http://teluguviews.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
TELUGU NEWS CINEMA GOSSIPS POLITICS ANDHRA NEWS chiranjeevi venkatesh nagarjuna ravi teja mahesh babu ram charan teja junior N.T.R prabaas gopi chand trisha kajal agarwal anushka hansika tapsee namitha brahmanandam ali
Updated: 46 min 47 sec ago

C.M ఆరోగ్యం బాగానే వుంది?

Tue, 09/07/2010 - 12:03
మన రాష్ట్ర ముఖ్య మంత్రి కి గత వారం రోజులుగా ఆరోగ్యం బాగాలేదనే సంగతి తెలిసిందే.కానీ ఈ రోజు ముఖ్య మంత్రి కి వాంతులు అవుతున్నాయని వార్తలు వచ్చాయి.దీంతో నిమ్స్ డైరెక్టర్ ప్రసాద రావు రోశయ్య గారి ఆరోగ్య పరిస్థితి నిలకడ గా వుందని ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారని వివరణ ఇచ్చారు.  
Categories: Right

మద మృగం ఫోటోలు

Tue, 09/07/2010 - 11:00























Categories: Right

రగడ సినిమా విశేషాలు

Tue, 09/07/2010 - 10:50
 నాగార్జున హీరోగా వీరు పొట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రగడ'.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన చార్మినార్ దగ్గర వుండే బాంగిల్ స్ట్రీట్ సెట్ లో పాట చిత్రీకరణ జరుగుతుంది.
ఈ చిత్రంలో నాగార్జున సరసన అనుష్క మరియు ప్రియమణి నటిస్తున్నారు. శ్రీ కామాక్షి ఈ చిత్రాన్నిసంస్థ నిర్మిస్తోంది.
Categories: Right

కొమరం ను అడ్డుకుంటామన్న వారసులు

Tue, 09/07/2010 - 10:50

ఇప్పటికే లేటుగా వస్తుందనుకుంటున్న కొమరం పులి సినిమా మరో వివాదంలో చిక్కుకుంది.కొమరం భీమ్ వారసులు కొమరం అనే పేరు తీసేస్తేనే కొమరం పులి ని తాము ఆడనిస్తామని చెబుతున్నారు.
ఈ విషయమై తాము ఎవరితోనూ మాట్లాడబోమని భీష్మించుకు కూర్చున్నారు.ఇప్పటికే టి.ఆర్.ఎస్ అధినేత కె. సి. ఆర్ కూతురు కవిత తెలంగాణాలో సినిమా రిలీజ్ కావాలంటే పది కోట్లు డిమాండ్ చేసినట్లుగా టాలీవుడ్ లో గుస గుసలాడుకుంటున్నారు.
చెక్ బౌన్సు కేస్ ఈ రోజే క్లియర్ కావడంతో ఆ హడావిడి లో వున్న నిర్మాత కి సంబంధించిన ప్రతినిధులెవ్వరూ దీనిపై స్పందించడానికి అందుబాటులో లేరు.
photos 
Categories: Right

రామ్ చరణ్ ఫోటోలు

Mon, 09/06/2010 - 03:06









































Categories: Right

కొమరం పులి రిలీజ్

Mon, 09/06/2010 - 01:27
పులి బోనులోంచి బయటకు రావడానికి సిద్దపడుతుంది.చాలా రోజులుగా పవన్ అభిమానులు ఆత్రుత మరియు ఆందోళనగా ఎదురు చూస్తున్న చిత్రం కొమరం పులి.
ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని ఒక్క కట్ కూడా లేకుండా A సర్టిఫికేట్ పొందింది.ఈ నెల 10 (September) న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
సింగనమల రమేష్ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్.s.j సూర్య దర్శకుడు.
Categories: Right

తమన్నా ఫోటోలు

Sun, 09/05/2010 - 15:35































































































Categories: Right

ఖలేజా స్టొరీ ఇదేనా?

Sun, 09/05/2010 - 15:34
ఖలేజా సినిమా కధ అంటూ ఇప్పుడు ఒక కధ ప్రచారంలో వుంది.అది ఏమిటంటే మహేష్ బాబు ఈ సినిమాలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర కాబ్ డ్రైవర్ గా పని చేస్తుంటాడు.ఒక వూరు కొన్ని కారణాల వలన స్మశానం లా మారిపోతూ ఉటుంది.ఆ ఊరిని రక్షించాలంటే అరుదైన జాతక చక్రంలో పుట్టిన వ్యక్తి మాత్రమే ఈ పని చేయగలడు అని తెలుస్తుంది.
దానితో అలాంటి వ్యక్తి గురుంచి ఆ వూరి పెద్దలు వెతుకుతూ వుంటారు.అప్పుడు వీరికి  మహేష్ బాబు కనబడతాడు.ఈ విషయం అంతా తెలుసుకుని అక్కడకు వెళ్ళిన మహేష్ కి పూర్వ జన్మ స్మృతులు గుర్తుకు వస్తాయి ఇక్కడ ఇంటర్వెల్.ఆ వూరితో తనకు సంబంధం వున్నదని తెలుసుకున్న మహేష్ ఆ ఊరిని ఎలా కాపాడాడు అనేదే స్టొరీ అంట.
ఇప్పటి వరకూ చాలా సినిమాలలో మహేష్ వెంట హీరొయిన్ లు పడితే ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ వెంట మహేష్ పడతాడు అని టాక్.నిజమేంటో సినిమా విడుదల అయితే గాని తెలీదు. 
ఫొటోస్
వీడియో  

