కూడలి
జల్లెడ
హారం
అమ్మ చేతిలో ఒక్కసారైనా దెబ్బ తినని వాళ్ళు ఉండటం చాలా అరుదని నా నమ్మకం. అందుకు నేనూ మినహాయింపు కాదు. చిన్నప్పుడు నాకు బంకమట్టితో బొమ్మలు చేయడమంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే చాలు అదే పని. రక రకాల వాహనాలు, పరికరాలు వంటివి చాలా తయారు చేస్తుండే వాడిని. నాకోసమే కాదు. నా పక్కన తిరిగే పిల్ల గ్యాంగ్ అంతటికీ నేనే చేసిపెట్టే వాడిని.
ఒక సారి మా అమ్మ గదిలో పూజ చేస్తూ పూజ అయిపోయేదాకా నన్నక్కడే కూర్చోమనింది. నేను నెమ్మదిగా అక్కణ్ణుంచి జారుకుని మట్టి బొమ్మలు చేయడానికి వెళ్ళిపోయాను. ఆటల్లో పడి పూజైపోయేదాకా తిరిగి రాలేదు. ఎవరో వచ్చి మా అమ్మ ఇంటి దగ్గర బెత్తం ఎత్తుకుని నా కోసం కాసుక్కూచుందని చెప్పారు.
అప్పటిదాకా మా అమ్మ నన్నెప్పుడూ తిట్టిందే తప్ప కొట్టింది లేదు. ఏంజరుగుతుందోనని భయం భయంగా ఇంటికెళ్ళాను. వెళ్ళగానే మా అమ్మ బెత్తం తీసింది. అంతే ఒంటి మీద చిన్న దెబ్బ పడిందో లేదో రోషం పొడుచుకొచ్చింది…అసలే పౌరుషం ఎక్కువ.. పైగా ఇంట్లో వాళ్ళందరి దగ్గర గారాబం… ఆ బెత్తం తీసుకుని మా అమ్మని తిరిగి నాలుగిచ్చేశా…అంతటితో ఆగానా… అన్నం తినకుండా అలక పాన్పు ఎక్కేశా. అలక తీర్చడానికి మాకుటుంబం మొత్తం రంగం లోకి దిగింది. ఒక్క దెబ్బకి నాలుగు దెబ్బలు తిరిగిచ్చి మళ్ళీ నేనే అలిగానని మా ఇంట్లో వాళ్ళంతా ఒకటే నవ్వులు. నాకు మాత్రం ఉక్రోషం పెరిగిపోతోంది. చివరికి మా తాత వచ్చి బుజ్జగించి ఎప్పట్నుంచో మూలన పడి ఉన్న ఈచెయిర్ రిపేర్ చేసి ఇచ్చేదాకా పట్టు వదల్లేదు.
కోపం తగ్గాక ఆ కుర్చీ మీద దర్జాగా కూర్చుని చెయ్యి చాపుతుంటే మా అమ్మ ఒక్కో ముద్ద కలిపి చేతిలో పెడుతూ…
“అది కాదు నాయనా.. పూజ దగ్గిర ఉండమంటే నువ్వు చెప్పా పట్టకుండా అట్ట ఎల్లిపోతే ఎట్టా చెప్పు… తప్పు గదా..” అంటూ నెమ్మదిగా మంచిమాటలు చెప్పింది.
“అయితే ఇంకెప్పుడూ అలా చెయ్యనులే…. నువ్వు కూడా నన్నెప్పుడూ కొట్టగూడదు” అన్నా…
అదే మొదటి మరియు చివరి అమ్మ చేతి దెబ్బ… ఇంకెప్పుడూ దెబ్బలు తినలేదు. మా నాన్న దగ్గరైతే ఆ ఒకసారి కూడా దెబ్బలు తినలేదు.
ఒక సినిమా చూసి బయటకొచ్చేటప్పుడు మనకి బాగా గుర్తుండిపోయేది ఆ సినిమా క్లైమాక్స్ సీన్. అంతకు కొద్ది సేపటిముందే చూడడం ఇందుకు ఒక కారణమైనప్పటికీ దానికంటే ముఖ్య కారణం మనం సినిమా అంతా చూసేది చివరికి ఏమవుతుందో అనే ఆసక్తితోనే కాబట్టి ఏ సినిమాకైనా క్లైమాక్స్ సీన్ అనేది కీలకం. ఆయా సినిమా ఎలా end అయిందన్న దాన్ని బట్టే ఏదైనా సినిమాను ఆదరించడం/తిరస్కరించబడడం జరుగుతుంది. ఉదాహరణకు ఎంతో పేలవంగా నడిచే ’లీడర్’ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో వచ్చే ఆరేడు నిమషాల ఎమోషనల్ సీన్ తో బ్యాలెన్స్ అయిపోయినట్టనిపిస్తుంది (ప్రేక్షకుల స్పందన, బాక్సాఫీస్ కలక్షన్ల బట్టి చూస్తే). అంటే ఏదైనా సినిమాకి ఎండింగ్ అనేది చాలా ముఖ్యం అనడానికి ’లీడర్’ ఒక మంచి ఉదాహరణ.
