hey guys .. i’m finally back in Hyd.. came in yesterday evening. Managed to finish the title song of my current film “Rama Rama Krishna Krishna” …..feels good to be back home after a hectic 30-day schedule…..will keep you guys posted. !! have fun !!
P.S : I could not reply to the large number of mails or to the comments (thanks !) i had received cause i had no internet connectivity there in Rajahmundry. Now that i am back, i’ll reply back to you guys !! (check spam folder also)
నా చిన్నతనం నుండి నాకు భాషల పట్ల ఇష్టం, ఒక రకమైన అభిరుచి ఉన్నాయి. అందులోనూ ఎంతో కొంత కవిని ఆయే. ఇంక కొత్త పదం తెలియడమేమిటి, దానికి వ్యుత్పత్తి ఏంటో నేనే ఊహించి చెప్పెయ్యడం మొదలెట్టేసాను. అలాంటివి:
సప్తపది: సప్త అంతే ఏడు కాబట్టి ఏడు పదులు డబ్భై అనుకునేవాడిని. సప్తపది సినిమా గురించి తొలుత విన్నప్పుడు నా వయసు వర్షసప్తకం!
దత్తపది: పది పదాలు ఇచ్చి మిగతావి వ్రాయమంటారు కాబట్టి దత్తపది. ఒక సారి మా ఫ్రెండ్ కి నాలుగు పదాలు ఇచ్చి, "ఇది దత్త-నాలుగు" అన్నాను కూడా :-)
అనవసరం: ఇంగ్లీష్ "అన్" + "అవసరం". అంటే, "అన్" + "నేసెస్సరీ" లాగా అన్నమాట. అలాగే, "అశేషం" అంటే "అ" + "శేషం". మన "అ" + "టిపికల్" లాగా అన్న మాట. ఇది నేను చిన్నప్పుడైతే తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ ని కాపీ కొట్టేసారు అనుకునేవాడిని :-O
బ్రదర్: సంస్కృత "భ్రాతా" నుండి కాపీ కొట్టేసారు అనుకునేవాడిని. అలాగే, "నైట్" అనేది "నక్తం" నుండి వచ్చిందని బలంగా నమ్మేవాడిని. ఇందులో కొంత నిజం ఉన్నా ఆశ్చర్యపోనులెండి.
నాకు ఒక్కోసారి జంధ్యాల సినిమాలో "సుత్తి వీరభద్రరావు" గుర్తొస్తూ ఉంటాడు. "అసలు న్యూటన్ అనేవాడి అసలు పేరు "నూతనుడు". వాడు బెంగాలీయుడు!" అని ఉద్ఘాటించినట్లు నేను కూడా చాలా అర్థాలు "డిసైడ్" చేసేసేవాడిని.
ఇవి ఇలాగ ఉంటే, నిజంగా కొన్ని మామూలు పదాలకు చాలా పెద్ద పెద్ద అర్థాలు ఏర్పరుస్తారు జనాలు. అది ఇంకా విచిత్రం. ఉదాహరణకి:
నాయాలు: "నా + ఆలు" అంటే "నా భార్య" అని అర్థం. ప్రియురాలు, జవరాలు, ఇల్లాలు అన్నీ కూడా తెలుగు సంధులే. ఈ నాయాలు అనే పదం తొలుత మా సోదరుడు "లవ-కుశ" చిత్రంలో "ఒల్లనోయి మామా, నీ పిల్లను" అనే పాటనుండి గ్రహించి నాకు అజ్ఞానం నుండి విమోచనం కలిగించాడు!
శ్రాద్ధం: "శ్రద్ధ" గా చేసేది కాబట్టి శ్రాద్ధం! అలాగే, "తద్దినం" అంటే "తత్ + దినం" అంటే "ఆ రోజు" అని అర్థము. ఈ రెండు పదాలు ఎప్పుడూ కొంచం అశుభసందర్భాలలోనే వాడతారు.
మరి కొందరు పదాల అర్థాలకు తోడ్పడేలాగా పదాలను పలుకుతారు. మచ్చుక్కి:
లెఖ్ఖ: అసలు పదం "లెక్క". కానీ, "లెక్క సరిగ్గా ఉండాలి" అనే భావంతో ఆ "సరిగ్గా" మీద కక్ష/కాంక్షా తీసుకొచ్చి ఈ "లెక్క" మీద రుద్ది "లెఖ్ఖ" చేస్తారు!
