http://srikaaram.wordpress.com/feed

Syndicate content శ్రీ-పదములు
Just another WordPress.com weblog
Updated: 20 min 17 sec ago

ఫొటో జవాబు

Sat, 07/10/2010 - 23:08

రాయల్ సొసైటీ వారి కోప్లే మెడల్-సైన్స్ లో ప్రపంచంలో అన్నీటికటే ప్రాచీనమైన అవార్డు ఇది.1731 లో మొదటిసారి ఇచ్చినది.డార్విన్,ఫరడే లాంటివారికి ఇచ్చినది ఆయనకు ఇచ్చినందుకు హాకింగ్ సంతోషించారు.
ఏస్ట్రొనాట్ పియర్ సెలర్స్ ఈ మెడల్ ను గౌరవంగా ఎస్.టి.ఎస్ స్పేస్ షటల్ లో ధరించాడు.

ఫొటో సౌజన్యం:రాయల్ సొసైటీ

సరైన సమాధానం ఇచ్చిన వారు:

jokabhiramayanam.blogspot.com


Categories: Left

జగన్ కొత్త పార్టీ?

Sat, 07/10/2010 - 13:15

‘ద ట్రిబ్యూన్  ‘ అనే వార్తా పత్రిక జగన్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ఒక వార్తను ప్రకటించింది.ఎలెక్షన్ కమిషన్ వారు రెండు విషయాలను ధృవీకరించారు.మొదటిది-13 నవంబర్ 2009 లో మహ్ బూబ్ బాషా అనే ఆయన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అనే పార్టీ పేరు రెజిస్టర్ చేయటానికి ప్రయత్నించారు. రెండు-కాంగ్రెస్ కార్యకర్త కె.శివకుమార్ అదే పేరుతో రెజిస్ట్రేషన్ కోసం  ఇటీవల అర్జీ ఇచ్చినట్లు తెలిపింది.

~~~***~~~
రాజకీయంగా ఆలోచిస్తే ఇది గట్టి సవాలు.కొన్ని పరిస్థితులలో చదరంగం ఆడుతున్నప్పుడు సిసిలియన్ దిఫెన్స్ ఏ మాత్రం పనికి రాదు. అందునా వై.ఎస్.ఆర్ గారి ఆట తీరు యావత్తూ ఆక్రమణం, నేను సిధ్ధం అని చెప్పటం-కొద్దిగా చదరంగంలో విశ్వనాథ్ ఆనంద్ పధ్ధతి ఇది.అవతల ప్రక్క వారికి ఆలోచించేందుకు ఎక్కువ సమయం ఇవ్వడు.ఎత్తు వేసి వాడిని చూసుకోమని వాడి సమయంలో ఈయన రంగం గురించి ఆలోచిస్తాడు!పిక్క కదిలించగానే సిధ్ధంగా ఎత్తు ఉనుంది.తన ఎత్తు దగ్గర ఎక్కువ ఆలోచించవలసిన అవసరం రాకపోవటం మీద గెలుపు టములు తేలిపోతాయి…

చదరంగం గొప్ప ఆట.ప్రతి కదలికతో రంగం మారుతుంది.ఇప్పుడు రంగం బాగుంది, నేను ఎత్తు వేస్తే చెడిపోగలదు అనుకుని నువ్వే ఆడు, నేను వదిలేస్తాను అనేందుకు లేదు! ఇష్టమున్నా లేకపోయినా అవతల నుంచి జరిగిన కదలికకు స్పందించి తీరాలి! మార్పును మార్పుతోనే ఆర్పుకోవాలి…

జగన్ పార్టీ స్థాపిస్తే ముఖ్యంగా రాయలసీమను కాంగ్రెస్ చేతులారా చెడకొట్టుకున్నట్లే. ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి బాగా లేదు.కె.సి .ఆర్ మరో చిందు వేస్తాడా లేక సమైక్యాంధ్ర తిరిగి గోల చేస్తుందా అనేది వేచి చూడాలి.ఆంధ్ర ప్రదేశ్ మూడు రాష్ట్రాలవుతుందా అనే ప్రస్ణ ఖూడా రాకపోదు.

సి.ఎం కానందుకు ఇవన్నీ మామూలేనని తోసిపుచ్చటానికి లేదు. వోట్లు చీల్చటానికి ఈ రోజు నేను కూడా సరిపోతాను! చిరంజీవికి ఎన్ని సీట్లు వచ్చాయో చూసాం. సంకీర్ణ రాజకీయలలో ఒకప్పుడు ఒకే సీటు ఉన్న సి.పి.ఐ కూడా గృహమంత్రిత్వ శాఖను (కేంద్రంలో) పొందిన రోజులున్నాయి!

మేడం గారికి వ్యవహారం క్షుణ్ణంగా తెలిసినట్లు లేదు.అహ్మద్ పటేల్, లుంగీ తంబి ల సలహాలతో నడిస్తే ఇలానే ఉంటుంది.

ఆజాద్ ఎంకౌంటర్ తరువాత (అ)ప్రధాని  గారిని ఆంధ్రకు ఇప్పుడప్పుడే రావద్దన్నారు.కశ్మీర్ లో పిల్లలను బయటకు రావద్దనారు చిదంబరం గారు.

ఇది మన లా అండ్ ఆర్డర్!

చూస్తూ చూస్తూనే అంకెల గారడీ మారే అవకశాలు లేకపోలేదు!
వ్యూహాత్మకమైన ప్రశాసనం చేయాలంటే భజనతంత్రం పని చేయదు.ముందు జనతంత్రం గురించి తెలుసుకోవాలి.

సమైక్యాంధ్ర నినాదంతో ఉమ్మడిగా అంధ్ర ఎం.పీలు రాజీనామా లు ఇచ్చినప్పుడు ఈ దిక్కుమాలిన అధిష్ఠానం వ్యవహారానికి మంచి జవాబు చెప్పారని నేను ఇతరత్ర వ్రాసియున్నాను. అదే పంథాలో ఒక్ వేళ జగన్ పార్టీ స్థాపించే యోచనలో ఉంటే అది రాజకీయంగా అతనికి ఉన్న బలగాన్ని ఉత్సాహపరచే అంశమే కాదు. ఢిల్లీ నుంచే ఉత్తర్వులకు, చెత్త వ్యవహారానికి మంచి చెక్!మరో విధంగా తెలుగు ఆత్మగౌరవం…?

