http://srikaaram.wordpress.com/feed

Syndicate content శ్రీ-పదములు
Just another WordPress.com weblog
Updated: 4 min 5 sec ago

ఫొటో జవాబు

Sat, 08/21/2010 - 22:27

Parliament is on Jaguar XJ rear view of the car

Answers given by:

Malakpet Rowdy
bhardwajvvsr@rediffmail.com
173.3.90.129 venkat.kotoju@yahoo.com nani

gajula
gajulamallik@yahoo.co.in
202.63.100.117


Categories: Left

ఎం.పీలకు జీతాలు చాలటం లేదుట!

Sat, 08/21/2010 - 03:37

ఎం.పీలకు జీతాలు మూడింతలు చేయటానికి ఒప్పుకున్నారు.వింతగా ఎన్నో ఇంతలు చేయాలని ఆదించారు కూడా.ఇక్కడ చెబుతున్న వాదన గొప్పగా ఉంది. ఎం.పీలు బ్రతికి బట్ట కట్టాలంటే జీతాలు పెంచాలన్నారు. ఇంకో మాట అన్నారు. మంచి జీతాలు ఇస్తే చలా మంది రాజకీయాలలోకి వచ్చి మన ప్రజాస్వామ్యానికే సరికొత్త ఊపిరి వస్తుంది అనేసారు!

ఎవరండీ కొత్త వారు వచ్చేది? ఎవరు రానిచ్చేది? ఇటీవల ఒక ఆంధ్ర ప్రబుధ్ధుడు సోనియా గారికి ఒక లేఖ వ్రాసారు. మీ కుటుంబానికి చేసే సేవకు కట్టుబడి ఉంటామన్నాడు ఈయన!కొత్త గాలులు కొత్త స్వాతంత్ర్యం…మన ప్రజాస్వామ్యానికి అంత ఆట లేదు.

విషయనికి వద్దాం.మన ఎం.పీలలో 315 కోటీశ్వరులున్నారు. ఒక్కొక్కరికీ ఏవరేజ్ తీస్తే 4.5 కోట్ల ఆస్తులున్నట్లు కాగితాల మీద ఉన్నది.ముందుకు వెళదాం.14 వ లోక్ సభలో 128 ఎం.పీలు క్రిమినల్స్. వీరిలో 58 మంది దారుణమైన నేరాలలో పట్టుబడినవారు-మానభంగం,హత్యలు…ఇలా చాలా!
15వ లోక్ సభలో సంఖ్య పెరిగింది.162 మంది క్రిమినల్స్ అయితే 76 మంది హంతకులు,ఇలాంటి వారు.మరి అభివృధ్ధి చెందింది కదా వ్య్వస్థ?అదీ సంగతి. జీతాలు పెంచకూడదని ఎవరు వాదిస్తున్నారు? అంకెలు కనిపించటం లేదా?

ద్ ట్రిబ్యూన్ లో ఒక వ్యాసం లో ఈ విషయం చెబుతూ విభా శర్మ అనే ఆవిడ అసలు పర్టీలను, ఎన్నికలను ఫండింగ్ చేసే ప్రక్రియపైన ఎవరు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు.

వీరి జీతాల గురించి చర్చించేటప్పుడు లోక్ సభలో ఎవరు అడగాలి ఈ ప్రశ్న?

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Thu, 08/19/2010 - 12:05

సంజీవ్ మెహతా-135 ఏండ్ల తరువాత ఈస్ట్ ఇండియా కంపనీని టేక్ ఓవర్ చేసిన వ్యక్తి ఈయన


Categories: Left

ఫొటో జవాబు

Wed, 08/18/2010 - 11:41

యు జై   రచించిన పుస్తకం ‘చైనాస్ బెస్ట్ ఏక్టర్, వెన్ జియబావొ ‘

చైనా ప్రధాని గురించి కొన్ని సెన్సిటివ్ విషయాలు ఇందులో చెప్పినందుకు పుస్తకాన్ని విడుదల చేయవద్దని ఆ ప్రభుత్వం రచయిత మీద వొత్తిడి తెస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఈ పుస్తకం హాంగ్ కాంగ్ లో రిలీస్ అయింది.


Categories: Left

ఎన్నటికో…

Tue, 08/17/2010 - 13:21


Categories: Left

ప్రతి జిల్లాలో ఒక కోర్టు కేసు లేని గ్రామం-హిమాచల్ ప్రయోగం!

