http://srikaaram.wordpress.com/feed

Syndicate content శ్రీ-పదములు
Just another WordPress.com weblog
Updated: 46 min 11 sec ago

ఫొటో జవాబు

Thu, 07/22/2010 - 21:41

అగస్టస్ నికొలస్ సాండినో(1895-1934).ఇతను నికారాగువా లో యు.ఎస్.మిలిటరీ కి విరుధ్ధంగా పోరాడాడు.లాటిన్ అమెరికాలో ఒక హీరోగా చెప్పుకునే వ్యక్తి.సాండినిస్టా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ వారు (సాండినో అనుయాయులు) 1979 లో సొమోజా ప్రభుత్వాన్ని దింపేసారు.గరిల్లా యుధ్ధాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ పేరు చర్చలోకి రాక మానదు.


Categories: Left

శ్రీమద్రామాయణం -రాజధర్మం (కచ్చిద్సర్గ) (10)

Thu, 07/22/2010 - 12:54

Contd…from previous post

శ్లో: కచ్చిన్న లోకాయతికాన్ బ్రాహ్మణాన్స్తాత సేవసే
అనర్థకుశలా హ్యేతే బాలా: పండితమానిన:

నాస్తిక బ్రాహ్మణుల సాంగత్యమైతే చేయటం లేదు కదా? వీరు బుధ్ధిని పరమార్థమునుండి తప్పించటంలో కుశలులై ఉంటారు.నిజానికి అఙ్ఞానులై ఉండి కూడా పండితులనుకుంటారు.

శ్లో: ధర్మశాస్త్రేషు ముఖ్యేషు  విద్యమానేషు దుర్బుధా:
బుధ్ధిమాన్వీక్షికీం ప్రాప్య నిరర్థం ప్రవదంతి తే

వేదవిరుధ్ధం అవటం వలన వారి ఙ్ఞానం  దూషితమయి ఉంటుంది.వారి ఙ్ఞానం ప్రధానమైన ధర్మశాస్త్రాలతో ప్రమాణభూతములై ఉన్నప్పటికీ తార్కిక బుధ్ధిని
ఆశ్రయించి వ్యర్థమైన వాదములు చేస్తుంది.

శ్లో: వీరరైరధ్యుతాం  పూర్వమస్మాకం తాత పూర్వకై:
సత్యనామాం దృఢద్వారాం హస్త్యశ్వరథసంకులాం
బ్రాహ్మణై: క్షత్రియైర్వైశ్యై: స్వకర్మనిరతై: సదా
జితేంద్రియైర్మహోత్సాహైర్వృతామాయై: సహస్రశ:
ప్రాసాదైర్వివిధాకారైర్వృతాం వైద్యజనాకులాం
కచ్చిత్ సముదితాం స్ఫీతామయోధ్యాం పరిరక్షసే

అయోధ్య మన వీరపూర్వజుల నివాసభూమి.అది పేరుకు తగ్గట్లు గుణములు కలది. దాని ద్వారాలు అన్ని వైపులా దృఢములు.గజ,అశ్వ, రథములతో పరిపూర్ణము.స్వకర్మములలో నిరతులై ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్యులు సహస్ర సంఖ్యలో నివాసముంటారు. అందరూ ఉత్సాహవంతులు,జితేంద్రియులు, శ్రేష్ఠులు.    నానా విధములైన రాజభవనములు, మందిరములు శోభిల్లుతుంటాయి. పండితులు అధికంగా ఉంటారు. అటువంటి అభ్యుదయశీలమైన, సమృధ్ధమైన అఓధ్యను కాపాడుకుంటున్నావు కదా?

శుభం భూయాత్!

To be continued…

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Thu, 07/22/2010 - 11:25

The first known photograph of a rare primate that was feared extinct has been captured by researchers in central Sri Lanka.

The Horton Plains slender loris, which has short, sturdy limbs and long fur, was tracked down in highland forest.

The photo shows an adult male sitting on a branch.
The elusive primate has been spotted only four times since 1937 and disappeared altogether from 1939 until 2002, when it was last glimpsed.
Experts feared the primate, whose numbers fell dramatically as much of its habitat was lost to crops and tea plantations, had become extinct.
The mysterious creature was traced by a joint team from the Zoological Society of London (ZSL) and Sri Lanka who conducted about 1,000 nocturnal searches in mountain forest. The researchers were able to capture and physically examine one of the creatures, before releasing it back into the wild.

