http://srikaaram.wordpress.com/feed

Syndicate content శ్రీ-పదములు
Just another WordPress.com weblog
Updated: 53 sec ago

ఫొటో జవాబు

Thu, 09/02/2010 - 22:45


ఇండొనేశియా లోని పశ్చిమ జావా లో సియారుతిన్ ప్రాంతాన్ని పరిపాలించిన తిరుమనెగర అను రాజు శిలాశాసనాలు.ఈ అక్షరాలు సంస్కృతంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.చివరి పదాలు…’విష్ణోరివ పదద్వయం’ తో ముగుస్తున్నాయి.


Categories: Left

కశ్మీర్ మనది కాదా?

Thu, 09/02/2010 - 14:31

కశ్మీర్ ను తలచుకుంటేనే చాలా మందికి చిరాకు పుట్టటం ప్రారంభమయింది. గత ఇరవై ఏండ్లుగా జరుగుతున్న యుధ్ధానికి అంతూ పంతూ కనిపించటం లేదు. ఎందరు జవాన్లు, అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారో అని తలచుకుంటే బాధ పడటం తప్ప మరొకటి చేయలేని స్థితి. ప్రస్తుతం ఈ సమస్యను విశ్లేషించటం కోసం ఈ టపా పెట్టటం లేదు. ఈ వీడియోలో ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది అర్థం అవుతోంది. భారత దేసం మాప్ లో కశ్మీర్ ను వీరు చూపించటం కూడా మానేసి చాలా కాలం అయింది…గమనించండి. ఇతరత్ర వీడియోలలో కూడా ఇదే పధ్ధతి. చూస్తూ చూస్తుండగా మన దేశం లోని అంతర్భాగమైనది ఒక అంతర్జాతీయ వివాదాస్పదమైన ప్రాంతం గా ప్రపంచం గుర్తించటం పాకిస్తాన్ విజయం కాకపోతే ఎవరి విజయం?

