http://ammaodi.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
Updated: 5 min 7 sec ago

విద్యార్ధుల సమీకరణకు, ఫలితాల పంపకానికి నెట్ వర్క్! [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 11]

Thu, 05/27/2010 - 04:04
నిజానికి విద్య అన్నది ఉప్ప ప్యాకెట్టో, బిస్కట్ ప్యాకెట్టో కాదు. సూపర్ మార్కెట్ కు వెళ్ళి, లేదా వీధి చివరికి చిల్లర కొట్టుకొళ్ళి, పది రూపాయలిచ్చి ఓ ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ విద్య అలాంటి వస్తువు కాదు, డబ్బిచ్చి పొందేందుకు! దుకాణదారుకి డబ్బు ఇవ్వటం, దుకాణపు యజమాని మనకి ఉప్ప ప్యాకెట్ ఇవ్వటంతో ఇక్కడ వ్యవహారం [deal] పూర్తయిపోతుంది.

కానీ విద్య విషయంలో అలా కాదు. పాఠశాలలో ఫీజు కట్టి చేరడంతో డీల్ మొదలౌతుంది. ఇక్కడ డబ్బుకి అతీతమైన సంబంధం - విద్యార్ది, ఉపాధ్యాయుల మధ్య ఉంటుంది. విద్యార్ధికి తమ టీచర్ పట్ల గౌరవం ఉండాలి. టీచర్ కి తమ విద్యార్ధుల పట్ల ప్రేమా, వాత్సల్యం ఉండాలి. [ఆవుదూడని వత్స అంటారు. గోమాతకి తన బిడ్డ పట్ల ఉండే ప్రేమని వాత్సల్యం అంటారు.] అప్పుడే టీచర్ చెప్పింది పిల్లల బుర్రలకి పడుతుంది.

కానీ చాలామంది తల్లిదండ్రుల దృష్టి ‘ఫీజు డబ్బు కట్టటంతో తమ కర్తవ్యం పూర్తయ్యింది’ అన్నట్లు ఉంటుంది. దాంతో మొత్తం భారం పాఠశాలల మీద పడుతుంది. పాఠశాలల యాజమాన్యాలు, ఆ భారాన్ని పూర్తిగా తమ ఉద్యోగులైన ఉపాధ్యాయుల మీదికి జారుస్థాయి. దాంతో ఈ మొత్తం జంఝటాన్ని - పాఠశాలలు, ఉపాధ్యాయులతో సహా... కష్టపడి పిల్లలకి చదువు నేర్పించి గాక, పైసలు ఉపయోగించి... మాస్ కాపీయింగ్, మార్కులు వేయించటం, ర్యాంకులు కొనటం వంటి ప్రక్కదారి మార్గాలలో వదిలించుకుంటున్నారు.

పిల్లలకి చదువు నేర్పటం, క్రమశిక్షణాది మంచి లక్షణాలు నేర్పటం.... అందుకోసం మంచి, సమర్ధులైన ఉపాధ్యాయులని సమీకరించటం, వాళ్లకి ఎక్కువెక్కువ జీతాలు చెల్లించటం.... ఇదంతా జంఝటమే! ఇంతకంటే తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో ఫలితాలని సంపాదించవచ్చు.

కష్టపడి పిల్లలకి చదువు చెప్పటం, నయానో భయానో క్రమశిక్షణ నేర్పటం, కష్టపడి చదువుకునే తత్త్వం నేర్పటం - వీటన్నిటి కంటే.... ప్రశ్నాపత్రాలు లీక్ చెయ్యటం, మాస్ కాపీయింగ్ చేయించటం, వంటి పనులకు టీచర్లు పాల్పడుతుంటారు. స్వయంగా టీచర్లే బిట్స్ డిక్టేట్ చేయటం, కాపీలందించటం మొన్నటి పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో కూడా చూశాను. ఇంటర్నల్ పరీక్షల్లో సైతం, కొన్ని పాఠశాలల్లో, కొందరు ఉపాధ్యాయులు ఇదే పద్దతి నడపటం, నడవనివ్వటం మేము స్వయంగా పరిశీలించివే!

ఇక పాఠశాలలు యాజమాన్యాలు... డబ్బూ, పరపతి ఉపయోగించి, తమ విద్యార్దులుకి మార్కులు వేయించటం, ర్యాంకులు కొనటం సర్వ సాధారణం. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, ఫలానా పాఠశాల విద్యార్ధులు ఎవరెవరు తమ గదిలో పరీక్ష వ్రాస్తున్నారో విచారించి మరీ మాస్ కాపీయింగ్ కి సహకరించటం కూడా మొన్నటి పదవ తరగతి పరీక్షల్లో చూశాను.

ఇన్ని రకాలుగా, డబ్బుతో ఫలితాలని కొనవలసిన రావటంతో కూడా, యాజమాన్యాలు ఉపాధ్యాయులకు జీతాలు అంతంత మాత్రంగా ఇస్తుంటాయి. వాక్ ఇన్ ఇంటర్యూ అంటూ కార్పోరేట్ పాఠశాలలు, జిల్లా స్థాయిలో నెంబర్ వన్ విద్యాసంస్థలు కూడా, టీచర్లకు[IIT ఫౌండేషన్ శిక్షణ ఇచ్చేవారికి సైతం] పాతిక వేల దాకా జీతపు స్థాయి ప్రకటిస్తారు. అది కేవలం వాణిజ్య ప్రకటన మాత్రమే. తీరా చూస్తే... ఉదయం నుండి సాయంత్రం వరకూ ఏడెనిమిది పీరియడ్లు చెప్పించుకుని, పది పన్నెండు వేలు చేతిలో పెట్టటమూ నాకు తెలుసు.

పత్రికా ప్రకటనలలో మాత్రం, నెలకు పాతిక ముప్పై వేలు టీచర్లకు చెల్లిస్తున్నట్లు చెప్పుకుంటారు, అందులో సగం వాస్తవంగా చెల్లిస్తారు. టీచర్లను సైతం అలాంటి అబద్దాలనే చెప్పుకొమ్మంటుంది యాజమాన్యం. నిజం బయటపడితే ఉద్యోగం Fire out.

నిజాని కిది రంగు మారిన వాణిజ్య ప్రకటనే, ఉద్యోగ ప్రకటన కానే కాదు. ఆ విధమైన ప్రకటన ఇవ్వటం ద్వారా ‘ఫలానా పాఠశాల వారు నెలకు పాతిక వేలు చెల్లించి మరీ సమర్ధులైన టీచర్లతో చదువు చెప్పిస్తారు!’ అనుకొని, తల్లిదండ్రులు పాతిక వేల నుండి ఏభైవేల దాకా, సంవత్సరపు ఫీజులు తమకు చెల్లించాలన్నది ఇక్కడ వ్యూహం! అదే జరుగుతోంది రాష్ట్రస్థాయి ర్యాంకులు పొందిన విద్యా సంస్థలలో కూడా!

