరికి సమాచారం ఇస్తారా?

Wed, 09/08/2010 - 15:00
నాకు ఈమెయిల్లో వచ్చింది ఇది. విషయం ఇంగ్లీషులో వున్నందుకు మన్నించండి.
Namastey


Once upon a time I used to live in north of the USA and now due to vidhi (or whatever) came to Fort Knox KY for job in [Edited]. I have left family back in the north and put the house on sale too. But due to fort knox realignment of the army base, the govt is hiring hundreds and the nearest town, elizabethtown, KY is not able to accommodate the incoming families. Since a week I have been searching for an apartment invain. I went round the city and also checked craigslist and whatever possible. None. Just today I found a place but it is in the midst of corn fields and I cannot go there with family due to sharp curvy roads and distance from the work place. A snowy day can easily kill me on the narrow roads. Plus the school is like 20 miles away. Just not possible to make it work. It is like a retirement home with well water and no access to TV stations/Cable. Not for me.

Now my request to you... can you possibly put a post on your blog (well I can create a blog and do it but your fan following is better:-0). If you do not want to post it, that would be fine. But if you want to help please do *NOT* mention my name or any other details on your blog. I very much appreciate your help in advance.

I checked as far north as Doe valley, Radcliff, Vine Grove, Elizabethtown and even some more south. The best school system (yes my kid goes to 3rd grade) is in E/Town but there are no apts available. I am currently renting a room in Radcliff and have not moved the family yet. My request is to create a telugu blog and ask help from users. Can you do that?

The best places to live, PineValley, Waterford apts and Claysville landing apts have waiting list up to 200. Yes you read it right two hundred applications. I went to mall to see if I can find some Indians. So far there are none here. I met one Bangladeshi and one pakistani. Both gave information which I already know. Many Indians could be there in Louisville but I want to stay close to work place and in e/town due to less time of commute and school system.

Any help at all? If you do not want to do any help, it is fine I do not mind. Many thanks and have a great day.
Categories: Left

14-03-80 న నేను తీసుకున్న నిర్ణయాలు

Sat, 09/04/2010 - 13:10
1. మితభాషి నవడం
2. ధైర్యం తెచ్చుకోవడం

3. అతిగా మితిమీరి నవ్వకుండటం

4. (కొట్టివేసాను. ఏం వ్రాసానో కనపడి చావడం లేదు)

5. సినిమాల గురించి మాట్లాడకుండటం

6. (కొట్టివేసాను. ఏం వ్రాసానో తెలియదు)

7. ఆడవాళ్లతో జోక్యం NOT (ఛ!)

8. అతిగా స్నేహం కలపకపోవడం

9. అసూయ పడకపోవడం

10. ఎక్కువ కాలం నా దృష్టితో (?)

11. అవమానపడటం తగ్గింపు

12. సార్లతో మామూలుగా వ్యవహరించడం

13. కొండల్ రావుకు చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టడం (?)

14. యుద్ధానికి దిగకపోవడం (?)

15. అనవసరపు చేష్టలు చెయ్యకపొవడం

16. ...........

అప్పటి నిర్ణయాలన్నీ నా బ్లాగులకు వర్తించుకుంటే బావుంటుందేమొ కదా!
Categories: Left

నా భోషాణం నుండి...

Sat, 09/04/2010 - 08:42
నా డైరీలో కొన్ని రోజులు
01-01-1980
ఈనాడు కొత్త సంవత్సరం. ఈరోజు బడికి సెలవు (అప్పుడు 9వ తరగతి). కొత్త సంవత్సరం బడికి సెలవు కాబట్టి ఈ రోజు ఎంతో ఆనందంగా నా స్నేహితులతో బాటు ఆనందంగా గడిపాను. ఈనాడు రాత్రి నాన్న, వదిన, సుదర్శన్, నవత బేబి బస్సు నుండి దిగారు.

02-01-1980
ఈనాడు బడికి సెలవు. ఈనాడు పౌర్ణమి. నేను నవత బాగా ఆడుకున్నాము. రవి నేను శ్రీను, మిగతా వారితో కొంచెం సేపు ఆడుకున్నాను. ఉల్లాసంగా గడిచింది.

03-01-1980
ఈనాడు కూడా బడికి సెలవు. ఈనాడు చెన్నారెడ్డి వస్తాడని బడి గ్రవుండులో స్టేజి కట్టారు. కానీ రాలేదు. G S రెడ్డి మొదలగువారు ప్రసంగించారు. బుర్రకథ, గొల్ల సుద్దులు నాటిక వేయించారు.
Categories: Left

కాంప్లాన్ బేబీతో ఓ చక్కటి రోజు - 3

Fri, 09/03/2010 - 11:17
ఆ తరువాత సంజన, వాళ్ళమ్మ వంటింట్లో ఏదో హడావిడి పడుతుండటం చూసి ఏంటా హడావిడి అని అడిగా. మీ కోసం గారెలు చేస్తున్నాం మామాజీ అని సమాధానం వచ్చింది. గుండెల్లో రాయి పడింది. ఇప్పుడీ పెంకి పిల్ల నా నోట్లో గారెలు కూడా కుక్కేస్తుందా అని వణుకుతూ కూర్చున్నా. ఆ సమయం రానే వచ్చింది. కష్టపడి కొన్ని తిన్నాను. మిగతావి తరువాత తప్పక తింటానని గట్టి హామీ ఇస్తే కానీ వదిలింది కాదు.
ఆ తరువాత తల్లీ కూతుర్లిద్దరూ స్నేహితురాళ్ళలా కబుర్లు చెప్పుకోవడం చూస్తే ముచ్చట వేసింది. సంజన వాళ్ళ అమ్మ రాణికి కొంచెం అంగ వైకల్యం వుంది. నరాల బలహీనత వల్ల రెండు చేతుల్లోనూ అంతగా పట్టులేదు. అందువల్ల ప్రతి చిన్న పనికీ రెండు చేతుల మీద ఆధారపడుతుంది. అందువల్ల వంట అయినా మరేదయినా సాధారణంగా ఇతరులకి అయిదు నిమిషాలు పడితే తనకు అరగంట పడుతుందని తెలిసినప్పుడు నా కోసం అన్ని కూరలు ఎంత కష్టపడి చేసివుంటుందో అర్ధమయ్యింది! అమ్మ చేతుల మీద వున్న కాలిన గాయాల మచ్చలను సంజన నాకు చూపించింది. నరాల బలహీనత వల్ల సరిగ్గా పట్టు దొరకక వంట వండుతున్నప్పుడు కాలిన మచ్చలవి. అవి చూసాక నాలో నిశ్శబ్దం, నిస్సహాయత. వీళ్ళిద్దరి కష్టాలు ఎప్పుడు తీరతాయో ఏంటో. సంజనకి అమ్మ అంటే ఎంతో ప్రేమ, అమ్మ కష్టాలు త్వరగా తీరిపోవాలని ఎంతగానో తపించిపోతుంది ఆ అమ్మాయి కానీ ప్రస్థుతం ఏమీ చేయలేని పరిస్థితి.
కొద్ది సేపయ్యాక మళ్ళీ గారెలు గుర్తుకు చేసింది. కారులో తిరిగి వెళ్ళేప్పుడు తింటానని మళ్ళీ గట్టిగా హామీ ఇచ్చాను. సాయంత్రం ఆరు గంటలు కావస్తుండటంతో తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యాము. రాణి అక్క ఆ రోజు అక్కడే వుండి తెల్లవారి వెళ్ళాల్సిందిగా కోరింది కానీ ఆ రాత్రి మా బావమర్దిని ఆస్ట్రేలియా విమానం ఎక్కించాల్సిన పని వుండటంతో అలా ఆరోజు రాత్రి అక్కడ వుండటానికి నాకు వీల్లేకపోయింది.
కారులో తిరిగి వస్తున్నప్పుడు నాకు బోర్ కొట్టకుండా ఎన్నో సినిమా పాటలు పాడి వినిపించింది. అన్ని పాటలు ఎలా గుర్తుంటాయీ అని ఆశ్చర్యపడి అడిగాను. ఆమెది శ్రావ్యమయిన కంఠం అవడంతో ఆ పాటలు వింటుంటే హాయిగా అనిపించింది. నాకు ఇష్టమయిన పాటలు అడిగి మరీ పాడింది. పాటలు సరే కానీ తనకి నేను గారెలు తినాల్సిన విషయం ఎక్కడ గుర్తుకు వస్తుందో అని బెంగ పడ్డాను. మొత్తం మీద మా ఇంటి దగ్గరకి వచ్చేదాకా తనకు గుర్తురాలేదు. అప్పుడు గుర్తు చేసి నా గారెలు పొట్లాం కట్టించి ఇంటికి వెళ్ళాక తప్పక తినాల్సిందే అని చెప్పింది.
ఆ తరువాత తను తన గదికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు హ్యాపీ హ్యాపీ సినిమా చూడటం కోసం కలిసాము. గారెలు తిన్నారా మామాజీ అని అడిగింది. ఇంకా లేదు కానీ తప్పక తింటాను అని ప్రామిజ్ చేసాను. మీ అక్క అంత కష్టపడి గారెలు చేస్తే తినకుండా వుంటే ఎలా అని హెచ్చరించింది. సుదర్శన్ 70mm లో హ్యాపీ హ్యాపీ చూసాము. ఆ సినిమా ఇద్దరికీ సగం హ్యాపీగానే అనిపించింది. సినిమా అయ్యాక రెస్టారెంటులో లంచ్ లేసి ఆమెను తన గది దగ్గర వదిలేస్తూ వీడ్కోలు ఇచ్చాను. మళ్ళీ ఆమెను ఎప్పుడు కలుస్తానో ఏంటో. హృదయం భారమయ్యింది.
యు ఎస్ వెళ్ళే రోజు ఫోన్ చేస్తే తనకి తీవ్రమయిన జ్వరం, జలుబు. తను ఒక్కతే వుంటోంది కనుక పక్కింటి అక్క నిన్ను కనిపెట్టి చూసుకొంటోందా అని అడిగితే అవును అంది. యు ఎస్ వెళ్ళే పనే కనుక లేకుంటే ఇంకా ఎంత ముఖ్యమయిన పని వున్నా వదిలేసి స్వయంగా వెళ్ళి మా కోడలి ఆలనా పాలనా చూసివుండేవాడిని. యు ఎస్ కి వచ్చాక ఫోన్ చేసాను. జ్వరం, జలుబు నెమ్మదించాయి అని తెలిసాక ఆమె ఆరోగ్యం పట్ల నా ఆందోళన తగ్గింది.
అన్నట్లు చెప్పడం మరిచానండోయ్, సినిమా చూసిన రోజు రాత్రి ఆ గారెలు లాగించాను.
(అయిపోయింది)
Categories: Left

