http://srikaaram.wordpress.com/feed

Syndicate content శ్రీ-పదములు
Just another WordPress.com weblog
Updated: 19 min 44 sec ago

ఫొటో జవాబు

Sun, 08/01/2010 - 02:21

సమాధానం

సరైన సమాధానం ఇచ్చిన వారు:

తార
ramuug@gmail.com

చిలమకూరు విజయమోహన్
vijayamohan59.blogspot.com


Categories: Left

అమెరికా అఫ్ ఘాన్…ఎంత సేపు ముసుగులో గుద్దులాట?

Sat, 07/31/2010 - 14:23

వికిలీక్స్ వలన ఏమి అర్థమయిందో లేదో అలా ప్రక్కన పెడితే ఈ వీడియోలో చాలా విషయాలు మందుకొస్తాయి.

ఫోర్స్ 373 (అమెరికా సైన్యం లోని ఒక భాగం) ఒక రెయిడ్ జరిపినప్పుడు ఆ ఇంటిలో ఏడుగురు చిన్న పిల్లలు ప్రాణాలు కోలుపోయారు.’విదేశీయులు ‘మా గడ్డ మీద ఉండకూడదనే ఒక నినాదం పలు చోట్ల రగులుకున్నది.ఈ నినాదం తో అందరినీ ఆకట్టుకోవటం చాలా తేలికైన పని.అదే పాకిస్తాన్ కూడా చేస్తోంది.తాలిబాన్ దృష్టిలో పాకిస్తాన్ కీ, అఫ్ఘాన్ కీ మధ్య తేడా లేదు. రెండు చోట్ల నుండీ తాలిబాన్ విచ్చలవిడిగా ఆపరేట్ చేస్తోంది.పాకిస్తాన్ భారత్ అఫ్ఘాన్ లో చొరబడి ఆ దేశాన్ని చుట్టుముడుతున్నదనే ఒక మాటను ప్రచారం చేస్తోంది.

పాకిస్తాన్ అల్ కైదా కంటే అమెరికా వలన ఎక్కువ ముప్పు ఉన్నదని భావించటం గమనార్హం!పాకిస్తాన్ ప్రస్తుతం అమెరికాకి ఒక సన్నిహితుడిగా తీవ్రవాదం మీద యుధ్ధం చేయటం లేదు. అది సమస్యలో ఒక భాగమై కూర్చుంది.అఫ్ఘాన్ లోని పష్తూన్ తెగల మధ్యలోకి వెళ్లి తలిబాన్ వారి ‘జాతీయత ‘ ను అడ్డం పెట్టుకుని ప్రస్తుతం ఆడుకుంటోంది.ఈ వీడియోలో ఒక సైనికుడు పాకిస్తాన్ చెక్ పోస్ట్ ను చూపించి తాలిబాన్ దాడి చేసినప్పుడల్లా ఆ చెక్ పోస్ట్ నుండి పాకిస్తానీ సైనికులు కూడా కలసి దాడి చేస్తారని చెప్పటం మనకు కనిపిస్తుంది.

పాకిస్తాన్ తాలిబాన్ ను చాలా తెలివిగా వాడుకుంటోంది.జాతీయత, జిహాద్,విదేశీయుల దురాగతాలు, ‘భారత్ బూచి ‘ అనే అంశాలను నేపథ్యంగ పెట్టి డబల్ గేం తో చెలామణి అయిపోతోంది.కశ్మీర్ ను అలవోకగా కలిపేసింది…

అమెరికా తన టౄప్ లను పెంచి ఉపయోగం?

దీనికి పరిష్కారం సైనిక చర్య కాదు.ఏ ప్రాంతంలోనైనా ఏ దేశం యొక్క సైన్యం దిగినా (ఐ.పి.కె.ఎఫ్ అయినా అంతే!)స్థానిక ప్రజలలో ఒక అసంతృప్తి, అసహనం సామాన్యమే.సైనికులకు నిగ్రహంతో వ్యవహరించే తత్వం అరుదు. మన దేశంలోనే చాలా సార్లు ఈశాన్య రాష్ట్రాలలో జరిగినవి మనం మరచిపోలేదు.

