Middle

Allu Arjun Dhee 3 Finals Mar 10 Episode


satya won the dhee title. vivek runner up.
Categories: Middle

యెదలో గానం ..



యెదలో గానం .. ..పెదవే మౌనం ...సెలవన్నాయి కలలు...సెలయేరైన కనులలో మెరిసేనిలా శ్రీరంగ కావేరి సారంగా వర్ణాలలో...అలజడిలో యెదలో గానం పెదవే మౌనం సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో మెరిసేనిలా శ్రీరంగ కావేరి సారంగా వర్ణాలలో అలజడిలో .....
కట్టుకధ లాయే మమత కలవరింత కాలమొకటే కలలకయినా పులకరింత శిలకూడా చిగురించే విధి రామాయణం విధికయినా విధి మార్చే కధప్రేమాయణం
మరువకుమా ..వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో మనస్సు కధ....మరువకుమా ...వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో మనస్సు కధ .................
Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Unfair comparisons

    ఇంట్లో ఉండే చిన్న పిల్లల దగ్గరనుండి,ఏదో ఫీల్డ్ లో ఉన్నా వారిదాకా ప్రతీవాళ్ళనూ ఇంకోరితో పోల్చడం అంత మంచిది కాదని నేను అనుకుంటున్నాను.మన ఇంటికి ఎవరైనా వచ్చేరనుకోండి,ఇంట్లో చిన్న పిల్లలు అంటే నాలుగైదేళ్ళ వాళ్ళుంటారనుకోండి. వాళ్ళ ప్రజ్ఞా పాటవాలు, ఆ వచ్చినవాళ్ళెదురుగా ప్రదర్శింపచేయాలని, చాలామంది తల్లితండ్రులు ప్రయత్నిస్తారు. ‘ ఏదీ ఒక ఇంగ్లీషు రైమ్ చెప్పమ్మా’అని.ప్రతీ రోజూ,ఇంట్లో వాళ్ళతో బోరుకొట్టేసిన, ఆ చిన్నపిల్ల ఇంక బ్రేక్ లేకుండా,రైమ్ములు చెప్పడం మొదలెడుతుంది. కొంతసేపైన తరువాత, మీ పాప/బాబు కి ఎన్నేళ్ళండీ అని అడుగుతారు. ‘అయ్యో అంతేనా! మా వాళ్ళ పిల్ల ఈ పిల్లకంటే ఆరునెలలు పెద్ద,అయినా సరే ఇంకా స్పష్టంగా మాటలు కూడా రావు’అంటారు.
కొంతమంది పిల్లల్లో పెరుగుదల కొంచెం ఆలశ్యం అవుతుంది,ఆ కారణం చేత కొంచెం టైము తీసికోవచ్చు.ఏం కొంప ములిగిపోదు,అయినా అందరు పిల్లలూ, పుట్టీ పుట్టగానే జీనియస్సు అవాలని అనుకుని వాళ్ళమీద ‘ప్రెషర్’ తీసికొని రావడం చాలా అన్యాయం.

    ఈ మధ్యన సచిన్ తెండూల్కర్ గురించి చెప్పేవాళ్ళు ప్రతీ వాడూ,అతనిని డాన్ బ్రాడ్ మన్ తో పోల్చడం. అసలు ఇద్దరికీ పోలికలు ఎక్కడున్నాయంట?బ్రాడ్ మన్ క్రికెట్ ఆడింది 60 సంవత్సరాల క్రింద.అప్పటి పరిస్థితులు వేరు.పైగా సచిన్ అభిమానులు ప్రతీసారీ, ‘డాన్’స్వయంగా ఒప్పుకున్నాడూ,తన కంటే సచినే బెటర్ అనీ అనడం.అది డాన్ బ్రాడ్ మన్ గ్రేట్నెస్!ఎన్ని యుగాలు ఎందరు క్రికెట్ ఆడినా, బ్రాడ్ మన్ సాధించిన
ఏవరేజ్ సాధించగలరా? పైగా అలా అంటే, ఆయన ఆడినవి అరవై టెస్టులుకూడా లేవూ,ఏవరేజ్ అంత వచ్చిందంటే రాదా అని ఓ ఆర్గ్యుమెంటూ.
సచిన్ గొప్పవాడు కాడూ అనడం లేదు.20 సంవత్సరాలనుండి ఆడుతూ,అన్ని సెంచరీలూ టెస్టుల్లోనూ, ఓ.డీ.ఐ ల్లోనూ చేయడం మజాకా కాదు.
కానీ అతనిని కావలిసిస్తే ఈ శతాబ్దం లో ఆడిన బ్రియాన్ లారా తో పోల్చండి.

    ఈ మధ్యన గారీ సోబర్స్ ఒక ఫంక్షన్ లో చెప్పాడు–’ నా ఉద్దేశ్యంలో సచిన్ కంటె గవాస్కర్ గొప్పా’ అని.కారణాలు కూడా చెప్పాడు. గవాస్కర్ తన కెరీర్ లో ఎప్పుడూ,హెల్మెట్లూ,ఇంకో రకమైన గార్డులూ పెట్టుకోలేదు.అయినా ధైర్యంగా ప్రపంచంలోని ఫాస్టెస్ట్ బౌలర్స్ మీద సెంచరీలు కొట్టాడు.
ఇప్పుడు క్రికెట్ లో ఆడుతున్న బౌలర్లేమీ, వాళ్ళకంటే ఫాస్ట్ కాదు.అయినా ఇప్పటి ప్లేయర్లు,నెత్తిమీద నుండి ప్రతీ భాగం,రక్షణ లేకుండా మైదానం లోకి దిగలేరు.
ఎవరితోనైనా కంపారిజన్ చేసేటప్పుడు అన్ని పారామీటర్లూ ఇద్దరికీ ఒకేలాగ ఉండాలి.యువరాజ్ సింగూ, సెహ్వాగ్గూ, రిచర్డ్స్ తో పోల్చడం కూడా ఇలాటిదే. ఎవరి గొప్ప వారిదే.

    ప్రతీ క్రీడ లోనూ ఇలాగే.ఎవడో మొదలెడతాడు,ఫలానా వాడు ఈ శతాబ్దానికి చాలా గొప్పవాడూ అంటూ.అయినా ఈ సతాబ్దం మొదలయి ఇప్పటికి 10 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇంకా వచ్చే 90 ఏళ్ళలోనూ, ఏమో వీళ్ళందరినీ మించేవాడు రావొచ్చేమో!ఏదో ఫలానా శతాబ్దానికి ఫలానా వాడు’గ్రేటెస్ట్’ అనడం వేరూ,’ఆల్ టైం గ్రేట్’ అనడం వేరూ.

   అలాగే సినిమా పాటలగురించి కూడా.ఏదో తాత్కాలికంగా ఓ పాట పాప్యులర్ అవుతుంది. దానిగురించి ప్రతీవాడూ మాట్లాడేవాడే.ఈ ఏడాది వచ్చిన పాటల సంగతి వదిలేయండి- గత అయిదేళ్ళలోనూ ఎన్నో పాటలు వచ్చాయి, అందులో ఎన్ని పాటలు ఎంతమందికి గుర్తున్నాయీ? ఇప్పుడొస్తున్న పాటలకి ‘షెల్ఫ్ లైఫ్’-ఓ ఏడాది, మహా అయితే ఇంకో ఆరు నెలలు. మరి 60 సంవత్సరాలక్రింద వచ్చిన హిందీ,తెలుగు పాటలు ఇప్పటికీ, ప్రతీ వాడూ హం చేస్తున్నారంటే కారణం ఏమిటి? వాటిలో ఉన్న జీవం.ఆ పాటలు ఎప్పటికీ చిరంజీవులే.

    ఎవరి అభిమానులు వాళ్ళకి ఉంటారు.వాళ్ళు చెప్పిందే వేదం అని ప్రతీవారిమీదా రుద్దకూడదు. కావలిసిస్తే ప్రస్తుత రాజకీయ నాయకుల గురించి, కంపారిజన్లు చేయండి. ఎందుకంటే వీళ్ళలాటి వాళ్ళు కారణ జన్ములు! దేశ పరిస్థితిని నాశనం చేయడమే వీళ్ళ అల్టిమేట్ టార్గెట్.వీళ్ళలాటి నమూనాలు మనకి ఎక్కడా దొరకరు.శాసనసభ/ పార్లమెంటు లో ఈ మధ్యన జరుగుతున్న ‘నౌటంకీ’ వాటికి సాక్ష్యం.


Categories: Middle

రాయల తెలంగాణా


సీమాంధ్ర నేతల స్వరాల్లో మార్పు ధ్వనిస్తోంది.. ఒకరి తరువాత ఒకరుగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.. సమైక్యం అంటూనే.. తెలంగాణ విభజనకూ వ్యతిరేకం కాదన్న సంకేతాలు స్పష్టంగానే వినిపిస్తున్నారు... రాష్ట్ర విభజన అంటూ జరిగితే తెలంగాణాతో కలిసి ఉండటమే మంచిదన్న జెసి దివాకర్‌ రెడ్డి తాజా వ్యాఖ్య సమైక్యాంధ్ర వాదనలో కొత్త మలుపునకు నాంది పలికింది...
మొన్న బొత్స సత్యనారాయణ... నిన్న హర్షకుమార్‌.. ఇవాళ జెసి దివాకర్‌ రెడ్డి.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలకు చెందిన ముగ్గురు నేతలు ఒకరి తరువాత ఒకరుగా విభజన స్వరాలు వినిపించారు..జెసి దివాకర్‌ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి తన ఓటు ముందుగా సమైక్యాంధ్రప్రదేశ్‌కే అయినప్పటికీ, రాష్ట్ర విభజన అన్నది తప్పకపోతే రాయలసీమను తెలంగాణాతో కలిపి ఉంచాలంటూ కొత్త ప్రతిపాదన చేశారు..