మా వేడుకకి విచ్చేసిన బ్లాగర్లు

Thu, 09/02/2010 - 16:48
హైదరాబాదులో జరిగిన మా కుటుంబ వేడుకకు ఒక దానికి స్థానిక బ్లాగర్లను కొంతమందిని ఆహ్వానించగా ఇద్దరు మాత్రమే రాగలిగారు. ముందుగా వచ్చింది నాగప్రసాద్. బక్క పలుచగా, కాస్త పొట్టిగా వున్నారు. కులాసాగా కొద్దిసేపు బ్లాగుల కబుర్లు చెప్పుకున్నాక ఇక నా పనుల్లో పడ్దాను. ఇంకెవరూ రాకముందే సరిగ్గా సమయానికి పంక్చువలుగా వచ్చేసారు కాబట్టి మాట్లాడటానికి ఎవరూ దొరక్క కాస్సేపు ఇబ్బంది పడినట్లున్నారు. ఇంజినీరింగ్ చేస్తున్న మా బంధువుల అబ్బాయిలను పరిచయం చేసాక వారికి కాలక్షేపం అయినట్లుంది.
తరువాత వచ్చింది జ్యోతి గారు. వారి ఫోటోను చూసాను కాబట్టి వారు వస్తుండగా చూసి గుర్తించి ఎదురేగి ఆహ్వానించాను. వారితో పాటుగా వారి అమ్మాయి కూడా వచ్చారు. వారికి మా బంధువులని కొంతమందిని పరిచయం చేసాను. వారు కాస్త రిజర్వుడుగా అనిపించారు. కొద్దిసేపు మాట్లాడాక నాగ కూడా వచ్చారని చెప్పి నాగను వారి దగ్గరికి పిలిచాను. ఇద్దరూ కలుసుకోవడం అదే ప్రధమం అనుకుంటాను. ఇహ వారిద్దరూ బ్లాగు కబుర్లలో పడిపోయారు.
AP మీడియా రాము గారు రావడానికి చాలా ప్రయత్నించారు కానీ వర్షం వల్ల వీలు పడక మలక్పేట దాకా వచ్చి వెనుదిరిగారు. నెలబాలుడు కూడా వర్షం వల్ల రాలేకపోయానని తెలిపారు. సమయానికి అతిధులు రావడం వల్ల ఇంకో బ్లాగర్ రాలేకపోయారు. తెలుగుకై నడక, తదితర పనుల వల్ల రాలేకున్నానని వీవెన్ తెలిపారు. నేను తప్పక వస్తారని అనుకున్న కొంతమంది ఇతర బ్లాగర్లు ఎందుకు రాలేకపోయారో కనీస సమాచారం కూడా లేదు. ఆ రోజు సాయంత్రం సిటీలో బాగా వర్షం పడినందువల్ల కూడా వీధులు బాగా జలమయం అయ్యి, ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల కొంతమంది రాలేకపోయి వుండవచ్చును.
మొత్తం మీద జ్యోతి మరియు నాగ గార్లు అయినా ఆ వేడుకకి రాగలిగినందుకు నాకు సంతోషం కలిగింది. మా పెద్దమ్మాయి స్నిని జ్యోతి గారికి పరిచయం చేస్తూ నీ గురించి జ్యోతి గారికి నా బ్లాగుల వల్ల బాగానే తెలిసివుంటుంది అన్నాను. నీ గురించే కాదు, నీ చెల్లి గురించి కూడా మాకు బాగా తెలుసు అని జ్యోతి గారు సరదాగా స్ని తో అని ఎక్కడ మీ చిన్నమ్మాయి అని నన్ను అడిగారు. అది ఒక దగ్గర వుంటుందా, ఎక్కడెక్కడో తిరుగుతోంది. తరువాత సంజన రాగా ఇద్దరు బ్లాగర్లకీ పరిచయం చేసాను. మామాజీ అన్న పేరిట వ్రాసిన నా పోస్టులు చదవనందువల్ల సంజన గురించి జ్యోతి గారికి ఐడియా లేదు.
వేడుకకి సంబంధించిన బాధ్యతల వల్ల వారిద్దరితో ఎక్కువ సేపు మాట్లాడలేకపోయాను. తెలుగుకై నడక కార్యక్రమంలో మళ్ళీ నాగని కలవగలిగాను.  
Categories: Left

కాంప్లాన్ బేబీతో ఓ చక్కటి రోజు - 2

Thu, 09/02/2010 - 15:13
వద్దు మొర్రో అంటూ వుంటే బోలెడంత అన్నం వడ్డించింది నా కోడలు పిల్ల. మీ అక్కగారు నీకోసం ఆప్యాయంగా చేసిందంటూ నాకు నచ్చుతాయని చెప్పిన కూరలన్నీ పళ్ళెం చుట్టూరా వడ్డించింది. అసలే ఈ మధ్య డైటింగ్ తక్కువయ్యి తక్కువ తినడం అలవాటు అయిపోయింది. అదే చెప్పి అంత అన్నం తినలేనని చెప్పాను. అదేం లేదు ఈ రోజు మాకోసం అంతా తినాల్సిందే అని పట్టుబట్టింది. కొంత తిన్నాక ఇక తినలేక కోడి కెలికినట్లు భోజనాన్ని కెలుకుతూ వుంటే అదేం కుదరదనీ మొత్తం లాగించాల్సిందేననీ సంజన సూచించింది. పెట్టిన కూరలన్నీ అయిపోవాల్సిందేననీ మిగిలిస్తే తనకు నచ్చదనీ వార్నింగిచ్చేసింది.
నేను ఆయాసపడుతూ తింటూ వుంటే ఇంకా ఇంకా తినమని పప్పు ,పులుసూ, పెరుగులు కూడా వడ్దించింది. తినేటప్పుడు నాకు బోర్ కొట్టకుండా ఎదురుగ్గా నాకు దగ్గర్లో కూర్చొని తింటూ నాకు కబుర్లు చెప్పింది. ఈ అప్యాయత చూస్తుంటే నాకు శరత్ బాబు నవలల్లోని నాయికలు గుర్తుకువచ్చి హృదయం అర్ద్రమయిపోయింది. అందులో నాయికలు కథా నాయకునికి ఎంతో ఆప్యాయంగా భోజనం వడ్డిస్తుంటారు. వారి ఆదరణ చూసి నవలల్లోని కథానాయకులు ఎంతో సంతృప్తి చెందుతారు. నా పరిస్థితీ అదేలా వుంది. చక్కటి వంటలు వండటం మన వారిలో చాలామందికి తెలుసు కానీ చక్కగా కొసరి కొసరి వడ్డించడం, అందులో ప్రేమనూ, ఆప్యాయతనూ రంగరించి సంతృప్తి పరచడం ఎంత మందికి చేతనవును అనుకున్నాను. అన్నదాతా సుఖీభవా అని మనస్సులో ఆ అమ్మాయిని మనసారా దీవించాను.
అయితే ఆ అమ్మాయి ఆప్యాయత నిజమే కానీ ఆప్యాయత చూపించే విధానంలో మార్పు రావాల్సి వుంది. ఎక్కువ తినిపించడమే ప్రేమ అనుకునే ధోరణి అందరిలో తొలగిపోవాలి. వయస్సుకి, ఆరోగ్యానికి తగ్గట్టుగా సమతులమయిన ఆహారాన్ని ప్రేమగా వడ్డించడమే మంచి పద్ధతి అన్న ధోరణి రావాలి. ఆ విషయాన్ని అక్కడే మీ కోడలు పిల్లకి చెప్పలేకపోయారా అని అంటారా? సర్లెండి, అలాగేం అంటూ బిల్కుల్ లైట్ తీసుకొని మళ్ళీ మెక్కిస్తుంది. ఎందుకొచ్చిన గొడవ ఆ గడుగ్గాయితో!
నాచేత మీ ఇంట్లో ఇన్నిన్ని క్యాలరీల ఆహారం తినిపిస్తావా! మా బ్లాగర్లకి నీమీద ఫిర్యాదు చేస్తానుండు అని సంజనని బెదిరించాను. "మీ ఇంట్లో అని కాదు మామాజీ - మన ఇంట్లో అనాలి" అని సవరించింది. అప్పటినుండీ మీ అన్న భావం తొలగిపోయి మన అన్న భావం పెరిగిపోయింది.
భోజనం అయిపోయాక వక్కపొడి నములుతూ విశ్రాంతి తీసుకుంటుండగా కూడా ఎదురుగ్గా దగ్గర్లో కూర్చొని కబుర్లతో అలరించింది. ఇహ మామాజీని  అలాగే విసిగిస్తావా - మీ మామాజీ  విశ్రాంతి తీసుకుంటారేమో అని వాళ్ళమ్మ సూచించింది. కరెంటు ఎప్పుడో పోయింది కనుక లోపలి గదిలో మంచం మీద పడుకుంటే ఉక్కగా వుంది. ఆ మంచం బయట గదిలో వేస్తామన్నారు. అంత శ్రమ వద్దు - ఒక చాప దిండు ఇవ్వండి చాలు - ఇక్కడ వేసుకు పడుకుంటాను అన్నాను. అలా నాకు అసౌకర్యంగా వుంటుందేమోనని సంకోచించారు. ఫర్వాలేదు - నేను చాలా సరళమయిన మనిషిని అని హామీ ఇచ్చాక ఆ ఏర్ఫాటు చేసారు. కాస్సేపు ఆ పక్క మీద అటు ఇటూ నుసిలి నిద్ర పోయాను. బాగా తిని వున్నాను కనుక చక్కగా నిద్ర పట్టింది.
రేకుల మీద వర్షపు చినుకుల శబ్దానికి మెలకువ వచ్చి లేచాను. మీరు ఆశించినట్లే వర్షం వచ్చింది అని అంది అక్కయ్య. నవ్వి వర్షాన్ని చూస్తూ, రేకుల మీది డబడబ శబ్దాలని వింటూ కూర్చున్నాను. నాకు తోడుగా సంజన కూడా వచ్చి కూర్చొని తనకూ వర్షం అంటే ఎంత ఇష్టమో ఉదాహరణలతో సహా చెప్పసాగింది. వర్షపు చినుకులకి తడిచిన మట్టి వాసన గురించి తెలుసునా అని అడిగాను. తెలియదు అంది. వివరించాను. ఆ తరువాత ఇద్దరం దీర్ఘ శ్వాస తీసుకొని మట్టి వాసనను ఆఘ్రాణించాము. ఇది బావున్నట్లుందే ఇహనుండి ఇది కూడా గమనిస్తుంటాను అంది.
(ఇంకా వుంది)
Categories: Left

