కూడలి
జల్లెడ
హారం
క్రిందటి టపాలో ఏ.సి 2 లో నేను చూసినవాటిగురించి వ్రాశాను. చెన్నై నుండి పూణె తిరుగు ప్రయాణం ఏ.సి.3 లో చేశాను. మరీ ఎక్కువ ఖరీదు కాదు కాబట్టి, చాలామంది దీంట్లో ప్రయాణం చేయడానికి చాలామంది ఉత్సాహం చూపుతారు.అందుకనే ఎప్పుడు చూసినా waiting list కొల్లేటి చేంతాడంత ఉంటుంది!దానితో, పాపం చాలామంది తత్కాల్ లో చేసేసికుంటూంటారు.
ఇదో దోపిడీ! లాలూ ప్రసాద్, తన దారిన తను తింటూ, ప్రభుత్వానికి కూడా అదనపు రాబడి ఏర్పాటు చేశాడు! ఏ concession నూ ఉండదు.అప్పుడప్పుడు మాత్రం అదృష్టాన్ని బట్టి టికెట్టుని upgrade చేస్తూంటారు! ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మళ్ళీ ఎందుకీ గోలంతా అనకండి.
ఏ.సీ 3 లో ప్రయాణం చేసేవారిలో ఒక విషయం మాత్రం చూస్తూంటాము.ఎలాగూ అంత డబ్బెట్టి టికెట్టు తీసికున్నాము కదా, పూర్తి వసూలు చేయాలనే ఉద్దేశ్యంతో,మిడిల్ బెర్త్ వచ్చినవారు
వేళా పాళా లేకుండా, బెర్తుని క్రిందకు దింపేసి, attendant ఇచ్చిన ‘దీక్షావస్త్రాలు’ కప్పేసికుని, నిద్రరాకపోయినా కళ్ళు మూసేసికుని, కాళ్ళు జాపేసికుని, ఏదో తన్మయత్వంలో మునిగిపోతూంటారు! దీంతోటి ఏమౌతుందంటే, క్రింద బెర్తు వాడి పని ఇరకాటంలో పడుతుంది! తన బెర్తు మీద, మెడ వంచుకుని కూర్చోనూ లేడూ, పోనీ ఏ సైడు బెర్తు వాళ్ళో కూర్చోనిస్తారా అనుకుంటే, వాళ్ళుకూడా సీట్లు విడతీసి,పైవాడూ, క్రిందివాడూ సెటిల్ అయిపోతారు! ఇంక అక్కడ ఉండేది భార్యాభర్తలైతే, ఒకళ్ళు పడుక్కునీ, ఇంకోళ్ళు వాళ్ళ కాళ్ళదగ్గరా సెటిల్ అవుతారు!
ఆతావేతా తేలేదేమిటంటే, మనకిచ్చిన క్రింది బెర్తులోనే, మెణ్ణరం (stiff neck) పట్టేసినా సరే నోరుమూసుకుని కూర్చోడమే!
అన్నిటిలోనూ ఆ కోచ్ attendant ఇచ్చే కంబళీలు- వాటంత దరిద్రపువి ఇంకెక్కడా ఉండవు!తెల్లదుప్పట్లూ,నాప్ కిన్నూ ఏదో ఒకసారైనా ఉతికి ఇస్త్రీ చేసినట్లనిపిస్తాయి. ఆ కంబళ్ళు మాత్రం
అసలు వాటిని క్లీన్ చేసి ఎన్ని యుగాలయిందో అనేట్లుంటాయి! తలక్రింద పెట్టుకోడానికి మాత్రం బాగా ఉంటాయి!అడిగితేనే కానీ, ఆ attendant నాప్ కిన్ ఇవ్వడు.
ఇందులో ప్రయాణం చేసే మనుష్యులు మాత్రం, ఏ.సీ 2 లో వారికంటె, కలివిడిగా ఉంటారు.ప్రక్కవాడితో మాట్లాడడం వగైరా.. మరీ హైఫై కాదు.స్టేషనొచ్చినప్పుడు, platform మీదికెళ్ళి ఏదో ఒకటి తినేది కొనుక్కోవడమో లాటివి చేస్తూంటారు, ఎందుకంటే చాలా మంది పిల్లలతో ప్రయాణం చేస్తూంటారు. ఏ.సీ లో ప్రయాణం చేసినట్లూ ఉంటుంది, మరీ ఖరీదెక్కువా కాదు.suffocation ఒకటే భరించలేము. ఏ.సీ.2 కంటే ఎక్కువ బెర్తులేమో, దీంతోటి ఊపిరాడదు.