రాయలసీమ మొదట్నుంచీ తెలంగాణాలో అంతర్భాగంగానే ఉన్నదని ఆయన అన్నారు.. నిజాం నవాబు కప్పం కట్టలేక తమ ప్రాంతాన్ని బ్రిటిష్‌ వారికి దత్తత ఇచ్చారనీ జేసీ వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. సాంస్కృతికంగా, సంబంధ బాంధవ్యాల పరంగానూ రాయలసీమ తెలంగాణాతోనే అనుబంధంగా ఉండగలుగుతుందనీ మాట్లాడారు...
రాయలసీమకు తెలంగాణాకు ఉన్న అనుబంధాన్ని చెప్తూనే...ఎందుకు తాను ఈ ప్రతిపాదన చేస్తున్నదీ వెల్లడించారు.. సీమ ప్రాంతానికి జీవనాధారమైన నీళ్లు తెలంగాణాతో కలిసి ఉన్నప్పుడే లభిస్తాయని, లేకపోతే కష్టపడాల్సి వస్తుందని జెసి స్పష్టంగా చెప్పారు..జెసి మాటలతో మిగతా సీమ నేతలు ఏకీభవించినట్లు కనిపించకపోయినా, వ్యక్తిగత అభిప్రాయమంటూ జెసి వ్యాఖ్యలను పూర్తిగా ఖండించనైనా లేదు..అయితే తాము మాత్రం సమైక్యానికే ఓటేస్తామని కుండబద్దలు కొట్టారు..
౨౦౦౯ డిసెంబర్‌ ౯న కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన చేసిన క్షణంలో దానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర పల్లవిని మొదట వినిపించింది జెసి దివాకర్‌ రెడ్డి... తొలి రాజీనామా సమర్పించిందీ ఆయనే.. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమానికి నాంది పలికిన జెసి వంటి బడా నాయకులు.. అధిష్ఠానం కదలికల ఆనుపానుల గురించి బాగా తెలిసిన నాయకులే స్వరం మార్చటంతో చిన్న నాయకులు పెదవి విప్పలేకపోతున్నారు...శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చి వెళ్లినప్పటి నుంచీ వీళ్ల వైఖరుల్లో మార్పు కనిపిస్తోంది... అంటే అధిష్ఠానం అభిప్రాయం కూడా ఈ దిశగానే ఉందేమో అన్న అభిప్రాయం కాంగ్రెస్‌ నేతల్లోనే వ్యక్తమవుతుంది.. శ్రీకృష్ణ కమిటీ కూడా విభజనకు సానుకూలంగా వ్యవహరించనుందా అన్న అనుమానాలూ కలుగుతున్నాయి.. అయితే కాంగ్రెస్‌ రాజకీయాన్ని ఒక పట్టాన అర్థం చేసుకోవటం ఎవరి తరం కాదు. ఏ విషయం పైనైనా కాంగ్రెస్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంతుపట్టదు..


Categories: Middle

వేకువ వెలుగులు - 8 By భావన


వేదాల విన్నపాలు ప్రచండ భాస్కరుని మది దోచగా
సప్తాశ్వాల మీద పరుగు పరుగున ప్రయాణ మయ్యేడనుకుంటా...

రధపు జేగంటల మోత... ఆకశాన చిరు వెలుగుల తునకలు
చెల్లా చెదురు గా మబ్బు మొలకలయ్యాయి..
వాయు వేగాన రావాలనేమో...
గాలి దేవుని తోడు తీసుకుని, చిరు తెమ్మేరలను మాత్రం
మనకు బహుమానమిచ్చాడు....

నేనోస్తున్నానో అని వసంతం పచ్చదనాన్ని చిలక ముక్కు ఎరుపుదనాన్ని
చెదురు మదురు గా విసిరేసింది తన ఆనవాలు గా.....
నవ్వుతున్న కన్నె మదిన వెలిగిన కోటి ఆశల మెరుపల్లె వెలుగుతున్న
సూరీడుకు శుభారంభం........

ఆ తలపులను మదిన దాచుకున్న మిత్రులందరికీ

శుభ దిన మవ్వాలని కోరుకుంటూ ఇంకో రోజు లోకి పయనం..
Categories: Middle

చందమామలో దయ్యం కథలు

http://blaagu.com/chandamamalu/feed/ - 11 hours 55 min ago

చందమామ సీనియర్ చిత్రకారులు శంకర్ గారు జూన్ చందమామ -2010 జూన్ సంచిక- కథలకు ప్రస్తుతం చిత్రాలు గీస్తున్నారు.జూన్ నెల చందమామకోసం రెండు దయ్యం కథలు ఎంపిక చేయడం జరిగింది. వాటిలో ఆర్ కుమార రత్నం గారు రాసిన ‘చింతచెట్టు దయ్యం’ అనే ఒక పేజీ కథకు ఆయన ప్రస్తుతం బొమ్మలు వేస్తున్నారు. ఏదో పని మీద ఆయనకు ఇవ్వాళ ఫోన్ చేసి మాట్లాడితే ఆ కథ చాలా బాగుందని తన అభిప్రాయం చెప్పారు.

చిన్న కథే అయినా మనిషి కష్టాలు చూసి దయ్యమే భయపడి మనుషులను పీడించుకు తినడం ఆపేసిందని ముగించడం చాలా బాగుందని శంకర్ గారు చెప్పారు. దయ్యం కథ మళ్లీ చాన్నాళ్ల తర్వాత చందమామలో రాబోతోందని  సంతోషపడ్డారు. ‘ఇలాంటి కథలే కావాలి. ఎందుకు చందమామలో కార్టూన్లు, లోకజ్ఞానం ఇలా  రకరకాల విషయాలు రాస్తున్నారం’టూ బాధపడ్డారు.

‘చందమామ అంటే పూర్తి పేజీలలో కథలు ఉండాలని కథలు లేకుండా చందమామను నింపడం ఏమిట’ని ఆయన దెప్పి పొడిచారు. ఇన్ని సంవత్సరాలుగా చందమామ వస్తోందంటే  కారణం కథలేనని, కథల కోసమే చందమామను చదువుతున్నారని ఆయన అమూల్యమైన అభిప్రాయం  చెప్పారు.

పేదవాళ్లకు, పనిపాటలు చేసుకుంటూ కాస్త తీరిక సమమంలో చదువుకునేందుకు కథలు తప్ప జీకేలు, కార్టూన్‌లు ఉపయోగపడవని, కష్టజీవులకు కాస్త సరదా తెప్పించేందుకు, శ్రమను మరిపించేందుకోసమే చందమామ కథలు ముందునుంచి ప్రయత్నించాయని కథల స్థానంలో కార్టూన్లు, జీకెలు వేస్తే ఎవరికి అవసరమని ఆయన ఢంకా భజాయించారు.

ఆయన మాటలు వింటూంటే ఆ క్షణం నా నోట్లో ఎవరో అమృతం పోసినట్లయ్యింది. చందమామ కథలు ఎవరికోసం ఉంటూ వచ్చాయో. ఎవరికి ఉపయోగపడ్డాయో ఇంత అధ్భుతంగా చెప్పగా నేనింతకు ముందు ఎన్నడూ వినలేదు. ఒక్కసారిగా నా బాల్యం కళ్లముందు సాక్షాత్కరించింది.

పల్లెల్లో వ్యవసాయానికి కరెంట్ పగలు నాలుగు గంటలు, రాత్రి నాలుగు గంటలు మాత్రమే ఇచ్చిన ఆ కాలంలో -1970లు- అప్పుడే మా ప్రాంతాల్లో పరిచయమయిన కరెంట్ మోటర్‌ను ఆన్ చేసి పొలాలకు నీళ్లు మలపడం, బావిలో నీళ్లు అయిపోతాయోమే మోటర్‌లో గాలిపోతే మళ్లీ ఆన్ కాదేమో అని భయంతో పొలంకాడికి, దగ్గరే ఉన్న బావికాడికి  చక్కర్లు కొడుతూ ఉన్నప్పుడు మాకు చందమామే అప్తబంధువయ్యేది.

ఒక పొలంలో నీళ్లు తడుపుతూ మరో పొలానికి నీళ్లు మలిపే మధ్య కాలంలో దొరికే విరామాన్ని చందమామను చదువుతూనే గడిపేశాం. ఇంకా రాత్రి పూట పొలాలకు నీళ్లు పెట్టవలసి వస్తే లైటు అవసరం లేని సమయంలో కూడా ఆపివేయకుండా దాన్ని అలాగే వుంచి ఆ వెలుతురులో  కొత్త చందమామను చదివి సంతోషపడిన రోజులు మావి. ఎందుకంటే పగటిపూట చందమామ చదివేందుకు ఇళ్లలో చాలా పోటీ ఉండేది. ఒక పట్టాన దొరికేది కాదు.