ఒక రాజకీయపరమైన సమాధానం వైపు అమెరికా భరత్ తో కలసి వెళ్లాలి.ఈ ప్రక్రియలో  కీలకమైన దేశాలను కలుపుకోవటం మంచిది.
పాకిస్తాన్ లోని అణు ఆయుధాలు తాలిబాన్ చేతిలోకి వెళ్లే ముందైనా అఫ్ఘాన్ కీ, పాకిస్తాన్ కీ మధ్య తేడా లేదని తెలుసుకోలేని అమెరికా కళ్లు తెరిస్తే బాగుంటుంది.
ఇరాక్, అఫ్ ఘాన్ లలో అమెరికా సాధించింది ఏమీ లేదు.వారి సైన్యంలోని మృతుల సంఖ్య చూస్తే బాధగా ఉంటుంది.

Bishop Tutu had once said, ” There are times when it would have been justifiable to go to war,but only after you have genuinely exhausted every other possible option.You have to say with reasonable certainty that the struggle will be successful and that the circumstances are going to be better…and of course you have to use the principle of proportionality-that the violence or force you use is in proportion to the end that you wish to achieve.”

చేతనైతే ఒక బృహత్ పథకాన్ని పన్ని ఆ దేశం అణు ఆయుధాలను అంతర్రాష్ట్రీయ పర్యవేక్షణలో స్వాధీనం చేసుకుని ముక్కుకు తాడు వేయగలగాలి.మిగతా పనులు ఉపయోగం లేనివి!
ఒక నీచమైన వృత్తికీ, ప్రవృత్తికీ అలవాటయిపోయిన పాకిస్తాన్ లాంటి దేశం కింద పడ్డా పై చేయి మాదే అనే సామెతను ఋజువు చేస్తుంది.ఆ ప్రక్రియలో భాగంగా దేనికైనా తెగించగలదు.అందులో అమాయకులను బలి చేయటం మూర్ఖత్వమే అనిపించుకుంటుంది…

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Sat, 07/31/2010 - 03:05

అందం కోసం,ఎక్కువ కాలం బ్రతకటం కోసం మైకెల్ జాక్ సన్ ఈ ఆక్సిజన్ చేంబర్ లో నిదురించేవాడు.దీనిని కేలిఫార్నియా మెడికల్ సెంటర్ కు ఇచ్చేసాడు.

సరైన జవాబిచ్చిన వారు:

swapna@kalalaprapancham
welcome2dreamzworldmaster@gmail.com

jokabhiramayanam.blogspot.com
satyaonline@gmail.com

Observer
lndurvasula@gmail.com

sharmavj@gmail.com
121.246.231.226

subbaiah@gmail.com

vijayabhanukote.wordpress.com
rajsamvizzi@gmail.com


Categories: Left

ఈయనెవరు?

Wed, 07/28/2010 - 12:34


Categories: Left

ఫొటో జవాబు

Wed, 07/28/2010 - 12:25

అల్జీరియా, మొరొక్కో


Categories: Left

వ్యాఖ్య పంపండి

Wed, 07/28/2010 - 00:34


Categories: Left

ఒంటరిగా…

Mon, 07/26/2010 - 22:15

చాలా దేశాలలొ  ఒకప్పుడు ఒంటరిగా సినిమాకి వెళ్లినా, హోటల్ కు వెళ్లినా కొద్దిగా అవమానకరంగానే ఉండేది.రోజులు మారిపోతున్నాయి. కొరియాలో ఇటీవల ఒంటరి వారికోసం ప్రత్యేకమైన హోటళ్లు తయారయినాయి. ఒక కర్టెన్, ఒక పార్టిషన్,సన్నని సంగీతం, లాప్టాప్ కోసం సౌకర్యం, తిండి…ఇలా అంతా నిశ్సబ్దం అంతటా చోటు చేసుకుంటోంది.ఆసియా ఖండంలో ప్రజలు ఎక్కువగా ఒంటరితనాన్నే కోరుకుంటున్నారని తెలుస్తోంది.

ముంబయి నగరంలో వివాహాలనేవి తగ్గి ‘లివ్ ఇన్ ‘ సంబంధాలు పెరిగాయి…

ఒక లాప్ టాప్ ద్వారా ప్రపంచమంతా చేతిలోకి వచ్చింది.మిగిలింది నన్ను కాకుండా లెక్క వేసుకో!

