http://sarath-kaalam.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
ఇది సరదా కాలం. కొండొకచో, కొందరికిది స్లీజీ కాలం!
Updated: 8 min ago

ఒక్క సారి ఆవులించి వెళ్ళండి :)

Fri, 07/16/2010 - 11:55
ఏమీ లేదు - జస్ట్ సరదాగా ఒక్క సారి ఆవులించి వెళ్ళండంతే. నాకు తెలుసు - మీరు ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేరని :))
Categories: Left

నాది ఎవడన్నా ఎత్తుకుపోయాడేమో :(

Thu, 07/15/2010 - 16:35
అస్తమానం సిస్టం ముందు బ్రతుకు వేలాడదీయటమే మన పని కాబట్టి జీవితంలో కాస్త ఏక్టివిటీ పెంచుదామని ఉదయం కూడా జిమ్ము చేద్దామని ఇవాళ బయల్దేరాను. మా ఆఫీసు దగ్గరే జిమ్ము. జిమ్ము చేసి అటునుండి అటే ఆఫీసుకి వెళ్ళేలా ప్లాన్. అంతా బాగానే వుంది కానీ లాకర్ కి లాక్ తేవడం మరచిపోయాను. సరే అని ధైర్యం చేసి నావన్నీ లాకర్లో పెట్టి మరీ ఉదయమే ఏం బరువులెత్తుతాములే అని చెప్పి సానా గదిలో కూలబడ్డాను. వేడి ఆవిర్లు వస్తుంటే నాది ఎవడన్నా ఎత్తుకెళ్ళాడేమో అన్న కంగారుతో ఆవిరి గదిలో హాయిగా వున్నానన్న సుఖం కూడా లేకుండా పోయింది. మధ్యమధ్యలో వచ్చి చూసుకున్నాను. ఎవడూ ఎత్తుకెళ్ళలేదు. సంతోషం. ఇంతకీ నేను ఖంగారు పడింది దేనిగురించి అంటారూ? గెస్ చేయండి చూద్దాం. గెస్ చేసి కామెంటండి. కరెక్టో కాదో టపా అడుగున చూడండి! .


.




.



.ఇంకా క్రిందికి
.

.

.


చెడ్డీ. దొంగకి చెప్పయినా లాభమే అంటారు. నా క్రెడిట్ కార్డులు ఎత్తుకెళతారన్న భయం లేదు లెండి - ఎందుకంటే మనకు క్రెడిట్ కార్డులు లేవు కదా. ఇక డెబిట్ కార్డులో డబ్బులుంటే కదా. ఏదో పదో పరకో వుంటాయి లెండి. అంతే. డబ్బులు పెట్టుకోని దానికి డెబిట్ కార్డులెందుకు అని పిల్లకాకులకు సందేహాలు రాకూడదంతే. ఇక మిగతావంటారా మరీ అంత ముఖ్యం కాదు. చెడ్డీ లేకపోతే చేతులు ఊపుకుంటూ ఆఫీసుకి ఎలా వెళ్ళేదీ? సరే అలా వెళ్ళానే అనుకోండి ఎప్పుడన్నా మరచిపోయి అలవాటులో పొరపాటుగా ఎప్పుడన్నా  జిప్పు యమ స్పీడుగా లాగించాననుకోండి - నా గతేం కానూ!  అప్పుడు నా బాధ మళ్ళీ ఇలా నా బ్లాగులో చెప్పుకోవాల్సిందే కదా.
Categories: Left

అర్జెంటీనాలో చట్టబద్దం అయిన స్వలింగ వివాహాలు

Thu, 07/15/2010 - 12:27
లాటిన్ అమెరికాలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం అయిన తొలిదేశంగా అర్జెంటీనా దేశం అవతరించింది. వివాహమే కాకుండా స్వలింగ దంపతులు పిల్లలని దత్తత కూడా చేసుకోవచ్చు.
యు ఎస్ లోనూ, ఇండియాలోనూ, ఇతర అన్ని దేశాల్లోనూ ఈ దృశ్యం ఎప్పుడో ఏంటో కానీ నెమ్మది నెమ్మదిగా స్వలింగ సంపర్కులు ప్రపంచాన్ని ఆక్రమిస్తూ వస్తున్నారు అని అర్ధం కావడం లేదూ మీకు :)
Categories: Left

ఫ్రాన్సులో బుర్ఖాలు బ్యాన్

Wed, 07/14/2010 - 11:24
ఫాన్సు దిగువ సభ చాలా గొప్ప మెజారిటీతో బుర్ఖా నిషేధాన్ని ఆమోదించింది. ఇక సెనేట్ లో ఆ చట్టం ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు. ఆగస్టులో ఆ దేశాధ్యక్షులు సర్కోజీ ఆ చట్టం మీద సంతకం చేయనున్నారు. వచ్చే ఏదాది స్ప్రింగ్ నుండి ఆ చట్టం అమల్లోకి వస్తుంది.
దీని స్ఫూర్తితో బెల్జియం, స్పెయిన్, బ్రిటన్ లు కూడా అలాంటి చట్టాలు చేసేందుకు తయారవుతున్నాయి. యు ఎస్ లో అలాంటి చట్టం చేయాలంటే ఎక్కువ మంది ప్రజలు సముఖంగా లేరు. ఈ ఫ్రాన్స్ చట్టాన్ని సహజంగానే ముస్లిం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నెషనల్ కు కూడా ఇందువల్ల నొప్పి కలిగింది. మత స్వేఛ్ఛకి ఆటంకం అని దాని వాదన. వారికి స్త్రీ స్వేఛ్ఛ అవసరం కనపడటం లేదనుకుంటాను! ఇలాంటి చట్టం ఇండియాలో, కెనడాలో, యు ఎస్ లో మరియు ఇతర దేశాల్లోనూ రావాల్సిన అవసరం చాలా వుంది.
Categories: Left

మీరే నా శ్రేయోభిలాషులయితే ;)

Tue, 07/13/2010 - 16:38
మీరు నా శ్రేయోభిలాషులా కాదా? నా సమస్య మీ సమస్యా కాదా? నాకు లిబిడో తగ్గితే మీకు కూడా తగ్గినట్లు కాదా ఏంటీ? అందుకే ఈ క్రింది వివరాలు చూడండి మరి.
మా డాక్టరుని పీకేసి ఒక సైకియాట్రిస్టును చూసుకున్నా అన్నాను కదా. చక్కటి సైకియాట్రిస్టు దొరికాడు. చక్కగా నా కథంతా విన్నాడు. నేను చెప్పింది వినకుండా మా డాక్టర్ నా మనోభావాలు ఎలా గాయపరచిందీ అక్కడ వాపోయాను. నన్ను ఊరడించి లిబిడో గురించిన నా వ్యూహమే రైట్ అన్నాడు. భేషుగ్గా ఆ రెండు మందులూ వేసుకోవచ్చు అన్నాడు. అప్పుడు నా కళ్ళలో విజయగర్వం తొణికిసలాడింది. తొణికిసలాడుతుంది - ఆడదూ మరి?
ఆ తరువాత మా చర్చ కొత్త తరం మందుల మీదికి వెళ్ళింది. ఇలా రెండు మందులు వేసుకునే బదులు ఒకే మందులో రెండు గుణాలు కనిపించేవి కూడా వచ్చాయి. అయితే మన మెదడులో మన మనస్సుని ముఖ్యంగా ప్రభావితం చేసేవి మూడు ముఖ్యమయిన న్యూరోట్రాన్స్‌మిటర్లు. సులభంగా అర్ధం కావడం కోసం వాటిని కణాలు అందాము. ఇప్పటివరకూ ఆ రెండు కణాల మీద పనిచేసే ఒకే మందులు వచ్చాయే కానీ మొత్తం మూడు కణాల మీద పనిచేసే ఒకే మందు రాలేదు. ఇప్పటి దాకా నేను ఒక్క కణం మీదనే పనిచేసే మందు వాడుతున్నాను కాబట్టి రెండు కణాల మీద పనిచెసే మందు వాడితే ఇంకా ప్రయోజనం వుండవచ్చు.
మానసిక వైద్యుడు నా అభిప్రాయం కరెక్టే అన్నాడు. రెండు కణాలు ( సెరటోనిన్, నారెడ్రినలిన్/నారెపయిన్‌ఫ్రయిన్) మీద పనిచేసే మందు ఇస్తానన్నాడు. దానితో పాటే డోపమయిన్ అన్న కణానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఇవ్వమన్నాను. ఇన్ని మార్పులూ ఒకేసారి చేస్తే బుర్ర పేలిపోతుంది కాబట్టి ప్రస్తుతానికి రెండు కణాల మీద పనిచేసే సింబాల్టా అనే మందు వాడి చూడమన్నాడు. ఈమందులో సైడ్ ఎఫెక్టులు తక్కువ కాబట్టి మళ్ళీ లిబిడో పుంజుకోవచ్చు అన్నాడు. ఈ మందుతో లైంగికాసక్తి అనుకున్నంత పెరగకపోతే దీనికి తోడుగా డోపమయిన్ కణానికి చెందిన మందు కూడా ఇస్తానన్నాడు.
అయితే నేను అప్పటిదాకా సెరటోనిన్ కణం గురించి వాడుతున్న సిటాలాప్రాం కీ ఈ సింబాల్టాకి ఒక చిన్న తేడా వుంది. సిటాలాప్రాం కి నెలకు $4 అయితే నెలకు ఈ సింబాల్టా కి $400. ఇన్సూరెన్సు వుంది కాబట్టి సింబాల్టా నాకు నెలకు $50 కి వస్తుంది. సింబాల్టా కొత్త మందు అవడం మూలాన జెనెరిక్ వర్శన్లు లేనందున ఖర్చు ఎక్కువ. ఈ కొత్తమందు వాడబట్టి ఓ ఇరవై రోజులవుతున్నది. మొదట్లో కొద్ది రోజులు సిటాలోప్రాం తగ్గిస్తూ ఈ మందు పెంచిన రోజుల్లో కాస్త నా లిబిడో పుంజుకుంది. అందుకే అప్పట్లో ఆ ఆనందంతో 'బి డి ఎస్ ఎం వైపు నా అడుగులు' అన్న పోస్టు వేసాను. మూడు నాలుగు రోజులకే మళ్ళీ నా ఆనందం ఆవిరి అయ్యింది :(     అయితే ఈ మందుతో అదనపు ప్రయోజనాలు చేకూరాయిలెండి. కొన్ని సైడ్ ఎఫెక్టులు తగ్గాయి. బాగా నిద్ర రావడం, బాగా ఆకలి వేయడం కొంత తగ్గింది. మనస్సూ, ఆలోచనా విధానం మెరుగయ్యాయి.
ఈ నెల 19 వ తారీఖున మళ్ళీ నా సైకియాట్రిస్టుని కలవబోతున్నాను. సింబాల్టా ప్చ్ అని చెప్పి దానికి తోడుగా డోపమయిన్ కణానికై బుబ్రోపియాన్ మందు ఇవ్వమని కోరుతాను. మరి ఇస్తాడా లేదా, ఇచ్చినా మరి నేను అనుకుంటున్నట్లుగా పనిచేస్తుందా లేదా అన్నది మనం నా తెర మీద చూడాల్సిందే. ఇంకో విషయం - సరిగ్గా అదే రోజు సాయంత్రం మా ఫ్యామిలీ ఇండియా చెక్కేస్తోంది. కొంపదీసి నా లిబిడో గానీ పుంజుకుంటే నా గతేం కానూ. ఇహ ఒక్కడినే ఇల్లంతా ఎగుర్లబెట్టడమే!
సో మీరంతా నా శ్రేయోభిలాషులు కనుక నా బాగు కొరకు ఆశించండి మరి. ఇంకా మీకు తోచినవేవయినా చెయ్యండి :)  వీడి మొఖం మండా అని నా 'అసలు'కే ఎసరు వచ్చేలా చేతబడులు, బ్లాగుబడులు మాత్రం చేయకండేం!
Categories: Left