‘నెలరోజులు పనిచేయవలిసిన లైట్ అప్పుడే కాలిపోయిందేమిట్రా బ్యాటరీలు తింటున్నారా ఏమి అంటూ మా పెద్దవాళ్లు ఎగిరితే మాకేం తెలుసు పొలంకాడికి తీసుకుపోయాం అంతే’ అని అమాయకంగా ముఖం పెట్టి తప్పుకోవడం మర్చిపోగలమా..

శంకర్ గారూ! ఎంత మంచి విషయాలు మళ్లీ గుర్తుచేశారు మీరు. నిజంగా చందమామ పేదవాళ్లకు, పని పాటలు చేసుకుని అలసట తీర్చుకునే వాళ్లకు ఎంత చక్కగా ఉపయోగపడిందో. పేరుకు  దయ్యం కథ అనగానే మూడనమ్మకాలను మళ్లీ ప్రచారం చేస్తున్నట్లు విమర్శలు రావడం సహజమే కానీ, చీకటిని ఇంకా అనుభవిస్తున్న, చీకటిలో ఇంకా ప్రయాణాలు కొనసాగిస్తున్న భారతీయ ప్రజలకు దయ్య్యం అనే భావనను మర్చిపోవడం సులభం కాదు.

నడిరాత్రులు పక్క ఊళ్లనుంచి వస్తూ దట్టంగా ఉన్న చెట్ల ఆకులు కదిలితే, ఉన్నట్లుండి పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగి పడితే చచ్చాన్లో బాబోయ్ అంటూ పరుగుపెడుతున్న గాఢాంథకారపు అనుభవం ఇంకా మన మనస్సులలో మిగిలే ఉంది.

ఇలాంటి వారు చింతచెట్టుమీద దయ్యం గురించి చదివితే, ఆ దయ్యం కూడా మనిషి కష్టాలు దయ్యం పెట్టే బాధల కంటే ఎక్కువ అనే సత్యాన్ని గ్రహించి అప్పటినుంచి అది మనుషులను పీడించడం మానుకున్న వైనం చదివితే వారి మనస్సుకు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే చందమామ కథను లక్షలాది మంది భారతీయులు తమ స్వంత జీవిత అనుభవాలతో పోల్చుకుని పరవశించడం. దశాబ్దాలుగా ఇదే తీరు.

చందమామలో దయ్యం కథలు మళ్లీ  వేస్తే ఎక్కడ విమర్శలు  వస్తాయో అనే భయంతోనే వేసి చూద్దాం ఏమవుతుందో అని సాహసించి జూన్ చందమామలో రెండు దయ్యం కథలు ఎంపిక చేశాము. అది ఇంకా బయటకు రాకముందే. బొమ్మలు కూడా ఇంకా తయారు కాకముందే చందమామ చిత్రమాంత్రికులు శంకర్ గారు అమాంతంగా వాటిని ఆకాశానికి ఎత్తి ప్రశంసించడం. నిజంగా గుండె పొంగిపోతోంది నాకయితే..

‘దయ్యం  కోరిక’ అనే మరో కథ ఆరుపల్లి గోవిందరాజులు గారు -విశాఖపట్న- పంపారు. ఇది కూడా ముగింపు కాస్త మార్చి జూన్ నెలకే ఎంపిక చేయడమైంది. శంకర్ గారు రెండు కథలూ బాగున్నాయని ప్రశంసించారు. చాలాకాలం తర్వాత ఇంత స్పష్టంగా ఉన్న కథలకు బొమ్మలు వేస్తున్నానని ఆయన చక్కటి తెలుగులో మాట్లాడుతుంటే వాటిని ఎంపిక చేసుకోవడంలో తప్పు లేదనిపిస్తోంది.

జగమెరిగిన చిత్రకారులు ఒకే చెప్పారు. ఇక పాఠకుల తీర్పు కావాలి. ఈసారి చందమామలో ఎన్నడూ లేనివిధంగా అయిదు కథలు కొత్తవి ఎంపిక చేయడమైంది. అన్నీ మంచి కథలే. జూన్ చందమామ వచ్చాక అభిమానులుగా మీరే తీర్పు చెప్పండి.

శంకర్ గారూ! ఒక  పేజీ కథ అయినా వెంటనే దాని గొప్పతనాన్ని పట్టేశారు. నా కథల ఎంపికకు గౌరవం కలిగించారు. జీవితం ధన్యమైంది.

మీరు చల్లగా ఉండండి. చందమామ కథల సారం విప్పిచెప్పారు. ఎవరి కోసం చందమామ కథలు వేయాలో కూడా తేల్చి చెప్పారు.

మీరు కలకాలం ఆరోగ్యంగా ఉండి, ఇలాగే బొమ్మలు గీస్తూ ఉండండి.

లక్షలాది ప్రజలకు ఉపశమనం కలిగించిన, కలిగిస్తున్న మీకు మా వందనాలు…

రాజు.

RTS Perm Link

Categories: Middle

Allu Arjun Ram Charan about Leader Movie


http://megafanz.blogspot.com/tags:sekhar kammula ,rana daggubati ,naga chaitanya ,allu arjun ,ram charan teja
Categories: Middle

పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లు







నేనెప్పుడన్నా పొరపాటున ఫలానా విషయం తెలియదు అనుకున్నాను అనుకోండి..వెంటనే ఆ విషయం మీద ప్రాక్టికల్స్ తో సహా నా జీవితం లో జరిగిపోయి రిజల్ట్ చేతికోచ్చేస్తుంది...పైన చెప్పిన సామెత విషయంకూడా అలా అనుకున్నదే ..పలితం ఇలా పోస్ట్ రూపం లో మీ ముందు ఉండటం.. సరే విషయంలో కి వచ్చేద్దాం..

ఓసారి కూడలి లో బ్లాగులను చూస్తూ ,మా ఆయన గారు కొన్న జామకాయ ముక్కల పేకెట్ ని ముందు పెట్టుకుని తినడం మొదలు పెట్టాను.. షాప్ వాడు ముక్కలతో పాటు బ్రౌన్ కలర్ లో ఉన్న ఒక పొడిని కూడాఇచ్చాడు ..అది ముంచుకుని నోట్లో పెట్టుకుంటుంటే ఉప్ప,ఉప్ప గా చప్ప,చప్పగా ఏదోలా ఉంది. వీళ్ళ టేస్ట్ తగలబడ,ఏమిటి ఇలా ఉంది అని తిట్టుకుంటూ తింటున్నా ..అంత బాధ పడి తినేబదులు ఆ పొడిని ప్రక్కన పడేసి తినచ్చుగా లాంటి ప్రశ్నలు అడక్కండి నాక్కోపం వస్తుంది. సరే అలా తిట్టుకుంటూ తింటూ లాస్ట్ ముక్క నోట్లో పెట్టుకునేసరికి ఒక్కసారిగా విపరీతమైన బాధ ..దంతాల దగ్గర నరాలన్నీ లాగేస్తూ ..చెంపలపై చేతులు పెట్టుకుని ఒక అర్ధ గంట అలాగే కూర్చుండి పోయాను .. అది మొదలు ఆ రోజునుండి తీపి తిన్నా, జామ, యాపిల్ లాంటి పళ్ళు తిన్నా నెప్పి మొదలై పోయింది.అదేంటో అప్పటి వరకు పెద్దగా ఇష్టపడని తీపి మీద ఒకటే మనసులాగేసేది..ఏ పార్టీలోనో ,పంక్షన్ లోనో గులాబ్ జాంనో, రసగుల్లానో తినడం..ఇంటికొచ్చి అరగంట గోలు గొలున ఏడవడం నాకు మామూలైపోయింది ..

ఎప్పుడన్నా .. ఏమండీ! నా జ్ఞానదంతాలు నెప్పి అనగానే ..అందుకేనే జ్ఞానం లేని వాళ్లకు జ్ఞానదంతాలు వస్తే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ యే వస్తాయి ..అలా ప్రకృతి విరుద్దం గా ఏది జరగా కూడదు అని తీసి పడేసేవారు మావారు ..అప్పటి నుండిమార్కెట్ లో ఉన్న సెన్సిటివ్ టూత్ పేస్ట్ లన్ని వాడి పడేసాను ..పలితం శూన్యం.. ఇలాకాదని ఇంటర్నెట్ ముందేసుకుని గూగుల్ లో ఫలానా ఫలానా సమస్యకు హోమ్ రెమిడి ఉందా అనగానే ప్రేమగా ఆయుర్వేదం లో 60 రకాలా పరిష్కారాలు చూపించింది.. ఏది చూసినా ఉత్తరేణి ఆకు, గుంటగలగర ఆకు అని తెలియని పదార్ధాలన్నీ ఉన్నాయి కాని సింపుల్ గా ఉన్నవస్తువులు లేవు..సరే దొరకని వాటిని ప్రక్కన పడేసి తెలిసిన లవంగం,కర్పూరం,దాల్చిన చెక్క,సొంటి వాటిని పొడి చేసి మరి వాడాను ..ఉహు ..అస్సలేమాత్రం తగ్గలేదు..