~~~***~~~


Categories: Left

శ్రీమద్రామాయణం -రాజధర్మం (కచ్చిద్సర్గ) (6)

Sat, 07/10/2010 - 12:23

శ్లో:రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయా: పతయే నమ:

శ్లో: చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం
ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం

శ్లో:కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

శ్లో: ఏకోప్యమాత్యో మేధావీ శూరో దక్షో విచక్షణ:
రాజానం రాజపుత్రం వా ప్రాపయేన్మహతీం శ్రియం

ఒక్క మంత్రి అయినా మేధావి, శూర వీరుడు,చతురుడు, నీతిఙ్ఞుడు ఉంటే అతను రాజుకు లేద రాజపుత్రునకు చాలా సంపత్తి తెచ్చి పెట్టగలడు.

శ్లో: కచ్చిన్ముఖ్యా మహత్స్వేవ మధ్యమేషుచ మధ్యమా:
జఘన్యాశ్చ జఘన్యేషు భృత్యాస్తే తాత యోజితా:

ప్రధానమైన వ్యక్తులను ప్రధానమైనవి, మధ్యమ శ్రేణిలోని వారికి మధ్యమములైనవి, చిన్న వారికి చిన్నవి అయిన పనులను అప్పగించావా?

శ్లో: అమాత్యానుపధాతీతాన్ పితృపైతామహాన్ శుచీన్
శ్రేష్ఠాన్ శ్రేష్ఠేషు కచ్చిత్ త్వం నియోజసి కర్మసు

కార్యములను నెరవేర్చటం లో స్వంత లాభాన్ని ఆశించని వారిని, ఎన్నో తరాలుగా నిస్వార్థంగా పని చేస్తున్న వారిని పనులలో నియుక్తులను చేసావు కదా?

శుభం భూయాత్!

(మరల కలుద్దాం)
~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Fri, 07/09/2010 - 23:19

దీని పేరు రెడ్ బాక్ స్పైడర్.ఈ సాలెపురుగు కాటుకు చనిపోయిన 70 సెన్.మీ  పొడవు గల ఈ సర్పం  సాలెగూడులో బంధింపబడి దాని ఆహారమైనది!
చరిత్రలోనే రెండవసారి ఇలా జరిగిందని అరక్నోలజీ విభాగం వారు చెబుతున్నారు. ఇది ఒక ఎలెక్ట్రికల్ సంస్థ కార్యాలయంలో ఒక రిసెప్షనిస్టు టేబిల్ దగ్గర జరిగింది!


