http://srikaaram.wordpress.com/feed

Syndicate content శ్రీ-పదములు
Just another WordPress.com weblog
Updated: 9 min 28 sec ago

భారతీయులం మనం…

Fri, 08/27/2010 - 03:43

చిన్నప్పటి నుంచీ ఎవరైనా జాతీయ గీతం పాడుతుంటే అటెన్షన్ లో నిలబడటం అలవాటు. ..ఇవన్నీ చూస్తే కడుపు మండిపోతుంది…

~~~***~~~


Categories: Left

మన దేశంలో సివిల్ ఇంజినియర్లు లేరు!

Thu, 08/26/2010 - 22:09

విశ్వేశ్వరయ్యను కన్న దేశంలో సివిల్ ఇంజినియర్లు కరువయ్యారు. సాంకేతికపరంగా ఎంతో పేరు సంపాదించాం కానీ దేశనిర్మాణం విషయంలో యువతకు పెద్దగా ఆసక్తి లేదని తెలుస్తోంది. ఆఫీసుకు పరుగులెత్తి అక్కడ ఎవరో విదేశీయుడికి ఒక ప్రొగ్రాం వ్రాసి సంపాదించాలనే కానీ అదే ఆఫీసుకు వెళ్లేందుకు ఇంత సమయం నాకెందుకు? రోడ్డు పరిస్థితి ఏమిటి అనే ఆలోచన లేదని అంకెల ఆగడాలు చెబుతున్నాయి.

500 మిలియన్ డాలర్లు ప్రభుత్వం 2012 నాటికి ఇంఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలని యోచించి ఉపయోగం? ప్రపంచ బాంకు వారు 2008 లో భారత దేశం ఇంఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ రంగంలో ఎందుకు విఫలమవుతోందో చెబుతూ ఎప్పుడూ ఉండే చెత్త ప్లానింగు, అవినీతి,రాజకీయాలను పేర్కొంటూ సివిల్ ఇంజినియరింగు రంగంలో మూడింతలుగా మానవ వనరులను పెంచుకోవాల్సి ఉంటుందని చెప్పింది.

సాఫ్ట్వేర్ రంగంలోకి 193500 భర్తీలు 2007 నాటికి కాగా సివిల్ ఇంజినియరింగులో 1990 లో ఉన్న 13500 నుంచి 22700 కి మాత్రమే పెరిగింది. సాఫ్ట్వేర్ అభివృధ్ధి దీనికి ప్రధానమైన కారణం అయినప్పటికీ ప్రభుత్వం  ఇతర రంగాల మీద సరైన దృష్టి సారించకపోవటం ఒక అంశం.ఈ మధ్యనే నిద్ర లేచి 30 విశ్వవిద్యాలయాలను ఏర్పరచే మాట చెప్పింది.

సివిల్ ఇంజినియరింగు వారికి ఎంట్రీ లెవెల్లో సరైన జీతాలు ఇవ్వకపోవటం చాలా తప్పు. సివిల్ నుంచి సాఫ్ట్వేర్ కు వెళ్లే వారికి అక్కడ సంపాదన ఎక్కువ ఉండటం వలన న్యాయంగా వాళ్లు అటే వెళతారు.ఈ విషయంలో సమగ్రంగా ఆలోచించి విధానాలను మార్చవలసిన అవసరం ఉన్నది. మంచి మేధస్సు ఉన్న వారిని ఇటు సమంగా ఆకర్షించే ప్రయత్నం కూడా చేయాలి.

చివరగా అబ్దుల్ కలాం గారు అన్న మాట గుర్తుకు వస్తుంది.విదేశీయులకు చీప్ గా పని చేసి పెట్టటం కంటే మన సాఫ్ట్ వేర్ రంగం వారు భారతీయ పేటెంట్ ఉన్న ఒక్క సాఫ్ట్ వేర్ చూపించగలరా అని అడిగారు.

ఎంత నేర్చినా మంద ముందుండే మందగొడి దేశమా ఇది?

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Thu, 08/26/2010 - 10:34

అల్లు అర్జున్

సరైన సమాధానం ఇచ్చిన వారు:

జయంత్ కుమార్
jayanthkillam@gmail.com


Categories: Left

కాపీలు కొడుతూ చిక్కిన వారు జడ్జులు!

Thu, 08/26/2010 - 10:29

ఎల్.ఎల్.ఎం పరీక్షలో ఏడుగురు లాయర్లతో పాటు ముగ్గురు జిల్లా జడ్జులు కాపీలు కొడుతూ దొరికిపోయారు.పదోన్నతుల కోసం పరీక్షకు కూర్చున్నారు మహానుభావులు.కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన ఈ పరీక్షలో ప్రింట్ అయి ఉన్న నోట్స్ తో వీరు పట్టు బడ్డారు. డిబార్ అయిన వారు అదిలాబాద్ సబ్ జడ్జ్ ఎం.కృష్ణప్ప గారు,రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జ్ కె.అజిత్ నరసింహారావు గారు,నిజామాబాద్ జిల్లా కోర్టు జడ్జ్ పి. విజయేంద్ర రెడ్డి గారు .

ఏడుగురు న్యాయవాదులు కూడా మాస్ కాపీయింగ్ లో పట్టు బడ్డారు. ఆ రోజు పేపరు-లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా!

అసలు పేపరు లాక్కున్నా వీరిని పాస్ చేయటమే న్యాయమవుతుంది.ఎందుచేతనంటే వీరు ఉమ్మడిగా ఆ పేపరుకు న్యాయమే చేసారు! ఇదే మన అసలైన లీగల్ మరియు కాన్స్టిట్యూషనల్ చరిత్ర!దానిని ఇంత పూస గుచ్చినట్లు వారు ప్రదర్శిస్తుంటే తప్పు చేసినట్లు డిబార్ చేయటం అన్యాయం!