నాకు తెలుసు ,నాకు తెలుసు ఇప్పుడు మీ మనసులో ఏమనుకుంటున్నారో...అంత కష్టపడేపదులు ఎంచక్కా డాక్టర్ దగ్గరకు వెళ్ళచ్చుకదా అని కదా ..హమ్మా ..నన్ను అనేద్దామనే !!! ఇలాంటి ప్రశ్నలకు నా దగ్గర ప్లాష్ బ్యాక్ ల రూపంలో సమాధానాలు ఉంటాయి.. కాచుకోండి మరి..చాలా రోజుల క్రితం ఒక రోజు బ్రష్ చేసుకుంటుంటే చిగుళ్ళ నుండి నెప్పి,బ్లడ్ రావడం గమనించాను ..వెంటనే మా ఆయనకు చెప్పేద్దాం అనుకున్నా గాని నువ్వు సరిగ్గా బ్రష్ చేసుకుని ఏడ్చి ఉండవు అంటారు అని నా కోల్గేట్ పేస్ట్ పై ఎక్సట్రా ఉప్పు జల్లి మరీ తోమాను .. సమస్య తగ్గలేదు కదా ఇంకొంచం ఎక్కువ అయ్యింది ..ఇలా లాభం లేదని ఒక రోజు రాత్రంతా మా ఆయన్ని కూర్చోపెట్టి ఈ వారం రోజులు నేను పడిన కష్టాలు- వాటి పలితాలు అనే శీర్షికన మొత్తం స్టోరి అంతా హృదయవికారం గా వర్ణించే సరికి తట్టుకోలేక ఆ మరుసటి రోజే డెంటిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళారు ..

వెళ్ళిన తరువాత డాక్టర్ విషయమంతా వినిఆహ్లాదకరమైన చిరునవ్వు ఒకటి నవ్వి నర్స్ వైపు చూసాడు.. ఆ అమ్మాయి నా భుజం చుట్టూ చేతులు వేసి ,అత్తగారిని చూసి కొత్తకోడలు ఇచ్చే మర్యాదలా ఎంతో ఇదిగా లోపలి తీసుకు వెళ్ళింది..అదేంటో చిన్నప్పటి నుండి నన్ను ఎవరైనా ఆప్యాయంగా చూస్తే చాలు ఆస్తి లో సగభాగం రాసిచ్చేయాలన్నంత ఆవేశం వచ్చేస్తుంది నాకు. రూం చూద్దును కదా ఇంద్ర భవనంలా ఎంత బాగుందో .. పైగా ఆ ఎక్విప్మెంట్ అదీ..అబ్బో ..ఏదేమైనా విదేశాలు ,విదేశాలే అనుకున్నా గాని ఒక ప్రక్క భయం గా ఉంది ఆ పరికరాలు అవి చూస్తుంటే.. .ఏదో టేబ్లేట్స్ ఇస్తారనుకుంటే ఆపరేషన్ చేస్తున్నట్లు ఇక్కడకు తీసుకు వచ్చా రేంటి అని బోలెడు అనుమానాలు ..నోరు తెరవమని డాక్టరు గారు అనేసరికి భయంతో అంత ఎ.సిలోను చమటలు పట్టేసాయి ...ఆ తరువాత గుయ్..య్...య్ మని శబ్దం చేస్తూన్న పదునైన పరికరం తో పళ్ళను క్లీన్ చేయడం అంతా తెలుస్తూనే ఉంది..విచిత్రం నేప్పే లేదు ..పైగా అయిస్ ముక్క పెట్టినట్లు నోరుచల్లగా ఉంది.. క్లీనింగ్ అయిపోగానే బయటకు వస్తుంటే మా ఆయన బిల్ పే చేస్తూ కనబడ్డారు ..

బయటకు రాగానే ఏమండీ అసలు టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో తెలుసా,లోపల బెడ్ ఉంటుందా దానికి స్విచ్ నొక్కగానే అదే పైకి ,క్రిందకు ఎడ్జస్ట్ అయిపోతుంది ..ఇంకా పదునుగా ,సూది లాంటి దానితో మన పంటిని క్లీన్ చేస్తున్నా నేప్పేరాలేదు ..పైగా నోట్లో నీరు బయటకు వెళ్ళడానికి మరొక పైపు తెలుసా ...నేను ఉత్సాహం ఆపుకోలేక జరిగింది చెప్తుంటే మా ఆయన అటు ఇటు చూస్తూ , మెల్లిగా పస్ట్ టైం డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళడం ఇదేనా బుజ్జి అన్నారు..అవును ఏం అన్నాను ...గట్టిగా మాట్లాడకే బాబు విన్నవాళ్ళు నిన్ను చూసి కాదు ,నన్ను చూసి నవ్వుతారు అన్నారు ... చీ.. మీతో అస్సలు ఏం చెప్పకూడదు అని తిట్టుకుని అయ్యో టేబ్లేట్స్ ఇవ్వలేదండి డాక్టర్ అన్నాను కంగారుగా.. ఎందుకూ ..క్లీనింగ్ చేసాడుగా ఇంక అవసరం లేదు అన్నారు. ఇంత సులువుగా ప్రాబ్లం పోయిందా ..ఇట్స్
గాన్ ,గాయబ్,పోయి పోచ్చే అని తెగ ఆనంద పడిపోయాను.. ..

మరుసటి రోజు బ్రష్ చేసుకుంటూ ..నహీ..యే నహీ హోసక్తా అనే అరుపుకి మా అపార్ట్మెంట్ దద్దరిల్లిపోయింది ..మా ఆయనకు విషయం అర్ధం అయిపోయి అటునుండి అటే ఆఫీస్ కి పారిపోయారు .. ఆ తరువాత వారం రోజులు అయినా సమస్య ఏ మాత్రం తగ్గలేదు సరి కదా పెరిగింది ..ఈ సారి మరో డాక్టర్ దగ్గరకు వెళ్ళాము ..మళ్లీ సీన్ రిపీటెడ్..డాక్టర్ చిరు మందహాసం ,నర్స్ మృదు స్వభావం ... కట్ చేస్తే 200 $ బిల్ కడుతూ మా ఆయన ... ఆ తరువాత విషయం తెలుసుకున్న మావారి ఫ్రెండ్ ..భలే వాడివే ఇక్కడి డెంటిస్ట్ దగ్గరకు తీసుకు వెళ్ళావా ..వీళ్ళకు మన ఇండియన్ డాక్టర్స్ కంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ..పిడుక్కి ,బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లు ( ఈ సామెతకర్ధం అడక్కండి ..నాకు తెలుసుకోవాలని ఏ మాత్రం ఇంటరెస్ట్ లేదు ..ఇపుడే చెబుతున్నా) ఏం చెప్పినా క్లీనింగ్ అంటారు..మీరింకా నయం 400 $ తో బయట పడ్డారు..మా ఫ్రెండ్ అయితే పన్ను నెప్పి వస్తే పన్ను పీకి చేతిలో 9000 $ బిల్ చేతిలో పెట్టారు..అని ఓదార్చాడు..

ఆ తరువాత ఈ సమస్య గురించి నాన్నకు చెప్పితే ..ఈ మద్య కాలం లో బ్రష్ మార్చావా అమ్మా అన్నారు ..అవును నాన్న అన్నాను.. ఏ మాత్రం అది హార్డ్ గా ఉండి ఉంటుంది కొత్తది మార్చు అన్నారు.. అంతే సమస్య మటుమాయం ..ప్లాష్ బ్యాక్ అయిపొయింది ...మీకు అర్ధం అయిపోయి ఉంటుంది ఇక్కడి డాక్టర్ల దగ్గరకు ఎందుకు వెళ్ళ లేదో నేను .. ఇంక చేసేది లేక ఇండియా ట్రిప్ కోసం చకోర పక్షిలా ఎదురుచూసాను .. కాని అప్పటికి నేను ఇంకా పెనం మీదనే ఉన్నాను అన్న విషయం తెలుసుకోలేకపోయాను ..ఆ విషయాలు తరువాతి పోస్ట్లో ..
Categories: Middle

Puli shooting is complete but for 3 songs


Shooting of Pawan Kalyan’s latest movie Puli is complete but for three songs. These three songs will be shot soon and the producer Singanamala Ramesh is planning to release the movie in the last week of April. SJ Suryah directs this movie. AR Rahman composes music.
Categories: Middle

ఉండమ్మా బొట్టు పెడతా

గాత్రం: సుశీల
సాహిత్యం: కృష్ణశాస్తి





పల్లవి:

అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది
అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది అదియే దైవం
అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది అదియే దైవం
అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది

చరణం1:

ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈశుని కొలువనిపించాలి
ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈశుని కొలువనిపించాలి
ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
దీపం మరి మరి వెలగాలి తెరలూ పొరలూ తొలగాలి

అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది అదియే దైవం
అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది

చరణం2:

తల్లీ తండ్రీ గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం
తల్లీ తండ్రీ గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే దైవం
ప్రతిమనిషీ నడిచే దైవం ప్రతి పులుగు ఎగిరే దైవం

అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది అదియే దైవం
అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది

||
Categories: Middle

ఆస్కార్ అవార్డులు-2009 (Oscar Awards-2009)

  • 82వ ఆస్కార్ అవార్డు ఉత్తమ చిత్రం--ది హర్ట్ లాకర్.
  • ఉత్తమ దర్శకురాలు అవార్డు పొందినది--క్యాథరిన్ బిగ్.
  • ఆస్కార్ అవార్డు గ్రహీతలలో క్యాథరిన్ బిగ్ ప్రత్యేకత--ఆక్సార్ అవార్డు పొందిన తొలి మహిళా దర్శకురాలిగా రికార్డు సృష్టించింది.
  • ది హర్ట్ లాకర్ చిత్రం ఎన్ని విభాగాలలో ఆస్కార్ అవార్డులను సాధించింది--6 విభాగాలలో.
  • ఉత్తమ నటుడు అవార్డు పొందినది--జెఫ్ బ్రిజెస్ (క్రేజీహర్ట్ చిత్రం).
  • ఉత్తమ నటి అవార్డు ఎవరికి లభించింది--శాంద్రా బులక్ (ది బ్లైండ్ సైడ్ చిత్రం).
  • ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపికైన చిత్రం--ది సీక్రెట్ ఇన్ దెయిర్ ఐస్.
  • 82వ ఆస్కార్ అవార్డుల ప్రధానం ఎక్కడ జరిగింది--హాలివుడ్‌లోని కొడక్ థియేటర్ (కాలిఫోర్నియా).
  • ది హర్ట్ లాకర్‌తో పాటు అత్యధికంగా 9 ఆస్కార్ నామినేషన్లు పొందిన చిత్రం--అవతార్.
  • అవతార్ చిత్రం ఎన్ని విభాగాలలో ఆస్కార్ అవార్డులను సాధించింది--3 విభాగాలలో.

