http://saahitya-abhimaani.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
™ Copyright © 2009-2020. All rights reserved.
Updated: 2 min 25 sec ago

రేడియో అభిమానులకు శుభవార్త

Tue, 09/07/2010 - 05:31
అవును శుభవార్తే!

ఎన్నెన్ని రేడియో నాటికలు, రూపకాలు, పరిచయాలు, లలిత సంగీతం!

వినండి ఆనందించండి!

మీ దగ్గర ఉన్న రేడియో కార్యక్రమ రికార్డింగులను అందరితో పంచుకొండి

రేడియో మనకు దైనందిన కార్యక్రమంలో ఒక భాగం. ఇప్పుడు కాదు లెండి. ఒకప్పుడు అంటే, ఒక ముఫ్ఫై ఏళ్ళపైమాట. పొద్దున్నే భక్తీ రంజనితో నిద్ర లేచిన రోజులు మళ్ళి వస్తే బాగుండును అనిపించక మానదు. రేడియోలో వార్తలు వినని రోజున ఏదోగా అనిపించేది. రేడియోలో నాటికలు వచ్చే సమయం గుర్తు పెట్టుకుని, ఎక్కడున్నా సరే ఇంటికి పరుగు పరుగున వచ్చి, రేడియో ముందు కూచుని, ఆ నాటికను ఆ సాంతం విని ఎంతగానో ఆనందించిన రోజులు ఎంత గొప్పవి! అవ్వొక హాయి ఐన రోజులు. రేడియో తో ఒక చక్కటి సులువు ఉన్నది (టి.వికి లేనిది ). రేడియో వింటూ మనపని చేసుకోవచ్చు. దాని ముందే కూచుని మన పనులన్నీ మానుకునేట్టుగా చెయ్యదు పాపం రేడియో.

అలనాడు మనం విని ఆనందించిన రేడియో కార్యక్రమాలను మళ్ళి మనం వినగలిగితే! అంతకంటేనా! అవునుకొంతమంది ఔత్సాహికులు పాత కార్యక్రమాలను పోగుచేసి, మనకు అందిస్తున్నారు. ఎప్పుడెప్పుడో రేడియోలోవస్తున్నప్పుడు రికార్డు చేసుకుని, ఇన్నాళ్ళూ జాగ్రత్తగా దాచి. నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అనుకుంటూ తామొక్కళ్ళే విని ఆనందించటం కాకుండా, తమతో బాటుగా అనేక మంది తమలాంటి అభిమానులు వినటానికి వీలుగా వాళ్ళ వాళ్ళ బ్లాగుల్లోనూ, వెబ్ సైటుల్లోనూ ఉంచారు.

ఇక వివరాలలోకి వెడితే, చూడగానే ఏదో ఒక్క కుటుంబానికి సంబంధిచిన వెబ్ సైటులాగ పేరు కనిపించినా, లోపలకిఆడుగు పెట్టినవాళ్ళు, కొన్ని గంటలు తిరుగాడినా ఇంక ఇంకా చూడవలసినవి కనపడుతూనే ఉంటాయి. ఒక్కటా రెండాఎన్నెన్ని విషశేషాలు. అదే మాగంటి వంశీ గారి వెబ్ సైటు. . ఈ వెబ్ సైటును ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు.

మాగంటి వంశీ గారి వెబ్ సైటు


మాగంటి.ఆర్గ్ వెబ్ సైటును నిర్వహిస్తున్నది శ్రీ మాగంటి వంశీగారు. ఆయన అమెరికాలో ఉంటూ తెలుగు భాష , సంస్కృతి సంరక్షించటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన వెబ్ సైటులో ఉన్న విశేషాలలో కొన్ని:

ఆకాశవాణి కళాకారులు
ఈ విభాగంలో ఆనాడో ఆకాశవాణి లో పని చేసి మనకు వారి గళం ద్వారానే పరిచయం ఉన్న అనేక మంది కళాకారులను చూడవచ్చు.

ఆకాశవాణి నాటికలు:
ఈ విభాగంలో అలనాటి నాటికలను వినవచ్చు.

లలిత సంగీతం
ఇక్కడ దశాబ్దాల క్రితం రేడియోలో వినపడిన లలిత గీతాలను వినవచ్చు.

ఇలా వ్రాసుకుంటూ పొతే అనేకమైనవి ఉన్నాయి ఈ అద్భుతమైన వెబ్ సైటులో.

ఎందుకు ఇక ఆలశ్యం వెంటనే పైనున్న లింకులు నొక్కి ఆనందించండి

ఇలాగే మరొక అద్భుత వ్యక్తి శ్రీ కారంచేడు గోపాలం . ఈ రేడియో కార్యక్రమాల్లో ఎక్కువభాగం ఆయన కలేక్షన్లోనివే. వీరికి సొంతంగా ఒక బ్లాగు ఉన్నది. ఆయన బ్లాగు గురించి మరొక రోజున.

మరొక వ్యక్తి గురించి కూడ ఇక్కడ మనం చెప్పుకుని తీరాలి. వారు "రంజని" గారు. వీరి పూర్తిపేరు ఇతర వివరాలు తెలియవు. ఒక గంధర్వుడిలాగా ఈ వెబ్ ప్రపంచంలోనే పరిచయమయ్యి తన దగ్గర ఓపికగా రేడియో నుంచి రికార్డు చేసుకున్న చక్కటి ఇంటర్వ్యూలను అందచేసారు.

ఇదే విధంగా అలనాటి రేడియో కార్యక్రమాల గురించి వ్రాస్తున్నవారు, తమ దగ్గర అలనాటి రికార్డింగులు ఉన్నవారు అనేక మంది ఉండే ఉంటారు. అందరి దగ్గర ఉన్న అలనాటి ఆణిముత్యాలను అందరికీ అందుబాటులోకి తీసుకు రాగలిగితే, సాంకేతిక విజ్ఞానం మనకు అందించిన చక్కటి కళారూపం రేడియో కార్యక్రమం, రాబోయే తరాలకు అందిచగలుగుతాం.

ఎవరి వద్దైనా అలనాటి రేడియో కార్యక్రమాలు ఉంటే దయచేసి తెలియచేయండి.

Categories: Left

అద్భుత సేకరణ::శభాష్ శ్యాం నారాయణ్

Sun, 08/29/2010 - 09:19
(శ్యాం నారాయణ్ గారి చిత్ర సౌజన్యం ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం 22 08 2010)

హాబీలలో అనేక రకాలు. కొందరు స్తాంపులు సేకరిస్తే, మరి కొందరు పాత పత్రికలు సేకరిస్తారు. మన శ్యాం నారాయణ్ గారు పాత పాటలు, సినిమాలు ఒక ఉద్యమం లాగ సేకరిస్తారు. ఆయనేమీ పెద్ద సాహితీ వేత్తా కాదు, ఆల్ ఇండియా రేడియోలో పనీ చెయ్యటంలేదు. ఒక సామాన్య వ్యాపార వేత్త. హైదరాబాదులో ఫొటో ఫ్రేముల వ్యాపారం. తన వ్యాపారపు పనులు చూసుకుంటూనే, ఓపికగా ఎన్నెన్నో పాటలు, చిత్రాలు, ఆడియో పుస్తకాలు, సినిమాలు సేకరించటం అంటే మాటలు కాదు. ఆయనకు ఆ పాటల మీద, సినిమాల మీద ఉన్న ఆసక్తి అటువంటిది. అలా సేకరించటమే కాదు, ఆ సేకరించిన వాటిని ఒక పధ్ధతి ప్రకారం పదిల పరచటం, అవసరమైనప్పుడు వెను వెంటనే ఎక్కడ ఉన్నదో పట్టి బయటకు లాగి ఆసక్తి ఉన్నవారికి వినిపించటం, చూపించటం. అద్బుతం.

ఈ అరుదైన అద్భుత వ్యక్తి గురించి 22 08 2010 ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురించటం ముదావహం. ఆ వ్యాసం వ్రాసిన సరోజా ప్రసాద్ గారు అభినందనీయులు.

పేపర్లు అప్పుడప్పుడూ సామాన్య ప్రజలలో ఉన్న ఇటువంటి అసాధారణ వ్యక్తుల గురించి వ్రాస్తూ, మరింత మందికి స్పూర్తి కలిగించెదరు గాక.

చందమామ పత్రిక రాజశేఖర రాజుగారు, తన బ్లాగులో సామాన్యంగా, వారి పత్రిక గురించే వ్రాస్తుంటారు. కాని, ఈ అసమాన్య వ్యక్తి శంకర్ నారాయణ్ గురించి వారికి రచన శాయిగారు పేపర్ కట్టింవు పంపగానే, తన "చందమామ చరిత్ర" బ్లాగులో ప్రముఖంగా మరియు విపులంగా వ్రాశారు. ఈ కింది లింకు నొక్కి చదువ వచ్చు.

శ్యాం నారాయణ్ ను అడిగితె పోలా



ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం లో శ్యాం నారాయణ్ గారి మీద వచ్చిన వ్యాసాన్ని ఈ కింది బొమ్మలను క్లిక్ చేసి చదువ వచ్చు. (ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం సౌజన్యం).

శభాష్ శ్యాం నారాయణ్
శభాష్ సరోజా ప్రసాద్
శభాష్ ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం




.

Categories: Left

తెలుగులో కొత్త మాటలు :: తెలుగు భాషా దినోత్సవం

Sun, 08/29/2010 - 02:50


తెలుగు భాషాభివృధ్ధికి, గ్రాంధికంలోనే వ్రాయలన్న కొంతమంది పిడివాదుల వాదన, ఎంతగానో చేటు చేసింది. ఈ పండిత పిడివాదుల కోరల్లోంచి తెలుగు భాషను రక్షించే ప్రక్రియ శ్రీ గిడుగు రామ్మూర్తిగారు చేబడితే, తన అద్భుత శైలితో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం గారు చేసి చూపించారు.

తన రచనా శైలి గురించి చలంగారు తన ఆత్మ కథలో ఈ విధంగా వ్రాసుకున్నారు:

"నేను రచనలు సాగించేటప్పటికి నాకు తెలీకుండానే, నేను మాట్లాడే భాషలోనే వ్రాశాను. తక్కిన కథలని పుస్తకాల భాషలో వ్రాశాను. అసలు ఆనాడు భాషా ఉద్యమం అనేది ఒకటి ఉందని నాకు తెలీదు. గిడుగు రామ్మూర్తి గారి పేరు చింతా దీక్షితులు (ఈయన కూడ రచయిత, చలంగారికి సహ ఉద్యోగి) గారినించే విన్నాను . వారి శిష్యులు ఆలోచించి, భాషని ఎంతవరకు మార్చవచ్చో తూచి రాసేవారు. ఆ యత్నాలు, మడి కట్టుకోటాలు చదివితేనే నాకు అసహ్యం వేసింది. భాష ఎట్లా మారాలో నాకు శాసించాలని చూసేవారు. భర్తని యెన్ని ముద్దులు పెట్టుకొవాలో శాసించినట్లు. కాని ఈ చలం ఓ వరదల్లె వూడ్చుకొచ్చాడు. నా భాషాధాటికి వారికెంత భయమో! పైగా ఆ భాష, భయంలేని, సంకోచంలేని, భీతిలేని, పాత గోడల్ని పడగొట్టే తీవ్రవాది ఓ Master Sculptor చేతిలో పడ్డది. చాలా త్వరలో వీళ్ళ కృతక భాషలన్నీ కుప్పకూలాయి. చలం శైలిలో, రాతలో అంత తీవ్రత అంత inevitability అంత భయంకరాకర్షణ ఉండిపోయింది. ఒక్కొక్కరే ప్రతిఘటించబోయి, పరాజితులై, నా భాషనే అనుకరించారు గతిలేక. ఇంకో విధంగా రాస్తే వాటిని చదవరు ఎవ్వరూ. ఈ భాష, ఈ భావాలు వీలులేదు అని ఎంతమంది మొత్తుకున్నా, ప్రజలు ఎగబడి చదువుతున్నారు. రచయితలు, పత్రికలు చలం పేరు చెప్పకుండా చలాన్ని అనుకరించటం ప్రారంభించారు. భాషాదిగ్గజాల మొకాళ్ళూగిసలాడే పాత నీతుల గోడలు విరిగి కింద కూలాయి"

ఇరవైయ్యో శతాబ్దం మొదటి రోజుల్లో, అంటే 1920లలో మొదలైన ఈ భాషోద్యమం చలంగారి రచనలతో ఊపు అందుకుని, ఎంతగానో అభివృధ్ధి చెంది, ఈ రోజున వాడుక భాష, వ్రాత భాష అనే తేడా పెద్దగా లేకుండా చేసింది. చక్కటి శైలితో, సులువైన పదాలతో, దీర్ఘ సమాస పదాడంబరాలు, లేకుండా తెలుగు వచ్చిన అందరికీ అర్ధమయ్యే భాషలో వ్రాసే ఎందరో రచయితలు మనకు ఉన్నారు. అందులో శ్రీయుతులు కొడవటిగంటి కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజు, మధురాంతకం రాజారాం వంటి దిగ్గజాలు అనేక మంది యువతీ యువకులకు స్పూర్తి ప్రదాతలయ్యారు. ఈ రోజున ఇంతమంది రచయితలు మనకు తయారయ్యారంటే, వ్రాసే ఆసక్తిని పెంచి పెంపొందించటమే కాక, ఎవరికి వచ్చిన భాషలో వాళ్ళు వ్రాయచ్చు అని చేసి చూపించిన ఆ మొదటి తరం రచయితలకు, తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా నివాళి అందిచాల్సిందే.