ఉచ్ఛారణ: అసలు పదం "ఉచ్చారణ". "ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి" అనే ఆవేశంతో స్పష్టాన్ని క్లిష్టం చేసి ఉచ్ఛారణ చేసారు. ఇది ఇంగ్లీష్ లోనూ ఉంది "pronunciation" ని "pronounciation" చేసేస్తారు. ఏమైనా, మనకు కావలసింది pronunciation ఏ కానీ, spelling కాదు కదా!
ఖర్మ: అసలు ఈ "ఖర్మ" ఎక్కడనుండి వచ్చిందా అని నేను తెగ ఆలోచించేవాడిని. బ్రహ్మానందం భాషలో ఇది "కర్మ" కు పట్టిన "కర్మాయ్" :) ఎంతో విసుగ్గా ఉండి, "ఇది నా కర్మఫలితము. ఎవర్నీ అనుకోవడానికి లేదు", అనే లోతైన వేదసూత్రాన్ని "నెత్తీ నోరు బాదుకుని" చెప్పిన ఫలితం దక్కాలని "ఖర్మ" గా మార్చారు.
తెలుగు పద్యాలు చదివేటప్పుడు కొందరు చేసే దోషాలు బాగా నవ్విస్తాయి. "రామునితో కపివరుండు ఇట్లనియె" ని "రాముని తోక పివరుండు ఇట్లనియె" అని "పండగ" సినిమా లో చూసి "ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తారా?", అనుకునే వాళ్లు అవాక్కయ్యేలాగా మా తమ్ముడి క్లాసు లో కొందరు, కృష్ణుడితో ద్రౌపది తన ఆవేదనను వ్యక్తం చేస్తూ చెప్పిన పద్యంలో ఒక పదాన్ని "పంక-జనాభా" అని పలికారు. పాపం, "పంకజ-నాభుడికి" "కలియుగం మొదలయ్యింది, జనాభా అంతా పంకమయం అయ్యింది", అని ద్రౌపది చెప్తోంది అనుకున్నారో ఏమో!
వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కంటే రంజు గా సాగేది ఏమిటిరా అంటే మొగుడూపెళ్ళాల (చిట్టి పొట్టి) తగువులే. మా బందువుల్లోనూ, ఫ్రెండ్స్ లోనూ దాదాపు అందరు జంటలూ ఏదో ఒక దానికి వాదించుకోవడం, ఎత్తుకు పై యెత్తు, మాటకు మాట, నువ్వంటే నువ్వు అనుకోవడం, అది గుర్తు చేసుకుని, నాతొచెప్పి నవ్వుకోవడం షరా మామూలు. నా లాంటి ఒంటిగాళ్ళకి ఇదంతా గొప్ప కామెడీ గానూ, కొంచం అసూయగానూ ఉంటుంది :) అలాంటి చిలిపి సంభాషణలు కూడా గుర్తుంచుకుంటే బాగుంటుంది అని, ఈ రామా, రాము అనే పాత్రలను శ్రుష్టించాను.
రమ, రాము ఇద్దరూ ఒక మూడు నెలలు ప్రేమించుకుని పెద్దలతో చెప్పి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఇంకా పూర్తిగా ఒక నిర్దిష్టమైన ఉభయతారకమైన తలం పైకి రాలేదు. చిన్న చిన్న విషయాలకు కూడా నేనంటే నేను అనుకుంటూ వాడిన్చుకుంటారు. వారి వాదనలు కొన్ని ఇక్కడ.
ర: ఆడవాళ్ళని మగవాళ్ళు ఎలాగా మిగతరంగాల్లో పైకి రానివ్వలేదు. కనీసం ఆధ్యాత్మికంగా కూడా ఎదగకుండా అడ్డు పడుతున్నారు.
రా: అలాగా కూడా అనిపిస్తోందా? ఎందుకో?
ర: ఏముంది, ఒక మీరాబాయి ని చూడాండి, ఒక వెంగమాంబని చూడండి. సంఘం అంత కలిసి "నువ్వు దేవుణ్ణి ఆరాధించకూడదు", అని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
రా: అవునా పాపం?
ర: ఏమిటి, వెటకారమా?