అయితే ఈ మధ్యన వచ్చిన ’యుగానికొక్కడు’ అనే సినిమాలో కూడా ప్రదమార్థం కంటే రెండో సగం చాలా గందరగోళంగా ఉంటుంది. అయినప్పటికీ విజువల్ గా కొద్దిపాటి ఇంట్రస్ట్ ని sustain చెయ్యగలిగాడు దర్శకుడు. కానీ ఈ సినిమా అంతటినీ ఎలాగో క్షమించేసినా ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం చాలా పేలవంగా ఉంటుంది. సినిమాలో అక్కడక్కడా breathtaking విజుయల్స్ తో మాయచేసిన దర్శకుడు సినిమా అంతా చూసిన ప్రేక్షకుడికి “ఏదో ట్రై చేశాడు. కానీ అర్థం కాలేదు” అనిపించేలా చేశాడు. ఈ సినిమా ఎండింగ్ బావుండుంటే ఇంకా పెద్ద విజయం సాధించి ఉండేదని నా అభిప్రాయం.
‘Movie Endings’ and Socio-Historical context
పై రెండు ఉదాహరణల ద్వారా సినిమాకి ముగింపు ఎంత ముఖ్యమైన అంశమో ఒప్పుకుంటారనే అనుకుంటాను. అయితే ప్రపంచంలోని సినిమాలు తీసే ఆయా దేశాల socio-historic context ఆధారంగానే ఆయా సినిమాల ముగింపు ఉంటుందని ఒక థియరీ.
ఉదాహరణకు యూరోపియన్ సినిమాలను, హాలీవుడ్ సినిమాలనూ సినిమాల ముగింపు ఆధారంగా లెక్కలేస్తే హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా “They lived happily ever after” లాంటి పాజిటివ్ నోట్ తో ముగిస్తే యూరోపియన్ సినిమాలు “జగమే మాయ. బతుకే మాయ. ఇంతేనయా తెలుసుకోవయా. ఈ లోకం ఇంతేనయా” అనేటువంటి ముగింపులు కనిపిస్తాయి.
ఈ విషయం మనకి కూడా చాలా సార్లు రుజువయిన సత్యం. అందుకు ప్రస్తుతం మన రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్న ‘ఏ మాయ చేశావే’ ఒక గొప్ప ఉదాహరణ. ఇదే సినిమా తమిళంలో తీశారు. కానీ రెండింటి లోనూ సినిమా మొత్తం కథ ఒకటే అయినా క్లైమాక్స్ లో అమ్మాయి-అబ్బాయి కలవకుండానే తమిళంలో కథ ముగుస్తుంది. తెలుగులో ఇద్దరూ కలవడంతో కథ ముగుస్తుంది.
అలా వెతుక్కుంటే మహష్ బాబు నటించిన ’బాబీ’ సినిమా నెగటివ్ ఎండింగ్ మూలంగానే ఫ్లాపయ్యిందని ఒక టక్.
అలాగే “మరో చరిత్ర” ను రీమేక్ చేస్తూ మన వాళ్ళు దాన్ని ముగింపు మాత్రం “అంతా హ్యాపీస్” గా మారుస్తున్నారని ఇండస్ట్రీ లో ఒక టాక్. అదెంతవరకూ నిజమో సినిమా రిలీజయ్యాక చూడాలి మరి.
అంటే మన తెలుగు వాళ్ళకు negative గా ముగిసే సినిమాలు ఎందుకో నచ్చవని ఎక్కడో ఎవరో డిసైడ్ అయిపోయారు. దీని వెనుక socio-historic context ఏమిటో మరి?
తెలుగు సినిమా మరియు వనవాసం
తెలుగు సినిమాల happy endings వెనుక socio-historic context ఏమిటో తెలియదు కానీ మన సినిమాల మధ్య భాగాల (second act) వెనుక మాత్రం రామాయణ భారతాల influence చాలానే ఉందనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే రామాయణ, భారతాల్లో హీరోలు వనవాసాల కెళ్ళినట్టు మన తెలుగు సినిమాలోనూ హీరోలు వనవాసం వెళ్ళడం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాదంటారా?
