http://srikaaram.wordpress.com/feed

Syndicate content శ్రీ-పదములు
Just another WordPress.com weblog
Updated: 20 min 37 sec ago

నేషనల్ కంపనీ లా ట్రిబ్యూనల్-దొరబాబులకు మరో రెఫ్యూజీ కాంప్!

Tue, 08/10/2010 - 00:13

క్రిందటి వారం సుప్రీం కోర్టు ప్రభుత్వానికి మరో వాత పెట్టింది. నేషనల్ కంపనీ లా ట్రైబ్యూనల్ ఏర్పాటులో గల తప్పులను వెలికి తీసి ఇలా కాదు ఇలా అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

సభ్యుల నియామకం ఈ ఐ.ఎ.ఎస్ బాఉలతో చేస్తే వారికి సరైన అర్హత ఉండదని తేల్చింది. నిజమే!. నిరంతరం లావా దేవీలు, దేవులాటలో కాలం గడిపే వీళ్లు కంపెనీ కార్పొరేట్ విషయాలలో సరిగ్గా అలాగే ఆలోచిస్తారు.నిజానికి వీళ్లు ట్రైబ్యూనల్ కు వచ్చేదే ఓ మూడేళ్లు పబ్బం గడుపుకోవటానికి! వీళ్లకి లీన్ కూడా ఉంటుందట! ఇవన్నీ కుదరవని సుప్రీం కోర్టు చెప్పింది.

ట్రైబ్యూనల్ అంటే హై కోర్టు స్థాయి ఉంటుంది. ఇందులో ఇలా డెప్యుటేషన్, రిటరయిన తరువాత మరో అయిదేండ్లు కూడా ప్రభుత్వాన్ని పీడించేందుకు వీలుగా ఈ ట్రైబ్యూనల్ ను వాడుకుందామని వీళ్లు ట్రైబ్యూనల్ ను తయారు చేసారు తప్ప ఇక్కడ చిత్త శుధ్ధి ఏమీ లేదు! 2002 లో వచ్చిన ఇన్సాల్వెన్సీ వ్యవహారానికి ఒక మేండ్మెంట్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచించకుండా ముందుకు వెళ్లిపోయింది. బాబుల పనితీరు అలా ఉంటుంది. వీళ్లు ట్రైబ్యూనల్ లో సభ్యులుగా చేరి కార్పొరేట్ వ్యవహారలలో న్యాయం చెబుతారుట!

ఈ దేశాన్ని నిలబేట్టి దోచుకున్న వాళ్లల్లో అగ్రగణ్యులు ఈ దొరబాబులు.  సివిల్ సర్వీసెస్ వారి మీద ప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్టు ఖర్చు ఆసియా ఖండం లోనే ఏ దేశం పెట్టదు.  వారి ఆదాయానికి ఈ వ్యవస్థ ఏర్పాటు చేసే విధానాలను పరిగణనలోకి తీసుకుంటే లెక్కలు వేయటానికి ఒక జీవితకాలం పడుతుంది.  వీళ్ల బంగళాలు, కార్లు, వీరి వెంట తిరిగే మనుషులు, వెట్టి చాకిరీ…ఇవి చూస్తేనే ప్రజలకు అసహ్యం వేస్తుంది.

‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ‘ లో నెహ్రూ గారు ప్రియదర్శినికి వ్రాసిన ఒక లేఖ గుర్తుకొస్తుంది. ఆయన అప్పటి రాజా మహరాజాల గురించి ప్రస్తావిస్తారు. వీళ్లు ఏ కాలం లో ఉన్నారో వారికే తెలియదు…, మోయలేని దుస్తులు వేసుకుని పార్టీలలోకి దూరుతారు. అందరినీ వింతగా చూస్తారు. అందరూ వారిని వింతగా చూస్తారు. ఎందుకో నవ్వుతారు…వీళ్లని పట్టించుకోవద్దు. వీళ్లు మనకే కాదు, వాళ్లకి వాళ్లే పెద్ద న్యూసెన్స్!…అన్నారాయన!

ఆధునిక సమాచార యుగంలో ఈ ‘వారసత్వపు ‘ రాజులు-మన సివిల్ సర్వీసెస్ వారు నాకు ఇలానే కనపడతారు. ఆ బుధ్ధులు పోవు…కనీసం చుట్టు ప్రక్కల చూసైనా వాళ్లని వారు గమనించరు.