ఫలించిన వ్యాయామం, ఆహార నియంత్రణ

Wed, 09/01/2010 - 15:02
నేనేమీ ఆరడుగుల అందగాడినేమీ కాదు గానీ వున్నంతలో నేను ఈ సారి చక్కగా వున్నానంటూ ఇండియాలో చాలామంది బంధు మిత్రులు కితాబులిచ్చారు. బక్కగా అయినప్పటికీ బొజ్జ గట్రా తగ్గించి ఫిట్టుగా, చక్కగా తయారయ్యాననీ చాలామంది వ్యాఖ్యానించారు. అసలు వయస్సుకన్నా పదేళ్ళు చిన్నగా కనిపిస్తున్నానన్నారు. నలభైల్లో వాడిని ముప్పయిలోవాడిగా అనిపిస్తున్నానని మెచ్చుకున్నారు. ఇంకొంతమంది ఎప్పుడు చూసినా మీరలాగే వుంటారు - మీకు వయస్సు పెరగదా, మేమేమో ముసలివారం అయిపోతున్నామని వాపోయారు.
మా అనిత ఆదేశం మీద హడావిడిగా వచ్చాను కానీ ఇంకో రెండు నెలలు ఆలస్యంగా వచ్చి వుంటే బెల్లీ ఇంకాస్త తగ్గించీ, కండలు గట్రా పెరిగించీ ఇరవై ఏళ్ళ నవయువకుడిలా కనిపించేవాడిననీ వారందరి దగ్గరా వాపోయాను.  మా ఆవిడ అందగత్తె కావడంతో పాటుగా శరీరాన్ని అదుపులో వుంచుకుంటూ వయస్సు బాగా తక్కువగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఏమి తింటారో, ఏమి చేస్తారో కానీ కుర్రతనంతో కనిపిస్తారంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తుంటారు.
నాకు వచ్చిన ప్రశంసలే ఇంధనంగా ఇహపై ఇంకా జిమ్ము పై పడతాను. బెల్లీ బాగానే తగ్గింది కానీ ఇహపై కండలు పెంచి నాగ, పవన్, తార, నాగార్జున లాంటి కుర్రాళ్లను భయపెట్టాల్సి వుంది. ఏదేమయినా మన కృషికి తగిన గుర్తింపు వస్తే బాగా ఉత్సాహంగా అనిపిస్తుంది కదా. ఆ ఉత్సాహాన్ని నీరుకారిపోనివ్వకుండా జిమ్ములో చూపిస్తా ఇహ నుండీ.
ఒక్క వ్యాయామమే కాకుండా ఆహార నియంత్రణే కాకుండా ఆహారంలో  చాలా మార్పులు చేసాను. కొన్ని సార్లయితే రోజుల కొద్దీ అన్నం తినలేదు. పళ్ళు, కూరగాయలు, ఓట్స్ మీదనే బ్రతికేవాడిని. సో, ఆ ప్రయత్నాలన్నీ ఫలించాయన్నమాట. సంతోషం.
Categories: Left

కాంప్లాన్ బేబీతో ఓ చక్కటి రోజు - 1

Wed, 09/01/2010 - 11:57
ఇండియా నుండి తిరిగివచ్చాను. ఇలా నెమ్మదిగా అక్కడి కబుర్లు తెలియజేస్తుంటాను.

ముందు ఇవి చదవండి:
మామాజీ - 1
మామాజీ - 2

సంజనకి నేను పెట్టిన నిక్ నేం కాంప్లాన్ బేబీ.
సంజనకి ప్రామిస్ చేసినట్లుగానే ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఉదయం సంజనని తన క్లాస్ దగ్గర పికప్ చేసుకొని తన స్వంత ఊరికి వెళుతుంటే చాలా చక్కగా అనిపించింది. దాదాపు మూడు గంటల కారు ప్రయాణం. చక్కటి నవ్వుతో, తియ్యటి మాట్లతో హుశారుగా సంజన చెప్పే కబుర్లు వింటూ వుంటే కాలం ఎలా తెలుస్తుందీ. పచ్చటి పొలాలూ, పచ్చని చెట్లూ చూస్తూ వెళుతుంటే మనస్సంతా అహ్లాదభరితం అయ్యింది. కారులో వెళుతుంటే తన చిన్నప్పటి ఫోటోలు చూపించింది. చిన్నప్పుడు తెల్లగా వున్న అమ్మాయి ఎందుకోగానీ పదవ తరగతి నుండీ ఛామనఛాయలోకి మారిపోయింది. చిన్నప్పటి లాగే తెల్లగా వుండి వుంటే ఇంకా బావుండేది కదా అని అనుకున్నాం. నాకు నచ్చిన ఫోటోలు కొన్నింటి కాపీలు కావాలని అడిగాను. తను చీర కట్టుకున్న ఒక ఫోటో బావుంది. అది కూడా అడిగాను.
తీరికగా సంజనని గమనించే అవకాశం వచ్చింది కనుక శ్రద్ధగా పరిశీలించాను. హుశారుగా, ఉత్సాహంగా, ఆత్మీయంగా, గలగలా మాట్లాడుతుంది. ఆమె నవ్వు బావుంటుంది. ఆ నవ్వు స్వఛ్ఛంగా వుంటూ మనకు ప్రశాంతతని ఇస్తుంది. ఆమెకు ఒక దగ్గర పలువరుస బావుండదు కానీ అదే ఆ అమ్మాయి నవ్వుకి ఇంకా అందాన్నిచ్చింది. ఆమె నవ్వు, స్వఛ్ఛంగా, స్వేఛ్ఛగా విచ్చుకునే ఆ పెదవులూ ఆమెకి ఎస్సెట్. ఆ చక్కటి నవ్వుతో బోలెడన్ని కబుర్లు చెబుతూ వుంటే మనం అలా వింటూపోతాము. ముఖం గుండ్రంగా వుంటుంది. ఆమె గొంతు చాలా శ్రావ్యంగ వుంటుందని మీకు ఆల్రెడీ చెప్పేననుకుంటా. చక్కటి ఇంగ్లీషుతో స్టయిలిషుగా మాట్లాడుతుంది. బ్లాక్ పంజాబీ డ్రస్ వేసుకువచ్చింది. ఆ డ్రెస్సులో చాలా బావుంది. తనకి నల్లరంగు అంటే చాలా ఇష్టమని చెప్పుకువచ్చింది.  మా ఫ్యామిలీ ఫంక్షనుకి వచ్చిన బ్లాగర్లు జ్యోతి, నాగ ప్రసాదులకి ఈ అమ్మాయిని పరిచయం చేసాను. మేము సంజన ఊరికి వెళుతూ అల్పాహారం కోసం ఆగినప్పుడు తెలుగుకై నడకకు ఆహ్వానిస్తూ సుజాత గారి నుండి ఫోను వచ్చింది. అప్పుడు సుజాత గారికి ఫోనులో పరిచయం చేసాను.
వారి ఇంటిముందుకు చేరగానే సంజన వారి అమ్మ ఇంటిలోనికి ఆహ్వానించింది. వారికి చిన్న కిరాణా కొట్టు వుంది. దానిమీద వచ్చే కొద్ది ఆదాయంతోనే వీరి ఖర్చులన్నీ జరిగిపోవాలి. పాత ఇల్లు అది. నాకు ఆ ఇల్లు అసౌకర్యంగా వుంటుందేమోనని ఆ అక్కయ్య (సంజన నాకు కోడలి వరుస కదా) బెంగ పడింది. నాకు పల్లెటూరులు, ఇలాంటి పాత ఇళ్ళే ఇష్టమని తెలియజేయడంతో ఆమె బెంగ తీరింది. ఆమె కూడా చక్కగా మాట్లాడి నాకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా మర్యాదగా చూస్తూ వచ్చింది.
అలాంటి ప్రశాంతమయిన పల్లెటూరికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నగర వాతావరణంలో వుంటూ వచ్చిన అలసటను ఆ రోజు అలా గడిపి దూరం చేసుకోవాలనుకున్నాను. అక్కడి ఇళ్ళనూ, చెట్లనూ, అలా పల్లెలోని, ఆ ఇల్లులోని ప్రతి ఒక్క దానినీ పరిశీలిస్తూ ప్రకృతిలో తాద్మాత్యం చెందసాగాను. నాకు ఎప్పుడో గానీ ఇలా గ్రామల్లో వుండే అవకాశం రాదు. నాకు నగరాలకన్నా పచ్చటి పల్లెటూరులు, అక్కడి అమాయకత్వం, ఆప్యాయతలే బాగా ఇష్టం.
ఆ ఇంట్లో కొంత భాగం పెంకుటిల్లు, కొంత భాగం రేకుటిల్లు. ఆ రేకులు చూస్తుంటే అప్పుడు బాగా వర్షం పడితే బావుండుననిపించింది. వర్షం రేకుల మీద పడుతుంటే వచ్చే శబ్దం వినడానికి ఎంతో బావుంటుంది. మీ కోరిక ప్రకారం ఈ రోజు వర్షం పడుతుంది లెండి అని అక్కయ్య అంది. పైకి ఆకాశంలోకి మరో సారి చూసానప్పుడు - దట్టంగా మేఘాలు అలుముకుంటున్నాయి.
ముందుగా భోజనాలు చేద్దామనుకున్నాం. నాకు ఏయే కూరలు ఇష్టమో ముందే తెలుసుకొని అవన్నీ అప్పటికే సిద్ధం చేసారు ఆ అక్కయ్య. ముందుగా నా ఒక్కడికే భోజనం వడ్డించారు. నా ముందే స్టూలు వేసుకొని కూర్చుంది సంజన. మరి నువ్వో అని అడిగాను. ఇప్పుడు మీ అవసరాలు చూస్తూ మమ్మీతో కలిసి తరువాత తింటానంది. మరి నాకు కంపెనీ ఇవ్వవా అన్నాను. సరె అని తనుకూడా భోజనం తెచ్చుకొని నా ఎదురుగ్గా కూర్చుంది. కబుర్లు చెప్పుకుంటూ భోజనానికి ఉపక్రమించాము. అప్పుడు మొదలయ్యాయి నా అవస్థలు. సంజన కబుర్లు మాత్రమే బాగా చెబుతుంది అనుకున్నాను కానీ అది అవాస్తవమని అప్పుడు బాగా అర్ధమయ్యింది! నా అవస్థలేంటో మరో టపాలో చూద్దాం.
Categories: Left