మరీ ట్రైనుకి ముందరో ఆఖర్నో ఉండడంచేత స్టేషన్లలో ఆగినప్పుడు, పుస్తకాల షాప్పులికీ వాటికీ వెళ్ళడం కొంచెం రిస్కు తో కూడిన పని! చాలా మంది ఓ పోర్టబుల్ డి.వీ.డీ ప్లేయరు పెట్టుకుని, అందరి ప్రాణాలూ తీస్తూంటారు! పోనీ దాంట్లోకైనా తొంగి చూద్దామా అంటే, అబ్బే, వాళ్ళూ వాళ్ళ కుటుంబంతప్ప ఇంకోళ్ళు చూసేటట్లుగా పెట్టరు! పిల్లలతో ప్రయాణం ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూపించుకోవద్దూ!
ఈమధ్యన ప్రయాణంలో మాపు ఆగుతుంది కదా అని, ఓ చిన్న చిన్న గళ్ళున్న షర్టువేసికున్నాను. నాకేం తెలుసూ, IRCTC Pantry Car వాడి యూనిఫారం అలాగే ఉంటుందని. మా కోచ్ లో Toilet ఖాళీ లేదని పక్కదాంట్లోకి వెళ్తూంటే, चाय है क्या? అని అడిగాడు ఓ ప్రాణి! మళ్ళీ జీవితంలో అలాటి గళ్ళున్న షర్టు ఛస్తే వేసికోను!ఇలాటి ‘కష్టాలు’ ఉన్నా, నాకు మాత్రం కాలక్షేపం బాగానే అయింది. ఎందుకంటే, సైడు బెర్తు రైల్వే ఎంప్లాయీస్ దిట. నా అదృష్టంకొద్దీ, రేణిగుంటనుండి, గుంతకల్ దాకా ప్రయాణం చేశారు. రైల్వే లో ఆడిటరుట, ఎన్నెన్నో విషయాలు చెప్పారు.తిరుమలలో ఓ రైల్వే రిజర్వేషను కౌంటరుందికదా, దాని ఆడిట్ కి వెళ్తూండడంవలన, అక్కడ చాలా పలుకుబడి కూడా ఉంది.నా కబుర్లన్నీ విని, ఎప్పుడైనా తిరుమల వేళ్ళేమాటైతే, ఆయనకి ఫోను చేయమని ఓ ఆఫరు కూడా ఇచ్చారు.ఇదిగో ఇలాటి ఉపయోగాలుంటాయి, ఇంకోరితో కబుర్లు మొదలెడితే!
స్టేషనులో దిగినతరువాత ఆ చివర్నించి సామాన్లు మోసుకుంటూ రావడానికి పడే తిప్పలు ప్రక్కకి పెడితే, మొత్తంమీద ప్రయాణం బాగానే సాగింది! ఈసారి మన ‘జనతా జనార్ధన్’ స్లీపరు క్లాసు గురించి!
ఆయన వృత్తిరీత్యా వైద్యులు. గత 30 సంవత్సరాలుగా తిరుపతి కేంద్రంగా రాష్ట్ట వ్యాప్తంగా ఆక్యుపంక్చర్ వైద్య నిపుణుడిగా సుప్రసిద్ధులైన వైద్యుడీయన. చైనా సాంప్రదాయవైద్యం ఆక్యుపంక్చర్‌ని దేశంలో పరిచయం చేసిన చేసిన కొద్దిమంది వైద్యులలో ఒకరైన గురుకుల మిత్రా -మిత్రా- గారి శిష్యుడు. పేరు డాక్టర్ బాలాజీ. తిరుపతిలో అతి సాదా సీదాగా, నిరాకర్షణీయంగా కనిపించే సమతా హాస్పిటల్‌ని పాతికేళ్లుగా తిరుపతి పట్టణంలో పాత మెటర్నిటీ ఆసుపత్రి ఎదురుగా నిర్వహిస్తూ వస్తున్నారు.