వీళ్లు ఈ రోజు చుట్టూ ఉన్న అన్ని రంగాలనూ ఎంక్రోచ్ చేసిన కాక్రోచెస్.  తేడా ఏమిటంటే ఒక చక్కని చోటుకు వచ్చి ఈ పురుగు అటూ ఇటూ తిరుగుతుంది. చూసే వారికి చిరాకుగా ఉందని అది అనుకోదు. దాని నైజం అది!

~~~***~~~


Categories: Left

షిప్పులు ముద్దు పెట్టుకున్నాయి!

Sun, 08/08/2010 - 23:53

వినటానికి చిత్రంగా ఉంది.చిత్ర అనే షిప్ ఖలిజా అనే షిప్ తో ఢీకొని ముంబయి తీరంలో ఆయిల్ స్పిల్ చేసేసింది!

హైదరాబాదులో ఇంత ట్రాఫిక్ అడ్డదిడ్డంగా గల్లీలలోంచి అలా స్మూత్ గా వెళ్లిపోతూ ఉంటుంది. షిప్పులకు ఏమి పట్టింది? అంత సముద్రం పెట్టుకుని ఏనుగంత షిప్పును గుద్దటం ఏమిటో?

మన కోస్ట్ గార్డ్ పెద్దగా పని చేస్తున్నట్లు నేననుకోను. తాజ్ మహల్ హోటల్ లో జరిగిన అటాక్ లో ఇదే కోస్ట్ గార్డ్ వారు నిద్రపోతున్నట్లు తెలిసింది. తీవ్రవాదులు చక్కగా ఒకడిని చంపి చాలా దూరం వచ్చే వరకు కూడా ముంబయి వరకు సమాచారం చేరలేదుట!

ప్రపంచమంతా గందరగోళంగా ఉంది. చైనాలో లాంద్ స్లైడ్లు, రషియాలో ఫారెస్ట్ ఫైర్లు, ఫాగ్లు, అమెరికాలో అన్నీ సమస్యలే, పాకిస్తాన్ లో వరద భీభత్సం, మెక్సికో ఆయిల్ స్పిల్ ఇంకా అలానే ఉంది…ఇక్కడ షిప్పులు ముద్దు పెట్టుకోవటం ఏమిటో!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~


Categories: Left

మన ఐ.ఐ.టీలు ప్రపంచ స్థాయిలో లేవా?

Sun, 08/08/2010 - 07:18

ఉపరాష్ట్రపతి అహ్మద్ అన్సారీ గారు ఐ.ఐ.టి ఢిల్లీ 41 వ స్నాతకోత్సవంలో పాల్గొని కొన్ని విషయాల పట్ల విచారం వ్యక్తపరచారు.

ప్రపంచంలోని ఇంజినీయరింగు బోధన సంస్థలలో 100 రాంకులలో మన ఐ.ఐ.టీలు లేకపోవటం బాధ కలిగిస్తోందన్నారు.ఐ.ఐ.టిలలో చదువుకున్న వారిలో ఒక శాతం కంటే తక్కువ మంది మాస్టర్స్ చేసి తిరిగి బోధన వైపు ఆలోచించటం ఈ రోజు ఒక సమస్య.ప్రచురణలు,సైటేషన్లు ,పేటెంట్ల గ్రేడింగు విషయంలో టైంస్ వారి 50 పేర్లలో ఐ.ఐ.టి ముంబై, ఢిల్లీ కనిపిస్తాయి.
~~~***~~~
ఇటీవల ఒక కుర్రాడు ఐ.ఐ.టి చెన్నై లో భర్తీ అవుతూ సివిల్ ఇంజనియరింగు కోరితే ప్రొఫెసర్లు పిలచి నాయనా,మా దగ్గర ఇందులో పాఠం చెప్పే వారు లేరు, దయ చేసి మరొకటి తీసుకోమన్నారు!

భారతీయులకు వేలం వెర్రి అనేది వెన్నతో పెట్టిన విద్య!ఎందుకు పరుగు తీస్తారో తెలియదు. అందరూ ఒక వైపే ఒకే సారి పరుగు తీస్తారు!చాలా కాలం క్రితం ఐర్ లాండ్ వారు సాఫ్ట్ వేర్ ఒక్కటే కాకుండా మిగతా సబ్జక్ట్స్ కు సమానమైన ప్రాధాన్యత ఇవ్వటం వైపు దృష్టి సారించి మంచి ఫలితాలు పొందారు.మన దగ్గర ఐ.ఐ.ఎస్. సి లాంటి చోట ఎయిరోస్పేస్ ఇంజనియరింగులో ఎం.టెక్ చేసిన వారు కూడా సాఫ్ట్ వేర్ కు మారిపోయి మందలో కలసిపోతారు.ఇస్రో శ్రీహరికోటలో ఒక సారి ఇద్దరు ఐ.ఐ.టీ చెన్నయి కుర్రాళ్లతో మాట్లాడాను.మేము వెళ్లిపోతున్నాం అన్నారు వారు!కారణం మన ప్రభుత్వ సంస్థలలో ఒక ఎన్లైటెండ్ వ్యవహారం ఉండదు.మంచి పని , కాదు, పని చేసిన వాడు, ఊరంతా తిరిగి వచ్చిన వాడు ఒకే జీతం తీసుకోవటం,అర్థం లేని ఎచ్.ఆర్ వ్యవస్థ,నీచమైన రాజకీయాలు…ఇవన్నీ విసుగు పుట్టిస్తాయి.

ఐ.ఐ.టీల దగ్గరకు వస్తే మరొకటి ఉంది.రిసర్చ్ లోకి ఎవరూ రావటం లేదు అంటే ఈ ప్రొఫెసర్లు మామూలుగా ఉన్నారా? మొదటిది వీరికి సరైన అకౌంటెబిలిటీ లేదు. కళ్లు నెత్తిన ఉంటాయి.విద్యార్థుల చేత నానా పనులు చేయించుకోవటం, ఇతర సంస్థలలో ఆనరరీ పనులకు పరుగులు తీయటం…కొన్ని సందర్భాలలో అమ్మాయిలను వేధించటం కూడా చూసాం. ఒకళ్లనొకళ్లు ఆడిపోసుకోవటం, లాబీయింగు,చెత్తా చెదారం కావలసినంత ఈ సంస్థలలో ఉన్నది…

కలాం గారు చెప్పినట్లు కలెక్టివ్ ప్రైడ్ -మన దేశం ప్రతిభ పట్ల సమానమైన అభిమానం అందరికీ ఎప్పుడొస్తుందో ఆలోచిస్తే చిన్నగా నవ్వొస్తుంది! కేవలం కీర్తి కాంక్ష!ఇది మన దేశంలో అన్ని రంగాలను పీడించినట్లు ఏ దేశంలోనూ పీడించలేదు. కారణం సింపుల్. దేశం యొక్క కీర్తి లోనే మన కీర్తి అనుకునే వారు ఎందరు…

షేర్డ్ వేల్యూస్ గురించి చెప్పటం తేలికే!

అవి ఈ రోజు రమ్మంటే రావు.ఎల్.కె.జీలో భర్తీ చేస్తూ చుక్కలని చూపించి అదుగో నువ్వు చుక్కా రామయ్య వైపు వెళ్లాలి అని చెప్పే తల్లి దండ్రులు,అబ్బాయి,నువ్వు ఇలా అయితే అమెరికా ఎలా వెళతావురా? అనే వారు…ఒక్క సారి అభివృధ్ధి చెందుతున్న దేశాల వైపు చూసి ఆలోచించాలి. అక్కడా సమస్యలున్నాయి.పారిపోతున్నారా?