Categories: Left

శ్రీమద్రామాయణం -రాజధర్మం (కచ్చిద్సర్గ) (5)

Fri, 07/09/2010 - 11:39

శ్లో:రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయా: పతయే నమ:

శ్లో: చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం
ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం

శ్లో:కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

శ్లో: కచ్చిన్న తర్కైర్యుక్త్యా వా యే చాప్యపరికీర్తితా:
త్వయా వా తవ వామాత్యైర్బుధ్యతే తాత మంత్రితం

నీవు చేసిన నిర్ణయాలను ఎవరికీ చెప్పకపోయినా ఇతరులు తర్కముతో, యుక్తితో తెలుసుకుంటున్నారా?

శ్లో: కచ్చిత్ సహస్రైర్మూర్ఖాణామేకమిఛ్చసి పండితం
పండితో హ్యర్థకృఛ్రేషు కుర్యాన్ని:శ్రేయసం మహత్

వేయి మూర్ఖులకు బదులు ఒక్క పండితుడుని దగ్గర పెట్టుకున్నావా లేదా? అర్థసంకటం ఏర్పడినప్పుడు పండితుడే మంచి చేయగలడు.

శ్లో: సహస్రాణ్యపి మూర్ఖాణాం యద్యుపాస్తే మహీపతి:
అథవాప్యయుతాన్యేవ నాస్తి తేషు సహాయతా

వేయి లేదా పది వేల మూర్ఖులు దగ్గరున్నపటికీ వారి వలన అవసరానికి ఒక్క సహాయం దొరకదు.

శుభం భూయాత్!

(మరల కలుద్దాం)
~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు 2

Fri, 07/09/2010 - 01:27

4 బిలియన్ పౌండ్ల మరినా సాండ్స్ బే వారి స్విమ్మింగ్ పూల్ లో ఈదుతూ  55వ ఫ్లోర్ లోంచి సింగపూర్ పట్టణాన్ని  చూడవచ్చు! ఇది 150 మీటర్ల పొడవు. ఒలంపిక్ లోని స్విమింగ్ పూల్ కంటే మూడింతలు పొడుగు!

సరైన సమాధానం ఇచ్చిన వారు:

myfeelings-rishi.blogspot.com

sravyav2020@gmail.com

harekrishna011@gmail.com

ఆశ్చర్యపోయిన వారు:

e@d.com

త్వరలోనే అందరం అక్కడికి వెళదాం…


Categories: Left

ఫొటో జవాబు 1

Fri, 07/09/2010 - 01:11

ఇవి బిస్కెట్లు!

దగ్గర జవాబులిచ్చిన వారు:

naninarra@gmail.com

nenu-naa-prapancham.blogspot.com


Categories: Left

లాయర్లూ కత్తులూ…

Fri, 07/09/2010 - 01:00

రాజు అనే లాయరు నవీన అనే జూనియర్ లాయరును కర్ణాటక హై కోర్టులో కత్తితో పొడిచి చంపేశాడు.ఆమెకు మరొకరితో ఎంగేజ్ మెంట్ అయిందని తట్టుకోలేకపోయాడుట!

సినిమాలలో చూపిస్తే కోర్టులలో ఇలా జరుగగలదా అని అనుకునే వారున్నారు!

కాలేజీలలో జరుగుతున్న రాక్షసత్వం కనిపిస్తూనే ఉంది.హై కోర్టుకు మినహాయింపు లేదంటే మన సమాజం ఏ రకమైన  తరం చేతులలోకి వెళ్లిపోయిందా అని ఒక్క సారి బాధగా ఆలోచించాల్సి వస్తోంది. పోలీసు కాన్స్టబుల్ ను ప్రేమించి ఎస్. ఐ లు ఏసిడ్ పోసేయగలరు. ఎస్.పీలు, రేప్ కేసులు అలా ఉండనే ఉన్నాయి.కొద్దిగా జగ్రత్తగా ఆలోచించాలి…