రా: గొడ్డుకారం, లేకపోతె? ఎప్పుడైనా మగభక్తుడెవడైనా "ఫలానా దేవతే నా పెళ్ళాము, నువ్వు కాదు", అని పెళ్ళాంతో అని ఉంటే, అడ్డుకోవడం కాదు, పాయసంలో పాయిసన్ కలిపి చంపేస్తుంది. మగవాళ్ళు మాత్రం దేవతని "అమ్మ", అని పిలవాలి. ఆడవాళ్ళు కృష్ణుడు నా మొగుడు, వెంకటేశ్వర స్వామీ నా మొగుడు, శివుడు నా మొగుడు అని రెచ్చిపోవచ్చా?
ర: (ఢమాల్, రాము పాయింట్ దెబ్బ కొట్టేసింది)
రా: ఈవేళ మా ఆఫీసు లో ఒక అమ్మాయిని చూసాను, జుట్టు కట్ చేసుకుని దానికి curlings పెట్టించుకుని ముందుకు వేసుకుని వచ్చిందీ, టూ ముచ్ గా ఉంది అనుకో.
ర: ఓహో, పాపం. అమ్మ,బాబు డబ్బులిచ్చి ఊరి మీదకు వదిలేస్తే అలాగే తయారవుతారు. (సహజంగానే, రమకు కోపం వచ్చింది)
రా: నువ్వు కూడా అలాగ జుట్టు కట్ చేసుకుని...
ర: అన్నట్టు, మీతో చెప్పానా?
రా: ఏమిటి?
ర: ఈవేళ, మా ఆఫీసు లో కొత్త మేనేజర్ వచ్చాడు. ఎంత బిజీ గా ఉన్నా, రోజూ గంట సేపు జిం చేస్తాడుట. తనకు సిక్స్-ప్యాక్ కూడా ఉందిట. మీరు కూడా అలాగ...
రా: (ఢమాల్, నో సౌండ్)
రమ "తన మొగుడు బాగా ఉండాలి", అని అదే, "బాగుండాలి", అని నోములు, వ్రతాలు మొదలుపెట్టింది. "ఇంకా పెళ్లి అయ్యి ఏడాది కూడా అవ్వలేదు, అప్పుడే నోములు వ్రతాలు ఏమిటే", అని అందరూ అంటున్నా పట్టించుకోకుండా రెచ్చిపోయింది. ఈ టైం లో రాము చిన్ననాటి స్నేహితుడు ఒకడు రాముకి ఫోన్ చేసాడు. రమ ఎక్కడో పూజ గదిలో పండగ చేసుకుంటూ ఉందిలే అని అనుకుని రాము బెడ్రూంలో ఫోన్లో గట్టిగా మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్ ప్రశ్న, "ఎరా మామ, మీ ఆవిడ సెలవలు పెట్టి మరీ పతి-సేవ చేస్తోంది అని విన్నాను, ఏమిటి ఫుల్ రొమాన్స్ ఆ?" దానికి రాము, "రొమాన్స్ ఆ, నా మొహమా? ఫుల్ పూజలు, వ్రతాలు. కథలు, కథ అక్షింతలు, ప్రసాదాలు తప్పితే ఇంకేమి లేవు", అన్నాడు. ఫ్లోలో పడి రాము చూసుకొని విషయం ఏమిటి అంటే రమ తన కాళ్ళకు దణ్ణం పెడదామని ఆ గదిలోకి వచ్చింది. ఇది మొత్తం వింది. రమ ఏమి అడుగుతుందో, ఏం కడుగుతుందో అని కంగారు పడుతున్న రాము కాళ్ళకు దణ్ణం పెట్టి మంత్రాలు కొంచం గట్టిగా చదువుకుంటూ చురచురా చూస్తూ వెళ్ళిపోయింది రమ. పూజ అయిపొయింది అనిపించి, వెనక్కి వచ్చింది. రాము బుద్ధిగా స్నానం చేసి, తలదువ్వుకుని రెడీగా ఉన్నాడు, తిట్లు తినడానికి. ఆ రోజు రమ అడిగిన ప్రశ్న కి రాముకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపొయింది. "నాతొ మీకు రొమాన్స్ లేదు సరే. ఆ విషయం వాడికి ఎందుకు చెప్పారు? వాడు మన్మథుడా? నాకు పూలబాణం వేసి మీ మీద మొహం కల్పిస్తాడా? లేక వాడేమైనా వచ్చి మీతో రొమాన్స్ చేస్తాడా?", అంది. ఏదో తిట్లకైతే మెంటల్ గా ప్రిపేర్ అయ్యాడు కానీ, ఇలాగ లాజిక్ తో దెబ్బ కొడుతుంది అని ఊహించలేదు.