ఇలియట్ మంచి మాట అడిగాడు.

Where is the knowledge we have lost in the pursuit of information?

Where is the wisdom we have lost in the pursuit of knowledge?

Where is the life we have lost in the pursuit of a living?

సిరివెన్నెల గారి మాట గుర్తుకొస్తుంది…జగమంత కుటుంబం నాది (ఇంటర్ నెట్ నా చేతిలో).ఏకాకి జీవితం నాది (నన్ను కాకుండా లెక్కేసుకో!)

ఇది మంచి విషయం కాదు.

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Mon, 07/26/2010 - 21:49

ప్రైమరీ నుండి యూనివర్సిటీ వరకు 35డాలర్ల ధరకు పంచాలనుకుంటున్న లాప్ టాప్స్.

సరైన సమాధానం ఇచ్చిన వారు:

అరిపిరాల
jokabhiramayanam.blogspot.com

జయంత్ కుమార్
jayanthalerts@gmail.com


Categories: Left

‘ఎడ్యుకేషన్-మై పర్సెప్షన్’-శ్రీ జయంత్ మునిగల గారి పుస్తకం

Mon, 07/26/2010 - 12:41

1986 లో ఐ.ఎ.ఎస్ లో చేరిన జయంత్ మునిగల గారు చాలా అనుభవం గడించారు.ఈ పుస్తకం కేవలం వారు అనుకున్న దృక్పథం గురించి కాదు.విద్య అనే అంశం విధానాలమధ్య, విధి వ్రాత అడుగున,విధాత పెట్టిన విధి వేధింపుల మరుగున తర తరాలుగా అలా మార్పులకు గురీవుతూ వస్తోంది.ముఖ్యంగా దీనిని ప్రశాసనంలో భాగమై చాలా దగ్గరగా పరిశీలించి కొన్ని నిజాలను పుస్తకరూపంలో చెప్పారు మునిగల గారు.

ఆయన చిన్నప్పుడి అదిలాబాద్ జిల్లాలో చదువుకున్న వ్యవహారం నుంచి ఈ నాటి విద్యారంగంలోని అంశాలను చెప్పారు.ప్రాథమిక విద్యావిధానాల లో సంకల్ప బలం లోపించటం వలన వాటి అమలులో ఎన్ని సమస్యలుంటాయో బాగా ఉదాహరణలతో చూపించారు. ముఖ్యంగా జార్ ఖండ్ లో ఒక్క ఉపాధ్యాయుని సహాయంతో బడులు నడిపించటం లాంటివి ఆలోచింపచేస్తాయి.

విద్యావిధానంలో అటకెక్కిన భాష మీద దృష్టిని ఆయన ప్రారంభంలోనే పునరుధ్ధరించారు.తరువాత చరిత్ర (హిస్టరి)ను పట్టుకోమన్నారు.శబ్దం-శబ్దబ్రహ్మము యొక్క మరో స్వరూపమే భాష.ఆలోచనను అలవోకగా అలంకరించేదే భాష. ఆలోచన నుంచే ఆత్మశోధన.ఆత్మశోధనకు అంకురార్పణ చరిత్రలో ంచే జరుగుతుంది.మనం నిలబడింది ఎక్కడో నిలబడం.మన వెనుక నిలబడ్డ చరిత్ర అనే నేపథ్యం ముందు దాని ప్రతినిధిగా నిలబడతాం.తరువాత లెక్కలలోకి వెళ్లమన్నారు.అంటే లెక్కలు వేసుకోమన్నారు.తరువాత విఙ్ఞానం లోకి రమ్మన్నారు.సమస్తం విఙ్ఞానం ద్వారా పరికించి చూడమన్నారు.శారీరిక స్వస్థత గురించి చిన్నప్పటినుండే చూడమంటున్నారు.