ఆలోచన, ఆవేశం, దౌర్జన్యం అన్నీ తృటిలో జరిగిపోతున్నాయంటే …

ఎంత నేర్చినా ఎంత చూసినా వ్యక్తి ఒక పరిధి దాటి జీవితం, ప్రాణం విలువలను గుర్తించి ఆలోచించలేకపోవటానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి.
చెత్త  సమాచార  ప్రచారం,తీవ్రమైన భావకాలుష్యం ,పశువులు కూడా మొహం తిప్పేసుకునే మనోరంజనానికి ఏర్పరచుకున్న సాధనాలు,అన్నీ చెల్లుతాయనే విచ్చలవిడితనం,అనవసరమైన చర్చలు,పోటీలు,ప్రతి మనిషికీ ఒక జట్టు,ఒక వర్గం,ఒక రాజకీయం,అందరూ హీరోలే!

ఇలా సాగిపోతూ వెళ్లిపోతే బయటకు నెట్టలేని ఒక అసహనం తప్ప చుట్టూ ఏమీ మిగలదు.ఒక పిల్లవాడికి ఇదిగో ఇది గౌరవప్రదమైన వృత్తి అని ఒక తండ్రి చెప్పగలిగే పరిస్థితి లేకపోవటం నిజమైన దౌర్భాగ్యం…

ఈ దారి చివర ఏముందీ , ఏమి లేదు అని గట్టిగా యోచించకుండా అర్థం లేని ఒరవడులను అలవోకగా అవలంబించి చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారనుకుంటున్న తల్లిదండ్రులు మరో ఛాన్స్ ఇస్తే బాగుండునని అనుకుని ఉపయోగం లేదు.

ఎదుటా నివే ఎదలోనా నీవే…ఏ మనిషిని చూసినా ఎదుటా చెత్తే, ఎదలోనా చెత్తే!

బాహ్య ప్రపంచం, బజారు, నడి వీథి…ఈ సంస్కారం నుండి కొద్దిగా స్వగృహం,కుటుంబం వైపు జనం తిరిగు ప్రయాణం కట్టవలసిన అవసరం ఉన్నది. అక్కడినుండి సరైన విద్యాభ్యాసం ప్రారంభమవగలదు.
జ్యోతిష శాస్త్రంలో తల్లికి, తొలి విద్యాభాసానికి నాల్గవ స్థానమే పరిశీలించటం జరుగుతుంది. తొలి పాఠం తల్లి ఒడిలో కాక మరెక్కడా లేదు! నాల్గవ స్థానమే ఇంటికి సంబంధించిన స్థానం. మన బాడీ మైండ్ సిస్టమే తొలి స్వగృహం, నిజమైన స్వగృహం. ఆ లోపలికి వెళ్లి ఒక్క సారి తొంగి చూడవలసిన అవసరం ఉన్నది.

స్కెలిటన్లను చూస్తే ఎలా భయపడి అసహ్యించుకుంటామో సగటు మనిషి మనసులోకి తొంగి చూస్తే అంతకంటే జుగుప్సాకరమైన ప్రపంచం తయారవటానికి కారణం ఈ బజారు సంస్కృతి తప్ప మరొకటి కాదు.

ఇంత పనికి దిగజారాక చివర ఇది నేనే చేసానా, ఎంత పని చేసాను, అని వీళ్లు ఆలోచించగలిగే పరిస్థితిలో ఉంటారని నేననుకోను.
ఆ శక్తి వాళ్లకి లేదు.  దానిని పొందే చోట్లు మనకు అక్కరలేదు…