గుడిలో వస్త్రధారణపై ఆంక్షలు మానవ హక్కుల ఆంశమా?

Mon, 07/12/2010 - 15:09
ఒక టపాలో పిల్ల కాకి బ్లాగర్ క్రిష్ణ ఈ క్రింది సందేహాలు వెలిబుచ్చారు:
@ శరత్ గారు,


వారాంతం ఎంజాయ్ చేస్తున్నారా ? సరే , గుడిలో వస్త్ర ధారణ , బడిలో గే పంతులు ... మోకాలికి , బోడి గుండుకి వున్నంత సంబంధం కూడా కనిపియ్యలేదా ! ఒక్కొసారి మనకి అనవసరం అనిపించే విషయాలని మన మనసు సరిగా పట్టించుకోదు. పోలిక చెబుతా మరి.

1) గుడికి వచ్చే వారు ఇలా వుండాలి అని కట్టుబాటులు - ఒక బడిలో పంతులు గారు ప్రిఫరెన్సెస్ ఇలానే వుండాలి తమ చర్య ద్వారా చెప్పిన బడి యజమాన్యం.

2) తమ వస్త్రాలతో అసభ్యంగా వున్నారా లేదా అన్నది ముఖ్య విషయం కాకుండా , పాశ్చాత్యత , సంప్రదాయత ముఖ్య విషయం కావడం - తమ విధ్యార్దులని ఎబ్యూజ్ చేస్తుండడానికి స్ట్రెయిటా , గే నా అన్నది ముఖ్యం కాదని గుర్తించక పోవడం !

3) పాశ్చాత్య వస్త్ర ధారణలో కూడా సభ్యత వుండవచ్చని, గే కూడా సభ్యత సంస్కారాలు కలిగే వుండవచ్చని గుర్తించక పోవడం !

4) గే అయ్యినంత మాత్రాన , బడిలో కూడా అదే యావ తో వుంటారనుకోవడం - గుడిలో పాశ్చాత్య వస్త్ర ధారణ తో వున్నంత మాత్రాన విచ్చల విడిగా వుంటారు అనుకోవడం ! ( ఈ రెండు అభిప్రాయాలు పిచ్చ తప్పు .. ఇది పాపులర్ అభిప్రాయం. స్కర్టులు వేసుకున్న పిల్ల బరి తెగించడం ఎంత నిజమో, చీర కట్టుకున్న వారు అందరూ పాతివ్రత్యం పాటిస్తారన్నది అంతే నిజం )

5) తన ప్రవృత్తి ఇది అని చెప్పుకున్న గే ని చూసి ఎవరైనా గే అయ్యిపోతారా ? ( ఆ లక్షణాలు వున్న వారు బహుశా అప్రోచ్ అవ్వచ్చు నేమో ?) వారిలో ఆ లక్షణాలు వుండాలి గాని - పాశ్చాత్య వస్త్ర ధారణ లో వున్న వాళ్లని చూడగానే మనసు చెడిపోతుందా ? ( ఆ చెడిపోయే వారు చీర కట్టుకున్న వారిని చూసి చెడిపోరా ?) రెండు సందర్భాలలో అలా మారి పోయేవారిదే తప్పు గాని, మార్చే వారు ఎవరైనా వుంటారా ?

6) స్ట్రెయిట్ లెక్చరర్లు అమ్మాయిలని వేదించడం చూసి చూడనట్టు ఊరుకునే యజమాన్యాలు, ఆ విషయాలు బయటకి పొక్కి తరువాత గొడవ అవ్వడం..

మగ వారు వస్త్రధారణ అసభ్యంగా ( పాశ్చాత్యమా లేక సంప్రదాయమా అని కాదు అసభ్యమన్నదే ప్రశ్న )వున్న పట్టించుకోని గుడి పెద్దలు ( ఒక్కో చోట చొక్కా నిషిద్ధం.. ఒక్కో చోట పై పంచే కూడా నిషిద్ధం వారే చేస్తారు ) ..

ఇవి పోలికలు. ఇక మరొక ప్రశ్న.. ఆస్తిక స్వలింగ సంపర్కులు.. పెళ్లి చేసుకుని గుడికి దర్శనం కి వెళితే ప్రవేశం లేదు అంటే అప్పుడు కూడా గుడీ కాబట్టి హక్కులు గురిచి మాట్లాడనక్కరలేదు అంటారా ? గేల హక్కులు మాత్రమే హక్కులా ? వారిని మాత్రమే మిగిలిన మగ వారి తో / ఆడవారి తో సమానంగా చూడాలా ? మగ ఆడ మధ్య సమానత్వం అక్కరలేదా ? సభ్యత ముఖ్యమా ? సంప్రదాయత ముఖ్యమా ? సంస్కారం ముఖ్యమా లేక సెక్సువల్ ప్రిఫెరెన్స్ ముఖ్యమా ?

దయ చేసి ప్రతి పాయింటుకి సమాధానం ఇవ్వండి.

నా సమాధానం/వివరణ:

1. గుడి అయినా బడి అయినా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా లేదా అన్నది చూడాలి. తిరుపతి గుడి వస్త్రధారణ ఆంక్షలు హక్కుల ఉల్లంఘనగా పరిగణించలేం. కొన్ని పబ్ లల్లో సూట్ వేసుకొనే రావాలంటారు. అలాంటివాటిని హక్కుల ఉల్లంఘనగా భావించలేం. అలాంటి ఆంక్షల్లొ ఔచిత్యం తప్పితే, మితిమీరితే హక్కుల ఉల్లంఘన జరగవచ్చు. గే ప్రొఫెసర్ అని వెలివేయడం హక్కుల ఉల్లంఘన క్రిందికి వస్తుంది కాబట్టి మనం ప్రొటెస్ట్ చేస్తాం.

2. ఒక డాక్టర్ మంచి పరిజ్ఞ్ఞానం వుండి కూడా చింపిరి గడ్డంతోనూ, చింపిరి దుస్తులతోనూ వచ్చాడనుకోండి - అతని చికిత్స పై మీకు గౌరవం వుంటుందా? ఇదీ అంతే. ఒక ప్రదేశం యొక్క ఔన్నత్యం నిలపడం కోసం అలాంటి ఆక్షలు విధిండంలో పొరపాటు ఏమీ లేదు. అలాంటి ఆంక్షలు సాధారణంగా చాలాచోట్ల వివిధ వేదికలలో కనపడుతున్నదే.

3. పాశ్చాత్య దుస్తుల్లో సభ్యత వుండవచ్చు కానీ సాంప్రదాయం వుండదు. గుడులల్లో సాంప్రదాయం కూడా ముఖ్యమే. మా ఆవిడ (ఒహవేళ) బయట బికినీలు వేసుకొని తిరిగినా నాకు అభ్యంతరం వుండదు కానీ ఆలయాలకూ, తెలుగు ఫంక్షనులకూ వెళ్ళేటప్పుడు చీర కట్టుకుంటే బావుంటుందని సూచిస్తాను. ఓ రెండు నెలల క్రితం చికాగోలో ఓ తెలుగు పాప పుట్టినరోజు ఫంక్షనుకి వెళ్ళాము. అక్కడికి వచ్చిన స్త్రీలందరూ, ఆ పాప తల్లితో సహా ఒక రకమయిన దుస్తుల్లో వస్తే మా ఆవిడను ఒక్కదాన్ని మరో రకం దుస్తుల్లో చూసి ఆశ్చర్యం కలిగింది. మా ఆవిడ కట్టుకున్నది చీర!

4. నిజమే కానీ గుడుల్లో సాంప్రదాయకంగా వుండాలని కోరడం హక్కుల ఉల్లంఘన క్రిందికి రాకపోగా అది సబబు అనిపించుకుంటుంది. బడుల్లో సాంప్రాదాయిక ప్రవృత్తి మాత్రమే వుండాలనుకోవడం ఔచిత్యం కాదు.