నిజం చెప్పాల్సి వస్తే - ఈ ఫలితాల అవకతవకలకు కూడా తక్కువేం ఖర్చవ్వదు. మంచి టీచర్ల చేత, తగినంత జీతభత్యాలిచ్చి, నిజాయితీగా చదువు చెప్పించినా ఇంతా ఖర్చవుతుంది. అలాంటప్పుడు ‘అదే ఖర్చుపెట్టి నిజాయితీగా ఫలితాలు సాధించవచ్చుగా?’ అనే అనుమానం మనకు వస్తుంది. సరిగ్గా ఇక్కడే కుట్ర కోణం బలంగానూ, అప్రకటితంగానూ పని చేస్తుంది.

నిజాయితీగా, సమర్ధులైన టీచర్లని పెట్టి చదువు చెప్పించినా, పిల్లలు కష్టపడి చదివినా.... ఫలితాలు అంత నిజాయితీగా రావు. ప్రభుత్వమో మరో అధికారామో నియంత్రిస్తే తప్ప! నూటికి ఒక విద్యాసంస్థ, నిజాయితీ దారిలో వెళ్తే పరాజయం పాలు కావాల్సిందే! పైనున్న కార్పోరేట్ సంస్థలు, ఫలితాలని హైజాక్ చేసి తొక్కేస్తాయి. కాబట్టి కూడా విద్యా వైద్యాలు ప్రైవేటీ కరించబడ కూడదు. అందుకే ఇందిరాగాంధీ హయాంలోని గత ప్రభుత్వాలు, అందుకోసం ఒడ్డి పోరాడాయి. గూఢచర్యపు పట్టు అప్పట్లో లేక ఓడిపోయాయి.

ఇక ఈ ఫలితాలని నిర్వహించే [organaise చేసే] తీరు, వాటి తాలూకూ నెట్ వర్క్, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకోసం పెద్ద కార్పోరేట్ విద్యాసంస్థలు కొందరు మధ్యవర్తులని [లైజాన్ ఆఫీసర్లు]ని నియమించుకుంటుంది. సంవత్సరమంతా ఉన్నతోద్యోగులకి, ఎం.ఎల్.ఏ., మంత్రుల వంటి రాజకీయులకి అందుబాటులో ఉంటూ, అవసరాలు[?] తీరుస్తూ, సత్సంబంధాలు కొనసాగించటమే సదరు ఉద్యోగుల/డైరక్టర్ల పని!

ఇవి ఫలితాల సాధన విషయంలో అయితే, ఇక విద్యార్ధుల సమీకరణ గురించిన నెట్ వర్క్, మరింత ఆసక్తి కరమైనది. కార్పోరేట్ విద్యాసంస్థలే కాదు, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ కూడా... విద్యార్ధులని సమీకరించేందుకు తమ తమ PRO లని ఆయాప్రాంతాల్లో అప్రకటితంగా అపాయింట్ చేసుకుంటాయి. మాటకారి వారిని, వ్యాపార నైపుణ్యం, ఎదుటి వారికి నచ్చచెప్పి ఒప్పించగల ఓపిక ఉన్నవారిని చూసుకుని, తమ దగ్గరికి ఎంత మంది విద్యార్ధులని పంపితే అంతగా, తలకు ఇంతని కమీషన్ ముట్టచెబుతాయి.

ఇందుకోసం కొన్ని కాలేజీలు, పాఠశాలలు తమ బోధనా సిబ్బందినీ ఉపయోగిస్తుంది. యాడ్ కాంపైన్ పేరుతో, ఆడియో వీడియోలతో సహా కరపత్రాలూ, బ్రోషర్స్ తో, ఆకర్షణీయమైన స్కీములతో... వేసవి సెలవులంతా ఇదే పని! ఎంతగా ఆశలు పెడతారంటే - తల్లిదండ్రులకి, ముఖ్యంగా అంతగా చదువుకోని గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకి, ఏకంగా అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు.

చిన్న ఉదాహరణ చెబుతాను. మాకు తెలిసిన ఒక అమ్మాయికి పదవ తరగతిలో 541 మార్కులు వచ్చాయి. ఆ అమ్మాయికి లెక్కలంటే ఇష్టం. బాగా చేస్తుంది. కప్ప, బొద్దింకలని చూసినా, ఒక్కసారిగా చీమల కుప్పల్ని చూసినా, ఆ పిల్లకి ఒళ్ళు జలదరిస్తుంది. జంతువుల పట్ల చాలా అయిష్టత. ఆమెకి MPC ఇష్టం.

స్థానిక కాలేజీ వాళ్ళు ఆ పిల్ల తల్లిదండ్రులకి "మీ అమ్మాయిని మా కాలేజీలో చేర్పిస్తే, ఫ్రీగా చదువు చెబుతాం. Bi.PC ఇప్పించండి. బాగా చదువుచెబుతాం. పూర్తిగా ఆమె మీద కాన్ సెంట్రేషన్ చేస్తాం. ఆమె గనుక మెడిసిన్ ర్యాంకు సాధిస్తే, రెండు తులాల బంగారు గొలుసు బహుమతిగా ఇస్తాం" అంటూ ఊదర పెట్టారు.

గత సంవత్సరం మా ప్రక్కింటి అమ్మాయికి 574 మార్కులు వచ్చాయి. ఆమె ఐఐటీ, ఎంసెట్ అంటూ ఉంటే, ఇదే కాలేజీ వాళ్ళు ఇదే ప్రపోజల్ తో "నువ్వు మా పాలిట లక్ష్మీదేవివి తల్లీ! సరస్వతీ దేవి కటాక్షం నీకుంది. ఏదో నీలాంటి వాళ్ళు మా కాలేజీలో ఉండి బాగా చదివి ర్యాంకు తెచ్చుకుంటే మాకు పేరు వస్తుందని మా ఆశ! Bi.P.C. తీసుకో, రానుపోనూ మేమే ఆటో కూడా ఏర్పాటు చేస్తాం" అంటూ ఇంటి చుట్టూ తిరగటం ప్రత్యక్షంగా చూశాము మేము. అదే తంతు ఈ సంవత్సరం ఈ అమ్మాయిది కూడా!

తల్లిదండ్రులకి ఆశ కలగటం సహజం. రెండు తులాల బంగారం అంటే 40 వేలు. ‘తమ పిల్ల చదివేసి మెడిసిన్ సీటు తెచ్చేసుకుంటే...?’ అని ఆశ! అదెంత కష్టమో, ఏపాటి సంభవమో తెలియదు. పదవ తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంది కాబట్టి, మెడిసిన్ ర్యాంకూ తెచ్చేసుకుంటుంది అనుకుంటారు.

ఇక ఇలా ఆశపెట్టే కాలేజీ వాళ్లకి కూడా మెడిసిన్ ర్యాంకు ఎలా వస్తుందో తెలియదు. అసలిక్కడ ఎంసెట్ అన్నదే ఓ పెద్ద ఫార్సు! కాబట్టి, ఎంసెట్ లో ఈ అమ్మాయికే కాదు, ఏ విద్యార్ధికీ మెడిసిన్ ర్యాంకు తెచ్చుకునేంత శిక్షణా తామివ్వలేమని సదరు కాలేజీ వాళ్ళకీ తెలుసు. కానీ ఇవాళా రేపూ, ఇంజనీరింగ్ ర్యాంకులకి విలువ లేదు. ఐఐటీ తాము అందుకోలేరు. చదవగల విద్యార్ధులని సమీకరిస్తే, ఆశపెడితే, వాళ్ళు చదివి ఎలాగోలా ఒక్క మెడిసిన్ సీటు తెచ్చుకున్నా, అది తమకి కాసులు పండిస్తుంది.