మనం ఎటు పోతున్నాం?

~~~***~~~


Categories: Left

గూగుల్, సాంబ్రాణీ,అరుణాచల్ ప్రదేశ్!

Wed, 07/07/2010 - 23:17

హిందీలో గూగల్ అంటే మనం వెలిగించుకునే సాంబ్రాణీ.దీని ధూపం చాలా ప్రశస్తమైనదని ,దృష్టిదోషం నిర్మూలిస్తుందని,సాయంత్రం వేళలో ఇంటిలో కానీ ఇంటి గడపకు కానీ ఈ ధూపాన్ని వేస్తే లక్ష్మీప్రదమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి!

అస్తు!

చిన్నప్పుడు మా ఇంటి ప్రక్కన చాలా లావుగా ఉండే ఒక మహిళ ఉండేది.గేటు దగ్గర నిలబడి వచ్చే పోయే వాళ్లను పంపిస్తూ ఉండేది.సాంబ్రాణీ సాయబు వచ్చి పొగ చేసి నెమలి ఈకను అటూ ఇటూ ఊపే వాడు.ఆవిడ అలాగే నిలబడేది.పైసా రాల్చేది కాదు.కొత్తల్లో నాకు అర్థం అయ్యేది కాదు.ఈవిడ కోసం ఏర్పాటు చేసిన  వింత వైద్యం అనుకునేవాడిని!
ఆవిడ ఎదురింటావిడ అతి నాజూకుగా ఉండేది.ఆవిడ ఏదైనా పడేస్తే ఈవిడ కూడా వేసేది.అందుచేత ఆమె అర్థరూపాయి పైకి చూపిస్తూ సాయబు వచ్చి మరీ పొగ వేసేవాడు. వెంటనే లోపలికి వెళ్లి ఏదో తెచ్చేది.కొన్నాళ్ల తరువాత ఎదురింటావిడ పట్టించుకోవటం మానేసింది.సాయబు ఆమె ఏమీ వెయ్యలేదని నిలబడే వాడు.అలాగా, ఉండు అని ఈవిడ ఏదో తెచ్చి ఆమె పూల వాడు వచ్చి ఆమెకు మల్లెపూలు అమ్మి వెళ్లే వరకూ సాంబ్రాణీ సాయబును ఆపి అప్పుడు చిల్లర వేసేది!

స్త్రీలు ఒకరి మీద ఒకరు పోటీ పడటం కూడా లక్ష్మీప్రదమే! (శరీర సౌష్టవం లో కాదు!).
దీనినే ఓపెన్ మార్కెట్ కాంపిటీషన్ అని శాస్త్రవేత్తలు మరో విధంగా చెప్పారు. కొందరికి కోపం వచ్చే ముందరే దీనిని వదలిపెట్టి సాంబ్రాణీ…గూగల్ దగ్గరకు వద్దాం!

గూగల్ కంపనీ గురించి అందరికీ తెలిసిందే.ఇది చైనాలో చైనా వారికే కనిపించే రీతిలో మాపింగ్ చేసింది ఆ మధ్య.ఆ మాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ను చైనాలో చూపించింది. వేరే వారికి భారత దేశంలో చూపిస్తుంది!ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ ను ఒక వివాదాస్పదమైన ప్రాంతంగా చూపిస్తున్నదట!

వీడి సాంబ్రాణీ వ్యాపారం బాగానే ఉంది!

~~~***~~~


Categories: Left

శ్రీమద్రామాయణం-కచ్చిద్సర్గ (4)

Wed, 07/07/2010 - 22:13

శ్లో:రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయా: పతయే నమ:

శ్లో: చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం
ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం

శ్లో:కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

శ్లో:కచ్చిన్మంత్రయసే నైక: కచ్చిన్న బహుభి: సహ
కచ్చిత్ తే మంత్రితో మంత్రో రాష్ట్రం న పరిధావతి

ఏదైనా గూఢమైన విషయం మీద ఒంటరిగా ఆలోచిస్తున్నావా? చాలా మందితో కలసి ఆలోచిస్తున్నావా? ఆ గూఢమైన విషయం శత్రువుల వరకూ చేరిపోవటంలేదు కదా?

గూఢమైన విషయాలు, రహస్యమైనవి ఒంటరిగానూ, చాలా మందితోనూ కలసి చర్చించకూడదు. ఎంచుకున్న కొద్ది మందితోనే ఆ చర్చ జరపాలి.ఒంటరితనంలో ఆలోచనలు తప్పు దారి పట్టగలవు.మరీ ఎక్కువమందిలోనూ అలానే జరుగుతుంది!

శ్లో:కచ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయం
క్షిప్రమారభసే కర్మ న దీర్ఘయసి రాఘవ

దేని ప్రసాధనం చిన్నగా ఉండి ఫలితం పెద్దదిగా ఉండగలదో , ఆ కార్యాన్ని తలపెట్టిన తరువాత త్వరగా ప్రారంభిస్తున్నావు కదా? అలస్యం చేయటంలేదు కదా?