సమరసింహా రెడ్డి, ఇంద్ర తరహా చిత్రాల్లో హీరోలది వనవాసం టైపే కదా!
తేజ సినిమాల్లో హీరో హీరోయిన్ల వనవాసం గురించి చెప్పాలా?
వెతుక్కుంటే ఇలాంటివి ఇంకా చాలానే ఉంటాయనుకుంటా! మీరేమంటారు?
చివరిగా
Movie endings అధారంగా సినిమాలను వర్గీకరించారు Richard Neupert అనే film critic. The End – Narration and Closure in the Cinema అనే పుస్తకంలో ఆయన సినిమాలను ఈ విధంగా విభజించారు.
ఆయన మాటల్లో story అంటే
…the story is a complex system of characters, actions and events organised temporally and causally, which are all reconstructed by the viewer’s activity. Each character and action has a varying effect on the resolution of individual scenes and on the eventual ending
discourse అంటే
The discourse as opposed to the story is the narrative voice, which includes a group of techniques, such as editing principles and musical interventions. The discourse also functions as an inscribed narrator where the techniques may even collectively create a definite personality or presence.
శారదా మాత శిష్యులలో ఒకరు స్వామి అదినాథానంద. రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు నిర్మించడం అతని భాద్యత. ఆయన దగ్గర ఉగప్ప అనే శిష్యుడు క్యాషియర్ గా పనిచేసేవాడు. ఈ పాఠశాలలు నడపడానికి అవసరమయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేది. ఇందుకోసం విడతలవారీగా చెక్కుల రూపంలో డబ్బు పంపించేది.
ఒకసారి శనివారం సాయంత్రం బ్యాంకు మూసేసిన తర్వాత పెద్ద మొత్తం కలిగిన చెక్ ఆశ్రమానికి వచ్చింది. ఆ చెక్ ను సాధ్యమైనంత త్వరగా జమచేయాలని భావించాడు. ఆదివారం ఉదయం స్వామీజీ ఉగప్పను పిలిచి బ్యాంకు కెళ్ళి ఈ చెక్ ను జమచేసి రమ్మన్నాడు.
గురూజీ పరధ్యానంలో ఉన్నాడేమో అనుకుని ఆరోజు ఆదివారమనీ, బ్యాంకు తెరవరనీ, చెక్ జమ చేయడం అసాధ్యమని తేల్చేశాడు.
“నువ్వు కనీసం ప్రయత్నమైనా చెయ్యకుండా అది అసాధ్యమని ఎలా చెప్పగలుగుతున్నావు. ముందుగా వెళ్ళి ప్రయత్నించు. తరువాత వచ్చి నాకు విషయమేమిటో చెప్పు” అన్నాడు.
రామకృష్ణ ఆశ్రమంలో గురువు ఏదైనా ఆదేశిస్తే ముందుగా శిరసావహించాలి తరువాతనే ప్రశ్నలడగాలి. అప్పుడు గుర్తుకొచ్చిందా శిష్యుడికి ఆ బ్యాంకు డైరెక్టర్ చిరకాల మిత్రుడని. ఆయన ఎక్కడ నివసిస్తాడో కూడా తెలుసు. ఉగప్ప సరాసరి ఆయనింటికి వెళ్ళి పరిస్థితిని వివరించాడు. ఆ ఆఫీసర్ కాసేపు ఆలోచించి
“ముందుగా బ్యాంకు వెళదాం. అక్కడ ఏంచేయగలనో చూద్దాం” అన్నాడు.
ఇద్దరు కలిసి బ్యాంకుకు వెళ్ళగానే డైరెక్టర్ ఆ చెక్ తీసుకుని ఆశ్రమం ఖాతాలో వేశాడు.
పని ముగించుకుని శిష్యుడు ఆశ్రమానికి రాగానే స్వామీజీ శిష్యునితో ఇలా అన్నాడు.
“ఇప్పుడు నీకు తెలిసిందా? ప్రయత్నిస్తే కొన్నిసార్లు అసాధ్యమైనవి కూడా సుసాధ్యమౌతాయనీ”.