నా మధుర స్మృతుల భోషాణం కథ

Wed, 08/18/2010 - 15:15
చాలా ఏళ్ల క్రితం ఒక సారి మా బంధువుల అమ్మాయి "అన్నయ్యా, నువ్వు మల్లాది వ్రాసిన అందమయిన జీవితం చదువు. చాలా బావుంది. ఆ హీరో కూడా నీలాగనే అన్ని మధురస్మృతులు దాచుకుంటాడూ" అంది. చదివానా పుస్తకం. బాగా నచ్చింది.
నాకు నా యవ్వన కాలం నుండీ మధుర స్మృతులు దాచుకోవడం అలవాటు. ఏదయినా తియ్యటి సంఘటనో, తియ్యటి అమ్మాయో పరిచయం అయ్యిందనుకోండి - ఆ సంఘటన తాలూకు లేదా ఆమ్మాయి తాలూకు ఏదో ఒకటి భద్రపరుస్తుండేవాడిని. అలాగే ఇంకెన్నో కుటుంబానికి సంబంధించినవీ, స్నేహితులకు సంబధించినవీ కూడా సేకరించేవాడిని. అలాగే నా డైరీలు కూడా. అప్పట్లో అప్పుడప్పుడయినా డైరీలు వ్రాసేవాడిని. అవన్నీ ఓ పాత ట్రంకుపెట్టెలో పెట్టేవాడిని. దానిని మా చుట్టాలు, ఫ్రెండ్స్ నా భోషాణం అని పిలుస్తూ ఆటపట్టిస్తుండేవారు.  ఇంకా ప్రియురాళ్ళు, గర్ల్ ఫ్రెండ్స్, స్నేహితులూ, హితులూ వ్రాసిన ఉత్తరాలు కూడా అందులో పెట్టేవాడిని. ఎంటీవోడి గుర్తుగా కూడా ఆయన స్వయంగా నాకిచ్చిన ఒక విశేషం వుంది కానీ ఆ ముచ్చట మరోసారి చెబుతా.
ఉదాహరణకు ఒ చక్కటి అమ్మాయి పరిచయం అయ్యిందనుకోండీ తన జడ పిన్నో లేక తలలో పెట్టుకున్న పువ్వో సేకరించి పొట్లాం కట్టి దాని మీద వారి పేరూ, తేదీ వ్రాసిపెట్టేవాడిని. మల్లెప్పుడయినా లేదా ముసలితనం లోనయినా ఆ పెట్టే తెరిస్తే మధుర స్మృతులన్నీ గుర్తుకురావాలని నా ఆశ. ఇండియాలో వున్నప్పుడు అప్పుడప్పుడు అన్నీ తెరచి చూసుకొంటుండేవాడిని కానీ ఇక్కడికి వచ్చాక మధ్యలో అప్పుడప్పుడు ఇండియా వెళ్ళినా కూడా నా భోషాణం తెరచిచూసేంత తీరిక లభించింది కాదు. అలా ఆ ట్రంకు పెట్టె తెరవక ఓ పదిహేనేళ్ళు కావస్తోంది.
నా పెళ్ళి అయిన మూడో రోజునే ఆనందం ఎక్కువయ్యి నా భోషాణం మా ఆవిడకి చూపించేసాను. ఆమెకు వళ్ళు మండి సగం స్మృతులు చింపేస్తూ వుంటే నోటమాట రాక కొత్త పెళ్ళాన్ని ఏమనలేకనూ చూస్తూవుండిపోయాను. నేనలాగే నోరెళ్ళ బెట్టుకొని కూర్చుంటే నా కాలనాళిక అసాంతమూ నాశనమవుతుందై తెలివి వచ్చి ఆమె దగ్గరి నుండి ఆ పెట్టె లాక్కొని భద్రపరచుకున్నాను.
నా భోషాణం మా ఇంటి పైన సబ్జా మీద ఎక్కడో వుందని తెలుసు కానీ దాని స్థితిగతులు ఎలా వున్నాయో ఏమిటో? రేపు ఇండియా వెళుతున్నా కదా, ఇహ ఇప్పుడయినా తెరచి చూడాలి. ఈలోగా దానిని ఎవరెవరు తెరచి చూసారో ఏమిటో? అప్పట్లో పెద్ద తాళం కప్ప వేసేవచ్చాను కానీ అది వుందో ఊడిందో! అప్పుడు ఆ పెట్టె మా అమ్మ దగ్గర పెట్టివచ్చాను. మా అమ్మ ఇల్లు మారినప్పుడల్లా అది కూడా ఇల్లు మారుతూ చివరికి నా స్వంత ఇంట్లోకి చేరింది. మధ్యలో ఎవరెవరు ఏమేం చూసారో ఏంటో. అందులో వున్న నా జ్ఞాపకాలు శిధిలమయ్యాయో లేక అలాగే వున్నాయో. ఏవన్నా మంచివి దొరికితే ఆ స్మృతులు మీతో కూడా పంచుకుంటాను లెండి.
Categories: Left

మా నాన్న గారి సమయపాలన

Mon, 08/16/2010 - 18:12

ఈ మధ్య ఎ పి మీడియా రాము గారు సమయ పాలన గురించి ఒక టపాలో ప్రస్థావిస్తే మా నాన్న గారు గుర్తుకువచ్చారు. మా నాన్నగారు సమయ పాలన ఎంతో చక్కగా పాటించేవారు. మా నాన్నగారు ఉపాధ్యాయులు కనుక వారు క్లాసుకు వెళుతున్నారంటే అందరూ వాచీలు సరిదిద్దుకొనే పరిస్థితి వుండేది. తన క్లాసు సమయం కాగానే క్లాసులో వుండేవారు. ఒహవేళ అంతకుముందటి ఉపాధ్యాయులు ఆ గదిలో వుండివుంటే క్లాసు ద్వారం దగ్గర వుండి ఎదురుచూసేవారు. నాగం సార్ వచ్చేసారా అని హడావిడిగా ఆ సార్లు బయటకి వెళ్ళేవారు.
అలా మీటింగుల్లో నయితేనేమిటి, కార్యక్రమాలలోనయితే నేమిటి ప్రతి విషయంలోనూ సమయ పాలన పాటించేవారు. తన వృత్తిలో కూడా నీతీ నిజాయితీ, నిబద్దతలతో పనిచేసేవారు. అందుకే ఉపాధ్యాయులుగా వారి సేవలను మెచ్చి అప్పటి ఎన్ టి రామారావు ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్ ఇచ్చి మా నాన్న గారిని గౌరవించింది.
సమయ పాలన ఇషయంలో కూడా నాస్తికోద్యమ నాయకులు శ్రీ గోరా గారి ప్రభావం ఎక్కువగా వుంది. సమయ పాలన అందరికీ వుండాలంటూ వారు బాగా ఉద్బోధించేవారు. నాస్తిక సభలూ, సమావేశాలూ సరి అయిన సమయానికి మొదలయ్యేలా చూసేవారు.
గోరాగారి రెండవ కుమారుడు విజయం గారి వద్ద నాస్తికకేంద్రంలో సమాజ సేవ గురించి ఒక ఏడాది శిష్యరికం చేసాను. ఆ శిక్షణలో భాగంగా చాలా సభలు, సమవేశాలకి ఏర్పాట్లు చెయ్యాల్సొచ్చేది. మన ఇండియన్ల పంక్చువాలిటీ తెలుసు కనుక ఎప్పుడో మధ్యాహ్నం 3 గంటలకు మీటింగు వుంటే ఉదయం 10 గంటల నుండే మమ్మలందరినీ హైరానా పెట్టించేవారు. అలా రెండు మూడు సార్లు మోసపోయిన తరువాత వారి విధానం గురించి మాకు జ్ఞానోదయం అయ్యింది. అప్పటినుండీ వారి పిలుపులను లైట్ తీసుకొని తాపీగా ఏర్పాట్లు చేస్తుండేవారం.
ఆ విజయం గారి టెక్నికే ఉపయోగించి ఇంట్లో ఏదయినా ఫంక్షన్ జరిగితే లేక వెళ్ళాల్సి వస్తే ఓ కొన్ని గంటల ముందు గానే హడావిడి చేస్తుంటా కానీ ఆ ఆవిడ చాలా కూల్ గా నా హడావిడి పట్టించుకోకుండా గంటల కొద్దీ తయారవుతూనే వుంటుంది. పిల్లల్నీ గంటల కొద్దీ తయారు చేస్తుంది. ఏమన్నా అందామంటే మా ఇంట్లో మైనారిటీ మగజాతి మనది! ఇంకేం చేస్తాం. నోరుమూసుకొని వెయిట్ చేస్తాం.
Categories: Left