ఈ మధ్య, తెలుగు భాషలో కొన్ని పదాలను కొత్తగా ఏర్పరచాలన్న కోరిక ఎక్కువైపోయి, కొన్ని చిత్ర విచిత్రమైన మాటల తయారీకి కొంతమంది ప్రయత్నిస్తున్నారని నాకు అనిపిస్తున్నది. భాష అనేది, సామాన్య ప్రజల నోళ్ళనుండి, వారి వాడుకనుండి తయారవ్వాలి కాని, పడితులనుకునే వారు, డ్రాయింగు రూముల్లో (దీనికి తెలుగేమిటోకదా!) కూచుని తమ పాండిత్య ప్రదర్శనకోసం తయారు చేసే మాటల వల్ల కొత్త మాటలు వాడుకలోకి రావు.

మనకు కొత్తగా ప్రయాణ సాధనమైన రైలు వచ్చినప్పుదు, పండితులు "ధూమ శకటం" అన్న పేరు కనిపెట్టారు. కాని సామాన్య ప్రజలు, హాయిగా "పొగ బండి" అని చులాగ్గా ఒక తెలుగు పేరు వాడెయ్యటం మొదలు పెట్టారు. అలాగే "హాస్పిటల్" అన్న ఆంగ్ల పదానికి, ఆసుపత్రి అన్న మాట సులువుగా ఒక తెలుగు పదమై పోయింది. మనకు ఇప్పుడు అనేక పట్టణాలలో , నగరాలలో ఫ్లై ఓవర్లు దర్శనమిస్తున్నాయి. దీనికి పండితులైతే ఏమని పేరు పెట్టేవారో తెలియదు కాని, "పై వంతెన" అన్న మాట వాడుకలోకి వస్తున్నది. తెలుగులో పుట్టని కొన్ని పదాలకి తప్పనిసరిగా ఒక తెలుగు పదం తయారు చెయ్యాలన్న తపనతో, చిత్ర విచిత్రమైన మాటలు, చివరికి ఇనుప గుగ్గిళ్ళు, కంకర్రాళ్ళ వంటి మాటలను తయారుచేసి సామాన్యులను భయపెట్టే ప్రయత్నం భాషాభివృధ్ధికి ఏమాత్రం ఉపయోగ పడదు. పైగా, మళ్ళి గ్రాంధిక భాషా వాసనలు పెల్లుబికి సామాన్య ప్రజలను భాషాభివృధ్ధిలో భాగస్వాములు కాకుండా చేసే ప్రమాదమున్నది.

ఆంగ్ల భాషలో ఒక అద్భుతమైన గుణం ఉన్నది. అదేమిటి అంటే, "మాట" ఏ భాషలోనిదైనా సరే, ఆ మాటను పెద్దగా ఆంగ్లీకరించకుండా, యధాతధంగా వాడకుండా, కొద్ది మార్పు చేసి ఒక ఆంగ్ల పదం చెయ్యటం. ఈ శక్తి ఆంగ్ల భాష మాట్లాడే ప్రజలకు ఎక్కువగా ఉండటం వల్ల ఆంగ్ల భాష దాదాపుగా ప్రపంచ బాష అయ్యింది. అటువంటి శక్తిలేని లాటిన్ వంటి ప్రాచీన భాషలు కనుమరుగయ్యి, పుస్తకాలకు, పండితులకు మాత్రమే పరిమతమయ్యాయి. మనం తెలుగులో కూడ అనేకానేక మాటలను ముఖ్యంగా ఆంగ్ల, పారశీక, ఉర్దూ, హిందీ మాటలను తెలుగీకరించాము. రోడ్ అనే ఆంగ్ల పదం తెలుగులో రోడ్డు అయ్యింది. ఆ పదాన్ని, రహదారి అని ఎవ్వరూ అనడటంలేదు. చివరకు ప్రభుత్వ శాఖ ఐన Roads and Builldings రోడ్లు భవనాల శాఖగా మారింది కాని రహదారులు భవనాల శాఖ అవ్వలేదు. ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. అలాగే, బాంకు, చెక్కు, డ్రాఫ్టు, బిల్లు, పంపు, సైకిలు, ఫ్యాషను, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకానేక ఉదాహరణలు. ఇలాంటి చిన్ని చిన్ని పదాలకు, తెలుగు పదాలను కనిపెట్టే ప్రయత్నంలో, ఆ పదాల అర్ధాలను భ్రష్టు పట్టించే బదులుగా, ఉన్న చిన్న ఆంగ్ల పదానికి ఉకారమో అకారమో తగిలించి తెలుగు చెయ్యటమే మంచి పధ్ధతి. కారణం, అయా పదాలు విదేశాలలో కనిపెట్టబడిన వస్తువులు, విశేషాలకు సంబంధిచినవి. వాళ్ళు వాటికి సరిపొయ్యే పదాలను కాలక్రమేణా స్థిరపరిచారు (Bicycle, Cycle అయ్యింది, మనం తెలుగులో కూడా కొన్ని బైసికిల్ అనటం కూడ కద్దు).

కొన్ని కొన్ని పదాల తెలుగీకరణ ఎబ్బెట్టుగా ఉంటుంది. ఉదాహరణకి, ఇంటర్నెట్టునే తీసుకుందాము. ఇంటర్నెట్ అనే ఆంగ్ల పదాన్ని యధాతధంగా వాడే బదులు ఇంటర్‌నెట్టు అని మార్చి దానిని తెలుగు పదం చెయ్యటమే శ్రేష్టం. ఆంగ్లంలో నెట్ అనే పదం ఉన్నదికాబట్టి, ఆ పదానికి సామాన్య అర్ధం వల కాబట్టి, ఇంటర్ అంటే మధ్య అని తెలుసు కాబట్టి, ఇంటర్నెట్ ను అంతర్జాలం అనటం నాకు ఎందుకనో నప్పలేదు అనిపిస్తుంది. ఎక్కడైనా కంప్యూటర్ గురించి తెలిసిన ఆంగ్ల భాష అంతగా రాని వారు కూడ ఇంటర్నెట్ అంటే అర్ధమయ్యినట్టుగా ఈ అంతర్జాలం (ఏదో ఇంద్రజాలంలాగ) అటే తికమక పడే అవకాశం ఎక్కువగా ఉన్నది.

భాషలోని పదాల ఉద్దేశ్యం, వాటి భావాన్ని అందరూ ఒకేలాగ అర్ధం చేసుకోవటమే కాని పదాఢంబరం చూపటం కాకూడదు. తెలుగు అకాడమీ వాళ్ళ టెక్స్ట్ పుస్తకాల్లో ఉండే భాష, తెలుగుకి ఏవిధమైన సేవ చేస్తున్నది? వృక్ష శాస్త్రం, రసాయన శాస్త్రం, జంతు శాస్త్రం మొదలుగాగల శాస్త్రాలలోని లాటిన్, గ్రీక్, ఆంగ్ల పదాలను అతి భయంకరంగా తెలుగీకరించి, విధ్యార్ధులు ఝడుసుకునేట్టుగా చేసి, వెంటనే ఆంగ్ల మాధ్యమంలోకి పారిపొయ్యేట్టుగా చేశాయి. ఫిజిక్సు, బయోలజీ, కెమిస్ట్రీ వంటి శాస్త్రాలు చదివేది, ఆ శాస్త్ర విజ్ఞానం వంటబట్టించుకోవటానికి కాని, విదేశీ భాషలను తెలుగీకరించి, వాటిని భట్టీయం వెయ్యటానికి కాదుకదా.

ఏతా వాతా చెప్పేదేమిటి అంటే, తెలుగులో కొత్త పదాల సృష్టి జరుగ వలసినదే. కాని ఆ పేరుమీద నోరు తిరగని, హాస్యాస్పదంగా ఉండే పదాలను తయారు చెయ్యటం సబబు కాకపోవటం అటుంచి , భాషాభివృధ్ధికి ఎంతమాత్రం దోహదం చెయ్యదు అని నా అభిప్రాయం.

మరొక్కమాట. బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాసేప్పుడు, కొంతమంది, బధ్ధకం వల్లనో లేక అలా వ్రాయటం గొప్పగా భావించటం వల్లనో, తెలుగును ఆంగ్ల లిపిలో వ్రాస్తుంటారు. అలా తెలుగును ఆంగ్ల లిపిలో వ్రాయటం వల్ల చదవటంలో చాలా ఇబ్బంది కలిగి, అసలు చదవటమే మానేయ్యటం జరుగుతుంది. ఏ భాషను ఆ భాష లిపిలో వ్రాస్తేనే బాగుంటుంది. ఆ విధంగా, తెలుగును వేరొక భాషా లిపిలో వ్రాసి ఖూని చెయ్యొద్దని, ఈ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా అలా వ్రాసే అలవాటుగలవారికి విజ్ఞప్తి. తెలుగులో వ్రాయటానికి కొంత శ్రధ్ధ తీసుకుని, (మనకు ఎన్నో ఉపకరణాలు లేఖిని వంటివి ఉన్నయి) కనీసం ఈరోజు నుంచి అయినా, కొద్దిగా శ్రమ తీసుకుని నేర్చుకుని, తెలుగును తెలుగు లిపిలోనే వ్రాయటం మొదలుపెడితే, తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నందుకు ఒక అర్ధం ఉంటుంది.

తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు
Categories: Left

మానసిక కాలుష్యం

Wed, 08/25/2010 - 22:13

మీరు తప్పించుకోలేరు, అవకాశమే లేదు తప్పించుకోవటానికి, కళ్ళు మూసుకున్నా, చెవుల్లో దూదులు పెట్టుకున్నా, ఏమి చేసినా తప్పించుకోలేరు ఈ కాలుష్యం నుండి. ఇది శబ్ద కాలుష్యం కాదు, రసాయన కాలుష్యం కాదు. అదే మానసిక కాలుష్యం. ఇదేదో ఫ్యాక్టరీలు కలిగిస్తున్నది కాదు. మరేవరో, ఇంకెవరో కలిగిస్తున్నది కాదు.

సమాజాన్ని ఉత్తేజితులను చేసి, సమాజంలో ఉండే తప్పుడు భావాలను, అపనమ్మకాలను వమ్ముచేసి విద్యావంతులను ( ! ! ) చేయటానికి కంకణం కట్టుకుని, ప్రజా స్వామ్యానికి నాలుగో స్తంభంగా తమకు తామే పేరు పెట్టుకున్న, ఘనతవహించిన మీడియా. అవి పత్రికలు కావచ్చు, రేడియో కావచ్చు, ఒక బ్రహ్మాండ పిశాచం లాగ తయారయ్యిన టి.వి కావచ్చు. వాళ్ళందరూ కలిగించేదే మానసిక కాలుష్యం. ఇదొక కాలుష్యం అని తెలియకుండా, చక్కగా పంచదార పూత పూసి, ధారావాహికలని, వార్తలని, మరింకేదో అని మనం తప్పించుకోవటానికి వీల్లేకుండా నిద్ర లేచిన తరుణం నుండి, పడుకునే వరకు (నిద్రలో కూడ మనకు కలల్లో అవ్వే వచ్చేట్టుగా) మనని పట్టి పీడిస్తున్నది ఈ మీడియా వెనుక ఉన్న అడ్వర్టైసుమెంటు మాఫియా, అవును మాఫియానే.