ఏంటో అమెరికాలో కామెడీనే లేదు. అయినా మల్లెపూలు, మావిడి పళ్ళూ లేని ఈ దేశం కూడా ఒక దేశమా అని అప్పుడప్పుడూ డౌట్ వస్తుంది. ఆఖరికి ఎప్పటివో జోక్స్ గుర్తు చేసుకుని నవ్వుకోవలసిన ఖర్మ పట్టింది. చద్ది అన్నం ఎలాగా అలవాటయ్యింది, ఇప్పుడు చద్ది జోకులు అన్నమాట. సరే, ఏవో గుర్తున్నవి.
* ప్రిథ్వి అని నేను లాగూలు వేసుకునే రోజుల్లో, మా కాలనీ లో, చడ్డీలు వేసుకుని తిరిగేవాడు. వాడు మాతో క్రికెట్ ఆడేవాడు. వాడు బాల్ పట్టుకోవడానికే అండి రోడ్డిక్ సర్వ్ చేసినంత expression పెట్టేవాడు. కానీ, మహా ఘటికుడు. ఒక సారి మా ఇంటి పక్కన తాతగారి ఇంట్లో లడ్డూలు వండారు. ఆ వాసనకి వాడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ చిన్న సంభాషణ:
ప్రి: తాతా, లడ్డూలు ఏవి తాత?
తా: లేవు మనవడా ఐపోయాయి
ప్రి: నిజం చెప్పు తాత. ఆ పైన డబ్బాలో పెడుతుంది మామ్మ.
తా: లేవురా నాయినా, నీకు అబద్ధం ఎందుకు చెప్తాను. నేను ఎలాగా తినలేను, షుగర్ ఉంది.
ప్రి: అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు తాత
తా: (అప్పటికే ఉన్న అల్లుడి బాధ తట్టుకోలేక) వద్దురా నాన్నా, ఒక్క దానితోనే చచ్చే చావు వచ్చింది.
ప్రి: ఓహో, ఐతే ఇదివరకే ఒక అబద్ధం ఆడావన్నమాట!
వాడి ఆలోచనకు నాకు బాగా నవ్వు వచ్చింది.
* మా ఫ్రెండ్ ఒకడు గిన్నెలు తోమడం ఎప్పటికీ postpone చేస్తాడు. ఒక రోజు గాల్లో చేతులూపెస్తూ "what a shot", అన్నాడు. గిన్నెలు లేక వంట చెయ్యలేకపోయిన నాకు వళ్ళు మంది "హలో ధోనీ, బర్తన్ ధోనీ హై", అన్నాను. ఈ మల్టీ-లింగుఅల్ జోక్ తట్టుకోలేక వెంటనే తోమేసాడు.
* ఒక వీకెండ్ ఏమి తోచక మా ఫ్రెండ్ కి ఫోన్ చేశాను. వాడు ఏమి తోచక బుర్ర పీక్కుంటున్నాడు. నేను ఫోన్ చేసేసరికి "కారులో షికారుకెళ్ళే", పాట వ్రాసే ముందు ఏ.యెన్.ఆర్ లాగా expression పెట్టి రోడ్ మీదకు చూస్తున్నటున్నాడు. అప్పుడు సంభాషణ:
నేను: ఏమిటిరా చిచ్చా సంగతులు చెప్పు
వాడు: ఏముంది మామ, అంత రొటీన్
నేను: అంతేలే, మనకు గరళఫ్రెండ్స్ తప్పితే గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా. బోర్ గానే ఉంటుంది.
వాడు: అంతేలే, విరక్తి వచేస్తోంది.
నేను: ఇంకేంటి సంగతులు?
వాడు: నువ్వే చెప్పాలి.
నేను: ఎహే, ఏమి లేవురా. నువ్వే ఏమైనా చెప్పు.
వాడు: మామ, ఇక్కడ రోడ్ మీద రెండు కుక్కలు అచ్చికబుచ్చికలాడుకుంటున్నాయి మామ!
నేను: నీ యంకమ్మా, సంగతులు అంటే కుక్కలు అచ్చికబుచ్చికలాడుకోవడాలు, పిల్లులు ప్రేమగీతాలు పాడుకోవడాలు అంటారా?