ఆలోచించాల్సిన అవసరం ఉన్నది…
~~~***~~~

గిల్గిట్  బాల్టిసాన్ ప్రాంతంలో 11000 సైన్యాన్ని మొహరించినట్లు న్యూ యార్క్ టైంస్ లో వచ్చిన వార్తలను ఖండిస్తూ చైనా చేసిన వ్యాఖ్యలను ఒక్క సారి చూద్దాం.పి.ఓ.కేను పి.ఓ.కే గా వీరు వర్ణించటం లేదు.దీనిని ఉత్తర పాకిస్తాన్ అంటున్నారు.మన దేశం లోని జమ్ము కశ్మీర్ ను  ఇండియా కంట్రోల్డ్ కశ్మీర్ గా విదేశీ వ్యవహారాల జియాన్ యు పేర్కొనటం గమనార్హం.చైనా పాకిస్తాన్ కు,భారత్ కు మిత్ర దేశమని, సంప్రదింపుల ద్వారా కశ్మీర్ సమస్యకు సమాధానం వెతకాలని గురువారం రోజున ఈమె సందేశం ఇచ్చారు.ఈవిడ మాటలలో అసలు భరత్ కు ఏ ప్రాంతాన్ని మిగిల్చినట్లో!

ఇదిలా ఉంచండి.కశ్మీర్ లో ట్రూప్స్ ను మాన్ చేస్తున్నందుకు ఒక భారతీయ ఆర్మీ జనరల్ కు చైనా విసా ఇవ్వలేదన్న సంగతి అందరికీ తెలిసిందే! శాంఘాయిలో భారతీయ పర్యాటక ఎక్షిబిషన్ లోంచి భారత దేశపు మాప్ లను తీసేసారు చైనీయులు.ఆ మాప్ లలో అరుణాచల్ ప్రదేశ్  మన దేశంలో ఉన్నట్లు చూపించాముట!

ఏమిటి ఈ జులుం?

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Thu, 09/02/2010 - 03:06

కార్లా బ్రునీ సార్కోజీ (ఎడమ)-ఫ్రాన్స్ మొదటి మహిళ.
ఈవిడ ఇరాన్ లో ఒక మహిళ ను రాళ్లతో కొట్టి చంపే ఒక తీర్పు మీద తీవ్రం గా  మానవ హక్కుల విషయంలో ఒక లేఖ వ్రాసారు. ఆ దేశం లోని కొన్ని వర్గాలు ఈమె మీద తిరిగి అక్రమ సంబంధాల ఆరోపణలు చేసారు.

ఇరాన్ లో నేరము శిక్ష విషయం ఎవరూ చర్చించకూడదా?


Categories: Left

సెప్టెంబర్ 2010 రాశిఫలాలు

Wed, 09/01/2010 - 11:33

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

మేష రాశి: మంచి లాభదాయకమైన మాసం.నూతన పరిచయాల వలన కొన్ని సొకర్యాలు ఏర్పడగలవు.ఒక దూరప్రయాణం ఉండగలదు.చమత్కారం గా మాట్లాడి అందరినీ ఆకర్షిస్తారు. ఇంటి విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు.ధార్మిక పరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.నీరు వలన కలిగే జబ్బుల విషయంలో జాగ్రత్త వహించాలి.

వృషభ రాశి: పదోన్నతి ఉండగలదు. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉండగలవు.స్థిరాస్తి కలసిరాగలదు.బంధువులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన మాసం. మాసం పూర్వార్థంలో పిల్లలు మంచి వార్తలు వినిపించగలరు.మీరు సాధించారని అనుకున్న విషయాలను తొందర పడి అందరికీ చెప్పకూడని మాసం.

మిథున రాశి: కుటుంబ, ఆరోగ్య సౌఖ్యం బాగుంటుంది.పెట్టుబడులకు మంచి మాసం.సోదరీ మణుల నుంచి వార్తలు వింటారు.నేర పరిశోధనలో ఉన్నవారికి కొత్త అంశాలు బయట పడగలవు.వ్యాపారులకు మొదటి రెండు వారాలు బాగుండగలవు.కళాకారులకు అవకాశాలు బాగుండగలవు. మాటలో చాంచల్యం తగ్గించుకోగలిగితే మంచి లాభం పొందగలరు.

కర్కాటక రాశి: మీలోని ప్రతిభను ఒక ఉద్యమంలా ప్రదర్శిస్తారు.ఆరోగ్యం మెరుగవగలదు.చిన్న వారితో కొన్ని రహస్యాలను పంచుకుంటారు.ఆదాయం బాగుంటుంది.నిరుద్యోగులకు ప్రభుత్వం వైపు నుంచి పిలుపు రాగలదు.చిత్రకారులకు సదవకాశాలుండగలవు.మిత్రులతో కొన్ని అభిప్రాయభేదాలుండగలవు.వాద్వివాదాలు ఈ మాసం మంచిది కాదు.నూతన వస్తువు కొనే ముందు ఆలోచన చేయగలరు.

సింహ రాశి: కళ్లు, కాళ్ల  విషయంలో జాగ్రత్తలు వహించాలి.స్త్రీలు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.బదిలీలు ఉండగలవు.సమయానికి డబ్బు అందగలదు.విదేశీ వ్యవహారాలున్నవారికి మంచి మాసం.రోగనిర్ధారణలో ఆలస్యం వలన కొన్ని సమస్యలు రాగలవు.జీవిత భాగస్వామి మానసిక పరిస్థితి పై శ్రధ్ధ చూపటం అవసరం. వ్యాపారస్తులకు మంచి మాసం.జీవిత భీమా రంగం లోని వారు లాభించగలరు.శివాలయ సందర్శనం  మంచిది.

కన్య రాశి: అదుపు లేని ఆలోచనల వలన కొంత చికాకు ఉండగలదు. మాసం మధ్యలో ప్రయాణం ఉండగలదు.కొన్ని నిర్ణయాలను కాలానికి వదిలేయటం మంచిది.అనుకోని సంఘటనలకు సిధ్ధంగా ఉండండి.పాత మిత్రులు కలుస్తారు.మీ ప్రతిభ వెలుగులోకి రాగలదు.మీ సత్ప్రవర్తన మిమ్మల్ని కాపాడుతుంది.వ్యాపారంలో భాగస్వాముల అలోచనలు భిన్నంగా ఉండగలవు.చిన్న పిల్లలతో కాలం గడుపుతారు.కొత్త విషయాలు తెలుసుకుంటారు.

తుల రాశి: భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోగలవు.ఇంటిలోని పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాలి.డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం.ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి.రాజకీయం లో ఉన్న వారు మనసులోని మాట చెప్పవలసిన అవసరం ఉన్నది.వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించాలి.ప్రేమికులు కొంత ఉత్సాహం పొందగలిగే మాసం. దూరాన ఉన్న వారు ఇంటికి తిరిగి రాగలరు.

