http://meeandarikosam.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న ముఖ్య విషయములను తెలుసుకొన వచ్హును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Updated: 58 min 44 sec ago

నాన్ స్టిక్ గిన్నెల వలన పిల్లలో కొలెస్ట్రాల్ ఎక్కువౌతోందా?

5 hours 47 min ago
వంటలకు ఉపయోగించే నాన్ స్టిక్ పాన్ మరియూ గిన్నెలకు పూయబడిన రసాయనాల వలన పిల్లలలో కొలెస్ట్రాల్ లెవల్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నదని అమెరికాలోని పరిశోధనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మధ్య వస్తున్న వాటర్ ప్రూఫ్ గుడ్డల వలన కూడా పిల్లలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువయ్యే అవకాశమున్నదని కూడా వారు చెబుతున్నారు.

ఈ మధ్య కొంతమంది పిల్లలలో జరిపిన పరిశోధనలో నాన్ స్టిక్ పరికరాలకు ఉపయోగించే రసాయనాలు ఆ పిల్లల నెత్తురులో ఉండటమే కాకుండా, ఆ పిల్లలలో కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉన్నదని తెలుసుకున్నారు. అందులోనూ ఎల్.డి.ఏల్ (LDL) అనే బాడ్ కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నదట.....

నాన్ స్టిక్ కు ఉపయోగించే పెర్ ఫ్లూరో ఆల్కలిక్ ఆసిడ్ (PERFLUOROALKYL ACID) అనే రసాయనం వలనే పిల్లలలో అధికమైన కొలెస్ట్రాల్ రీడింగ్స్ కనబడుతున్నాయని చెప్పలేము. కానీ ఆ రసాయనానికీ కొలెస్ట్రాల్ రీడింగ్స్ కూ లింక్ ఉన్నదని,కాబట్టి ఈ విషయము మీద ప్రత్యేక పరిశోధన జరుపవలసి ఉన్నదని వారు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆర్చివ్స్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ అడోలసెంట్ మెడిసిన్ అనే పత్రికలో వెస్ట్ విర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన స్టీ ఫైన్ ఫ్రిస్ బీ అనే శాస్త్రవేత్త రాసేరు.

నాన్ స్టిక్ పరికరాలకు ఉపయోగిస్తున్న పెర్ ఫ్లూరో ఆక్టోనిక్ ఆసిడ్ (PERFLUOROOCTANIC ACID…..PFOA) మరియూ పెర్ ఫ్లూరో ఆక్టినో సల్ఫోనేట్ (PERFLUOROACTANE SULFONATE……PFOS) అనే రెండు రసాయనాల గురించి శాస్త్రవేత్తలు పరిశోధన చేసేరు. ఈ రెండు రసాయనాలూ నాన్ స్టిక్ పరికరాలను ఉపయోగించి వాడుతున్న ఆహార పధార్ధాలతో కలిసిపోతాయట. ఇంతే కాకుండా ఆ నాన్ స్టిక్ గిన్నెలను మంట మీద ఉపయోగిస్తున్నప్పుడు, ఆ మంట వేడికి ఆ రసాయనాలు కరిగి, గాలిలో కలసి వంట గదిలో ఉంచే మంచి నీరు, పాలు, మజ్జిగ లాంటి వాటిలో కలుస్తాయట. గాలిలో కలుస్తున్న ఈ రసాయనాలను వంట గదిలోకి వచ్హే వారు పీల్చుకునే శ్వాస మూలంగా రక్తంలో కలుస్తుందట. ఈ రసాయనాల వలన లివర్ సరిగ్గా పనిచేయదట. అందువలన కొలెస్ట్రాల్ పెరుగుతుందట.

రక్తంలో కలిసే ఈ రసాయానాలు మెదడు అభివ్రుద్దిలో అడ్డుపడుతుందట. దీని వలన పిల్లలో వెంటనే ఎటువంటి మార్పూ కనబడకపోయినా, వారు పెరుగుతున్నప్పుడు వారి లక్షణాలలో మార్పులు ఏర్పరచి వారిని బద్ధకస్తులుగా చేస్తుందట.

కొత్త రకం వంట గిన్నెలు రుచులలో మార్పులు తీసుకు రావు కాబట్టి, ఇంతకు ముందు లాగానే మామూలు గిన్నెలు వాడితే మంచిదేమో.
Categories: Right

చైనా దేశం లోని అపురూపమైన ప్రదేశాలు....ఫోటోలు (పార్ట్-2)

14 hours 38 min ago
చైనా దేశం లోని అపురూపమైన ప్రదేశాలు....ఫోటోలు

Shanghai -Yu-Yuan-Garden







Shangai




Hong Kong



Great Wall




Buddha Palace - Lingshan




Guangzhou



Lingshan Park
Categories: Right

మోటార్ సైకిల్ ను "బులెట్ బాబా" దేముడు గా కొలుస్తున్న వందలాది ప్రజలు!

Thu, 09/09/2010 - 01:43
దేముడు అన్నింటిలోనూ ఉన్నాడని నిరూపించే విధముగా రాజస్తాన్ లోని చోటిలా గ్రామస్తులు ఒక మోటార్ సైకిల్ ను దేవతగా కొలుస్తున్నారు. ఆ మోటార్ సైకిల్ ను "బులెట్ బాబా" అని పిలుస్తున్నారు. ఆ మోటార్ సైకిల్ ఉన్న చోటును ఒక దేవాలయం గా చెబుతున్నారు.

ప్రతిరోజూ వందలకొలది ప్రజలు అ మోటార్ సైకిల్ ను దర్శనం చేసుకుని తమ ప్రయాణం సురక్షితంగా జరగాలని వేడుకుంటారట.

పాలీ అనే గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో జోద్ పూర్ వెళ్లే నేషనల్ హై వే లో ఉన్నది ఈ చొటిలా గ్రామం. అక్కడ ఒక చెట్టు క్రింద రాయల్ ఎన్ ఫీల్డ్ 350సిసి(బులెట్ అని పిలువబడే) మోటార్ సైకిల్ ఉన్నది. జోద్ పూర్ నేషనల్ రహదారి నుండి వెళ్లే ప్రతి వాహనం అక్కడ ఆగుతుంది. అందులోని ప్రయానీకులంతా క్రిందకు దిగి ఆ మోటార్ సైకిల్ ను దర్శనం చేసుకుని వెల్తారట. ఆ మోటార్ సైకిల్తో పాటు చనిపోయిన ఆ మోటర్ సైకిల్ ఓనర్ బీం సింగ్ ఫోటోకు, అక్కడున్న చెట్టుకు నమస్కరించి, వేడుకుని వెలతారట. ఆ మోటార్ సైకిల్ ఓనర్ను "ఓం బాబా" అని పిలుచుకుంటున్నారు.