సమాజానికి ఉపయోగపడే విషయాలు, సబ్జక్ట్స్ ఎన్ని లేవు? భౌతిక శాస్త్రం గొడ్డు పోయిందా? భాషలు, లిటరేచర్ లేకుండానే ఈ సంస్కృతి ఈ రోజు ఇలా నిలబడిందా?మేథమేటిక్స్ లో పరిశోధన వద్దా? మానసిక శాస్త్రం ఉపయోగపడదా?పాడీ పంటా అక్కరలేదా?విద్యుత్తు రంగం అణుశక్తి రంగం…రసాయనాలు,వీటికి సమాజంలో పాత్ర లేదా?

~~~***~~~


Categories: Left

మీ పిల్లల స్కూల్లో పెస్టిసైడ్లు వాడుతున్నారా?

Sat, 08/07/2010 - 23:18

కొద్దిగా పర్యావరణం లోకి వెళదాం…

సామాన్యంగా స్కూళ్లల్లో పెస్టిసైడ్లు లాన్లలో, గార్డెన్లలో వాడటం వలన పిల్లలకు కొన్ని జబ్బులు రావచ్చని చెబుతున్నారు:

1.ఆస్థమా
2.అటెన్షన్ డెఫిసిట్ లేదా హైపర్ ఏక్టివిటీ
3. ఆటిసం
4. బ్రెస్ట్ కాన్సర్ (టీనేజ్ లో)
5. డైయాబిటిస్
6. లుకేమియా
7. ఒబెసిటీ
8. శరీరాంగాల లోపాలు

పెస్టిసైడ్ల బదులు మొక్కలకు, లాన్లలోనూ ఏది వాడాలి,ఎలా వాడాలి అనే విషయాలు http://www.earthshare.org/pesticides-toxins-in-the-classroom.html లో వివరంగా తెలుసుసుకోవటం మంచిది

~~~***~~~


Categories: Left

ఇది ఏ ఊరు? ఏ దేశం?

Sat, 08/07/2010 - 11:43


Categories: Left

ఫొటో జవాబు

Sat, 08/07/2010 - 11:23

ముంబయి మెట్రో ఇంజిన్


Categories: Left

ప్రధాన న్యాయమూర్తి గారు ప్రభుత్వం మీద ఆగ్రహించారు!

Sat, 08/07/2010 - 02:42

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియా గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల తప్పు పట్టారు.సి.ఆర్.పి.సి సెక్షన్ 24 ప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే ముందు  న్యాయమూర్తితో సంప్రదింపులు అనివార్యం అయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా ఆ పధ్ధతికి ప్రభుత్వం వారు స్వస్తి చెప్పటం మనం చూసాం.ఇది ఎవరి చర్య అని మనం ఆలోచించక్కరలేదు.ప్రభుత్వం లో కాలు జాపుకుని పడుకున్న ఐ.ఎ.ఎస్ దొరబాబులు వారి ప్రయోజనాల కోసం దేనికైనా తెగించగలరు.న్యాయమూర్తిగారి మాట లో జ్యూరిస్ప్రుడెన్స్ ఉంది.’మొన్నటి వరకు మంచి ప్రాసిక్యూటర్లు ఉండే వారు…’అన్నారు.అంటే ఖచ్చితంగా ఆయన ఇప్పటి పి.పీల పట్ల సంతృప్తితో లేరనేగా?

ఈ మధ్య మన రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారానికి వద్దాం.ఆంటీ కరప్షన్ బ్యూరో వారు ఏదైనా కేసు లో అరెస్ట్ చేస్తే నాన్ బెయిలిబిల్ గా వ్యవహరించి ఆ వ్యక్తిని రిమాండ్ లో పెట్టి కొంత ‘కథ ‘ జరిగిన తరువాత బెయిల్ ఇవ్వటం జరుగుతున్నది.ఇలా కాదు,నోటీస్ జారీ చేసి గడువు ఇచ్చిన తరువాత అవసరం అనిపిస్తే అరెస్ట్ చేయాలని క్రింద కోర్టులో ఉత్తర్వు తెచ్చుకున్నారు. (చాలా కేసులలో కేవలం ఒక ఇంటిలో డబ్బు దొరికిందని తిన్నగా అరెస్ట్ చేసే వ్యవహారం కూడా ఉంది).న్యాయవాదులంతా ఎన్.జి.ఓల మాధ్యమం వాడుకుని హై కోర్టులో స్టే తెప్పించారు.ఈ రోజు పి.పి, ఆయన చుట్టూ ఉండే వర్గం,పోలీసులు,ఇతర న్యాయవాదులు కలసి ఈ ఎ.సి.బి కేసులలో కుమ్ముకుంటున్నది సామాన్యమైన డబ్బు కాదు…ఈ వివరాలకు తరువాత వద్దాం…

ప్రధాన న్యాయమూర్తిగారు పి.పీల వ్యవహారం లో చేసిన వ్యాఖ్య ఆలోచించతగ్గది!