మూడు దశాబ్దాలుగా ఆయన వ్యక్తిగతంగా, భావాల పరంగా కూడా నా వంటి ఎందరికో సహృదయుడైన, సన్నిహిత మిత్రుడు. తన వద్దకు వచ్చే రోగులకు వైద్యంతో పాటు సమాజ పరిస్థితులను విశ్లేషించి చెప్పడంలోనే ఎక్కువ కాలం గడుపుతాడనే ‘మాచెడ్డ’ పేరు గల వైద్యుడు. ఆ రకంగా ఈయన వైద్యుడే కాదని చెబితే కూడా ఆశ్చర్య పడవలసిన పనిలేదు.
రోగుల చేయి పట్టుకుని, నాడి చూసి, తర్వాత ఒంటిపై సూదివేసి మాత్రలిచ్చి తగ్గకుంటే మళ్లీ రమ్మంటూ పంపించివేసే సాధారణ వైద్యుల కిందికి ఈయన రారు. కీళ్లనొప్పులు, కాళ్ల నొప్పులు, నడుం నొప్పులు అంటూ తనవద్దకు వచ్చే రోగులకు చైనా సూదులు గుచ్చి వైద్యం చేయడం, మర్దనం చేయడం, నొప్పులు తగ్గించడంతోటే ఈయన సరిపెట్టుకుంటే ఈయనా సాధారణ వైద్యుడిలాగే ఉండేవారు.
“జీవితమంతా ఒళ్లొంచి కాళ్లు చేతులు, నడుము అరగ దీస్తేనే మీకు ఇలాంటి జబ్బులు వస్తున్నాయి. మీరు ఈ వయసులో అయినా మాటిమాటికి వంగటం, బరువులెత్తడం వంటి పనులు చేయకుండా కాస్త విశ్రాంతి తీసుకుంటే ప్రాణానికి నిమ్మళంగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ కాస్త నొప్పులు తగ్గగానే వెళ్లిపోయి మళ్లీ మీపాటికి మీరు, బతకడం కోసం పనులు చేసుకుంటూ ఉంటే మూణ్ణెళ్లు కాకముందే మీరు నా దగ్గరకో మరే వైద్యుడి దగ్గరకో రాక తప్పదు. ఒంటి నొప్పులు తగ్గించుకోవడం, తగ్గించుకోకపోవడం మీ చేతుల్లో ఉంది” అంటూ వైద్యంతోపాటు సుద్దులు కూడా చెప్పే ఈ వింత వైద్యుడిని, రోగులు అలా చూసి నవ్వుతారు.
వంగి పని చేయకుండా, కాళ్లు, చేతులకు పని పెట్టకుండా బతకడం ఎలా? ఇల్లు గడవడం ఎలా? అనే జీవితాంతపు తాత్విక సమస్య వారి నవ్వులో కనబడి ఈయనా నవ్వుతారు. ఆ నవ్వులో మన సమాజ జీవితానికి సంబంధించిన ప్రశ్నా, జవాబు రెండూ ఇమిడి ఉన్నాయి కాబట్టే రోగీ, డాక్టరూ కూడా అంతగా నవ్వడం.
పాతికేళ్లుగా ఆయన తాను నమ్మిన విశ్వాసాలను సడలించుకుందీ లేదు. వైద్యం చేయడంలో రోగులతో ఎంత సున్నితంగా వ్యవహరిస్తారో, వారికి సామాజిక విషయాలను కూడా వివరించి చెప్పడంలో చక్కటి వ్యక్తీకరణ సామర్థ్యం ఉన్న భిన్న వైద్యుడీయన. వైద్య సమస్య సమాజ సమస్యలో ఎలా భాగమవుతోందో ఈయన వివరిస్తుంటే మళ్లీ విందాం అనిపిస్తూంటుంది.
ఇంత వ్యక్తీకరణ సామర్థ్యం ఉన్న మీరు ఆక్యుపంక్చర్ వైద్యుడిగా మీ అనుభవానికి సామాజిక విశ్లేషణ జతపర్చి వ్రాయకూడదా అంటే నవ్వేసి ఊరకుండిపోతారు. స్వంతంగా రాయాలంటే కుదరకపోవడం.. చెబుతూంటే ఎవరైనా రాసే వారుంటే చెప్పి రాయించడం సులభమని తనకు అనిపిస్తూంటుంది కాని మళ్లీ వందల ఏళ్ల క్రితం నాటి ఆశుకవి, వ్రాయస కాడు సంప్రదాయం పునరావృతమయ్యే పరిస్థితులు ప్రస్తుతం లేవు కాబట్టి అది జరగదు.