వృశ్చిక రాశి: మిత్రుల సహాయంతో ఒక కార్యాన్ని నెరవేరుస్తారు.పరిశ్రమలలో ఉన్న వారికి కొన్ని మంచి వార్తలుండగలవు.వృత్తులలో రాణించగలరు.ఖర్చులు ఎక్కువగా ఉండగలవు.ఆర్థిక లావాదేవీలకు మరొక మాసం ఆగటం మంచిది.చిన్న వ్యాపారస్తులు లాభించగలరు.విద్యార్థులు కృషి పెంచాలి.దృష్టి దోషం వలన కొంత సమస్య ఉండగలదు.సింహ వాహిని అయిన దుర్గ పటం ముందు ధ్యానం చేయగలరు.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

ధను రాశి: కార్యాలయంలో అన్నీ మార్పులతో సతమతమవగలరు.వైద్య రంగం వారికి, పరిశోధనా రంగం వారికి మంచి మాసం. వివాహ ప్రయత్నాలలో ఉన్న వారికి మంచి వార్తలుండగలవు.మీ ఇంటిలోని ఒక సభ్యునికి మంచి పేరు వచ్చే సూచన ఉన్నది.పెద్దల సలహాలను గౌరవిస్తారు. ఒక సమూహానికి నాయకత్వం వహిస్తారు.ఒక ప్రణాలికను ఏర్పాటు చేసి అనుకున్న కార్యంలో విజయం సాధిస్తారు.హనుమాన్ చాలీసా చదవగలరు.

మకర రాశి: ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.మాట మార్చే వారి వలన ఇబ్బందులు ఎదురవ్వగలవు.వాహనానికి మరమ్మత్తు అవసరం కాగలదు.మానసిక పరమైన అంశాల మీద అధ్యయనానికి సమయం వెచ్చిస్తారు.క్షేత్ర దర్శనం చేస్తారు. ఆడపడుచులకు కొన్ని హామీలు ఇస్తారు.ఆటలలో కొంత అసౌకర్యం ఉన్నా ఆటగాళ్లు రాణిస్తారు.మీడియా వర్గం వారి పట్ల అప్రమత్తంగా ఉండవలసిన మాసం. శ్రీసూక్తం చదవండి.

కుంభ రాశి: బాధ్యతల నడుమన అంతర్మథనానికి గురి అవుతున్నట్లు తెలుస్తున్నది. చేయగలిగినంతే కానీ ఏ విషయంలోనూ సంతృప్తి  కలుగని కాలం ఇది. మానసిక సంతోషం  అన్ని విషయాలకూ మూలమని తెలుసుకుంటారు.మంచి రోజులు ముందున్నాయి.కొందరికి విదేశీ యానం ఉండగలదు.మందులు,నూనెల వ్యాపారస్తులకు మంచి మాసం.స్త్రీలకు పరస్పరం  వైరం ఏర్పడగలదు. ధ్యాన మార్గం అవలంబించండి.

మీన రాశి: విలాసానికి బాగానే ఖర్చు చేస్తారు.కొత్త మనుషులతో పని చేయాల్సి రావచ్చు.ఇంటిలో కొంత మరమ్మత్తు చేస్తారు. భాగస్వాములు కాగితాల మీద సంతకాలు చేసే ముందు జాగ్రత్త వహించాలి.కాంట్రాక్టర్లకు మంచి మాసం.సంతానం లేని వారికి మంచి వార్తలుండగలవు.ఉద్యోగం మారుదామనుకునే వారు మాసం చివర ప్రయత్నించటం మంచిది.ట్రావెల్ ఏజెంట్లకు, మార్కెటింగ్ రంగం వారికి మంచి అవకాశాలు ఉండగలవు.

శ్లో: వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనం,దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Tue, 08/31/2010 - 00:41

ఏండ్ర్యూ స్ట్రాస్

సరైన సమాధానం ఇచ్చిన వారు:

karthik
karthikeya.iitk@gmail.com


Categories: Left

ఈ క్రికెటర్ ఎవరు?

Mon, 08/30/2010 - 06:40


Categories: Left

ఫొటో జవాబు

Mon, 08/30/2010 - 03:26

బైమా సీ-వైట్ హార్స్ బౌధ్ధ దేవాలయం, చైనా.భారతదేశం నుండి బౌధ్ధ సూత్రాలను ఇక్కడికి మొదటి సారి గుర్రాల మీద తెచ్చినందుకు ఆ పేరు పెట్టారు.ఇది చైనాలోని మొదటి బౌధ్ధ ఆలయం .


Categories: Left

సినీ రంగం,సాంఘిక నేరాలు…

Sun, 08/29/2010 - 03:11

చాలా కాలం క్రితం నైనీ తాల్ లో నైనా కొలను ముందున్న మాల్ దగ్గర నేనూ, నా మిత్రుడు కూర్చుని ఉన్నాం.ఒక హిందీ చిత్రం షూటింగ్ జరుగుతోంది.ఒక రెటైర్డ్ కర్నల్ కుమార్తె అందులో హీరోయిన్.ఆయన మా ప్రక్కనే కూర్చుని చూస్తున్నాడు.అమ్మాయి స్విమింగ్ పూల్ లోంచి లేచి రావటం,హీరో గట్టిగా కౌగిలించుకుని నిలబడటం-ఇది దృశ్యం.ఈ సీను దాదాపు రోజంతా టేక్ అవుతోంది.అక్కడ జనం చుట్టూతా,చెట్ల మీదా సద్దుకుని చూస్తున్నారు. ఆమె పైకి రాగానే ఈలలు,కౌగిలించుకోగానే ఆకాశం దద్దరిల్లేలా గోల…మా ప్రక్కనున్నాయన అటూ ఇటూ చూడటం…నేను ఏమీ మాట్లాడకపోయినా ఎందుకో నా వైపు తిరిగి ‘ఇట్ ఈస్ ఎ గుడ్ మువీ…’,అన్నాడు!

రాత్రి అక్కడ ఆర్మీ వారు ఏర్పరచిన ఒక విందులో పాల్గొన్నాను. ఆ చిత్ర నిర్మాత కూడా వచ్చాడు.ఆ చిత్రం యూనిట్ అంతా ఉంది.సిగరెట్ పట్టుకుని ఒక ప్రక్కగా వచ్చి పలుకరించాడు.’మా చిత్రం  రివ్యూ వ్రాయాలి…’అన్నాడు.
‘అలాగే వ్రాస్తాను.ఎన్ని భాషలలో వ్రాయాలి?’
‘ఎన్ని భాషలలో వ్రాయగలరు?’
‘ఈ రోజు ఆ దిక్కుమాలిన సీను ఎన్ని గంటలు తీసారో అన్ని భాషలలో వ్రాయగలను!’
అటూ ఇటూ చూసాడు.
‘మరోలా అనుకోకండి.అలా చేయకపోతే మాకు స్పాట్ ఇవ్వరు ఈ ప్రాంతం వారు. మీకు మరో సంగతి చెబుతాను. అలా చెట్ల మీద, పుట్టల మీద ఉన్న వారంతా ఈ దళారీలకు డబ్బులిచ్చి ఉన్న వారు.మేము పాక్ అప్ అంటే మమ్మల్ని పాక్ చేసి పంపేస్తారు…’
ఎందుకో హీరోయిన్ తండ్రి మాకు దగ్గరగా వచ్చాడు.గ్లాస్ పైకి ఎత్తాడు.’ఇట్ ఈస్ ఎ గుడ్ మువీ…’అని గ్లాసు ఖాళీ చేసాడు!