21 సంవత్సరాల క్రితం వేసవి కాలం రోజు అర్ధ రాత్రి ఓం బాబా పాలీ నుండి తన గ్రామం చోటిలాకు ఈ మోటార్ సైకిల్ మీద వస్తున్నారట. అప్పుడు ఆ మోటార్ సైకిల్ స్కిడ్ అయ్యి ఒక చెట్టును ఢీ కొందట. ఓం బాబా అక్కడికక్కడే చనిపోయేరట.

ఓం బాబా చనిపోయిన తరువాత ఆ మోటార్ సైకిల్ ను ఆ ప్రాంతానికి చెందిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించేరట. కానీ మరుసటి రోజు ప్రొద్దున ఆ మోటార్ సైకిల్ పోలీస్ స్టేషన్ లో కాకుండా ఆ చెట్టు క్రింద ఉన్నదట. ఈ పనిని ఎవరో దుష్టులు చేసి ఉంటారని అనుకుని, ఆ మోటార్ సైకిల్ ను తిరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళి, ఆ మోటార్ సైకిల్ లో ఉన్న పెట్రోల్ ను పూర్తిగా తీసేసేరట. కానీ ఆ మరుసటి రోజు ప్రొద్దున కూడా ఆ మోటార్ సైకిల్ మళ్ళీ ఆ చెట్టు క్రింద ఉన్నదట.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ మోటార్ సైకిల్ నిలబడ్డ చోటులో ఒక సిమెంట్ దిమ్మ కట్టి, ఆ మోటార్ సైకిల్ ను దాని పై ఉంచి, దానికి పూజలు చేయటం మొదలుపెట్టేరట. ఆ ప్రాంతం ప్రజలు ఆ మోటార్ సైకిల్ ఓనర్ ఓం బాబా మీద పాటలు పాడేరట. ప్రజలలో ఏదో ఒక నమ్మకాన్ని కలిగించిన ఆ మోటార్ సైకిల్ ను పోలీసులు అక్కడే వదిలేసేరు.

ఆ రోజు నుండి ఆ దారిన వెళ్లే ప్రతి ఒక్కరూ ఆ మోటార్ సైకిల్ ను దర్శించుకుని, ఓం బాబా ఫోటోకూ మరియూ ఆ చెట్టుకూ నమస్కరించుకుని వెడుతున్నారట.

తుప్పు పట్టి, పాడైపోయిన ఆ మోటార్ సైకిల్ ఇప్పుడు కూడా అక్కడే, ఆ చెట్టు క్రిందే ఉన్నది. రోజూ కొన్ని వందలమంది ఆ మోటార్ సైకిల్ ను దర్శించుకుని వెడతారట. ఆ గ్రామ ప్రజలో ఒకరు రోజూ ఆ మోటార్ సైకిల్ ను తుడిచి, శుభ్ర పరిచి దానికి బొట్టూ, పసుపు రాస్తారట.

అలా ఆ మోటార్ సైకిల్ “బులెట్ బాబా” గా మారింది.
Categories: Right

చైనా దేశం లోని అపురూపమైన ప్రదేశాలు....ఫోటోలు (పార్ట్-1)

Wed, 09/08/2010 - 10:13
చైనా దేశం లోని అపురూపమైన ప్రదేశాలు....ఫోటోలు

Beijing....బీజింగ్





Forbidden City - Beijing



Chengdu_statue of Mao Zedong



National Theatre - Beijing



Cloud Dispelling Hall - Summer Palace - Beijing



Olympic Stadium - Beijing



Shangai
Categories: Right

విండోస్ ఓఎస్ 7(Windows OS 7) తో ఎల్.జి (LG) వారు మొబైల్ ఫోన్.......పరిచయ వీడియో

Tue, 09/07/2010 - 10:34
విండోస్ OS 7 ను ఇదివరకే రిలీజ్ చేసేరు. టచ్ స్క్రీన్ టెక్నోలజీ కలిగిన ఈ వెర్షన్ ను కంప్యూటర్స్ లో వాడుతున్నారు.

ఇప్పుడు ఈ టెక్నోలజీతో, ఈ ఆపరేటింగ్ సిస్టం తో ఎల్.జీ కంపెనీ వారు మొబైల్ ఫోన్ (LG OPTIMUS 7) ను పరిచయం చేయబోతున్నారనే విషయం తెలిసింది. ఈ మొబైల్ ఫోన్ ఐ ఫోన్ (iPhone), ఆపిల్ (Apple) మరియూ బ్లాక్ బెరీ (BlackBerry) తో పోటీ పడుతుందని అందరూ అనుకుంటున్నారు.

బహుశ మీరు ఇది ఇదివరకే చూసుంటారు అనుకుంటాను. తెలియని వారికోసం ఆ ఫోన్ పరిచయ వీడియో మరియూ కంప్యూటర్ స్క్రీన్ విడియో ఈ టపాలో ఉంచుతున్నాను.











Categories: Right

కలకత్తాలో ఒకప్పుడు హిట్లర్ ని శ్రీ మహావిష్ణువు అవతారంగా కొలిచేవారట!?

Tue, 09/07/2010 - 03:02
బ్రిటన్ కు చెందిన చరిత్రకారుడు నికోలాస్ గుడ్రికే క్లార్కే నమ్మకాన్ని బట్టి జర్మన్ సర్వాధికారి అడాల్ఫ్ హిట్లర్ ను భారతీయ అధ్యాత్మిక, తాంత్రీక మరియూ నాజీలకు సానుభూతి ని చూపిన, కలకత్తాకు చెందిన సావిత్రీ దేవి అనే ఆమె హిట్లర్ ను మహావిష్ణువు యోక్క చివరి అవతారమైన కల్కి భగవాన్ గా పేర్కొన్నదట.

కలకత్తాలోని పెద్ద పెద్ద బెంగాలీ కుటుంభాలలో హిట్లర్ను దేవునిగా కొలిచేవారట. హాలీవుడ్లో హిట్లర్ గురించి మంచిగా తీయబోయే సినిమాలో అనుపం కేర్ హిట్లర్ గా నటించటానికి ఒప్పుకున్నరు.(కానీ ఆ తరువాత చాలామంది ఆయన్ను తప్పు బట్టడంతో ఆ సినిమాలో తాను నటించబోనని తెలిపేరు).

టారంటోలో ఉన్న నియో-నాజీ సమీస్ డాట్ పుస్తక ప్రచురన కర్త ఎర్నెస్ట్ జుండేల్ 1982 లో తన దగ్గర సావిత్రీ దేవితో చేసిన రెండు ఇంటెర్వ్యూ క్యాసెట్లు మరియూ అమె రాసిన (ప్రచురన కాని పుస్తకం) "ది లైటనింగ్ అండ్ ది సన్" తన దగ్గర ఉన్నదని ప్రకటించేరు. ఆ ప్రకటన యోక్క హెడ్డింగ్ ఇలా ఉన్నది "హిట్లర్ యోక్క మతం తెలిసెను! ఆయన భారతదేశములో బ్రతికే ఉన్నారు. కావలసినవారు ఈ రెండు క్యాసెట్లనూ కొనుక్కోవచ్హును".