మూలం:http://www.vedanta-atlanta.org/stories/swami.html
I was so confidently clear about the opening shot of my first film “SHIVA” that the camera set on the crane should be showing the college in the suggestion of a college name-board, come down slowly and pan to the close-up of a car wheel coming into the foreground and stopping in front of the camera. Tired of my repeated narration of this shot of mine during the pre-production of SHIVA, my assistant Siva Nageshwar Rao advised me not to get fixed up about shots as it might not be always practically possible to do things on location the way one imagines while writing the script. He pointed out that it’s possible that the height of the crane might not match up to the height of the name-board of the college. Or if the board is too high we have to tilt the camera up and we will only see the sky in suggestion and not the college, and if it’s too low and you have to tilt down, either you will see the ground instead of the college or the travel downwards to the wheel in the foreground might not be enough.
That however simplistically it might sound, was technically the first lesson I learnt in terms of the complex practicalities of the shooting of a film on location. The difference between how much would you be compromising versus how stuck you are about what you imagined has a very thin line. In the case of the college name-board after Nageshwar Rao’s input I spoke to the art director Tarani to adjust the board height to the exact desired height.
Siva Nageshwar Rao was technically my assistant but I started off my career as being his assistant in the making of “Rao Gari Illu”, the director of which was Tarani. Nageshwar Rao never trusted me enough to give me a responsible job because I was the producer’s recommendation candidate. But in the course of filming he kind of warmed up to me as he might have felt that I am a little more than just the producer’s recommended candidate. So when I got the break for “SHIVA” I requested Nageshwar Rao to assist me.
So my assistants were Siva Nageshwar Rao, Krishna Vamsi, Teja and Uttej. Teja, I met him as a camera assistant of Maheedhar the cameraman of “Rao Gari Illu”. Both Krishna Vamsi and Uttej were kind of recommended by Nageshwar Rao.
From the time I was trying to get a break till I reached “Rao Gari Illu” I was able to impress the producers Venkat and Surendra so much that they were giving me, an assistant, more importance than the director himself which obviously was not taken too kindly by the rest of the assistants of that film let alone the director. They used to think that I am just conning the producers with my English and high funda talk which was partly true but what was also true is that my high funda talk had enough material in it to convince the producers to give me a break.
It was very rare during those days that you could be an assistant who can talk English and that used to intimidate them. What also used to intimidate them was my knowledge of English films and also filmmaking techniques which I picked up by voraciously reading “American Cinematographer” magazines which used to lie around in Annapurna Studio’s store room and read by nobody but me.
Coming back to Siva Nageshwar Rao, after all the confidence and my supposed knowledge with which I convinced the producers and Nagarjuna by the time we reached the production stage, on the first day of the shoot I didn’t know how to call for the shot. I just became blank with so many people on the set and so many things happening and Siva Nageshwar Rao from behind was whispering in my ear to call for “start, camera” and to say “sound” and then “action”. So my first day shoot went on by mostly being prompted by Siva Nageshwar Rao.
The cameraman Gopal Reddy after finishing lighting shouted “Order, Sir”, which I took as he wants order on the set and I also repeated after him by shouting “Order, Sir”. Across the set Siva Nageshwar Rao gave a dirty look at me, took me aside and said, “He is asking you to order him to take that shot and that’s why he is saying ‘Order, Sir’ and since you are the ‘Sir’ here, how can you yourself again shout ‘Order, Sir’”. Sheepishly nodding I followed Siva Nageshwar Rao’s instructions.
And this is what I call as being an assistant to an assistant to an assistant.
P.S: Later on I produced “Money” with Siva Nageshwar Rao as director.
ఈ సినిమా పేరు నేనింతకు ముందు వినలేదు. డివిడి కవర్ డిజైన్ చూడగానే అట్రాక్ట్ అయ్యాను. యాక్టర్స్ ఎవ్వరన్నది పట్టించుకోకుండానే కొనేశాను. రాత్రి వంటి గంటకు మొదలు పెట్టాను. ఇక ఆపటం నా తరం గాలేదు పూర్తయ్యేవరకు.
పరేష్ రావెల్, ఓంపురి ప్రధాన పాత్రధారులు. కొన్ని సీన్లలో గాంధీ గారి మనవడు తుషార్ గాంధీ ని చూడచ్చు. తప్ప మిగతా నటులెవ్వర్ని చూడలేదు. కాని ప్రతీ పాత్ర తీర్చి దిద్దినట్లున్నాయి ఓ ఇంగ్లీష్ సినిమా లోలాగా.
పరేష్ హష్మత్ భాయ్ పాత్రకు ప్రాణం పోశాడు. పాలిటిక్స్ లేకపోతే బెష్ట్ యాక్టర్ అవార్డ్ ఇవ్వచ్చు; మిగతా ఏ పాత్ర అతని దరిదాపులకి కూడా రాలేదు. అన్ని విభాగాలు చక్కగా రాణించాయి.