కాలమిలా పాతికేళ్లుగా సాగిపోతూనే ఉంది. కాని ఆయన వైద్యంతో పాటు మాటల వైద్యం కూడా చేసే ప్రయత్నాలు ఆపుకోలేదు. చికిత్స సంబంధంతో తన వద్దకు వచ్చే వారికి పుస్తకాలను అంటగట్టి చదివించడమనే వ్యసనం నుంచి తను బయటపడలేదు. ఆయన వద్దకు వచ్చే రోగులూ బయటపడలేదు.
గత కొంత కాలంగా తన వద్దకు వచ్చే రోగులకు ‘చందమామ’ వైద్యం కూడా చేసే ప్రయత్నానికి తానే నాంది పలికారు. గత సంవత్సరం చివర్లో తనను తిరుపతిలో కలిసినప్పుడు మా డాక్టర్లకు మీ చందమామ పత్రిక యాజమాన్యం నెలవారీగా చందమామలను కాంప్లిమెంటరీ కాపీలుగా ఇస్తే మా వద్దకు వచ్చే ప్రతి రోగీ చందమామ పత్రిక చూసి కాస్సేపయినా తిరగేస్తారు కదా. అలా అలవాటయ్యాక వారిలో కొందరయినా ఆసక్తి చంపుకోలేక రెగ్యులర్‌గా చందమామను కొని చదవవచ్చు, లేదా చందా కూడా తీసుకోవచ్చు. ఒక ఆరునెలలు ఇలా చేసి చూడండి. ఫలితం లేకుంటే తర్వాత చందమామను ఆపివేద్దురు గాని అని ఆయన సలహా ఇచ్చారు.
అయినా ఆసుపత్రిలో చందమామను ఎదురుగా పెడితే చూడని, చదవని రోగి ఎవరుంటారు అని ముక్తాయింపు కూడా ఇచ్చారాయన. (ఇక్కడ సందర్భోచితం కాకపోవచ్చు కాని, టీ ముఖం ఎరుగని భారతీయులకు బ్రిటిష్ వాడు ఎలా మొదట్లో టీ తాగడం అలవాటు చేయించాడనే విషయంపై ఎప్పుడో చదివిన కథ మళ్లీ గుర్తుకొచ్చింది నాకు.)
‘చందమామను ఫ్రీగా, అదీ ఆసుపత్రులకు ఇచ్చే సంప్రదాయం మాకు లేదు. కానీ మీరు కోరారు కాబట్టి మీకు ఒక కాంప్లిమెంటరీ కాపీ నేను పంపిస్తాను’ అని చెప్పి ఆయన పేరుతో నేను డబ్బు కట్టి గత 8 నెలలుగా చందమామ పత్రికను తన ఆసుపత్రికి పంపిస్తున్నాను. ఈ మధ్యలో నేను తిరుపతికి పోయింది లేదు. ఈ ఆదివారం పని పడి తిరుపతికి వెళ్లి ఆయనను కలిస్తే గురువుగారూ అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన కొడవటిగంటి కుటుంబరావు గారి సమగ్ర రచనలలో 5,6,7 సంకలనాల సెట్‌ను ఇచ్చారు – ఆయన ద్వారానే 1,2,3,4 భాగాలను కూడా గత సంవత్సరం తీసుకున్నాను -.
ఈలోపలే తన వద్ద వైద్యానికి వచ్చిన ఇద్దరు విద్యావంతులకు నన్ను పరిచయం చేశారు. నేను తీసుకువచ్చిన రచన ప్రత్యేక సంచిక -చందమామ సీరియల్ రచయిత దాసరి సుబ్రహ్మణ్యంగారిపై సంచిక-ను ఆగస్టు చందమామను వారికి చూపిస్తే వెంటనే వారు డబ్బు చెల్లించి మరీ తీసుకున్నారు. వారు చందమామ రెగ్యులర్ పాఠకులట. ప్రత్యేక సంచిక అని చెప్పడంతో వెంటనే తీసుకున్నారు. ఇంటర్నెట్ పరిచయం ఉందని వారు చెప్పడంతో చందమామ వెబ్‌సైట్, బ్లాగు గురించి చెప్పాను.