5. ఎక్కడయినా చెడు తలపులు రావచ్చు. అయితే ఆ తలపులు తగ్గించడం వారి ఉద్దేశ్యం కావచ్చు. సాంప్రదాయిక మయిన వాతావరణంలో అలాంటి ఆలోచనలకు ఆస్కారం తక్కువగా వుంటుంది.

6. మగవాడికి ఛాతిమీద ఆఛ్ఛాదన లేకపోయినా అసభ్యం అనిపించుకోదు కదా. మరీ ఇక్కడ కూడా సమాన హక్కులు డిమాండ్ చేసి ఆడాళ్ళు కూడా అలాగే వుండాలని కోరడం బావోదేమో ;)

స్వలింగ సంపర్కుల ఆలయ ప్రవేశం మీద నిషేధం హక్కుల ఉల్లంఘన క్రిందికే వస్తుంది. అందరి హక్కులూ హక్కులే. కాకపోతే అన్నింటికీ అందరూ స్పందించలేరు, పోరాడలేరు కాబట్టి నాలాంటి వారు గే హక్కుల విషయలో ఎక్కువగా స్పందిస్తుంటారు. గుడుల్లో సభ్యత, సంస్కారం రెండూ ముఖ్యమే. సంస్కారం సెక్సువల్ ప్రెఫరెన్సును బట్టి వుండదు - వ్యక్తిత్వాన్ని బట్టి వుంటుంది.
Categories: Left

వా...నాకు లిబిడో తగ్గింది! వా :((

Mon, 07/12/2010 - 11:58
...అంటే నాకు లిబిడో (లైంగికాసక్తి) పూర్తిగా పడిపోయిందనుకొని మా ప్రవీణ్ బావ బాణాసంచా కాల్చుకోవాల్సినంత సీన్ లేదు. ఇదివరకు నాగుపాము ఎప్పుడూ పడగవిప్పి బుస్ బుస్ మని ఎవరిని కరుద్దామా, ఎవరిమీద వేటేద్దామా అన్నట్లు వుండేది పరిస్థితి. ఇప్పుడేమో నాగస్వరం వినపడితే తప్ప పడగ లేవట్లేదు - అంతే తేడా.
హే ఆస్థిక భగవాన్, హేమిటీ నాకీ శిక్ష!? లైంగిక హక్కుల కార్యకర్తనయిన నాకే ఈ అవస్థా? హతవిధీ. కొంపదీసి వృద్ధనారీ పతివ్రత నయిపోతున్నానేమో అనుకొని ఎందుకయినా మంచిదని టెస్టోస్టిరాన్ హార్మోన్లు పక్కాగా వున్నాయా లేవా అనేది లెక్కేసుకున్నాను. ఓ రేంజిలోనే వున్నాయి అని తేలింది కాబట్టి అలా నో ప్రాబ్లెం.
నాకు లిబిడో తగ్గడానికి ఒక కారణం వుంది. నాకున్న చిన్న రుగ్మత - జెనెరల్ ఏంగ్జయిటీ - కంట్రోల్లో వుండటం కోసం కొన్నేళ్ళుగా మందులు వాడుతున్నాను. ఆ మందుల యొక్క సైడ్ ఎఫెక్టులలో ఒకటి ఇది. కొంతకాలం మందులు వాడాక జిందగీ బోర్ కొట్టింది. ఇలా లాభం లేదని మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలిగాను. నా లిబిడో నాక్కావాల్సిదే అని వార్నింగిచ్చాను. సరే బాబూ అని మందులు మార్చి ఇచ్చాడు. ఆనందంగా లొట్టలు వేసుకుంటూ ఆ మందులు వాడటం ప్రారంభించాను. ఆ మందులతో కొండనాలిక అనగా నా లిబిడో ఫుల్లుగా వెనక్కొచ్చింది కానీ నా డిజార్డర్ కూడా వెనక్కొచ్చింది :(  కొండనాలుకకి మందేస్తే వున్న నాలుక కూడా వూడిపోయేట్లుగా వుందనుకొని మళ్ళీ మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఘొల్లుమన్నాను!
మా డాక్టర్ కాస్సేపు ఆకాశంలోకి చూసాడు. తరువాత గంభీరంగా నా వైపు తిరిగి "నీకు నాలుక ముఖ్యమా, కొండనాలుక ముఖ్యమా" అని అడిగాడు



నేను సహజంగానే అమాయకంగా "మనకు రెండూ ముఖ్యమే కదా" అని సెలవిచ్చాను.


మా డాక్టరు కొంచెం చిరాగ్గా "అలాక్కాదు. ఏదో ఒహటే చెప్పు" అన్నాడు


నేను నాలుక అని అన్నాను హడావిడిగా.


అయితే ఇహ కొండనాలుక పెరగడం గురించి మరచిపో అన్నాడు ఆ డాక్టర్ తాపీగా.


నా గుండె గుభేలుమంది. నేను డాక్టరుతో లబలబలాడాను కానీ వినలేదు. నాలుకకీ, కొండనాలుకకీ రెండు మందులు ఒకేసారి వాడతాను అని చెప్పాను. అలా వాడటానికి వీలు లేదు అని ససేమిరా అన్నాడు. స్వప్న రాగలీన బ్లాగులో ఈ విషయం ఇప్పటికే మీకు తెలియపరచినట్లుగా అలా రెండు మందులూ ఏకకాలంలో వాడొచ్చని నాకు తెలుసు కానీ ఈ డాక్టరుకి తెలియదు. ఆ విషయం నేను అతనికి గట్టిగా చెబితే బావుండదు. ఏం చేయాలో తోచక మనస్సులోనే లబలబలాడాను. తోటకూర కాడలా వేలాడిపోయిన నా ముఖం చూసి అనునయిస్తూ త్యాగం గురించి గొప్పమాటలు చెప్పాడు. మనస్సుకోసం లిబిడోని త్యాగం చెయ్యమని భారంగా ఉపదేశం చేసాడు. అలాగే అని తల ఊపి మనస్సులో "డాక్టరూ, లిబిడోని త్యాగం చెయ్యను గాక చెయ్యను గానీ నిన్నే త్యాగం చేస్తాను" అని తీర్మానించుకున్నాను. ఈ సాధారణ డాక్టరుతో ఇలాంటి విషయాల్లో లాభం లేదని డిసైడ్ చేసుకొని ఆ విషయాల్లో ఒక స్పెషలిస్టుని చూసుకున్నాను.


మరి ఆ సైకియాట్రిస్టు ఏమన్నాడు - తరువాత ఏమయ్యింది అన్నది మరో టపాలొ.
Categories: Left

కొత్తపాళీ గారు నాకు అపాలజీ చెప్పాల్సిందే!

Fri, 07/09/2010 - 10:37
పై ఫోటొలో కుడి పక్కన కొత్తపాళీ గారు, వారి పక్కనే నేను. నా పక్కన శ్రీ, శ్రీ పక్కన సి బి రావు గారూ, రవి వైజాసత్య. రెండేళ్ళ క్రితం డెట్రాయిటు తెలుగు సాహితీ సమావేశాల్లో తీసిన బ్లాగర్స్ ఫోటో ఇది.
ముందు ఈ క్రింది లింకులు చదవండేం: http://sarath-kaalam.blogspot.com/2010/07/blog-post_7315.html

http://sarath-kaalam.blogspot.com/2010/07/blog-post_07.html

http://sarath-kaalam.blogspot.com/2010/07/blog-post_08.html
------------------------------
స్థలం: మెక్డొనాల్డ్స్
కారులో కూర్చొని మెక్డోనాల్డ్స్ వారి ఫ్రీ ఇంటర్నెట్టుతో యాహూ లో అనిత (మా ఆవిడ - మాటి మాటికీ మా ఆవిడ అంటే బావోలేదని పేరుతో ప్రస్థావిస్తున్నా) అక్కయ్య బిడ్డ బిందుతో చాట్ చేస్తున్నాను. ఆ అమ్మాయి బెంగుళూరులో సాఫ్టువేరు ఇంజినీరుగా చేస్తోంది. ఒక ముఖ్యమయిన బ్లాగర్స్ మీటింగ్ కోసం వచ్చాననీ, ఒక ముఖ్యమయిన బ్లాగర్ నన్ను కలవడానికి వస్తున్నారనీ తెలిపాను.
--------------------------

స్థలం: శ్రీ స్వగృహం, సమయం ఉదయం 11:10


నేను: కొత్తపాళీ గారు వస్తామన్నారు కదా. ఏరీ?

శ్రీ: వారు రాలేనన్నారు

నేను: ఎందుకుట?

శ్రీ: ఇంత ఉదయమే (అనగా 10 గంటలకు) ఏం వస్తానులే బాబూ, మీరూ మీరూ మాట్లాడుకోండి అన్నారు

నేను: !

నాలో నేను: మా బాబే, ఈ చావు కబురు ముందే చెబితే ఉదయం 3 గంటల నుండి మీ ఇంటిముందు మాకు శవ జాగరణ తప్పేదిగా!

తనలో అనిత: నోట్ దిస్ పాయింట్!

నేను: బావుంది. మరి ఇంకో బ్లాగర్?

శ్రీ: వారికేదో పిల్లలని డ్యాన్స్ క్లాసుకి తీసుకెళాల్సిన పని వుండి వుంటుంది. రాలేదు

నేను: సరే

నాలో నేను: లైట్. ఆ బ్లాగరెవరో, తన బ్లాగేదో కూడా నాకు తెలియదు

తనలో అనిత: నోట్ దిస్ పాయింట్!  