ఇవి కూడా చూడండి ... ఆస్కార్ అవార్డు-2008

Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–డబ్బుల దగ్గర మొహమ్మాటాలు

http://harephala.wordpress.com/feed/ - Tue, 03/09/2010 - 12:27

    చాలా మందికి డబ్బులదగ్గరకు వచ్చేసరికి,అవతలివాళ్ళమీద ఖర్చు చేసిన డబ్బు,అడగడానికి మొహమ్మాట పడిపోతూంటారు! ఆందరితో కలిసి ఏ సినిమాకో, హొటల్ కో వెళ్ళినప్పుడు ఇలాటి మొహమ్మాటాలు ఎదురౌతూంటాయి.ఎందుకంటే ఈ రెండింటికీ ఖర్చు కొంచెం ఎక్కువే.ముందర, ఏదో అతి ఉత్సాహానికి వెళ్ళి, టిక్కేట్లు అందరికీ కలిపి తీసేసికోవడం, ఆ తరువాత చూసుకుంటే తడిపి మోపెడయ్యేటంత ఖర్చు.అడిగితే ఏం అనుకుంటారో అని సిగ్గూ, మొహమ్మాటం! పోనీ మనతో వచ్చినవాళ్ళైనా, అడిగి,టిక్కెట్టుకి ఎంతయిందో తిరిగి ఇచ్చేస్తే బాగానే ఉంటుంది.అబ్బే వాళ్ళనుకుంటారూ, మనం అడిగితే ఇచ్చేద్దామనుకుంటారు,కానీ మనం అడగం!ఏదో నెలలోనూ ఏ మూడో, నాలుగో సినిమాలకి వెళ్ళి అందరూ తలోసారీ తీసికున్నా బాగానే ఉంటుంది.కానీ ఆ గుంపులో, అవతలివాళ్ళమీదే బ్రతికేసే ‘ప్రాణులు’ ఉంటారు!

    ఇంకొంతమంది-వాళ్ళ పనిమీద ఎక్కెడెక్కడికో వెళ్ళవలసివస్తుంది.బస్సుల్లో వెళ్ళడానికి నామోషీ, ఓ ఆటో పిలుస్తారు.సరే బాగానే ఉందికదా,వెళ్ళేది అవతలి వాడి పనిమీదే కదా అని, ఎక్కుతాము.వాడు ఆటో దిగినప్పుడల్లా, ఓ అయిదువందల రూపాయల నోటో, వెయ్యిరూపాయల నోటో తీస్తాడు.అంత పెద్ద నోటుకి, ఆటో వాడిదగ్గర చిల్లరెక్కడుంటుందీ,ఇంకో దిక్కులేక, పోన్లే అని మనం ఇచ్చేస్తాము.మనవాడు రోజంతా ఆటోలో తిరిగి, మనచేతే ఇప్పించేస్తాడు. ఇలాటివారికి మందేమిటంటే,మనం జేబులో, వెయ్యి రూపాయలకి చిల్లర పెట్టుకుని, వీడు మొదటిసారి చిల్లర లేదనగానే, ఠక్కున తీసి ఇచ్చేస్తే, వాడికి తెలుస్తుంది , ‘ అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్నా’ అని! ఇక్కడ మనం ఏం మొహమ్మాట పడఖ్ఖర్లేదు!

    పెళ్ళిళ్ళల్లో ఖర్చులన్నీ చూసుకోవడానికి, ఓ దగ్గర చుట్టానికి, ఈ బాధ్యతంతా అప్పచెప్పుతాడు. ఆయనేమో, ఓ బ్యాగ్గు పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూంటాడు.ఎక్కడ డబ్బు అవసరం ఉన్నా ఆయన గురించే చూస్తారు.మరి అలాటప్పుడు, ఆ పెద్దమనిషి, కూతవేటు దూరంలో ఉండాలికదా. మన అదృష్టం బాగోకపోతే,అవసరానికి ఈయన కనిపించడు.కన్యాదాత పీటలమీదనుంచి లేవకూడదు, ఏం చేస్తాడు?
దగ్గరలో ఉన్న మీలాటివాడినో, నాలాటివాడినో అడుగుతాడు.ఇంక అలాటివాటిమీద ఆశ వదులుకోవాల్సిందే!మనం చేయవలసిన పని ఏమిటా అంటే,ఆ ఆర్ధిక సలహాదారుడి మూవ్మెంట్స్ కనిబెడుతూ,కన్యాదాత గారు అడగ్గానే ఈయనని పిలవడం !

    ఇలాటిదే, ఎవరైనా పోయినప్పుడు, ఆసమయంలో అయే ఖర్చులు.తమ దగ్గరవాళ్ళు పోయినప్పుడు,పాపం ఆఇంటిపెద్ద ఎన్నని చూసుకుంటాడూ,
పోయినవారిని సాగనంపడానికి సవాలక్ష ఖర్చులుంటాయి. ఎవరో ఒకరు ముందుకు వచ్చి, కావలిసిన ఎరేంజ్ మెంట్స్ చేయడానికి, ముందర డబ్బు ఖర్చు పెడతాడు.ఆయన సంస్కారవంతుడైతే ఫర్వాలేదు. అంతా పూర్తయిన తరువాత, ఎంత ఖర్చయ్యిందో అడిగి అణాపైసలతో ఇచ్చేస్తారు. వచ్చిన గొడవల్లా,రెండో రకం వారితో. మనం అడిగితేనే కానీ, పైస రాల్చడు.ఆర్ధికంగా బాగుండని వారైతే వేరే విషయం.పైగా అలాటి సమయాల్లో, అడగడానికి కూడా మొహమ్మాటం. పదిరోజులూ ఈయన ఆ ఇంటికి వెళ్తూనే ఉంటాడు. అయినా సరే ఒక్కరోజు కూడా, మొదటి రోజున అంత్యక్రియల సమయంలో ఎంత ఖర్చు అయిందో, చచ్చినా అడగడు. అలాగని ఈయనా ఇంతయిందీ అని అడగా లేడు.ఆ పోయినాయనకేదో, మనం ఋణం ఉన్నామనుకుని దండం పెట్టడమే !( మా అమ్మగారు పూణే లో దివంగతులైనప్పుడు, మాస్నేహితుడొకరు,ముందుగా అన్ని ఖర్చులూ చేశారు.అదేరోజు రాత్రి, మా అబ్బాయిని, వాళ్ళింటికి పంపించి, అణాపైసలతో ఎంతయిందో అంతా ఆయనకిచ్చేశాను. చెప్పడానికి ముందర ఆయన మొహమ్మాట పడ్డారు. అయినా నాబలవంతంమీద, చెప్పించి, ప్రతీ స్టేజ్ లోనూ ఎంతంతయిందో అడిగి ఇచ్చేశాము.) ఇలాటివి చాలా సున్నితమైన పరిస్థితులు. అవతలి వాళ్ళు అడుగుతారులే అని ఊరుకోకుండా, మనమే బాధ్యతతో ఉండాలి.

    ఇంకో సీన్ ఏమిటంటే, మన ఇంటి ఆడవారు ఏవేవో బిసీ పార్టీలనీ, చిట్ ఫండనీ , కిట్టీ పార్టీ అనీ నెలనెలా ఏదో కొంత డబ్బు వేసికుని,ఒక్కొక్క నెలా ఒక్కక్కరికి వచ్చేలా ఏదో వాళ్ళకి చేతనైనంత సేవింగ్ చేస్తూంటారు.ఏదో ఒకనెల ఒకావిడ రాలేదనుకోండి, మొహమ్మాటానికి ఇంకొకావిడ, తన డబ్బుతోపాటు, ఆవిడ డబ్బుకూడా ఇచ్చేస్తుంది.అంతదాకా బాగానే ఉంది, ఇంకో నెల వచ్చేదాకా, వీలున్నంతవరకూ, ఎవరో ఒకరి దగ్గర, ఈ టాపిక్కు తెస్తూండాలి. లేకపోతే,ఆ రెండో ఆవిడ మర్చిపోవచ్చు. ఆ గ్రూప్ లో ఒకళ్ళైనా ఉంటారు, ఈ సంగతి గుర్తుచేయడానికి!


Categories: Middle

పాపం టైగర్‌...