~~~***~~~
మంచి బొమ్మే! ఒక మంచి బొమ్మ తీసి చూపించాలన్నా అతి నీచమైన ప్రక్రియలలోంచి తీసుకుని వెళ్లే వ్యవస్థ నేరాలకు పెద్దగా దూరంగా ఉండలేదని అందరికీ తెలిసిందే.నల్ల డబ్బు రొటేషన్,అనుదినం అడగకుండానే సరిక్రొత్త స్త్రీ సౌఖ్యం,అశ్లీలతను చిత్రీకరించి ఎడిటింగ్ పేరుతో కత్తిరించి ఆ ముక్కలను మరో చోటుకు వ్యాపారానికి పంపించటం…ఇవన్నీ ఇక్కడ  మామూలే. చిన్న కళాకారులు,అమ్మాయిలు,నాట్యాలలో పాల్గొనే వారు పడే అవస్థలతో నిండా నరకంలా కనిపించే వ్యవస్థ ఇది.డ్రగ్స్ గురించి వచ్చినది బాలీవుడ్ నుండి ప్రయాణిస్తున్న ఒక అలవాటు.ఇక్కడ కొత్తగా ఉంది.

2000 మందిలో ముప్పయి శాతం డ్రగ్స్ వ్యాపారంలో ఉండవచ్చని అంచనా.రోడ్ నంబర్ 3 బంజారా హిల్స్ లోంచి బయట పడ్డ వ్యవహారంలో నైజీరియా, ఉగాండా వారి లింకులు బయట పడ్డాయి.ఆయుధాల స్మగ్లింగ్,ఇతర నేరాలు డ్రగ్స్ ద్వారా తేలికగా సాగుతాయన్నది పోలీసు వర్గాల కథనం. ఇందులో నిజం  లేకపోలేదు.డ్రగ్స్ ద్వారా ఏడిక్ట్ అయిన వారు ఏ పనికైనా ఎందుకు చేస్తున్నారో ఆలోచించకు ండా సిధ్ధమవుతారు. అదో సులభమైన మార్గం.కొన్ని చోట్ల నార్కోటిక్ డ్రగ్స్ కు ‘హరహర మహాదేవ ‘ అనే పేరుంది.ఎక్స్టెసీ అనే డ్రగ్ అనౌష్క అనే పేరుతో,ఓపియం త్రిష పేరుతో,కొన్ని చీప్ గా వచ్చేవి ముమయిత్ పేరుతో చెలామణి అయిపోతున్నాయి.