"కొత్తపాళీ గారు ఇక్కడికి రాలేకపోయారు కదా. కనీసం మీతో మాట్లాడుతారేమో. ఫోన్ చేసి మీరు వచ్చేరని చెబుతాను" అని శ్రీ కొత్తపాళీ గారికి ఫోను చేసారు. అది మెసేజీ లోకి వెళ్ళింది. మెసేజి పెట్టారు. మేము అక్కడున్నంత సేపు కొత్తపాళీ గారి దగ్గరినుండి కాల్ ఏమీ రాలేదు. హ్మ్.


-----------------------------------------

స్థలం: కెనడాలో విండ్సర్ టవున్.

లంచ్ కోసం ఆగాము. బిందుతో అనిత చాట్ చేస్తోంది. బ్లాగర్ల సమావేశం ఎలా జరిగిందని బిందు అనితని అడిగింది. అనిత హైలైట్స్ చెప్పింది!

బిందు రిప్లయ్: ఎక్స్‌పెక్ట్ చేసా :))

నా ఫీలింగ్స్:    :(  
-----------------------------------

స్థలం: కెనడా. మా డెస్టినేషన్ ఇంకా రెండు గంటలున్నది


రాత్రి సరిగ్గా నిద్ర లేదు కదా. డ్రైవ్ చేస్తుంటే నిద్ర వస్తున్నది. నిద్ర పోవడానికి మీరయితే ఏం చేస్తారో తెలియదు కానీ నా దగ్గర బ్రహ్మాండమయిన చిట్కా వుంది. దానికి పేటేంటు నాదే. అది మీరూ వాడాలనుకుంటే కొద్దిగా ఖర్చు అవుద్ది. మా ఆవిడ (బుర్ర) ని కెలికేస్తాను. దాంతో నన్ను అరుస్తుంది. దాంతో దెబ్బకు నిద్ర మత్తు వదిలిపోతుంది. ఇప్పుడూ ఆ టెక్నికే ఉపయోగించాను. నాకు నిద్ర వస్తోంది. సరదాగా నాతో ఏదయినా గొడవ వేస్కోకూడదూ! అని అన్నాను. ఓ చూపు చూసింది. ఆమెకూ బోరింగ్ గానే వున్నట్లుంది. కాలక్షేపం కోసం నన్ను తిట్టడం మొదలెట్టింది. ఏం తిట్టిందో, ఎలా తిట్టిందో దేని గురించి తిట్టిందో మీరు ఎంచక్కా ఊహించేయవచ్చు. నా విజ్ఞప్తి మీద గొడవేసుకుంది కాబట్టి వ్యూహాత్మక చెవుడు పాటిస్తే పద్ధతి గా వుండదు కదా. నేనూ డ్రైవ్ చేస్తూనే (నా) తొడగొట్టాను. కొత్తపాళీ గారి మీది కోపమంతా మా ఆవిడ మీద చూపించి నేనూ అడ్దంగా వాదించాను. అలా మా గొడవతో నాకు ఎంచక్కా నిద్రమత్తు వదిలిపోయింది. ఇద్దరం అలసిపోయాక నేను మౌనంగా డ్రైవ్ చేస్తూ సెయింట్ క్యాథరిన్స్ టవునుకి చేరాము.

-------------------------------------------

స్థలం: మా మిత్రుని ఇల్లు


మా మిత్రుని భార్య ఇందుమతి " శరత్ గారూ, బ్లాగర్ల సమావేశం అన్నారు కదా, ఎలా జరిగింది. చక్కగా జరిగిందా?" అని అడిగింది.

అనిత నన్ను చెప్పనిస్తే కదా. పూసగుచ్చినట్లు అక్కడి విశేషాలన్నీ చెప్పింది. ఆడాల్లు ఎలా ముచ్చట్లు పెట్టుకుంటారో అందరికీ తెలిసిందే కదా. మొత్తం విన్నాక ఇందు ముందు తెగ నవ్వేసి తరువాత పాపం శరత్ గారు అని నామీద బోలెడంత జాలి కురిపించింది.

ఆ తరువాత ఇందు వాళ్ళాయన, నా మిత్రుడు కుమార్ బయటకి వెళ్ళి వచ్చాడు. "ఏం శరత్, బావున్నావా? మీ బ్లాగర్ల మీటింగ్ ఎలా జరిగిందేమిటి?" అని అడిగాడు. ఇందు నన్ను కానీ, అనితని కానీ చెప్పనిస్తేనా! బ్రహ్మాండంగా నవ్వేస్తూ అనిత చెప్పింది పొల్లుపోకుండా వాళ్ళాయనకు చెప్పేసింది. ఇహ లాభం లేదని నిద్ర వస్తోందని దుప్పటి తల మీదకు వేసుకున్నాను ఘాట్టిగా. అప్పుడు వాళ్ళ ముగ్గురి నవ్వుల గలగలలు లీలామాత్రంగా వినిపించసాగాయి. నేను ఊడుక్కుంటూ నిద్రలోకి జారాను.

------------------------
సీన్ కట్ చేస్తే కొద్ది నెలల తరువాత టెక్సాస్ లోని డల్లాస్ నగరం. మా మిత్రుని ఇల్లు.

బ్లాగర్లు/బ్లాగ్ రీడర్లు పానీపూరి, డల్లాస్ నాగ్ లు నన్ను కలవడానికి వచ్చారు. వారిని పైన గదిలో కూర్చోబెట్టి వచ్చాను. క్రిందికి వచ్చి అనితని "మా బ్లాగర్ల కోసం ఏమయినా స్నాక్స్ ఇస్తావా" అని సంకోచిస్తూనే అడిగాను. బ్లాగర్లు అంటే ఆమెకు ఏం గుర్తుకువస్తుందో తెలుసు కదా. ఖరాఖండిగా "ఏమీ లేవు" అని చెప్పేసింది. నేను బిక్క మొఖం వేసింది చూసి పక్కనే వున్న ఇంకో బంధువు నామీద జాలిపడి "రవ్వలడ్డూలున్నట్లున్నాయండి. చూసి ఇస్తాను" అని చూసి ఇచ్చింది. అవి తీసుకువెళ్ళి పైన గదిలో వున్న వారికి ఇచ్చాను.
---------------------------------------------

అలా జరిగిందన్నమాట డెట్రాయిట్ బ్లాగర్లతో నా సమావేశం. పోనీ ఇంతకాలమయినా మరి కొత్తపాళీ గారు నన్ను రమ్మనమని మరీ చెప్పి వారు రాలేకపోయినందుకు ఫోన్ చేసో లేక ఈమెయిల్లోనో కనీసం సారీ అయినా చెప్పారా? లేదు. మరి నేను వారి అపాలజీ డిమాండ్ చేయడం భావ్యమో కాదో మీరే చెప్పండి.


:))

అన్నట్లు చెప్పడం మరిచాను. మొన్నామధ్య మా పాప శారీ ఫంక్షను గురించిన టపా వ్రాసినప్పుడు కొంతమంది హైద్బాద్ బ్లాగర్లు కూడా రండి కలుద్దాం అని ఆహ్వానించారు కదా. ఆ విషయం అనితకి "హైదరాబాద్ బ్లాగర్లు కూడా రమ్మంటున్నారు" అని చెప్పబోయి ఎందుకయినా మంచిదని నోరు నొక్కేసుకొని "హైదరాబాద్ మిత్రులు కూడా రమ్మంటున్నారు" అని మార్చేసి చెప్పేసాను.

అయిపోయింది.
Categories: Left

తిన్న గారెలు కక్కిస్తా :))

Thu, 07/08/2010 - 12:04
(క్రిందటి టపాలో నేను డెట్రాయిట్ బ్లాగ్మిత్రులని కలవడానికి వెళ్ళాలని అనుకున్నానని చెప్పాను కదా. దానికి కొనసాగింపు ఈ టపా. ముందు ఈ క్రింది లింకులు చదవండేం:

http://sarath-kaalam.blogspot.com/2010/07/blog-post_7315.html
http://sarath-kaalam.blogspot.com/2010/07/blog-post_07.html
)
మా దగ్గరి నుండి కారులో 5-6 గంటలు పడుతుంది డెట్రాయిటుకి. శనివారం ఉదయం బయల్దేరి వెళ్ళాలనేది మా ప్లాన్ కానీ డెట్రాయిటులో బ్లాగ్మిత్రులను కలవాలని శుక్రవారం రాత్రే బయల్దేరాలని నిర్ణయించాను. "ఠాఠ్ వీల్లేదు, డెట్రాయిట్ వద్దు ఏం వద్దు - డైరెక్టుగా కెనడాకే" అంది మా ఆవిడ. బ్రతిమాలి బామాలి చివరికి ఓకే అనిపించుకున్నాను. మా మీటింగ్ 10 గంటలకు అని చెబితే మళ్ళీ ఠాఠ్ అంటుందని 8 గంటలకే అని చెప్పాను. మనం 9 గంటలంటే ఈ ఆడోళ్ళు తయారయేసరికి 11 అవుతుంది కదా అని రాత్రి తొమ్మిదిగంటలకు ప్రయాణం అన్నాను. నా ఖర్మగాలి అందరూ 9 గంటల వరకల్లా రెడీ అయి కూర్చున్నారు!
శనివారం ఉదయమే పెందరాళే లేచి వెళ్ళాలనుకున్నా ఎందువల్ల నన్నా ఆలస్యం అయితే పెద్దవారు కొత్తపాళీ ఏమనుకుంటారని కొద్దిగా శ్రమ అయినా సరే అని మా సమావేశానికి ఏమాత్రం ఆలస్యం కాకుండా ముందుగానే వుండాలని శుక్రవారం రాత్రే బయలుదేరాను. పోనీలే దారిలో సాధారణంగా వచ్చే అవాంతరాలు ఎదురయ్యి ఆలస్యం కాకపోతుందా అని బయల్దేరాను. ఖర్మ కాలి నాకు ఒక్క అవాంతరమూ అనగా దారిలో ఎందువల్ల నన్నా ట్రాఫిక్ జామో, లేకపోతే నేనొకటి తలిస్తే జి పి ఎస్ ఒకటి తలచి అక్కడికక్కడే గిరికీలు కొట్టో, లేక రెస్టు ఏరియాలలో ఆగినప్పుడు ఆలస్యమో అవకుండా నిక్షేపంగా ఉదయం 3 గంటల వరకల్లా శ్రీ ఇంటి ముందుకు వచ్చి చేరాము. ముందుగా నేను అనుకున్నది ఉదయం 7, 8 గంటల వరకల్లా వస్తామని. అటువంటిది ఉదయం 3 గంటలకే వచ్చేసరికల్లా ఇబ్బందులు మొదలయ్యాయి.
ఆ సమయంలో శ్రీని నిద్ర లేపితే ఏమనుకుంటారో! శ్రీ ఏమనుకోవడం కంటే మా ఆవిడ అనుకునేది భరించలేను కనుక శ్రీ ని నిద్ర లేపి ఇంట్లోకి వెళ్ళి అందరం రెస్టు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. కాల్ చేసాను. లేపలేదు. ఇంకో పది నిముషాలు ఆగి కాల్ చేసాను. ఊహు. కాలింగ్ బెల్ కొడదామా అంటే అంటే మేము సరి అయిన అడ్రసుకి వచ్చామా అని సందేహం. సందేహం ఎందుకంటే శ్రీ ఇంటిముందు ఒక పికప్ ట్రక్కు వుంది. మన దేశీల ఇంటిముందు పికప్ ట్రక్కు, అందునా సాఫ్టువేరు దేశీల ఇంటిముందు పికప్ ట్రక్కు వుండటం అసాధ్యం.
పోనీలే అని మా ఆవిడ మరియు పిల్లల విసుగులు భరిస్తూ కారులోనే జాగారం/నిద్ర చేసాము. మళ్ళీ 6 గంటలకు శ్రీకి కాల్ చేసి చూసాను - లాభం లేదు. మళ్ళీ ఎనిమిదింటికి కాల్ చేసినట్టున్నాను. అప్పుడు ఎత్తారు. తాము ఎక్కడో వున్నామని, పది గంటల వరకల్లా ఇంటికి వస్తామని చెప్పారు. హ్మ్. ఇక అందరినీ మెక్డోనాల్డ్సుకో మరెక్కడికో తీసుకువెళ్ళాను. అక్కడ అందరం పళ్ళు తోముకున్నట్లు చేసి బ్రేక్ఫాస్టు అయ్యిందనిపించాను. మళ్ళీ శ్రీ ఇంటి ముందుకి వచ్చి చేరాము. ఎనిమిది గంటలకే మీటింగు అన్నావు కదా అని మా ఆవిడ. టైం మారిందిలే అని నసుగుతూ చెప్పాను. పది గంటలకు అని చెప్పాను. పది గంటల దాకా కారులో వున్నవారందరూ నా బుర్ర ఫ్రై చేసారంటే నమ్మండి.
పది గంటలు అయ్యింది. బ్లాగర్లు ఎవరయినా వస్తారేమో అని కళ్ళళ్ళొ వత్తులు వేసుకొని చూడసాగాను. ఎవరూ రారే! శ్రీ కూడా రారే! ఫోన్ చేస్తే ఏదో ఆలస్యం అవుతోంది పది నిమిషాల్లో మీ ముందు వుంటామన్నారు. అలా అలా ఓ గంట అయ్యాక వచ్చారు. అప్పటికి సమయం 11 అయ్యింది. అందరం లోనికి వెళ్ళాం. తనతో పాటు వచ్చిన ఒక తెల్ల అతనిని శ్రీ పరిచయం చేసాడు. అతను చక్కగా మాట్లాడాడు. ఎందుకు ఆలస్యం అయ్యిందో వివరించి శ్రీ క్షమాపణలు చెప్పారు. శ్రీ తన తెల్ల మిత్రుని దగ్గర మోటార్ సైకిల్ కొన్నాడు. ఆ బైక్ రిజిస్ట్రేషన్ కోసమే ఇప్పటిదాకా వెళ్ళివచ్చారు. ఆ పికప్ వ్యాను ఆ తెల్ల మిత్రునిదే. శ్రీ ఇంటిముందే కాపాలా కాస్తూ వున్నాము కదా మాకు తెలవకుండా, మా కన్నుగప్పి రిజిస్ట్రేషను ఆఫీసుకి ఎలా వెళ్ళారబ్బా అని బోల్డు సందేహం కలిగి అది అడుగుదామనుకుంటూనే మరచిపోయాను. రాత్రి ఎక్కడయినా వుండి వచ్చారేమో నాకు తెలియదు. శ్రీ ఫ్యామిలీ కొద్ది వారాల క్రితమే ఇండియా వెళ్ళింది.
లోపలికి వెళ్ళాక కబుర్లు చెప్పుకున్నాము. ఎంతసేపటికీ కబుర్లే తప్ప అతిధి మర్యాదలు జరిగేట్టుగా లేవు. ఏ టీనో , కాఫీనో మా మొఖాన పోస్తారేమో అని చూసాను కానీ అలాంటి దాఖలాలు ఏమీ కనిపించలా :)) మంచినీళ్ళు అయినా ఇచ్చారా లేదా అన్నది గుర్తుకులేదు! మా ఆవిడకి మనస్సులో చిరచిర మొదలయ్యింది అని నాకు తెలుసు. మా పెద్దది తినకుండా వారం అయినా వుండగలదు కానీ చిన్నది పది నిముషాలు కూడా వుండలేదు. దానికి ఎప్పుడూ రెడీమెడ్ గా ఆకలవుతుంది. నాకు ఆకలవుతోంది అన్నది. దానికి శ్రీ ఏదో బర్గర్ చెసిస్తాను అని తనని కిచెన్ లోకి తీసుకువెళ్ళాడు కానీ ఎందుకో ఆ పని అవలేదు. నేనప్పుడు ఏదో పని వుండి కారు దగ్గరికి వెళ్ళాను కాబట్టి కారణం తెలియలేదు.
కబుర్లు సాధారణంగా సాగుతున్నాయి మా మధ్య. అంతకు ముందు రెండు వారాల క్రితమే శ్రీని కలిసినందువల్ల పెద్దగా కొత్త సంగతులు ఏమీ లేవు. స్నానాలు చేస్తారేమో మా వాళ్ళు, ఓకేనా అని అడిగాను శ్రీని. ఓకే, చేయమనండి అన్నారు కానీ మనస్పూర్తిగా అనలేదు. అది మా ఆవిడ గ్రహించి నాకు మాత్రమే కనిపించేలా ధుమధుమలాడుతూ స్నానాలు ఇక్కడ వద్దులే, కెనడాలోనే చేద్దాములే అంది. ఇక వెళ్దామా అంది మా ఆవిడ. మా వాళ్ళకి ఆకలవుతున్నదని తెలుసు. ప్రిపేర్ చేసే, ఆర్డర్ చేసో లంచ్ ఏర్పాటు చేసేంత దృశ్యం అక్కడ నాకు అనిపించలేదు. ఎప్పుడు మమ్మల్ని వదల్చుకుందామా అన్నట్లు వుంది అక్కడ పరిస్థితి. మరి కాస్సేపు మాట్లాడి సెలవు తీసుకున్నాము. కెనడాకి డ్రయివ్ చేస్తూ ఎందుకు శ్రీ అంత అన్‌రెస్పాన్సివ్ గా వున్నారు అని ఆలోచించాను. బహుశా కొత్త బైక్ ఎప్పుడు తోలాలా అన్న ఉబలాటం మీద అయివుండవచ్చు అనుకున్నాను :))
ఇక కారులోకి ఎక్కాక కెనడాకి వెళుతుండగా మా ఆవిడ నామీద అరగంట చిరచిర లాడింది. "ఆహా ఏం బ్లాగర్ ఫ్రెండు బాబూ. ఇంటికి వస్తే టీ ఇచ్చే సీను కూడా లేదు. ఇంకోసారి ఈ బ్లాగరో, మరో బ్లాగరో మన ఇంటికి రానీ. పచ్చి మంచినీళ్ళు కూడా ఎవ్వరికీ ఇవ్వను. ఇంకోసారి ఈ బ్లాగర్ మన ఇంటికి వస్తే అప్పుడు మన ఇంట్లో తిన్న గారెలు కక్కిస్తాను" మా ఆవిడకి ఎంత మండిందో అర్ధం చేసుకోవచ్చు. నేను చేసేదేమిలేక వ్యూహాత్మక చెవుడు పాటించాను :(
కాలాస్త్రి శ్రీ: ఏంటండీ బాబూ, ఇలా నన్ను మా ఆవిడతో తిట్లు తినిపించారు :))
ఇక ఘనత వహించిన బ్లాగు కురువృద్ధులు కొత్తపాళీ గారి నిర్వాకం కూడా సరదాగానే వచ్చేటపాలో.
Categories: Left