చరిత్రకారుడు-రచయత క్లార్కే ఈ ప్రకటన చూసి ఒక హిందూ అధ్యాత్మిక వాది నాజీ మతం గురించి భారతదేశ స్వాతంత్ర్యానికి ముందే మాట్లాడటం, రాయడం మీద ఆశక్తి కలిగింది. క్లార్కే దక్షిణ ఇంగ్లాండ్లో ఉన్న ఎక్సేటర్ విశ్వవిద్యాలయంలో పాశ్చ్యాత దేశాల రహశ్యాలను భోదించే అధ్యాపకుడిగా పనిచేసేవారు. ఈయన కూడా అధ్యాత్మిక పుస్తకాలూ, రహశ్యాలు మరియూ నాజీ రాజకీయ చరిత్ర గురించి పుస్తకాలు రాసేరు.

క్లార్కే ఆ క్యాసెట్లను కొనుకున్నారు. ఆ క్యాసెట్లలో హిట్లర్ కి హిందూ ఫిలాసఫీలో మరియూ హిందూ అధ్యాత్మికాలపై తనకున్న నమ్మకాలని వ్యక్తపరచటం విని ఆశ్చర్యపోయేరు. అందులో న్యూయార్క్ యూనివర్సిటీ ప్రెస్ వారు "హిట్లర్ యోక్క గురువు: సావిత్రీ దేవి--హిందూ ఆర్య మిత్ అండ్ నియో-నాజీజం' అనే పుస్తకాన్ని ప్రచురణ చేసేరనే విషయాన్ని తెలుసుకున్నారు.

లయాన్స్ లో ఉన్న మాక్సీమెయానీ పోర్టాస్ అనే నగరంలో సావిత్రి దేవి జన్మించేరు. ఆమె కలకత్తాకు చెందిన బెంగాలీ అసిత్ క్రిష్ణ ముఖర్జీ అనే ఆయన్ను పెళ్ళిచేసుకున్నారట. ఆమె హిట్లర్ మీద ఆర్య-నాజిజం గురించి చాలా పుస్తకాలు రాసేరట.....1937 నుండి 1940 వరకు ఆమె హిందూ మతం గురించి ప్రచారం చేసేరట. అదే సమయం లో ఆమె అర్య-నాజిజం గురించి కూడా ప్రసంగాలు చేసేవారని క్లార్కే తెలిపేరు. 1930 లో భారతదేశం బ్రిటీష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడు భారతదేశోద్దారకులపై బ్రిటీష్ వారు అంక్షలు విధించేరు. ముఖ్యం గా స్వస్తిక్ గుర్తులున్న మత సంఘాలపై ఎక్కువ ఆంక్షలు విధించేరట.

కలకత్తాలోని కొందరి ఇల్లలో హిట్లర్ యొక్క ఫొటోలు ఉండటాన్ని గమనించిన సావిత్రీదేవి అప్పుడు కలకత్తా హిందూ మిషన్ యొక్క ప్రిశిడెంట్ శ్రీమత్ స్వామి సత్యానందా ని కలిసి తాను హిట్లర్ గురించి హిందూ మత ప్రచారాలలో ప్రసంగాలు చేయవచ్హా అని అడిగినప్పుడు ఆయన హిట్లర్ మాకు మహావిష్ణువు అవతారం అని చెప్పేరట.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఆమె తన పుట్తిన ఊరికి వెళ్లిందట. అప్పుడు అమె తన ఎస్.ఎస్. ( నాజీ ల సీక్రెట్ సెర్వీస్) హీరోలను యుద్ద ఖైదీలుగా పట్టుకుని దండిస్తున్నారని తెలుసుకున్నదట. ఆ రోజు రాత్రి ఆమె కల గన్నదట. ఆ కలలో ఆమె నాజీ సీక్రెట్ ఏజెంట్ హెర్మాన్ గోయరింగ్ ను కలుసుకున్నట్లు "మిమ్మల్ని ఒక క్రిమినల్ గా చాటించి ఉరితీయబోతున్నారు...మీరు అలా మరణించ కూడదు" అని చెప్పి తన దగ్గరున్నా ఒక మందు బిల్లను ఆయనకు ఇచ్హిందట. ఆమె కల గన్న మరుసటి రోజు హెర్మాన్ గోయరింగ్ కారాగారంలో చనిపోయి ఉన్నారని వార్త వెలువడినట్లు ఆమె తన పుస్తకంలో రాసిందట.

కొన్ని రోజుల తరువాత బ్రిటీష్ ప్రభుత్వం నాజీలకు సానుభూతి ని చూపిన ఈమెను కూడా ఖైదు చేసి చెరసాలలో ఉంచేరట. ఆమె జీవితం అవగాహనకు అందని రహశ్యము గానే ఉండిపోయిందని క్లార్కే తెలిపేరు.
Categories: Right

"నా డబ్బును దొంగలించిన వారిని పట్టుకునేంత వరకు వస్తూనే ఉంటాను"....మైకేల్ జాక్సన్ ఆత్మ

Mon, 09/06/2010 - 10:38
పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ దయ్యం ను అతని స్నేహితులూ మరియూ అతని బంధువులూ అతను చనిపోయిన తరువాత చాలా సార్లు చూడటం మరియూ ఎదొర్కొనటం జరిగిందని చెబుతున్నారు.

ఇప్పుడు ఒక సైకిక్ (అతీంద్రియ శక్తులున్న మనిషి) "ఆయన ఆత్మ శాంతించదు. ఆయనకు జరిగిన అన్యాయాలకు న్యాయం జరిగేంత వరకు ఆయన ఆత్మ శాంతించదు. అంతవరకు ఆయన దయ్యం గా మన మధ్య తిరుగుతూనే ఉంటారు" అని చెప్పినట్లు లండన్ కు చెందిన డైలీ స్టార్ పత్రిక తెలిపింది.

ఒక గంటసేపు జరిగిన మెడిటేషన్ లాంటి కార్యక్రమంలో మెలెడియా అనే ఒక మహిళా సెలెబ్రిటీ మైకేల్ జాక్సన్ ఆత్మతో మాట్లాడేరట.









ఆశ్చర్య పరిచే విధముగా జరిగిన సంభాషణలో మైకేల్ జాక్సన్ ఆత్మ "నేను చనిపోయిన వెంటనే నేను అద్దెకున్న భవనం లో నుండి నేను దాచుకున్న డబ్బును దొంగతనంగా తీసుకు వెళ్లేరు" అని చెప్పిందట.

ఒక గంటసేపు నిశ్శబ్ధంగా జరిగిన మెడిటేషన్ మధ్యలో "ఎవరైనా మైకేల్ జాక్సన్ తో మాట్లాడ దలుచుకుంటే, నా మూలం గా ఆయనతో మాట్లాడ వచ్హు...ఎవరైనా ఏదైనా అడగదలచుకుంటే అడగండి" అని ఆమె అడిగిందట.