ఇటీవల పబ్ కల్చర్ ఒక మ్హమ్మారిలా పాకింది.ఈ పబ్స్ ఎక్కువగా సినీ రంగం,రాజకీయరంగం వారు నడపటం ఒక విశేషం. పబ్స్ నుండి డ్రగ్స్ వైపుకు చాలా సింపుల్ గా హైదరాబాదు అభివృధ్ధి చెందింది.డప్యుటీ కమిషనర్ జె. సత్యనారయణ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. రియల్ ఎస్టేట్ నుండి సినీ రంగం లోకి వచ్చి డబ్బులు పెట్టి నష్ట పోయిన వారు ఈ వ్యాపారంలో ముందున్నారు.ముంబయి ఢిల్లీ నుంచి జయింట్ ఆపరేషన్స్ జరుపుతున్న వారి మీద విచారణ చేపడుతున్నారని ఎ.కె. ఖాన్ తెలుపుతున్నారు. ప్రముఖుల పిల్లలు, పేరు గల హీరోలు తప్పించుకోలేని విధంగా ఆధారాలను తెచ్చి లోపలికి తోస్తామని చెప్పటం కూడా విన్నాం.ఖాన్ గారి మాటను ప్రస్తుతానికి గౌరవించినా పాయింట్ బ్లాంక్ లో బులెట్లు పేల్చిన హీరోను ఏమీ చేయలేని పోలీసు వ్యవస్థ ఇంత చుట్టు తిరుగుడుగా సాగే నల్ల వ్యాపారాన్ని అరికట్టగలదనే నమ్మకం మటుకు కలగటం లేదు.

~~~***~~~

వ్యాపారం,సినీ పరిశ్రమ,రాజకీయాలు పెనవేసుకుని సాగే దేశం ఇది.ఫోర్త్ ఎస్టేట్ -మీడియా సామాన్యమైన పాత్రలో లేదు. సామాన్యులను మెంటల్ వారిలా తయారు చేసి తిరిగి ఈ మూడిటి ముందరా పీక్కు తినమని పడేస్తోంది మన మీడియా.ఈ నాలుగు దయ్యాలనూ నియంత్రించేందుకు సామాన్యులే పూనుకోవాల్సిన అవసరం ఉంది.

