http://tetageeti.wordpress.com/feed

Syndicate content తేట గీతి
Viewed best with Internet Explorer 7 or Firefox 3
Updated: 33 min 38 sec ago

పీతల సీసా

Sun, 07/25/2010 - 21:00
“గురూ త్వరగా రా, మంచి ఫైటింగ్ సీన్ టీవీలో. మనం చూడని సినిమా ఏదో. పోలీసులకు పొలిటీషన్స్‌కి మధ్య ఫైట్. చాలా సహజంగా ఉంది. పోలీసులు రాజకీయ నాయకులని విరగదీస్తున్నారు,” ఉత్సాహంగా అరిచాడు రాధేశ్యాం. నేను వడివడిగా వెళ్ళి టీవీ స్క్రీన్ వైపు చూశాను. ఒక్క క్షణం అయ్యాక నాకు అర్థమయ్యింది అక్కడ ఏం జరుగుతూందో. “ఒరేయి, అది సినిమా కాదురా, ఆ పొలిటీషన్స్ మన తెగులుదేశం ఎం.ఎల్.ఏ.లు. వాళ్ళని చావబాదుతూంది మనకు పక్కనే ఉన్న మామూలురాష్ట్రకు [...]
Categories: Right

పుణ్యం కావాలా? ఐతే డబ్బు ఖర్చవుతుంది!

Thu, 07/15/2010 - 21:19
“పురుషోత్తమా, పురుషోత్తమా, పురుషోత్తమా!” అన్నమయ్య సినిమాలో ఎస్.పీ బాలు పాడిన పాట అందుకున్నాడు అప్పారావు. అతను పూజ గదిలో కూర్చుని, వెంకటేశ్వర స్వామి పటం వైపు అర్ధ నిమీలిత నేత్రాలతో చూస్తూ ఉన్నాడు. “పిలిచావా బావా!” రివ్వున వచ్చేశాడు అతని బావమరిది పురుషోత్తం. అతను రెండు రోజుల కింద డల్లాస్ నుంచి కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాకి (అప్పారావు ఇంటికి) వచ్చి ఉన్నాడు. ఇంకో రెండు గంటల్లో మళ్ళీ డల్లాస్ వెళ్ళే ఫ్లైట్ అందుకోవాలి అతను. “నిన్ను [...]
Categories: Right

ఓదార్పు యాత్ర

Mon, 07/12/2010 - 22:12
“ఏరు దాటాక తెప్ప తగల బెట్టినట్టు, ఏరు దాటాక తెప్ప తగల బెట్టినట్టు,” అని వల్లె వేస్తున్న చుట్టాలబ్బాయిని, “నీకు ఆ సామెత తప్ప ఇంకేం దొరక లేదా?” అంటూ కసురుకున్నాడు వై.నో. గగన్. ఆ కుర్రవాడు బిక్క మొహం వేసుకుని అక్కడినుంచి నిష్క్రమించాడు. “ఆ కుర్రాణ్ణి కోప్పడి ప్రయోజనం ఏముంది, ఇప్పుడు మనం నిరూపించాల్సింది, ఇంకా చాలా ఏరులు ఉన్నాయని మన తెప్ప ఇంకా పనికొస్తుందని,” అన్నాడు అక్కడే ఉన్న గగన్ ముఖ్య అనుచరుడు సోంబాబు. [...]
Categories: Right

పేరులో ఏముంది పెన్నిధి?

Sun, 06/13/2010 - 01:50
రవికిరణ్ గాడు నాకు మార్కెట్‌లో ఎదురయ్యాడు. “ఒరే రవికిరణ్, దాదాపు ఐదేళ్ళయ్యిందిరా నిన్ను చూసి. నీ పెళ్ళి కాగానే ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళిపోయావు. మళ్ళీ ఈ ఊరిలోనే వచ్చిందా పోస్టింగ్?” ఆనందంగా అడిగాను నేను. రవికిరణ్ గాడు నా క్లాస్‌మేట్. “అవున్రా, రెండు రోజులయ్యింది వచ్చి. నీకు ఫోన్ చేద్దామని అనుకుంటూనే ఉన్నా. ఇంతలో నువ్వే కలిశావు,” అన్నాడు వాడు కూడా అంతే ఆనందంగా. “నాన్నా!” అంటూ ఒక చిన్న శాల్తీ వచ్చింది అక్కడికి. నాలుగేళ్ళు ఉంటాయి [...]
Categories: Right

పాడనా తెలుగు పాట!