తాళం వేయబడని అలమార్లలోని డబ్బును దొంగతనం చేసేరట. ఈ నేరం ఎవరు చేసేరో కూడా తెలిపేరట కానీ విచారణ జరగవలసి ఉన్నది కాబట్టి వారి పేరును బయటపెట్టలేమని చెప్పేరట.

అన్నిటి కంటే ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే మైకేల్ జాక్సన్ దయ్యం గా తిరుగుతున్నారని అతని స్నేహితులూ, బంధువులూ మరియూ ఆ నగర ప్రజలు నమ్ముతున్నారు.
Categories: Right

శేఖర్ కమ్ముల గారి "లైఫ్ ఈస్ బ్యూటిఫుల్" (Life is Beautiful) సినిమాలో నటించాలని ఉన్నదా?

Sun, 09/05/2010 - 11:20
మీకు సినిమాలో నటించాలనే ఆశ ఉన్నదా?...శేఖర్ కమ్ముల గారు తీయబోతున్న "లైఫ్ ఈస్ బ్యూటిఫుల్" సినిమాలో నటించడానికి నటీనటులు కావాలట. పూర్తి వివరాలు ఆయన అఫీసియల్ వెబ్ సైట్ http://www.amigoscreations.com/lifeisbeautiful లో ఇచ్హేరు. అక్కడ నుండి తెలుసుకోండి.


Categories: Right

కాళ్ళు చేతులు లేని ఇతను అన్నీ ఉన్న ఇతరులని ప్రోశ్చహించే విధం చూడండి(తప్పక చూడవలసిన వీడియో)

Sat, 09/04/2010 - 10:16
పుట్టుకతోనే కాళ్ళూ చేతులూ లేని ఇతను, జీవన పోరాటంలో ఎవరూ ఓడిపోకూడదని, ఓడిపోయిన ప్రతిసారీ గెలవటానికి ప్రయత్నం చేయాలని, గెలిచేంతవరకూ ప్రయత్నం చేస్తూనే ఉండాలని అందరినీ ప్రోశ్చాహించే విధముగా ఉపన్యాసం ఇవ్వటాన్ని మరియూ అతను జీవతం తో పోరాడి జైయిస్తున్న కొన్ని సంఘటనలను ఈ వీడియోలో చూడండి.


Categories: Right

వైద్య నివారణ కొరకు గానీ, వైద్య సమాచారం కొరకు గానీ అంతర్జాలంలో వెతక వద్దు...అది మేలు కంటే హాని ఎక్కువ చేస్తుంది

Sat, 09/04/2010 - 03:59
"అంతర్జాలము వైద్య సమాచారానికి అతి పెద్ద కేంద్రం అనడంలో సందేహం లేదు. కానీ రోగ నిర్ణయం చేసే చోటు మాత్రం కానే కాదని ఖచ్హితము గా చెప్పవచ్హు. నిజానికి అంతర్జాలంలోని వైద్య సమాచారం మనకి మంచి చేసే కంటే హాని ఎక్కువ చేస్తుంది" అని బ్రిటైన్ వారు జరిపిన ఒక సర్వే తెలిపింది.

వైద్య సమాచారాలనూ, రోగ లక్షణాలనూ అంతర్జాలం నుండి వెతికి తెలుసుకునే 5 గురిలో ఒకరు తమకు హార్ట్ అటాక్ వచ్హే సూచనలున్నాయని భావించి, మనశ్శాంతి కరువై బాధ పడుతున్నారట.

అజీర్తితో కడుపులో తిప్పటాన్ని ఫుడ్ పాయిసనింగ్ గానూ, సాధారణ నడుం నొప్పిని కిడ్నీ వ్యాధి గానూ చిత్రించుకుని అవస్త పడుతున్నారట. సాదారణ తల నొప్పి వచ్హే వారిలో 80 శాతం మంది దానిని మైగ్రేన్ వ్యాధి గానూ, సాదారణ పొత్తి కడుపు నొప్పి వచ్హే వారిలో 28 శాతం దానిని అపెండిసైటీస్ గానూ ఊహించుకుంటున్నారట.

వ్యాధుల గురించి సమాచారం తెలుసుకోవాలనుకుని అంతర్జాలం లో వైద్య సమాచారాలు చదివే వారిలో 46 శాతం మంది తమకు ఏదో తీరని రోగం రాబోతోందని, దాని వలన మంచాన పడతామని భయపడిపోతున్నారట. చాలా మంది తమకు రోజూ కలిగే మామూలు శరీర బాధలకు కారణ మేమిటో తెలుసుకోవటానికి అంతర్జాలములో రోగ లక్షణాలని పోల్చుకుని తమకు అతి పెద్ద జబ్బు వచ్హే సూచనలున్నాయనుకుని అనవసరం గా మానసిక అలజడికి గురౌతున్నారట.

"అంతర్జాలము వైద్య సమాచారాన్ని(వైద్యులకు) అందజేయడంలో అతి ముఖ్య మైన పాత్ర వహిస్తున్నా...రోగ నిర్ణయాన్ని మాత్రం ఒక డాక్టర్ దగ్గరకు వెళ్లే నిర్ణయించుకోవాలి" అని సర్వేని జరిపిన టినా క్లరే ఆఫ్ ఎంగేజ్ మ్యూచువల్ అస్యూరన్స్(Tina Clare of Engage Mutual Assurance) అధినేత స్కాట్స్ మాన్ తెలిపేరు.

డాక్టర్లు మన ఆలోచనలకు విరామము, మనసుకు విశ్రాంతి ఇవ్వడమే కాకుండా మనం తెలిపే లక్షణాలను విని, అసలు మనకు వ్యాధి ఉన్నదా...ఉంటే ఎటువంటి వ్యాధి ఉన్నది చెబుతారని ఆయన అన్నారు.

మైగ్రేన్ వ్యాధి ఉన్న వారిలో 16 శాతం తమకు బ్రైన్ ట్యూమర్ ఉండవచ్హునని, ఊపిరి సరిగ్గా పీల్చుకోలేని వారిలో 15 శాతం మంది తమకు ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నదని అంతర్జాలము లోని వ్యాధి సమాచారాన్ని చూసి అపోహ పడుతున్నారట.

అందరూ తెలుసుకో వలసిన విషయం ఏమిటంటే వ్యాధి లక్షణాలు చాలా వ్యాధులకు ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి అంతర్జాలములో ప్రకటించే వివరాల కంటే నిజమైన డాక్టర్లు తెలిపే వివరాలు, సమాచారమూ మాత్రమే మనకి మేలు చేస్తుంది.
Categories: Right

2001 లో భారతదేశంలో కురిసిన "ఎర్ర వర్షం" (RED RAIN) లో పడిన బగ్స్ అన్య గ్రహాలకు చెందినవి...పాన్స్ పెర్మియా (PANSPERMIA) సిద్దాంతులు

Fri, 09/03/2010 - 11:25
9 సంవత్సరాల పరిశోధన తరువాత, పాన్స్ పెర్మియా సిద్దాంతాన్ని నమ్మే సిద్దాంతులు, 2001 జూలై నెలలో భారతదేశం లో కురిసిన ఎర్ర వర్షం నీటిలో కనబడ్డ పురుగులు (WORMS & BUGS) భూమి మీద ఉన్నటువంటి ఎటువంటి జీవరాసికీ చెందినవి కావు. కాబట్టి అవి అన్య లోకం లోని జీవ రాసులకు చెందినవే నని గట్టిగా చెబుతున్నారు.