అమ్మలు అసాధారణ వ్యక్తిత్వం

Sun, 08/15/2010 - 16:34
ఎవరి పిల్లలు వారికి ముద్దు. అలాగే నా పిల్లలు నాకు ముద్దు. మా అమ్మలు పాప అంటే మాకు ఇంకెంతో ముద్దు. ఎందుకంటే...ఎంత చక్కటి వ్యక్తిత్వం తనది! ఎంత చక్కటి సున్నితమయిన భావాలు తనవి! ఎంత కలుపుగోలుతనం! ముచ్చటేస్తుంది తన ముఖారవిందాన్ని చూస్తే. ప్రశాంతమయిన ఆ మోముని చూస్తే ప్రపంచంలోని బాధలన్నీ ఉఫ్ మని ఊదెయ్యొచ్చనిపిస్తుంది.
కలుపుగోలుతనం: పెద్దలు, చిన్నలు అన్న తేదా లేకుండా, నల్లవారు, తెల్లవారు, దేసీవారు అన్న తేడా లేకుండా అందరితో అనర్గళంగా మాట్లాడుతుంది. ఎవరితో ఏం మాట్లాడితో ఇష్టం వుంటుందో బాగా తెలిసినట్లే ప్రవర్తిస్తుంది. ఎదుటివారు చేస్తున్న పనిలో జెన్యూన్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వారిలో మెచ్చుకోవాల్సిన విషయాలేమయినా వుంటే తటపటాయింపు లేకుండా మెచ్చుకుంటుంది. ఎదయినా పబ్లిక్ ప్లేసులో ఎవరయినా తనని మందలిస్తే చాలు - మాటలతో అల్లుకుపోతుంది. ఇహ పిల్లల పట్ల అపరిమితమయిన ఆసక్తి. శ్రద్ధగా, బాధ్యతాయుతంగా వారిపట్ల చూసుకుంటుంది. వారి ఆలనా పాలనా చూస్తుంది. చక్కగా ఆడిపిస్తుంది. ఏడవకుండా చూస్తుంది.
పనిమంతురాలు: ఇంట్లో ఎవరికి ఏ పని చెప్పినా వేరే వారు లెవకముందే తను ఆ పని చేసిపెడుతుంది. ఇంట్లో అమ్మకి పనిలో సహాయపడుతుంది. అక్కకి కూడా తన పనుల్లో సహకరిస్తుంది. నేను ఏదయినా చెబితే మాత్రం ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలంటుంది! ఇంట్లో ఎవరికయినా అనారోగ్యం కలిగితే శ్రద్ధగా చూసుకుంటుంది. తనకు అనారోగ్యం కలిగినా చురుకుగా వుంటుంది.
ఎనెర్జీ: ఎంత ఎనర్జీనొ అమ్మలుకి. ఎంత ఆడినా ఇంకా ఆడుకోవాలని చూస్తుంది. తనతో ఆడీ ఆడీ మనం అలసిపొవడమే కానీ అది అలసిపొదుకదా.
స్నేహితురాళ్ళు: ఫ్రెండ్స్ ని శ్రద్ధగా ఇంటికి పిలిచి చక్కగా ఆడుకుంటుంది. వారి గురించి కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుంది.
సున్నితమయిన భావాలు: తనకు ప్రకృతి, జంతువులు, పాటలు అంటే ఎంతో ఇష్టం. తను వెలిబుచ్చే భావాలు చూస్తుంటే ఇంత చిన్న వయస్సులో అంత గొప్పగా ఆలొచించగలగడం చూస్తుంటే ముచ్చటేస్తుంది.
నాయకత్వ లక్షణాలు: తను ఎక్కడ వున్నా రింగ్ లీడర్. అందరినీ కలుపుకొని గ్రూపు చేసుకొని అందరినీ ఆటాడిస్తుంది.
పెద్దరికం: తనెదో పెద్ద అమ్మమ్మలాగా అవసరం అయినప్పుడు మాకు నీతులు బోధిస్తూ వుంటుంది. ముఖ్యంగా నాకు బోధిస్తుంటుంది :(  సున్నితమయిన భావాలనూ, ఇతరుల సమస్యలనూ, ఇబ్బందులనూ, కస్టాలనూ ఎంత చక్కగా అర్ధం చెసుకొని స్పందిస్తుందో.
పాఠశాల: పాఠశాలలో కూడా అందరితో, ప్రిన్సిపాలుతో అనర్గళంగా, సంకోచం లేకుండా మాట్లాడుతూ అందరి మన్ననలను పొందుతుంటుంది. టీచర్లకు ఇష్టమయిన అమ్మాయిగా వుంటుంది.

చిలిపితనం: ఎంత అల్లరి నాటీ పాపనో. తన చిలిపితనంతో నన్ను కూడా ఆటాడుకుంటుంది. ఎంతో చక్కగా జోక్స్ కట్ చేస్తుంది.
ఇలా ఇలా ఎన్నో ఇంకా ఎన్నెన్నో చక్కటి విషయాలు. ఎన్నని వ్రాయను. ఎంత వ్రాసినా దాని గురించి తక్కువే అనిపిస్తుంది. తల్లిని ఎంత ప్రేమిస్తుందో. తల్లి మీద ఈగ కూడా వాలనివ్వదు. నేను దానిని ఎంత బాగా చూసుకున్నా అది మమ్మీ పక్షపాతినే. మమ్మీ ఏదన్నా తిట్టినప్పుడు మాత్రం నేను బాగా గుర్తుకు వస్తాను. అప్పుడు నామీద బోలెడంత ప్రేమ కురిపిస్తుంది. ఈ భూగోళంలోనే బెస్ట్ డాడీ అంటుంది.
ఒక్క ఏడుపు మాత్రమే తనలో చికాకు కలిగించే విషయం. ప్రతి చిన్న దానికీ ఏడుస్తుంది. 

ఇప్పుడు ఇండియాలో వుంది కదా. ఇండియాకు ఫోన్ చేస్తే చాలు - అందరూ దాని కలుపుగోలు తనం, మాటకారితనం, డైనమిజం, చురుకుదనం, రెస్పాన్సిబుల్ ప్రవర్తన మొదలయిన వాటి గురించి అచ్చెరొవొందుతూ మాట్లాడుతున్నారు. పెద్దా, చిన్నా తేడాలేకుండా ఎలా అందరినీ కలుపుకొని వస్తుందో చెబుతున్నారు.  నేను ఇండియాకి చేరుకోబోతున్న ఆగస్ట్ 21 వ తేదీ అమ్మలు పుట్టిన రోజు. అదే రోజు జరిగే మా ఫామిలీ వేడుకలో తన పుట్టిన రోజు కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఆ రోజుకి తనకి ఎనిమిది ఏళ్ళు నిండి తొమ్మిది ప్రవేశిస్తాయి.
Categories: Left

Evite తో ఆహ్వానించడం ఎలా?

Fri, 08/13/2010 - 10:50
కొది రోజుల్లో జరగబోతున్న ఒక ఫ్యామిలీ పార్టీకి కొద్దిమంది AP బ్లాగర్లను ఈవైట్ ద్వారా ఆహ్వానించాను. ఈవైట్ గురించి యు ఎస్ లో వుండేవారికి తెలిసేవుంటుంది కానీ ఇతరదేశాల వారికి ముఖ్యంగా ఇండియా వారికి అంతగా తెలిసినట్లు లేదు. అందుకే ఈవైట్ గురించి ఈ పరిచయం.
నేను ఈవైట్ ఆహ్వానం పంపిస్తే చాలామంది ఇంకా చూసుకోలేదు. ఎవరెవరు ఆహ్వానాన్ని చూసుకున్నారో, ఎప్పుడు చూసుకున్నారో అందులో తెలిసిపోతుంది కాబట్టి అబ్బే నాకు మీ ఇన్విటేషను అందలేదు అని ఎవరయినా బుకాయించడానికి వీలు వుండదు :) అది ఒక చక్కని సౌకర్యం అందులో.
కొంతమంది చూసుకున్నా ఆ ఇన్విటేషనుకి సరిగ్గా స్పందించలేదు. అందులో యెస్, నో, మే బి అనే బటన్లు వుంటాయి. వాటిని నొక్కి మీరు వస్తున్నారా లేదా అన్నది తెలియజేయాలి. వస్తున్నట్టయితే మీతో సహా ఎంతమంది మీతో వస్తున్నారు, అందులో ఎంతమంది పెద్దలు, ఎంతమంది పిల్లలు అనేది కూడా తెలపవచ్చు. అలాగే హోస్టుకు ఏమయినా సందేశం ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వవచ్చు. ఇలా ఎంతమంది ఆ పార్టీకి వస్తున్నారో తెలవడం వల్ల పార్టీకి ఏర్పాట్లు సరిగ్గా చెయ్యడానికి వీలుగా వుంటుంది.
కొంతమంది హోస్టులు గెస్ట్ లిస్ట్ కూడా ఈవైట్ ఆహ్వానంలో ప్రదర్శిస్తారు కానీ నేను ప్రదర్శించలేదు. అలా ప్రదర్శిస్తే మహిళా బ్లాగర్లు ఇబ్బంది పడుతారేమో అనే సంకోచం వల్ల ఆ లిస్ట్ పెట్టలేదు. కానీ ఆ లిస్ట్ పెట్టడం వల్ల ఇంకా ఎవరెవరిని ఆ సందర్భానికి ఆహ్వానించారు, మనకు తెలిసిన వారు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రావట్లేదు, ఎంత మంది వస్తున్నారు అనేది ఆ ఇన్విటేషన్ చూస్తున్న వారికి అవగాహన అవుతుంది.
ఇహ కొంతమంది ఈవైట్ నుండి వచ్చిన మెయిల్ చూసినా కూడా ఈవైట్ అంటే ఏమిటో తెలియకపోవడం వల్ల స్పాం అనుకొని డిలిట్ చేసారు. ఇహ మరికొంతమని నా ఇన్విటేషను చూసుకోకపోవడానికి కారణం నా ఆహ్వానం వారి జంక్ లేదా స్పాం ఫోల్డర్లకి వెళ్ళడం అయివుండవచ్చు.
ఈవైట్ వెబ్సైట్ లింక్ క్రింద ఇస్తున్నాను. అందులో వున్న సౌకర్యాలు గట్రా ఇక మీరే ఎక్స్‌ప్లోర్ చేసి చూసుకోండి. ముందు ముందు మీరు ఏ పార్టీ అయినా నిర్వహిస్తుంటే కనుక అందరినీ ఆహ్వానించడానికి ఈవైట్ చాలా సౌకర్యవంతమయినదని గుర్తుంచుకోండి.
http://www.evite.com/
Categories: Left