ZSL conservation biologist Dr Craig Turner said: “We are thrilled to have captured the first-ever photographs and prove its continued existence – especially after its 65-year disappearing act.This is the first time we have been able to conduct such a close examination of the Horton Plains slender loris,” he said.

Slender lorises are small, nocturnal primates found only in the tropical forests of southern India and Sri Lanka.

About 6-10in long (15-25cm), their large eyes help their night-time hunting.

While the slender loris is extremely rare, other types of loris thrive in parts of South Asia and South East Asia.

Some communities believe eating loris flesh can treat leprosy. Tonics made from the animals are claimed to heal wounds and broken bones, and help women regain strength after childbirth.

In Sri Lanka, there is a belief that the animal’s body parts can ward off the “evil eye” and be used to curse enemies. The primate’s tears have been used as an ingredient in love potions.

Every year thousands of lorises are caught to supply such uses.

సమాధానాలుగా వచ్చిన ఇతర వ్యాఖ్యలు కూడా పరిశీలించదగ్గవే!

(సౌజన్యం:బి.బి.సి)


Categories: Left

జాతీయ బ్యాంకులు మహమ్మదీయులకు ఖాతాలను నిరాకరిస్తున్నాయా?

Wed, 07/21/2010 - 22:21

మైనారిటీ కమిషన్ వారికి వస్తున్న కంప్లయింట్లలో ఇటీవల ఎక్కువగా ఉన్న వాటిలో జాతీయ బ్యాంకులు మన దేశంలో మహమ్మదీయులను ఖాతాలు  తెరవనీయటం లేదు అని!
(బి.బి.సి వార్త)

మామూలుగానే ఈ మధ్య జాతీయ బ్యాంకుల వ్యవహారం ప్రజలలో చాలా అసంతృప్తిని రేకెత్తించింది. కార్పొరేట్ బాంకులు  మామూలు మధ్య తరగతి వాడు లోపలికి రాగానే ఫినైల్ బాటిల్ కోసం అటూ ఇటూ చూస్తాయి.

జాతీయ బాంకులలో ఎక్కువగా దిష్టి బొమ్మలను,దయ్యం పట్టిన వాళ్లని ఉద్యోగాలో చేచుకున్నట్లు వ్యవహరిస్తున్నారు.ఎవరో వాళ్లని దోచుకుపోతారనేమో ఈ మధ్య తలుపులు వేసేసి కూర్చుంటున్నారు. ఒక బాంకులో చూసాను.గ్రిల్ డోర్ నా లాంటి బక్క ప్రాణం కూడా దూరలేనంతగా తెరచి పెట్టాడు. ఒక మహిళ చంటి పిల్లను ఎత్తుకుని వచ్చింది. ఆ దికుమాలిన సెక్యూరిటీకి కనీసం ఆవిడ దూరలేకపోతోందనే ఆలోచన కూడా లేదు. కొద్దిగా గ్రిల్ డోర్ ను నెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అంతా అవుట్ సోర్సింగ్! అవుట్ సోర్సింగ్ చేసే సోర్సరీ మీద మన దేశం ప్రస్తుతం ఇలా నడుస్తోంది.

మహమ్మదీయుల వద్దకి వద్దాం…

బాంకు వారు ఇస్తున్న వివరణ ఏమిటంటే వారికి విధానాల ప్రకారం సరైన ఆర్థిక స్తోమత లేదు కాబట్టి అలా చేస్తున్నాం అన్నారుట!

మన  రాష్ట్రంలో 90 వేల మహమ్మదీయ విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను జమ చేసుకునేందుకు కూడా వీరు దోహద పడలేదంటే బాధగా ఉంది.మరి విద్యార్థుల విషయం లో బాంకులలో ప్రత్యేకమైన విధానాలున్నాయి కదా? వాటి సంగతి ఏమిటి?

ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించవలసిన అవసరం ఉన్నది.మామూలుగానే అసలు ఒక ఖాతా తెరవాలంటే సామాన్యుడికి  సమస్యలే! అయిదు శాతం దొంగపనులు చేస్తారని 95% ప్రజలను ఇబ్బంది పెట్టే నియమాలను తయారు చేసి కాళ్లు జాపుకుని పడుకోవటం అలవాటయిన  దొరబాబుల దేశం ఇది.

మాకెందుకని మరబొమ్మలలా పని చేస్తారు సిబ్బంది.ఇందుకు కాదు కోట్లు వెచ్చించి శిక్షణ ఇచ్చి పనులలో పెట్టేది.పబ్లిక్ సర్వీస్ ఈస్ పబ్లిక్ సర్విస్.

పబ్లిక్ సర్విస్ యావత్తూ అవినీతి పరుల దొరబాబుల దగ్గర పెట్టి ఆ తెల్ల దొర వాడి తాతలను కూర్చోపెట్టి వెళ్లిపోయాడు! ఈ రిపబ్లిక్ నే పబ్లిక్ గా దోచుకోమన్నాడు!

మహమ్మదీయ సోదరులతో  విచక్షణతో కాదు…మైనారటీలని కూడా కాదు.సగటు  భారతీయులుగా వ్యవహరించటం చాలా అవసరం. వోటు బాంకులు తెచ్చే సాంఘికపరమైన పర్యవసానాలను ఎవరూ పట్టించుకోవటం లేదు.

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Wed, 07/21/2010 - 21:40

This year’s biggest release of water from the sluice for flood prevention at the Three Gorges Dam in Yichang, central China’s Hubei province, on July 20, after relentless torrential rains hit Yangtze River areas. The massive water flow on the Yangtze was expected to pose the biggest test for the Three Gorges Dam — the world’s largest hydroelectric project — since it was completed in 2006, as rivers throughout rain-hit regions have risen to or beyond their warning levels, flooding numerous towns and cities. AFP

సరైన సమాధానం ఇచ్చిన వారు:

jokabhiramayanam.blogspot.com
satyaonline@gmail.com

VJ@GMAIL.COM


Categories: Left

ఇక్కడ ఏమవుతోంది?

Wed, 07/21/2010 - 05:48


Categories: Left

ఫొటో జవాబు

Wed, 07/21/2010 - 05:46

హౌరా రైల్వే స్టేషన్


Categories: Left

విధి

Wed, 07/21/2010 - 03:24

ఆర్మీ లోని మిత్రులతో బాగా పొద్దు పోయే వరకూ కూర్చున్నాను.వాళ్లు రకరకాల ప్రశ్నలు వేసారు. చేతులు చూడమన్నారు. రాత్రి పూట చూడనన్నాను. ఫేస్ రీడింగ్ చేయమన్నారు. సరదాగా ఒకరిద్దరికి చేసాను.అందరూ భవిష్యత్తు గురించి అడుగుతుంటే ఒక ఆలోచన వచ్చింది.
‘మీరంతా సైనికులు. వీటి గురించి మీకెందుకు?’,అన్నాను.
ఒకాయన సిగరెట్ ముట్టించాడు.
‘మా మధ్యనే జరిగింది చెబుతాను వినండి…’,అన్నాడు. అందరం కుర్చీల్లోకి వెనక్కి వాలాం.
‘ఆ రాత్రి కూడా బాగా పొద్దు పోయింది.కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం.కొద్దిగా ఛలిగా కూడా ఉంది.పునీత్ ఒక మాటన్నాడు.రేపు ఆదివారం కదురా, ఈ రాత్రి రెండో ఆటకి వెళదాం, అన్నాడు. మాలో ఇద్దరికి ఇష్టం లేకపోయినా ఆ మాటా, ఈ మాటా అనుకుని అందరం సిధ్ధమయ్యాం.ఈ కాంపస్ కి వెనుకనుండి మరో దారి ఉంది. అందులోంచి అందరం బైకుల మీద రోడ్డెక్కాం. హాలు పెద్ద దూరం కాదు.కొంత దూరం వెళ్లాక ఎందుకో పునీత్ ఆగిపోయాడు.
ఏమయింది అని అడిగాం.ఎందుకో వెనక్కి వెళ్లిపోవాలనిపిస్తోంది, అన్నాడు.నువ్వే కదరా అందరినీ బయలుదేరదీసావు? అని అడిగితే అదోలా మొహం పెట్టాడు.
ఏమో రా, మీరు వెళ్లండి, అన్నాడు. సరే అతనికి మూడ్ బాలేదని వెళ్లమని చెప్పి మేము ముందుకు సాగిపోయాం. అంతే! వెనుక పెద్ద శబ్దం అయింది. అందరం ఆగి బళ్లను వెనక్కి తిప్పాం. పునీత్ ఎక్కడో పడి ఉన్నాడు, అతని బండీ ఎక్కడికో జరిగిపోయి ఉంది. ఒక లారీ ఇటు వస్తూ రోడ్డుకు అడ్డంగా తిరిగిపోయి ఉంది!
పునీత్ వెనక్కి ఎందుకు వెళ్లాలని ఎందుకన్నాడో అర్థం కాలేదు. అలా వెనక్కి వెళ్లి మళ్లీ రాలేదు!’
ఒక్క సారి మబ్బుల్లోకి చూసి నిట్టూర్చాను…
~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Tue, 07/20/2010 - 11:20