Tue, 08/17/2010 - 11:34

హిమాచల్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు ఒక ప్రయోగం చేపట్టారు. ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంచుకుని ఆ గ్రామంలో ఎటువంటి లిటిగేషన్ లేకుండా చేయటం ఈ కార్యక్రమం. ఇందుకు గాను రాష్ట్రం లో ఉన్న లా కాలేజీలలోని విద్యార్థులను ఒక్కో గ్రామాన్ని ఎంచుకుని ముందుకు వెళ్లమన్నారు. ముఖ్యంగా కాలేజీలలో ఇప్పటికే ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్కులు ఇందుకు కోర్టుకు వెళ్లకుండా న్యాయం జరిగే పధ్ధతులలో తోడ్పడనున్నాయి.

విద్యార్థులు ఒక ప్రశ్నల మాలికను తయారు చేసి సర్వే నిర్వహించి కేవలం ఒక్క ఏడాదిలో గ్రామాల లోని కేసులు ముగిసేలా ప్రయత్నించనున్నారు.

ఇది తొలుత కేరళ రాష్ట్రంలో చేపట్టిన ప్రక్రియ అని తెలుస్తోంది.కోర్టు మేనేజర్సును కూడా నియమించే అవకాశాలు ఉన్నట్లు కురియన్ గారు చెప్పారు. తొమ్మిదవ, పదవ తరగతులలో న్యాయ పరమైన శిక్షణకు ప్రత్యేక తరగతులు ఉండాలని వీరు సూచిస్తున్నారు…

సత్వరంగా కేసులు విచారించటం జరగనప్పుడు కోర్టు బయట న్యాయం జరగలనే ఆశ మంచిదే. సత్వర న్యాయం పట్ల న్యాయమూర్తి గారికి ఉన్న ప్రేమ కూడా అభినందించాల్సిందే.కాకపోతే చైనా వాల్ లాగా నిలబడి ఉన్న న్యాయవ్యవస్థ సరైనది కాదనే ఒక అంతర్లీనమైన ఆలోచన దాగి ఉన్నదా?ఏమో!

చాలా సార్లు చర్చలోకి వచ్చే ఒక విషయం ఒకటి ఉంటుంది.వ్యవస్థలోంచి పోరాడాలా లేక వ్యవస్థ బయటనుండి ఉద్యమం తీసుకుని రావాలా అని.వ్యవస్థలోంచి ఇది ఇంతే అని పరోక్షంగా చెబుతూ మా జోలికి రాకండి అని చెబుతున్నట్లు కనిపిస్తోంది.

చాలా కాలం క్రితం రీడర్స్ డైజెస్ట్ లో ఒక మాట చదివినది గుర్తు.మనిషికి అవసరమైతే ఒకరు కాదు, వంద మంది వచ్చి నిలబడాలి. కానీ అవసరం రాకుండా జీవితం సాగాలి…

విద్యాలయాలలో కూడా న్యాయశాస్త్రం పట్ల అవగాహన గురించి చెబుతూనే కోర్టు బయట న్యాయం మీద దృష్టి సారించారు జడ్జ్ గారు.దీని జోలికి మీరు వెళ్లకండి, దానిని మీ దగ్గరకు రానీయకండి, అందుకే దాని గురించి తెలుసుకోండి అని చెప్పకనే చెబుతున్నట్లు ఉన్నది.

కాకపోతే ప్రస్తుతానికి చేపట్టిన ప్రక్రియ వలన ప్రజలు లాభం పొందుతారని ఆశిద్దాం.

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Tue, 08/17/2010 - 08:17

ఉత్తర కంబోడియా లోని ప్రీ విహియర్ గుడి. ఇది తూర్పు థాయిలాండ్ సరిహద్దులో ఉండటం వలన ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యకు వివాదంలో ఉన్నది.


Categories: Left

మావోయిస్టులను తరిమిన అమ్మాయిలు!