భూమి మీదున్న జీవరాసులన్నీ అంతరిక్షంలో ఉన్న తోక చుక్క, క్షుద్ర గ్రహం లేక ఉల్క భూమిని ఢీ కొన్నప్పుడు వాటిలో నుండి భూమి మీద పడిన జీవరాసుల గుంపు నుండి వచ్హినవే నని చెప్పే సిద్దంతాన్నే పాన్స్ పెర్మియా అంటారు.


గాడ్ ఫ్రీ లూయిస్ అనే బౌతిక శాస్త్ర నిపుణులు, మరియూ బ్రిటన్ కు చెందిన పాన్స్ పెర్మియా సిద్దాంతి చంద్ర విక్రమసింగే భారతదేశంలో కురిసిన ఎర్ర వర్షంలో వచ్హిన బగ్స్ అంతరిక్షంలో ఉన్న ఏదో ఒక తోక చుక్క పగిలిపోవడం వలన, అందులో నుండి బయటకు వచ్హిన బగ్స్ మేఘాల మీద పడటం వలన వర్షం కురిసింది. ఆ వర్షం తో పాటూ అవికూడా క్రిందకు రావటం వలన వాటి రంగుతో వర్షం పడింది అని చెబుతున్నారు.

ఈ బగ్స్ భూ వాతావరణం లో అచేతనంగా ఉంటాయి. కానీ ఇవి ఎండ వేడి 121 డిగ్రీల సెల్షియస్ లో, ఆ సూర్య రస్మి వేడికి చలనంలోకి వచ్హి తమ అంకెను పెంచుకుంటాయట. అంటే ఒక బగ్ లో కొన్ని వేల బగ్స్ గుడ్లు ఉండి అవి బయటకు వస్తాయని లూయిస్ తెలిపేరట.

2001 లో జూలై నెల 25 నుండి సెప్టంబర్ నెల 23 వరకు కేరళా రాష్ట్రంలో పలు చోట్ల ఈ ఎర్ర వర్షం కురిసిందట. ఎక్కువ చోట్ల ఈ వర్షం ఎర్ర రంగులో ఉన్నా కొన్ని చొట్లలో పసుపు,నలుపు మరియూ గ్రీన్ కలర్ లో కురిసిందట. ఆ వర్షంలో తడిసిన బట్టలకు ఆ రంగు మరకలు అంటినాయట.

ఇలాంటి వర్షం కేరళ రాష్ట్రంలో 1896 నుండి అప్పుడప్పుడు కురుస్తునే ఉందట.అయితే, 2001 లో ఈ ఎర్ర వర్షం ఎక్కువగా పడింది. కానీ 2006 లో పడిన ఈ ఎర్ర వర్షం ప్రపంచ శాస్త్రవేత్తల ద్రుష్టిలో పడింది. భారతదేశం 2001 లోనే ఈ వర్షం గురించి పరిసోధనలు జరిపింది. గాలిలో ఎగురుతున్న బగ్స్ వలన ఆ రంగు వర్షం కురిసిందని తెలిపేరు.

కానీ 2006 లో కోట్టయంలో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి చెందిన బౌతిక శాస్త్రవేత్త సంతోష్ కుమార్ మరియూ గాడ్ ఫ్రీ లూయిస్ ఆ వర్షం అంతరిక్షంలో ఉన్న అన్య జీవుల జీవ కణాల వలనే ఆ రంగులో ఉన్నదని తమ అనుమానాన్ని వ్యక్త పరచటం ప్రపంచ మంతా ఆశక్తి కలిగించటమే కాకుండా సంచలనం స్రుష్టించింది.

గూగుల్ సెర్చ్ కు వెళ్లి రెడ్ రైన్ (RED RAIN) మరియూ పాన్స్ పెర్మియా (PANSPERMIA) అని వెతికితే మీకు మరి కొన్ని విషయాలు తెలుస్తాయి.
Categories: Right

రాత్రి పూట ఎక్కువసేపు ఇంటర్ నెట్ తో గడుపుతున్నారా?...మీకు ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి

Fri, 09/03/2010 - 02:29
ఇంటర్ నెట్ ని బ్రౌజ్ చేస్తూనో లేక్ చాటింగ్ చేస్తూనో రాత్రి బాగా పొద్దుపోయేదాకా మెలుకువగా ఉంటున్నారా? అయితే మీకు మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్హే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక గంట నిద్ర తక్కువకు మనలో 14 శాతం వ్యాకులత పెరుగుతుందట. దీని వలన భవిష్యత్తులో స్థిరచిత్తత ఏర్పడుతుందని ఒక పరిశోధన మూలంగా తెలిసింది.

ఈ మధ్య కాలంలో యువతీ యువకులు నిద్ర లేమి వలన కలిగే సమస్యలతో ఎక్కువగా బాధ పడుతున్నారని, దానికి ముఖ్య కారణం ఇదే నని చెబుతున్నారు.

5 గంటల కంటే తక్కువ సేపు నిద్ర పోయే వారిలో మానాసిక అలజడులు ఎక్కువగా ఉంటాయని, 17-24 ఏళ్ళ వయస్సు వారిలో ఈ మానసిక అలజడులు ఎక్కువగా ఉన్నాయని, దీనికి కారణం వెతికినప్పుడు ఈ వయస్సు వారు రాత్రి పూట నిద్ర పోవలసిన సమయాన్ని దాటవేస్తూ, ఎక్కువ సమయాన్ని ఇంటర్ నేట్ తో గడుపుతున్నారని డైలీ మైల్ పత్రిక తెలిపింది.

ప్రతి ఒక గంట నిద్రలేమికి మనిషిలో 14 శాతం మానసిక అలజడి పెరుగుతుందని "స్లీప్" పత్రిక పేర్కొన్నది.

నిద్రా బంగం మొదట ఇన్సోమేనియా(INSOMNIA) గానూ, బిపోలార్ (BIPOLAR) గానూ తరువాత డిప్రెషెన్ (DEPRESSION) గానూ, చివరికి ఆంక్సైటీ (ANXIETY) గానూ మారుతుందట. ఈ మానసిక అలజడుల వ్యాధులను తగ్గించడం అతి కష్టముట.