* మా కాలనీ లో ఇంకో ముదురు కాండిడేట్ ఉన్నాడు. వాడు రెండేళ్లకే పొలికేకలు పెట్టించడం మొదలెట్టాడు. చివరికి వాడి బాధ తట్టుకోలేక వాడిని స్కూల్ లో జాయిన్ చేసారు. అక్కడ వాడి పక్క సీట్ లో "అపర్ణ", అనే అమ్మాయి కూర్చుంది. వీడికి ఏ, బీ, సి లు రావు కానే, వెంటనీ దాని భుజం మీద చెయ్యి వేసి, "నువ్వు యాడికేల్తే ఆదికోస్త అపర్ణ, నీ ఇంటిపేరు మారుస్తా అపర్ణ", అని పాడటం మొదలెట్టాడు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తాలూకు పిల్లాడు అని తెలిసి ఏమి చెయ్యాలో తెలియక టీచర్ బుర్ర బాదుకుంది.
నేను:ఈవేళ ఉదయం నాలుగున్నర గంటలకి నడి రోడ్డులో ఒంటరిగా నడిచాను. మొత్తం యునివెర్సిటీ లో పిట్టా కాకి లేదు. రోడ్ మీద ఎవడూ లేడు. ఫోన్ లోబ్యాటరీ అయిపోయింది. నాకు గుండె గుభేలుమంది"
ఫ్రెండ్: ఎందుకు అంత భయం? దెయ్యలకా?
నేను: దెయ్యాలా ఇంకేమైనానా? అమెరికా లో సంగతి నీకు తెలియదు అనుకుంటాను. ఎవడైనా దొంగ రాస్కెల్ వెనకనుండి వచ్చి, "మగ బొమ్మాలి" అన్నాడు అంతే, నా బ్రతుకు కుక్క చింపిన విస్తార అయిపోతుంది.
పోకిరి సినిమా చూసి inspire అయ్యి ఒక లవ్ స్టొరీ డెవలప్ చేసాను. ఈ సినిమా లో హీరో (పేరు: కిట్టు, పండు అంటే మరీ ఓల్డ్ గా ఉంటుంది అని) ఒక M.S. స్టూడెంట్. అతను U.S లో చదువుకుంటూ ఉంటాడు. బేసిక్ గా అతనికి పీహెచ్. డీ చెయ్యాలని కోరిక. కానీ, అలాగ చెప్తే ఇంట్లో వాళ్ళు "అన్నాళ్ళు ఇంటికి దూరంగా ఉండి ఏం కష్టాలు పడతాడో, పెళ్లి ఎక్కడ వద్దు అంటాడో?", అని ఆపేస్తారు, అని ఫీల్ అయ్యి M.S. కి అని చెప్పి U.S. కి వస్తాడు. తను బయల్దేరే ముందు ఒక అమ్మాయితో (పేరు స్వాతి) పరిచయం అవుతుంది. మనవాడు ఆ అమ్మాయికి ఫ్లాట్ అయిపోతాడు.
ఏవో ఒకటి రెండు సందర్భాలలో ఆ అమ్మాయి భర్త ఎలాగుండాలని expect చేస్తోందో అడిగితే, "ఆ ఏముంది కిట్టుగారు, ఏదో చదువు అయ్యింది అనిపించి, మైక్రోసాఫ్ట్ లోనో, గూగుల్ లోనో పని చేస్తూ ఉండి, ఏటా ఒక సారి యు.ఎస్, ఒక సారి యు.కే కి తీసుకెళ్ళి అన్నీ తిప్పి చూపించగలిగితే చాలు", అంటుంది. మనవాడు షాక్ అయ్యి, వెంటనే "ఛీ నీయన్కమ్మ, నీకు ఒక్క క్వాలిటీ కూడా లేదు", అనుకుంటాడు. సరే, అన్ని ఆశలు ఉండే ambitious పిల్లను పెళ్లి చేసుకుంటే, తన సరదాలన్నీ తీర్చగలిగే అంత సీన్ తనకు లేదు అని అనుకుని, స్వాతి లవ్ చెయ్యనట్టు నటిస్తుంటాడు.
కొన్నాళ్ళకి ఆ అమ్మాయి కూడా తనకు నచ్చిన ఒక్క క్వాలిటీ లేకపోయినా కిట్టునే ఇష్టపడుతుంది. ఆ విషయం కిట్టుకి చెప్తుంది. కానీ, ఏదో మిడిల్ క్లాసు ఫ్యామిలీలో పుట్టి పెరిగిన కిట్టు ఎప్పుడూ చదువు, న్యాయం, నిజాయితీ, సేవ లాంటివి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. "దీన్ని పెళ్లి చేసుకుంటే యూరోప్ చూపించకపోతే ఏ రోపో తీసుకుని అఘాయిత్యానికి పాల్పడుతుంది", అని అనుకోని, తనకు అసలేమి తెలియనట్టు, తను స్వాతిని ఎప్పుడూ ప్రేమించనట్టు నటిస్తాడు. అప్పుడు వాళ్ళ మధ్యలో జరిగిన ఒక సన్నివేశం ఈ అంకంలో చూద్దాం.