మామాజీ - 2

Thu, 08/12/2010 - 11:41
సంజనవన్నీ సినిమా కష్టాలు. తండ్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాడు. తల్లికి అనారోగ్యం. దుర్భరమయిన పేదరికం. తల్లి అనారోగ్యంతోనే వాళ్ళ ఊరిలో చిన్న కిరాణా షాపు నడుపుతూ పొట్టపోసుకుంటోంది. అది నడిచేది కూడా అంతంత మాత్రమే. సంజన చదువుల తల్లి. ఆమెకు చదువంటే ఎంత ఇష్టమో. వారి, వీరి దాతృత్వంతో ఎలాగోలా నెట్టుకువస్తోంది. ఈమె పరిస్తితి అర్ధమయ్యి ఆమె డిగ్రీ మొదటి ఏడు ఖర్చులన్నీ నేను స్పాన్సర్ చేసాను. ఇహ ఆ తరువాత చెయ్యలేకపోయి చేతులెత్తేసినా నాకు తెలిసిన వారి నుండి అంతో ఇంతో సహాయం ఇప్పిస్తుంటాను. రెండేళ్ళ క్రితం ఈమె గురించి ఒక పోస్టు వ్రాస్తే ఇద్దరు ముగ్గురు బ్లాగర్లు స్పందించి కొంత సహాయం చేసారు.
అప్పుడప్పుడు ట్యూషన్లు చెప్పుకుంటూ కూడా తన ఖర్చులో కోసం ప్రయత్నిస్తూ వుంటుంది. కొన్ని నెలల క్రితమే డిగ్రీ అయిపోయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సీటు కోసం లాంగ్ టెర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. ఆమె ఇంటర్ మొదటి ఏడు మార్కుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి పదిమందిలో వచ్చిందంట. రెండో ఏడు మాత్రం గృహశాంతి లేక, తండ్రి ఇల్లు వదిలి పెట్టి వెళ్ళిన పరిస్థితుల్లో సరిగ్గా చదవలేక అంత మంచి మార్కులు తెచ్చుకోలేకపోయిందిట.
సంజన వాళ్లమ్మతో కూడా అప్పుడపుడూ మాట్లాడుతూ ఆమె యోగక్షేమాలు కనుక్కుంటూ వుంటాను. అలా అలా ఆ ఇంట్లో నాకో ప్రత్యేక స్థానం ఏర్పడింది. సంజన నన్ను ఒక గాడ్ ఫాదర్ గా భావిస్తూ వస్తోంది. సహాయం చేసున్నందుకు కృతజ్ఞత అనుకున్నా సహాయం చెయ్యలేని, ఇతరుల ద్వారా సహాయం ఇప్పించలేని పరిస్థితుల్లో కూడా ఆమెకు నామీదున్న గౌరవం, ప్రత్యేక స్థానం చెక్కు చెదరకుండా వుండటం ఆశ్చర్యం కలిగిస్తూ వుంటుంది. నేను చేసిన సహాయానికీ, ఈ గౌరవానికీ సంబంధం లేదంటుంది. నా వ్యక్తిత్వం నచ్చి నన్ను గాడ్ ఫాదరుగా గుర్తిస్తున్నాంటుంది. తనకు తండ్రి దూరమవడంతో నాలో తండ్రిని చూసుకుంటున్నదేమో మరి.
ఎన్నేళ్ళనుండో నన్ను ఇండియా రమ్మనమనీ, నన్ను చూడాలని వుందనీ కోరుతూవస్తోంది. నేనేమో ఇప్పుడు వస్తాను, అప్పుడు వస్తాను అని పొడుగిస్తూ వస్తున్నాను. నా మాటలు విని నా ఫోటోలు చూడకముందు శోభన్ బాబుని ఊహించుకునేదంట. శోభన్ బాబు లాగే మృదువుగా మాట్లాడుతారు మీరు అంటుంది. నేను ఫోన్ చెసినప్పుడు మామ్మాజీ అని ఉల్లాసంగా, ఉత్సాహంగా పలకరిస్తుంది. ఆమె ఉత్సాహాన్ని చూసి నాకూ హుశారుగా అనిపిస్తుంది.
మొత్తమ్మీద ఈ నా అల్లరి కోడలు పిల్లని ఈ నెల 21 న మా ఫ్యామిలీ పార్టీలో చూడబోతున్నాను. కొంతమంది బ్లాగర్లను తొలిసారిగా కలవబోతున్నట్లే ఈ అమ్మాయితో నాకు మూడున్నర ఏళ్ళుగా ఫోను స్నేహం వున్నా కూడా ఇదే ఆమెని తొలిసారి చూడబోవడం. ఆ పార్టీలో మామాజీ అన తియ్యటి పిలుపు కోసం ఎదురుచూడబోతున్నాను - ఎందుకంటే ఆ పార్టీకి వచ్చేవారిలో ఇంకెవ్వరూ అలా పిలవరు కనుక ఎవరయినా అలా పిలిస్తే అది సంజనే అయివుంటుంది.
అయితే సంజన మీరు ఇండియా రండి అని కోరుతూ అంతటితో ఊరుకుందా? లేదు లేదు. నేను ఇండియాకి వచ్చాక ఒక రోజన్నా కంప్లీటుగా తనకి కెటాయించాలంట. ఆ రోజు ఇంకే పనులూ నేను పెట్టుకోకూడదంట. ఆ రోజు వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ అమ్మ చక్కగా వండి పెట్టిన కమ్మటి భోజనం చేసి ఆ ఊరిలోనే కబుర్లు చెప్పుకుంటూ వుండాలంట. మరి అంత ఆప్యాయంగా ఆహ్వానిస్తుంటే ఊరుకోగలమా? సరే అని హామీ ఇచ్చాను. ఈ నెల 27 న వాళ్ల ఊరికి వెళదామని చెప్పాను. ఎంత సంతోషించిందో. హైదరాబాదు నుండి ఉదయం ఇద్దరం కలిసి వెళ్ళి మళ్ళీ రాత్రికి తిరిగివస్తాం. మాతో పాటు మా అమ్మలు పాప కూడా రావచ్చు. దానికి గ్రామీణ వాతావరణం చూపించాల్సి వుంది. వారి ఊరు మా సూర్యాపేటకి కొంత దూరంలో వుంటుంది. నేను తిరిగి యు ఎస్ కి వచ్చాక మా కోడలి మరికొన్ని విశేషాలు, వాళ్ళ ఊరి కబుర్లూ వ్రాస్తానేం.
(అయిపోయింది)
Categories: Left

మామాజీ - 1

Wed, 08/11/2010 - 17:39
నన్ను ఇప్పటివరకూ మామాజీ అని పిలిచేవారు ముగ్గురే ముగ్గురు. అది మొదటగా శ్వేత మొదలుపెట్టింది. ఆ తరువాత సంజన, గీత ఆ పిలుపుని మహి నుండి అందుకున్నారు. వీరి ముగ్గురి పేర్లు మార్చి ప్రస్థావిస్తున్నాను. వీరు ముగ్గురూ నిజానికి నాకు బంధువులు కాకపోయినా నన్ను ప్రేమగా, ఆప్యాయంగా మామాజీ అని పిలుస్తారు. అయితే సంజనకీ మిగతా వారిద్దరికీ జీవన విధానంలో బోలెడంత వైవిధ్యం వుంది. శ్వేత, గీత స్వేఛ్ఛా ప్రణయ సామ్రాజ్యాన్ని ఏలాలని ఎన్నుకోగా సంజన మాత్రం ఒద్దిక అయిన నడవడిని ఎన్నుకుంది. ఈ టపాలో సంజన గురించి చూద్దాం. మరెప్పుడన్నా మిగతా వారిద్దరి గురించీ వ్రాస్తాను.
ఈ అమ్మాయికి ఇప్పుడు 21 ఏళ్ళు. ఈ మధ్యనే డిగ్రీ అయిపోయింది. డిగ్రీలో ఈమె చేరకముందు శ్వేత ఈ అమ్మాయిని నాకు పరిచయం చేసింది. వారిద్దరూ ఇంటర్లో క్లాస్మేట్లు. మొదటి సారి ఫోనులో యు ఎస్ నుండి ఈ అమ్మాయితో మాట్లాడినప్పుడు తేనేలాంటి కంఠం, మర్యాద, మన్నన, వినయంతో కూడిన మాటలు విని చాలా ఆనందపడ్దాను. నేను కూడా మిమ్మల్ని మామాజీ అనొచ్చా అని ఆర్తిగా అడిగింది. తప్పకుండా అన్నాను. అలా అలా మా ఫోను పరిచయం పెరిగింది.
నేను శ్వేతతో అన్ని విషయాలు ఫోనులో ఇక్కడినుండి మాట్లాడుతుండే వాడిని కాబట్టి నా గురించి ఈమెకూ అంతా తెలుస్తుండేది. నాతో మాత్రం అలాంటి కబుర్లు పెట్టకండి, నాకు ఇష్టం వుండవు, నాకు మాత్రం మీ లిస్టులో మినహాయింపు ఇవ్వండి అని కోరింది. అలాగే అని అభయహస్తం ఇచ్చేశాను.
ఈ అమ్మాయి ఎలా వుంటుందో నాకు తెలియదు. ఎప్పుడూ ఆమెని చూడలేదు. ఆమె గొంతు మాత్రం వీణ మీటినట్లే వుంటుంది. మంచి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ. అలాంటి చక్కటి కంఠంతో, ఒద్దికగా, గౌరవంగా మాట్లాడుతూవుంటే మెస్మరైజ్ అయినట్లే వుండేది. ఆమె ఎలా వుంటుందా అని ఆమెను, ఆమెకు తెలిసిన ఇతరులనూ అడిగి చూసాను. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా చెప్పేవారు. కొందరేమో బావుంటుందని, కొందరు సో సో అనీ, కొందరు ఏం బావోదనీనూ. ఫోటో పంపించమ్మాయ్ అని ఎన్ని సార్లు అడిగినా మీరు స్వయంగా వచ్చి చూడాల్సిందే మామాజీ అని అంటుంది.
Categories: Left