ఒక వేళ మెడిసిన్ ర్యాంకు రాకపోయినా ఇంటర్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే అవి ప్రచారస్త్రంగా ఉపయోగపడతాయి. ఈ ఆశ కంటే వాస్తవికతా తెలియదు. ఇంటర్ తమ దగ్గర చదివి, లాంగ్ టర్మ్ లో మెడిసిన్ ర్యాంకులు తెచ్చుకున విద్యార్ధుల వివరాలతో, ప్రచారాలు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ ఆశ వాళ్ళది!

ఇవేవీ తెలియని తల్లిదండ్రుల ఆశ తల్లిదండ్రులది. దాంతో లెక్కలంటే ఇష్టమో, జువాలజీ అంటే కష్టమో ఉన్న అమ్మాయిని Bi.P.C. లో చేరమన్న ఒత్తిడితో, ఆ బుడ్డిది బేర్ మంటోంది. ఏం చేస్తాం? అందుకే నిన్నటి టపాలో.... పిల్లలు విద్యాసంస్థలకీ, తల్లిదండ్రులకీ కూడా ఆదాయ వనరులుగా మాత్రమే కనబడుతున్నారని వ్రాసాను.

ఈ విషయం ప్రక్కన బెడితే.... PROల సాయంతో విద్యాసంస్థలు, విద్యార్ధులని సమీకరించుకునే ప్రక్రియలో.... అచ్చంగా ఎవరి మార్కెట్ సర్వే వారికుంటుంది. ఏ ప్రాంతంలో ఏయే వయస్సు పిల్లలు, ఏఏ తరగతుల్లో చేరేందుకు, ఎంతమంది ఉన్నారన్న వివరాలతో సహా, తల్లిదండ్రుల ఆర్ధిక స్థాయిల గురించి కూడా సమాచారం సేకరిస్తారు. ఆయా ప్రాంతాల్లో, ఏ విద్యార్ధుల తల్లిదండ్రులకి ఎంతెంత పలుకుబడి ఉందీ, ప్రభావపరచగల సత్తా ఏమాత్రం ఉందీ.... లాంటి వివరాలూ పరిశీలిస్తారు. దాన్ని బట్టి ఫలితాల పంపకం ఉంటుంది.

ఎవరి పిల్లలకి మంచి మార్కులూ, ర్యాంకులూ కట్టబెడితే, ఆయా ప్రాంతాల నుండి తదుపరి సంవత్సరం తమకు ఎంతమంది విద్యార్ధులు రవాణా అవుతారో చూసుకుని, దాన్నిబట్టి ఫలితాలని మేనేజ్ చేస్తారన్న మాట! ఇదంతా గమనించినప్పుడు, ఇంత శ్రమా, శ్రద్దా, సమయమూ... విద్యార్ధుల జ్ఞానాన్ని పెంపొందించటానికీ, వారి వ్యక్తిత్వాన్ని నిర్మించటానికీ ఉపయోగిస్తే.... ‘ఈ దేశపు యువత, ఎంత ధృఢతరంగా, సుసంపన్నంగా తయారౌతారో కదా!’ అన్పిస్తుంది.

ఈ విధమైన ఫలితాల అవకతవకల గురించి రాజకీయ రంగం ద్వారా భారతీయత మీద సుదీర్ఘ కుట్ర అనే టపాల మాలికలో ఎంసెట్ అవకతవకల మీద వ్రాసిన టపాలలో వివరించాను.

2000 సంవత్సరం ఫలితాల మీద మేము ఫిర్యాదు చేసిన తరువాత నుండి, ఇంటర్ ఫలితాలలోనూ, ఎంసెట్ ఫలితాలలోనూ, ఈ మధ్య కాలంలో ఐఐటీలోనూ, ‘మట్టిలోని మాణిక్యాలు’, ‘పేదింట విద్యాకుసుమాలు’ అంటూ శీర్షికలతో మార్కులూ, ర్యాంకులలో కొన్నింటిని, డబ్బూ పరపతి, ప్రభావశీలతా గల తల్లిదండ్రుల పిల్లలకి గాక, సామాన్యులకి కూడా రానిస్తున్నారు.

ఎందుకంటే - క్రమంగా ర్యాంకు ఫిక్సింగులూ, మార్కుల అవకతవకలూ బహిరంగ పడుతున్నాయి కదా!? జారిపోయే నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు, కొంత సహజత్వాన్ని అద్దేందుకు, ఇలాంటి చర్యలు చేపట్టారన్న మాట. ఇవే మట్టిలోని మాణిక్యాలు 2000 సంవత్సరానికి ముందు స్టేట్ ర్యాంకుల జాబితాలో లేకపోవటం గమనార్హం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

రేపటి భవిష్యత్తు కోసం అంటూ, ఇంత ఒత్తిడి ఈ రోజు అవసరమా? [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 10]

Wed, 05/26/2010 - 03:33
భారతీయుల మీద విద్యారంగం ద్వారా కుట్రకు సమాంతరంగా.... గ్రంధాలయాలు, ప్రజలలో పిల్లలలో పఠనాసక్తి, శిధిలం చేయబడ్డాయి. లైబ్రేరియన్ నియామకాలు మూలపడ్డాయి. గ్రంధాలయాలకు నిధులు రద్దయ్యాయి. క్రమంగా గ్రంధాలయాలు అంతరించాయి. క్రికెట్టూ, టీవీలతో [ముఖ్యంగా ప్రైవేటు ఛానెళ్ళు వచ్చాక], జనాల్లో మిగిలి ఉన్న పఠనాసక్తి కూడా అడుగంటి పోయింది. ఇప్పుడు నిర్వహించబడుతున్న గ్రంధాలయాలలో కేవలం జి.కే.పుస్తకాలు, ఉద్యోగపోటీలలో విజయ సోపానాలు, టిప్స్ తో నిండిన వ్యక్తిత్వ నిర్మాణ పుస్తకాలు మాత్రమే ఉన్నాయి.

దశాబ్దాల తరబడి [తీవ్రదశలో] అమలు చేయబడిన ఈ కుట్రలో, ఆయా కాలాల్లో ఆయా స్థాయిలలో తదనుగుణమైన వ్యూహాలు[స్ట్రాటజీలు] అమలు చేయబడ్డాయి. ఉన్నతాధికారులలోనూ, రాజకీయ నాయకులలోనూ, డబ్బు కెరీర్ కు లొంగే అవినీతి పరులని, వాటితోనే సంతృప్తి పరచి లోబరుచుకున్నారు. ‘దూరదృష్టితో చూస్తే ఇలాంటి విద్యావిధానాలు, పాఠ్యాంశాలు, గ్రంధాలయ నిర్మూలనలు సమాజానికి నష్టదాయకం’ అని అడ్డుకునే ప్రయత్నం చేసిన నిజాయితీపరులనీ, నిబద్దత గల వారినీ, విధుల్నుండి తప్పించడం, వేధించటం చేశారు. గురిపెట్టుకుని విసిగించారు.