స్వాతి ఆంధ్రదేశంలో, కిట్టు యు.ఎస్ లో ఉన్నారు. స్వాతి ఆర్కుట్ బ్రౌస్ చేస్తూ ఉంటే కిట్టు ఉన్నట్టు తన మనసుకు అనిపిస్తుంది. కానీ కిట్టు స్క్రాప్ చెయ్యడు, gtalk లో ఆన్లైన్ కనబడడు. చివరకు ఈ టెన్షన్ తట్టుకోలేక ఫోన్ చేస్తుంది (ISD call నిముషానికి ఆరు రూపాయలు అయినా సరే. బేసిక్ గా, స్వాతిది బాగా బలిసిన ఫ్యామిలీ).
స్వా: ఏం చేస్తున్నావు?
కి: టీవీ చూస్తున్నాను.
స్వా: కాదు. నువ్వు ఆర్కుట్ లోనూ, gtalk లోనూ ఎవరితోనూ మాట్లాడుతున్నావు.
కి: లేదు. నేను ఫ్యాషన్ టీవీ చూస్తున్నాను. చాలా కలోర్ఫుల్ గా ఉంది.
స్వా: No. నువ్వు ఆర్కుట్ లో బ్రౌస్ చేస్తుంటే నా scrapbook లో నీనుండి స్క్రాప్ వచ్చి, నోటిఫికేషన్ వచ్చినట్టు అనిపిస్తోంది. I can feel it.
కి: లేదు. నేను నిజంగానే టీవీ చూస్తున్నాను.
స్వా: Listen carefully. నువ్వు నిజంగా ఆర్కుట్ లో బ్రౌస్ చేస్తుంటే, నాది నిజమైన ప్రేమ. లేకపోతే, I will try to forget you.
కి: ఉఫ్ఫ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను టీవీ చూస్తున్నాను అని.
స్వా: I don't believe you. You're a liar.
స్వాతికి ఏం చెయ్యాలో పాలుపోక ఆర్కుట్ లో ఫ్రెండ్ (పేరు: రాజు) కి birthday wishes చెప్దామని scrapbook కి వెళ్తే, అక్కడ కిట్టు వ్రాసిన స్క్రాప్ ఉంది. ఎప్పుడు చేసాడా అని చుస్తే 2 min ago, అని ఉంది. స్వాతికి కోపం పొంగుకొచ్చింది. తన ఫ్రెండ్ తులసిని gtalk లో చూసింది. "తులసి, కిట్టు నీతో మాట్లాడాలన్నాడు. invisible mode లో ఉన్నాడు. ping చెయ్యి", అని చెప్పింది. వెంటనే, తులసి "అవునా, నేను తనతో chat చేస్తున్నానే? ఏమీ చెప్పలేదు?", అంది. దానితో కిట్టు ఆన్లైన్ ఉన్నాడని స్వాతికి తెలిసిపోయింది. తులసి కిట్టుని పింగ్ చేసి, "ఏం కిట్టు, నాకు ఏదో చెప్పాలని స్వాతితో అన్నావుట. ఏమిటి?", అని అడిగింది. అప్పుడు కిట్టుకి స్వాతి ఐడియా అర్థం అయ్యింది. తనలో తనే, "ఇప్పుడు స్వాతి నన్ను పింగ్ చేస్తుంది, రెడీ 1,2,3...", అనుకున్నాడు. వెంటనే, స్వాతి పింగ్ చేసింది.
స్వా: ఫ్యాషన్ టీవీ చూడటం అంటే ఆర్కుట్ లో birthday scraps పంపించడం, తులసి తో చాట్ చెయ్యడమా?
కి: ఇప్పటి దాక చూసి, నీతో ఫోన్ మాట్లాడాక ఆన్లైన్ వచ్చాను.
స్వా: అసలు ఫ్యాషన్ టీవీ చూసే మొహమేనా నీది?
కి: ఏం? నేను ఫ్యాషన్ టీవీ చూడకూడదా?