సామాన్యంగా ఇటువంటి కార్యక్రమాలు తరచు తారసపడుతూ ఉంటాయి.వాటి అమలులో ఏ మాత్రం జాప్యం పనికిరాదని చెప్పడమైనది.ఆ అవకాశం జారిపోగలదు అని భావం.

శ్లో: కచ్చిన్ను సుకృతాన్యేవ కృతరూపాణివా పున:
విదుస్తే సర్వకార్యాణి న కర్తవ్యాని పార్థివా:

నీ అన్ని కార్యములు పూర్తి అయినప్పుడే లేదా పూర్తి కావస్తున్నప్పుడే ఇతర రాజులకు వాటి గురించి తెలుస్తున్నవి కదా? నీవు చేపట్టబోతున్న కార్యక్రమాల గురించి ముందుగానే అందరికీ తెలిసిపోవటం లేదు కదా?

పైన రెండు శ్లోకాలను కలిపి చదివితే మరి కాస్త అర్థమవుతుంది.మంచి పనుల విషయంలో జాప్యం వలన ఆలోచన బహిర్గతం కాగలదు.అది పూర్తీ కాదు,ఫలితమూ ఉండదు.చిన్నగా చెప్పాలంటే సత్కార్యానికి సంక్రమించగల సమస్యలు ఏ కారణం చేత అనేది స్పష్టమవుతున్నది. ఏది ముందుగా, త్వరగా ప్రారంభించాలో, దేనికి సమయం తీసుకోవాలో, ఏది ఎవరితో, ఎంతమందితో చర్చించాలో రాజుకు స్పష్టంగా తెలియవలసి యున్నది!

ఈ విషయాలన్నిటిలో ఏ లోపం ఉన్నా రాజ్యం నష్టమవగలదు అని తాత్పర్యం.

(మరల కలుసుకుందాం)

శుభం భూయాత్!

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Wed, 07/07/2010 - 01:00

ఇది ఎం13 అనే ఒక గ్లోబ్యులార్ క్లస్టర్.లక్ష సంఖ్యలో నక్షత్రాలు ఇందులో ఒక వృత్తాకారంలో తిరుగుతున్నాయి. ఎప్పుడైనా ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు హెర్క్యూల్స్ నక్షత్ర మండలంలో మామూలు కళ్లకు కనిపించవచ్చు కూడా! ఇవి 25000 లైట్ ఇయర్స్ దూరంలో మాత్రమే ఉన్నాయి!.
ఈ వృత్తంలో 150 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఇవి ఇదే వృత్తంలో జీవితాంతం తిరుగుతూ ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రం హబ్బల్ టెలిస్కోప్ ద్వారా తీసినది.

(నాసా వారి సౌజన్యంతో)

సరైన సమాధానం ఇచ్చిన వారు:

sureshkadiri.blogspot.com


Categories: Left

టెలి మెడిసిన్-అపోలో ప్రయోగం

Tue, 07/06/2010 - 22:44

అపోలో ప్రతాప్ రెడ్డి గారు  అరగొండలో  ప్రవేశ పెట్టిన టెలిమెడిసిన్ ప్రయోగం విజయవంతంగా వార్తలలోకి వచ్చింది.అది విసాట్ లైన్ల ద్వారా (ఇస్రో ఏర్పాటు చేసింది).వీడియో కాంఫరెన్సింగ్ ద్వారా స్పెషలిస్టుల కన్సల్టేషన్లు కూడా జరిగే ఏర్పాటు ఉన్నది.దగ్గర ఊళ్ల నుంచి చాలా మంది ఎన్నో వ్యాధులకు చెన్నై, హైదరాబదు రాకుండా చికిత్స చేయించుకుంటున్నారు! బాగుంది.

ఏడాదికి 365 రూపాయలు భీమా కట్టే ఏర్పాటు ముందు బాగానే సాగినా మెల్లగా కుంటు పడింది.దీనికి కారణం ఆయా కాగితాలలో నానా చెత్త నింపమని భీమా వారు కోరటం. నిజమే! అన్ని రంగాలలోనూ ఎదురుగా ఉండే ఆ ఫారంలను చూడగానే నాకు కూడా జీవితం మీద విరక్తి పుడుతోంది. పధ్ధతులను సుకరం చేయటంలో మన వాళ్లది పై చేయి!మరింత కష్టసాధ్యం చేసేస్తారు.