తర్వాత ఎక్కువ సేపు తనతో ఉండలేదు మా మరో మిత్రుడి నాన్నగారి సాంవత్సరీకం కోసం నాతో పాటు వచ్చి అరగంట తర్వాత వెళ్లిపోయారు. సాయంత్రం కలుస్తానని చెప్పాను లేటయింది. రాత్రి అక్కడి నుంచి వచ్చేస్తూ కొకు పుస్తకాలు తీసుకుపోవడానికి ఆసుపత్రికి వస్తే అక్కడ నర్సులు, సార్ బయటకు వెళ్లారని చెప్పి పుస్తకాలు ఇచ్చారు.
వారిని యధాలాపంగా ‘ఆసుపత్రికి చందమామ రెగ్యులర్‌గా వస్తోందామ్మా’ అని అడిగితే ‘వస్తోందని, ఆగస్టు సంచిక కూడా వచ్చింద’ని సంతోషంగా చెప్పారు. చందమామను వారు -ముగ్గురు నర్సులు- కూడా చదువుతున్నారట. పైగా ఇన్ పేషెంట్లుగా చేరి ఆసుపత్రిలో బస చేస్తున్న రోగులు కూడా చందమామను చదువుతున్నారని చెప్పారు. ఆయనకు ఫోన్ చేస్తే కాల్ పోని ప్రాంతంలో ఉన్నట్లుంది. దీంతో అక్కడినుంచి వచ్చేశాను.
రోగుల అభిరుచిని పసిగట్టి ప్రగతిశీల సాహిత్యాన్ని తన వద్దకు వచ్చే వారికి పరిచయం చేసి అభిరుచికి తగ్గ పుస్తకాలను ఆయా రోగులకు అందిస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు చందమామ పత్రికను కూడా తన రోగులకు ఒక వ్యసనంగా మార్చేశారన్నమాట. దీంతో చందమామ సర్క్యులేషన్ కాస్త పెరిగిందో లేదో, అమ్మకాలు పెరిగాయో లేదో తెలియదు కాని ఒక ఆసుపత్రి కేంద్రంలోని రోగులలో చాలామంది, చందమామను చూస్తున్నారు.. చదువుతున్నారు..
రేపు కొనగలిగిన శక్తి ఉన్నప్పుడు, అవకాశమున్నప్పుడు వీరే తమ పిల్లలకు కూడా చందమామను పరిచయం చేస్తారని ఎందుకు ఆశించకూడదు? అసలు మొదటినుంచీ తెలుగునేలపై చందమామ వేలాది కుటుంబాలకు పరిచయం అయింది కూడా ఈ రీతినే కదా! మా మిత్రుడైన డాక్టర్ గారి ప్రతిపాదన అలా ఒక నాటి చందమామ ఉజ్వల గతాన్ని మళ్లీ గుర్తు చేసింది. ఫోన్‌కు అందుబాటులో లేని మా మిత్రుడికి మనసులోనే ధన్యవాదాలు తెలుపుతూ తిరుపతినుంచి వచ్చేశాను.
కొసమెరుపుగా ఒక విషయం తప్పక మీతో పంచుకోవాలి. తిరుపతి బస్టాండులో బయలు దేరుతూ అక్కడున్న బుక్‌స్టాల్స్ లోని పుస్తకాల కేసి చూశాను. అన్ని పత్రికలు సెప్టెంబర్ సంచికలతో వెలిగిపోతున్నాయి. ఒక ‘చందమామ,’ ‘కంప్యూటర్ విజ్ఞానం’ పత్రికలు మాత్రం జూలై సంచికలే కనబడ్డాయి. మనసు చేదైపోయింది.