జాతీయ జంతువుపై జనరాకాసుల పంజా...
అడవుల్లో యథేచ్చగా సాగుతున్న పులుల వేట..
లాభసాటి వ్యాపారంగా మారిన స్మగ్లింగ్‌..
వేగంగా కనుమరుగవుతున్న పులులు..
జవాబుదారీ లేని సర్కారు..
అడవుల్లో వేట... అదీ టైగర్‌ను వేటాడటం.. అబ్బో... ఒకప్పుడు రాజులకు, రాచరిక దర్పానికీ షాన్‌... పహచాన్‌.. అప్పుడు అడవులు ఎక్కువగా ఉండేవి.. జంతువులు ఎక్కువగా ఉండేవి.. జనావాసాల మీదకు క్రూర జంతువులు దాడులు చేయకుండా కాపాడేందుకు వేట జరిగేది.. ఇప్పుడూ వేట కొనసాగుతూనే ఉంది.. కానీ, ఇప్పుడదొక లాభసాటి వ్యాపారం.. దొంగతనం.. స్మగ్లింగ్‌... ఫలితం క్రమంగా కనుమరుగవుతున్న వన్యప్రాణి సంపద..
పులి.. వన్యప్రాణుల్లో అరుదైన జంతువు.. అందునా మన జాతీయ జంతువు.. ఇవాళ వేగంగా కనుమరుగవుతున్న జంతువూ అదే.. సర్కారు వారు ఏదైతే చేయకూడదని నిషేధిస్తారో,... ఆ పని చేయటంలోనే కొందరికి మజా.. హాబీ.. అదే బిజినెస్‌... అందులో పులి వేట ఒకటి.. ఇప్పుడు ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో జోరుగా సాగుతున్న స్మగ్లింగ్‌...

టైగర్‌ గర్జన ఇక వినిపించదా? మన జాతీయ జంతువును మనమే వేటాడుతుంటే.. చర్మాన్ని అందిన కాడికి అమ్ముకుంటుంటే ఆపేవారెవరు? అభయారణ్యాలనీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలనీ ఓ... బోర్డులయితే తెగ పెట్టేస్తారు.. టైగర్‌ జోన్‌లోకి వెళ్లవద్దని హెచ్చరికలూ చేస్తారు.. కానీ... అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా కొనసాగుతున్న వేట చూస్తుంటే... చివరకు ఈ బోర్డులు తప్ప వన్యప్రాణులు మిగులుతాయా అన్న సందేహం కలుగుతోంది...
ఇది నిజం.. ఇవాళ ఖమ్మం పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న తంతు ఇదే.. అత్యంత ప్రమాదకరంగా పులుల వేట జరుగుతోంది.. పెద్ద పులులు, చిరుతల సంహారం యథేచ్ఛగా కొనసాగుతోంది.. పకడ్బందీ ప్రణాళికతో.. పక్కా ఎత్తుగడతో ఉచ్చు వేసి మరీ పులులను హతమారుస్తున్నారు..
పులులు, చిరుతల సంచారమున్న అటవీ ప్రాంతంలో వీళ్లు ముందుగా ఉచ్చులు వేస్తారు.. వాటికి పులుల మెడలు బిగుసుకుని చచ్చిపోతాయి..

అలా సాధ్యం కాని పక్షంలో మరో దారుణమైన ప్రత్యామ్నాయాన్నీ ప్రయోగిస్తారు.. అడవుల్లో ప్రవహించే వాగులు, వంకలు, నీటి గుంటల్లో పురుగు మందులు కలిపేస్తారు.. దాహం తీర్చుకోవటానికి వచ్చిన పులులు ఆ నీటిని అమాయకంగా తాగి మృత్యువాతపడతాయి...
నిజానికి ఈ వేటగాళ్లు అమాయక గిరిజనులు... అసలైన వేటగాళ్లు వేరే ఉన్నారు.. వాళ్ల ఉచ్చులో ముందుగా వీళ్లు పడతారు.. వాళ్లు చెప్పిన పనల్లా చేసి పెడతారు...కొద్దో గొప్పో డబ్బులకు ఆశపడ్డ గిరిజనులు పులులను హతమారుస్తారు.. అసలైన స్మగ్లర్లు వీళ్ల దగ్గర నుంచి మూడు నాలుగు వేల రూపాయలు చెల్లించి పులి చర్మాన్ని తీసుకువెళ్తారు..


పులి చర్మం కేవలం మూడు వేల రూపాయలేనా? ఆశ్చర్యపోకండి.. పులుల చర్మాలు, గోళ్ల వ్యాపారం అంతర్జాతీయ స్థాయిలో జరిగేది... మిగతా వ్యాపారాల్లో మాదిరిగానే ఇందులోనూ సొమ్ములు దండుకునేది, దళారులు.. అసలు స్మగ్లర్లు... గిరిజనులు కేవలం వీరికి ఉపయోగపడే పావులు మాత్రమే...
పులుల వేట జరుగుతున్నట్లు సమాచారం అందిన ప్రతిసారీ అటవీ శాఖాధికారులు పెద్ద ఎత్తున నిఘా వేసి దొంగల్ని పట్టుకుంటారు.. ప్రతి సంవత్సరమూ ఈ తరహా కేసులు నమోదవుతూనే ఉన్నాయి...
పులులను వేటగాళ్లు వేటాడినట్లే.. వాళ్లను అటవీ అధికారులు వేటాడి పట్టుకుంటున్నారు.. ఇంతవరకు బాగానే ఉంది... కానీ వచ్చిన చిక్కల్లా వేరే ఉంది.. అటవీ అధికారులకు పట్టుబడే వాళ్లంతా సామాన్య గిరిజనులే... వాస్తవంగా పులులను వీళ్లే హతమార్చినా.. వీరి చేత ఈ పని చేయిస్తున్న అసలు వేటగాళ్లు వేరే ఉన్నారు.. వారు పట్టణ వాసాలను వీడి బయటకు రారు.. బయటపడరు..
అధికారులు మాత్రం గిరిజనులను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేసి పనయిందనిపించుకుంటారు..
అసలు స్మగ్లర్లపై మాత్రం ఎలాంటి కేసులూ నమోదు జరగవు.. వారి వంక కన్నెత్తి కూడా చూసేవాళ్లు కనపడరు..వీరంతా హైదరాబాద్‌ కేంద్రంగానే అంతర్జాతీయ వ్యాపారం వెలగబెడుతున్నారు.. మూడునాలుగు వేల రూపాయలకు గిరిజనుల నుంచి కొనుక్కున్న పులి చర్మాలను ఒక్కొక్కటిని ౭౫ వేల రూపాయల వరకు ఎగుమతి చేస్తారు..ఇక గోళ్ల ధర కూడా తక్కువేం పలకదు.. ౩వేల నుంచి ఒక్కోసారి పది వేల రూపాయల దాకా ఒక్కో గోరు పలుకుతుంది.. ఎముకలకు కూడా విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది...
వన్యప్రాణులను కాపాడుకోవటానికి చట్టాలు ఉన్నాయి.. జంతు సంరక్షణ సంస్థలూ ఉన్నాయి.. అయినా వేట నిరాటంకంగా కొనసాగుతోంది.. మరెందుకు ఈ చట్టాలు..? ఓ వైపు దేశంలో ఎన్ని పులులు ఉన్నాయనే గణాంకాలు తీస్తున్నారు.. ఇంకోపక్క పులుల వేట కొనసాగుతోంది.. వేటను నియంత్రించలేనప్పుడు గణాంకాలు చేసి మాత్రం ఏం ప్రయోజనం?
ఖమ్మం జిల్లాలో అటవీప్రాంతం ౮, ౪౦౦ చ.కిమీ..
కిన్నెర సాని అభయారణ్యం ౬౩౫ చ.కిమీ.
పాపికొండలు అభయారణ్యం ౧౧,౨౦౦ చ.కిమీ
(భద్రాచలం సౌత్‌ డివిజన్‌, (తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు కలుపుకుని)
పాపికొండలు అభయారణ్యంలోనే పులులు, చిరుతల సంచారం
వీటి చర్మాలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌..
౨౦౦౦ నుంచి ౨౦౦౯ వరకు ౧౩ చిరుత చర్మాల స్వాధీనం..
౧౯౭౨లోనే అమల్లోకి వచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టం
౨౦౦౫లో చట్టానికి సవరణ చేసిన సర్కారు...
అయినా పులి సంహారం..ఆగడం లేదు
మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఒరిస్సాల నుంచీ స్మగ్లర్లు ఖమ్మం అడవుల్లో చొరబడుతున్నారు.. వీళ్లందరికీ దేశ వ్యాప్తంగా పక్కా నెట్‌వర్కింగ్‌ ఉంది.. వీళ్లకుండా పలుకుబడి కూడా తక్కువేమీ కాదు. బ్యూరోక్రసీని, రాజకీయ నేతలను కూడా ప్రభావితం చేయగల సమర్థులు కాబట్టే వీరి ఆటలు సాగిపోతున్నాయి. వీళ్లను పట్టుకోవటం మామూలు అధికారుల వల్ల అయ్యే పని కాదు..పాలకులు ఇందుకు పూనుకోవాలి.. పకడ్బందిగా వ్యవహరించాలి...అప్పుడే జాతీయ జంతువును కాపాడుకోవటం సాధ్యపడుతుంది..