ఇలా చెప్పుకొస్తూ చాలా దేశాలలో విద్య అనే విషయంలో జరుగు ప్రక్రియలను చిన్నగా స్పృశించారు. వారి ఆలోచనలో ఒకటి నుండి నాలుగో తరగతి వరకు మొదటి దశ. ఇందులో భాషలు, గణితం ప్రధానంగా నేర్చుకోవాలన్నారు.సంస్కృతం మూడో భాషగా అధ్యయనం చేయమన్నారు. రెండవ దశ అయిదు నుండి ఏడవ తరగతి వరకు. ఇందులో హిస్టరీ,విఙ్ఞానం కలపాలి. అలాగే భాషల స్థాయి పెరిగి గ్రామర్ తప్పులు లేకుండా మాట్లాడటం వ్రాయటం గట్టి పడాలన్నారు.మూడవ దశ ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు.ఇందులో అన్నిటి స్థాయిని రాబోయే చదువులను అందుకునేలా పెంచమన్నారు!

వినటానికి చాలా సింపుల్ గా ఉంది.ఆలోచిస్తే అర్థమవగలదు.

మా ఇంటి వెనుక ఒక విద్యాలయం ఉంది.ప్రతి రోజూ అసెంబ్లీలో పిల్లలు ఏవో చదువుతూ ఉంటారు.
‘అవర్ రిచ్ అండ్ వేరీడ్ హెరిటేజ్ ‘అని చదివేటప్పుడు మైకు ముందు ఆ అమ్మాయి ‘…రిచ్ అండ్ వరీడ్ హెరిటేజ్ ‘అంటుంది. రోజూ అలానే చదువుతుంది.అధ్యాపకులు, ప్రధాన అధ్యాపకులు అలానే వింటూ ఉంటారు…ఇది తప్పు కాదు! మన హెరిటేజ్ నిజంగా వరీడ్ గానే ఉంది!!!

మునిగల గారి పాయింటు ఇప్పుడింకా అర్థమవుతుంది.

ఈ పుస్తకం చాలా చిన్నది.చాలా పెద్ద ఫాంటులో 111 పుటలు.ధర 116 రూపాయలు మాత్రమే!

ఈ పుస్తకాన్ని పాలపిట్ట పబ్లికేషన్ వారు ఇటీవల ప్రచురించారు.
ప్రతులు దొరకు చోటు:

Paalapitta Books

16-11-20/6/1/1

403 Vijayasai Residency

Saleemnagar

Malakpet

Hyderabad-500 036

Ph: 9848787284

paalapittabooks@gmail.com

Writer can be contacted at 09652044903, munigala2001@yahoo.com

~~~***~~~


Categories: Left

‘లవ్ జిహాద్ ‘-ప్రేమా,దగ!

Sun, 07/25/2010 - 22:30

కేరళ రాష్ట్రంలో ఒక అధ్యాపకుని చేయి నరకటాన్ని మనం చూసాం.హై కోర్టు మహమ్మదీయ కుర్రాళ్లు ఒక పన్నాగం ప్రకారం ఇతర మతాల అమ్మాయిలను ప్రేమ అంటూ వల పన్ని మత మార్పిడి చేసి జిహాద్ కోసం పిల్లలను కంటూ నానా హంగామా చేస్తున్నట్లు గమనించి ఒక విచారణ కూడా చేపట్టింది.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీద్దరు కేరళ యువతులు 2009లో ఫిర్యాదు చేసారు.డబ్బు చూపించి వాళ్లని వివాహం చేసుకోమని చెప్పి కొంత ‘జిహాదీ ‘ సాహిత్యం ఇచ్చి చదవమన్నారని వాళ్లు పేర్కొన్నారు.కోర్టు వారు పోలీసును విచారణ జరపమన్నారు.విశ్వ హిందు పరిషత్,చర్చ్ వారు వారి రీతిలో వారు సాక్ష్యాలు చూపించారు.పోలీసు వారు కూడా ఇందులో వెతికి తీయవలసినది చాలా ఉందని చెప్పినా ఆ తరువాత కోర్టు మరో బెంచ్ ఆ పనికి స్టే ఇచ్చింది…

విషయానికి రెండు నజరియాలున్నాయి.మొదటిది-తీవ్రమైన పర్యవసానాలున్న జిహాదీ గోల ప్రపంచవ్యాప్తంగా ఆటవికంగా సాగుతున్న తీవ్రవాద సమస్య.

రెండు-దానికి మతపరమైన రంగు పూసి ప్రజలను మభ్యపెట్టి ఆ చర్యలో భాగస్వాములను చేసుకోవటం.

మన ప్రశాసనం న్యాయవ్యవస్థలో ఇటువంటి వాటికి విడి విధానం తో మసలుకోవాలి.ఒక బాంబు పేలినప్పుడు ఏ మతం వారు,ఎంత డబ్బున్నవారు,ఎటువంటి వారు ప్రాణలు కోలుపోయారనేది హాస్యాస్పదం.తీవ్రవాదానికి ఎటువంటి లింకు కనిపించినా దానిని ఆదిలోనే పోటా లాంటి చట్టం ద్వారా నరికి అవతల పారేయవలసిన విధానం ఉండాలి.అల కాకుండా ఒక దిక్కుమాలిన సివిల్ కేసు చేసినట్లు ఒక బెంచ్ విచారించమని, ఒక బెంచ్ ఆపమని చెబుతూ ఉన్నంత కాలం సగటు భారతీయుడికి రక్షణ లేదు.

చిదంబరం సిగు లేకుండా లోక్ సభలో కసబ్ కు సామాన్యమైన విచారణకు మేము న్యాయస్థానంలో అవకాశం ఇచ్చాం…ఇది మా గొప్పతనం అని చెప్పాడు!

తాలిబాన్ పధ్ధతిలో చేయి నరికారు కేరళలో!అఫ్ఘాన్ లో కొన్ని గ్రామాలలో తాలిబాన్ కు విరుధ్ధంగా ఇటీవల ఏర్పడిన విద్రోహాలలో పాలు పంచుకుంటున్న స్త్రీల ను చూసైనా కొంత సిగ్గు ఈ ప్రభుత్వం తెచ్చుకుంటుందేమోననే ఆశ లేదు!

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Sun, 07/25/2010 - 21:53

స్పెయిన్, పోర్చుగల్


Categories: Left

పడ్డ వాడు చెడ్డవాడు కాదు…

Sun, 07/25/2010 - 13:07

అమెరికాలో ఈ మధ్య జరిగిన ఒక సంఘటన నన్ను ఆలోచింపజేసింది.షర్లీ షెరాడ్ అనే ఒకావిడను (ఎగ్రికల్చర్ డిపార్ట్ మెంట్) ఒక బ్లాగ్ లో ఎడిట్ చేసిన వీడియో ద్వారా దుష్ప్రచారం చేసి పదవినుండి దింపటం. ..
ఈవిడ నల్ల జాతికి చెందిన ఆవిడ అవటం గమనార్హం.ఒక తెల్ల రైతును ఆదుకోకుండా అన్యాయం చేసినట్లు చెప్పటం జరిగింది. ఆ తరువాత ఆవిడ ఇచ్చిన స్పీచ్ యావత్తూ చూసిన తరువాత నిజానికి ఆవిడ అతని ఫార్మ్ ను కాపాడినదని తెలిసింది. ఆ తరువాత ఆవిడను వెనక్కి తీసుకున్నారు.(సదర్న్ కాపరేటివ్స్ లాండ్ అసిస్టెన్స్ ఫండ్ వ్యవహారం).

షర్లీ గారు వర్ణ వివక్ష నిజానికి సమస్య కాదు,ప్రస్తుతం ఉన్న సమస్య ఆర్థిక అసమానత అని చెప్పటం విశేషం.

అమెరికాలో పేదా గొప్పా మధ్య వ్యత్యాసం మన దేశంలో లాగానే పెరుగుతూ వస్తోంది.1988లో ‘లేనివారు ‘ 18% ఉండగా 2007లో 34% ఉన్నది.ఆదాయం అనేది అందరికంటే పైన ఉన్న వారికే గత కొన్ని దశాబ్దాలుగా  చేరుతూ రావటం శోచనీయం.

వాషింగ్టన్ పోస్ట్ లో మిషెల్ సింగిల్టరీ ఈ అంశాన్ని తీసుకుని అమెరికా ఆర్థిక పరిస్థితిని బాగా విశ్లేషించారు.సాంఘికపరమైన ప్రొపెన్సిటీ ఆర్థిక విధానాలతో ఎలా ముడిపడి ఉంటుందో అర్థమవుతుంది.

ఏ రంగాన్ని తీసుకున్నా ఉన్నవారి డామినేషన్ తప్ప మరొకటి కనిపించదు.రిసెషన్ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలన్నీ ఇలా దోహదపడినవే కానీ పేద, మధ్యతరగతి వర్గాలకు ఏమి జరిగిందని ఆవిడ ప్రశ్నిస్తున్నారు…