పోలీసే కాదు,న్యాయ వ్యవస్థ కూడా ఎంత అవినీతితో కూడినదో ‘ప్రధానంగా ‘ఒప్పుకోవటం జరిగింది.స్వాతంత్ర్యం తరువాత జన్మించిన మొదటి ప్రధాన న్యాయమూర్తి గారిని ఇలా స్వతంత్రంగా, సూటిగా వ్యవహరించినందుకు అభినందిస్తున్నాను!

~~~***~~~


Categories: Left

పాకిస్తాన్ లో వరదలు,తోడుగా కశ్మీర్ దురదలు!

Fri, 08/06/2010 - 12:59

పాకిస్తాన్ లో గత 80 ఏండ్లలో లేని వరద భీభత్సం చూస్తున్నాం.ఇప్పటికే 1600 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు,40 లక్షల మంది వీధిన పడ్డారని తెలుస్తోంది.ప్రభుత్వం చేయగలిగింది చేస్తోంది.బాధితుల పట్ల అందరికీ సానుభూతి కలుగుతూనే ఉంది…

దాని దారి దానిదే!పాకిస్తాన్ పార్లమెంటరీ పానల్ ఒకటి ఒక తీర్మానం చేసింది! అదేమిటంటే కశ్మీర్ లోని ప్రజలకు స్వావలంబన  మార్గం భారత్ సుగమం చేయాలిట!అక్కడి ప్రజలకు పాకిస్తాన్ పూర్తి మద్దతు ఇస్తుందట!

ఇంగ్లండ్ ప్రధాని డేవిడ్ కామరోన్ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఉసి గొల్పుతున్నదని చేసిన వ్యాఖ్యలను ఈ పానల్ ఖండిస్తూ బ్రిటన్ వారు కశ్మీర్ కు ఇప్పుడైనా స్వాతంత్ర్యం ఇప్పించాలన్నారు-ఈ సమస్య భారత్ పాక్ పార్టిషన్ సమయం నుంచీ  అలా వారు వదిలేసారుట!

మార్క్ ట్వెయిన్ ఒక మాట అంటాడు-You have struck the loftiest peak of stupidity which human effort ever assailed!

~~~***~~~


Categories: Left

సోషల్ సెక్యూరిటీ…మనం ఎక్కడున్నాం?

Fri, 08/06/2010 - 12:36

రైల్లో డోర్ దగ్గర కుర్రాళ్లు నిలబడో లేదా ఒక్కో సారి కూర్చునో ప్రయాణం చేస్తూ ఉంటారు.అప్పుడప్పుడు వాళ్లనిఏదైనా  అడుగుతూ ఉంటాను.అలాగే ఒకబ్బాయిని అడిగాను,
‘ఏ ఊరు వెళ్లాలి బాబూ?’
‘ఏ ఊరు వెళ్లమంటారు?’
‘టికెట్ లేదా?’
అతను నవ్వాడు.’అందరూ ఇలాగే అడుగుతారు.టికెట్ ఉంది.ఒక ఊళ్లో దిగాలని లేదు.’
‘చదువుతున్నావా? ఉద్యోగమా…’
‘రెండూ లేవు.అన్నీ మాయం.’
కొద్దిగా బండీ తోపుకు అతని చేయి పట్టుకున్నాను.
‘భయపడకండి.నేను దూకేందుకు ఇక్కడ నిలబడలేదు.’
‘…’
‘అలా ఆ అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ చీకటిని ఆహ్వానిస్తాను.’
‘ఎందుకలా?’
‘మరో రోజు గడచిపోయింది…ఈ బండీ నా బ్రతుకు నుంచి నన్ను దూరంగా పరిగెట్టిస్తూ ఉంటుంది…’
నిజమే! సామాజిక భద్రత లేనప్పుడు ఎంత ప్రతిభ ఉండి ఏమి లాభం?

~~~***~~~

‘చైనా డెయిలీ ‘లో యు జియన్ రాంగ్ ఒక ఆలోచించవలసిన అంశాన్ని చూపించారు.ముప్పయి ఏండ్ల రిఫారంస్ తరువాత చైనాలోని యువత ఈ రోజు రెండుగా చీలి ఉన్నది.మొదటిది తండ్రి సంపాదన మీద ఆధారపడి ఉన్న వారు, రెండు పల్లెల నుండి వలస వచ్చి ఉద్యోగాలు లేకుండా ‘ఆంట్ ట్రైబ్స్ ‘ అనిపించుకునే వారు. వీరు ‘కోపోద్రిక్తులుగా ‘మారుతున్నారు.ఇది చైనాకు ఈ రోజు పెద్ద సమస్య.బాగా చదువుకోని యువత ఒక సమస్యగా  మారింది.చైనా గురించి చాలా గొప్పగా మనం వింటూ ఉంటాం.అక్కడ సమస్యలు లేవని కాదు.చైనాలో రాజకీయ, సార్వజనిక శక్తి చాలా కొద్ది మందిలో కేంద్రీకృతమయి ఉండటం వలన నివురు గప్పిన నిప్పులాగా చిచ్చు రగులుకుంటున్నది.ఈ వర్గం వారి జీవితాలను ఆ దేశంలోని ప్రశాసనం వారు గుర్తించి జాగ్రత్తగా పరిశీలించి ప్రణాలికలను తయారు చేయకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఉండగలవని ఈ వ్యాసం లో  పేర్కొనటం జరిగింది…

~~~***~~~

చైనా నుంచి మన దేశానికి వద్దాం.ఇక్కడ సమస్య ఇంకా గంభీరమైనది.వ్యవస్థీకృతమైన శ్రామికులు 7 % ఉండగా 93 % అస్తవ్యస్తంగా ఉన్నారు.భూమి లేని వ్యవసాయ కూలీలు 10 కోట్లు,ఇతర వ్యవసాయ కూలీలు 13 కోట్లు,వ్యవస్థీకృతం కాని సెక్టర్ లో కేవలం తిండి కోసం ఏదైనా పని చేసుకునే వారు 36 కోట్ల మంది ఉన్నారు.(ఇది  వరల్డ్ బాంకు వారి వివరం).
వీరిలో తక్కువ అక్షరస్యత,దారిద్ర్యం,పట్టణాలకు వలస వెళ్లు వారు,దేశం నలు మూలలా తిరుగు వారు ఎక్కువ.

సర్వీసెస్ సెక్టర్ లో ప్రయోగాలు చేయవలసియున్నదని దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రపంచ బ్యాంకు,ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పి యున్నారు.మైక్రో ఫైనాన్స్ వడ్డీ రేటు చివరకు 36% తేలిందని ఒక అంచనా!

బాగా యోచిస్తే బోధన-ట్రెయినింగు అనే ప్రక్రియలో గణనీయమైన మార్పులు రాకపోతే తీవ్రంగా నష్టపోగలం.డాక్టర్ రెడ్డీ ఫౌండేషన్ వారు ఈ దిశగా చాలా మంచి పనులు చేపట్టారు. ఇతర కార్పొరేట్ సంస్థల వారు ముందుకు రావలసి యున్నది.