విభాగాలు: హైదరాబాదు, భారతీయ రైల్వేలు,
ఇంటినిండా ఉపాధ్యాయులతోనే జీవించడం ధర్మమా అని, వారంటే ఓ భక్తీ, ఆరాధనా ఉన్నాయి నాకు.చెప్పానుగా, మా ఇంటావిడ కూడా ఒకానొకప్పుడు, ఈ ఉద్యోగమే చేసింది, దానికి సాయం వీలున్నప్పుడల్లా, క్లాసులు తీసికుంటూంటుంది, ‘అలా మాట్లాడేరెందుకూ, ఇలా అంటే బాగుండును కదా, మరీ అంతలా మాట్లాడితే అవతలివాళ్ళేమనుకుంటారూ…’ వగైరా వగైరా…
మన టి.వీ.. చానెల్స్ వాళ్ళు, ప్రతీ సంవత్సరం, ‘ఉపాధ్యాయ దినం’ సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చూపించేవారు. పోన్లే ఈవేళకూడా చూడొచ్చూ అనుకుని, టి.వీ. పెడితే ఏముందీ? ప్రొద్దుటనుండి, అన్ని చానెల్స్ లోనూ ఒకే విషయం. అది రెండు మూడు రోజులనుండే ప్రారంభం అయిందనుకోండి. అర్ధం అయిందనుకుంటాను మీకందరికీ. ఆ వివాదం లోని మంచిచెడ్డలగురించి, ఇప్పటికే రెండు పక్షాలవారూ, హోరెత్తించేశారు. పైగా ఎవరైనా మిస్ అయిపోతారేమో అని అవే విజుఅల్స్ రోజంతా చూపించేశారు.ప్రతీ ఆదివారం ఉదయం 11.30 కి ఈ.టీవీ-2 వారు, ‘తెలుగు వెలుగు’ అనే ఓ మంచికార్యక్రమం చూపిస్తూంటారు. అది చూడొచ్చుకదా అని టి.వీ.ముందర కూర్చుంటే, అదేదో ప్రత్యక్ష ప్రసారం పెట్టేసికున్నారు. ప్రత్యక్ష ప్రసారం అంటూనే, ఒకే విజుఅల్ మాటిమాటికీ చూపించడం. అదేదో Action replay లాగ! ఒక్కో చానెల్ తీసిందీ రెండో మూడో విజుఅల్స్. కొంపలంటుకుపోయినట్లుగా అవే అస్తమానూ చూపించడంలో వారి ఉద్దేశ్యమేమిటో తెలియలేదు.
క్రిందటాదివారం మన ఈబాట కార్యక్రమానికి ఒక్కళ్ళకీ రావడానికి తీరికలేకపోయింది, మన చానెల్స్ వారికీ ఏదో OBV లంటే తెచ్చుకున్నారు కానీ, ఇంత హడావిడి చేయలేదు.దీన్నిబట్టి తేలిందేమయ్యా అంటే, మన టి.వి. వాళ్ళకి రోజంతా సరిపోయే కాలక్షేపం కావాలంటే, ఎవో బస్సులు తగలేయడం, ఏదో ఒక టవర్ మీదో, ఇంకెక్కడో ఎక్కి కూర్చోవడం, రాళ్ళు విసరడం- ఇలాటివుంటే చాలు! మన నాయకులకైతే ఇంక అడగక్కర్లేదు.కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో తమాషాగా అనిపిస్తుంది- ఏదో ఒక విషయం తీసికోవడం, దాన్ని గురించి ఆ ఇంటర్వ్యూ కి వచ్చిన
so called expert పేట్రేగిపోవడం.ఏదైనా మర్చిపోయాడేమో అని మన యాంకరు కూడా, అవతలివాడు ఏదో ఒకటి చెప్పేదాకా దాన్నే రిపీట్ చేయడం-even to the extent of putting words in his mouth ! ఇంకెక్కడో లైన్లో ఇంకోడుంటాడు, వాడిని provoke చేయడం. దీనిమీద అవతలివాడు ఇంకోటేదో పేలడం!