"ఈ మధ్య ఈ వయస్సు (17-24) వారే కాకుండా, మధ్య వయస్సు వారు కూడా ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్ నెట్ లో ఫేస్ బుక్ గానీ, గేంస్ గానీ లేక మరింకేదైనా అనవసర మైన విషయల మీద గానీ తమ అమూల్యమైన నిద్రా సమయాన్ని వ్రుధా చేస్తూ రాత్రి 1-2 గంటలకు పడుకుంటున్నారు. తిరిగి ప్రొద్దున్నే 7 గంటలకు లేస్తున్నారు. పడుకున్న వెంటనే నిద్ర పట్టదు. ఇంటెర్ నెట్ లోని విషయాలు మెదడులోని "స్లీప్ సెంటర్" ను డిస్టర్బ్ చేస్తుంది. దీనివలన వారికి నిద్ర పట్టడానికి ఆలశ్యమవడమే కాకుండా, వారి నిద్ర కూడా రిలాక్స్డ్ (RELAXED) నిద్రగా ఉండదు. దీని వలన వారిలో చికాకు పెరిగి అది కోపంగా మారుతుంది. దీనిని కంట్రోల్ చేయాలనుకునే వారు మానసిక ఒత్తిడికి లోనౌతారు. దీని వలన ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఇది తెలియక చాలా మంది తమ నిద్రను పాడుచేసుకుంటున్నారు. వీరంతా ఒక విషయం మరిచిపోతున్నారు. ఇంటర్ నెట్ లో, అందులోనూ ముఖ్యంగా సోషియల్ నెట్ వర్క్ ల వలన ఎటువంటి లాభమూ లేదు. లాభం నెట్ వర్క్ వారికి, కష్టాలు మనకి" అని సిడ్నీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నికోలాస్ గ్లోజియర్ తెలిపేరు.

నిద్ర పోవడానికి అనవసరమైన మందులు వాడుతూ, ఆ మందుల వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ను భరిస్తూ లాభం లేని ఇంటర్ నెట్ లో అంత సమయం గడపాలా?
Categories: Right

11 సంవత్సరాల ఈ బాస్కెట్ బాల్ (BASKETBALL) ప్లేయర్ ప్రతిభ ను చూడండి

Thu, 09/02/2010 - 10:50
11 సంవత్సరాల ఈ బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిభ ను చూడండి....వీడియో

Categories: Right

మంచి నీళ్ళ పంపు లో నుండి డబ్బు!

Wed, 09/01/2010 - 03:14
ఆశ్చర్యంగా ఉన్నదా....మీకే కాదు, ఈ వార్తను చదివిన వారందరీకీ కూడా ఆశ్చర్యం గానే ఉన్నది. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలోని ప్రజలకైతే మరింత ఆశ్చర్యమేసిందట. ఎందుకంటే ఈ సంఘటనను వారు నేరుగా చూసేరు కనుక.

తెలతెల్లవారుతూండగా చెక్కలను రవాణా చేస్తున్న ఒక లారీ రోడ్డు మీదున్న ఒక పెద్ద నీళ్ళ పంపును ఢీ కొన్నది. ఈ నీళ్ళ పంపు పగిలి ఒక్కసారిగా నీళ్ళు విరజిమ్ముకోచ్హినై. ఇలా మాత్రమే జరిగుంటే ఇది వార్త అయ్యేది కాదు. విరజిమ్ముకోచ్హిన నీటితో పాటూ రూపాయి నోట్లు కూడా వచ్హినందున ఇది వార్త అయ్యింది.

చెన్నై నగరంలో ఉన్న వ్యాసార్ పాడి ప్రాంతంలోని ఒక బ్రిడ్జ్ మీద జరిగిన ఈ సంఘటన వలన ఆ బిజీ రోడ్డు మీద ట్రాఫిక్ సుమారు ఒక గంటకు పైగా ఆగిపోయింది. విరిగి పోయిన నీళ్ల పంపు నుండి బయటకు విసిరి వేయబడుతున్న రూపాయి నోట్లను చూసి ఆ రోడ్డు మీద వెడుతున్న వారు తమ వాహనాలు ఆపి ఆ డబ్బును ఏరుకోవడం మొదలు పెట్టేరు. రూ.20, రూ.50 మరియూ రూ.100 నోట్లు బయటకొచ్హి పడ్డాయి. ఎవరికివారు తమకు దొరికినంత డబ్బును ఏరుకున్నారు. ఈ వార్త ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు తెలిసింది. వెంటనే చాలా మంది ఆ సంఘటన స్థలానికి వచ్హి, వారు కూడా ఏరుకోవడం మొదలు పెట్టేరు.

ఒక అర గంట తరువాత డబ్బు రావడం ఆగిపోయింది. ఆ నీళ్ళ పంపు లోపలి లోతులో ఇంకా డబ్బు వుండి వుండవచ్హు నని అక్కడ గుమి కూడిన ప్రజలు ఆ పంపును పగలకోడదామని చూసేరు. ఈ లోపు అక్కడికి పోలీసులు వస్తున్నారని తెలుసుకుని తమ ప్రయత్నాన్ని ఆపేరు. ట్రాఫిక్ ఆగిపోయి ఉండటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి కొద్ది సమయం పట్టింది. ఈ లోపు చాలా మంది తడిసిపోయిన రూపాయి నోట్లను ఏరుకున్నారు.

అక్కడికొచ్హిన పోలీసులను చూసి జనం వెనక్కు తగ్గేరు. విషయం పూర్తిగా తెలుసుకున్న పోలీసులు, డబ్బును ఏరుకున్న ప్రజలను చూసి ఏమీ అనలేకపోయేరు. తంటాలు పడి పంపు నుండి వస్తున్న నీటిని ఆపేరు. నీటితొ పాటు వస్తున్న డబ్బు రావటం ఆగిందని తెలుసుకున్న ప్రజలు, వస్తున్న నీటిని పోలీసులు ఆపివేయడంతో అక్కడి నుండి వెళ్లిపోయేరు. ట్రాఫిక్ ను సరి చేసి, వాహన రాకపోకలను మామూలు స్తితికి తీసుకువచ్హేరు.

"దొంగలు, తాము దోచుకున్న డబ్బును ఆ నీళ్ళ పంపు వెనుక దాచుకుని ఉంటారు. నీటి వేగంతో పాటూ ఆ డబ్బు కూడా బయటకు వచ్హి ఉంటుంది" అని ఒక పోలీస్ అధికారి తెలిపేరు. అక్కడ దొరికిన డబ్బు సుమారు 5000 రూపాయలుంటుందని చెబుతున్నారు.
Categories: Right

57 అంతస్తుల భవనాన్ని ఎటువంటి భద్రత లేకుండా ఎక్కిన నిజమైన స్పైడర్ మాన్ (SPIDERMAN).....వీడియో

Tue, 08/31/2010 - 11:20
48 సంవత్సరాల వయసున్న, ఫ్రాన్స్ దేశానికి చెందిన స్కైస్క్రాపర్ ఆస్ట్రేలియా దేశంలో ఉన్న సిడ్నీ నగరంలోని 57 అంతస్తుల బిల్డింగ్ ను ఎటువంటి భద్రత లేకుండా స్పైడర్ మాన్ లాగా ఎక్కేరు.