ఒస్మానియా జనరల్ ఆస్పత్రి,హైదరాబాదు


Categories: Left

నేను దురాత్ముడను!

Mon, 07/19/2010 - 13:20

ఏ నిద్రలోనో నిదురిస్తున్న నీరజాక్షుని వద్ద నిలచాను
‘నేను దురాత్ముడను ‘,చిన్నగా పలికాను

నాతో నీకొక పనుంది…
నన్ను చూడటానికి మూడు కారణాలు

ఆదుకొనే కార్యక్రమం చేపడితే ముందు చెడిపోయినవారిలో అందరికంటే ఎక్కువ చెడిపోయినవారితో మొదలెట్టాలి.నేను నీ ముందే ఉన్నాను…
నేను దురాత్ముడను!

రెండు,నన్ను బాగు చేస్తే పాటుగా ఎందరో బాగవుతారు. నీ పని సులభం!
నేనంతటి దురాత్ముడను.నాతోనే మొదలెట్టు.నీకు నాతో పనుంది.
నేను దురాత్ముడను!

మూడు,నీ కీర్తిని వేయి రెట్లు పెంచగలను!
నాలాంటివాడిని కూడా ఆదుకోగలడన్న కీర్తి నీకు వద్దా?
మళ్లీ ఆలోచించు!

ఎవరనే నీ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలో నాలుగు ప్రత్యామ్నాయాలూ నేనే!

నేను లేవలేను.నేను దురాత్ముడను!
నీ పక్కలో పడి ఉన్న చేతకాని పసివాడను.
నీకంటే ముందరే నిద్ర లేస్తాను, నీ ముందరే పడుకుంటాను.
అదేమిటో నువ్వు త్వరగా లేవవు.నేను ఎంత గిల గిలా కొట్టుకున్నా కదలవు.

ఇంత నల్లగా ఉన్నా నిలువెత్తు వెలిగిపోతావు.
ఇంత మెల్లగా చెప్పినా వినిపించదంటావు.
మధుకైటభులను వినిపించకుండా చెవులలో అడ్డం పెట్టుకున్నావు.
నా గోల వినిపించకూడదని అంత రాక్షసులను వాడుకుంటున్నావు!

నేను ఎంత దురాత్ముడను!
నాతో నీకింత పనా?
ఇంతటి అప్రయోజకునితో
ఏ స్వప్రయోజనమునో వెతికేవు…

నాకడ్డం వచ్చే కర్మలను మరో భాగోతంలో నరుకుతావా?
ఏమో!నాకవన్నీ తెలియవు.
మరో సారి ఆలోచించు.నీకు నాతో చాలా పనుంది.
లోకోధ్ధరణ అక్కరలేదు.నేనొక్కడిని చాలు!