ఇంట్లోంచి బయటకు రాగానే ఎదురుగుండా ప్రత్యక్షం ఒక పెద్ద హోర్డింగు, దానిమీద ఏవేవో వెర్రి మాటాలతో ప్రకటనలు. ఏమని, అదేదో ఒక వస్తువో లేక సెల్ కనెక్షనో తీసుకోమని తిరకాసు మాటలతో అర్ధింపు లాంటి ఆజ్ఞ. మనం చిన్నప్పుడు బ్రాహ్మడు మేక కథ చదివే ఉంటాము. అందులో మేకను పట్టికెళ్తున్న బ్రాహ్మడిని మోసం చేసి ఆ మేకను కొట్టేయటానికి కొందరు పథకం ప్రకారం, అతను తీసుకెళ్తున్నది మేక కాదని, కుక్క అని పదే పదే విడి విడిగా చెప్తారు. పాపం ఆ అమాయకుడు అన్ని సార్లు రకరకాలుగా చెప్పేప్పటికి, తన కళ్ళు కూడ తనను మోసం చేస్తున్నాయని ఒక నిర్ణయానికొచ్చేటుగా చేసి ఆ మేకను కాస్తా కాజేస్తారు ఆ దుష్టులు. ఆ తరువాత ఆ మేకను ఏం చేసి ఉంటారో తెలుసుకోవటానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు.

అదే పధ్ధతి, ఈ ప్రకటనల ఉద్దేశ్యం కూడ. ఒక్కసారి కాదు అనేకసార్లు, వేల సార్లు, అనేక చోట్ల, ఇక్కడ అక్కడ అనిలేదు, రోడ్లమీద హోర్డింగులు, రోడ్డు డివిడర్లు, బస్సుల మీద, రైళ్ళ పెట్టెల మీద, పత్రికలు, రేడియోలు, సరే టి.విలు, ఏదైన టిక్కెట్టు కొంటే దాని వెనకాల, ఏటిఎం లో డబ్బులు తీసుకున్న తరువాత వచ్చే చీటి వెనుకాల, ఎందెందు వెతికిన అదెందు కలదు ఈ కాలుష్యం. చివరకు ఎంత బరితెగించి పొయ్యారంటే ఈ కాలుష్య కర్తలు, కుర్రాళ్ళ భుజాలకు ఈ ప్రకటనలు కట్టి రోడ్ల మీద ఎండలో వరుసగా నిలుచో పెడుతున్నారు . ఇలా కుర్రాళ్ళను ఎండలో నిలబెట్టటాన్ని ఇంతవరకూ ఏ సామాజిక కార్యకర్త (?) విమర్శించలేదు.

ఎందుకు ఇంత ప్రకటనల పిచ్చి. ఎలాగో ఒకలాగ తమ వస్తువలను, సేవలను అమ్ముకోవాలి. అమ్ముకోకపోతే సంస్థ నిలవదు. తాము తయారు చేసే వస్తువులను అమ్ముకోవటానికి, ఆ వస్తువలు నాణ్యతే అతి ముఖ్యమైన వ్యాపార ప్రకటన అని మర్చిపోతున్నారు. ఒక తృప్తి చెందిన వినియోగదారుడే ఆ వస్తువుకు అద్భుతమైన ప్రచారాన్ని కలుగ చేస్తాడు. ఇటువంటి అరోగ్యకరమైన ధోరణి ఇప్పుడు లేదు. ఎలాగో ఒక లాగ తమ వస్తువులను మనకు చుట్టబెట్టి అమ్మేసుకోవలి. నాణ్యత ఉంటే ఉండచ్చు, లేకపోతే లేదు, అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ వస్తువు అవసరం మనకు ఉన్నదా లేదా అని మన నిర్ణయాన్ని వాళ్ళే చేసేస్తారు, మనను ఆలోచించుకునే అవకాశం వెసులుబాటు లేకుండా తమ ప్రకటనా (కాలుష్య) పాటవంతో మనను ఉక్కిరి బిక్కిరి చేసేసి, మనం ఒక హిప్నొటిక్ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయేట్టు చేసి తమ వస్తువును తాము నిర్ణయించిన వెలతో (అందులో లాభ శాతం చాలా సార్లు 100% కంటే ఎక్కువగా ఉంటుంది) మన చేత కొనిపించేస్తారు.

ఆర్ధిక శాస్త్రంలో మానవుడి అవసరాలను మూడు విధాలుగా విభజించబడినాయి. అవి మనిషి ఆర్ధిక స్థాయినిబట్టి అవి అటు ఇటు మారుతుంటాయిట! అవేమిటంటే నిత్యావసరాలు, సౌకర్యాలు, విలాసాలు. అని. మనం కొంత నిదానించి చూస్తే, వీటిల్లో ఈ వ్యాపార ప్రకటనలు ఏ విధమైన ఉత్పత్తులకు/సేవలకు వస్తున్నాయి? నిత్యావసరాలైన బియ్యం, కూరలు వంటివాటికి వ్యాపార ప్రకటనలు రావట్లేదు. ఎందుకంటే అవి పండించే రైతులకు ఇటువంటి అనారోగ్యకరమైన ఆలోచనలు లేవు. పైగా అవి నిత్యావసరాలు కనుక వాటికి గిరాకి ఎక్కువ, మార్కెట్టులోకి వచ్చిన వెంటవెంటనే అమ్ముడుపోతాయి.

అదేదో వ్యాపార వ్యవసాయంట, పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడిప్పుడే తమ విషపు చూపులను వ్యవసాయం వైపుకు సారిస్తున్నాయి. వాళ్ళ ఆలోచనలు విజయవంతమైతే, కొద్దిరోజులలో మనకు బ్రాండెడు వంకాయలు, ఏనుగు మార్కు బంగాళ దుంపలు కొనండి అంటూ దేశంలో గుడ్డల కరువేమో అనిపించేట్టుగా కనిపించే ఓ పిల్ల గెంతుతూ మీ చెవిలో చెప్తుంది. ఆ పిల్లను చూసిన పరవశంలో ఆ బంగాళ దుంపలు కొనెయ్యటానికి ఎగపడతారు జనం. ఇక వ్యాపార ప్రకటనలన్ని కూడ సౌకర్యాలు విలాసాల చుట్టూ తిరుగుతున్నాయి. షాంపూలు, పేస్టులు, సానిటరీ నేప్కిన్‌లు, రేజర్లు/బ్లేడులు, కార్లు/ద్విచక్ర వాహనాలు, రెప్రిజిరేటర్లు, వాక్యూం క్లీనర్లు మొదలగుగా గల అనేకానేక వస్తువులు.

మనం సమాజంలో అందరం కలసి బతకటం నేర్చుకుని చాలా శతాబ్దాలయ్యింది. ఎవరికి చాతనైన పని వారు చేసుకుంటూ, ఇతరులకు తమ వస్తువులను, సేవలను అందిస్తూ బతకటం అనేది విజయవంతంగా జరుగుతున్నది. అందరూ ఎంతో కొంత ఇతరులకు "పనికి వచ్చే" పని (ECONOMIC ACTIVITY) చెయ్యాలి. మనం చేసేపనికి ఇతరులకి ఉపయోగ పడాలి.

ఉత్పత్తి దారునికి, వినియోగదారునికి మధ్య దళారులు ఎక్కువైన కొద్ది ఆ వస్తువు ధర పెరుగుతుంది. ఉత్పత్తి దారునికి, వినియోగదారునికి మధ్య ఆ వస్తువులను ఉత్పత్తి జరిగిన చోటినుండి, వినియోగ దారుని దగ్గరకు తెచ్చి అమ్మటానికి ఒక వ్యవస్థ కావాలి. వారు చేసే పనిలో ఉత్పాదకత వస్తువును ఒక చోటినుండి మరొక చోటికి చేరవేయటమే (PLACE VALUE). ఈ సేవ ఎంతయినా అవసరం.

వ్యాపార ప్రకటనలు ఒక వస్తువు గుణగణాలను వినియోగదారునికి తెలియచెప్పటానికి పనికి వస్తాయి. అ వ్యాపార ప్రకటనలు తగిన మోతాదులో ఉండాలి. మోతాదు మించిన వ్యాపార ప్రకటనల వల్ల వినియోగదారునికి ప్రయోజనం సున్న. పైగా ఈ అనవసర వ్యయం వల్ల, ఉత్పాదకదారు తన వస్తువు ధర పెంచుతాడు. మనం కొనే ప్రతి వస్తువు ధరలోనూ, మనకు రోజూ చూసే హోర్డింగు ధర, వినే టంగు టింగంటూ వినపడే రేడియో ప్రకటన, వార్తా పత్రికలో మొదటిపేజీలో కూడా సగాన్ని మించిన ప్రకటన ధర (కొన్ని పత్రికలు సిగ్గు విడిచి, తమ పత్రిక పేరు పైన కూడ ప్రకటనలను అనుమతిస్తున్నాయి). అనుక్షణం అన్ని ఇళ్ళల్లోనూ మోగే టి.వి. ప్రకటనల ధర నిబిడీకృతమై ఉంటుంది.

వ్యాపార ప్రకటనల ధోరణి చాలా అనారోగ్యకరమైన పంధాలో పడింది. ఏ వస్తువు గురించైనా ఒక పధ్ధతిలో అరోగ్య కరమైన ప్రకటనలు వినియోగదారునికి ఎంతైనా పనికి వస్తాయి. కాని, అవి ఆడుగడుగునా మనల్ని వెంటాడి వెంటాడి తరుమటం వల్ల మనకు తెలియకుండా మన అలోచనా పధ్ధతిని ప్రభావితం చేస్తున్నాయి. ఒక ప్రకటనలో మంచి ధృఢకాయుడైన అందమైన యువకుణ్ణి చూసి పెళ్ళైన ఒక యువతి తన మంగళసూత్రం కనపడకుండా కప్పుకుంటుంది. మరొక ప్రకటనలో ఒకావిడ పూవు కోసే ప్రయత్నంలో ఉంటే ఆవిడ పల్లు గాలికి ఎగిరిపోతుంది, ఆవిడ పరిగెడ్తుంతే ఆవిడ అందాన్ని (ఫోనులో తరువాత మాట్టాడతాలే అని కసిరి మరి) తదేకంగా చూస్తుంటాడు ఒక యువకుడు. ఇక సానిటరీ నాప్కిన్‌ల ప్రకటనల తీరు చెప్ప వీల్లేదు. ఇలా ఒకటని లేదు. అన్ని వ్యాపార ప్రకటనలు అర్ధం పర్ధం లేకుండా ఒక్కటే సూత్రం, తరచి తరచి, మళ్ళి మళ్ళి చూపిస్తూ ఉండి మనకు మానసిక కాలుష్యాన్ని స్లో పాయిజన్ లాగ అందిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి. ఈ వ్యాపర ప్రకటనల తీరు ఎంతవరకు వెళ్ళిందంటే, ఆయా చానెళ్ళ వార్తా ప్రసార ధోరణి, కార్యక్రమాల సరళి, కార్యక్రమాలలో ఉండాల్సిన విషయ విశేషాలను శాసించే విధంగా ఉన్నది. ఏ చానెల్ కు ఎక్కువ రేటింగు ఉంటే ఆ చానెల్ కు అంత ఎక్కువ వ్యాపార ప్రకటన రాబడి వస్తుంది. ఈ రేటింగు కోసం, అన్ని చానెళ్ళు (కొంచెం ఎక్కువ తక్కువ అంతే) తిక్క తిక్క కార్యక్రమాలు, ఇది చూపవచ్చు, ఇది చూపకూడదు అన్న ఇంగితం కూడ లేకుండా తమ వార్తా ప్రసారాలను, ఇతర కార్యక్రమాలను మనమీద వదులుతున్నారు.

నగరాలలో ఎక్కడ చూసినా హోర్డింగులే. పైగా ఆ హోర్డింగులకు రాత్రిపూట లైట్లు!! మనకు తిండి పండించే రైతుకు కరెంటు కట్ పెట్టి మరీ నగరాల్లో ఉన్న ఈ హోర్డింగులకు లైట్లు ఇవ్వాలా. చిత్రమైన విషయం!

ఈ కాలుష్యాన్ని తగ్గించే ఉపాయమే లేదా. ఇటువంటి మానసిక కాలుష్యాన్ని గుర్తించి నియంత్రించే నాదుడే లేడా. ఏమి చెయ్యాలి. మనం కొనే వస్తువులలో ఈ అనవసర వ్యయం ఎంత? మనకు తెలియనివ్వకుండా ఒక ధారావాహిక స్పాన్సర్ చేస్తారు. ఆ ధారావాహిక రోజూ చూడాలనిపించి అనేక నెలలు సాగతీయబడుతుంది. మనం చూస్తూనే ఉంటాము, కొనే వస్తువు ధర పెరుగుతూనే ఉంటుంది.