~~~***~~~

మాకూ సమాజం పట్ల బాధ్యత ఉంది,మేమూ సంఘజీవులం అంటూ సందేశాలిచ్చే వారు పైన ఉదహరించిన సినీ పోస్టర్ ను చూసి సిగ్గు తెచ్చుకోవాలి.ఈ వ్యవస్థలో ఉన్నవారి కుళ్లు ఆలోచనలలో ఏముందో ఇక్కడే కనిపిస్తుంది. యువత తోనే కదా ఈ వ్యాపారం ముడి బడి ఉన్నది? యువతే కదా మన భవిష్యత్తు?ఏది మన మార్గం?

~~~***~~~


Categories: Left

మెక్సికో కాంగ్రెస్!

Sun, 08/29/2010 - 01:08


Categories: Left

ఐ.టి పార్క్ లా ఉన్నది…

Sun, 08/29/2010 - 00:50

ఆస్ట్రియాలోని జైలు!


Categories: Left

ఫొటో జవాబు

Sat, 08/28/2010 - 22:16

ఎనిడ్ బ్లైటన్


Categories: Left

రాజ్యసభలోకి కొత్తగా వచ్చిన 55 మంది చరిత్రలు చూద్దాం…

Sat, 08/28/2010 - 01:52

పదమూడు రాష్ట్రాల నుంచి 55 మంది మహానుభావులు వెళ్లారు.పదిహేను మంది వారి అఫిడవిట్లలో వారి మీద నేరారోపణలు, విచారణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఇటువంటి వారిలో ఎనిమిది మంది మీద గట్టి విచారణలు ఉన్నాయి.(హత్యలు,మానభంగాలు,ఫోర్జరీలు…)

అన్ని పార్టీలు సమానంగా ఈ తరహా అభ్యర్థులను ముందుకు పంపారు.వీరిలో కొందరు ప్రబుధ్ధుల పేర్లు చూద్దాం.ప్రొఫ్ .బఘేల్ సింగ్ (బి.ఎస్.పి)ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులో,డా.విజయ్ మాల్య కు రెండు ఫెరా కేసులు,రెండు చీటింగ్ కేసులు,గుండు సుధారాణి (టి.డి.పి)మీద మతం పేరిట గొడవ సృష్టించినందుకు రెండు కేసులు,రషీద్ (ఎస్.పి),డి.ఎం.కె నుంచి టి.ఎం. సెల్వగణపతి గారు మూడు కరప్షన్ కేసులలో ఉన్నట్లు తెలుస్తోంది.

విజయ్ మాల్య గారు 615 కోట్లు మాత్రమే ఆస్తుల క్రింద చూపించారు.తరువాత టి.డి.పి నుంచి యలమంచిలి సత్యనారాయణ చొదరీ గారు 189.7 కోట్లు చూపించారు.కన్వర్ దీప్ సింగ్ (జె.ఎం.ఎం) 82.6 కోట్లు చూపించారు.

కొత్తగా వచ్చిన రజ్యసభ సభ్యులలో 72% కోటీశ్వరులు.ఏవరేజ్ ఆస్తులు 23 కోట్లు తేలింది.అయిదుగురు అఫిడవిట్లలో పాన్ కార్డు నంబర్లు ఇవ్వలేదు. మరి ఎన్నికల కమిషన్ ఎలా ఒప్పుకుందో! ఒప్పుకోవచ్చని నియమం ఉందేమో చర్చించాలి.సామాన్యుడిని పాన్ నంబర్ లేకపోతే ఏ అప్లికేషనూ ఇవ్వనీయరు…

స్త్రీలకు పెద్దగా ప్రాతినిధ్యం లేదు.నలుగురు వచ్చారు. అంతే!

కానీయండి, సభలు మీవి,రాజ్యం మీది,కానీయండి!