~~~***~~~
మన దేశంలోకూడా ఇదే జరుగుతున్నది. మధ్య తరగతి మానవుడు వెలిగి, ఆరి తిరిగి వెలిగి మరల అరగలదనిపించే వీధి దీపంలా పూర్తిగా వీధిన పడి యున్నాడు.చాలా మంది జీవించే స్టాండర్డ్ మారిందని చంకలు గుద్దుకున్నారు. అది నిజం కాదు.ఒక ఉద్యోగం ఊడినా, ఒక లోనూఅగినా చుక్కలు కనిపించేఆర్థిక శక్తి సరైనది కాదు.మార్కెట్ అటుగా పయనించ్టం వలన లక్సురీస్ అన్నీ అవసరాలుగా మారి ఉన్నాయి.ఆరోగ్యం విషయంలో,విద్య విషయంలో ఈ రెండు వర్గాల వారికీ ఉన్న ఇబ్బందులు అలనే ఉన్నాయి.నిరుద్యోగం రాబోయే కాలంలో తీవ్రమైన సమస్య కాగలదు…

షర్లీ గారి వ్యాఖ్య ఆలోచించవలసినది.ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఆవిడ  స్పందించారు.సామాన్యంగా ఇలా జరిగినప్పుడు తన వర్గం వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవచ్చు.రాజకీయంగా లబ్ధి కూడా పొంద్వచ్చు.అలా కాకుండా దేశంలో ఏది ఎందుకు జరుగుతోండొ అని వివరించి చెప్పగలగటం గొప్ప విషయం.సమస్యలు అందరికీ వస్తాయి. సమస్యను ఒక ప్రక్రియలోంచి పరిశీలించి ఒక దృక్పథానికి చేరుకోవటం ఎప్పుడైనా మంచి పధ్ధతి.సమస్య నుంచి  చెత్త వ్యవహారం చేసి (చేసుకుని) కొత్త సమస్యలను సృష్టించటం మన దేశం లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం…

వ్యక్తి పూజలు, వర్గ పూజలు,నన్ను మించిన తెలివిగలవాడు లేడనే ఆలోచనలు మనకు ఎక్కువ, మక్కువ కూడా!

~~~***~~~


Categories: Left

వరదలా పారే పేదరసం!

Sun, 07/25/2010 - 04:50

పంజాబ్ లో వరదల వలన గేస్ట్రో ఎంటరైటిస్  విపరీతంగా వ్యాపించిందని తెలుస్తోంది.
హీరా సింగ్ ఘబ్రియా అనే మంత్రిగారు ప్రజలను చూడటానికి వచ్చారు.అందరినీ కార్పొరేషన్ నీరు కాచి తాగమని చెబుతూనే ఆ టీం వారు మటుకు మినరల్ వాటర్ బాటిల్ లోంచే మంచి నీరు తాగుతూ వచ్చారు.
పంజాబ్ లోని వరద ప్రాంతాలలో మంచినీటిలోకి డ్రెయినేజి నీరు కలసిపోయిందని చెబుతున్నారు.ఇప్పటికి చాలా మంది ఈ వ్యాధి వలన ప్రాణాలు కోలుపోయారు…
ఈ పోస్టును నేను దాచి ఇరవై ఏండ్ల తరువాత కూడా ప్రచురించవచ్చు.(ఏ మార్పూ లేకుండా)
~~~***~~~
‘యహూదీ ‘ అనే ఒక చాలా పాత చిత్రం గుర్తుకొచ్చింది.అందులో చివరకు ఒక ముసలాయన రాజు గారిని అడుగుతాడు,’తుమ్హారా ఖూన్ ఖూన్ హై, హమారా ఖూన్ పానీ హై!’
‘మీలో ప్రవహించేది రక్తం, మాలోది నీరు!’
~~~***~~~


Categories: Left

శ్రీమద్రామాయణం -రాజధర్మం (కచ్చిద్సర్గ) (11)

Sun, 07/25/2010 - 04:14

Contd. from (10)…

శ్లో: కచ్చిత్ తే దయితా: సర్వే కృషి గోరక్షజీవిన:
వార్తాయాం సంశ్రితస్తాత లోకోయం సుఖమేధతే

కృషి, గోరక్షతో జీవితం సాగించే వారందరూ నీ ప్రీతిపాత్రులే కదా?కృషి, వ్యాపారం లో సంలగ్నమైనప్పుడే ఈ లోకం సుఖమయంగా, ఉన్నతశీలంగా ఉంటుంది.

శ్లో: తేషాం గుప్తిపరీహారై: కచ్చిత్ తే భరణం కృతం
రక్ష్యా హి రాఙ్ఞా ధర్మేణ సర్వే విషయవాసిన:

వారి అనిష్టమును నివారించి ఇష్టమైనది ఇస్చ్చి పోషించుచున్నావా?రాజుకు అన్ని వర్గాలవారినీ ధర్మానుసారంగా పాలించవలసి ఉంటుంది.

శ్లో: కచ్చిత్ స్త్రియ: సాంత్వయసే కచ్చిత్ తే సంతి ధేనుకా:
కచ్చిన్న గణికాశ్వానాం కుంజరాణాం చ తృప్యసి

గజములు ఉత్పన్నమగు అడవులు నీ అధీనంలో ఉన్నాయా?పాలిచ్చు గోవులు అధికంగా ఉన్నవి కదా? గజములు, గోవులు,అశ్వములు సమీకరించటంలో నీవు ఎన్నడూ సంతృప్తి చెందటం లేదు కదా?

శుభం భూయాత్!

To be contd…