స్వా: ఎందుకు నా మనసుతో ఇలాగ ఆడుకుంటున్నావు? ఎందుకు ఇన్ని అబద్ధాలు.
కి: సరే కానీ. ఏంటి, నేను ఆర్కుట్ లో ఆన్లైన్ వస్తే నీకు స్క్రాప్ చేసినట్టు అనిపిస్తోందా?
స్వా: మరి అనిపించదా?
కి: మరి నాకు అనిపించదేందుకు?
స్వా: జీవితంలో ఎవరినైనా లవ్ చేస్తే కదా తెలిసేదే.
కి: ఐతే ఇప్పుడు ఏంటి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నాను అంటావా?
స్వా: ఇప్పటిదాకా లవ్ చేశాను. But, I am dropping now. I hate you truly and completely.
కి: ఏదో ఆవేశంలో ఉన్నట్టున్నావు. పడుకో. తరువాత మాట్లాడుకుందాము.
ఈ chatting మధ్యలోనే కిట్టు birthday wishes చెప్పిన ఫ్రెండ్ (రాజు), "థాంక్స్ బాస్, సో స్వాతి ఏమంటోంది?", అని స్క్రాప్ చేసాడు. దానికి కిట్టు, "తను నన్ను వేపుకు తింటోందిరా బాబు. గౌరీ కూడా ఇంతేనా?", అని రిప్లై పంపాడు. అప్పుడే రాజుకి birthday scrap పంపించిన స్వాతి (పేజి రిఫ్రెష్ అయ్యాక) కిట్టు స్క్రాప్ చూసింది. అది కాపీ చేసి కిట్టు విండో లో పేస్టు చేసింది.
స్వా: "స్వాతి నన్ను వేపుకు తింటోందిరా బాబు. గౌరీ కూడా ఇంతేనా? " -- ఏమిటిది?
కి: నీకు వేరే వాళ్ళ scrapbook చూడటం తప్ప వేరే పని లేదా?
స్వా: నీకు నా గురించి వేరే వాళ్ళ scrapbook లో మాట్లాడటం తప్పితే వేరే పని లేదా? మన విషయాలు వేరే వాళ్ళకి ఎందుకు చెప్పాలి అసలు?
కి: వెళ్ళమ్మా తల్లి, నేను కాస్త పని చేసుకుంటాను. నా టైం వేస్ట్ చెయ్యకు.
స్వా: నీకు నేను టైం వేస్ట్ అయితే, నాకు నువ్వు కూడా టైం వేస్ట్. పో రా వెధవా.
కిరికిరి అనే ప్రేమకథలో "పో రా వెధవా", అనే అంకం సమాప్తం.
©ãjšü B²òˆ¢œË“XϧŒáªÃ©Õ... “XÔåX-ªáœú ¹¯ã-¹¥¯þ ©Ç¢šËC. ¯ã©-Âî-²ÄJ K͵êýb Í䮾Õ-Âî-„ÃL. Æ©Ç ÆE ¯ã©-ªî-V©Ö ªÃŸ¿Õ. «ÕŸµ¿u©ð ÍÃ©Ç šÇXý-Æ-Xý©Ö „䮾Õ-Âî-„ÃL. ¦ðª½Õ-Âí-šËd¢-Ÿ¿-ÊÕ-ÂË... K͵êýb Í䧌՜¿¢ «Ö¯äæ®h ÍéÕ, ¹¯ã-¹¥¯þ ŸÄÊ¢-ÅŒ{ ÆŸä ¹šü ƪá-¤ò-ŌբC.
¦µÇª½u... ¤ò®ýd-åXªáœú ©ãjX¶ý-˜ãj„þÕ Â¹¯ã-¹¥-¯þ-©Ç¢-šËC. ŠÂ¹-²ÄJ B®¾Õ¹ע˜ä „äL-œËšÌ …Êo¢ÅŒ «ª½Â¹Ø «ÖšÇx-œíÍŒÕa. «ÕÊ¢ «ÖšÇx-œË¯Ã «ÖšÇx-œ¿-¹-¤òªá¯Ã G©Õx-«Ö“ÅŒ¢ “X¾A-¯ã©Ç ÍãLx¢-ÍÃ-Lq¢Ÿä. Ȫ½Õa©Õ åX¢Íä ‚X¶¾ª½Öx ÍÃ©Ç «®¾Õh¢-šÇªá. B®¾Õ-Âî-«œ¿¢ B®¾Õ-Âî-¹-¤ò-«œ¿¢ «ÕÊ ƒ†¾d¢ ÆÊÕ-ÂË.f
Love Aaj Kal:
నాకు ఈ మధ్య కాలంలో విపరీతంగా నచ్చేసిన సినిమా ఇది. కూల్ టైం పాస్ మూవీ.కథ మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ బాగుంది.సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా మనల్ని లాక్కెళ్ళిపోతుంది, ఎక్కడా బోర్ కొట్టకుండా.