చాలామందికి అత్యల్పంగా కనిపించే, ఈ ముఖ్యమైన విషయం గురించి కొంత చర్చ AP మీడియా కబుర్లు బ్లాగ్‌లో కొంతవరకు జరిగింది. ప్రకటనల దాడి నుంచి సమాజాన్ని రక్షించే ప్రయత్నం ఎవరు చెయ్యాలి. మీడియా తనంతట తాను ఈ పని చేస్తుందా? చెయ్యదు!! ఎందుకు అంటే, వాళ్ళకు ఇదొక ఆదాయ మార్గం. తమకొచ్చే ఆదాయాన్ని వదుకుంటారా! లేనే లేదు. ఇక మిగిలినది ప్రభుత్వం. ప్రభుత్వాధికార్లకు ఉన్న నిజాయితీ మీద ప్రజలకు నమ్మకం పోయి కొన్ని దశాబ్దాలయ్యింది. మరింకెవరు రక్షిస్తారు మన్ని ఈ కాలుష్యం బారినుండి??

ఎలెక్షన్ కమిషన్ తరహాలో ఒక స్వతంత్రమైన వ్యవస్థను ఏర్పరిచి, అటువంటి వ్యవస్థ ఈ ప్రకటనల తీరుతెన్నులను పరిశీలించి, కొన్ని కఠినమైన నియమాలను (GUIDELINES) తయారు చేసి ఏవిధమైన తిరకాసు, తికమక లేకుండా అమలు పరచాలి. ఈ నియమాలను తయారు చేయ్యటానికి, సమాజంలోని పెద్దలను, వినియోగదారుల సంఘాల సేవలను ఉపయోగించుకోవాలి.

నా ఉద్దేశ్యంలో వ్యాపార ప్రకటనల నియంత్రణకు తయారు చేయాల్సిన నియమాలు ఈ విధంగా ఉండాలి:
  1. ఒక వస్తువు ధరలో, వ్యాపార ప్రకటన ఖర్చు, ఎంత శాతాన్ని మించకుండా ఉండాలి.
  2. ఏ వస్తువులకు వ్యాపార ప్రకటన చెయ్యకూడదు.
  3. ఏక్కడెక్కడ వ్యాపార ప్రకటనలు చెయ్యకూడదు. హోర్డింగుల మీద, రోడ్ డివైడర్ల మీద , రైళ్ళు, బస్సుల మీద ప్రకటనలను, గుడి/పాఠశాల గోడల మీద పూర్తిగా నిషేధించాలి.
  4. టివిలో వచ్చే కార్యక్రమాలలో ఎంతవరకు వ్యాపార ప్రకటనలు ఉండవచ్చు. అంటే అసలు కార్యక్రమానికి, వ్యాపార ప్రకటనకు మధ్య ఉండే నిష్పత్తి. అరగంట అసలు కార్యక్రమంలో, అరనిమిషానికి మించి ప్రకటనలు ఉండకూడదు.
  5. ప్రకటనను ఎన్ని సార్లు ప్రచురించవచ్చు, ఎన్నిసార్లు వినిపించవచ్చు లేదా చూపించవచ్చు. తరచి తరచి చూపించటం వల్ల మనకు తెలియకుండానే ఆ వస్తువు పేరు గుర్తుండిపోయి, మరొక సరైన వస్తువు వెతుక్కునే హక్కును కోల్పోతున్నాము,
  6. ఒక ప్రకటన మళ్ళి ఎంత సమయం తరువాత అదే ప్రకటనను చూపించవచ్చు/వినిపించవచ్చు/ప్రకటించవచ్చు. పేపర్లో ఐతే వారం వ్యవధిలో పున:ప్రచురణ ఉండకూడదు. టి వి రేడియోల్లో మళ్ళి నాలుగు గంటల వరకు చూపించకూడదు./వినిపించకూడదు.
  7. టి.విల్లో వచ్చే ధారావాహికల ఎపిసోడ్ లు ఎన్ని ఉండవచ్చు
  8. టి.విల్లో వ్యాపార ప్రకటనలకు వెచ్చించే సమయంలో తప్పని సరిగా 25% శాతం సామాజిక ఉన్నతికోసం ప్రకటనలను చూపించాలి. పౌర విజ్ఞానం, సాంఘిక దురాచారాలు, తాగుడువల్ల కలిగే నష్టాలు మున్నగునవి
  9. ఏ వస్తువులకైతే ప్రకటనలను నిషేధించారో (సిగిరెట్లు, ఆల్కహాల్) అటువంటి ఉత్పత్తిదారులు తయారుచేసే (అదే బ్రాండు పేరుతో) మరే ఇతర వస్తువులకు ప్రకటనలు చెయ్యరాదు. బ్రాండు పేరుతో కనపడకుండా, నిషేధిత వస్తువు పేరు గుర్తుకు తెస్తున్నారు.
  10. సిగరేట్/ఆల్కహాల్ తయారీదార్లు ఏ విధమైన స్పాన్సరింగు చెయ్యకుండా కట్టడి చెయ్యాలి.

ఈ విధంగా కొంతవరకూ నియమాలను చేసుకుని ఈ వ్యాపార ప్రకటనా కాలుష్యాన్ని కొంతలో కొంతవరకూ నియంత్రించవచ్చు అని నా అభిప్రాయం.












.

Categories: Left

పౌరసత్వం?

Tue, 08/24/2010 - 22:54





ఈరోజున పౌరసత్వం పేరిట మన చదరంగపు మేటి ఆటగాడు శ్రీ విశ్వనాథన్ ఆనంద్ కు జరిగిన అవమానం తలుచుకుంటేనే మనసు రగిలిపోతోంది.

మనదేశంలో పుట్టని, ఒక ఫాసిస్టు దేశంలో పుట్టి పెరిగి, మనదేశానికి చెందిన ఒక పైలట్టును వివాహమాడినంత మాత్రాన భారతదేశపు పౌరసత్వం వచ్చేసిందని నానా యాగీ చేసి, దేశ ప్రధాని పట్టం కట్టబెట్టటానికి ఇదే నాయకులు 2004 లో ఎంత తాపత్రయ పడ్డారో మనం చూశాం. ఆ సమయంలో దేశభక్తి కల, "భారతీయ" రాష్ట్రపతి ఉండటంవల్లకదా మనకా ముప్పు తప్పింది.

అదే నాయకమన్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈనాటి ప్రభుత్వం, విశ్వనాథన్ ఆనంద్ పౌరసత్వం గురించి ప్రశ్నించటమా, ఆయన పౌరసత్వం గురించి చర్చ, దర్యాప్తూనా. అలోచనా ధోరణులలో ఎంత తేడా??.

కాసేపు మన ఆనందుకు వేరొక దేశపు పౌరసత్వం కూడ ఉందనుకుందాము. ఆయన పుట్టుకతోనే భారతీయుడే. అడిగేవాళ్ళకు ఆమాత్రం "ఇంగితం' ఉండద్దూ. వీళ్ళకి దేశ ప్రధాని కావటానికి విదేశీయులు పనికివస్తారు . పైగా వితండవాదం చేసి మరీ నెగ్గుకు వస్తున్నారు. స్వంత ప్రతిభతో, మేధస్సుతో రాణిస్తున్న విశ్వనాధన్ ఆనంద్ వీళ్ళకి విదేశీయుడయ్యాడా? సిగ్గు! సిగ్గు!

యాసిర్ అరాఫత్ కు (ఈయనెవరో మీకు గుర్తు ఉండే ఉంటుంది) గౌరవ పట్టాలిచ్చిన దేశం మనది. విశ్వనాధన్ ఆనంద్ ఆ గౌరవ పట్టా తిరస్కరించి తన గౌరవం నిలబెట్టుకున్నారు.
Categories: Left

పి బి శ్రీనివాస్ మొహమ్మద్ రఫీ జుగల్ బందీ

Sun, 08/22/2010 - 12:29
తెలుగు హిందీ సినిమాలలోని పాటలు, ఒకచోట హిట్ అయినవి మరోకచోటకు ప్రేక్షకులకు అందించటం లో మన సినిమా వారు అందే వేసిన చెయ్యి .అనేకానేక పాటలు తెలుగులోంచి హిందీలోకి అలాగే హిందీలోంచి తెలుగులోకి వచ్చి ప్రేక్షక శ్రోతలను అలరించాయి.

ఆ విధంగా వచ్చిన ఒక హిందీ పాట, తెలుగు పాటల సాహిత్యం కింద ఇస్తున్నాను. తెలుగులో మదన కామరాజు కథ సినిమాలోది, హిందీలో చౌద్వీ కా చాంద్ సినిమాలోది. తెలుగులో పాడిన గాయకుడు శ్రీ ప్రతివాద భయంకర శ్రీనివాస్ ( పి బి శ్రీనివాస్), హిందీలో పాడిన గాయకుడు శ్రీ మొహమ్మద్ రఫీ.
v\:* {behavior:url(#default#VML);} o\:* {behavior:url(#default#VML);} w\:* {behavior:url(#default#VML);} .shape {behavior:url(#default#VML);} Normal 0 false false false false EN-US X-NONE TE MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin;} table.MsoTableGrid {mso-style-name:"Table Grid"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-priority:59; mso-style-unhide:no; border:solid black 1.0pt; mso-border-themecolor:text1; mso-border-alt:solid black .5pt; mso-border-themecolor:text1; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-border-insideh:.5pt solid black; mso-border-insideh-themecolor:text1; mso-border-insidev:.5pt solid black; mso-border-insidev-themecolor:text1; mso-para-margin:0in; mso-para-margin-bottom:.0001pt; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin;}

మదన కామరాజు కథ

చౌద్వీ కా చాంద్



నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదినే దోచిపోదువో

నీలి మేఘమాలవో నీలాల తారవో

నీ సోయగాలతో మదినే దోచిపోదువో నీలి మేఘమాలవో నీ మోములోన జాబిలి దోబూచులాడెనే నీ కురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే నిదురించు వలపు మేల్కొలిపి దాగిపోదువో నీలి మేఘమాలవో

నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే

నీ వలపు తీరని మధురాల రావమే నిలచేవదేల నా పిలుపు ఆలకించవో

నీలి మేఘమాలవో రాదేల జాలి ఓ చెలీ

ఈ మౌనమేలనే రాగాల తెలిపోదమే జాగేల చాలునే రావో యుగాల ప్రేయసీ నన్నాదరించవో నీలి మేఘమాలవో నీలాల తారవో

నీ సోయగాలతో మదినే దోచిపోదువో నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదినే దోచిపోదువో నీలి మేఘమాలవో




चौदवीं का चाँद हो , या आफताब हो
जो भी हो तुम खुदा की कसम , लाजवाब हो

जुल्फें हैं जैसे काँधे पे बादल झुके हुए
आँखें हैं जैसे मे के प्याले भरे हुए
मस्ती है जिसमे प्यार की तुम , वोह शराब हो
चौदवीं का चाँद हो ...

चेहरा हा i जैसे झील में खिलता हुआ कँवल
या ज़िन्दगी के साज़ पे छेदी हुई ग़ज़ल
जाने बहार तुम किसी शायर का ख्वाब हो
चौदवीं का चाँद हो ...

होठों पे खेलती हैं तबस्सुम की बिजलियाँ
सजदे तुम्हारी राह में करती हैं कैकशां
दुनिया -इ -हुस्नो -इश्क का तुम ही शबाब हो
चौदवीं का चाँद हो ...


మా తమ్ముడు రాధాకృష్ణ ఈమధ్యనే కంప్యూటర్ కొని, నెట్ లోకంలోకి వచ్చాడు. సంగీతం మీద మంచి అభిరుచి ఉన్నది. ఈ రెండు పాటలనూ కలిపి మిక్స్ చేసి ఫైలు పంపాడు . ఆ పాటతో ఒక చిన్న వీడియో తయారుచేసాను. ఈ కింద ఆ వీడియోను ఇస్తున్నాను, చూసి/విని ఆనందించండి.



హిందీ పాటకు సంగీతం సమ కూర్చినది శ్రీ రవి. కాని, తెలుగులో మదన కామరాజు కథ సినిమాలో ఉన్న ఈ పాటకు సంగీతం సమకూర్చినది సాలూరి రాజేశ్వరరావుగారని ఒక చోట ఉన్నది. ఆ సి.డి కవరు మీద శ్రీయుతులు రాజన్-నాగేంద్ర అని ఉన్నది. ఈ రెంటిలోనూ ఏది సరైన సమాచారమో తెలియటంలేదు. తెలిసిన వారు చెప్పగలరు.

హిందీలో పాట రచన శ్రీ షకీల్ బదాయుని. తెలుగు సినిమాకు రచించినది శ్రీ పింగళి నాగేంద్రరావు.


ఎంతో శ్రమకోర్చి, ప్రత్యెక సాంకేతిక పరిజ్ఞానం కాని, సామగ్రి కాని లేకుండా, కంప్యూటర్ సాయంతో, మామూలు సాఫ్ట్వేర్లతో ఈ రెండు పాటలనూ ఎక్కడా ఎక్కువ తక్కువలు కాకుండా చక్కగా కలిపిన కప్పగంతు రాధాకృష్ణకు అభినందనలు .