~~~***~~~


Categories: Left

మౌనమె నీ భాష…

Sun, 07/25/2010 - 02:57

నేపథ్య గీతాలలో ఈ పాట ఎందరి నోట్లలోనో ఆడుతూ ఉంటుంది.అంతే కాదు.నేనేమీ మాట్లాడను అని చెప్పాలనుకున్నప్పుడు మిత్రులు చాలామంది చిన్నగా ‘మౌనమె నీ భాష…’అంటూ ఎత్తుకుంటారు!

బాలచందర్ గారి ‘గుప్పెడు మనసు ‘ చిత్రంలో ఒక్క సారిగా కథ యావత్తూ నిశ్శబ్దం లోకి వెళ్లినప్పుడు ,అందరి ఆలోచనలూ ఆగిపోయినప్పుడూ, మౌనాన్నీ, మనసునూ ముడి పెట్టి ఒక నేపథ్య గీతాన్ని ఎంచుకుని దర్శకుడు అద్భుతమైన ప్రక్రియను చూపిస్తాడు.ఆత్రేయ గారు ఆబ్స్ట్రాక్ట్ వస్తువుకు కాంక్రీట్ స్వరూపాన్ని ఇచ్చినట్లు నాకు తెలిసి ఎవరూ ఇవ్వలేదు!బాలమురళీ గారు సముద్రం వంటి గంభీరమైన కంఠంతో హావభావాలను ఊపేశారు.’ఊహల ఉయ్యాలవే…మాయల దయ్యానివే!’అనేది వారు పాడినట్లు పాడటం కష్టమే.ఆ వాక్యంలో ఉన్న వైపరీత్యాన్ని రాగయుక్తం గా తేల్చి ప్రదర్శించారాయన.

పాటలో ఎం.ఎస్.విశ్వనాథన్ గారు ఇచ్చిన ఇంటర్ల్యూడ్ సంగీతం మనసు వ్యవహారం-లేచి పడటం,భయపెట్టటం,అలలలా సగిపోవటం…ఈ విన్యాసాలన్నీ దాగి ఉన్నాయి.

ఆరభి రాగం లో మెళకువలు కొద్దిగా ఇలానే కనిపిస్తాయి.నిదానంగా వెళుతున్నట్లు ఉంటుంది, జలపాతంలా జారిపోతుంది.ఎంచుకున్న రాగం కూడా ఈ వ్యవహారానికి సరిపోయింది.

సాహిత్యం, సంగీతం,కథలోకి అల్లుకున్న పాట.దృశ్యం లేకుండా వింటున్నా పది సార్లు వినాలనిపిస్తుంది…

~~~***~~~


Categories: Left