Mon, 08/16/2010 - 13:39

గయ జిల్లా లోని మైగ్రా అనే పల్లెటూరులోని ఒక స్కూల్లోకి స్వాతంత్ర్య దినోత్సవం రోజున నలుగురు మావోయిస్టులు మోటర్ సైకిల్ వాహనాల మీద వచ్చి దేశానికి వ్యతిరేకంగా నినాదాలు వేసి వేడుకలను చెడగొట్టి జెండాను అవమానించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ఆ స్కూల్లోని అమ్మాయిలు వారిని దూరంగా తరుముకుంటూ వెళ్లారుట! మావోయిస్టులు కొన్ని బులెట్లు పేల్చగా ఎవరికీ గాయాలు తగలలేదని కూడా తెలుస్తోంది.ఎస్.పి దల్ జీత్ సింగ్ మాట్లాడుతూ ఈ పిల్లలు తరువాత మావోయిస్టులకు వ్యతిరేకంగా ఊళ్లో ఒక చిన్న ఊరేగింపు కూడా నిర్వహించారని చెప్పారు!

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Sun, 08/15/2010 - 21:49

రాజమండ్రి

సరైన సమాధానం ఇచ్చిన వారు

suryudu@live.com


Categories: Left

‘స్ట్రేంజర్స్ ఆన్ ఎ ట్రెయిన్ ‘-చిత్రం పై కబుర్లు

Sun, 08/15/2010 - 11:34

మెటనిం,ఇమేజ్,ట్రేజక్టరీలను చదవలాంటే ఈ చిత్రం లోకి వెళ్లాలి. ఇది 1951 లో నిర్మించిన చిత్రం.పేట్రిసియా రచించిన నవల ఇది.నవలను కొద్దిగా మార్చి తీసిన చిత్రం ఇది.
ఎంచుకున్న ఇతివృత్తం ఎలాంటిది అయినా ఒక సంఘటన తరువాత ఒకటి సాగిపోతూ ఇలా జరిగి ఉండవచ్చు అని చెప్పటం హిచ్ కాక్ గొప్పతనం.ఘటనలో ఇమేజ్ ను నింపటం తేలికైన పని కాదు. చాలా మంది ప్రయత్నించి ఏదో ఒక దానితో సంతృప్తి చెంది వదిలేయటం కూడా చూస్తాం…

కథలోకి వద్దాం.  హేన్స్ ఒక ట్రెయిన్ లో ప్రయాణిస్తుండగా బ్రునో అనే ఒక సైకో తో తారసపడతాడు.హేన్స్ ఒక టెన్నిస్ స్టార్ అవటం తో అతన్ని బ్రునో గుర్తు పట్టి హేన్స్ భార్యను తను చంపితే హేన్స్ అతని తండ్రిని చంపాలని మాట్లాడతాడు. హేన్స్ తన భార్యకు విడాకులు ఇవ్వటానికి వెళుతూ ఉంటాడు.హేన్స్ రైలు దిగిపోతాడు.బ్రునో అతను ఒప్పందం లోకి వచ్చాడనుకుంటాడు. హేన్స్ మరచిపోయిన సిగరెట్ లైటర్ తీసుకుని వెళ్లిపోతాడు. హేన్స్ ను తన భార్య డబల్ క్రాస్ చేయటం,బ్రునో ఆమెను అమ్యూస్ మెంట్ పార్క్ లో హత్య చేయటం అన్నీ జరిగిపోతాయి. నవలలో హేన్స్ బ్రునో తండ్రిని హత్య చేయటానికి ఒప్పుకుంటాడు. సినిమాలో అతని తండ్రికి బ్రునో ఒక సైకొ అని చెప్పటానికి అక్కడికి వెళ్లినట్లు తెలుస్తుంది…

హేన్స్ ఒక సెనెటర్ కుమార్తెను ప్రేమిస్తాడు. బ్రునో తండ్రిని హత్య చేసే సమస్యే లేదని బ్రునోకు వివరించిన తరువాత అసలు పేస్ అందుకుంటుంది.ఆ లైటర్ ను ఎమ్యూస్ మెంట్ పార్క్ లో వదిలి హేన్స్ పోలీసులకు చిక్కేలా చేస్తానని బ్రునో చెబుతాడు.