.












.

Categories: Left

ఒక చక్కటి బ్లాగ్

Fri, 08/20/2010 - 00:01
మనకు తెలుగులో అనేకానేక బ్లాగులు కనపడుతూ ఉంటాయి. సామాన్యంగా బ్లాగులో ఎవరి అభిరుచినిబట్టి వారు వ్రాస్తూ ఉంటారు. అన్ని బ్లాగుల్లోనూ తప్పనిసరిగా ఉండేవి, ఆయా బ్లాగు యజమానుల గురించిన వివరాలు, ఈ మెయిలు వగైరా. కాని ఈరోజున ఒక తెలుగు పాట సాహిత్యం వెతుకుతూ ఉంటే ఒక మంచి తెలుగు బ్లాగు కనపడింది.

ఎక్కడా ఏవిధమైన ఆర్భాటం, సొంత డబ్బా లేకుండా శ్రీ చింతలపాటి శ్రీధర్ గారు తెలుగులో ఉన్న అపురూపమైన పాటల సాహిత్యాన్ని అందిస్తున్నారు. మొత్తం మీద నాలుగైదు పాటలకి మాత్రమె అటువంటి సాహిత్యాన్ని అందించినా, నాకు ఈ బ్లాగు చాలా నచ్చింది. పాట సాహిత్యం ఎవరు వ్రాశారు, సంగీతం ఎవరు సమకూర్చారు, ఏ సినిమాలోది, పాడిన గాయనీ గాయకులూ వంటి పూర్తి వివరాలను అందించారు.

ఇంత చక్కటి బ్లాగు నిర్వహిస్తున్న శ్రీధర్ గారిని వ్యక్తిగతంగా మెయిలు పంపి అభినందిద్దామని ప్రయత్నిస్తే, ఆ బ్లాగులో ఆ అవకాశం లేదు. ఒక కామెంటు వ్రాయటానికి కూడా ఆప్షన్ ఏర్పరచలేదు.

శ్రీధర్ గారూ మీ బ్లాగ్ అద్భుతంగా ఉన్నది . మీకివే నా అభినందనలు కృతజ్ఞతలు

శ్రీధర్ గారూ, మే నెల తరువాత మీరు మళ్ళి ఏ పాట గురించి వ్రాయలేదు. మీరు చేస్తున్న చక్కటి పని దయచేసి కొనసాగించగలరు.

ఈ చక్కటి బ్లాగును ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు.

తెలుగు పాటల సాహిత్యం

ఇలా మనకు తెలుగులో ఉన్న చిత్ర గీతాలు, లలిత గీతాలు అన్నిటికి మించి కర్నాటక సంగీతం గురించిన వివరాలు అందించటానికి అభిరుచి కలిగిన ఐదారుగురు కలిసి ఒక బ్లాగులో వ్రాయటం మొదలుపెడితే, చక్కటి తెలుగు పాటల "భాడారం" తయారవుతుంది.

ఇలా తెలుగు పాటల సాహిత్యం సేకరించి ఒక చక్కటి బ్లాగు రూపొందించి, అందులో కనీసం వారానికి రెండు పాటలు అందిస్తే చాలు సంవత్సరానికి నూట నాలుగు పాటలు అవుతాయి. బృందంలో ఉండే సభ్యుల సంఖ్య అంతకంటే సభ్యుల హుషారును బట్టి పాటల ఖజానా పెరుతుగుంది.

అటువంటి అవకాశం ఉందంటారా!!

చూచెదము గాక.





Categories: Left

ఒక చక్కటి తెలుగు బ్లాగ్

Thu, 08/19/2010 - 23:18
మనకు తెలుగులో అనేకానేక బ్లాగులు కనపడుతూ ఉంటాయి. సామాన్యంగా బ్లాగులో ఎవరి అభిరుచినిబట్టి వారు వ్రాస్తూ ఉంటారు. అన్ని బ్లాగుల్లోనూ తప్పనిసరిగా ఉండేవి, ఆయా బ్లాగు యజమానుల గురించిన వివరాలు, ఈ మెయిలు వగైరా. కాని ఈరోజున ఒక తెలుగు పాట సాహిత్యం వెతుకుతూ ఉంటే ఒక మంచి తెలుగు బ్లాగు కనపడింది.

ఎక్కడా ఏవిధమైన ఆర్భాటం, సొంత డబ్బా లేకుండా శ్రీ చింతలపాటి శ్రీధర్ గారు తెలుగులో ఉన్న అపురూపమైన పాటల సాహిత్యాన్ని అందిస్తున్నారు. మొత్తం మీద నాలుగైదు పాటలకి మాత్రమె అటువంటి సాహిత్యాన్ని అందించినా, నాకు ఈ బ్లాగు చాలా నచ్చింది. పాట సాహిత్యం ఎవరు వ్రాశారు, సంగీతం ఎవరు సమకూర్చారు, ఏ సినిమాలోది, పాడిన గాయనీ గాయకులూ వంటి పూర్తి వివరాలను అందించారు.

ఇంత చక్కటి బ్లాగు నిర్వహిస్తున్న శ్రీధర్ గారిని వ్యక్తిగతంగా మెయిలు పంపి అభినందిద్దామని ప్రయత్నిస్తే, ఆ బ్లాగులో ఆ అవకాశం లేదు. ఒక కామెంటు వ్రాయటానికి కూడా ఆప్షన్ ఏర్పరచలేదు.

శ్రీధర్ గారూ మీ బ్లాగ్ అద్భుతంగా ఉన్నది . మీకివే నా అభినందనలు కృతజ్ఞతలు

శ్రీధర్ గారూ, మే నెల తరువాత మీరు మళ్ళి ఏ పాట గురించి వ్రాయలేదు. మీరు చేస్తున్న చక్కటి పని దయచేసి కొనసాగించగలరు.

ఈ చక్కటి బ్లాగును ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు.

తెలుగు పాటల సాహిత్యం

ఇలా మనకు తెలుగులో ఉన్న చిత్ర గీతాలు, లలిత గీతాలు అన్నిటికి మించి కర్నాటక సంగీతం గురించిన వివరాలు అందించటానికి అభిరుచి కలిగిన ఐదారుగురు కలిసి ఒక బ్లాగులో వ్రాయటం మొదలుపెడితే, చక్కటి తెలుగు పాటల "భాడారం" తయారవుతుంది. అటువంటి అవకాశం ఉన్నదా!! అడియాసేనా?



Categories: Left

టాప్ ఆఫ్ ది వరల్డ్

Sun, 08/15/2010 - 14:32

మనకు అనుకున్నది జరిగినప్పుడు, మనం ఇష్టపడిన వారిని కలుసుకోబోయే ముందు ఇంకా ఇలా అనేక సంతోషకర సమయాలలో అనుభవించే ఆనందం చెప్పనలవి కాదు. అటువంటి ఆనందాన్ని ఒక పాటగా వ్రాసి పాడుకోగాలిగితే! అదేపని చేసారు కార్పెంటర్స్.

వారి పేరు చూసి అదేదో చేక్కపని చేసి చూపించారని అనుకోకండి. "కార్పెంటర్స్" వారి ఇంటిపేరు. అన్నా చెల్లెళ్ళు అయిన రిచర్డ్ కార్పెంటర్, కారెన్ కార్పెంటర్ లు కలిసి "కార్పెంటర్స్" అన్న మ్యూజిక్ గ్రూప్ నెలకొల్పి అనేక పాటలు పాడారు. 1970 లలో పాశ్చాత్య సంగీతం అంటే పెద్దగా చప్పుడు హడావిడిగా మారుతున్న సమయంలో, పాటలో ఉండే సాహిత్య విలువలు, చక్కటి సంగీతంతో ప్రజల ముందుకి వచ్చి కార్పెంటర్స్ ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను అలరించారు. వారు పాడిన పాటలలోకేల్ల నాకెంతో ఇష్టమైన పాటను మీ అందరితో పంచుకోవటానికి ఈ కింద ఇస్తున్నాను.




ఈ పాట సాహిత్యం ఈ క్రింది విధంగా ఉన్నది .

Such a feelin’s comin’ over me

There is wonder in most everything I see

Not a cloud in the sky

Got the sun in my eyes

And I won’t be surprised if it’s a dream

Everything I want the world to be

Is now coming true especially for me

And the reason is clear

It’s because you are here

You’re the nearest thing to heaven that I’ve seen

(*) I’m on the top of the world lookin’ down on creation

And the only explanation I can find

Is the love that I’ve found ever since you’ve been around

Your love’s put me at the top of the world

Something in the wind has learned my name

And it’s tellin’ me that things are not the same

In the leaves on the trees and the touch of the breeze

There’s a pleasin’ sense of happiness for me

There is only one wish on my mind

When this day is through I hope that I will find

That tomorrow will be just the same for you and me

All I need will be mine if you are here


ఈ అన్నా చెల్లెళ్ళ సంగీత బృందం గురించి ఈ కింద ఉన్న లింకు నొక్కి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
కార్పెంటర్స్














.

Categories: Left

పురాణాల నిధి

Sun, 08/15/2010 - 11:12

పురాణ ప్రవచనాల మీద ఆసక్తి అభిరుచి ఉన్నవారికి ఈ వెబ్ సైటు పెన్నిధి. శ్రీయుతులు చాగంటి కోటేశ్వరరావు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి, ఉషశ్రీ వంటి పురాణ ప్రవక్తలు చేసిన పురాణ ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి ఈ సైటులో.

ఈ కింది లింకు నొక్కి హాయిగా వినవచ్చు.

పురాణాల నిధి
Categories: Left

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Sat, 08/14/2010 - 14:31
అరవై మూడు సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రం వచ్చిందట. అందుకనే ఈ రోజు పండుగ. వీధి వీధినా పోటీలుపడి జెండా ఎగరవేతలు, జెండా వందనాలు వగైరా వగైరా. ఉన్న స్వాతంత్రాన్ని అనుభవిస్తూ, ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగ పరిచే వాళ్ళను ఆపగలిగే ధైర్యం, శక్తి అందరికీ రావాలని కోరుతూ, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ఒకప్పుడు సినిమా అయిపోగానే జాతీయ పతాక ప్రదర్సన ఉండేది. ఆకాశవాణి కార్యక్రమాలు జాతీయ గీతాలాపనతో ఆపేవారు. ఈ చక్కటి ఆనవాయితీ దశాబ్దాల క్రితమే ఆపేయవలసి వచ్చింది. కారణం!!??

ఇప్పుడు కొన్ని కొన్ని సినిమా హాళ్ళల్లో, సినిమా మొదలు పెట్టటానికి ముందే జాతీయ జెండా ప్రదర్సన జరుగుతున్నది. ఆ జండా ప్రదర్శనకు ముందు ఒక స్లైడు వేస్తారు ఏమని? "అందరూ దయచేసి నుంచోండి" అని

సినిమా మొదట్లో జెండా ప్రదర్సన దేనికి, దానికి ముందు నుంచోండి బాబూ అని బతిమాలుడు దేనికి??
ఒక్క క్షణం ఆలోచించండి

కొద్దిగా సమయం వెచ్చించి, ఈ కింది వీడియోని వీక్షించండి.మనం అందరం ఈ వీడియోలో ఉన్న పెద్దమనిషి లాగ ఉండగలిగితే పైన వ్రాసినవి జరిగేవా?

జెండాను గౌరవిద్దాం

ఇలాంటి వీడియోలను తీసి అది చూపిస్తేగాని బాధ్యత గుర్తుకు రాని వారి సంఖ్య పూర్తిగా మాయమవ్వాలని, అలాంటి మరుపు ఎవరికీ ఎప్పటికీ కలుగకుండా ఉండాలని కోరుతూ మరొక్కసారి

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
Categories: Left

అబ్బ ఏమి హింస!

Fri, 08/13/2010 - 15:07

చాలా కాలం తరువాత అనుకోకుండా తేజా చానెల్ లో ఒక సినిమా వస్తుంటే ఆగి చూడటం మొదలు పెట్టాను. అది "సిద్ధం" సినిమా. కథనం బాగుంది. అలా చూస్తూ ఉన్నాను. కాని ఉన్నట్టుంది, పంటి కిందికి ఇంగువ ముక్కలాగా ఆ చానెల్ వాడు విరగబడి ప్రకటనలు దంచటం మొదలు పెట్టాడు. ఒక పావు గంట సినిమా మరొక పావుగంట ప్రకటనలు. ఆ ప్రకటనలు కూడా చాలా నేలబారువి. ఒక సినిమా చూద్దామని కూచుంటే,ఇంత హింస పెట్టాలా ప్రేక్షకుల్ని.