డెట్రాయిట్ బ్లాగర్లతో జరిగిన నా సమావేశం

Wed, 07/07/2010 - 11:36
ఫ్లాష్ బ్యాకూ:

http://sarath-kaalam.blogspot.com/2010/07/blog-post_7315.html
కొత్తపాళీ: రెండేళ్ళ క్రితం డెట్రాయిట్ తెలుగు సాహితీ సమావేశాల్లో కొత్తపాళీని కలిసాను. వారు మంచి స్నేహశీలిగా, సరదాగా అనిపించారు. అప్పట్లో బ్లాగులకి నేనింకా కొత్తనే కనుక వారి ప్రముఖత్వం (మంచిగా, చెడ్డగా(?!)) నాకు అంతగా తెలియదు. అప్పటి నుండి వారితో పెన్ను స్నేహం అనగా ఈమెయిల్ స్నేహం నడుస్తూనే వుంది. బ్లాగు మరియు పుస్తక ధర్మ సందేహాలు ఏమయినా వుంటే వారిని అడుగుతుంటాను - వారు ఆలస్యం కాకుండా తీర్చేస్తూవుంటారు. గత ఏడాది జరిగిన డెట్రాయిట్ తెలుగు సాహితీ సమావేశాలకి నేను వెళ్ళలేకపోవడం వల్ల మరో సారి వారిని ముఖాముఖి కలుసుకునే అవకాశం తప్పింది. ఒకసారి డెట్రాయిట్ మీదుగా నేను కెనడా వెళ్ళానని తెలిసి ఈ సారి అలా వెళితే తమకు తెలియపరిస్తే డెట్రాయిట్ బ్లాగర్లతో సమావేశం ఏర్పాటు చేద్దామనీ, ఆ విధంగా మనం అందరం కలవ్వచ్చని వారు సూచించారు. నేను సరే అన్నాను.
డెట్రాయిటులో వారి రంగుటద్దాల కిటికీ పుస్తక అవిష్కరణ సభకీ వెళదామనుకున్నాను కానీ కుదరలేదు. అదే విషయాన్ని వారికి తెలిపాను. మీరు ఎప్పుడూ వస్తామనో, కలుద్దామనో అంటారు కానీ మీరు రారు అని అలిగినంత పని చేసారు. దానితో ఈ సారి కెనడాకి వెళ్ళేటప్పుడు ఎలాగయినా కొత్తపాళీని కలుస్తూ వెళ్ళాలని కంకణం కట్టుకున్నాను.
మార్చి నెలలో కెనడా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అదే విషయాన్ని వారికి తెలిపి మీకు వీలయితే కలుద్దాము అని చెప్పాను. ఆ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు లోగా మీటింగ్ ఏర్పాటు చేస్తే నాకు సౌకర్యంగా వుంటుందని తెలిపాను. కుటుంబంతో సహా వచ్చేస్తున్నాననీ తెలిపాను. కాలాస్త్రి శ్రీ ఈ విషయాలు సమన్వయం చేసి ఆ శనివారం ఉదయం 10 గంటలకు తమ ఇంట్లోనే మనం కలుద్దాము అని తెలిపారు.
కాలాస్త్రి శ్రీ: వీరు కూడా నాకు రెండేళ్ళ క్రితం డెట్రాయిట్ సాహితీ సమావేశాలలో కలిసారు. చాలా చక్కగా మాట్లాడారు. మంచి స్నేహశీలిగా అనిపించారు. గత ఏడాది డెట్రాయిట్ సాహితీ సమావేశాలకి వెళ్ళలేకపోవడంతో వారిని మరో సారి కలిసే అవకాశం కుదరలేదు. కొత్తపాళీ పుస్తకావిష్కరణ సభకి నన్ను తప్పని సరిగా రమ్మని ఆహ్వానించారు కానీ నేను వెళ్ళలేకపోయాను. ఫిబ్రవరిలోనో, మార్చి లోనో షికాగో లో మేము వుండే ప్లేసుకు దగ్గర్లోనే వారు వచ్చారు. అక్కడ వారి మిత్రులు వున్నారు. అక్కడికి వెళ్ళి వారిని మా ఇంటికి తీసుకువచ్చాను. ఓ గంట తెలుగు బ్లాగుల గురించి ముచ్చట్లు పెట్టుకున్నాము. మా ఆవిడ గారెలు చేసి పెడితే లాగించాము. భోజనానికి వారిని వుండమన్నాను కానీ వారికి తమ స్నేహితులతో గుడికి వెళ్ళే పని వుండటంతో కుదరలేదు. మా చిన్నమ్మాయి వారిని ఇంకాస్సేపు వుండమని బాగా కోరింది. కానీ వారికి పని వుండటం మూలాన వెళతానంటే వారిని వారి స్నేహితుల ఇంటి వద్ద దిగబెట్టి వచ్చాను.  
కొద్ది రోజుల తరువాత నేను కెనడా వెళుతున్నాననీ మీకందరికీ వీలయితే దారిలో డెట్రాయిట్ బ్లాగర్లని కలిసి వెళతానని వారికి చెప్పాను. నా కుటుంబంతో సహా వచ్చేసి అటునుండి సరాసరి కెనడా వెళతామని చెప్పాను. కొత్తపాళీ తోనూ, ఇంకో బ్లాగర్ తోనూ మాట్లాడి ఆ శనివారం ఉదయం తమ ఇంటిలోనే సమావేశం అవుదామనీ వారు తెలియపరిచారు.
అంతా అంతా సవ్యంగానే వుంది. భేశ్ కదూ. కాదు. నా కష్టాల్, నష్టాల్ అప్పటినుండే మొదలయ్యాయి. ఓ ప్రహసనానికిది అంతం కాదిది ఆరంభం మాత్రమే. అస్సలేమయ్యింది అన్న విషయం సరదాగా మరో టపాలో!
కొత్తపాళీ & శ్రీ: మీరు ఈ టపాలు చదువుతున్నారా? చదువుతుంటే కనుక హాజరు వేసుకోండి :)
Categories: Left

త్వరలో ఓ బ్లాగు భీష్మాచార్యుడిని కెలకబోతున్నాను!

Tue, 07/06/2010 - 13:59
వీలయితే ఈ వారమే ఆ టపా విడుదల. గత కొంత కాలంగా బ్లాగుల్లో చాలా ప్రశాంతంగా వుండి నాకేమాత్రమూ నచ్చడం లేదంటే నమ్మండి. బ్లాగు క్రిష్ణుడు తమ కోపం చల్లార్చుకునే పనిలో వుండి అడపాదడపా ఏవేవో పోస్టులనేవి వేస్తున్నారు. రౌడీ గారు క్రిష్ణుడి బాణాలకు సొమ్మసిల్లారేమో ప్రశాంతంగా బ్లాగుల్లోకి రాకుండా సేదతీర్చుకుంటున్నట్లున్నారు. మిగతా కెలుకుడు బ్లాగర్లు కూడా తుఫాను ముందు వుండే ప్రశాంతత వలె కూల్ గా వున్నారు. ఈ ప్రశాంతమయిన బ్లాగు సరస్సులోకి ఎవ్వరయినా ఓ రాయి అన్నా విసిరి కదలిక తెస్తారేమో అని కొన్ని వారాలుగా చూస్తున్నా లాభం లేకపోయింది.
అందుకే నా కెలుకమ్ముల పొదిలో కొన్ని నెలలుగా అట్టే పెట్టి సరి అయిన సమయం కోసం వేచిచూస్తున్న నేను ఆ కెలుకాయుధాన్ని సరదాగా ఈ వారమే బయటకి తీయబోతున్నాను. ఆ టపా కాస్త నిష్కర్షగా ఒకరిద్దరు బ్లాగర్లకి అనిపించవచ్చుగాక కానీ వారూ సరదాగా తీసుకుంటారని, చిన్న చిన్న పొరపాట్లు ఏమయినా వుంటే సవరించుకుంటారనే భావిస్తూ మొహమాటం లేకుండా, దాపరికం లేకుండా హాస్యం కోసం మాత్రమే నా మనోభావాలని వ్రాయబోతున్నాను.     కొన్ని నెలల క్రితం ఓ ఇద్దరు బ్లాగర్ల వల్ల నేను ప్రపంచవ్యాప్తంగా (అనగా ఇండియా, కెనడా, యు ఎస్ ల నుండి) అవహేళనలను ఎదుర్కొన్నాను :( వారి వల్ల నాకు తల దించుకొనే పరిస్థితి, తల దుప్పట్లో దూర్చి ఉష్ణ పక్షిలాగా నటించాల్సిన పరిస్ఠితీ వచ్చింది :(( వారు చేసిన పొరపాట్లు ఏంటి, నేను ఎదుర్కొన్న అవస్థలు ఏంటి? నాకెందుకు హేళనలు ఎదురయ్యాయి? దేశ విదేశాలనుండి నన్ను హేళన చేసిన దెవరు? ఆ ఇద్దరు బ్లాగర్లలో బ్లాగు భీష్ముడు ఎవరు? ఆ ఇద్దరు బ్లాగర్ల ఎఫెక్ట్ ఇంకో ఇద్దరు బ్లాగర్లు/ బ్లాగు రీడర్ల మీద ఎలా పడిందీ, ఎందుకు పడిందీ, ఇండియా బ్లాగర్ల మీద కూడా ఎలా పడిందీ, పడబోతున్నదీ, ఆ ప్రహసనం వల్ల నేను నేర్చుకున్న పాఠాలూ, గుణపాఠాలూ... ఇవన్నీ సరదాగానే  త్వరలో మీ ముందుకు! ఇవన్నీ ఎంచక్కా నా మనస్సులోనే వుంచుకొని కుళ్ళుకోవచ్చు కానీ, మీ అందరి కాలక్షేపం కోసం మరియు అలాంటి స్వల్పమయిన పొరపాట్లు మన బ్లాగులోకంలో జరగకుండా ఇతరులు అయినా జాగ్రత్త పడుతారని ఆశిస్తూ ఆ విషయాలను నా మనస్సులో నుండి వెలికితీసి మీ ముందు వుంచబోతున్నాను.


గమనిక: నా గే పుస్తకానికీ వ్రాయబోయే ఈ టపాకీ సంభంధం లేదు.
Categories: Left

గేర్ రాడ్ ఎక్కడ?