ఆ సాయంత్రం అక్కడికి వెళ్లేముందు ఒక టెన్నిస్ మాచ్, అక్కడికి చేరాక బ్రునో చేతిలోంచి లైటర్ ఒక గటర్ లోకి పడిపోవటం, తిరిగి దానిని పొందటం, చివరకు అక్కడ పిల్లలు ఆడుకునే రాట్నం  (కేరొసెల్లో ఇద్దరి కుమ్ములాట,బ్రునో చనిపోయే ముందు హేన్స్ అపరాధి అని చెప్పటం,చనిపోయాక చేతిలో లైటర్ కనిపించటం,పోలీసులు హేన్స్ ను వదిలేయటం…ఇవన్నీ హిచ్ కాక్ బ్రాండ్ లో గల విచిత్రాలు. ఆ ఎమ్యూస్ మెంట్ పార్క్ లోని ఒక ఉద్యోగి బ్రునోను గుర్తు పట్టి హంతకుడు ఇతనేనని చెబుతాడు.

చివరకు తన ప్రియురాలితో రైలెక్కినప్పుడు ఒక యాత్రికుడు నువ్వు హేన్స్ కదా అనగానే ఆమెతో మరో చోటుకు వెళ్లిపోతాడు!

ఇమేజరీ అడుగడుగునా సాగిన చిత్రం.క్లైమాక్స్ చాలా రసవత్తరంగా ఉంటుంది.ఒక్స్ అసికో వ్యవహారంలో తన అతితెలివి,మాట్లాడే తీరు,వ్యావహారికమైన స్పందన పాత్రలో ఇమిడిపోవటం చూస్తాం. పార్క్ లో ఒక చిన్న కుర్రాడు ఒక చిన్న గన్నును బ్రునో ముందు పెట్టి హడలు గొడతాడు. అతను వెళ్లిపోతున్నప్పుడు కుర్రాడి చేతిలో ఉన్న బెలూన్ ను తన సిగరెట్ తో ఠప్పు మనిపిస్తాడు బ్రునో. చివరి దృశ్యంలో హేన్స్ ప్రక్క నుంచి రెండు బూరలతో ఎవరో వెళ్లిపోతారు.

అలాగే ఈ చిత్రంలో ‘డబల్ ‘ ఎఫెక్ట్ గురించి పలు చోట్ల వ్యాఖ్యలు వచ్చాయి.రెండు జతల బూట్ల మీద ఫోకస్ తో చిత్రం ప్రారంభమవుతుంది (బ్రునో, హేన్స్).బ్రునో రెండు డ్రింకులు ఆర్డర్ చేస్తాడు. హిచ్ కాక్ ఈ చిత్రం లో రైల్లోకి ఒక డబల్ బాస్ తీసుకుని ఎక్కడం కనిపిస్తుంది…అంటే డబల్ క్రాసింగ్ కు ఒక ఇమేజరీ ఇది…టెన్నిస్ లో కూడా డబల్ పాయింట్,ఇలా చాలా కనిపిస్తాయి.

ఈ చిత్రంలో బ్రునో పాత్రలో నటించిన రాబర్ట్ వాకర్ జీవించేసాడు.ఆ పాత్ర మూలస్తంభంగా నిలబడి అన్నిటినీ తన చుట్టూ తిప్పేస్తుంది. ఒక పార్టీలో ఇద్దరు మహిళల దగ్గర కూర్చుని ఒక  మనిషిని ఎలా చంపాలి అని చేసే చర్చ,ఒక మహిళకు ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నట్లు కనిపించి దాదాపు ఆమెను చంపినంత పని చేయటం (చిత్రం లో ఆమె చనిపోతుందనిపించినప్పుడు తీరా ఇతను క్రింద పడిపోయి ఉంటాడు!)…ఈ దృశ్యాలలో అతని నటన అద్భుతంగా ఉంటుంది.

హేన్స్ పాత్రలో ఫార్లే గ్రాంజర్ నటించాడు.