మెకానిక్ హష్మత్ కి ఓ రోజున మ్యూజియం నించి ఓ అరవై ఏళ్ళ పాత ఫోర్డ్ ట్రక్ ఇంజన్ రిపేర్ కి పంపిస్తారు. అతనో ముస్లిమ్ అసోసియేషన్ కి జనరల్ సెక్రటరీ. ఈ లోగా కొన్ని ముస్లిమ్ గొడవలు వచ్చి ప్రెసిడెంట్ ఓంపురి మేనల్లుడు యాక్సిడెంటల్ గా చనిపోతాడు. దానికి ప్రభుత్వమే కారణమంటూ ముస్లిమ్ లంతా తమ షాప్ లన్నీ కొన్ని రోజుల పాటు బంద్ చేస్తారు హష్మత్ తో సహా. అప్పుడు హష్మత్ ని టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చెయ్యటానికి వస్తారు. ఆశ్చర్య పోయిన అతనికి అప్పుడు అసలు విషయం తెలుస్తుంది, మన ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా కొన్ని గాంధీ గారి అస్తికలు అలాగే ఓ బాంక్ లాకర్ లో మిగిలిపోతాయి. అవి అందుకున్న తుషార్ వాటిని సకల మర్యాదలతో అలహబాద్ లో నిమజ్జనం చెయ్యాలనుకుంటాడు. దానికి అరవై ఏళ్ళ క్రితం వాడిన ఫోర్డ్ ట్రక్ నే వాడాలని కోరుతాడు, దాని ఇంజనే మన హష్మత్ భాయ్ దగ్గర్ ఉంది. ఆరోజు అతి దగ్గరలోనే ఉంది.
మౌలా మరి ఇతర ముస్లీమ్ లు అతని షాప్ తెరిచి ఇంజన్ రిపేర్ చెయ్యటానికి ఒప్పుకోరు. బహిష్కరిస్తామని బెదరిస్తారు. కాని ఆ ఇంజన్ ని హష్మత్ తప్ప ఇంకెవ్వరు రిపేర్ చెయ్యలేరు. మరి హష్మత్ దీన్ని ఎలా పరిష్కరించాడన్నదే మిగిలిన కధ.
అమిత్ రాయ్ డైరక్షన్ అమిత్ ఛడ్దా ప్రొడ్యూసర్. హాట్స్ ఆఫ్ గయ్స్. ఫిక్షన్ అండ్ హిష్టరీ ని చక్కగా మిక్స్ చెయ్యగలిగినందుకు, ఈ సినిమా తీసే సాహసం చేసినందుకు.. నితిన్ గుప్తా, ప్రేమ్ హరియా ల మ్యూజిక్.. పాటలు కొన్ని సూఫీ స్టయిల్. వైష్ణవ జనతో రీమిక్స్ చేశారు. ఓవరాల్గా అన్నీ వినబుల్ సాంగ్సే..
ఇండియా లో తప్ప మిగతా అన్ని చోట్లా ప్రశంసలు పొందిన సినిమా నే. కాన్స్ లో స్టాండింగ్ ఒవేషన ట.
ప్లీజ్ సీ దిస్ మూవీ.. లెటజ్ బీ సపోర్టివ్ టు బాలీవుడ్ ఫర్ మేకింగ్ సచ్ ఎ గుడ్ అన్డ్ బోల్డ్ మూవీ….
ఇప్పుడే 82 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ముగిసింది. అవార్డు గ్రహీతలకు నవతరంగం అభినందనలు.
// Best Picture Actor in a Leading Role Actor in a Supporting Role Actress in a Leading Role Actress in a Supporting Role Animated Feature Film Art Direction Cinematography Costume Design Directing Documentary Feature Documentary Short Film Editing Foreign Language Film Makeup Music (Original Score) Music (Original Song) Short Film (Animated) Short Film (Live Action) Sound Editing Sound Mixing Visual Effects Writing (Adapted Screenplay) Writing (Original Screenplay)
ఇప్పుడు కాదు లెండి 12 ఏళ్ళ వయసులో మద్రాసులో తప్పిపోయాను. ఇది నా జీవితంలో మరిచిపోలేని అనుభవం. అందుకనే మీతో పంచుకుంటున్నాను.