~~~***~~~


Categories: Left

తాజ్ హోటల్ లోని ఘాతుకంలో అమెరికా హస్తం?

Wed, 08/25/2010 - 22:30

తీవ్రవాదం మేడ్ ఇన్ అమెరికా అనేది చాలా మందికి తెలిసినదే!దేవిడ్ హెడ్లే కీ,పాకిస్తాన్ తీవ్రవాదానికీ, అమెరికాకీ ఉన్న సంబంధం ఎప్పుడో బయట పడింది.వికిలీక్స్ సి.ఐ.ఎ లోని వ్యవహారాన్ని కూడా ఇటీవల బయట పెట్టింది.160 మందిని చంపిన ఈ ఘాతుకం లో లష్కర్-ఇ-తయిబా వాళ్లు ఈ వ్యక్తి రాకపోకలకు వీలు కల్పించారని అవగతం అవుతోంది. 1994 లో సి.ఐ.ఎ రెడ్ సెల్ (థింక్ టాంక్) ద్వారా ఏర్పాటయిన ఒక పన్నాగంలో బరుచ్ గోల్డ్ స్టీన్ అనే ఆయన ఇస్రాయిల్ వెళ్లి కచ్ అనే తీవ్రవాద సంస్థలోకి దూరి 29 పేలెస్టీనియన్లను హతమార్చాడు.

వికిలీక్స్ విడుదల చేసిన పేపర్ లో ఒక వేళ అమెరికాను ఇతర దేశాలు తీవ్రవాదాన్ని ఎగుమతి చేసే దేశంగా పరిగణించటం ప్రారంభిస్తే ప్రపంచ దేశాలతో సంబంధాలు ఎలా ఉండగలవు అని ప్రశ్నించటం జరిగింది.

ఒకప్పుడు ఇలాంటి ప్రశ్నలు కూడా ఈ దేశంలో అడిగేవారు కాదేమో!పరిస్థితులు మారుతున్నాయి.అమెరికాకు దగ్గరలోనే గడ్డు ఓజులు కనిపిస్తున్నాయి.మరో రిసెషన్ దగ్గరలో ఉన్నట్లు కొందరు అనుకుంటున్నారు.ఇప్పుడున్నది ఎక్కడికి వెళ్లింది అని కొందరు అడుగుతున్నారు. ఒబామా గారు కొన్ని కాగితాలను తీసుకుని మన ఏశం రానున్నారు.మన దేశం నుంచి చాలా అడగనున్నారు. (మనకి పనికి వచ్చేటట్లు చెబుతారు!)

చాలా కాలం క్రితం ముషర్రఫ్ వచ్చినప్పుడు అప్పటి గృహమంత్రి అడ్వానీ గారు హైజాక్ వ్యవహారంలో విడుదలయి వెళ్లిన మన్సూర్ ను అప్పగించమన్నారు.అది జరగలేదు వేరే విషయం.అలాగే నాయనా ఒబామా, డేవిడ్ హెడ్లేను,ఏండర్ సన్ ను తిన్నగా ఇక్కడికి దింపి అప్పుడు మాట్లాడదాం అని మనం అడగగలమా?

సమాధానం అందరికీ తెలిసిందే!
~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Wed, 08/25/2010 - 12:07

ఈ నాట్యం ఇండొనేషియాకు సంబంధించినది


Categories: Left

మన దేశం లోని వారు ప్రయోగాలకు పనికొస్తారా?

Wed, 08/25/2010 - 08:41

అమెరికా లోని డ్రగ్ డెవలప్ మెంట్ కార్యక్రమాలలో భాగంగా మన దేశంలోని వారి మీద ప్రయోగాలు చేస్తున్నారు. సామాన్యంగా గుండె అంటు వ్యాధులకు సంబంధించిన మందుల విషయంలో, తరువాత గుండె జబ్బులు,  ఆర్హ్రైటిస్, అలర్జీల విషయాలలో ఇది ఎక్కువగా జరుగుతోందని ఎకనమిక్ టైంస్ లో ఒక రిపోర్ట్ వచ్చింది.