కొన్ని భీమా ప్రణాలికలు చేపట్టినా ఈ దిశగా ప్రభుత్వం పెద్దగా యోచించకపోవటం విచారకరం.దేశం లో ఉన్న ఆర్థిక విధానాలలో ఈ అంశం సమాయుక్తం కాకపోవటం మరో సమస్య.మన దేశంలో ప్రస్తుతం పండే కూరగాయలు,పండ్లలో 40% వృధాగా పోతున్నాయని తెలుస్తోంది!దీనినే ఆర్థిక, సామాజిక ట్రాప్ అని చెప్పవచ్చు…

ఆహార వ్యుత్పత్తి విషయంలో తొలి సారి ఒక విప్లవాత్మకమైన వార్త విన్నాం.ముకేశ్ అంబానీ గారు ప్రభుత్వంతో చేతులు కలిపి పని మొదలు పెట్టనున్నారు.కార్పొరేట్ వారు వారు ప్రారంభించనున్న బృహత్ కార్యంలో ఈ అస్తవ్యస్తంగా తిరుగుతున్న యువతను ఒక పరిధిలోకి  తెచ్చి ఒక సక్రియమైన భాగస్వామ్యాన్ని ఇస్తారని ఆశించటమే కాదు, అలా చేయాలని ఒక సూచన కూడా చేయదలచాను.

పేదా గొప్పా తారతమ్యాలు తప్పవు.అవి సమాజంలో యువత అనే ప్లాట్ ఫారం మీద ఎదురు బదురు నిలబడి నువ్వా నేనా అనుకునే పరిస్థితి రాకూడదు.యువత దేశం  నిర్మాణం లో సమయాన్ని కలసి వెచ్చించగలిగే ఒక సందర్భాన్ని మనం సృష్టించాల్సి ఉన్నది.

~~~***~~~


Categories: Left

చిగురులు వేసిన కలలన్నీ…

Fri, 08/06/2010 - 07:38

ఈ పాట విన్నప్పుడల్లా గుండెలో ఏదో గుబులు. ఎందుకో తెలియదు. చిన్నతనంలో మా ఎదురింటి లోంచి మర్ఫీ రేడియో మ్రోగటం, మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమం, మధురమంజరి అనే పాటల ప్రొగ్రాం ఇలా అన్నీ గతస్మృతులు దొరలిపోతాయి…

నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే!  నారాయణరెడ్డిగారి మాటలు, సాలూరి వారి సంగీతం, కళ్యాణి రాగం, కె.బి.కె. మోహన్ రాజు గారి మొదటి సినీ గీతం,సుశీల గళం అన్నీ ఈ యుగళం లో కలసిపోతాయి. ఒక ఫొటో ఆల్బం లోకి తొంగి చూసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో మన వాళ్లని చూసుకుని తెలియకుండానే జారిపోయిన కన్నీరులా ఈ పాట విన్నప్పుడల్లా స్వగృహా ఫుడ్ బదులు స్వగృహం లోని మధురమైన వంటకాన్ని చవి చూసిన అనుభూతి కలుగుతుంది.

(చిత్రం: పూలరంగడు)


Categories: Left

వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ఇస్లామిక్ సెంటర్ ఆలోచన సబబా?

Fri, 08/06/2010 - 05:21

గ్రౌండ్ జిరో దగ్గర ఒక ఇస్లామిక్ సెంటర్ (మసీదుతో సహా) కట్టాలని యోచించిన అబ్దుల్ రౌఫ్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి.

కోర్డోబా ఇనిషియేటివ్ వాడుతున్న పేరు ‘దావా ‘ కూడా వివాదానికి దూరంగా లేదు.ఇది సూటిగా జిహాద్ కు సంబంధించినదని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇస్లాం గురించి వచ్చే తప్పు మాటలను ఈ ఇస్లామిక్ సెంటర్ ఖండిస్తూ ఉంటుందని వీరు చెబుతున్నారు…వినటానికి చిత్రంగా ఉంది.
చాలా మంది రిపబ్లికన్లు వేలాదిలో హతమైన చోట ఆ గుర్తులను ఈ రూపంలో తాజాకరించటం సరైన పని కాదని భావిస్తున్నారు.ఈ విషయంలో ఆంటీ దిఫమేషన్ లీగ్ వారు కొద్దిగా ఆలోచింపచేసే విధంగా స్పందించారు-’ ఇట్ ఈస్ నాట్ ఎ క్వష్చన్ ఆఫ్  రైత్స్ బట్ అబవుట్ వాట్ ఈస్ రైట్…’(ఇది హక్కుల వ్యవహారం కాదు.ఔచిత్యం గురించి ఆలోచించాలి) వాళ్ల మాటలో చెప్పాలంటే అక్కడ ప్రాణాలు కోలుపోయినవారి బాధిత కుటుంబాలకు, వ్యక్తులకు తిరిగి బాధ కలిగించే చర్య ఇది.ఇది అవసరమా? అని వారు అడుగుతున్నారు!

నిజమే!

~~~***~~~
ఇమాం ఫైసల్ అబ్దుల్ రౌఫ్ (పైన ఫొటోలోని వ్యక్తి) గతంలో ఇస్లామిక్ ‘దావా ‘,షరియత్ అమెరికా రాజ్యాంగాన్ని పడగొట్టాలని పేర్కొనటం జరిగింది.

‘దావా ‘అనేది ‘జిహాద్ ‘ కంటే ప్రాచీనమిన అంశం అని తెలుస్తున్నది.దీని అర్థం ఇస్లాం కు ఆహ్వానం.ఇస్లామిక్ విషయాలను అధ్యయనం చేసే రాబర్ట్ స్పెన్సర్ దీనికి ఒక వివరం ఇస్తున్నారు.నమ్మకం లేని వారిని మతం  అనే మార్గం మీదకి తీసుకుని రావటం దావా అని అర్థమవుతోంది.అలా రాని వారిని ‘జిహాద్ ‘అంటే ఒక అంతర్యుధ్ధం చేసి సన్మార్గ్మ్ మీదకు తేవలసి యున్నది.ఇది ధార్మికమైన, తాత్వికమైన విషయం.ఆ పదాలను పెడ దారి పట్టించి ఇస్లామిక్ చట్టాలను,లేదా షరియత్ ను రాజకీయపరంగా ప్రజల మీద రుద్దే ప్రక్రియలు సాగుతున్నాయని వారు చెబుతున్నారు.