అదేదో సంఘం వాళ్ళు అప్పుడప్పుడూ గొడవ చేస్తూ ఉంటారు, జంతువుల పట్ల హింస మానండి అని. ఆ సంఘం వాళ్ళు ప్రేక్షకులని కనీసం జంతువులుగా భావించి ఈ చానెల్ వాళ్ళు ప్రకటనలతో పెట్టె హింస నుండి కాపాడితే బాగుండును.

ఆ తరువాత ఈ అడ్వర్టైసుమెంటు ఎజన్సీలకి, వాళ్లకి ప్రకటనలు ఇచ్చే మార్కెటింగు మానేజర్లకి మతీ సుతీ ఉన్నట్టులేదు. కనీసపు తెలివితేటలు కూడ లోపించాయని నా అనుమానం. లేకపోతె, మన చేతిలో రిమోటు ఉంది, కావలసినన్ని చానెళ్ళు. వీళ్ళ గోల ఇక్కడ అయ్యిందని మనకు నమ్మకం దొరికాకే మళ్ళి ఇక్కడకు వచ్చి సినిమాచూస్తాం.

తరువాత మరొక విషయం, ఈ ప్రకటన వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. ఇలా మాటికి ప్రకటనలు చూపిస్తే, అలా హింసపెట్టినందుకు వినియోగదారులు కోపంతో వాళ్ళ వస్తువులు కొనకూడని అనుకునే ప్రమాదమున్నది.












.


Categories: Left

ఇంటర్నెట్ రేడియో

Wed, 08/11/2010 - 21:19

రేడియో మనకు అందుబాటులో ఉన్న ఏకైక వినోద సాధనం. ఆ మాట ఒకప్పుడు. ప్రస్తుతం రేడియోని టి.వి పడగొట్టి రకరకాల వేషాలు వేస్తున్నది. రేడియో పేరిట వస్తున్న లోకల్ చానెల్స్, అవే ఎఫ్ ఎం రేడియోలు, కూడ తామర తంపరగా పుట్టి వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నాయి. డిస్క్ జాకీ పేరిట నా నా అల్లరి చేస్తూ ఊరికే వాగటమే కనిపిస్తుంది నాకు. "జనరేషన్ గ్యాప్" అయ్యి ఉండచ్చు.

అదే నా పాయింటు. ఇవన్ని కూడ 40 ఏళ్ళ వయస్సు లోపలివారికే కాని, పాత తరం రేడియో తెలిసి అప్పట్లో ఆ రేడియో కార్యక్రమాలు విని ఎంతో ఆనందించి, ప్రస్తుతం ఏభయ్యో పడిలోకి వచ్చిన నా లాంటి వారి కోసం కార్యక్రమాలు ఎక్కడా కనపడటంలేదు, లేదా ఎక్కడన్నా ఉన్నాయేమో నేనే వాటిని పట్టుకునే వీలు లేకుండా ఏదో మారు మూల వస్తున్నాయేమో తెలియదు.

నా చిన్నతనంలో, రేడియోలో షార్ట్ వేవ్ ఫ్రీక్వెన్సీలలో ఏరియల్ అవి కట్టుకుని ఎంతో కష్టపడి విన్న రేడియోలు ఇప్పడు కనుమరుగయ్యాయి. వాటిలో చాలా భాగం శాటిలైటు రెడియోలుగా మారినాయి. దాదాపు అవన్నీ కూడ ఇంటర్నెట్లో కూడ ఉంచబడినాయి. అలా ఇంటర్నెట్లో వినటానికి వీలుగా ఉండి, అప్పట్లో అంటే దాదాపు 30+ సంవత్సరాల క్రితం విన్న రేడియోలు ఇప్పుడు హాయిగా వినటానికి దొరకటం ఆనందం కలిగిస్తున్నది. నా దృష్టిలో మంచి ఇంటర్నెట్ రేడియోలను అందరితో పంచుకోవాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను.

ఈ బ్లాగులో కుడిపక్కన ఒక విడ్జెట్ ఉంచాను. అందులో ఒక లింకు ఉంటుంది. ఆ లింకు నొక్కి ఇంటర్నెట్ రేడియోని వినవచ్చు. కుదిరినప్పుడు, ఆ రేడియోలను తరచూ మార్చటానికి ప్రయత్నం చేస్తుంటాను. రేడియో అభిరుచి కలవారు హాయిగా వినండి. మరిన్ని ఇంటర్నెట్ రేడియోలు తెలిసిన వారు లింకులు పంపండి, అందరితో పంచుకుందాము.










.
Categories: Left

మరొక్క ప్రయత్నం - వాళ్ళని చూడండి!

Thu, 08/05/2010 - 13:40

ఈ రోజునే మిత్రులు రంజని గారు పంపిన లింకు సహాయంతో ఈ చక్కటి హిందీ బ్లాగు చూడగలిగాను. హిందీ మాత్రు భాషగలవారు, తమ భాషలో వచ్చే రేడియో కార్యక్రమాల గురించి ఒక ప్రత్యెక బ్లాగు ఎప్పుడో 2007 లోనే మొదలు పెట్టి కొన్ని వందల పోస్టులు వెశారు. ఎన్నెన్నో రికార్డింగులు, పరిచయాలు, పాత జ్ఞాపకాలు,ఇంకెన్నో. ఎంతో బాగుంది.

పైగా ఈ బ్లాగు ఎవరో ఒక్కరే నిర్వహించటం లేదు! ఇరవై మందికి పైగా కలిసి ఈ చక్కటి బ్లాగు నిర్వహించి హిందీ రేడియో ప్రేమికులను అలరిస్తున్నారు.

మనం మన తెలుగు రేడియో కార్య క్రమాల గురంచి, రేడియో కళాకారుల గురంచి కలసి ఒక చోట వ్రాద్దామని నా ఆకాంక్ష. ఈ విషయం మీద అభిరుచి, ఓపికగలవారు దయచేసి మీ వ్యాఖ్య ద్వారా తెలియచేయగలరు. కనీసం ఇద్దరు ముగ్గురు కలసి మొదలుపెడితే, ఒక ప్రారంభం అంటూ జరిగితే, రాను రాను ఈ ప్రయత్నం ఫలించి పెరిగి పెద్దదై, కాల క్రమేనా కనుమరుగవుతున్న రేడియో కళ, రేడియో కళాకారుల గురించి అందరికీ తెలియచేయగలం.

వాళ్ళని చూడండి ఎంత ముచ్చటగా హిందీ రేడియో కళాకారుల గురించి చక్కగా వ్రాసుకుంటున్నారో. ఈ కింది లింకు నొక్కి మీరు ఆ బ్లాగును చూడవచ్చు.

रेडियोनामा





==

Categories: Left

విజ్ఞప్తికి స్పందన

Wed, 08/04/2010 - 22:19
నేను ఇటీవల రేడియో కళాకారుల గురించి చేసిన విజ్ఞప్తి బ్లాగు లోకం నుంచి స్పందన రాలేదు. ఒక్క రామూ గారు మాత్రమె (AP మీడియా కబుర్లు) స్పందించారు. ఆయన ఏకంగా నేను నా బ్లాగులో వ్రాసినది యధాతధంగా వారి బ్లాగులో ప్రచురించి నా విజ్ఞప్తికి మంచి ప్రాచుర్యం కలిగించారు. ఆయన బ్లాగులో ప్రస్తుతం బ్లాగర్లు కానివారి వద్దనుండి చక్కటి స్పందన వచ్చింది. ఆ స్పందనలను ఇక్కడ అందరికీ తెలియచెప్పటానికి ఇక్కడ పున:ప్రచురిస్తున్నాను.

రామూగారూ మీ సహాయానికి థాంక్యూ

AP మీడియా కబుర్లు బ్లాగులో స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు. సహాయ సహకారాలు అందించటానికి ముందుకు వచ్చిన వచ్చిన శ్రీమతి మాధురి గారికి, శ్రీ రామకృష్ణగారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

ఇక్కడ మరొక ప్రత్యేక వ్యక్తి గురించి చెప్పుకోవాలి. ఆయన రంజని గారు. వారి తమ దగ్గర ఉన్న అపురూపమైన రేడియో కార్యక్రమాలను పంపటమేకాక, నెను వ్రాసిన విజ్ఞప్తికి మొట్టమొదటగా నా బ్లాగులో స్పందిమ్హినవారు. వారికి ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు. వారు వ్యక్తపరిచిన భావాలకు నా స్పందన ఈ వ్యాసం చివరలో ఉంచాను.

శ్రీ రంజనిగారి వ్యాఖ్య

బ్లాగులలో అక్కడక్కడా రేడియో జ్ఞాపకాలు కనిపిస్తూ ఉంటాయి. అయినా
ఇక్కడ ఇంతవరకూ ఎవరూ ప్రతిస్పందించకపోవడం కొంత బాధగా ఉంది..

ఇటీవల కౌముదిలో సుధామగారు తన అనుభవాలని పంచుకుంటున్నారు.

కొన్ని పత్రికల్లో అప్పుడప్పుడూ అలనాటి రేడియో కళాకారుల పరిచయాలు,
జ్ఞాపకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ప్రచురించబడిన వ్యాసాలు..
మొదలైనవి ఉన్నా దయచేసి అందరితో పంచుకోవాలని మనవి.

హిందీ రేడియో కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఓ రెండు లంకెలు:

http://in.groups.yahoo.com/group/vividhbharati/

http://radionamaa.blogspot.com/

ధన్యవాదములు



================================================
A P మీడియా కబుర్లు బ్లాగులో బ్లాగర్లు కానివారి వద్దనుండి వచ్చిన స్పందనలు:
================================================
శ్రీమతి మాధురి

My father in law, Gunturu Sastry is a famous theatre personality, as an actor and more as a director. I shall ask him to provide all details possible.

4:33:00 పం

*****

శ్రీ రామకృష్ణ

శివరామప్రసాద్ గారు నమస్తే,
చాలా సంతోషం.
నేను కుడా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్త విభాగంలో న్యూస్ రీడర్ గా పనిచేశాను, 2002 - 2003 సంవతసరంలో.
బ్లాగ్లో మీ ప్రయత్నం గురించి చూశాను. మీ మెయిల్ id చూసి వెంటనే జాబు రాయకుండా ఉండలేకపోయాను.
నేనుకూడా HAM RADIO operator.
ఎంతైనా Radio.....
అందునా అడుగుతోంది HAM RADIO ఆపరేటర్...
HAM RADIO రుచి అలాంటిది మరి. మీ మెయిల్ id వేరేలా వుంటే జాబు రాసే వాడిని కాదేమో.
మీ అబిలాష బాగుంది. మీ ప్రయత్నానికి నావంతు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తా . ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అనౌన్సుర్ గా పనిచేసిన శ్రీ D S R ఆంజనేయులు గారు మీకు తెలిసే వుంటుంది. వారి కుమారుడు నాకు మిత్రుడు. అలానే ప్రముఖ న్యూస్ రీడర్ శ్రీ కొప్పుల సుబ్బారావు., హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో న్యూస్ ఎడిటర్ శ్రీ M V S ప్రసాద్ ., బహుశ మీకు తెలిసి ఉండవచు. వారి ద్వార మీ ప్రయత్నానికి నావంతు ఉడత సహాయం చేయగలను.
ధన్యవాదములు.
రామకృష్ణ

12:27:00 అం

*****

శ్రీ కట్టా జయప్రకాష్ గారు

Shiva garu eserves compliments for taking up a very good and purposeful asignment of bringing out the artists of radio who ruled the society for decades till the advent of television.Infact every one including the kids had a great time with radio till seventies and for good or bad the television had taken over the society and later in these days it is the FM mania for the youth.Whatever it may be the development progress and scientific innovations will definetely affect the old but as responsible citizens it is our prime duty to remember the old and recollect their service to the peole and pay tributes to them and at the same time sparingour time to radio too.The TV channels can give some programmes on the yesterdays's radio and it's artists.There are still many familiar names of radio artists who were most popular in every household but they could not get any star status or celebrity position as seen in these days of hytec area.Swathi weekly has been covering the articles of Gollapudi Ramuthi Rao in whic Gollapudi has been mentioning various artists,writers including his radio artist friends and I am surte he can provide most of the information on them.
JP.

8:17:00 అం

*****

శ్రీ కే వి రమణ

Congrats Shiva garu
I also started my career in AIR as a casual production assistant. In fact, I like that medium. Unfortunately, there are several issues that hamper the growth of the medium and particularly AIR. Though I can't write about them here, I am sure most of those familiar with AIR know those issues. After working there for about two years, I found an opportunity in print journalism and moved out. I sincerely feel that there is a great treasure of information in AIR either they are in the form of records or the details of the artists. I also sometimes feel ashamed to talk about radio particularly after the private FM channels were unleashed. Anyway, I wish Shiva garu good luck and hope his work will help reviving the most exciting medium called radio.