అవి నేను ఏడో తరగతి రోజులు. మా పెద్దక్కకి పెళ్ళి కుదిరింది. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా ఓ పిడుగులాంటి వార్త. మా తాతకి (మా అమ్మ వాళ్ళ నాన్న) క్యాన్సర్ మొదటి దశలో ఉందని తేలింది. పెళ్ళికి ముందే ఆసుపత్రికి వెళ్ళమంటే వెళ్తే ఏం చెప్తారో అనే భయంతో మా తాత అంగీకరించలేదు. పెళ్ళయిన తర్వాత హాస్పిటల్ కు వెళితే ఏమైపోయినా పరవాలేదన్నాడు. అలాగే పెళ్ళైపోయింది. మాకు దగ్గర్లో ఉన్న తిరుపతిలో, నెల్లూరులో దానికి తగ్గ చికిత్సలులేవు. ఒకవేళ చేయించాలన్నా ఎక్కడనుంచో వైద్యులొచ్చి చికిత్స చేయాలి కాబట్టి బాగా ఖర్చుతో కూడిన పని. మాకు అంత ఆర్థిక స్థోమత లేదు. ఇలా ఉంటే ఇది వరకే క్యాన్సర్ కు చికిత్స తీసుకున్న మా ఊరి వాళ్ళలో ఒకాయన మద్రాసు వెళ్ళమని సలహా ఇచ్చారు.
మద్రాసు అడయార్ ఆసుపత్రిలో అయితే ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచితంగా వైద్యం చేస్తారని అక్కడ చేర్పించాం. నేనూ, మా అమ్మ, మా అక్కవాళ్ళిద్దరు, ఇంకా మా ఊరివాళ్ళు ఓ నలుగురు కలిసి మద్రాసుకు బయలు దేరాం. అందరు బస్సులో వెళ్ళాలంటే చార్జీలు ఎక్కువౌతాయని రైలులో వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. రేణిగుంటలో మాకు తెలిసిన రైల్వే ఉద్యోగితో కలిసి వెళితే కొద్దిమంది ఆయన పాస్ మీద వెళ్ళచ్చని ఆయన్ని కూడా మాతో రమ్మన్నాం.
మద్రాసుకెళ్ళి మా తాతను చూశాం. అప్పుడు ఆయనకి కీమోథెరపీ చికిత్స జరుగుతోంది. మాకు ఓ మహానగరానికెళ్ళడం అదే కొత్త. ఇంక మనం ఈ మహానగరాన్ని చూడ్డానికి ఎప్పుడు వస్తామో ఏమో అని అందరం కలిసి గోల్డెన్ బీచ్ చూద్దామనుకున్నాం. అంతా చూసుకుని సాయంత్రం మళ్ళీ ఆస్పత్రికెళ్ళి మా తాతనొకసారి చూసేసి ఊరెళ్ళిపోదామనుకున్నాం.
గోల్డెన్ బీచ్ నుంచి అడయార్ కు రావడానికి 1J అనే బస్సు ఎక్కాం. బస్సులో నాకు కిటికీ పక్కనే సీటు దొరికింది . నా పక్కనే ఆ రైల్వే పెద్దాయన కూర్చున్నాడు. అప్పటిదాకా మా పల్లెటూరు, పక్కన శ్రీకాళహస్తి తప్ప మిగతా ఊళ్ళు ఎలా ఉంటాయో ఎరగని నేను ఆ పెద్ద పెద్ద భవనాలు, విశాలమైన రోడ్లు, ఎడతెరిపిలేని వాహనాలు, డబుల్ డెకర్ బస్సులు మొదలైన మహానగరపు వింతలు, విడ్డూరాలు చూడ్డంలో మునిగిపోయా.
కొద్దిసేపటి తర్వాత నా పక్కన ఉన్న పెద్దాయన ఎవరో వస్తే వాళ్ళను పలకరించడానికన్నట్లు లేచి సీటిచ్చాడు. సరే ఎవరో తెలిసిన వాళ్ళేమో అనుకున్నాను. కానీ రాబోయే స్టాపే దిగాల్సిన స్టాపని నాకప్పుడు తెలియలేదు. కాసేపటి తర్వాత బస్సులో కలియజూస్తే ఇంకేముంది?. బస్సులో నాకు తెలిసిన ఒక్క మొహం కూడా కనిపించలేదు.
ఏడుపు మొహం పెట్టుకుని మా అమ్మవాళ్ళనెవరైనా చూశారా అని అందర్నీ అడగడం మొదలుపెట్టాను. అసలే తమిళులకు భాషాభిమానం జాస్తి. నాకేమో తెలుగు తప్ప వేరే ఏ భాష రాదు. అప్పుడు ఏడో తరగతి పబ్లిక్ పరీక్షలకోసం బట్టీ పట్టిన వాటీజ్ యువర్ నేమ్, వాట్ ఆర్ యు స్టడీయింగ్ లాంటి ప్రశ్నలు సమాధానాలతో సహా గుర్తుకొచ్చాయి.