ఆలియన్ రాబర్ట్ అన్న పేరున్న ఈయన్ను స్పైడర్ మాన్ అనే పిలుస్తారట. ఈ బిల్డింగ్ ను 20 నిమిషాలలో ఎక్కిన ఈయన్ను పై అంతస్తు చేరుకున్నప్పుడు పోలీసులు ఖైదు చేసేరు.

క్రింద నుండి ఈయన బిల్డింగ్ ఎక్కుతుంటే ప్రజలు భయంతోనూ, ఆశ్చర్యంతోనూ కళ్ళార్పకుండా చూసేరట....ఈయన ఇంతకు ముందు ఇటువంటి సాహసాలు చాలా సార్లు చేసేరట.



Categories: Right

గంగా నది స్నానం వ్యాధులను తగ్గిస్తుంది...ముఖ్యంగా డయబిటీస్ (DIABETIS) పేషెంట్ల కు వచ్హే ఇన్ ఫెక్షన్ లకు మంచిది

Tue, 08/31/2010 - 03:13
గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు పోయి పుణ్యం వస్తుందని అంటారు. ఇప్పుడు ఒక భారతీయ శాస్త్రవేత్త గంగా నది నీరు డయబిటీస్ వ్యాధి ఉన్న వారికి వచ్హే ఇన్ ఫెక్షన్లు ( INFECTION) తగ్గిస్తుందని సైంటిఫికల్ గా నిరూపించేరు.

గంగా నది నీటిలో "బాక్టీరియో ఫేజ్" (BACTERIOPHAGES) అనే ఒక వైరస్ ఉన్నదట. ఈ వైరస్, వ్యాధులను కలిగించే మిగిలిన బాక్టీరియాలను, వాటి లోనికి వెళ్ళి వాటిని చంపుతుందట.

డయబిటీస్ వ్యాధి ఉన్న వారికి బాక్టీరియాల వలన వచ్హే ఇన్ ఫెక్షన్ లను తగ్గించటం కష్టమౌతోంది. ఈ ఇన్ ఫెక్షన్ లను తగ్గించటానికి మామూలు యాన్ టీ-బయాటిక్స్ పూర్తిగా పనిచేయటం లేదు. కారణం, డయబిటిక్స్ పేషెంట్లలో ఇన్ ఫెక్టివ్ బాక్టీరియాలు యాన్ టీ-బయాటిక్స్ ను ఎదుర్కోనే శక్తిని పొందుతున్నాయి. యాన్ టీ-బయాటిక్స్ ను ఎదుర్కునే ఈ బాక్టీరియాలను కూడా చంప గలిగే శక్తి బాక్టీరియో ఫేజ్ కు ఉన్నదని తన పరిశోధనలలో తెలుసుకున్నారు భారతీయ శాస్త్రవేత్త రాజూ సునగర్.

గుల్బర్గా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పూర్తి చేసుకుని, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో శాస్త్రవేత్త గా ఉంటున్న రాజూ సునగర్ తన 4 ఏళ్ళ పరిశోధనలో బాక్టీరియో ఫేజ్ వైద్యంతో శక్తి కలిగిన, యాన్ టీ-బయాటిక్స్ ను ఎదుర్కొన గలిగిన స్టఫిలో కోకస్ అవురస్ (STAPHYLOCOCCUS AUREUS) బాక్టీరియాను అంతంచేయవచ్హని నిరూపించేరు.

ఈయన చేసిన పరిశోధన "బాక్టీరియో ఫేజ్ తెరాఫీ ఫర్ స్టఫిలో కోకస్ అవురస్ ఇన్ ఫెక్షన్ ఇన్ డయబిటిక్ మైస్ మోడల్"(Bacteriophage Therapy for Staphylococcus Aureus Infections in Daibetic Mice Model) ను అంతర్జాతీయ మైక్రో బయాలజీ రీసెర్చ్ జర్నల్ (International Journal Research in Microbiology) అంగీకరించింది.

ఒక్క డయబిటీస్ పేషెంట్లలోనే కాకుండా, మరే ఇతర పేషెంట్లలో నైనా దీర్గ కాల ఇన్ ఫెక్షన్ లను (యాన్ టీ-బయాటిక్ రెసిస్టన్స్ బాక్టిరియాను) ఈ బాక్టీరియో ఫేజ్ ఒక కోర్స్ ట్రీట్మెంట్ తో వైద్యం చేసి తగ్గించవచ్హని ఆయన తెలిపేరు.

గంగా నది నీటిలో బాక్టీరియో ఫేజ్ అనే వైరస్ ఉండటం వలనే ఆ నది నీరు పవిత్రతను కలిగి ఉన్నదని ఇది వరకే తెలుసుకున్నారు. ఇప్పుడు దానిని సైంటిఫికల్ గా నిరూపించేరు డా.రాజూ సునగర్.
Categories: Right

మ్యాచ్ ఫిక్సింగ్...పాకిస్థాన్ క్రికెటర్లు డబ్బు తీసుకుంటున్న వీడియో

Tue, 08/31/2010 - 01:07
క్రికెట్ క్రీడను జూదం క్రీడగా మార్చాలనుకున్న పాకిస్థాన్ క్రికెటర్లు రెడ్ హాండడ్ గా సాక్చ్యాధారాలతో పట్టుబడ్డారు. ఈ సారి ఐ.సి.సి బరిలోకి దిగి పాకిస్థాన్ ను అంతర్జాతీయ క్రికెట్ రంగానికి దూరంగా ఉంచుతుందని అనుకుంటున్నారు.

పాకిస్థాన్ క్రికెటర్ల ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆ దేశ ప్రజలనూ, మాజీ పాకిస్థాన్ క్రికెటర్లనూ షాక్ లో పడేసింది.


Categories: Right

జీతభత్యాలు 300 శాతం పెరిగినా కోటీశ్వరులైన ఎం.పి లు ఆనందంగా లేరుట

Mon, 08/30/2010 - 11:14
తమ ఆస్తుల వివరాలలో చాలా మంది ఎం.పి.లు తమకు కోట్ల ఆస్తి ఉన్నదని తామే తెలియపరిచినా కేంద్ర ప్రభుత్వం వారికి 300 శాతం జీతం మరియూ దారాళంగా భత్యాలు పెంచింది. అయినా వారు ఆనందంగా లేరుట. తాము ప్రజా ప్రతినిధులుగా చేస్తున్న పనులకు ఇప్పుడు పెంచిన జీతం చాలా తక్కువగా ఉన్నదని చెబుతున్నారుట.

ఇప్పటి లోక్ సభలో మొత్తమున్న 543 ఎం.పి లలో 315 మంది కోటీశ్వరులని నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) మరియూ ఏ.డి.ఆర్ (ADR) తమ రిపోర్ట్ లో తెలిపింది. ఈ 315 మంది కోటీశ్వరులలో 275 మంది మగ ఎం.పి.లు మిగిలిన 40 ఎం.పి. లు ఆడవారు.