అదలా ఉంచి ఈ టెలిమెడిసిన్ పధ్ధతి చాలా ఉపయోగకరమైనది. కదలలేని వయోవృధ్ధులు నెట్ ద్వారా కాంఫరెన్సింగులోకి వచ్చే ఏర్పాటు కూడా చేసుకో వచ్చేమో! అలా ఉంటే చాలా మంది ఈ డాక్టర్ల టెస్టులకు భయపడే వారు దీనినే ఎంచుకోగలరు! కాకపోతే కొన్ని ఇబ్బందులుండగలవు. అరగొండలో అన్ని ఉపకరాలున్నాయి. ఆ రిపోర్టులను తీసి కేవలం స్పెషలిస్టులను ఆ పధ్ధతిలో సమ్రదించటం జరుగుతోంది.

రాబోయే రోజులలో అక్షరాస్యత పెరుగుదలతో ఈ ప్రక్రియ ఊపు అందుకోగలదేమో! ప్రభుత్వం వారు పల్లెల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఈ ఏర్పాటు విసాట్ లైన్ల ద్వారా చేపట్టటంలో తప్పేమీ లేదు.ఆరోగ్యం,పర్యావరణం మీద సూటిగా కార్యక్రమాలను నిరంతరం చూపించవచ్చు కూడా.

ప్రభుత్వం మరో సారి ఆలోచిస్తే బాగుంటుంది.

~~~***~~~


Categories: Left

శ్రీమద్రామాయణం- కచ్చిద్సర్గ (3)

Tue, 07/06/2010 - 22:15

శ్లో:రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయా: పతయే నమ:

శ్లో: చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం
ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం

శ్లో:కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

శ్లో: కచ్చిదాత్మసమా: శూరా: శృతవంతో జితేంద్రియా:
కులీనాశ్చేంగితఙ్ఞాశ్చ కృతాస్తే తాత మంత్రిణ:

నీకు సమానులైన శూరవీరులను,శాస్త్రఙ్ఞులను,జితేంద్రియులను,కులీనులను,బాహ్య చేష్టలతోనే మనసులోని మాటలను గ్రహించగల సుయోగ్యులను మంత్రులుగా ఎంచుకున్నావా?

మంత్రులు, రాజుకు దగ్గరగా ఉండే వారి గుణగణాల గురించి ఇక్కడ చెప్పటం జరుగుతోంది.

శ్లో: మంత్రో విజయమూలం హి రాఙ్ఞాం భవతి రాఘవ
సుసంవృతో మంత్రిధురైరమాత్యై: శాస్త్రకోవిదై:

రాజుల విజయానికి మూలకారణం చక్కని ‘మంత్రణ ‘.(మంచి మంత్రుల సంప్రదింపు, సలహాలు).ఈ సంప్రదింపులను నీతిశాస్త్ర నిపుణులైన మంత్రులు అన్ని విధాలా గుప్తములుగా ఉంచినపుడే సఫలములు కాగలవు.

శ్లో: కచ్చిన్నిద్రావశం నైషి కచ్చిద్ కాలేవబుధ్యసే
కచ్చిచ్చాపరరాత్రేషు చింతయస్యర్థనైపుణ్యం

సమయం కానప్పుడు నిద్రకు నీవు వశమవటంలేదు కదా?సకాలానికి నిద్ర లేస్తున్నావు కదా? రాత్రి  (అపరరాత్రిలో) అర్థసిధ్ధి ఉపాయముల గురించి యోచిస్తున్నావా?

ఐశ్వర్యానికి,అర్థసిధ్ధికి ,నిద్రించు వేళలకు, అలవాట్లకు దగ్గర సంబంధం ఉన్నది.త్రికాలసంధ్యలందు నిదురించే వారింట ఐశ్వర్యం నిలవదు.ఇంద్రుడికి కూడా ఈ విషయంలో మినహాయింపు లేదని శాస్త్రాలు చెబుతున్నాయి.త్రికాల సంధ్యలను ఆచరిస్తూ రాత్రి వేళ ప్రశాంతంగా అర్థసిధ్ధి కోసం కొత్త ఉపయాల గురించి యోచించే వారికి చక్కని మార్గాలు స్ఫురింపగలవు అని తాత్పర్యం.

(మరల కలుద్దాం)

శుభం భూయాత్!

~~~***~~~


Categories: Left