ఈ ఇస్లామిక్ సెంటర్ వెనుక ఉన్న వ్యక్తి 2001 లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఘాతుకం సమయంలో ఈ రెండు పదాలూ ఉపయోగించి అమెరికాలో షరియత్ రావాలన్నట్లు చెప్పటం ప్రజలు ఇంకా మరచిపోలేదు!

ఇస్లాంలో ఒకధార్మిక విప్లవం రావలసిన అవసరం ఉన్నది.ఇంకొకరి చోటులోకి వెళ్లి దురాక్రమణలు చేసే కాలం చరిత్రలో జరిగిపోయింది.నాగరికత మరో దారిలో పయనిస్తోంది.

ఎన్ని కబుర్లు చెప్పినా అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న అరాచకానికి ఈ కట్టబోయే ఇస్లామిక్ సెంటర్ ఒక దౌర్జన్యపు గుర్తుగానే కనిపిస్తుంది కానీ మరొకటి కాదు.ఈ పనిని అన్ని విధాలా అడ్డుకోవలసిన అవస్రం ఉన్నది…

ఇస్లాం కు, మహమ్మదీయులకు ఇప్పుడు కావలసినవి రాతికట్టడాలు కావు.ఆత్మశోధన ద్వారా ప్రస్తుత సమాజానికీ, వారి మతానికీ,వారు నిజంగా నమ్మే ధర్మానికి మధ్య ఎక్కడో తెగుతున్న సంబంధాన్ని పునర్వ్యవస్థీకరించటం వారి కర్తవ్యం.నలుగురూ పూనుకుని ఈ దావా, జిహాద్ లూ ఒక అంతర్యుధ్ధం-ఆత్మ పరిశోధన  ద్వారా చేసి నిజాన్ని చాటాలి…

ఎంతో చిత్తశుధ్ధి ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు!

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Fri, 08/06/2010 - 03:06

స్పెయిన్, ఫ్రాన్స్


Categories: Left

ఫొటో జవాబు

Tue, 08/03/2010 - 11:56

సవర్ సాప్ ఫ్రూట్…గ్రవియోలా చెట్టు నుంచి వచ్చునది. ఇది కెమొతెరెపీ కంటే చాలా ప్రభావవంతమైన మందు అని , కెమొతెరెపీ లాగా మంచి సెల్స్ ను చంపదని, కాన్సరస్ సెల్స్ ను నిర్మూలించటంలో ఉపయోగపడుతుందని వార్తలున్నాయి.ఇది నిజమా కాదా అని చర్చించే బదులు విజయవంతంగా సాగని కెమొతెరెపీ ముందు ప్రయోగించి చూడటంలో అభ్యంతరం ఏమిటో తెలియదు.మనిషి తత్వం చిత్రమైనది.ప్రాణాలు గుప్పెట్లోకి వచ్చినప్పుడు మరోలా వ్యవహరిస్తాడు.పరిశోధనలన్నీ ఊహల నుండి సాగునప్పుడు మానవాళికి ఉపయోగపడే విషయాన్ని శోధించటంలో నిజమైన విఙ్ఞాం ఉంది కానీ తర్కం పేరుతో కనిపించిన ప్రతిదానినీ తోసేయటం  వలన ప్రయోజనం ఏమిటో తెలియదు.హైపొతెసిస్ -ఒక ఊహ నుంచే సమస్త శోధన ప్రారంభమవుతుంది.ఏది శోధనకు పనికి రాగలదో ఏది పూర్తి గుడ్డి నమ్మకమో విచక్షణతో నిర్ణయించగలగటం మంచి లక్షణం.వినాయకుడు పలు త్రాగాడు అనగానే అందరం నవ్వుకున్నాం.జనమంతా చెంచాలూ, కెపిలరీ సిధ్ధాంతాలు గురించి మాట్లాడుకున్నాం. కొందరు కొద్ది సేపు ఇవన్నీ ఆపి ఆ రోజే అటువంటి విషయం చర్చలోకి చాలా ప్రాంతాలలో ఎందుకు వచ్చింది అని శోధించటం ప్రారంభించారు.ఏదో సత్యాన్ని కనుక్కోవటం కోసం కాదు.ఇటువంటి ప్రక్రియలను ఒక ఫ్రేం లో పెట్టి భవిష్యత్తు లో ఇతర విశ్లేషణలకు ఉపయోగించే ఆలోచన వారికి కలిగింది.ఆ సమయం లో ఇండియా టుడే లో సగటు మానవుల తొందరపాటు మాటలకు, నమ్మకాలకు దీటుగా వ్రాస్తూనే మరో ప్రక్క ఇటువంటివి కూడా వైఙ్ఞానికంగా పరిశోధనకు ఎలా ఉపయోగపడతాయన్నది వ్రాయటం జరిగింది.

Art is a lie which reveals the truth…


Categories: Left

బిహార్ లో రోజుకో బ్రిడ్జ్!

Mon, 08/02/2010 - 12:21

బిహార్ ఈ రోజు మన దేశంలో అందరికంటే వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం-16.59% అభివృధ్ధి క్రిందటి ఫిస్కల్ సంవత్సరానికి చూపింది.నవంబర్ 2005 నుండి దాదాపు రోజుకొక బ్రిడ్జ్ ఈ రాష్ట్రంలో కట్టటం ప్రారంభించారు.గత నాలుగున్నర సంవత్సరాలలో 2100 వంతెనలు కట్టటం సామాన్యమైన పని కాదు.నాలుగు దశాబ్దాలుగా జరగనిది నాలుగు ఏండ్లలో జరిగింది.