2004 లోక్ సభ లో 156 మంది కోటీశ్వర ఎం.పి లు ఉంటే, ఇప్పుడు 315 మంది ఉన్నారు. అలాగే 2004 లోక్ సభ ఎం.పి ల యావరేజ్ ఆస్తి 0.86 కోట్లు అయితే ఇప్పటి లోక్ సభ ఎం.పి ల యావరేజ్ ఆస్తి 5.33 కోట్లు.

2004 లోనూ 2009 లోనూ లోక్ సభ కు ఎన్నికైన ఎం.పి ల ఆస్తి 289 శాతం గా పెరిగింది.

183 మంది యున్న రాజ్య సభ ఎం.పీ లలో 54 శాతం ఎం.పీ లు మిలియనర్స్ అని NEW-ADR తెలిపింది.

ఎం.పి ల పెన్షెన్ ను నెలకు 8,000 నుండి 20,000 గా పెంచేరు. ఈ పెరిగిన పెన్షన్ పాత ఎం.పి లకు కూడా వర్తిస్తుంది. 15 వ లోక్ సభ మొదలు పెట్టినప్పటినుండి ఈ పెంచిన పెన్షెన్ ఇస్తారు కాబట్టి 15 వ లోక్ సభ మొదలుపెట్టినప్పటి నుండి ఇవ్వవలసిన డబ్బు 118 కోట్లు గా లెక్కవేసేరు.

లెఫ్ట్ పార్టీ లు తప్ప మిగిలిన పార్టీ లు ఎవరూ ఎం.పి ల జీతభత్యాల పెంపుదలని వ్యతిరేకించలేదు.
Categories: Right

ఇన్ స్యూరన్స్ కు తగినట్లు డాక్టర్లు బిల్లులు వేస్తున్నారా? అవసరం లేక పోయినా టెస్ట్ లు చేస్తున్నారా?

Mon, 08/30/2010 - 03:10
ఇన్ స్యూరన్స్ చేసుకోవడం చాలా మంచిదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న వైద్యాలకు కూడా వేలు ఖర్చు పెట్టవలసి వస్తున్నది. కానీ చాలా మంది పేషెంట్లు చెప్పటమేమిటంటే మనకున్న ఇన్ స్యూరన్స్ కు తగినట్లు హాస్పిటల్ వారు అవసరమున్నా లేక పోయినా టెస్టు లూ, శస్త్ర చికిత్సలూ చేస్తున్నారని చెబుతున్నారు.

ఈ మధ్య ఒక రిటైర్డ్ ఆవిడ మొకాళ్ల నొప్పులతో భాద పడుతూ ఒక హాస్పిటల్ కు వెళ్ళిందట. ఆ హాస్పిటల్ డాక్టర్లు ఆవిడ్ని అడిగిన మొదటి ప్రశ్న "మీకు ఇన్ స్యూరన్స్ ఉన్నదా?". ఆమె ఉన్నదని చెప్పిన వెంటనే అమెతో "మీరు ఒక శస్త్ర చికిత్స చేసుకోవాలి...దానికి 1 లక్ష రూపాయలు కర్చౌతుంది" అన్నారట. ఆలోచించుకుని వస్తానన్న ఆవిడ మరుసటి రోజు మరో డాక్టర్ ను కలిసిందట. "దీనికి శస్త్ర చికిత్స అవసరం లేదు. మందులు వాడితే చాలు" అన్నారట.

మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న ఒకతను కడుపునొప్పితో హాస్పిటల్ కు వెడితే "ఎండో స్కోపీ" చేయాలని చెప్పేరట. అతను వేరే డాక్టర్ ను కలిస్తే ఆయన అరుగుదలకి మందులిచ్హేరట. ఆ మందులు వాడిన అతను ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటున్నాడట.

హాస్పిటల్ కు వెడితే అడిగే మొదటి ప్రశ్న "మీకు ఇన్ స్యూరన్స్ ఉన్నదా...మీరు ఎక్కడ పనిచేస్తున్నారు". ఈ రెండింటినీ ఆధారం చేసుకుని దానికి తగినట్లు వైద్యం చేస్తున్నారు అని చాలా మంది చెబుతున్నారు.

"మా నాన్న గారికి అంజియోప్లాస్టీ చేయవలసి వచ్హింది. ఒక పెద్ద హాస్పిటల్ కు తీసుకు వెళ్లేను. మాకు ఇన్ స్యూరన్స్ ఉన్నదని తెలుసుకుని ఖరీదైన ప్యాకేజ్ తీసుకోమన్నారు. ఆ ఇన్ స్యూరన్స్ డబ్బును తీసుకోవటానికి ఆంజియోప్లాస్టీ అయిన తరువాత ఆయనకు చాలా టెస్ట్ లు చేసేరు. "ఆపరేషన్ తరువాత ఈ టెస్ట్ లు అవసరంలేదు. కానీ మీరు తీసుకున్న ప్యాకేజ్ లో ఇవన్ని ఉన్నాయి" అని అక్కడున్న మరో డాక్టర్ చెప్పేరు" అని ఐ.టీ కంపెనీలో పనిచేసే మరొకతను చెప్పేరు.

"జ్వరం గా ఉన్నదని ఒక హాస్పిటల్ కు వెళ్లేను. నా బ్లడ్ లో ప్లాట్లెట్ కౌంట్ తక్కువగా ఉన్నదని, నాకు డెంగ్ జ్వరమని చెప్పి హాస్పిటల్లో చేర్చుకున్నారు. కానీ ఆ రోజంతా ఏ డాక్టరూ నన్ను చూడలేదు. నేను మరుసటి రోజు మరో డాక్టర్ ను కలిసేను. ఆయన నాకు వైరల్ ఫీవర్ అని చెప్పేరు" మరో పేషంట్ తెలిపేరు.

వీరు చెప్పిన దానిని ఒక హాస్పిటల్ డాక్టర్ ఖండించేరు. "మాకు పేషంట్ లు చాలా ముఖ్యం. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకునే ముందు ఇన్ స్యూరన్సా....డబ్బ అని అడగటం మాకు అలవాటు. అంతే గానీ మేము ఇన్ స్యూరన్స్ కి తగినట్లు వైద్యం చేస్తున్నామని అనడంలో అర్ధంలేదు" అన్నారు.

"డాక్టర్లు అలా ఎప్పుడూ చేయరు. ఎందుకంటే వారు పేషెంట్లకు చేసే అన్ని చికిత్సలకూ రిపోర్ట్లు ఉంటాయి. ఇన్ స్యూరన్స్ కంపెనీ వారు అన్ని విధాలా మా బిల్లులను, చికిత్స రిపోర్ట్ లనూ తనిఖీ చేస్తారు" అని మరో హాస్పిటల్ చీఫ్ డాక్టర్ చెప్పేరు.

ఏది నిజం అనే సమస్యలో ఉన్నారు పేషంట్లు.
Categories: Right