ప్రభుత్వంలో కీలక స్థాయిల్లో ఉన్న అలాంటి వారిని విసిగించటం, వేధించటం సాధ్యం గాకపోతే.... ఇక అప్పుడు నల్లమేక - నలుగురు దొంగలు కథలోని దొంగల్లా, పదే పదే అదే చెప్పి కన్విన్స్ చేసారు. ఫలానా సమస్యకి ఇది తప్ప మరో పరిష్కార మార్గం లేదంటూ, పదే పదే, మేధావులంటూ మీడియా ప్రచారించిన వాళ్ళూ, కమీటిల నిపుణులుగా ప్రభుత్వం నియమించిన వాళ్ళూ చెవినిల్లు కట్టుకు పోరితే.... వినగా వినగా ‘అంతేనేమో’ అన్పించటమే ఇక్కడ విన్యాసం!

ఈ విధంగా, సామదాన దండోపాయాలే కాదు, ప్రభావపరచటం, ఏమార్చటం, భ్రమపరచటం, నమ్మించటం గట్రా మానసిక తంత్రాలు కూడా ప్రయోగింపబడ్డాయి. కాబట్టే ఒక్క విద్యారంగమే కాదు, రాను రాను అన్ని రంగాలూ అధ్వాన్నంగా, అవినీతి ఊబిగా ఉత్పన్నం చెందాయి. ఇందుకోసం, భారతంలో ధృతరాష్ట్రునికి, కణుకుడు చెప్పిన కూటనీతిని అమలు చేశారు. కణిక నీతిని వివరించే కథనీ, కూటనీతినీ మరో సారి ఇక్కడ చదువుకోవచ్చు.


చేదుగా ఉన్నా, నిజమే చెప్పాల్సి వస్తే..... ఈ రోజు సమాజంలో, తల్లిదండ్రులలో అత్యధికులు, పిల్లల పెంపకం విషయంలో విఫలమయ్యారు, అవుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో మరిచిపోయారు, లేదా వాళ్ళకిది అసలు తెలియదు. మొన్నటి తరం పెద్దల్ని గురించి ఈ మాట నేను ఆనటం లేదు. ఈ తరం తల్లిదండ్రుల్ని , నిన్నటి తరం తల్లిదండ్రుల్లో కొందరిని చూసి, ఈ మాట చెబుతున్నాను.

అలాంటి చాలామంది తల్ల్లిదండ్రులకి పిల్లల్ని ఏవిధంగా క్రమశిక్షణా యుతుల్ని చేయాలో తెలియదు. పిల్లల్లో కుతూహలాన్ని, ఆసక్తిని, తార్కికతనీ, ఆలోచనా శక్తిని ఎలా పెంపొందించాలో తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా పిల్లల్ని అతిగా ముద్దు చెయ్యటమే! వాళ్ళ దృష్టిలో పిల్లలు కోరిందల్లా ఇవ్వటంతో తమ బాధ్యత తీరినట్లే! పిల్లలు అడిగినంత డబ్బివ్వటం, కోరిన వస్తువులు కొనివ్వటం... ఇవే పిల్లల పట్ల తమ కర్తవ్వం అనుకునే తల్లిదండ్రుల్ని నేను చాలా మందిని చూశాను.

నిజానికి ఈ రకపు ’గారాం’తో పిల్లల్లో ఎంత అహం పెరుగుతుందో ఆ తల్లిదండ్రులకు అవగాహన లేదు. పేద ధనిక తారతమ్యం లేకుండా అన్ని వర్గాల తల్లిదండ్రుల్లోనూ, వారి వారి ఆర్ధిక స్థాయిలకు తగినంతగా, ఈ ‘గారాబపు అహంకారం’ అనే ప్రక్రియ నడుస్తోంది.

ఇక ఇలాంటి స్థితిలో.... ‘పిల్లల్ని దండిస్తే చట్ట పరంగా పిల్లలు పెద్దల మీద కేసులు పెట్టవచ్చు’ అంటే పరిస్థితి ఏమిటి? అసలుకే ఓప్రక్క, తల్లిదండ్రులకి తమ పిల్లల్ని గట్టిగా కోప్పడాలంటేనే భయం. నొచ్చుకుంటారనో, ఏడ్చి ఇల్లు పీకి పంది రేస్తారనో భయం. ఇక టీవీలు, నేరాలూ - ఘోరాలు, లేనిపొని కొత్త ఆలోచనలని పిల్లలకి రేకెత్తిస్తున్నాయయ్యె! గట్టిగా తిట్టినా, రెండు దెబ్బలు కొట్టినా.... ఇంట్లోంచి పారిపోవడమో, ఆత్మహత్య చేస్కోటమో చిన్నపిల్లల విషయంలోనూ వింటున్నాం, చూస్తున్నాం.

అలాంటప్పుడు భయం లేకుండా ఎలా ఉంటుంది? అదే పరిస్థితి పాఠశాలలదీ, అక్కడి ఉపాధ్యాయులదీ కూడా! చదవలేదనో, క్రమశిక్షణా రాహిత్యమనో పిల్లల మీద కాస్త తీవ్రచర్యలు తీసుకుంటే... దానికి ఆ పిల్లలు కాస్తా అతిగా స్పందిస్తే[ఇల్లు విడిచి పారిపోవటం, ఎలుకల మందు మింగటం గట్రా] ఆపైన కేసులు, పోలీసు స్టేషన్లూ, కోర్టులూ, తిప్పలూ! ‘ఎందికొచ్చిన గొడవ?’ అని ఉపాధ్యాయులూ అనుకుంటున్నారు, స్కూళ్ళదీ అదే పరిస్థితి!


"సార్! మా వాడు బాగుపడితే చాలు! రెండు పీకినా ఏమీ అనుకోం?" అనే తల్లిదండ్రులు సైతం, తీరా బిడ్డ వంటి మీద దెబ్బలు చూడగానే ఆవేశంతో ఊగిపోవటమూ సహజమే! పిల్లల ప్రవర్తనకి విసిగిన ఉపాధ్యాయుల ఆగ్రహం హద్దులు దాటటమూ సర్వసాధారణమే! ఎందుకంటే పెద్దలలోనే భావోద్రేకాలని నియంత్రించుకునే శక్తి సన్నగిల్లిన చోట, పిల్లల్లో అదెక్కడి నుండి వస్తుంది? వెరసి అంతటా అదే మానసిక అస్థిరత [imbalance] ఉంది. ఫలితమే ఘర్షణ!

ఇలాంటి స్థితిలో, మండే జ్వాలలో మరింత పెట్రోలు పోయటానికి.... చట్టాలూ, మానవహక్కులూ కూడా తోడయ్యాయి. ఇక్కడ మరో విన్యాసం ఏమిటంటే - ప్రస్తుత విద్యావిధానంలో, పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్ధుల తల్లిదండ్రులూ కూడా, విద్యార్ధులకు సంబంధించిన అన్ని వ్యవహారాలకు ఉపాధ్యాయులనే బాధ్యుల్ని చెయ్యటం! అంతేగాక అసలు పిల్లల విద్యాభివృద్దిని కేవలం మార్కులతో మాత్రమే కొలవటం అన్నది సర్వత్రా జరుగుతోంది. పిల్లల ఎదుగుదల అంటే మార్కులూ ర్యాంకులే!