అఫ్సర్ గారితో కాస్సేపు - 2

Tue, 08/10/2010 - 22:08
అఫ్సర్తో మాట్లాడుతూ వుంటే చాలా విషయాలు తెలుస్తూపోయాయి. వారి జీవనం, వారి విద్యార్ధి జీవితం, జర్నలిస్టుగా, అద్యాపకులుగా వారి అనుభవాలు మొదలయినవి అన్నీ అందులో వచ్చాయి. వారు విస్కాన్సిన్ లో రెసెర్చ్ విద్యార్దులకు తెలుగు నేర్పించడం అన్నది ఆసక్తి కరంగా అనిపించింది. వారి విద్యార్ధుల గురించి కూలంకషంగా తెలుసుకున్నాను. ఇద్దరు ముగ్గురు విద్యార్దులు మాత్రమే వుంటారనీ, వారు శ్రద్ధగా చదువుతారనీ, తెలుగు భాష మీద పట్టురావడానికి మూడేళ్ళన్నా పడుతుందనీ చెప్పారు. వారి విద్యార్దులు చేస్తున్న పరిశోధనాంశాల గురించి తెలిపారు. వారి తెలుగు యాస ఎలా వుంటుందని ఆసక్తిగా అడిగాను. వారు నవ్వి సహజంగానే యాస కొంత తేడాగా వున్నా కూడా మనం ఏదయినా తెలుగు పుస్తకం ఇస్తే వారు కూలంకషంగా చదువుతారు అని వివరించారు.   మా నాన్న నాగం గారి ప్రసక్తి కూడా మా మాటల్లో వచ్చింది. మా నాన్న గారి వివరాలు, అప్పటి తెలంగాణా నాస్తికోద్యమం గురించీ నన్ను అడిగి తెలుసుకున్నారు. మా నాన్న నాగం గారి గురించి విన్నాను అని చెప్పారు. వారి తండ్రి గురించి చెబుతూ వారు కూదా రచయిత అని చెప్పారు. విరసం లొనో, అరసంలోనో వారు వుండినట్లుగా చెప్పారు. పేరు అదిగాను. కౌముది అని చెప్పారు. ఒక ముస్లిం కవికి ఆ పేరు వుండటం ఏమిటా అని ముందు ఆశ్చర్యపడ్డా వెంటనే సర్దుకున్నాను. ఆ తరువాత మా టాపిక్ వారి పెళ్ళి మీదికి మళ్ళింది. కల్పనా రెంటాల గారి గురించి, వారిని ప్రేమ, పెళ్ళి గురించీ క్లుప్తంగా చెప్పారు.    --------------------------------
అఫ్సర్ గురించి ఇదివరకు లీలగా వినివున్నా సంకలినిలల్లో వారి బ్లాగు మొదలయిన దగ్గరి నుండీ ఇంకా తెలవడం మొదలయ్యింది. అయినా సరే వారు కవులు కాబట్టి, కవితలు అనేవి నాకు అర్దం కాక పడని విషయాలు కాబట్టి వారి బ్లాగుని అంటరాని బ్లాగుగానే చాలావరకు వుంచాను. గత ఏడాది విస్కాన్సిన్ కి వచ్చినప్పుడు ఓ రచయిత్రి గడిపిన ఇంటికి వెళ్లానని చెబుతూ వ్రాసిన టపా టైటిల్ నచ్చడంతో భయం భయం గా వారి బ్లాగులోకి అడుగుపెట్టాను. చక్కని పొందికయిన పదాల అల్లికతో వారి వచనం చాలా ఆహ్లాదంగా వుంటుంది.
ఆ తరువాత చదువు ముచ్చట్లు బ్లాగులో/టపాలో వారి ఇంటర్వ్యూ చదివాక వారి గురించి మరింత అవగాహన వచ్చింది. ఆ ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకొని ఎవరో ఓ టపా వెసారు. ధూం అనుకుంటా. దానితో అఫ్సర్ గురించి చర్చ జరిగింది. అలా ఇంకా అఫ్సర్ నాకు ఎక్స్‌పోజ్ అయ్యారు.
కొన్ని నెలల క్రితం కల్పనా రెంటాల గారితో మాట్లాడాను. అప్పుడు వారు అఫ్సర్ గురించి ప్రస్థావించారు. వారు అఫ్సర్ గురించి ఎందుకు ప్రస్థావిస్తున్నారో నాకు అర్ధం కాక తటపటాయిస్తూనే అఫ్సర్ గారు మీకేమవుతారు అని అడిగాను. నెత్తి మీద ఒక్కటెస్తే రెండవుతారు అని సమాధానం వచ్చింది! అప్పటిదాకా వారిద్దరూ భార్యా భర్తలు అని తెలియదు. తెలిసాక ఎంతో ఆశ్చర్యపోయి వారి పెళ్ళి గురించి కనుక్కున్నాను. ఇద్దరు కవులూ ఒకే ఇంట్లో వుంటే ఎలా వుంటుందబ్బా! ఇంట్లో తిట్టు కవిత్వం బాగా వాడుతారా అని సందేహం వచ్చిందప్పుడు.
సరే, ఈ విషయాలు అలా వుండగా అఫ్సర్ గారికి సూయిసైడల్ థాట్స్ వచ్చే ఒహ విషయం చెప్పాలి :) గుండె చిక్కబట్టుకోండి అఫ్సర్! కొద్దిరోజుల క్రితం వారు ఒక టపా వేసారు. అమెరికా పంట పొలాల నుండి ఓ కవిత్వ లేఖ అనీ. ఆ టైటిలే ఎంతో మనోరంజకంగా అనిపించి ఆ టపా చూసాను. ఎంత చక్కగా వ్రాసారు అదీ.సులభమయిన పదాలతో మనస్సుకు హత్తుకొని మనం అక్కడే వుండి ఆ పరిసరాల తాద్మాత్యంలో మునిగితేలుతున్నట్లుగా అనిపిస్తుంది అది చదివితే. అయితే అది చదువుతుంటే నాకు కొన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి. వెంటనే మా మామ గారి పంట పొలాలలో నేను పాడిన ఓ పాట గురించి ఓ స్లీజీ టపా వేసాను!   వారు కవితల్లొ ఉద్దండులొ మరి రమా భరద్వాజ్ లాంటి వారు విమర్శిస్తున్నట్లు కారో నాకు తెలియదు కానీ నాకు మాత్రం వారి వచనం చాలా చక్కగా నచ్చుతుంది. ఆ విషయంలో మాత్రమెవరు కాదన్నా నేను విశ్వసించను. ఎందుకంటే వారి వ్రాతల్లోని ఆహ్లాదతను నేను ఆస్వాదించాను. అలాగే వీరి కవితలు కూడా నా కోడి బుర్రకు ఎక్కుతాయేమోనని కాస్త ముక్కు పెట్టి ముంచినా అవి మనకు ఎక్కలేదు. అసలు కవితలంటే ఏమిటో నాకర్ధం కాదు. వచనాన్ని అడ్డదిడ్దంగా విరిచి వ్రాస్తే అది కవితవుతుందా అనేది నా ప్రగాఢ అనుమానం సుమండీ. అందరూ బ్లాగుల్లో ఓ తెగ కవితలు వ్రాయడమే కానీ బాబూ కవిత అంటే ఇది, తవిక అంటే ఇది అని ఒక్కరు వివరించిన పాపాన పోలేదు. నాకు ఈ కవుల, కవయిత్రుల భయం ఏంటో తెలుసు. అలా వివరిస్తే ఈ శరత్ కూడా త్వరలోనె గొప్ప కవి అయిపోయి తమకు పోటీకి వస్తాడని!   వారిని వీడి వచ్చాక అర్రెర్రే ఓ విషయం అడగడం మరచేపోయా అనుకున్నా. తన్‌హాయి అంటే అర్ధం. కల్పన వ్రాస్తున్న సీరియల్ టైటిల్ కి అర్ధమేంటని కల్పనని అడిగితే అఫ్సర్ నే అడుక్కోమని చెప్పారు. ...అంటే అర్ధం ప్రేమలేఖ అనా? దాని అర్ధం మరి అఫ్సరే నాకు చెప్పాలి.
ఒక చక్కటి బాల్య మిత్రుడిని కలిసి వచ్చాక ఎలాగయితే మాట్లాడుకున్న కబుర్లు నెమరువెసుకుంటామో అలాగే మృదుభాషి, స్నేహశీలి అయిన అఫ్సర్ తో మాట్లాడిన మాటలు కూడా ఇన్ని రోజులయినా మెదలుతూనే వున్నాయి. వారి వచన రచనల కోసం నా ఎదురుచూపులు అలా సాగుతూనేవుంటాయి. ఓ చక్కని స్నేహితుడితో మరో సారి కలిసి మాట్లాడుకోవడం కోసం ఈ రోజులు ఇలా దొర్లిపోతూనేవుంటాయి - బహుశా మళ్ళీ వచ్చే వేసవి దాకానూ!

(అయిపోయింది )
Categories: Left

అఫ్సర్ గారితో కాస్సేపు - 1

Mon, 08/09/2010 - 18:12
గత శుక్రవారం అఫ్సర్ని కలిసినా అలాంటివారి గురించి ఆషామషీగా వ్రాయకూడదు కాబట్టి కాస్త సమయం తీసుకున్నాను. వారి గురించి మరింత తెలుసుకొని, వారి టపాలు కొన్నీ, ఈమాట పత్రిక కొంతా చదివాక వారి గురించి మరింత అవగాహన వచ్చింది.
వారిని షికాగో ఓహేర్ విమానాశ్రయంలో కలుసుకున్నాను. వారు అప్పుడు టెక్సాస్ వెళ్ళే విమానం కోసం వేచివున్నారు. ఇద్దరం ఒకరినొకరం తేలిగ్గానే గుర్తించుకున్నాం. వారు అప్పుడే మూడు గంటలు బస్సు ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి ఆకలి మీద వున్నారు. అకడ టెర్మినల్లో ఎక్కడా ఫుడ్ కోర్ట్ కనిపించలేదు. ఎవరినయినా కనుక్కుందామా అన్నాను కానీ వారు చొరవ చూపలేదు. అప్పుడు గమనించాను వారిలోని బిడియం. ఇహ ఆ తరువాత ఇంకా కొన్ని సందర్భాలలో బిడియం, నెర్వస్‌నెస్ గమనించాను. అఫ్సర్ లాంటి ప్రముఖ కవి ముందు నేను బిడియపడాలి కానీ వారు నా ముందు నెర్వస్ ఫీల్ కావడం ఏమిటా అని విస్మయం చెందాను. సాధారణంగానే వారు అంత బిడియస్తులయితే అది కొంతవరకే వుందా లేక దాని వల్ల నిత్య జీవితంలో ఇబ్బందులు ఎదుర్కునేంత వుందా అన్నది వారు పరిశీలించుకోవాల్సిన అవసరం వుంది.

స్నాక్స్ తింటూ నెమ్మదిగా కబుర్లలోకి వెళ్ళిపోయాము. వారిది ఖమ్మం. మా సూర్యాపేటకి దగ్గర్లోనే. ఖమ్మంలో నేను కూడా కొన్నేళ్ళు వున్నాను. తరచుగా అటు వెళుతుండేవాడిని. ఇద్దరం ఒకే ప్రాంతానికి చెందిన వారం కావడం వల్ల మాకు తెలిసిన ప్రాంతాల గురించి మాట్లాడుకుంటూ వుండటం వల్ల మాకు ఏదో కొత్తగా కలిసినట్లుగా కాకుండా బాల్య స్నేహితులం కలిసినట్లుగా అనిపించింది. భావజాలంలోనూ ఇద్దరం ప్రగతివాదులమే కాబట్టి మా కాలేజీ రోజుల్లోని విద్యార్ధి రాజకీయాలు మా కబుర్లలో ప్రధానాంశాలు అయ్యాయి. వారు అప్పట్లో AISF లోనూ, నేను PDSU లోనూ తిరిగిన వైనాల్ని చెప్పుకున్నాము. వారు ఒక అభ్యుదయ కవిగా, రచయితగా ఎలా ఎదిగిందీ, నేను ఒక నాస్థికుడిగా ఎలా పెరిగిందీ చెప్పుకున్నాము.


మా మాటల్లో సహజంగానే ఎన్నో విషయాలు దొర్లాయి. ఈమాట పత్రిక గురించీ ప్రస్థావన వచ్చింది. అందులోని ఆస్థాన రచయితల కంటే బయట బ్లాగుల్లోనే భావ వ్యక్తీకరణ, వైవిధ్యం బావుందంటూ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈమాట కూపస్థ మండూకం లాంటిదయిపోతున్నదనే అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చారు. అలాంటి స్థితిలో పత్రికలకు ఎక్కువ కాలం మనుగడ వుండదనుకున్నాం.
(ఇంకా వుంది)
Categories: Left

'గారు'కి గౌరవం?