ఈ సినిమా లో దీపిక పదుకొణే నాకు విపరీతంగా నచ్చేసింది.దీపిక డైలాగ్ డెలివెరీ చాలా బాగుంది. especially,ఇండియా వచ్చేటప్పుడు సైఫ్ తో ఎయిర్ పోర్ట్ నుండి ఫోన్లో మాట్లాడే సీన్ లో నడిచే స్టైల్, మాట్లాడే స్టైల్ క్యూట్ గా ఉంటుంది. సినిమా క్లైమాక్స్ లో “Angle naya hai,mujhe lagta hain isein aur discuss karna chaihiye” డైలాగ్ కి వచ్చేటప్పటికి నేను పూర్తిగా దీపిక ఫాన్ అయిపోయాను.ఈ డైలాగ్ కాజువల్ గా ఉన్నా, చెప్పేటప్పుడు గొంతులో వణుకు తెలుస్తూ ఉంటుంది.కానీ రోటీన్ హింది సినిమాలలో లాగా పూర్తిగా ఏడుస్తున్నట్టు కూడా ఉండదు.
దీపిక గురించేనా, సైఫ్ గురించి ఏం లేదా అంటే.. ఎందుకు ఉండదు?? as usually, సైఫ్ బాగా చేసాడు. especially, దీపిక పెళ్ళిలో కంఫ్యూసింగ్ డైలాగ్స్ చెప్పే సీన్ చాలా బాగుంటుంది.సైఫ్ రెండ్ రోల్స్ కి బాగా సెట్ అయ్యాడు. కొన్ని కొన్ని సీన్స్ లో కనిపించీ కనిపించనట్లు ఇచ్చిన expressions బాగున్నాయి.
-Chor bazaari.. పాట నాకు అన్నింటికంటే ఎక్కువ నచ్చేసింది..దీన్లో ఒకటి రెండు స్టెప్స్ వెరైటీగా బాగుంటాయి.
-Break-up-party comedy బాగుంటుంది.
-సినిమా స్టార్టింగ్ లో హీరో, హీరోయిన్ రిలేషన్ డెవెలప్ కావటాన్ని చూపించిన స్టైల్ బాగుంటుంది.
-సైఫ్, రిషి కపూర్ మధ్య డైలాగ్స్ బాగుంటాయి.
-ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ క్యూట్ గా ఉంది.
-Twist song ముందు వచ్చే మ్యూసిక్, అమ్మ, నాన్న, తమిళమ్మాయి లో ఒక పాటలో మ్యూసిక్ లా ఉంటుంది. ఎవరు ఎక్కడి నుండి కొట్టుకొచ్చారో మరి!!
మగధీర:
అందరు చెప్పిందే గ్రాఫిక్స్ బాగున్నాయి. రాం చరణ్ నోరు తెరవనంత వరకు బాగున్నాడు. కాలభైరవగా బాగనే సూట్ అయ్యాడు of course, నోరు తెరవనంత వరకే. ఎందుకో గుర్రపు స్వారీలొ చిరంజీవి స్టైల్ చిరంజీవికే బాగుందనిపించింది, రాం చరణ్ కంటే. హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లో క్యూట్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో అసలు రాకుమారి ఛాయలే లేవు.సినిమా చేసే ముందు అరుంధతిని, జోధాభాయిని చూసుండాల్సింది .మరీ అంత ఠీవి చూపించాల్సిన అవసరం లేకపోయినా, రాకుమారి లాగా ఐతే అనిపించాలి కదా..ఫస్ట్ హాఫ్ కొంచెం సుత్తి తగ్గించి, ఫ్లాష్ బాక్ కొంచెం ముందే స్టార్ట్ చేస్తే బాగుండేది.అప్పుడు క్లైమాక్స్ ఆదరాబాదరాగా కాకుండా తీరిగ్గా ఉండేలా చేస్తే బాగుండేది.
ఆంజనేయులు:
చూడొద్దు, చూడొద్దు, చూడొద్దు. చూస్తే మీ ఖర్మ!!