ఆటల పోటీలలోనూ ఇతరత్రా ప్రతిభాపాటవాల విషయంలోనూ కూడా బహుమతుల లెక్కలే! ఎన్ని కప్పులూ, ఎన్ని పతకాలూ! ఇదే జాతర! ‘ఎంతగా పిల్లల్లో నైపుణ్యాలు పెరిగాయి?’ అన్నది ఎవరికీ పట్టనిదై పోయింది. క్రమంగా కార్పోరేట్ విద్యాసంస్థల దగ్గరి నుండి సాధారణ విద్యాసంస్థల దాకా, ఎవరి స్థాయిని బట్టి వారు నాసా గుర్తింపులూ, గణిత ఒలెంపియాడ్ లూ, ఫలానా ఫలానా పోటీల్లో నారాయణ హవా, శ్రీచైతన్య పెను హవా! అంటూ వ్యాపార ప్రకటనల స్థాయికి ఎదిగిపోయింది[?].

ఈ మొత్తం వ్యవహారంలో.... పిల్లలు, పాఠశాలలకు పైసలూ, ఇమేజ్ తెచ్చిపెట్టే మోడళ్ళు గానూ, తల్లిదండ్రులకి పరపతి మోజులని తీర్చే వనరులు గానూ మిగిలిపోయారు. ఎందుకు నేర్చుకుంటున్నారో, ఏం నేర్చుకుంటున్నారో వారికేం తెలీదు. చదువులు కాని ఇతరత్రా పోటీలలోనూ, యాజమాన్యాల లాబీయింగ్ లని బట్టే బహుమతి పంపకాలైన చోట, విద్యార్ధులు అందులో సమిధలే తప్ప, సదరు పోటీలు పిల్లల్లో మానసిక వికాసాన్ని తెస్తోందేమీ లేదూ, మానసిక వత్తిడులని తప్ప!

తల్లిదండ్రులకి కూడా, పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ, మానసిక వికాసాం, వ్యక్తిత్వ నిర్మాణాం ఏవిధంగా ఉందో పట్టించుకునే తీరిక లేదు. ఆయా లక్షణాలు పిల్లల్లో పెంపొందించాలనే అవగాహన కూడా చాలా తక్కువమంది తల్లిదండ్రుల్లో ఉంది. మార్కులూ, ర్యాంకులే కొలబద్దలై పోయాయి. జి.కే. బట్టీ వేస్తే తెలివైన వాళ్ళయిపోతారనేంత గుడ్డినమ్మకం ఉన్న తల్లిదండ్రుల్ని కూడా చూశాను. "రామాయణ భారతాలని గురించి ఇంట్లో అమ్మదగ్గర చెప్పించుకు రామ్మా!" అంటే.... "టీచర్! మా మమ్మీ ఆవేవీ అవసరం లేదులే అంది" అని చెప్పిన పిల్లల్ని చూశాను.

కొందరు తల్లిదండ్రులకి - ‘పిల్లల్లో వ్యక్తిత్వ నిర్మాణం జరగాలంటే, చదువుతో పాటు వ్యవహార జ్ఞానం కూడా కలిగించబడాలి. కథలు, పుస్తక పఠనంతో పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం కలిగించవచ్చు’ అని తెలిసినా, అందుకోసం తమ సమయాన్ని పిల్లలకి కేటాయించగల స్థితిలో లేరు. ఎవరి బిజీ వారిది. ఎవరి పని ఒత్తిడి వారిది. మొత్తంగా జీవితాలే ఉరుకులూ పరుగులతో, సూర్యాగమనాన్ని మించిన వేగంలో మునిగి పోయినప్పుడు ఎవరేం చెయ్యగలరు? ఎందుకంటే అందరూ ఒక్కటై పరిష్కరించుకోవలసిందే గానీ, ఒక్కరుగా పరిష్కరించుకోలేని సమస్య ఇది!

ఇంకా కొందరు తల్లిదండ్రుల అభిప్రాయంలో, పాఠశాలకు ఫీజులు కట్టటంలో తమ బాధ్యత తీరిపోయినట్లే! ఫీజులూ, పుస్తకాలు, యూనిఫాంలూ, బూట్లూ, సూట్లూ.... అన్ని ఖర్చులూ పెట్టి ‘పిల్లల్ని బళ్ళో పెట్టేస్తే’ సరి! ఇక కొందరు తల్లులకైతే ప్రతీ రోజూ, తామూ పిల్లల్తో కుస్తీ పట్టి, వాళ్ళ చేత హోం వర్కు చేయిస్తే, ఆ రోజుటికి తమ పని గడిచినట్లే! ఒక యజ్ఞం పూర్తయినట్లు ఓ నిట్టూర్పు కూడా విడుస్తారు. నిజానికి మొరాయించే పిల్లల చేత హోం వర్కు చేయించటం చాలా కష్టమైన పనే! మొరాయించని పిల్లలకి కూడా ‘బొచ్చెడంత హోం వర్క్’ ఉంటే అది నడ్డి విరిగేంత పని! ‘పిల్లలకి పరీక్షలు మాకు అగ్నిపరీక్షలు’ అనే తల్లిదండ్రులని బోలెడు మందిని గమనించాకే ఇవి చెబుతున్నాను.

ఇక ఈ తల నొప్పంతా భరించలేక, ఉదయం నుండీ బడిలో ఉండి వచ్చిన పిల్లల్ని, ట్యూషన్ కి తరిమేసే తల్లిదండ్రులు మరి కొందరు. దాంతో తల్లిదండ్రుల కర్తవ్య నిర్వహణ, బాధ్యతా పూర్తయినట్లే!

వెరసి పిల్లల అందమైన బాల్యం, ఆనందంగా గడవాల్సిన బాల్యం.... జ్ఞానపు తోటలో, చదువు‘కునే’ బడిలో కాదు, చదువు ‘కొనే’ జైలులో తెల్లారి పోతోంది! ఒక చిట్టి పిచుకనో, చిన్ని చిలుకనో గమనించే తీరిక లేదు.

శ్రీశ్రీ కాంక్షించినట్లు.... ‘మంచుకురిస్తే, వాన వెలిస్తే, ఆకాసాన హరివిల్లు విరిస్తే, అది మా కోసమే’ అనుకునే బాల్యం పిల్లలకి అందుబాటులో లేదు. ‘సముద్రపు అలల మీది తేలి వచ్చే నురగలలో ఆడుకుంటూ పిల్లలు పాడుకుంటున్నారు. కాగితపు పడవలు వదలి వాటి వయ్యారాలు చూసి సంబరంగా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు. వాళ్ళకి చేపలు పట్టటం రాదు!’ అంటూ రవీంద్రుడు పాడిన బాల్యం, ఇప్పుడు పిల్లల దగ్గర లేదు. అలారం.... స్కూలు బస్సు హరన్... లంచ్ బెల్... లాంగ్ బెల్... బస్సు హారన్.. డేట్ మారింది. అంతే! సెలవులొస్తే అప్పుడే ఊపిరి పీల్చుకోవాలి. మరి వీక్ టెస్టో?

చిదిమితే పాలు గారే పసిపాపలకి, రేపటి భవిష్యత్తు కోసం అంటూ, ఇంత ఒత్తిడి ఈ రోజు.... అవసరమా?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

గూఢచర్యానికి మరో పర్యాయపదమే రెడ్ టేపిజం!