వాటికి సమాధానాలన్నీ ఒక పేరాగ్రాఫ్ లాగా మనసులోనే తయారు చేసుకుని కొంచె చదువుకున్నాయనలా కనిపిస్తున్న దగ్గరికెళ్ళి ఏకరువు పెట్టుకున్నాను. ఆ మహానుభావుడికి నా తిక్క ఇంగ్లీషు ఏం అర్థమైందో ఏమో.. ఇంకా కొన్ని ప్రశ్నలడిగాడు. వాటికి సమాధానాలివ్వడం నాకు తెలియక
గ్రాండ్ ఫాదర్, క్యాన్సర్, అడయార్ హాస్పిటల్, సీ, మదర్, సిస్టర్స్, మిస్సింగ్ అని నాకు తెలిసిన ఇంగ్లీషు పదాలన్నీ ఒక వాక్యంలాగే కలిపేసి చెప్పేశాను.
ఆయనకి కొంచెం అర్థమై బస్సులో నాతో పాటే అక్కడే దిగేసి వేరే బస్సులో అడయార్ హాస్పిటల్ దగ్గర దింపాడు. కానీ ఆ హాస్పిటల్ మా తాత ఉండే హాస్పిటల్ లాగా కనిపించడం లేదు. ఆయన నన్ను ఆ గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆయనకు తెలుగు వచ్చు. తెలుగు వాళ్ళు కనిపించేసరికి నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆయన దగ్గర నా గోడంతా వెళ్ళబోసుకున్నాను.
“ఇంత పెద్ద మహానగరంలో అంత పరాకుగా ఉంటే ఎలా?” అని సున్నితంగా మందలించాడు నన్ను. మేం వచ్చింది అడయార్ కొత్త హాస్పిటల్ కనీ, ఇంకొంచెం ముందుకెళితే పాత హాస్పిటల్ వస్తుందనీ మా తాత అక్కడే ఉంటాడనీ చెప్పాడు. దాంతో నాకు మనం సరైన చోటుకే చేరుకున్నామనే నమ్మకం వచ్చింది. నన్ను అక్కడి దాకా తీసుకువచ్చినాయన అంతటితో ఆగకుండా పాత హాస్పిటల్ దాకా తీసుకుని పోయి మా తాత దగ్గర దిగబెట్టాడు. మా తాత కళ్ళనీళ్ళతో రెండు చేతులెత్తి అతనికో నమస్కారం చేశాడు. ఆయన ఆ చేతుల్ని కిందకు దించమని వారించి వెళ్ళిపోయాడు. ఆయనే గనక లేకపోతే నేనేమయ్యే వాడినో!
ఇదిలా ఉంటే బస్సులో నన్నొదిలేసి దిగేసిన ముసలాయన అజాగ్రత్తను గురించి అందరూ కాసేపు తర్జన భర్జలు పడి వెతుకులాట ప్రారంభించారు. దారిలో కనిపించిన వాళ్ళనంతా అడగడం మొదలు పెట్టారు. లాభం లేదు. వెతికి వెతికి విసిగి పోయి ఆసుపత్రికొచ్చి మా తాతకు విషయం చెప్పి టీవీల్లో, వార్తా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని నిర్ణయించుకునేశారు. అలా అక్కడికి వచ్చేసరికి నేను కనిపించాను. అప్పుడు వాళ్ళనుభవించిన భావన నేను మాటల్లో వర్ణించలేనిది. అసలే లేక లేక కలిగిన మగ సంతానాన్ని. వరప్రసాదంగా పుట్టానట. నేను పుట్టిన తర్వాత తిరువళ్ళూరు వీరరాఘవుల స్వామికి నా బరువు ధనం తూచి ఇచ్చారట. ఇంత సేపు ఎలా తట్టుకునిందో మా అమ్మ నేను కనిపించానని తెలియగానే నడిరోడ్డు మీదనే స్పృహ తప్పి పడిపోయింది. అక్కడుండే వాళ్ళంతా ఏం జరిగిందోనని ఆసక్తిగా చూస్తున్నారు. మా అక్కవాళ్ళిద్దరు వచ్చి చెరో పక్కన కూర్చున్నారు.నేనెళ్ళి ఒళ్ళో పడుకుని కాసేపు గట్టిగా కౌగలించుకుని మొహం మీద నీళ్ళు చల్లితే గానీ లేవలేదు.