బిహార్ రాహ్ట్ర పుల్ నిర్మాణ్ నిగం 2004-05 లో 42.62 కోట్ల టర్న్ ఓవర్ చూపగా నితిశ్ కుమార్ హయాం లో 2008-09 సంవత్సరానికి 858 కోట్ల టర్న్ ఓవర్ చూపించింది.

దాదాపు రెండు డజన్ల నదులు పారే ఈ రాష్ట్రానికి ఇది ఒక గొప్ప ఉద్యమం.ముఖ్యంగా గంగా నది పడమర నుండి తూర్పుకు దాదాపు 475 కిలోమీటర్లు సాగుతూ రాష్ట్రాన్ని విభజించటం విశేషం.ఈ నది మీద సాగు ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం నితీశ్ ప్రభుత్వం మంచి ప్రణాలికల ద్వారా చేపట్టింది.

ఇలాంటి కనెక్టివిటీ ఆర్థికాభివృధ్ధికి మంచి స్ఫూర్తి.ఈ రాష్ట్రం నుంచి ఈ వార్త వినటం నిజంగా గొప్ప విషయం.ఆరు రోజులలో చైనాలో ఒక పవర్ ప్లాంట్ తయారవుతుందని ఇటీవల విన్నాం.ఇది కూడా సామాన్యమైన విషయం కాదు.నితీశ్ గారికి అభినందనలు.