Tue, 07/06/2010 - 11:20
మేము టోరొంటోలో వుంటున్నప్పుడు నా స్నేహితుడు ఒకరు తొలిసారిగా డ్రైవింగ్ టెస్టుకి వెళ్ళాడు. ఒక లావు పాటి ఎగ్జామినర్ ఈ పరీక్ష నిర్వహించడం కోసం అతనితో పాటుగా కారులో కూర్చున్నది. మొదటి సారి డ్రైవింగ్ టెస్టు కాబట్టి మనవాడు సహజంగానే ఖంగారు పడ్డాడు. కార్ స్టార్ట్ చేసిన తరువాత గేర్ రాడ్ కోసం వెతికాడు. కొద్ది క్షణాలకే చెయ్యి తియ్యి అని కఠినంగా వినిపిస్తే ఎగ్జామినర్ వైపు చూసాడు, ఆమె ఆగ్రహంతో వుంది. గేర్ రాడ్ కోసం ఎక్కడ వెతికాడో అర్ధమయ్యి బలంగా నాలిక కరచుకున్నాడు.
ఈ విషయం విన్న తరువాత అతనితో "గేర్ రాడ్ వుండేది మగవారికి కదా" అన్నాను. కార్ గేర్ రాడ్ కోసం మా స్నేహితుడు ఎక్కడ వెతికి వుంటాడో, ఆ పరీక్షా ఫలితం ఏమయ్యిందో, ఆ పరిస్థితిలో ఆడ ఎగ్జామినర్ బదులుగా మగ ఎగ్జామినర్ వుండి వుంటే ఏమయ్యివుండేదో  ఇక మీరు తేలిగ్గా ఊహించెయ్యవచ్చు.
Categories: Left

ఇక ఎంచక్కా తీవ్రవాదులు తలపాగాలలో బాంబులు పెట్టుకొని తిరగొచ్చు!

Fri, 07/02/2010 - 15:34
ఈ ఈనాడు వార్త చూడండి.
http://eenadu.net/advancestory.asp?qry1=4a
మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేసినప్పుడు  అనుమానం వచ్చినా కూడా సిక్కుల తలపాగాలను తనిఖీ చేయరట. ఇంత చక్కటి రక్షణా చర్యలు చేపడుతున్నందుకు బ్రిటన్ విమానాశ్రయ అధికారులకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సారి ఇండియా వస్తున్నప్పుడు బ్రిటన్ లో కాకుండా వయా మరొ దేశం ద్వారా వస్తాను - ఎందుకయినా మంచిది. ఏ తలపాగాలో ఏ బాంబు వుందో ఎవడికి తెలుసు? ఇలాంటి మానవతా దృక్పధంతోనే ముస్లిం స్త్రీల బురఖాలను కూడా అనుమానం వచ్చినా పరీక్షించకుండా వదిలివేసి బ్రిటన్ అధికారులు తమ విశాల హృదయాన్ని చాటుకోవాలని కోరుతున్నాను. అప్పుడు గానీ విమాన ప్రయాణ భద్రత పెంపొందదు!
Categories: Left

Top Traffic Sources For This Blog

Fri, 07/02/2010 - 11:01
నిన్నటి రోజున ఈ బ్లాగుకి వచ్చిన ట్రాఫిక్ గణాంకాలు

Sources                          Visits    % visits


koodali.org                       146     41.71%

maalika.org                        75     21.43%

haaram.com                       32       9.14%

jalleda.com                        32        9.14%

google                               25        7.14%
Categories: Left

Zits :))

Thu, 07/01/2010 - 15:31
మీ ఇంట్లో టీనేజ్ పిల్లలున్నారా?
షికాగో ట్రిబ్యూన్ న్యూస్ పేపర్ తెప్పించుకుంటాను నేను. అందులో జిట్స్ అనే కామిక్ స్ట్రిప్ బాగా నవ్వు తెప్పిస్తుంది. టీనేజీ పిల్లల ఆలోచనలు, ప్రవర్తనలు ఎలా వుంటాయో అందులో బాగా వ్యంగ్యంగా చిత్రీకరిస్తుంటారు. మా టీనేజి అమ్మాయి ని వాటితో పోలుస్తూ వుంటే చాలా వరకు నిజమయ్యి భలే నవ్వొస్తుంటుంది నాకు.
మీరూ సరదాగా ఓ లుక్కెయ్యండి మరి :) http://www.arcamax.com/zits/
"Zits is the worst name for a comic strip since Peanuts."
—Charles Schulz   Zits is an award winning comic strip written by Jerry Scott (creator of Baby Blues and one-time cartoonist for Nancy) and illustrated by Jim Borgman about the life of 15-year-old high school freshman Jeremy Duncan.
Jeremy lives with his parents, Walt and Connie, who both possess boring jobs and spectacular ignorance (according to Jeremy, anyway). He dreams of 'making it big' as a rock musician, but feels like he lives in the shadow of his highly successful college brother Chad.
Many strips deal with relationships with his friends, the sensible Hector and the extremist Pierce, not to mention his on-off girlfriend Sara. Notably for a teen strip, many of the comics also deal with Connie and Walt, and many of the Crowning Moments Of Funny come from their perspectives.
As a comic strip, Zits works incredibly well — teenagers will easily recognize their parents' constant presence in Walt and Connie, while adults will both remember their own teenage years and recognize their own children in Jeremy's laid-back nature.   (Source: http://tvtropes.org/pmwiki/pmwiki.php/Main/Zits)
Categories: Left

నా కళ్ళద్దాలెక్కడ?

Thu, 07/01/2010 - 11:50
మా ఆవిడకి సాధారణంగా దొరికిపోను కానీ నా కళ్ళద్దాలు కనపడకుండా పోయినప్పుడు మాత్రం దొరికిపోతుంటాను. ఏదన్నా ముఖ్యమయిన పని మీద బయటకి వెళ్ళాల్సివచ్చినప్పుడే నా స్పెక్ట్స్ కనిపించకుండా పోతాయి. వాటికోసం వెతుకుతూ ఇల్లంతా చిందులేసినా అవి నాకు దొరకవుగాక దొరకవు. అదేంటో మా ఆవిడ వెతికితే మాత్రం వీజీగా దొరుకుతాయి.
నా అద్దాలు తప్పిపోయినప్పుడు యథాశక్తిగా కాస్సేపు వెతుకుతాను. సరిగ్గా చూపు ఆనకనే కదా అద్దాలు పెట్టుకొనేది - ఆ ఆద్దాలే తప్పిపోతే నా నానా కష్టాలు మీ భగవంతునికే ఎరుక :(  వెతికి వెతికి ఇక లాభం లేదని మా ఆవిడకి నా మొర వెళ్ళబుచ్చుకుంటాను. ఈ భాగోతం మామూలే కదా అని తను చూస్తున్న సీరియల్ నుండి తల కూడా తిప్పదు. ఈ చెవిన విని ఆ చెవిన పారేస్తుంది. సీరియళ్ళ కోడళ్ళ కష్టాల ఆక్రందనలు చెవుల్లోకి ఎక్కుతాయి కానీ పతి దేవుని అద్దాల కష్టాలు ఎన్నటికి తలకెక్కాలీ? మా ఆవిడ ప్రస్తుతం స్పందించుటలేదు అని నిర్ధారణ అయిన తరువాత ప్రత్యామ్నాయ పద్ధతులు పాటిస్తుంటాను.
మొదటి ప్రత్యామ్నాయం - మా పెద్ద పాప. నా అద్దాలు వెతుకు స్నీ అని అరుస్తాను. అలాగే డాడీ అని గూగుల్లో 'శరత్ - స్పెక్ట్స్' అని వెతుకుతుంది. నో రిజల్ట్స్ డాడీ అని తను మళ్ళీ కేకేస్తుంది. ఇహ దానితో పని కాదని చెప్పి మా చిన్న గడుగ్గాయిని నా అద్దాలు వెతకమని బ్రతిమలాడుతాను. పాపం అది మూడులో వుంటే బాగానే కష్టపడి వెతుకుతుంది కానీ సాధారణంగా దానికి కూడా దొరకవు. ఇహ మూడు లేకపోతే హూ కేర్స్, వాటెవర్, ఐ డోంట్ కేర్ అనో అనేసి నన్ను దులిపేసుకుంటుంది. ఇక లాభం లేక, బిక్క మొఖం వేసుకొని మా ఆవిడ చెంత కూర్చొని బేల ముఖం వేసుకొని నా గోడును వెళ్ళబోసుకుంటాను.
ఎప్పుడూ జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకుంటే ఏం పోయింది అని గయ్ మంటుంది. నేను సవినయంగా జాగ్రత్తగానే పెట్టుకున్నాను కానీ ఎక్కడ జాగ్రత్త చేసి పెట్టానో గుర్తుకు వచ్చి ఛావడం లేదు అని తెలియజేసుకుంటాను. నాకెప్పుడూ నీ అద్దాలు వెతకడమే పనా అని కూర్చున్నచోటునుండి కదలకుండా, సీరియల్ సీరియస్సుగా చూస్తూ అరుస్తుంది. నేను వ్యూహాత్మక మౌనం పాటిస్తూ చేతులు నులుపుకుంటూ అలాగే బిక్క మొఖం కంటిన్యూ చేస్తుంటాను. అప్పుడు నా మీద జాలి కలిగి చూస్తున్న సినిమానో, సీరియల్లో త్యాగం చేసేసి నా అద్దాలు వెతకడానికి ఉపక్రమిస్తుంది.
అంతటితో ఈ శరత్ కష్టాలు తీరతాయని అనుకుంటున్నారా? అబ్బే లేదు. ఇది అంతం కాదిది ఆరంభం మాత్రమే. నా బలహీన క్షణాలు మా ఆవిడకి తెలుసు కదా. అలా అలా అలవోకగా అద్దాలు వెతుకుతూ ఎన్ని రోజులుగానో నా మీద పేర్చుకున్న ఆగ్రహం, విసుగు, కోపం లాంటివి వుంటే అవన్నీ తాపీగా నామీద తీర్చేసుకుంటుంది. మామూలుగా నయితే నేను ఇంట్లో కూడా ఎవరినీ మాట మాట్లాడనీయకుండా నా తొడ కొడుతూ వుంటాను కదా. ఇప్పుడయితే ఏమని అన్నా కుక్కిన పేనులాగా పడివుంటాను. ఇదే అదనుగా నా మీద మాటలతో తీర్చుకోవాల్సిన ప్రతీకారాలన్నీ తీర్చేసుకుంటుంది. ఎప్పటెప్పటి విషయాలో ఆడాళ్లకి భలేగా గుర్తుంటాయి. అవన్నీ ఇదే అదనుగా ప్రశ్నిస్తుంది. నేను ఏమన్నా ఎదురు తిరిగి మాట్లాడితే ఆమె నా అద్దాలు వెతకదు కదా. అందుకే ఆ వాగ్బాణాలు మౌనంగా భరిస్తూ మనస్సులో బుసలు కొడుతూవుంటాను. అనువు కానప్పుడు అధికులమనరాదు కదా!  
అదేంటోనండి - నా కళ్ళద్దాలు మా ఆవిడకి వీజీగా దొరికేస్తుంటాయి. ఇక్కడే వున్నాయి కదా - సరిగ్గా వెతుక్కొని చావడం రాదు. ఈ సారి నుండయినా జాగ్రత్తగా పెట్టుకో - మరో సారి అద్దాలు వెతికేది లేదు అంటూ వార్నింగు సుభాషితాలు పలుకుతూ అద్దాలు నా చేతికి ఇస్తుంది. ఆమెకు కనపడిన చోటే ఎన్నో సార్లు నేను వెతికినా నాకు అవి కనపడవు ఎందుకో మరి.
కార్డ్‌లెస్ ఫోను దొరకకపోతే దానికి బేస్ నుండి పేజ్ చేయవచ్చు కదా. అలాగే ఈ అద్దాలు తప్పిపోతే దొరకడానికి అలాంటి పేజింగ్ సిస్టం ఎవరయినా కనిపెడితే ఎంత బాగుండును. నా కష్టాలు కొన్ని అయినా తీరేవి కదా.
Categories: Left