Sun, 06/06/2010 - 20:30
ఋగ్వేదం చతుర్ముఖ శర్మ కళ్ళు తెరిచాడు. భగవంతుడి ధ్యానంలో ఉన్న తనని ఎవరు డిస్టర్బ్ చేశారో ఒక క్షణం ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు గమనించాడు ఆయన తన ఎదురుగా ఉన్న సతీమణిని. “ఏంటి విషయం?” కాస్త విసుగ్గానే అడిగాడు ఆయన. “మీకు గత వారం నుంచి చెప్తూనే ఉన్నాను కదండి, ఆ సినిమా డైరెక్టర్ గారు మీకోసం ఫోన్ చేస్తున్నారని! ఇంతకు ముందే ఆయన మళ్ళీ ఫోన్ చేశాడు. ఈ రోజు సాయంత్రం వచ్చి మిమ్మల్ని [...]
Categories: Right

అదిరేటి డ్రెస్సు మేమేస్తే, బెదిరేటి లుక్కు మీరిస్తే…

Thu, 05/13/2010 - 20:05
ఆదర్శ్ నగర్ కాలనీ! అక్కడ అందరూ మధ్య తరగతి కుటుంబీకులే. అఫ్ కోర్స్, ప్రస్తుతం జంబూ ద్వీపంలో, మధ్య తరగతి అన్న పదానికి డెఫినిషన్ మారింది అనుకోండి. స్థిరాస్తులు, చరాస్తులు కలుపుకుని కనీసం ఒక కోటి రూపాయలు ఉంటేనే ఇప్పుడు మధ్య తరగతి కుటుంబీకుల కింద లెక్ఖ. ఆ కాలనీ ప్రెసిడెంట్ గారి ఇంట్లో గొడవ జరుగుతూంది. ప్రెసిడెంట్ గారు, తన ఆరేళ్ళ కూతురి మీద కేకలేస్తున్నారు, “ఛీ, నీ మూలంగా నా పరువు పోయింది కదే,” [...]
Categories: Right

ఏమైపోతుంది ఈ సభ్య సమాజం?

Mon, 05/10/2010 - 20:00
జంబూ ద్వీపంలో పెద్ద కలకలం చెలరేగింది. దానికి కారణం ఒకప్పటి సినీ నటి సువాసన చేసిన సంచలనమైన ప్రకటనే. ఒక ఇంటర్వ్యూలో ఆవిడ, పెళ్లికి ముందు ఆడపిల్లలు సెక్స్‌లో పాల్గొనడం తప్పు కాదని, కాని ఎయిడ్స్ లాంటి రోగాలు, గర్భం రాకుండా జాగ్రత్త పడాలని ఉటంకించింది. ఇంకా చెప్పాలంటే, పెళ్ళి కాని యువకులు ఈ రోజుల్లో తాము వివాహం చేసుకోబోయే అమ్మాయి కన్యత్వం (virginity) కోల్పోనిదై ఉండాలని ఆశించడం పిచ్చితనం అని కూడ సెలవిచ్చింది. దీనితో జంబూ [...]
Categories: Right

అరెమికాలో లైఫే వేరు

Thu, 05/06/2010 - 20:00
రమేష్, సురేష్ ఇస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు. జంబూ ద్వీపం అర్థికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, వారికి మాత్రం ఎలాగైనా అరెమికాలో సెటిల్ కావాలని కోరిక. జంబూ ద్వీపం అర్థికంగా పైకి వస్తున్నా కూడా, అరెమికాలోని infrastructure వాళ్ళిద్దరూ బ్రతికుండగా రాదని వారి అభిప్రాయం. ఇంకా, అరెమికాలో ఉండే వ్యక్తిగత స్వేచ్ఛ, శాంతి భద్రతలు, లంచగొండితనం లేకపోవడం కూడా వారికి అరెమికా మీద మక్కువ పెంచిన అంశాలు. *** భరత్, భారతి జంబూ ద్వీపం నుంచి అరెమికా [...]
Categories: Right

బృందగానా – శ్రీ గోవిందా కమీషన్

Tue, 04/27/2010 - 21:00
అంధేరా ప్రదేశ్‌కి చెందిన బృందగానా, మోస్తా ప్రాంతాల నాయకులు జుట్టు జుట్టు పట్టుకుని పోట్లాడడం వల్ల, అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. అంధేరా ప్రదేశ్ రాజధాని ఆదరా బాదరాలో కొన్ని రోజులు స్కూళ్ళు కాలేజీలు మూత పడ్డాయి. ఇదంతా చూసి ఆదరా బాదరాకి రావల్సిన పరిశ్రమలు, కంపెనీలు వేరే రాష్ట్రాలకు పోయాయి. ప్రత్యేక బృందగానా మాట దేవుడెరుగు, అసలు మొత్తం అంధేరా ప్రదేశ్‌కే ఏ ప్రత్యేకత లేకుండా పోతుందేమో అని చాలా మంది ఆందోళన చెందారు. కాని బృ.రా.స. [...]
Categories: Right