~~~***~~~


Categories: Left

కశ్మీర్-మిర్వైజ్ ఉమేర్ ఫరూక్ గారి నాలుగు సూత్రాలు…

Fri, 08/27/2010 - 13:09

చాలా దేశాలు కశ్మీర్ ను భారతదేశపు మాప్ లోంచి తీసేసినట్లు కనిపిస్తోంది.ఏ ప్రపంచ మీడియా లో చూసినా భారత్ మాప్ లో కశ్మీర్ ఒక వివాదం లో ఉన్న ప్రాంతం (ఏ దేశానికీ చెందనిది)క్రింద మాట్లాడుతున్నారు.ముఖ్యంగా అమెరికా నుండి వెలువడుతున్న వీడియోలలో మన దేశం తల భాగం మాయమయి చాలా కాలం అయింది!

హుర్రియత్ చేయిర్ మన్ మిర్వాయిజ్ ఉమేర్ ఫరూక్ ప్రభుత్వానికి శుక్రవారం ప్రార్థనల తరువాత ఒక సందేశాన్ని ఇచ్చారు. సాయుధ దళాల ప్రత్యేక పవర్స్ ను తీసేయమన్నారు.పబ్లిక్ సేఫ్ టీ చట్టాన్ని తీసేయాలిట.ట్రూప్స్ ను వెనక్కి తీసుకుని సెక్యూరిటీ బంకర్లను ఎత్తేసి జైళ్లలో ఉన్న వారందరినీ విడుదల చేయాలన్నారు.ఇవన్నీ చేసి తరిపాక్షిక చర్చలకు సిధ్ధం కావాలిట. అంటే పాకిస్తాన్ కూడా చర్చలలో కూర్చోవాలి…

బాగుంది మాష్టారూ!

మొదటి ప్రశ్న: తీవ్రవాదానికీ, స్వావలంబనకు సంబంధం ఎలాంటిదని చెబుతారు మీరు?
రెండవ ప్రశ్న: హుర్రియత్ అనే సంస్థ కశ్మీరీలందరికీ-తీవ్రవాదులకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నదనటానికి ఏమిటి ఆధారం? (పంజాబ్ లో హర్చంద్ సింగ్ లోంగోవాల్ రాజీవ్ గాంధీతో ఒప్పందానికి వచ్చిన వెంటనే మట్టిలో కలిసాడు!)
మూడవ ప్రశ్న:మీరు పాకిస్తన్ నుంచి విడిపోదలచారా లేక భారత్ నుంచి విడిపోదలచారా? లేక పాకిస్తాన్ లో కలసిపోవాలని యోచించారా?మరి చర్చలలో పకిస్తాన్ ఎందుకు?
నాల్గవ ప్రశ్న: అంతర్జాతీయ తీవ్రవాదాన్నీ,స్టేట్ స్పాన్సర్డ్ తీవ్రవాదాన్నీ మీరు ఎదుర్కుంటారా లేక పాక్ తో కలసి ఎదుర్కుంటారా? (అఫ్ఘాన్ బార్డరు, తాలిబాన్ కనిపించటం లేదా?)లేక ఈ పైశాచిక వృత్తి, ప్రవృత్తిలో లీనమయి జెండా ఎగురవేస్తారా?

సమాధానాలు విన్నాక చర్చిద్దాం.

పరిస్థితుల ప్రభావంతో ఒక నిజం కొన్ని రోజులు అబధ్ధం గా కనిపించవచ్చు.ఒక అబధ్ధం మరి కొన్ని రోజులు నిజంగా చెలామణి అయిపోవచ్చు.ఒక కఠినమైన నిజం చిరకాలం అబధ్ధంగా ఉండిపోదు!

~~~***~~~


Categories: Left

ఫొటో జవాబు

Fri, 08/27/2010 - 12:02

రిచర్డ్ ఫియన్ మాన్.1965 లో జులియన్ ష్వింగర్,సిన్ లిట్రో టొమనాగా తో పాటు  ఫిసిక్స్ లో నోబెల్ పుచ్చుకున్నారు. ఈయన క్వాంటం ఎలెక్ట్రోడైనమిక్స్ లో పరిశోధన చేసారు-ఈ సిధ్ధాంతం లైట్ కి, మాటర్ కి మధ్య సంబంధాన్ని వివరిస్తుంది.


Categories: Left