నేను దురాత్ముడను.నీకు నాతో కొంచెమైనా పనుంది…

~~~***~~~


Categories: Left

ఇది ఏ భవనం?

Mon, 07/19/2010 - 10:46


Categories: Left

ఫొటో జవాబు

Mon, 07/19/2010 - 05:09

హాఇనాన్ ముఖ్యపట్టణం (చైనా) హైకూ పోర్టులో కోన్సోన్ అనే టైఫూన్ రాబోతోందని 24000 బోట్లను సిధ్ధం చేసిన దృశ్యం ఇది.

చైనా వారి తయారీలు అలా ఉన్నాయి! అయినా ఇటీవల వరదలలో 135 మంది ప్రాణాలు కోలుపోగా 1.2 మిలియన్ మంది పునర్వ్యవస్థీకరింపబడ్డారు.113000 ఇళ్లు నష్టమయ్యాయి.
కోన్సొన్ టైఫూన్ ఫిలిపీన్స్ లో 38 మంది ప్రాణాలు తీసి ప్రస్తుతం వియత్నాం వైపుకు పోయిందనితెలుస్తోంది!

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Sat, 07/17/2010 - 11:20

వందలలో ఆసియా భూఖండంలోని విద్యార్థులు అతి తక్కువ  ఫ్యుఎల్ వాడే కారు తయారు చేసే పోటీలో పాల్గొన్నారు.పది దేశాలనుండి 81 మంది జులై 8 న మలేషియా
లో ‘ఎకొమరాథన్ ‘లో వాళ్ల కార్లను ప్రదర్శించారు! ఈ పోటీ 1985 నుంచి షెల్ మరథన్ పేరుతో యూరోప్ లో,2007 నుంచి అమెరికాలో జరుపబడుతోంది.మొదటి సారి ఆసియా ఖండానికి వచ్చింది.అతి తక్కువ ఫ్యుఎల్ తో అత్యధిక దూరం ప్రయాణించి అతి తక్కువ కార్బన్ డయాక్సైడ్ బయటకు పంపే కార్ల తయారీలని అభివృధ్ధి పరచే ప్రయత్నం ఇది.


Categories: Left

మహావీరుడు!

Sat, 07/17/2010 - 02:09

పుణెలో ఒక సారి కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనియరింగ్ లో ఒక మిత్రుడితో ఒక వారం రోజులున్నాను.అక్కడ సైన్యం లోని వాళ్లతో గడిపినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు  చర్చలోకి వచ్చేవి. రాత్రి మెస్ లో కూర్చున్నప్పుడు ఒక యువ కేప్టెన్ మరొకడితో 1971 యుధ్ధం విషయాలు చెబుతున్నాడు. కొద్దిగా దూరంగా కూర్చుని ఉన్న ఒక పెద్దాయన తన గ్లాసు పట్టుకుని వచ్చాడు.
‘యంగ్ మాన్, పెళ్లయిందా?’,అన్నాడు.
అతను లేచాడు.ఈయన కూర్చోమని కూర్చోపెట్టాడు.
‘అమ్మాయిని చూసావా?’
‘నో సర్!’
‘చూడవా?’
‘సర్!’
‘చూడవయ్యా…ఇదిగో చుట్టూ చక్కని అమ్మాయిలున్నారు.’
‘సర్!’
‘చూడకపోతే మహావీరచక్ర రాదు.’
‘సర్!’
‘కర్నల్ చటర్జీ గురించి తెలుసా?’
‘నో సర్!’
వెంటనే కుర్చీ తెప్పించి బాటల్ కూడా అక్కడికే తెప్పించాడు.మరో ఇద్దరు దగ్గరగా వచ్చారు.
‘రాజస్థాన్ బార్డర్లో తన కెప్టెన్ తో టెంటులో కూర్చున్నాడు చటర్జీ…’,ఆయన మొదలెట్టాడు,’…చుట్టూ అమ్మాయిలెవరూ కనిపించటం లేదు.చూడు,అన్నాడు.అ కెప్టెన్ ‘సర్,ఇది ఎడారి.మంచి నీళ్లే లేవు,అన్నాడు.’,గట్టిగా నవ్వి పెగ్గు ఖాళీ చేసాడు…