4:48:00 పం

*****

"నాగరికుడు విను"

ఈ ప్రయత్నము కడు శ్రవణానందకరము

10:33:00 పం

*****


ఇక నా ముగింపు

Ranjani gaaroo. Thank you very much for your kind comment.

Yes there is not a single comment from BLOGGERS. May be there is no Blogger interested in Radio Programmes, as their age profile is late twenties or early thirties, who must be quite ignorant about Radio programmes. For most of the people now, Radio means FM radio with Disc Jockeys jabbering intersperse with songs that had gained cheap popularity with copied tunes.

ONCE AGAIN A BIG THANK YOU RANJANI GAAROO FOR BEING THE FIRST PERSON TO KEEP YOUR COMMENT. MANY THANKS TO YOU FOR THE GOOD RECORDINGS SHARED BY YOU, WHICH I AM PROCESSING AND SHALL WRITE ABOUT SHRI RAVURI BHARADVAJA GARU SHORTLY WITH HIS PHOTO WHICH I TOOK WHEN I MET HIM DURING MAY, 2010.


JP గారూ , రమణ గారూ 'నాగరికుడు విను" మీ ప్రోత్సాహకర వ్యాఖ్యలకు అ బిగ్ థాంక్యూ

మరొక వ్యక్తి గురించి తప్పకుండా ఇక్కడ ప్రస్తుతించాలి . ఆయన కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు. స్వతహాగా సాప్ట్వేర్ ఇంజనీర్. అతనికి చందమామల మీద ఉన్న మక్కువ మా స్నేహానికి పునాది. చందమామల సేకరణలో అతని పాత్ర ఎంతగానో ఉన్నది. ఇప్పుడు కూడ నా విజ్ఞప్తి చూసి, వెబ్ వెతికి తన దృష్టికి వచ్చిన అనేకానేక రేడియో సంబంధిత లింకులు నాకు పంపుతూ ఉన్నారు. అతనికివే నా ప్రత్యెక అభినందనలు.

అలాగే ప్రముఖ రేడియో కళాకారుడు శ్రీ రామం గారి కుమార్తె "తృష్ణ" గారు కూడ సహకారాన్ని అందిస్తున్నారు. హెల్త్ సమస్యల వల్ల ప్రస్తుతం ఆవిడ బ్లాగులు చూస్తున్నట్టుగా లేరు. వారికి నా ధన్యవాదాలు.




==














Categories: Left

రేడియో కళాకారులు - ఒక విజ్ఞప్తి

Thu, 07/29/2010 - 22:01



నాటక లేదా సినీ కళాకారులను చూస్తూ, వింటూ వినోదాన్ని పొందుతాము. సినీ కళాకారులైతే వారి నటనకు సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో అనేక తళుకు బెళుకులను జోడించి మరింత ఆకర్షణీయంగా చేయగలరు.

రేడియో కళాకారులు, పూర్తి శబ్దం మీద మాత్రమె ఆధారపడుతూ అద్భుతమైన కార్యక్రమాలను తయారు చేసి (మనకు ఈ టి వి పూనకాలు రాకముందు) ఎంతో ఆరోగ్యకరమైన వినోదాన్ని దశాబ్దాల పాటు అందచేసారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది కళాకారులు ఇటు ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి, అటు ఆకాశవాణి హైదరాబాదు కేద్రం నుండి వారి వారి ప్రావిణ్యాన్ని పూర్తి పాటవంతోరంగరించి చక్కటి కార్యక్రమాలతో వినోద విజ్ఞానాలను సమపాళ్ళల్లో అందచేసారు. అటువంటి కళాకారులగురించి రాబొయ్యే తరాలకు తెలియచెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది.

నాటక కళాకారుల గురించి వ్రాసేవారు, అనేక మంది ఉన్నారు. కొన్ని వార పత్రికల్లో ధారావాహికలుగా కూడావేశారు. ఇక సినిమా నటుల గురించి చెప్పనే అక్కర్లేదు, ఎందుకు అంటే వారి గురించి ఇంకాతెలుసుకోవాలిసినది ఏమైనా ఉన్నాదా అని ఆశ్చర్యపొయ్యేంతవరకు - నిజాలు, అబద్ధాలు, అభూత కల్పనలువ్రాసి వ్రాసి అలసిపోయ్యారు, వాళ్ళల్లో కొంతమంది తమకు తామే వ్రాసుకునే శక్తి గలవారు వ్రాసుకుని పుస్తకాలు కూడ ప్రచురించారు.

కాని, రేడియో కళాకారుల గురించిన సమాచారం ఎవరికీ అంతగా తెలియదు.

ఆకాశవాణి వారి వెబ్ సైటు ఆశగా పరికిస్తే పూర్తి నిరాశా నిస్పృహలు చుట్టుముడతాయి. రేడియో కళాకారుల గురించిన సమాచారం వీసమేత్తైనా దొరకదు . ఇక లాభంలేదు! శ్రోతలమైన మనమే నడుం కట్టాలి. మనలోనే, అనేకమంది దగ్గర ఉన్న కొద్ది కొద్ది సమాచారాన్ని ఒకచోట పోగుచేసి, సమగ్ర రూపాన్ని ఇవ్వగలిగితే ఎంతైనా బాగుంటుంది.


రేడియో కళాకారుల గురించిన సమాచారం, ఫోటోలు, అలనాటి రికార్డింగులు ఉన్నవారు అందరితో బ్లాగు ద్వారా పంచుకోవాలని విజ్ఞప్తి. బ్లాగులు లేనివారు కూడ తమదగ్గర ఉన్న సమాచారాన్ని తెలియచేస్తే (vu3ktb@gmail.com) ఆ సమాచారాన్ని తప్పకుండా అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చే పని వెను వెంటనే చేయగలను.

అలాగే, అలనాటి రేడియో కళాకారులు, వారి వారసులు కూడ ఈ ప్రయత్నంలో పాలుపంచుకుని తమ జ్ఞాపకాలను, పాత ఫోటోలను, నాటక/నాటిక ఇతర రికార్డింగులను అందరితో పంచుకుని, రేడియో కళాకారుల చరిత్ర తయారీలో సహాయపడమని వినయపూర్వక విజ్ఞప్తి.









..
Categories: Left

అలనాటి అద్భుత గాయకుడు

Wed, 07/28/2010 - 20:18

అవ్వొక రోజులు........ఆ సంగీతం, ఆ సాహిత్యం, పాట పాడే పద్ధతిలో ఉన్న సొగసు, మళ్ళి రమ్మన్నా వస్తాయా!! వస్తే ఎంత బాగుండును.

ఇప్పటి తరానికి, సాలూరి రాజేశ్వర రావుగారి పేరు తెలియటం అంటూ జరిగితే, ఆ తెలియటం ఒక సంగీత దర్శకునిగానే. ఆయన ఒక అద్భుతమైన గాయకుడని తెలిసే ఆవకాశం కొంత ప్రయత్నం చేస్తే గాని తెలియని విషయం. 1940-1950 లలో ఆయన పాడిన లలిత గీతాలు బహుళ ప్రాచుర్యం పొందినాయి.

1980 లలో ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఒక గాన కచేరీలో పాడిన కొన్ని పాటలు ఇంటర్నెట్ వెతుకులాటలో దొరికినాయి. దొరకటమే కాదు మనకు కావలిసిన పాటలను ఒక ప్లే లిస్టు చేసుకుని అందరితో పంచుకోవటానికి మన బ్లాగులో ప్రచురించే ఆవకాశం టాలీ నేషన్.కాం అందచేసారు.

ఆ వెబ్ సైటువారు అందచేసిన అద్భుత ఆవకాశం అందిపుచ్చుకుని, రాజేశ్వరరావుగారి పాటలు ఒక ఐదు, ప్లేయర్లో పొందుపరచటం జరిగింది. హాయిగా విని ఆనందించండి.




ఈ పాటలలో నాకు బాగా నచ్చిన పాట, డాక్టర్ చక్రవర్తి సినిమాలోని "పాడమని నన్నడగవలెనా" అద్భుతంగా పాడి వినిపించారు రాజేశ్వర రావుగారు.

ఇటువంటి అద్భుతమైన గాయకుని పాటలను అందుబాటులోకి తేవటమే కాకుండా, బ్లాగులో ప్రచురించటానికి చక్కటి వీలు కల్పించిన టాలీ నేషన్.కాం వెబ్ సైటువారికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు.

ఇదే విధంగా రాజేశ్వర రావుగారు, బాలసరస్వతిగారు కలిసి పాడిన పాటలు కూడ దొరికితే లలితా సంగీత ప్రియులకు పండగే














.
Categories: Left

"చూసిందే మళ్ళి చూడు" సినిమా ట్రైలర్

Fri, 07/23/2010 - 23:14

మనకు తెలుగులో సినిమా ట్రైలర్లు తయారు చెయ్యటం వాటిని విడుదలకు ముందుగా ఇతర సినిమాలలో విశ్రాంతి సమయంలో చూపటం, తక్కువ. ఏవో అతి కొద్ది సినిమాలకు ట్రైలర్లు ఉన్నాయి. కానీ ఆంగ్ల సినిమాలకు దాదాపు ప్రతి సినిమాకు ట్రైలర్ ఉండి తీరుతుంది. అవి తయారు చెయ్యటం కూడ ఒక కళ, నైపుణ్యం ఉంటే కాని చెయ్యలేరు. కాని ఈ ట్రైలర్లు తయారు చేసేవారు చాలా భాగం అభూత కల్పనలతో డాంబికమైన మాటలతో తమ ట్రైలర్లను నింపేసి, ప్రేక్షకులను ఆ సినిమా తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి డాంబికాలను , అభూత కల్పనలను ఎద్దేవా చేస్తూ ఆకాశవాణి విజయవాడ కళాకారులు మూడు దశాబ్దాల క్రితం తయారు చేసిన సినిమా ట్రైలర్ పారడీ ఒకటి నా దగ్గర కలెక్షన్లో ఉన్నది. అదే "చూసిందే మళ్ళి చూడు" సినిమా ట్రైలర్. విని ఆనందించండి. అలనాటి ఆకాశవాణి కళాకారులకు హృదయపూర్వక అభినందనలు.




ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ పుణ్యమా అని, ఇలాంటివి హాస్య ప్రధానంగా మనం కూడాచెయ్యచ్చేమో ప్రయత్నించి చూడండి.

============================================================
ఈ పారడీ సినిమా ట్రైలర్ లో నా కు తెలిసిన గొంతులు శ్రీ ఏ. బి ఆనంద్, శ్రీమతి ఎం నాగరత్నమ్మ, శ్రీమతి వి బి కనకదుర్గ. మిగిలిన గొంతులు గుర్తుపట్టినవారు తెలియచేయగలరు.

ఈ వ్యాసం చూసి ఈ కార్యక్రమాన్ని తయారు చేసిన రేడియో కళాకారుని కుమార్తె తృష్ణ గారు ఈ విధంగా తెలియ చేసారు:
ఆ "ట్రైలర్"ను, మా నాన్నగారు శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తిగారు(రేడియో రామం) 1980లో విజయవాడ రేడియొస్టేషన్లో అనౌన్సర్ గా పనిచేస్తున్న రోజులలో, వివిధభారతి శ్రోతల కోసం తయాయరుచేసిన "నీలినీడలు" అనే ప్రోగ్రాం కోసం చేసినది.

ఇటువంటి చక్కటి కార్యక్రమం తయారుచేసి శ్రోతలను అలరించిన రేడియో రామం గారికి అభినందనలు. ఈసమాచారాన్ని అందచేసిన తృష్ణ గారికి థాంక్స్ .
===================================================================

Categories: Left

పాటలో ఒక చక్కటి కథ

Fri, 07/23/2010 - 16:15

నా దగ్గర ఉండి ఇప్పటి వరకు వినని పాటలను వెతుకుతుంటే (అలా కొని CD/DVD లు దాచేస్తుంటాను) ఒక మంచి పాట నన్ను కట్టి పడేసింది. నాలుగు సార్లు విన్నాను ఇప్పటికి. ఈ పాట పేరు గిడ్డి అప్ గో (GIDDY UP GO). అమెరికా జానపద శైలిలో పాడిన పాట. ఈ పాటను పాడినది రెడ్ సోవైన్ అనే అమెరిక గాయకుడు. ఈ పాటను మీ కోసం ఇక్కడ అందిస్తున్నాను.

ఈ పాట సాహిత్యం ఈ కింది విధంగా ఉన్నది.