Mon, 05/24/2010 - 21:16

ఇప్పటికే ప్రభుత్వ పనితీరులో, రాజకీయ నాయకుల, బ్యూరాక్రాట్ల వ్యవహార సరళిలో రెడ్ టేపిజం  పేరిట అవినీతి, అవకతవకలు, విధుల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం ఎలా జరుగుతుందో పలుమార్లు పరిశీలించినా....                 మరో స్పష్టమైన దృష్టాంతాన్ని గమనించండి. ముందుగా మే 19, 2010 న ఈనాడులో ప్రచురింపబడిన దిగువ వార్త పరిశీలించండి. >>>అఫ్జల్ గురు ఫైల్ పై కదలిక:గవర్నర్ కు పంపిన ఢిల్లీ ప్రభుత్వం!నాలుగేళ్ళ తర్వాత చలనం!పరిస్థితులను సమీక్షించాకే శిక్ష అంటూ మెలిక!
నాలుగేళ్ళుగా కదలకుండా పడి ఉన్న అఫ్జల్ గురు ఫైల్ పై ఢిల్లీ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఫైల్ ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తేజిందర్ ఖన్నాకు మంగళవారం పంపించింది. గవర్నర్ నుండి తిరిగి వచ్చాక కేంద్ర హోంశాఖకు అందజేయనుంది. ‘అఫ్జల్ గురుకు ఉరిశిక్ష వేయాల్సిందే కానీ, శిక్షను అమలు పరిచే ముందు శాంతిభద్రతల పరిస్థితులనూ క్షుణ్ణంగా పరిశీలించాలి’ అంటూ ఢిల్లీ ప్రభుత్వం ఫైల్ లో పేర్కొన్నట్లు సమాచారం. పార్లమెంట్ పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురుకు క్షమాభిక్ష పెట్టే విషయంలో ఢిల్లీ అభిప్రాయం కోరుతూ కేంద్ర హోంశాఖ దాదాపు నాలుగేళ్ల క్రితం ఫైల్ ను పంపించింది. ఆ తర్వాత ప్రతీ మూడు నెలలకోసారి రిమైండర్లు జారీ చేస్తూనే ఉంది. ఇప్పటికి 16 రిమైండర్లు జారీ అయ్యాయి. ముంబై దాడుల కేసులో కసబ్ కు ఉరిశిక్ష పడటంతో అఫ్జల్ గురు విషయం తెరపైకి వచ్చింది. అఫ్జల్ క్షమాభిక్ష ఫైలు ఢిల్లీ ప్రభుత్వం వద్ద ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ సర్కార్ అఫ్జల్ ను టెర్రరిస్టుగా కాకుండా టూరిస్ట్ గా చూస్తోందంటూ ప్రతిపక్ష భాజపా ఆరోపించింది. ఈ నేపధ్యంలో, ఢిల్లీ ప్రభుత్వ అసాధారణ జాప్యాన్ని తప్పుబడుతూ తీవ్రపదజాలంతో కేంద్ర హోంశాఖ ఇటీవల లేఖ రాసింది. దీంతో అఫ్జల్ ఫైలుపై ప్రభుత్వంలో చలనం వచ్చింది. మరో వైపు కేంద్రహోంశాఖకు ప్రత్యుత్తరం పంపించామంటూ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మంగళ వారం తెలిపారు. పరిణామక్రమం:13డిసెంబర్, 2001- పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి.18డిసెంబర్, 2002 - దాడికి కుట్ర పన్నిన అఫ్జల్ గురుకు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధింపు.29అక్టోబర్, 2003 - ఉరిశిక్షకు ఢిల్లీ హైకోర్టు ఆమోదం. 4ఆగస్టు 2005 - అఫ్జల్ అప్పీల్ కు సుప్రీంకోర్టు తిరస్కరణ.20అక్టోబరు 2006 - తిహార్ జైలులో ఉరి అమలుకు సెషన్స్ కోర్టు తేదీ ఖరారు.రాష్ట్రపతి క్షమాభిక్షను వేడుకుంటూ అఫ్జల్ గురు 2006 లో విజ్ఞప్తి దాఖలు చేసాడు. నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రపతి ఆ విజ్ఞప్తిని పరిశీలన కోసం కేంద్రహోంశాఖకు పంపించారు. అక్కడి నుండి ఫైలు ఢిల్లీ హోంశాఖకు చేరుకుంది.                ~~~~~~~~~పార్లమెంటు పై దాడి జరిగి 8 ½  సంవత్సరాలైంది. సదరు కుట్రదారుడికి ఉరిశిక్ష విధించి 7 ½  సంవత్సరాలైంది. ఫైల్ నింపాదిగా, నిబంధనల ప్రకారం ప్రయాణం చేస్తోంది. కారాగారంలో నేరగాణ్ణి మేపడానికి, రక్షించడానికి కోట్లాది రూపాయలు ఖర్చయ్యి ఉంటుంది.                 ఇంత పకడ్బందీగా నిబంధనల ప్రకారం ఫైలుని నడిపిస్తున్నాయి కేంద్ర, ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు! నేరం జరిగింది భాజపా హయంలో! వీళ్ళంతా ఇంతగా నిబంధనలు పాటిస్తున్నారే, మరి ఏ నిబంధనలు పాటిస్తూ ఆ ముస్లిం ఉగ్రవాదులూ, పాక్ కుట్రదారులూ, పాక్ ప్రేరేపిత నేరగాళ్ళు భారత పార్లమెంటుపై దాడి చేసారట? ఆ దాడిలో దేశపు పరువు కాపాడేందుకు అసువులు బాసిన పోలీసు, సైనిక వీరుల కుటుంబాలని, ఏ నిబంధనల ప్రకారం గాలికి వదిలేసారట? 14 డిసెంబరు, 2007 న ‘మీ సంతాపాలు ఎవరికి కావాలి?’ అంటూ ఆ కుటుంబాల వాళ్ళు ఆక్రోశించారు కూడా! ఈ తిలా పాపాన్ని తలా గుప్పెడు.... ఎన్డీయే, యూపీయే లు రెండూ కుమ్ముకున్నాయి.                ఇంకా.... షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిత్వాన గల ఢిల్లీ ప్రభుత్వం ‘అఫ్జల్ గురుకు ఉరిశిక్ష వేయాల్సిందే గానీ, శిక్షను అమలు పరిచే ముందు శాంతి భద్రతల పరిస్థితులనూ క్షుణ్ణంగా పరిశీలించాలంటూ’ మెలిక పెట్టిందట!                 అంత శాంతి భద్రతలను పరిరక్షించలేనప్పుడు, ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడం ఎందుకు? అందునా సదరు షీలా దీక్షిత్ ఎంతో సమర్ధనారి! 