ఈ చిత్రం  అకాడమీ అవార్డులలో ఉత్తమ బ్లాక్ అండ్ వైట్ సినమాటోగ్రఫీకి,డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా వారి ఉత్తమ దర్శకుడికి,నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ వారి  ఉత్తమ చిత్రానికీ ఎంపికయింది.
~~~***~~~


Categories: Left

ఆకాశం…

Sat, 08/14/2010 - 14:03

ఢిల్లీ లోని ఇద్దరు విద్యార్థులు ఒక కొత్త ఏస్టరాయిడ్ ను కనుగొన్నారు.రియాన్ ఇంటర్ నేషనల్ స్కూల్ లోని 12 వ క్లాసు విద్యార్థులు అమంజ్యోత్ సింగ్, సాహిల్ వధ్వ  ఈ పని చేసి చూపించారు.నాసా వారి ఆధ్వర్యం లో జరిగే ఈ కార్యక్రమం ఈ సారి 11 దేశాలు, నలుగు భూఖండాల లో జరిగింది. ఇది మొదటిసారి మన దేశంలో జరిగింది.దీనిని ఆల్ ఇండియా ఏస్టరాయిడ్ సర్చ్ కేంపెయిన్ అంటారు.
ఇదే విధంగా నవరచన విద్యాలయం, (వడోదర)నుంచి ముగ్గురు విద్యార్థులు ఒక నియర్ అర్త్ ఆబ్జెక్ట్ ను వర్చువల్ ఇంపేక్టర్ అబ్సర్వేషన్ ద్వారా కనుగొన్నారు.
ఆలోచనలు అవకాశాల కోసం కాదు, ఆకాశాన్ని అధిగమించాలి…అదే నిజమైన స్వాతంత్ర్యం.

వేర్ ద మైండ్ ఈస్ వితవుట్ ఫియర్…వేర్ నాలెడ్జ్ ఈస్ ఫ్రీ…ఇంటు దట్ వరల్డ్ ఆఫ్ ఫ్రీడం మై ఫాదర్, లెట్ మై కంట్రీ అవేక్!

అందరికీ స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు!
~~~***~~~


Categories: Left

ఈ బొమ్మ కథేమిటి?

Wed, 08/11/2010 - 01:52


Categories: Left

నిద్ర మిత్రులు!~వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ

Tue, 08/10/2010 - 03:04

కార్పొరేట్ ఆసుపత్రి సెల్లార్ లో కాంటీన్ అది. ఓ కప్పు టీ తీసుకుని ఒక టేబిలు దగ్గర కూర్చున్నాను. ఎదురుగా ఒక ముసలాయన వచ్చి కూర్చున్నాడు.
‘ఎక్కడో చూసాను మిమ్మల్ని!’,అన్నాడు.
‘నా ఙ్ఞాపక శక్తి చాలా పూర్ సార్! కాకపోతే ఆసుపత్రిలో, రైల్వే స్టేషన్లలో, తిరుమల లైనులో ఎక్కడైనా బఫే లైనులో నాకనదరూ ఎక్కడో అక్కడ చూసినట్లే ఉంటారు! ఎవరైనా చెయ్యి ఎత్తితే నేను కూడా ఒక సారి కళ్లు ఎగరేసి చెయ్యి చూపిస్తాను!’
‘బాగుంది. వాళ్లు చెయ్యి పట్టుకుని అవి ఇవీ మాట్లాడితే?’
‘నా చెయ్యి పట్టుకుని ఎంత గిల్లినా ఆ రేఖలను ఎవరూ మార్చలేరు! టైం బాలేదనౌకుని దిక్కుమాలిన నవ్వు నవ్వుతాను!. ఇంతకీ మీరు…’
‘లేదు లెండి. నేను మరొకరు అనుకుని భ్రమపడ్డాను. వయసు…అయినా వాడు ఇంత తొందరగా మాట్లాడడు! ‘
‘ ఇక్కడ ట్రీట్మెంట్ కి వచ్చారా?’
‘ఎవరికి తెలుసు?’
‘అయ్యో! అదేమిటి?’
‘అదేమిటంటే? నెలయింది. రోజూ రక్తం పిండేస్తారు. అన్నీ రిపోర్ట్లే! అన్నీ మామూలే!’
‘మరి ఎందుకున్నారు ఇక్కడ?’
‘నాకు సి.జి.ఎచ్.ఎస్ ఉన్నది.ఇది నామినేటెడ్ ఆస్పత్రి!’
‘అంతేనా?’
‘అంతే! నన్ను వదలరు!’
‘మరి ఎలా? మీ వారు ఎవరైనా…’
‘ఏం చేస్తారు? డాక్టర్ తో మాట్లాడతారు. ఆయన శాంతి స్వరూప్ వార్తలు చెప్పినట్లు నువ్వు ఎన్ని చేసినా నన్ను తప్పించుకోలేవన్నట్లు ఏదో చెబుతాడు! ఇలా మీలా ఇక్కడికి వచ్చి ఓ టీ తాగి వెళ్లిపోతారు! ఇంతేరా ఈ జీవితం…’