The highways that wind and wander over mountain and valleys deserts and plains
I guess I've drove about all of 'em
Cause for the past 25 years now the cab of a truck has been my home
And it'd be kinda hard for me to settle down and not be on the go
Why I remember the first truck I drove
I was so proud I could hardly wait to get home to show my wife and my little boy
And my little boy was so excited like so when he saw his first snow
He wasn't old enough to say too many words
He just kept hollering goddyup go daddy giddyup go
So that's what I named the old truck Giddyup go
Oh things wasn't too bad of course I's gone a lot
And after about six years I got home one day and found my wife and little boy gone
I couldn't find out what happened nobody seemed to know
So from that day on it's been me and old Giddyup go
I've made a lot of friends at all the truck stops
And some of 'em would kick me about my litle sign
Of course they knew where I got the name
Cause I told 'em about that little boy of mine
And how his first word about that old truck was Giddyup go
Today I was barrelin' down old 66
When up beside me pulled down a brand new diesel rig
Both stacks of blowin' black coal
And as she pulled around and back in front of me a big lump came in my throat
And my eyes watered like I had a bad old cold
A little sign on the back of the truck that read Giddyup go
Well I pushed old Giddyup go stayed right on him
Until the next truck stop where he'd pulled up
I waited till he went in and I offered to buy him a cup
Well we got to talkin' shop and I said
Now did you come by the name on your truck Giddyup go
Well he said I got it from my pop
Dad used to drive a truck that's what mom talked about a lot
You see I lost mom when I was just past sixteen and I lost all track of pop
Mom said he got the name from me
I shook his hand and told him that I had something I wanted him to see
I took him out to the old truck
And brushed off some of the dirt so the name would show
And his eyes got big and bright as he read Giddyup go
Oh we had a lot of things to talk about and buddy I felt like a king
And now we've just pulled back on old 66 and he's handled that big rig
Better than any gearjammer that I'd ever seen
Well now the lines on the highway have got much brighter glow
As we go roarin' down the road and me starin' at a little sign that reads Giddyup go.

ఒక ట్రక్ డ్రైవర్ తన కుటుంబాన్ని కోల్పోయి అనేక సంవత్సరాల తరువాత తన కొడుకుని కలుసుకునే ఆనందకర సంఘటన చక్కని పాట లాంటి మాటగా రూపొందించారు. ఒక పాటలో చక్కటి కథను సృష్టించి చాలా హ్రుద్యంగా ముగింపుని ఇచ్చారు.
Categories: Left

మా మంచి మాష్టారు

Wed, 07/21/2010 - 23:00
మా మాష్టారు శ్రీ భగవాన్ దాస్ (ఎడమ పక్కన) ప్రముఖ కార్టూనిస్టు శ్రీ బాబు తో
** ** ** ** ** **
మనం చదువుకునేప్పుడు అనేక మంది మాష్టార్లు మనకి చదువు చెప్పి ఉండవచ్చు. కాని వారిలో కొద్ది మందినే జీవితకాలం గుర్తు పెట్టుకుంటాము. సామాన్యంగా, ఆ చిన్న వయస్సులో మన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడిన గురువునే ఎక్కువ గుర్తుంచుకుంటాము.

అది డిసెంబరు 15 వ తారీకు 1972 సంవత్సరం (అప్పుడే మూడు దశాబ్దాల పైన గడిచి పోయింది!!! నిన్నో మొన్నో జరిగినట్టు జ్ఞాపంకం వస్తున్నది) మా నాన్నగారు మధ్యాహ్నం ఆయన నిద్రలేవంగానే "తయారుకారా! నిన్ను ఇవ్వాళ టైపు నేర్చుకోవటానికి చేరుస్తాను" అని నా గుండెల్లో రాయి పడేట్టుగా చెప్పారు. హాయిగా షిఫ్టు కాలేజీ పొద్దున్న ఏడున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు పది వరకు, ఇంటికి రావటం, లంచ్ చెయ్యటం, రెండు నుండి ఐదు వరకూ బుద్ధిగా చదువుకోవటం, ఆ తరువాత లైబ్రరీ ఆపైన బలాదూర్ తిరగటంగా హాయిగా గడిచిపోతుంటే ఇదేక్కడ గోలే అమ్మా అని చూశాను. కాని అరణ్య రోదనమే. చచ్చినట్టుగా ఓ రెండు అర ఠావు సైజు కాయితాలను గుండ్రంగా చుట్టుకుని మా నాన్న వెంట బయలుదేరాను.

మా సత్యనారాయణపురం (విజయవాడ)లో గిరి వీధి చివరగా ఉన్న మలుపులో ఉన్న స్వామీ కమర్షియల్ ఇన్సిట్యూట్ కు తీసుకు వెళ్ళారు. అందులో చేరిపించి, తన దారిన తాను వెళ్ళారు మా నాన్న. మొదటిరోజున మాష్టారు asdf ;lkj (టైపు నేర్చుకోవటంలో "అ ఆ" లాంటివి) తాను చెప్పలేదు. అప్పటికే అక్కడ నేర్చుకుంటున్న ఒకతని చేత చెప్పించారు. ఆ టైపు స్కూలులో అన్ని హాల్డా మేషిన్లె. నాకు అనిపించింది "ఏమిటీ మాష్టారు తానోచ్చి చెప్పరు?, వీడెవడో నేర్చుకుంటున్న వాడి చేత నాకు చెప్పిస్తున్నారు ??" అనుకున్నాను. కాని తరువాత తెలిసింది, చిన్నతనంలో వచ్చ్చిన జ్వర ఫలితంగా మా మాష్టారు లేచి నడవలేరని.
అప్పట్లో భగవాన్ దాస్ గారి టైపు స్కూల్ ఉన్న భవనపు ఇప్పటి ఫొటో

నాకు టైపు కొత్తేమి కాదు ఎందుకు అంటే మా ఇంట్లో రెమింగ్‌టన్ పోర్టబుల్ టైపురైటరు ఉండేది. మా నాన్నగారు దానిమీద రెండు వేళ్ళతోనే టప టపా టైపు చేస్తుంటే చూసే వాణ్ని, మార్జిన్లు, కాపిటల్ ఎలా కొట్టాలి, స్పేస్ బార్, కాయితం ఎక్కించటం వంటి విషయాలు అప్పటికే తెలుసు.

ఆరోజు సాయత్రం నేను కొట్టిన మొదటి టైపు కాయితం మాష్టారు చేతిలో పెట్టాను. ఆయన చూసి అక్కడక్కడా ఓవర్ టైపు అయిన వాటి మీద గీతలు పెట్టి. బాగా చేస్తున్నావు, కొంచెం అభ్యాసం కావాలి అని చెప్పారు.

ఇంతకూ మా టైపు మాష్టారి పేరు చెప్పలేదు కదూ. ఆయన పేరు శ్రీ క్యానం భగవాన్ దాస్. ఆయన ఆ టైపు ఇన్స్టిట్యూట్ 1965 లో మొదలు పెట్టారు.

సరే అలా తుమ్ముతూ దగ్గుతూ టైపు నేర్చుకుంటూ ఉన్నాను. అన్ని అక్షరాలూ ఆ యా వేళ్ళతో కొట్టటం వచ్చేసింది. కొన్ని కొన్ని మాటలు పుస్తకం చూసుకుని టైపు చేసేవాణ్ని . నాకు బాగా గుర్తు, ఒక రోజున Development, Station, Enough అనే మాటలలో స్పెల్లింగు తప్పులు టైపు చేసానని, మా మాష్టారు, మూడు తెల్ల కాయితాలు తన దగ్గరవి ఇచ్చి ఒక్కో కాయితం మీద ఒక్కో మాట కాయితం చివర వరకూ కొట్టించారు. ఇక ఆ తరువాత స్పెల్లింగు అందులో ఉండే సిలబల్ ఒక్క మాటలోనే ఉండే సిలబల్స్ గురించి ఒక మాటను మధ్యలో విరవాలంటే సిలబల్ ప్రకారం విరవటం వంటి మౌలికమైన విషయాలను తరువాత ఓపికగా వివరించి చెప్పారు. ఇలా మాకు ఆంగ్ల బోధించిన మాష్టార్లు కూడ ఏనాడు వివరించలేదు. ఆయన చెప్పిన విధానం చెప్పాలన్న ఆసక్తి నాకు ఎంతగానో స్పూర్తిని ఇచ్చింది. ఆంగ్ల భాషను నేర్చుకోవాలన్న ఆసక్తి ఆయనే కలిగించారు.

ఇక మాటలు కొట్టటం కూడ అయిపోయి స్పీడు పేపరు దగ్గరకు వచ్చేప్పటికి, ఆయన నన్ను టైపు లోయర్ పరీక్షకు ఫీజు కట్టించారు. అక్కడనుంచి, టైపు సెకండు పేపరు(స్టేటుమెంటులు గజిబిజి చేతి వ్రాతతో ఉండే ఉత్తరాలు) సాధన మొదలు పెట్టించారు. ఇక్కడ నుంచి మొదలయ్యింది మా మాష్టారి బోధనలో ఉండే అద్భుత శక్తి చూసే ఆవకాశం. ప్రతి ఆదివారం పొద్దున్నే ఆరున్నర ఏడు గంటలకు ప్రవైటు క్లాసు పెట్టేవారు. అందరూ టైముకు రావాలిసిందే. అ ప్రవైటు క్లాసుకు ఇచ్చే ఇంటిమేషన్ కూడ చాలా ఆకర్షణీయంగా కార్టూను వేసి మరీ తయారు చేసి నోటీసు బోర్డులో పెట్టేవారు.

అన్నట్టు మరచాను, మా మంచి మాష్టారు అప్పట్లో ప్రముఖ కార్టూనిస్టు కూడ. "భగవాన్" అన్న పేరుతొ అనేక కార్టూన్లు వేసేవారు. స్వయంగా కార్టూనిస్టు కావటంతో, మాకు చెప్పే పద్ధతిలో కూడ తన చిత్రకళా నైపుణ్యం చూపేవారు.

పైన ఉన్న ఫొటోలో ప్రముఖ కార్టూనిస్టు "బాబు" ఉన్నారు. "బాబు" మా భగవాన్ దాస్ గారు సమ వయస్కులు, మంచి స్నేహితులు. కాని "బాబు" భగవాన్ దాసు గారిని, "గురువు లాంటి స్నేహితుడని" ప్రస్తుతించారు. తాను కార్టూనిస్టు కావటానికి, పట్టుదలగా పనిచేయటానికి భగవాన్ దాసుగారి స్నేహమే కారణమని, "బాబు" ఈ మధ్య కలిసినప్పుడు కూడా అన్నారు.

ఆయన చెప్పిన ఒక ప్రాక్టికల్ జోకు మీతో పంచుకోవాలి. మా విద్యార్ధుల గుంపులో శర్మ అని ఒక కుర్రాడు ఉండేవాదు. అతనికి నాలిక బాగా బయటపెట్టి నవ్వటం అలవాటు. ఒకరోజున మాష్టారి జోకుకు అందరం నవ్వుతున్నాం. మాష్టారు శర్మ వంక చూసి, "ఏమోయ్ శర్మా! నువ్వు అలా పోస్టాఫీసులో నుంచుని నవ్వుతూ ఉండకూడదూ, జనం హాయిగా స్టాంపులు అంటించుకోవటం సులభం అవుతుంది" అని మరొక జోకు పేల్చారు. శర్మ అప్పటినుంచి కొంత సాధన చేసి, మామూలుగా నవ్వటం నేర్చుకున్నాడు.

ఈరోజున ఆంగ్లంలో కొద్దొ గొప్పో ప్రావెణ్యం, ఏ విషయాన్నైనా తెలుసుకుని నేర్చుకోవాలన్న తరగని జిజ్ఞాసా మా మాష్టారివల్లే. ఆయన నేర్పిన పాఠాలు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూ మార్గదర్శకాలుగా నిలుస్తూనే ఉన్నాయి.

మాకు ఎంతో ప్రేమపాత్రుడైన మా మాష్టారు భగవాన్‌దాస్ గారు ఇప్పుడు లేరు. మంచివాళ్ళను తొందరగా తీసుకువెళ్ళిపోతాడు దేవుడు అంటారు. అలాగే ఆయన్నూ తీసికెళ్ళి "అక్కడ" అందరికీ పాఠాలు చెప్పిస్తున్నారులా ఉంది.
గురుపూర్ణిమ సందర్భంగా
భగవాన్ దాస్ గారి వద్ద చదువుకున్న పూర్వ విద్యార్ధులచే చదువబడే అదృష్టం, ఈ వ్యాసానికి పడితే, అలనాటి ఆ పూర్వ విద్యార్ధులను, వారి అనుబంధాన్ని నెమరువేసుకుంటూ జ్ఞాపకాలను పంచుకోమని విజ్ఞప్తి.






Categories: Left