Categories: Middle

స్కూలు అంటే ఓ దుకాణం..

స్కూలు అంటే ఓ దుకాణం.. ఓ చిట్‌ఫండ్‌ కంపెనీ.. ఓ ఫైనాన్స్‌ సంస్థ... ఇదేమని ఆశ్చర్యపోకండి... మన దేశంలో చదువు అనేది అచ్చొచ్చే బిజినెస్‌గా ఎప్పుడో మారిపోయింది. స్కూళ్లు చదువును అమ్ముకునే అంగళ్లుగా రూపాంతరం చెంది చాలా కాలమే అయింది... విద్యార్థుల నుంచి అడ్డగోలుగా డబ్బులు దండుకోవటం.. స్కూలును చూపించి బయట వడ్డీలకు అప్పులు చేయటం.. రొటేషన్లు.. సెటిల్మెంట్లు.. అన్నీ కలిస్తే దాని పేరు విద్యాలయం... అలియాస్‌ కెపిఎస్‌ స్కూల్‌...

పేరుకు మాత్రం అది పెద్ద స్కూలు.. కానీ అక్కడ యాజమాన్యం నడిపేది ఓ దుకాణం.. అదే చదువుల కొట్టు.. ఇక్కడ చదువు చెప్పరు.. అమ్ముతారు.. నాలుగు వందల మంది విద్యార్థుల దగ్గర నుంచి అందినకాడికి దండుకోవటంలో వీళ్ల ఎక్స్పీరియన్స్‌ అబ్బో బోలెడంత... పిల్లల దగ్గర నుంచే కాదు... ఈ బడిని చూపించి బయట కూడా చేతికి తోచినంత అప్పులు చేసి చక్కా ఉడాయించారు సదరు స్కూలు యజమాని...

దిల్‌సుఖ్‌నగర్‌ సమీపంలోని మారుతీనగర్‌లో ఉన్న స్కూలు వైభవానికి ఆ స్కూలు బోర్డు ఉదాహరణ. నీతి సూత్రాలు.. వివేకానందుడు, మదర్‌ థెరెస్సాల ఆదర్శాలు తెగ వల్లెవేశారు... పాపం వాటన్నింటినీ నిజమేనని నమ్మిన పిల్లలు పొలోమని వచ్చి చేరిపోయారు...అక్షరాలా నాలుగు వందల యాభై మంది విద్యార్థులు చదువుకుంటున్న విద్యాలయం.. ఈ నెలాఖరు నుంచి యాన్యువల్‌ పరీక్షలు జరుగనున్నాయి. ఇవాళో, రేపో హాల్‌టికెట్లు ఇస్తారని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.. ఇవాళ ఉదయం హటాత్తుగా పాఠశాలను మూసేస్తున్నట్లు ప్రకటించేసి బోర్డు తిప్పేశారు..
ఉన్నట్టుండి స్కూలు ఎందుకు మూసేశారో అర్థం కాక విద్యార్థులు, తల్లిదండ్రులు అవాక్కయ్యారు..
జవాబు ఇచ్చేవారు లేరు.. అయోమయం...పరీక్షలు దగ్గరకు వచ్చిన సమయంలో ఇలా జరగటం మింగుడు పడని పరిస్థితి...
గమ్మత్తేమిటంటే గత నాలుగు రోజులుగా వరుసగా సెలవులు వచ్చాయి. ఈ సెలవులను పాఠశాల యాజమాన్యం చక్కగా వినియోగించుకుంది. అన్నీ చక్కబెట్టుకుని ఎంచక్కా చెక్కేసింది.
అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయటంలో ఈ స్కూలుకు సాటిరాగలది మరోటి లేనే లేదు.. సిబ్బందికి మాత్రం నాలుగైదు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు.. పరిస్థితి చేయి దాటినా ఎవరూ ఫిర్యాదు చేయలేదు.. అధికారులు పట్టించుకోలేదు.. పదో తరగతి దాకా అనుమతి లేకుండా స్కూలు నడుపుతుంటే... ఫీజులు దండుకుంటుంటే.. విద్యార్థులను ప్రెユవేటుగా పరీక్షలను రాయిస్తుంటే చేష్టలుడిగి చూస్తున్నారో... లేక కావాలనే తేలిగ్గా తీసుకున్నారో... అర్థం కాని స్థితి....
వేరే పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తామంటూ అధికారులైతే చెప్తున్నారు కానీ, పరీక్షలు ముంచుకొచ్చిన ఈ తరుణంలో ఇది ఎంత వరకు సాధ్యమన్నది అర్థం కాదు.. పరీక్షల ముందు సహజంగానే మానసిక ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులు.. ఈ పరిణామంతో మరింత దిగాలు పడిపోయారు.. ఇలాంటి యాజమాన్యాలను ఏం చేయాలి? ప్రభుత్వమూ పట్టించుకోక, పార్టీలూ పట్టించుకోక..నడివీధిలో విద్యార్థులను నిలబెట్టారు..


Categories: Middle

ఆత్మహత్యల తెలంగాణా...

ఎవరు ఆపాలి...ఈ ఆత్మహత్యల పరంపరని... రాజకీయ నాయకులు చప్పబడిపోయారు.. తమ వ్యవహారాలను బహుబాగా చక్కబెట్టుకుంటున్నారు.. నిరాహార దీక్షల శిబిరాలు బోసిపోయాయి.. శ్రీకృష్ణ కమిటీ వచ్చింది.. వెళ్లింది.. ఎవరైనా నివేదికలు ఇవ్వవచ్చంటూ ఓ మాటనేసి పాపం న్యాయమూర్తి వెళ్లిపోయారు.. కానీ, తెలంగాణాలో పిల్లల భావోద్వేగాలు, లోలోపల రేగుతున్న అలజడులు ఎంతమాత్రం చల్లారటం లేదు.. ప్రతిక్షణం ఒకే ఆలోచన.. ఏం జరుగుతుంది? తెలంగాణా వస్తుందా? రాదా? ఇక రాదేమో.. ఈ చేవచచ్చిన, చేతకాని రాజకీయ నాయకుల వల్ల సాధించేదేమీ ఇక లేదు.. ఈ మానసిక ఆందోళనలను చల్లబరిచే ప్రయత్నం చేస్తున్న వాళ్లెవరూ లేరు.. నిన్నటికి నిన్న వరంగల్‌ నగరంలో ప్రజాశక్తి పత్రిక విలేఖరి సునీల్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.. అతని అంతిమ యాత్ర అక్కడ కొనసాగుతుండగానే ఉస్మానియా విశ్వవిద్యాలయం మినీటెక్‌ హాస్టల్‌లో నల్గొండ జిల్లా కోదాడకు చెందిన సాయికుమార్‌ ఉరివేసుకున్నాడు.

. సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యలు కాదంటూ ఎవరెన్ని ఉపన్యాసాలు చెప్తున్నా.. వీళ్లను కన్విన్స్‌ చేయలేకపోతున్నాయి..ఒక పరిష్కారాన్ని సాధించుకోవటానికి మార్గాలు అనేకం ఉన్నాయి. కానీ, వాటన్నింటినీ వదిలేసి ఆత్మహత్యలు చేసుకోవటం ద్వారా వాళ్లనుకున్న లక్ష్యం ఎలా సాధ్యమవుతుంది? అమరులవటం వల్ల తల్లిదండ్రులకు గర్భశోకం.. స్నేహితులకు విషాదం... తల్లి తెలంగాణాకు తీరని దుఃఖం.. దీన్ని గ్రహించాలి.. నేతలు చేస్తున్న ద్రోహానికి వాళ్లను నిలదీయాలి.. పోరాటం దిశగా వాళ్లను కదిలించండి... మరింత ఉధృతంగా పోరాటం చేయండి.. లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్లాలి కానీ, ఆత్మహత్యలు చేసుకోవటం యుద్ధం నుంచి పిరికివాళ్లలా పారిపోవటం లాంటిదే... ఉన్నతంగా సాగుతున్న పోరాటంలో ఒక ఆత్మహత్య జరిగితే , . ఉద్యమించిన సైన్యంలో ఒక యోధుడు తగ్గినట్లేనని భావించాలి...తెలంగాణాకు నిజమైన రాజకీయ నాయకత్వం అనేది ఉండి ఉంటే తెలంగాణ అసలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యేదే కాదు.. ఈ సత్యాన్ని గ్రహించండి.. తెలంగాణాకు రాజకీయ నాయకత్వం అంటూ లేనే లేదు.. చెన్నారెడ్డి అయినా, కెసిఆర్‌ అయినా.. ఆ రాజకీయ నాయకత్వానికి ముసుగుల్లాంటి వారే.. ముసుగు తొలగిస్తే.. అంతా డొల్లే.. తెలంగాణా ప్రజను ముందుండి నడిపించే, మార్గదర్శనం చేసే నాయకత్వాన్ని ముందుగా పెంపొందించుకోవాలి.. సైన్యాధ్యక్షుడు లేకుండా సైన్యం తలోదిక్కున పయనిస్తే.. ఎదురయ్యేది ఇదిగో.. ఇలాంటి ఓటమే... దీన్ని అధిగమించటానికి ఏం చేయాలో.. ఎలా ముందుకు సాగాలో ఆలోచించుకోవాలి కానీ, ఆత్మహత్యలు చేసుకోవటం సరి కాదు.. మనం జీవించి ఉండి కలల్ని సాకారం చేసుకోవాలి కానీ, జీవితాన్ని అంతం చేసుకున్న తరువాత ఏం సాధించినా ఏం ఫలితం?