~~~***~~~

‘ఎంత సేపురా ఆ లాంతరు?’
‘సర్! వెలిగినంతవరకు!’
‘పద!’
‘సర్!ఎక్కడికి సర్?’
‘ప్రశ్నలొద్దు!ఫాలో మి!’
ఇద్దరూ బయటికి నడిచారు.భూమీ ఆకాశం తప్ప ఏమీ లేదు.అంతా చీకటి.కొద్ది దూరం నడిచారు.
‘ఎడారిలో కూడా అమ్మాయిలుంటారు.పద.కష్టపడాలి!’
అలా మరి కాస్త దూరం వెళ్లాక కెప్టెన్ ఆగాడు.
‘సర్! కనీసం ఒక్క ఇల్లు కూడా లేదు.అమ్మాయిలెక్కడుంటారు సర్!’
‘అరె తూ బచ్చ హై యార్!నడు. ఇక్కడ ఈ టైం కి గాజుల చప్పుడుతో ఈ ఇలాకా వాళ్లు వస్తారు.ఈ వేలప్పుడు రాకపోతే ఎప్పుడొస్తారు?’
అలా నడుచుకుంటూ వెళ్లిపోయారు.
‘సర్!’
‘ఏమయింది?’
‘దూరంగా చూడండి.’
‘ఉందా?’
‘అమ్మాయి కాదు సర్!అది పకిస్తనీ టెంట్!’
‘ఛా!’
‘అవును సర్!మనం శత్రువు ప్రదేశంలోకి తెలియకుండా వచ్చేసాం!’
చటర్జీ జాగ్రత్తగా చూసాడు.అంతా దిగిపోయింది.
‘కరెక్ట్!’
‘మెల్లగా వెనక్కి తిరుగుదాం!’
‘నో!ఈ ఎడారిలో  మనకు వచ్చిన దారి తెలియటంకష్టం.ఈ టెంటులోని వాళ్లు ఇట్టే తెలుసుకుంటారు.’
‘సర్!పాక్కుంటూ వెళదాం సర్!’
‘నో!నా వెనుక రా!ఆ పాకేదేదో ఆ టెంటులోకే పాకుదాం.’
‘సర్!’
‘యస్!మనం ఉన్న దిక్కు నుండి ఖచ్చితంగా టైగర్ (ఆ యూనిట్ కి కమండెంట్)అటు తిరిగి కూర్చుని ఉంటాడు.’
‘సర్! గారంటీ ఏమిటి సర్?’
‘బచ్చా! ఇటు తిరిగి ఉంటే ఈ పాటికి ఇద్దరం అందులో ఉండే వాళ్లం!’
‘సర్!’
‘నడు.’
ఇద్దరూ పాక్కుంటూ టెంటు దాకా వెళ్లారు. అనుకున్నట్లే వాడు అటు తిరిగి కూర్చుని ఏవో సందేశాలు వ్రాసుకుంటున్నాడు.ఇద్దరూ ఒకరినికరు సైగల ద్వారా సందేశాలిచ్చుకున్నారు.అంతే! హఠాత్తుగా లోపలికి దూరి గన్ను వాడి తలకు తగిలించారు. వాడు లేచి చేతులు పైకి ఎత్తాడు.
‘భారత దేశ సైన్యం ఈ ప్రాంతాన్ని టేక్ ఓవర్ చేసింది.పద!’,అన్నాడు చటర్జీ!వాడితో పాటు వాడి సైనికులు ఇద్దరిని వెంట పెట్టుకుని బయటకు వచ్చారు.వాళ్ల వెనుక గన్ పెట్టి వీళ్లు వెనుక నడిచారు. వాళ్లు వీరిని వీరి టెంట్ వరకూ గైడ్ చేసారు!
లోపలికి వచ్చి వైర్ లెస్ మెసేజ్ లో ‘టెరిటరీ కాప్చర్డ్!’ అని చెప్పారు!
అంతే. మిగతా యూనిట్ వచ్చేసింది. చటర్జీ హీరో అయిపోయాడు.ఆ అద్భుతమైన కార్యానికి అతనికి మహావీరచక్ర ఇచ్చారు!’

~~~***~~~
ఆయన నవ్వాడు.
‘యంగ్ మాన్,గట్టిగా చూడు.కథలెందుకు? మన బలహీనతలే మన కథలు.అవే మన శక్తి!’
నవ్వుతూ లేచాడు.

~~~***~~~


Categories: Left