‘It’s not by regretting what is irreparable that true work is to be done, but by making the best of what we are. It is not by complaining that we have not the right tools,but using well the tools we have.What we are ,and where we are,is God’s providential arrangement-God’s doing…the manly and the wise way is to look your disadvantages in the face, and see what can be made of them.’ ~ Frederick W. Robertson

~~~***~~~


Categories: Left

ఆగస్ట్ 2010 రాశి ఫలాలు

Mon, 08/02/2010 - 01:08

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

మేష రాశి: అసంతృప్తి నుండి బయట పడతారు.మాసం మధ్యలో దూరప్రయాణం సంభవం. మాసం చివర కొత్త పనులు చేపట్టగలరు.మీకంటే చిన్నవారి ఆరోగ్యం ఆలోచింపచేస్తుంది.పెద్దలు సహకరిస్తారు.పుకార్లను నమ్మటం మంచిది కాదు.అలసట వలన తొందరపాటు ఆలోచనలకు గురి కాగలరు. ఈ మాసం మంచి ఫలితాలను ఇవ్వగలదు.కలసి వచ్చే సంఖ్యలు 1,11.

వృషభ రాశి: అదృష్టం కలసివచ్చే మాసం.ఇంటిలో సౌఖ్యం బాగుండగలదు.కుటుంబ సభ్యుల పురోగతి బాగుంటుంది. గతంలో వ్రాసిన ఒక డాక్యుమెంట్ చర్చలోకి రాగలదు.మీరు సాధించదలచుకున్నది మంచిదైనప్పటికీ దానికి అవలంబిస్తున్న మార్గం సరైనది కాకపోవచ్చు.పధ్ధతి  మర్చవలసిన అవసరం ఉన్నది. విద్యార్థులు రాణిస్తారు.చుక్కెదురు అనుకున్న వారు మాట కలుపుతారు.కొన్ని సందర్భాలలో తొందర పడతారు.పలుకుబడిగల మిత్రులు సహాయం చేస్తారు.ఈ మాసం కలసి వచ్చే అంకెలు 7,12.

మిఠున రాశి:  దైవీకమైన అనుభవాలు ఆలోచింపజేస్తాయి.ఉద్యోగంలో రాణిస్తారు.ఆరోగ్యం బాగుంటుంది.ఇంటిలోని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించగలవు.భాగస్వాములతో విభేదాలు తగ్గగలవు.కొత్త పనులు చేపడతారు.కొందరు రాజీ పడటానికి వస్తారు.పిల్లలు పోటీలలో మంచి ఫలితాలు పొందుతారు. మాసం పూర్వార్థంలో పెట్టుబడులు రాణించగలవు.రాజకీయలలో ఉన్న వారు వారి మీద వారికి తెలియకుండా జరుగుతున్న పర్యవేక్షణల పట్ల జాగ్రత్త వహించాలి. దుర్గా సప్తశ్లోకి చదవండి. ఈ మాసం మంచి సంఖ్యలు 5,10.

కర్కాటక రాశి: అజీర్ణం వలన కొంత ఇబ్బంది పడగలరు.రావలసిన సమాచారం అందగలదు.సత్కర్మలందు ఆసక్తి కలుగుతుంది.బంధువుల రాక ఉండవచ్చు.ఒక అనుకోని సంఘటన ఎదురవ్వగలదు.చివరకు మంచే జరుగుతుంది.డబ్బు విషయంలో జాగ్రత్త వహించాలి.ఒకరికి సహాయం చేయలేకపోయినందుకు విచారిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలున్నాయి.ఒక రంగాన్నే ఎంచుకున్న వారికి కొంత నిరాశ ఎదురు కాగలదు.విష్ణు సహస్రనామం చదవండి.మంచి సంఖ్యలు 2,12.

సింహ రాశి: ప్రభుత్వోద్యోగులకు,విద్యా రంగంలో ఉన్న వారికి మంచి మాసం.వ్యాపారులకు కొత్త వస్తువులతో నూతన అవకాశాలు రాగలవు. సన్నిహితులతో ఒక వివాదం ఏర్పడగలదు.మనసు నొప్పించే మాటలకు దూరంగా ఉండాలి.వ్యంగ్యం ససేమిరా పనికిరాదు.ఖర్చులు బాగానే ఉన్నా ఆదాయం కూడా బాగానే ఉంది.మాసం  మధ్యలో ఒక ఒప్పందానికి రాగలరు.ఇంటి విషయంలో ఖర్చు చేస్తారు.కొంత లాభాపేక్ష తగ్గిస్తే దీర్ఘకాలీనమైన లాభాలుండగలవు. ఈ మాసం  మంచి సంఖ్యలు 9,19.

కన్య రాశి: అనుకున్న చోటుకు బదిలీ కాగలదు.మీ ప్రతిభ మెప్పు పొందుతుంది.మీరు తలపెట్టిన సరికొత్త కార్యక్రమం విజయవంతమవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.జమా ఖర్చులు ఒక్క సారి సరి చూసుకోవలసిన మాసం.కొత్త దంపతులకు కుటుంబ సౌఖ్యం,సంతాన లాభం ఉండగలదు.వ్యవసాయ రంగం లోని వారికి అభివృధ్ధి బాగుంది.   జీవితభాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాలి. శ్రీసూక్తం చదవండి.మంచి సంఖ్యలు 6,14.

తుల రాశి: స్థానచలనం ఉండగలదు.స్త్రీలకు  ప్ర్త్యేకమైన లాభదాయక మాసం. రాజకీయాలలోని వారికి మాసం ప్రారంభంలో అనుకోని సంఘటనలు,ప్రతిఘటనలు ఎదురు కావచ్చు. మాసం మధ్యనుండి పరిస్థితులు అనుకూలించగలవు. వ్యాపారులకు విదేశీ అవకాశాలు బాగున్నాయి. వృత్తులలోని వారికి మంచి గుర్తింపు లభించగలదు. మంగళవారాలు సంతకాలు చేయటం కానీ వివాదాలలోకి వెళ్లటం కానీ మానుకోవటం మంచిదని సూచించుట అయినది. కలసి వచ్చే సంఖ్యలు 6,17.

వృశ్చిక రాశి:  ఈ మాసం మంచి ఉత్సాహంతో ప్రారంభం కాగలదు. మిత్రుల మధ్య విభేదాలు ఏర్పడటం వలన మీకు కొన్ని అదనపు బాధ్యతలు సంక్రమించగలవు. మాసం మధ్యలో కొన్ని అద్భుతమైన అవకాశాలు లభించగలవు. ఒక దీర్ఘకాలీనమైన సమస్య పరిసమాప్తి కాగలదు.పెద్దల ఆరోగ్యం  పట్ల జాగ్రత్త వహించాలి. సరైన వైద్యం వలన పూర్తి నివృత్తి పొందగలరు. పబ్లిక్ తో వ్యవహారం చేసే వారికి ఒక సూచన ఉన్నది. మీ కరచాలనం తీరును గమనించి కొద్దిగా మార్పు చేసుకోవటం అవసరం…కలసి వచ్చే సంఖ్యలు 12,14.

ధను రాశి: ఉద్యోగంలో మార్పులు తప్పవు. పై అధికార్ల బదిలీల వలన కొన్ని కొత్త సమస్యలు తలెత్త గలవు. స్త్రీలకు సంబంధించిన వస్తువులతో వ్యాపారం చేసె వారికి మంచి లాభాలున్నాయి.ఒక స్థిరాస్తి వ్యవహారం కొన్ని కొత్త మలుపులు తీసుకోగలదు. దాన ధర్మాలకు మాసం చివర వారం వెచ్చిస్తారు. మీడియా వర్గం వారికి కొత్త అవకాశాలుండగలవు. ఇంటి కాగితాల మీద ఋణాలకు ప్రయత్నిస్తున్న వారు తగు జాగ్రత్తలు వహించాల్సిన మాసం.  శివుడికి అభిషేకం చేయించాలి. మంచి సంఖ్యలు 5,21.

మకర రాశి:  నమ్మించి మోసం చేసే వారికి దూరంగా ఉండవలసిన మాసం. ఇ-మెయిల్, లేదా ఇతర మాధ్యమాల ద్వారా వచ్చు సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. బంధు వర్గం లో తలెత్తే వివాదాలను పరిశీలించి వదిలేయండి. కొత్త ప్రదేశాలు చూస్తారు. సంగీత నృత్య రంగాలలోని వారికి మంచి ఫలితాలుండగలవు. విద్యార్థులు అధికంగా శ్రమించాలి. మాసం చివర విలాసానికి సమయం వెచ్చిస్తారు. కలసి వచ్చు సంఖ్యలు 17,20.

కుంభ రాశి: నీటి కాలుష్యం చేత ఆరోగ్యం దెబ్బ తినగలదు. జాగ్రత్త వహించాలి.అధికమైన ఆలోచన, శ్రమ వలన శారీరిక సౌఖ్యం తగ్గ వచ్చు.ఒక ప్రయాణం మానుకోవలసి రాగలదు. సోదరీమణుల విషయం లో నిర్ణయం తీసుకోవలసి రాగలదు. కొంత కాలం వేచి తగు నిర్ణయం తీసుకోవటం మంచిది. ఉపాసన మార్గం లో ఉన్న వారికి మంచి అనుభూతులు ఉండగలవు. మీ విశ్లేషణా యుక్తులు మీకు తగు గౌరవాన్ని ఇవ్వగలవు. హనుమాన్ చాలీసా చదువగలరు. కలసి వచ్చు సంఖ్యలు 15,24.

మీన రాశి: సంతానం పురోగతి బాగుంది. మీకు ఇష్టం లేని పని చేయవల్సి వచ్చినందుకు కష్టంగా ఉండగలదు. మార్కెటింగ్ రంగం లో ఉన్న వారికి సదవకాశాలున్నాయి. మీ మాటకారితనం ఆకట్టుకుంటుంది.  ఒక మార్పును తగు రీతిలో గుర్తించి ముందుకు వెళతారు.  మీ మంచితనాన్ని ఇతరులు గుర్తించలేదనే బాధ మిగులగలదు. లోకం మంచి చెడుల మీద నడవదు! కేవలం వ్యవహారఙ్ఞానం మీద వ్యక్తులు ప్రవర్తిస్తారు. గమనించగలరు. కలసి వచ్చు సంఖ్యలు 25,27.

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~


Categories: Left