Categories: Middle

ఒక అడ్డంకిని అధిగమించిన మహిళాబిల్లు...

అలజడులు.. అల్లర్లు.. ఆందోళనలు.. గల్లీ కొట్లాటలకు వేదికగా తలపించిన రాజ్యసభ.. సభాపతి అన్న మర్యాదను సైతం సభ్యులు ఉల్లంఘిస్తే.. ప్రజాస్వామ్యం విస్తుపోతూ చూస్తూ ఉండిపోయింది.. ఏడుగురు సభ్యులు.. ఒకరిద్దరు మినహా మిగతా వాళ్లంతా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాళ్లే.. అయినా గద్దల్లా ప్రజాస్వామ్యాన్ని పొడుచుకుతినేందుకు ప్రయత్నించారు ఈ డర్టీ సెవెన్‌...భారత స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారి రాజ్యసభలో సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడటం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని కళంకం.. దాని పేరే పెద్దల సభ.. కానీ, సభ్యులు మాత్రం పెద్దల్లా ప్రవర్తించింది లేదు.. ఇలాంటి వాళ్లనా మన రాజకీయ పార్టీలు పెద్దల సభకు పంపేది... ఆ సభకు ఇంతకాలంగా ఉన్న మర్యాదలన్నింటినీ ఈ డర్టీ సెవెన్‌ మంటగలిపేశారు.

ఈ గొడవల మధ్యలోనే.. ఈ గందరగోళం కొనసాగుతుండగానే బిల్లుపై చర్చనూ మమ అనిపించారు.. ఓటింగూ జరిపించారు.. విచిత్రమేమంటే.. రాజ్యసభలో ౨౩౩ మంది సభ్యులు ఓటింగ్‌ సమయంలో హాజరు అయితే బిల్లుకు అనుకూలంగా ౧౮౬ ఓట్లే పడ్డాయి.. ఒకే ఒక్క ఓటు వ్యతిరేకంగా పడింది.. మిగతా ౪౬ మంది ఓట్లేయలేదు.. వాస్తవానికి సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న ఎస్‌పి, ఆర్‌జెడి ఇతర సభ్యులు ౩౪ మందే ఉన్నారు.. ఇద్దరు బిఎస్‌పి సభ్యులు ముందే బహిష్కరించారు.. మరి మిగతా పది మంది ఎవరు..? ఏ పార్టీకి చెందిన వారు? వీరిలో అధికార పార్టీ, బిజెపికి చెందిన వాళ్లెవరైనా ఉన్నారా? ఇవన్నీ తెలియాల్సి ఉంది...
ఏమైతేనేం.. మొత్తం మీద మహిళాబిల్లుపై రాజ్యసభ ముద్రపడింది.. ఇక లోక్‌సభ ఆమోదమే తరువాయి.. దీనికి ఎంత హంగామా జరుగుతుందో.. ఎన్ని గందరగోళం సృష్టిస్తారో చూడాలి....
మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రకారం........
లోక్‌సభలో, శాసన సభల్లో...౩౩.౩శాతం సీట్లను మహిళలకు కేటాయించటం జరుగుతుంది..
పార్లమెంటులో ఇప్పటికే ఎస్‌సి, ఎస్‌టిలకు ౨౨.౫ శాతం రిజర్వేషన్లు ఉన్నాయి..

ఈ ఎస్‌సి ఎస్‌టి రిజర్వేషన్లలోనూ ౩౩.౩ శాతం మహిళలకు కేటాయించాలని బిల్లు నిర్దేశిస్తోంది.. అదే జరిగితే ఎస్‌సి ఎస్‌టిలకు ఉన్న ౨౨.౫ శాతంలో ౭.౫ శాతం మహిళలకు కేటాయించాల్సి వస్తుంది..
మొత్తం మీద లోక్‌సభలో మహిళల సంఖ్య ౧౮౧మందికి చేరనుంది...
మన రాష్ట్ర అసెంబ్లీలో మహిళల సంఖ్య ౯౮కి చేరుతుంది.
ప్రస్తుతం ౧౫వ లోక్‌సభలో ౫౯ మంది మహిళలు ఉన్నారు.. అంటే మహిళల సంఖ్య ౧౦.౮శాతం..
మన రాష్ట్రానికి సంబంధించి ౧౩వ శాసనసభలో ౩౪ మంది మహిళలు ఉన్నారు.. అంటే మన అసెంబ్లీలో మహిళల శాతం ౧౧.౫

డర్టీ సెవెన్‌...

డాక్టర్‌ ఇజాజ్‌ అలీ...
జెడి(యు) ద్వారా రాజ్యసభలో ప్రవేశించారు..
పేరుకు పెద్ద డాక్టర్‌... చదువులు గొప్ప.. చేష్టలు దిబ్బ..


షబీర్‌ అలీ...
లోక్‌ జనశక్తి పార్టీ నుంచి రాజ్యసభకు చేరుకున్న ఈయన
చదువుకున్నది తక్కువ...
సెటిల్మెంట్లు చేయటంలో.. పంచాయతీలు పరిష్కరించటంలో మేధావి..

కమల్‌ అఖ్తర్‌..
ఉత్తరప్రదేశ్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఈయన గారి రాజకీయ ఆవాసం
ఎస్‌పి మార్క్‌ రాజకీయానికి ఈయన మచ్చుతునక..
సమాజసేవకుడి నుంచి రాజకీయాల్లో ఎదిగిన నేత

ఆమీర్‌ అలం ఖాన్‌
ఈయనా సమాజ్‌వాదీ మాణిక్యమే...
ఈయన రైతు.. పలు పుస్తకాలు కూడా రాశారు..

వీర్‌పాల్‌సింగ్‌ యాదవ్‌
యుపి నుంచే ఎస్‌పి ద్వారా రాజ్యసభకు ఎంపిక..
బిఎ ఎల్‌ఎల్‌బి. చదివి చాలా పదవులు నిర్వహించారు

నందకిశోర్‌ యాదవ్‌..
యుపికే చెందిన ఈయన ములాయంకు సన్నిహిత సహచరుడు
రాజనీతి శాస్త్రంలో ఎంఎ చదువుకున్నాడరు..
లాయర్‌ వృత్తినీ వెలగబెడుతున్నారు..

సుభాష్‌ యాదవ్‌...
ఈయన అడ్రస్‌ కేరాఫ్‌ లాలూ...
లాలూ గారి ముద్దుల బావమరిది...
బావగారి అండతో బీహార్‌లో రాజ్యమేలుతున్న పెత్తందారీ..
Categories: Middle

వేకువ వెలుగులు - 7



కమ్మనైన రాతిరి కలలోన కరిగింది
తొలివేకువ వెన్నలాగ విచ్చింది
కలువభామ ఒళ్ళు విరిచింది
హృదయ సీమ స్వరాలు పలికింది

మత్తు వదిలి మానవులార
మార్తాండను చూడండి
వాడిపోక వెలుగు జిలిగె
ఎర్రబంతిని చూడండి
సుప్రభాత సూర్య నమస్కారముల
జీవుని పరమాత్మునిలో లీనం చెయ్యండి
Categories: Middle

ఈజీగా పైంటింగ్ వేద్దాం

చీరల పైన , దుప్పట్ల పైనా పైంటింగ్ వేస్తాం కదా.. కొంచం ఈజీగా ఎలా వెయ్యాలో నేర్చుకుందామా ...
Categories: Middle

Justice Jasti Chelameswar to be Chief Justice of Kerala

Guwahati Chief Justice Jasti Chelameswar is being posted as the Chief Justice of Kerala in place of Chief Justice S.R.Bannurmath who has retired from service.

The Supreme Court collegium has made the recommendation to the President in this regard.
Justice Jasti Chelameswar was born on June 23, 1953 at Pedda Muttevi, Movva Mandal in Krishna District at Andhra Pradesh, India. His father was late Jasti Lakshminarayana, a lawyer at Machilipatnam, Krishna District.

He had his earlier education up to class XII at Hindu High School at Machilipatnam in Krishna District and Graduated in Science (Physics) at Madras Loyala College. Graduated in Law from Andhra University Visakhapatnam, in 1976, he was enrolled as an Advocate in High Court of Andhra Pradesh at Hyderabad in the year 1976 and practised under a senior Advocate Dr. B. Bhimaraju, former Public Prosecutor, High Court of A.P., P. Rajarao, Ex. Government Pleader High Court of A.P. and K. Srinivasa Murthy, a leading Advocate in High Court of A.P. Specialised in Constitutional Law, Election Laws, Central Excise, Customs, Income Tax and Criminal Law.

He was appointed as Standing Counsel of A.P. Lokayukta in 1985 and 1986. He also worked as Government Pleader for Home Affairs in High Court in the years 1988 and 1989. He was designated as Senior Counsel in the year 1995 and appointed as Additional Advocate General on 13.10.1995. Elevated as Addl. Judge of High Court of Andhra Pradesh on 23.6.1997 and as Judge w.e.f. 17.05.1999.

He assumed the charge of the Chief Justice of the Gauhati High Court (The High Court of Assam, Meghalaya, Nagaland, Manipur, Tripura, Mizoram and Arunachal Pradesh) on 03.05.2007.
Categories: Middle
Syndicate content