ఈవేళ్టి విషయానికొస్తే, వాళ్ళెవరో చెప్పినట్లు,ఇవి ప్రిలిమ్సే కదా, ఇంకా మెయిన్స్ కి సమయం ఉందీ, ఆలోపులో కోటాల వ్యవహారం సెటిల్ చేసికోవచ్చుగా!ఈలోపులో వయస్సైపోయిందని పాపం ఎంతమందికి ఈ పరీక్షలు వ్రాయడం వీలుండకపోవచ్చునో, ఎవరైనా ఆలోచించారా? ఆ తరువాత అలా disqualify అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వీళ్ళు ఈ రాజకీయనాయకులు చూపిస్తారా? లేక ఈ రాళ్ళు రువ్వి, బస్సులు తగలేసినవారు చూపిస్తారా? ఇంట్లో వాళ్ళే మొహం చాటేస్తున్న ఈ రోజుల్లో, అంతంత ‘త్యాగాలు’ ఎవరికి పడతాయి? లేక అప్పుడు మళ్ళీ, వయోపరిమితి పెంచాలని మళ్ళీ ఉద్యమాలు చేస్తారా? ఏది ఏమైనా నష్టపోయేది, పాపం ఇలాటి పరీక్షలు వ్రాసి ఏదో పెద్ద ఉద్యోగంలో చేరాలని కష్టపడే,అభ్యర్ధులదే! రాజకీయ నాయకులకి ఉద్యోగం సద్యోగం అక్కరలేదు, ఏదో ఒక controversy ఉంటే చాలు, లేకపోయినా సృష్టించకల సత్తా వారిలో ఉంది,వాళ్ళ రోజులెళ్ళిపోయినట్లే.
మన చానెల్స్ లో చూపించే అత్యద్బుత సీరియల్సూ, మెగా సీరియల్సూ వాటికి పెట్టే పేర్లనుబట్టి చూడ్డం మొదలెట్టామంటే గోవిందాయే! ఏం పేర్లండీ-’సుందరకాండ’ ‘అనుబంధాలు’, ‘ గోరింటాకు’ ‘ బంధాలూ అనుబంధాలూ’ ఏ సిరియల్ చూసినా ఒకటే గోల.కుటుంబాల్లో ఇప్పటివరకూ తెలియనీ, ఊహించనీ కొత్త కొత్త ఆలోచన్లు పుట్టించేస్తాయి! An Idea can change your life ! లాగ ఒక్క సీరియల్ చూస్తే చాలు, మర్నాటి పేపర్లో చూస్తాము-ఫలానా ఊళ్ళో వాడెవడో అత్తని చంపాడూ, లేక ఇంకో ఊళ్ళో ఎవడో ఇంకోటేదో చేశాడూ అని.
These serials are so inspiring, giving new ideas to the virgin brains !! ఈ స్క్రిప్టులు వ్రాసే వాళ్ళింట్లో ఎలా ఉంటుందో తెలిసికోవాలనుంది! వాళ్ళకి ఓ బాధ్యత అనేది లేదా? ఏమైనా అంటే ప్రేక్షకులు ఇలాటివే కావలంటున్నారూ అని ఓ ఉవాచా! ఎవడడిగారో చెప్తారా?
ఈ మధ్యన ‘ఈనాడు’ లో వేసిన కార్టూన్లగురించి వివిధ అభిప్రాయాలూ వెలిబుచ్చారు.80 సంవత్సరాల వయస్సొచ్చేదాకా,కుర్చీ పట్టుకుని వేళ్ళాడే నాయకులున్నప్పుడు ఇలాగే ఉంటాయి కార్టూన్లు! ఆమధ్యన తమిళనాడులో ఒకతను కార్టూన్ వేశాడుట- ఏదో సినిమా గురించి వ్రాస్తూ, Produced by, Directed by, Script by,Acted by, Music by,Distributed by, etc… karunaanidhi & family అని చెప్పేటప్పటికి కరుణానిధి గారికి కోపం వచ్చేసిందిట! ఉన్నమాటంటే ఉలుకెందుకో? అలాగే,మన ముఖ్యమంత్రిగారికి కూడా, selective ఆరోగ్య సమస్యలున్నాయి.వాటివల్లే,సెక్యూరిటీ కంటె, డాక్టర్ల అవసరమే ఎక్కువా అని చూపించారు. అందులో వయోవృధ్ధుల గురించి అవహేళనేదో ఉందనుకోవడంలేదు!
,p> ఉండడమైతే ఇంకా చాలాచాలా విషయాలున్నాయి వ్రాయడానికి కానీ, టపా మరీ పెద్దదయిపోతే మీరే తిడతారు.ఇంకో రోజు….