బి డి ఎస్ ఎం వైపుగా నా అడుగులు

Tue, 06/29/2010 - 12:14
బి డి ఎస్ ఎం http://en.wikipedia.org/wiki/BDSM మీద నాకు ఆసక్తి ఎన్నో ఏళ్ళుగా వున్నప్పటికీ అది ఫాంటసీలకే పరిమితం అయ్యింది. సరి అయిన వేదికలతో పరిచయం లేక, కాంటాక్ట్స్, అది ఆసక్తి వున్న పార్ట్నర్స్ దొరకక అలా ఊహల్లోనే ఇప్పటివరకూ ఫిక్స్ అయ్యాను. రేపటి తరం రోమాన్సు అయిన ఆ ప్రత్యామ్నాయ జీవన విధానానికి సంబధించిన కమ్యూనిటీ చికాగోలో బాగానే వుంది. దానికి సంబధించిన క్లబ్బులు కొన్ని వున్నాయి. సెక్స్ స్వేఛ్ఛకి సంబంధించిన గ్రూపులు ఆయా కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ వుంటాయి.
వయోజనులు పరస్పర అంగీకారంతో చేసుకునే ఎటువంటి శృంగారానికీ అభ్యంతరం వుండకూడదన్న ఐడియాలజీ మీద ఇలాంటి కార్యక్రమాలు లీగలుగా నడుస్తున్నాయి. అలాంటి సంస్థలనూ, కార్యక్రమాలనూ పరిశీలించబోతున్నాను. ఆ తరువాత నేను గమనించిన విషయాలపై మీకు నివేదిక ఇస్తాను.
Categories: Left

మా ఆవిడకు నాకూ మధ్య ఓ చిన్న ధర్మ సంకటం!

Tue, 06/29/2010 - 10:13
ఒక ముఖ్యమయిన పెళ్ళి కోసం నా కుటుంబం వచ్చే నెల ఇండియాకు వెళుతున్నది. పనిలో పనిగా మా పెద్దమ్మాయికి అక్కడ చీర కట్టించే ఫంక్షన్ చేయాలని మా ఆవిడ ఆలోచన. నాకేమో అలాంటి అనవసరపు ఆడంబరాలు, ఖర్చులూ ఇష్టం వుండవు. మనం వద్దనగానే ఇంట్లో వాళ్ళు యెస్ సర్ అని సల్యూట్ చేసి వినరు కదా. వాళ్ళ గొడవ వాళ్ళది. సరే అన్నాను. అయితే ఓ చిక్కొచ్చింది. తండ్రిగా ఆ ఫంక్షనుకి నేను కూడా తప్పనిసరిగా వుండాలని, అందుకని నేను కూడా ఇండియాకి రావాలని మా ఆవిడ అంటోంది.   రకరకాల కారణాల వల్ల ఇప్పుడే ఇండియాకు వెళ్ళే ఉద్దేశ్యం, పరిస్థితులు నాకు లేవు. అందువల్ల నా ఫోటోతో ఒక నిలువెత్తు ఫ్లెక్సీ తయారు చేసిస్తాననీ , దానిని ఒక గడకర్ర కు కట్టి నేను అక్కడే వున్నట్లుగా పని లాగించేయమని మా ఆవిడకి ఉచిత సలహా ఇచ్చాను. ఓ చూపు చూసింది :(       అలాక్కాదని పోనీ మన బదులుగా మీ అక్కా, బావలను ఆ ఫంక్షను నిర్వహించమని చెప్పాను కానీ ఆ ఆలోచననూ కూడా వీటో చేసింది మా ఆవిడ. ఇండియాకు రమ్మనమని రోజూ పోరు. అదొక్కటి తక్క అని నేనూ.
నేను ఇండియాకి రానవసరం లేకుండా మా అమ్మాయికి చీర కట్టించే ఫంక్షన్ నిర్వహించే ప్రత్యామ్నాయం ఏమయినా సూచిద్దురూ. మీకు కాస్త పుణ్యం వుంటుంది!
Categories: Left

క్వీర్ ప్రైడ్ ర్యాలీ సన్నాహాల్లో నేను

Mon, 06/28/2010 - 17:31
చికాగో ప్రైడ్ ర్యాలీలో మా బై గ్రూపు కూడా పాల్గొననుండటంతో మా గ్రూపును రిప్రజెంట్ చేస్తూ అందుకోసం మొన్న కొందరం కలిసి సన్నాహాలు చేసాము. పెగ్గీ, డేవిడ్ ఇంట్లో కలిసాము. విశేషమేమిటంటే వారు పాలిఏమరీ (http://en.wikipedia.org/wiki/Polyamory) గ్రూపు సభ్యులు కూడా. వారిని కలవడం అదే ప్రధమం. వారి 14 ఏళ్ళ అమ్మాయి కూడా ఉత్సాహంగా ఈ సన్నాహాలలో పాల్గొన్నది. ర్యాలీ కోసం ఒక ట్రక్కును అలంకరించాము. బ్యానర్లూ, నినాదాలూ తయారుచేసాము. నేను తెలుగులో కూడా ఒక స్లోగన్ వ్రాసాను. "ద్విలింగ సంపర్కుల హక్కులు కూడా మానవ హక్కులే". ఆ భావం మా మీటప్ నిర్వాహకుడు నోయల్ నచ్చి ఇంగ్లీషులో కూడ వ్రాయమని ప్రోత్సహించాడు.
మాటల సందర్భంలో ఈ ఉద్యమంపై నా కృషి గురించి మిగతావారందరికీ నోయెల్ చెప్పాడు. పురోగతి అడిగి తెలుసుకున్నాడు. పుస్తకం సమస్యనీ, సానుభూతిపరుల సహకారాన్ని వివరించాను.
అయితే నిన్న జరిగిన ర్యాలీకీ మాత్రం వెళ్ళలేకపోయాను. ఇంట్లో వాళ్ళూ, పక్కింట్లో వాళ్ళూ ఫారెస్టు ప్రిజర్వుకి వెళ్దామని గొడవ చేసారు. ముందు రోజే సన్నాహాలకని వెళ్ళాను కాబట్టి ఆ రోజు కూడా నేను వెళతానంటే మా ఆవిడ వీటో చేసింది. ఏం చేస్తాం, కుటుంబం అన్న తరువాత ఆ బాధ్యతలు కూడా నిర్వర్తించాలి కదా. నోరు మూసుకొని అందరినీ తీసుకొని వెళ్ళి రోజంతా ప్రిజర్వులో గడిపాను. మనిషి నిక్కడ, మనస్సు ప్రైడ్ ర్యాలీలో.
ర్యాలీ చాలా గ్రాండుగా గొప్పగా జరిగిందని తరువాత వార్తల్లో, టివిలో చూసి తెలుసుకొని అనందించాను. మాలాంటి వివిధ రకాలయిన ఎల్ జి బి టీ గ్రూపులు 214 ఇందులో పాల్గొన్నాయి. ఇల్లినాయ్ గవర్నర్ కూడా ర్యాలీకి వచ్చారు. పై ఫోటోలో వున్న కంట్రీ మ్యూజిక్ స్టార్ షెలీ రైట్ ఈ ర్యాలీకి గ్రాండ్ మార్షలుగా వ్యవహరించారు. ఎల్ జి బి టి ప్రైడ్ ర్యాలీ వివరాలపై ఆసక్తి వుంటే ఈ క్రింది లింక్స్ క్లిక్ చేయండి. http://www.chicagobreakingnews.com/2010/06/pride-parade-attracts-thousands-despite-weather.html
http://www.chicagotribune.com/news/local/ct-met-pride-parade-0628-20100627,0,7311201.story

http://www.chicagotribune.com/features/chi-100627-pride-parade-chicago-2010-pictures,0,3808193.photogallery 
Categories: Left

ఈ చిత్రం ఏమిటో, ఎవరిదో మీకు ఈపాటికి తెలిసేవుంటుంది...

Mon, 06/28/2010 - 16:03

తెలియకపోతే ఊహించండి. లేటెస్ట్ వార్తలు చూడండి. అయినా అర్ధం కాకపోతే అడగండి. నా అభిమాన నటిది ఈ చిత్రం! అందుకే బ్లాగులో వేసుకున్నా!
Categories: Left