ముఖ్యంగా సమస్య ఏమిటంటే మన దేశంలో డాక్టర్ మనకు ప్రయోగాలలో భాగంగా మందు ఇస్తున్నాడో లేక మనకు చికిత్సకు ఇస్తున్నాడో చాలా మందికి తెలియదు. అనేకమైన మందులు ఇతర దేశాలలో నిరోధింపబడ్డాయన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు.

అమెరికాలోని శాస్త్రఙ్ఞులే ఇలా ప్రయోగాలు చేసి నిజంగా కనుగొన్న మందులు ఇలాంటి దేశాలలో లభ్యం అయ్యేటట్లు చేస్తారా? అని ప్రశ్నించటం విశేషం!

ఒక నైతికపరమైన సమస్య ఇది. ఇది అంతర్జాతీయ నేరం క్రింద గుర్తించి వీళ్లని శిక్షించవలసిన అవసరం ఉంది. మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నిద్ర లేవ వలసిన అవసరం ఉన్నది.

దారిద్ర్యం నేరం కాదు. దారిద్ర్యాన్ని దరిద్రమైన ఆలోచనలతో పీడించే వాడు సామాన్యమైన దుర్మార్గుడు కాడు. వాడిని పబ్లిక్ గా నిలబెట్టి కఠినంగా శిక్షించవలసిన  అవసరం ఉన్నది!
~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Tue, 08/24/2010 - 06:23

బాకో నేషనల్ పార్క్, మలేషియా


Categories: Left

ఫొటో జవాబు

Sat, 08/21/2010 - 22:27

Parliament is on Jaguar XJ rear view of the car

Answers given by:

Malakpet Rowdy
bhardwajvvsr@rediffmail.com
173.3.90.129 venkat.kotoju@yahoo.com nani

gajula
gajulamallik@yahoo.co.in
202.63.100.117


Categories: Left

ఎం.పీలకు జీతాలు చాలటం లేదుట!

Sat, 08/21/2010 - 03:37

ఎం.పీలకు జీతాలు మూడింతలు చేయటానికి ఒప్పుకున్నారు.వింతగా ఎన్నో ఇంతలు చేయాలని ఆదించారు కూడా.ఇక్కడ చెబుతున్న వాదన గొప్పగా ఉంది. ఎం.పీలు బ్రతికి బట్ట కట్టాలంటే జీతాలు పెంచాలన్నారు. ఇంకో మాట అన్నారు. మంచి జీతాలు ఇస్తే చలా మంది రాజకీయాలలోకి వచ్చి మన ప్రజాస్వామ్యానికే సరికొత్త ఊపిరి వస్తుంది అనేసారు!

ఎవరండీ కొత్త వారు వచ్చేది? ఎవరు రానిచ్చేది? ఇటీవల ఒక ఆంధ్ర ప్రబుధ్ధుడు సోనియా గారికి ఒక లేఖ వ్రాసారు. మీ కుటుంబానికి చేసే సేవకు కట్టుబడి ఉంటామన్నాడు ఈయన!కొత్త గాలులు కొత్త స్వాతంత్ర్యం…మన ప్రజాస్వామ్యానికి అంత ఆట లేదు.

విషయనికి వద్దాం.మన ఎం.పీలలో 315 కోటీశ్వరులున్నారు. ఒక్కొక్కరికీ ఏవరేజ్ తీస్తే 4.5 కోట్ల ఆస్తులున్నట్లు కాగితాల మీద ఉన్నది.ముందుకు వెళదాం.14 వ లోక్ సభలో 128 ఎం.పీలు క్రిమినల్స్. వీరిలో 58 మంది దారుణమైన నేరాలలో పట్టుబడినవారు-మానభంగం,హత్యలు…ఇలా చాలా!
15వ లోక్ సభలో సంఖ్య పెరిగింది.162 మంది క్రిమినల్స్ అయితే 76 మంది హంతకులు,ఇలాంటి వారు.మరి అభివృధ్ధి చెందింది కదా వ్య్వస్థ?అదీ సంగతి. జీతాలు పెంచకూడదని ఎవరు వాదిస్తున్నారు? అంకెలు కనిపించటం లేదా?

ద్ ట్రిబ్యూన్ లో ఒక వ్యాసం లో ఈ విషయం చెబుతూ విభా శర్మ అనే ఆవిడ అసలు పర్టీలను, ఎన్నికలను ఫండింగ్ చేసే ప్రక్రియపైన ఎవరు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు.

వీరి జీతాల గురించి చర్చించేటప్పుడు లోక్ సభలో ఎవరు అడగాలి ఈ ప్రశ్న?

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Thu, 08/19/2010 - 12:05

సంజీవ్ మెహతా-135 ఏండ్ల తరువాత ఈస్ట్ ఇండియా కంపనీని టేక్ ఓవర్ చేసిన వ్యక్తి ఈయన


Categories: Left