1991, మే 21న రాజీవ్ గాంధీ శ్రీపెరుబుదూర్ లో హత్యకు గురికావడానికి ముందు [ఒకటి లేదా రెండు రోజులు ], ఒడిషాలో ఎన్నికల ప్రచార యాత్రలలో సోనియాకి నమ్మకంగా, రాజీవ్ వెంట ఉండి మరి మృత్యుముఖానికి సాగనంపినంత సమర్ధురాలు. అప్పట్లో ఎన్నికల ప్రచార యాత్రలలో రాజీవ్ గాంధీ తిండితిప్పల బాధ్యత ఈవిడదే లెండి. చల్లారిన బజ్జీల దగ్గర నుండి సమయానికి భోజనం చేసేటట్లు, దగ్గరుండి మరీ చూసుకుంది![ఈ విషయం గురించి వివరంగా ‘భారత రాజకీయ రంగంపై కుట్ర’ అనే లేబుల్ లో వ్రాసాను.]                మరి అంతటి సమర్ధ నాయకురాలికి, రెండోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన సీనియర్ నాయకురాలికి, అఫ్జల్ గురుకి ఉరి తీస్తే శాంతి భద్రతలని పరిరక్షించే సామర్ధ్యం లేదటనా? అఫ్జల్ గురు ఉరిశిక్ష సాగదీసిందీ, అఫ్జల్ గురు ఉరిశిక్ష ఫైలుకి నాలుగేళ్ళు తొక్కిపెట్టి ఉంచిందీ షీలా దీక్షిత్ ప్రభుత్వం!? వెంటనే ఫార్వర్డ్ చేయనిది పాక్ కి ఆగ్రహం కలుగుతుందనా లేక అధిష్టానానికి ఆగ్రహం కలుగుతుందనా?                 నిజంగా భారత దేశ ముస్లింలు అఫ్జల్ గురుని ఉరి తీస్తే శాంతిభద్ర్రతలకి విఘాతం కలిగిస్తారా? మరి పార్లమెంట్ పై దాడిని "పోన్లే పాపం!" అనుకుంటారా? ఈ దేశపు పార్లమెంటు ముస్లింలది కాదటనా? ఈ దేశం, దేశపు పరువు మర్యాదలు ఈ దేశ ముస్లింలకు పట్టదటనా? దేశం కంటే మతమే తమకు ముఖ్యం అనుకున్నప్పుడు, మత ప్రాతిపదికన దేశ విభజన జరిగిన నాడు ఇక్కడెందుకు ఉండిపోయినట్లు? అటు పాకిస్తాన్ కో, ఇటు బంగ్లాదేశ్ కో పోవలసింది కదా?                  దేశం కంటే మతమే ముఖ్యం అనుకుంటే, అలాంటి వాళ్ళని.... ముస్లింలైతే అరేబియా సముద్రంలోకి దించి, పడవెక్కించి పాకిస్తాన్ కీ, హిందువులైతే హిందూ మహా సముద్రంలోకి దించి దిక్కున్న చోటికీ, పొమ్మనటం మేలు.                 అసలైనా ఈ దేశపు ముస్లింలు గానీ, హిందువులు గానీ, ఏ ఇతరులు గానీ అఫ్జల్ గురుని ఉరిశిక్ష వేయవద్దంటున్నారా? పాక్ కి అనుకూల ఎన్డీయే, యూపీఏ నాయకులూ, మీడియా తప్ప, మరెవ్వరూ ఆ వాదనకు మద్దతు ఇవ్వటం లేదు! లేకపోతే ఈ రెడ్ టేపిజం మీద మీడియా, ప్రతిపక్షాలు, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి కదా!                 సామాన్య ముస్లింలని, కూరలమ్మే వాళ్ళ దగ్గరి నుండి కాసేట్లమ్మే వాళ్ళ దాకా, ఎవరిని కదిపినా, పెరిగిన పప్పూబియ్యాల ధరల పట్ల అదురూ, మరోసారి పెరగనున్న పెట్రో ధరల పట్ల బెదురూ తప్ప, అఫ్జల్ గురు లాంటి నేరగాడికి ఉరిశిక్ష వేస్తే ఊరుకోం అనే హుంకరింపు ఎవరిలోనూ కనబడదు. మరి పాత బస్తీలో వాళ్ళంతా హుంకరిస్తూ ఊగిపోతున్నారేమో! అలాంటి వాళ్ళని చూసి షీలా దీక్షిత్ లూ, సోనియాలూ, చిదంబరంలూ, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ‘కలవర పడుతున్నారేమో’! ఇదీ గూఢచర్యం!
ఇందులో రెడ్ టేపిజం ఏమిటంటే - మచ్చుకి పరిశీలించండి. నాలుగేళ్ళగా 16 రిమైండర్లు జారీ అయినా ఢిల్లీ హోంశాఖ నిమ్మకు నీరెత్తినట్లు కిమ్మనకుండా కూర్చొంది. ఎవరు ఆదేశిస్తే అలా గమ్మున కూర్చొంది? ఎవరూ నియంత్రించక పోతే, ఢిల్లీ హోంశాఖ ఉద్యోగులే ఫైలు తమ సొరుగులో పెట్టుకుని చోద్యం చూస్తారా?                ఇక్కడ మీకు ఓ ఉదాహరణ చెబుతాను. 1992 ప్రధమార్దంలో.... అప్పట్లో నేను APS RTC కి బ్యాటరీలు సరఫరా చేసేదాన్ని! ఆర్టీసీ వాళ్ళ వాడకంలో కనీసం 10% రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని నియమం ఉండేది. అయితే ఆర్టీసీలో డైరెక్టరు స్థాయి అధికారి ఒకరికి, బినామీగా బ్యాటరీ తయారీ యూనిట్ ఉండటంతో, అతడు కాగితాల మీదే కొత్త బ్యాటరీల కొనుగోలు, పాత బ్యాటరీల[scrap] అమ్మకమూ కొనసాగిస్తూ, పోటీదారులైన నాలాంటి వారికి ఆర్డర్లు ఇవ్వకుండా సతాయిస్తున్నాడు.                 నేను Gowell పేరుతో నడుస్తున్న ఆ యూనిట్ చిరునామా సంపాదించి అక్కడికి వెళ్ళాను. చూస్తే అది ఓ అద్దె ఇంటిలో[రెండు గదులు] కేవలం బ్యాటరీలు అసెంబుల్ చేస్తున్నది.[ఈ మొత్తం వ్యవహారం కార్మికుల యూనియన్ లకు  తెలుసు. వాళ్ళ వాటాలు వాళ్ళకి వస్తాయి. అందుకే వాళ్ళు నోరు మెదపరు. ఆర్టీసీ నష్టాలకు ఇది కూడా ఒక కారణం.]                 నేర్పుగా వాళ్ళ నుండి డాక్యుమెంట్ల కాపీలు సంపాదించాను. పరిశీలిస్తే ఏముంది! డైరెక్టర్ కే గాక, మెటీరియల్ డిపార్ట్ మెంట్ లో ఉన్నతాధికారికి కూడా అందులో వాటా ఉన్నది. వాళ్ళ భార్యల పేరిట ఉన్న భాగస్వామ్య డీడ్ సంపాదించాను. ఈ మొత్తం వ్యవహారం మీద అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డిని స్వయంగా కలిసి ఫిర్యాదు చేసాను. [ఆ నేపధ్యంలోనే ఈనాడులో ఉపసంపాదకురాలిగా పనిచేసే నా మిత్రురాలి ఇంట కొన్నిరోజులు ఉన్నాను. రామోజీరావు గూఢచర్య కార్యకలాపాలు నా దృష్టికి వచ్చింది అప్పుడే!]                 