Categories: Right

తికమక పడ్డ వర్మ

Sun, 09/05/2010 - 10:18
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సీన్ చిత్రీకరించడానికి చాలా కష్ట పడాల్సివచ్చిందట.ఇది ఇప్పటి మాట కాదు.వర్మ తన మొదటి సినిమా శివ కు మొదటి షాట్ చిత్రీకరణ చేస్తున్నప్పుడు.
కెమెరా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలియక చాలా తికమక పడ్డాడు వర్మ.అప్పుడు అదే సినిమా కి వర్మ దగ్గర పని చేస్తున్నశివ నాగేశ్వరరావు సహాయం తీసుకోవాల్సి వచ్చింది.
ఇదంతా సినిమా ఓపెనింగ్ కి వచ్చిన జనాన్ని చూసిన టెన్షన్ వల్ల వచ్చిందని  చెబుతున్నాడు వర్మ.
Categories: Right

పవన్ చాలా నిజాయితీపరుడు

Sun, 09/05/2010 - 10:17
పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీ పరుడు అంటుంది, ఈ మాట అంటుంది మరెవరో కాదు ఆడ పులి నికిషా పటేల్.దాదాపు రెండేళ్ళ పాటు పవన్ కళ్యాణ్ తో పాటు 'కొమరం పులి' సినిమా షూటింగ్లో పాల్గొన్న ఈమె పవన్ గురుంచి కొన్ని విశేషాలు చెప్పింది.
పవన్ అవసరానికి మించి మాట్లాడారు.చాలా నిజాయితీగా వుంటారు.మౌనంగా తన పని తాను చేసుకుపోతుంటారు.పెద్ద స్టార్ అయి ఉండి కూడా చాలా సింపుల్ గా వుండటం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అంటుంది నికిషా పటేల్.
Categories: Right

నరేష్ హీరోగా 'అహ నా పెళ్ళంట'

Sun, 09/05/2010 - 10:14
అల్లరి నరేష్ హీరో గా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అహ నా పెళ్ళంట' మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఈ నెల 22 నుంచి రెండో షెడ్యూల్ మొదలు పెట్టనున్న ఈ చిత్రాన్ని AK ఎంటర్తైన్మెంట్ సంస్ద నిర్మిస్తోంది.అల్లరి నరేష్ సరసన రీతు అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది.
Categories: Right

ఆఖరి పాట చిత్రీకరణలో

Sun, 09/05/2010 - 10:12
మహేష్ బాబు హీరో గా రూపొందుతున్న ఖలేజా చిత్రం ఆఖరి పాట చిత్రీకరణ జరగనున్నది.నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు నృత్య రీతుల్ని సమకూర్చనున్నారు.అన్నపూర్ణ స్టూడియో లోనూ రామోజీ ఫిల్మ్ సిటీ లోనూ మూడు రోజులు పాటు షూటింగ్ జరగబోతున్నది.
 ఈ నెల 30 న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Categories: Right

సెన్సార్ పూర్తి అయిన పులి

Sat, 09/04/2010 - 13:55
పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త.కొమరం పులి సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది.

ఒక్క కట్ కూడా లేకుండా A సర్టిఫికేట్ తెచ్చుకున్న కొమరం పులి ఈ నెల తొమ్మిదో తారీకునైనా విడుదల అవుతుందేమో వేచి చూడాలి.

                                              Twitter
Categories: Right

శేఖర్ కమ్ముల సినిమాలో నటించాలని ఉందా?

Sat, 09/04/2010 - 11:11
శేఖర్ కమ్ముల కొత్త సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' లో నటించాలని ఉందా?అయితే మీరు చేయాల్సిన పని ఇండియా లో వున్న వారైతే వోడాఫోన్ స్టోర్స్ లో దొరికే అప్లికేషన్ ఫామ్ ని నింపి ఫొటోలతో పంపించడమే.ఈ సినిమా కి కావాల్సింది ముగ్గురు అమ్మాయిలు,ముగ్గురు అబ్బాయిలు.లేకపోతె ఈ మెయిల్ చెయ్యండి.ఈ మెయిల్ అడ్రెస్ lifeisbeautiful@amigoscreations.com.website:http://www.amigoscreations.com/lifeisbeautiful

Categories: Right

విమలారామన్ ఫోటోలు

Sat, 09/04/2010 - 05:47














Categories: Right

మొదలయిన పూరి,రానా చిత్రం

Sat, 09/04/2010 - 05:07
 పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందే చిత్రం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యింది.నల్లమలపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాత.రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ నెల 13 వ తారీకునుంచి జరిగే అవకాశాలు వున్నాయి.ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటిస్తుంది.
Categories: Right

హీరో నుంచి స్వామి గా మారిన?

Sat, 09/04/2010 - 03:58
హీరో నుంచి స్వామి గా ఎవరు మారారా అని ఆశ్చర్యపోతున్నారా?ఆ హీరో మరెవరో కాదు రాజేంద్ర ప్రసాద్.ఇదంతా రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్న కొత్త చిత్రంలోనిది.స్వామి నిత్యానంద గుర్తున్నాడు కదా?
ఇప్పుడు అదే పాత్రని 'అయ్యారే' అనే సినిమాలో రాజేంద్రప్రసాద్ చేయ్యబోతున్నాడని సమాచారం.ఈ చిత్ర ఫోటోలు చూసిన వారెవరైనా రాజేంద్ర ప్రసాదా లేక నిత్యానందా అన్నట్లు వున్నాడు.ఈ చిత్రంలో హీరో శివాజీ దర్శకుడు సాగర్ చంద్ర.

ఫోటోలు 
Categories: Right