Sat, 08/07/2010 - 18:05
నిన్న అఫ్సర్ గారిని కలిసాను కదా. వారితో మాట్లాటల గురించి ఓ పోస్ట్ వేద్దామని నిన్నటినుండీ అనుకుంటూనే వున్నాను. టైటిల్ ఎలా వుండాలి? ఇలా వుంటే ఎలా వుంటుంది? 'అఫ్సర్ తో కప్పు కాఫీ'  అని పెట్టాలా లేక 'అఫ్సర్ గారితో కప్పు కాఫీ' అని పెట్టాలా? నాకు ఈ గారుతో చాలా కాలం నుండి ముఖ్యంగా బ్లాగుల్లోకి వచ్చినప్పటినుండీ కొద్దిగా సమస్యగానే వుంది. ఇక్కడ కల్చర్ ప్రకారం చూస్తే అందరూ పేరుతోనే పలకరిస్తారు కానీ గౌరవ వాచకాలు ముందూ వెనకా పెట్టరు. ఇంతపెద్దవారయినా, చిన్నవారయినా పేరుతోనే పిలుస్తారు. 
ఇక ఇండియాలో అయితే పెద్దవారూ, గౌరవనీయులు అయితే గారు వాడుతాం కదా. వ్యక్తి మరీ సన్నిహితం అయి ఇంకా మన మధ్య గారు ఏంటండీ అనేవరకూ ఆగి అన్నాక ఏదో వెంకటేశు సినిమాలో వున్నట్లుగా ఒరే సుబ్రహ్మణ్యంగా ఎలా వున్నావురా, చాలా కాలమయ్యిందిరోయ్ నిన్ను చూసీ అని కావలించుకుంటారు. సో, మన సమస్య ఏంటంటే ఇక్కడి కల్చర్ ప్రకారమూ, ఇక్కడి దేశస్తుడిని అవడం మూలాన ఒరే మలక్కూ అని మలక్కును కౌగలించుకోవాలా లేక మలక్గారూ అని మర్యాదగా మన్నన ఇవ్వాలా? పోనీ ఇక్కడి మన దేశీయులను పేరు పెట్టి పిలిచినా అంటే శ్రీ లాంటి వారిని శ్రీ అని పిలిచినా ఇండియాలో వున్న బ్లాగర్లని గారూ అని పిలవాలా? ఎవరు ఎక్కడ నివసిస్తున్నారో మనకు ఎల్లప్పుడూ తెలియదు కదా. ఎలా? 
సరే, అలా పిలవాలని నిర్ణయించినా ఇండియా బ్లాగర్లు యు ఎస్ కి విజిటింగు మీద రాగానే మనం గారు పీకిపారెయ్యొచ్చా. అలా చేస్తే  డంగై పోతారేమో! పోనీ ఇండియాలోని  బ్లాగర్లు అందరినీ గారు అనడం, పాశ్చాత్య దేశాలలోని బ్లాగర్లు అందరినీ పేరుతోనూ పిలిస్తే సరిపోతుందా? గారు లేకుండా బ్లాగుల్లో సంబోధిస్తే అగౌరవం అనుకుంటారేమో. లేకపోతే బ్లాగుల్లో గారు తీసివేసి ఈమెయిళ్ళలోనూ, ఫోను లోనూ, వ్యక్తిగతంగా కలిసినప్పుడూనూ గారు తగిలించేస్తే ఎలా వుంటుందేమిటీ? 
ఇహ ఇండియాలో వున్నవారే కాకుండా మా దే్శాల్లో వుండే గౌరవనీయమయిన బ్లాగర్లు కూడా పేరుతో పిలిస్తే నొచ్చుకుంటారా లేదా అన్నది ఎలా తెలియడం? వారు నన్ను గారు పెట్టి పిలవడం లేదేమని మనని కడిగేయకపోయినా మనస్సులో నొచ్చుకుంటారేమో. సో, ఇవన్నీ మన కంఫ్యూజన్లు. ఎవరయినా ఇలాంటి విషయాల మీద అధారిటీ వున్న గార్లు వుంటే ఈ విషయం లో ఓ తీర్పు గౌరవంగా వెలువరిస్తే బావుంటుంది మహాప్రభో.
ఇక అందరికీ, ఇక్కడి సంస్కృతి ప్రకారం నాకు నా పేరుతోనే అందరూ పిలవడం అలవాటు అయ్యింది కనుక ఎవరయినా సరే ఎంచక్కా నాకు గారు పీకెయ్యొచ్చు. అలా అన్నానని చెప్పేసి ఒరేయ్ శరత్గా అని మీద పడి హగ్గియ్యకండేం! నేను ఎవరో మీకు తెలుసుకదా! జాగ్రత్త.
Categories: Left

ఇవాళ సెలవు పెట్టి అఫ్సర్ గారి కోసం వెయ్టింగూ...

Fri, 08/06/2010 - 15:42
ఇవాళ ప్రముఖ కవి అఫ్సర్ గారిని కలవబోతున్నాను. వారితో నాకు కొద్దిగా ఫోను స్నేహం, కొద్దిగా మెయిల్ స్నేహమూ వుంది. కవులతో మనకేం పడుతుందిలే అనుకున్న నేను కొన్ని నెలల క్రొతం వారు చక్కగా మాట్లాడింది చూసి ఇంప్రెస్ అయ్యాను. వారు ఓ రెండు నెలలుగా మాకు కొంత దగ్గర్లోనే పనిచేస్తున్నా వారు టెక్సాస్ నుండి తాత్కాలికంగా ఇటువైపు వచ్చేరని తెలియక వారిని కలవడం ఆలస్యం అయ్యింది.

వారు ముందు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 5 అని చెప్పారు కానీ వాస్తవంగా 3 అట. ఇప్పుడే ఫోను చేసి చెప్పారు. అక్కడికి వెళ్ళాలి. వారిని కలిసాక మళ్ళీ ఆ విశేషాలతో రేపు కొత్త టపా వ్రాస్తాను.
Categories: Left

ఓకే, హైదరాబాద్ బ్లాగర్స్!

Wed, 08/04/2010 - 18:10
హైదరాబాదు మరియు చుట్టుపక్కల బ్లాగర్లలో నాతో అంతో ఇంతో (బ్లాగు) సాన్నిహిత్యం వున్నవారికి సూచన ఇది:
మీకు వీలయినంత వరకు ఆగస్టు 22 వ తేదీ సాయంత్రం నాకోసం పక్కన పెట్టండి. ఒక ముఖ్యమయిన ఫ్యామిలీ ఫంక్షనుకి మిమ్మల్ని ఆహ్వానించబోతున్నాను. నా దగ్గర ఈమెయిల్ ఐడి వున్నవారికి ఈమెయిల్ ఇస్తాను. మిగతావారివి సేకరిస్తాను. అదే రోజు ఇతర ప్రాంతాల బ్లాగర్లు, రీడర్లు ఎవరయినా హైదరాబాదులో అందుబాటులో వుండేట్టయితే తెలియజేయండి.
ఎవరెవరు హైదరాబాదులో వుంటారో నాకు ఎక్కువగా అవగాహన లేదు. ఇంకొంతమందితో నాకు సరి అయిన స్నేహితం లేదు. హైదరాబాదులో వున్నారని నాకు తెలిసిన వారు: చింతా రామక్రిష్ణా రావు, నెలబాలుడు, మీడియా రాము, అరుణ పప్పు, చైతన్య, సుజాతలు, జ్యోతి, మాల(?), రమణి, నీహారిక తదితరులు. వీరిలో కొంతమందివి ఈమెయిల్స్ వున్నాయి. ప్రమదావనం హైదరాబాద్ మరియు చుట్టుపక్కల సభ్యులందరికీ అభ్యంతరం లేకపోతే జ్యోతి గారిని సంప్రదించి వారి ద్వారా ఆహ్వానిస్తాను. మరి మహిళా బ్లాగర్స్ ఈమధ్య నా టపాల వల్ల నామీద గుర్రుగా ఏమయినా వున్నారేమో తెలియదు. పేకాట పేకాతే తమ్ముడు తమ్ముడే అనుకుంటే సంతోషిస్తాను.
ఇక మిగతా నాకు తెలిసిన ఇతర బ్లాగర్ల పేర్లూ, ఈమెయిల్సూ సేకరిస్తాను. ఇతర ప్రాంతాల నుండి కూడా నాకు బాగా సన్నిహితమయిన బ్లాగర్లు రాగలితే సంతోషిస్తాను. నాగ, పవన్,శ్రీనివాస్ లు రాగలిగితే సంతోషం. వచ్చేప్పుడు మా బావని మాత్రం వెంటబెట్టుకు రాకండేం. కార్తీక్ వుండేదెక్కడా? ఇంకా నాకు సన్నిహితంగా వున్నవారిని గుర్తుకు తెచ్చుకుంటాను. ఎవరినయినా మరచిపోతే కామెంటు ద్వారానో, ఈమెయిల్ ద్వారానో గుర్తుకు చేయండి. నా బ్లాక్ లిస్ట్ గుర్తుకు వుంది కదా. ఆ పేర్లు మీరు గుర్తుకుచేయనవసరం లేదు.
హోస్టు గా నేను తీరికలేకుండా వుండే అవకాశం వున్నా మా బంధుమిత్రులు, అందులో పొటెన్షియల్ బ్లాగర్లూ మిమ్మల్ని ఎంటెర్‌టైన్ చేసే విధంగా నేను చూసుకుంటాను. అలా ఓ పదిమంది నన్నా మీరందరూ కలిసి బ్లాగర్సుని చెయ్యగలరేమో చూస్తా కదా :) అలా ఆ వేడుకలో మనం కలిస్తే మరొకసారి మనమందరమూ కలిసి మళ్ళీ తీరిగ్గా బ్లాగుల గురించి మాట్లాడుకోవచ్చు.
ఈ ప్రపోజల్లో, ఆహ్వానంలో ఏమయినా లొసుగులు అనిపిస్తే తెలియజేయండి. సవరించుకుంటాను. వ్యక్తిగత పరిచయాల్లేకుండానే వేడుకకి రావడం బాగుండదనుకుంటే అలాంటి సంకోచం లేనివారికే నా ఆహ్వానం. ముఖ్య గమనిక: ఈ ఆహ్వానానికి మా ఆవిడ అనిత ఆమోదముద్ర వుంది. భయం లేదు :)
Categories: Left