నా ఫిర్యాదు దరిమిలా ఆర్టీసీలో ఎంక్వయిరీ జరిగింది. ఆ సమయంలో నా ఫైలు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు, మరుక్షణం దాని మీద రిమార్క్ వ్రాసేసి తర్వాతి టేబుల్ మీదికి తోసేసారు. ఫైలుని బాంబుని చూసినట్లు చూసారని, ‘తమ దగ్గరుండగా ఎక్కడ పేలుతుందో, ఎందుకొచ్చిన గొడవ?! అన్నట్లు ఎవరికి వాళ్ళు పక్క టేబుల్ మీదికి ఉరికించారనీ, అప్పట్లో జోకులేసుకున్నాను. ఎందుకంటే తేడా వస్తే ఉద్యోగాలు పోతాయని భయం ఉండేది అప్పట్లో! ఆ విషయమై గుమాస్తా స్థాయి ఉద్యోగి నాతో "ఉద్యోగం పోతే ఏముంది మేడం! అడుక్కుతినటానికి కూడా పనికి రాము!" అంటూ తమ భయాన్ని సమర్ధించుకుంటూ వ్యాఖ్యానించాడు.                 ప్రమాదకరమైన వ్యవహారం అనుకున్నప్పుడు ఉద్యోగులు తీరు ఇలాగే ఉంటుంది.                 APSFC హెడ్ ఆఫీసులో నా ఫ్యాక్టరీ పైలు, ఈ రాష్ట్రంలో తొలి పబ్ ఫైలు ఒకేసారి ప్రయాణం ప్రారంభించాయి. నా సంస్థ లాంటి చిన్న తరహా ఉత్పత్తి సంస్థలను ఉద్యోగులు తొక్కేస్తే, పబ్ లు ప్రతీ చోటా పరుగులు పెడుతున్నాయి. ప్రతీ సినిమాలోనూ కనీసం ఒకటి రెండన్నా సీన్లుండే పబ్ లు మరి! తాగి చిందులేసే పబ్ లని ప్రభుత్వమూ, సినీ పరిశ్రమ ప్రోత్సాహించటం, చిన్న కుటీర పరిశ్రమలను ప్రభుత్వమూ, కార్పోరేట్ కంపెనీలు నలిపివేయటమూ కుట్రలో భాగం కదా!               ఇంతకీ చెప్ప వచ్చేందేమిటంటే - ఏ ఫైలునైనా తాము ఉరికించదలుచుకుంటే ఆఘమేఘాల మీద వ్యవహారం నడుస్తుంది. ముఖేష్ అంబానీకి మేలు చేయాలంటే మూడురోజుల్లో జీవోలూ, చట్ట సవరణలూ కూడా సాధ్యమే! అదే తాము ఏ ఫైలునైనా తొక్కి పట్ట దలుచుకుంటే, నాలుగేళ్ళలో 16 రిమైండర్లూ వచ్చినా ఉలుకూ పలుకూ ఉండదు. వ్రాతపూర్వకంగా రిమైండరు పంపుతూ నోటి పూర్వకంగా స్పందించ వద్దని చెప్పబడుతుందన్న మాట.                 కాబట్టే నోటి పూర్వకంగా చెప్పబడిన వ్యక్తిని ఎప్పటికీ నిరూపించ లేము. తాము నోటి పూర్వకంగా చెబితే ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి శ్రద్దా సక్తులతో చేయాలంటే, తాము నిలిపిన బొమ్మైయితే సరి! ఆ వ్యక్తులు రాష్ట్రపతి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, గవర్నర్ లు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు!                ఎప్పుడో ఇక తప్పదన్నప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ‘ఈ అసాధారణ జాప్యాన్ని తప్పబడుతూ’ తీవ్ర పదజాలంతో లేఖ వ్రాసినట్లు, ఓ స్టంట్ నడిచి, తర్వాత మెల్లిగా ఫైలు నడక మొదలౌతుంది. మళ్ళీ ఎక్కడ బ్రేక్ పడుతుందో ఎవరూ చెప్పలేనట్లుగా!                ఇది రెడ్ టేపిజం! నిజం చెప్పాల్సి వస్తే.... గూఢచర్యమే, దిగువ స్థాయికి వస్తే, ఉద్యోగులు స్థాయికొస్తే రెడ్ టేపిజం గా పిలవబడతుంది. బ్యూరాక్రాట్ల స్థాయిలోనూ, అగ్ర రాజకీయ నాయకుల స్థాయిలోనూ, ప్రభుత్వాధినేతల స్థాయిలోనూ ఉంటే, అప్పుడూ రెడ్ టేపిజం అనే పిలవబడినా, గూఢచర్యం అన్నది నిశ్శబ్దంగా పలకబడుతుంది.                 వెరసి రెడ్ టేపిజం పేరుతో గూఢచర్యం చాలా మామూలుగా అట్టడుగు స్థాయి ప్రజల వరకూ పాకి ‘గవర్నమెంటులో పనులంటే, ఏళ్ళూపూళ్ళూ పడుతుంది’ అనే నిర్లక్ష్యపు వ్యాఖ్యతో స్టాంపు కొట్టబడి చెలామణి అయిపోతోంది. ఈ రెడ్ టేపిజం వలన భారత ప్రభుత్వపు సొమ్ము దోచుకోబడటమే గాక, భారత రాజ్యాంగం పట్ల నమ్మకమూ దోచుకోబడుతుంది.  ఇదే ఇక్కడ గూఢచర్యపు విన్యాసము. అందుకే గూఢచర్యానికి మరో పర్యాయపదమే  రెడ్ టేపిజం అన్నది.                 నిజానికి రెడ్ టేపిజం అంటే పనులలో అలక్ష్యమూ కాదు, అవినీతీ కాదు. అవి పైపొరలు[over leaf reasons] మాత్రమే! లోపలి పొర గూఢచర్యమే! పైస్థాయి వాళ్ళకి, అంటే సోనియాలకీ, చిదంబరాలకీ, షీలా దీక్షిత్ లకీ, రోశయ్యలకీ, ఇంకా అలాంటి వాళ్ళకి రెడ్ టేపిజం అంటే గూఢచర్యానికి పర్యాయపదం అని తెలుసు.                 మన ఊళ్ళో మునిసిపాలిటి ఉద్యోగులకి తెలియదు. వాళ్ళకి సంబంధించి ‘రెడ్ టేపిజం’ అంటే కాసులు కురిపించే ప్రభుత్వ ప్రక్రియ అని మాత్రమే తెలుసు! తెలిసినా తెలియక పోయినా.... రెడ్ టేపిజం పేరిట వాళ్ళంతా చేస్తోంది మాత్రం దగా! నిలువునా దేశాన్ని, అవినీతి పేరుతో ముంచేసే దగా!
కొసమెరుపు ఏమిటంటే ‘ఉరి కన్నా దాని కోసం ఎదురు చూడటమే పెద్దశిక్ష’ అని చిదంబరం అభిప్రాయ పడ్డాడు. కాని, కాందహార్ విమాన హైజాక్ సంఘటన లాంటిది ఒక్కటి జరిగినా ఈ ఖైదీలు చాలా మామూలుగా విడుదల చేయబడతారు. ఈ విషయాలు తెలియకుండానే చిదంబరం కేంద్ర హోంమంత్రి పదవిలోకి వచ్చాడా!?
మరిన్ని  విషయాలతో తదుపరి టపా.అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.                              సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left