‘అదేమిటి సార్? అసలు ఏ రోగమని లోపలికి వచ్చారు?’
‘నేను ఒకటనుకున్నాను. వారు అదో కాదో చెబుతామంటున్నారు?’
నా టీ పూర్తి అయిపోయింది.
‘ఇంకో టీ తేనా?’
‘వద్దు. మీరు ఏ రోగం అనుకుంటున్నారు?’
‘నీరసం. వయసుకు తగ్గ నీరసమే!’
‘వాళ్లు?’
‘కరెక్ట్ గా నెల తరువాత నిన్ననే ఆ మాట కాకుండా నోరు తిరగని ఏదో శ్రీలంక బాట్స్మన్ పేరు లాంటిది చెప్పి దాని అర్థం దాదాపు అదే అన్నారు!’
‘గుడ్!’

‘ఎక్కువ నిద్ర పోకూడదంటారు. ఎంత మాట? అతిరాత్ర వ్రతం లాగా అతినిద్ర వ్రతం చేసాను. స్వామి కూడా పడుకోడా? ఎంత పెద్ద యోగనిద్ర? ఆలోచించండి. చీమకు కూడా హాని చేయకుండా నేల మీద ఎక్కువ నడవకుండా ఎవరినీ ఏమీ అడగకుండా ఒకరిని అనకుండా మిస్టర్ క్లీన్ గా జీవితం వెళ్లదీసాను. పడదు సార్…జనం ఊర్కోరు. మంచి వారంటే జనాలకు గిట్టదు!’
‘కరెక్ట్!’
‘మరి మందు?’
‘ఈ నీరసం నిద్ర లేచాక రాకూడదుట. దానికి మందు ఇవ్వటం కోసం నా రక్తమంతా పిండేసి అప్పుడు పరీక్ష చేసి ఇస్తారుట!’
‘అన్నీ తినమంటున్నారా?’
‘ఓ!’
‘ఊ…నిద్ర లేచాక నీరసం రాకూడదా?’
‘ట!’
‘నాకు రోజూ అలానే ఉంటుంది! నిద్ర లేచాక నేల మీద కాలు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.’
‘అందుకే నేను మిమ్మల్ని ఇట్టే గుర్తు పట్టేసాను!’
‘కరెక్ట్! గట్టిగా అనకండి! నేను బయటకి వెళ్లాలి!’
‘అవునా? మీ వెనకాల వస్తాను. నన్ను జస్ట్ గేట్ దాకా తీసుకుని వెళ్లండి! నేను ఆటో ఎక్కేస్తాను!’
‘సార్, అలా ఎలా? మీ వాళ్లు ఇబ్బంది పడతారు. డాక్టర్…’
‘డాక్టర్ తో మనకి పని లేదు.ఇక్కడ ఎవరికీ లేదు. రండి. కమాన్. మనిద్దరికీ ఒకటే సమస్య. కాపరేట్ చేసుకుంటే అన్నీ సమసి పోతాయి…’
అటూ ఇటూ చూసాను. ఉండండి. ఒక మాస్టర్ ప్లాన్ వేద్దాం. మా వాళ్లకి ఇడ్లీ ఇచ్చి వస్తాను…’
‘నేనూ వస్తాను…’
‘నో! ఎందుకు శ్రమ? నేను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదు. నన్ను నమ్మండి.మనిద్దరం నిద్ర మిత్రులం!’
ఆయన ముక్కు మీద వేలు పెట్టాడు.
‘ఎంత మాట? ఒక టీ ఇప్పించి వెళ్లండి. ఈ లోపల…’
‘అలాగే…’
వెళ్లి ఒక టీ ఇచ్చి అటు తిరిగాను.’థాంక్స్! ఇంట్లో అయితే మంచం మీదే మెడ వంచకుండా తాగుతాను టీ…త్వరగా రండి!’
‘అలాగే!’
తప్పుకుని  వచ్చి మెట్ల మీద నుండి సెల్లార్ లోకి చూసాను. ఆయన ఎదురుగా ఓ కుర్రాడు వచ్చి కూర్చున్నాడు. మరల జాగ్రత్తగా చూసాను. ఇద్దరూ ఎందుకో చేతులు కలుపుకుంటున్నారు. కుర్రాడు ఏదో అంటున్నాడు!

~~~***~~~


Categories: Left