ఆ ముసలాయన “ఎంత పని జేసినావురా బాబూ! హాఫ్ ఏసినా ఫుల్లుగా ఎక్కేసేది, ఫుల్లేసినా ఎక్కలేదు గదరా నాయనా” అని పరాచికాలాడినాడు వాతావరణాన్ని తేలిక పరచడానికి
అందరూ పెద్దగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు సాయంత్రమే ఊరికెళ్ళిపోయాం. మరుసటి రోజు నుంచి మా తాత జ్వరంతో మంచమెక్కి వారం రోజులపాటు లేవలేదని తెలిసింది. ఈ సంగతి ఎప్పుడు గుర్తు చేసుకున్నా మా ఇంట్లో వాళ్ళు అదో రకమైన ఉద్వేగానికి లోనైపోతుంటారు.
నాకు బాగా నచ్చే సినిమాల్లో, జంధ్యాల తీసిన ’నెలవంక’ ఒకటి. ఇన్నాళ్టికి మొదటిసారి ఈసినిమాని మోసర్బేర్ పుణ్యమా అని పూర్తిగా చూడగలిగాను. ఎప్పట్లాగే – I am still in love with it.
చాలామంది జంధ్యాల సినిమాలంటే – ’ఆహ నా పెళ్లంట’, ’వివాహభోజనంబు’, ’చూపులు కలసిన శుభవేళ’ – ఇలా కామెడీలనే గుర్తుపెట్టుకుంటారు. నేను మాట్లాడిన వాళ్ళలో తొంభై శాతం మంది ’నెలవంక’ అన్న ఒక సినిమా ఉంది అంటేనే తెలీదన్నవారు! ఇది జంధ్యాలకి కేవలం నాలుగో సినిమా అంటే – మొదటిసారి నమ్మడం కష్టమైంది.
ఈ సినిమా ప్రత్యేకతలు దానివి. తెలుగుతో పాటు ఉర్దూలో టైటిల్ వేసి, ఉపోధ్ఘాతాన్ని తెలుగు-ఉర్దూల్లో చెప్పి – వీలైనంత వరకు ముస్లిం జీవితాన్ని ఆథెంటిగ్గానే చూపాము, తప్పులుంటే క్షమించండి – అని డిస్‍క్లైమర్ పెట్టిన తెలుగు చిత్రాన్ని నేనెప్పుడూ చూళ్ళేదు. అలాగే, గాంధీగారికి అంకితమిచ్చిన చిత్రం కూడా.
కథ: ’హిందు-ముస్లిం’ భాయి భాయి కాన్సెప్టు. (కథ మీకెక్కడైనా దొరుకుతుంది. అమూల్యమైన నా అభిప్రాయాలు (హీహీహీ) నేనే చెప్పగలను కనుక, నా పాయింటుకొచ్చేస్తున్నా.
నటీనటులు: ’శంకరశాస్త్రి’ గా నటించిన సోమయాజులుగారిని, రహీంగా చూపాలన్న ఆలోచన రావడమే ఒక సాహసమని నాకనిపిస్తుంది. కానీ, ఆయన భలే కుదిరారు ఆ పాత్రకి. గుమ్మడి గారికి, సోమయాజులు గారికి మధ్య దృశ్యాల్లో నాకు ఇద్దరూ చాలా నచ్చారు. ఇక, తక్కిన వారిలో, నాకు అందరికంటే నచ్చింది – అలీ. రాజేష్-తులసి-రాజ్యలక్ష్మి : వీళ్ళెవరూ నాకు పెద్దగొప్పగా అనిపించలేదు (అసలా మొదటి ఇద్దరిపై జంధ్యాలకెందుకంత లవ్వో అర్థం కాదు!) ఇక, గుర్రం – గుర్రం చేత కూడా నటింపజేసారీ సినిమాలో!! రాజ్యలక్షి భర్తగా, తులసిని ప్రేమించినవాడిగా వేసినతను – మహా చిరాగ్గా ఉన్నాడు. ’అసలా ఫేస్ నచ్చలేదు నాకు’ – మరో జంధ్యాల డైలాగే వాడుతున్నా.
నచ్చిన సంగతులు:
- తోలుబొమ్మలాట దృశ్యాలు. ముఖ్యంగా, సీతమ్మవారి బొమ్మ మాట్లాడ్డం మొదలుపెట్టగానే సాక్షిరంగారావు బీడీ ఆపేసి భక్తితో వినే దృశ్యం
-రామాయణంలో పాదుకల కథ చెబుతూ – “అందుకే పాదుకలు రాముడికి దూరమయ్యాయి” అని చెప్పి నిట్టూరుస్తూ సోమయాజులు గుమ్మడివాళ్ళ భవంతివైపుకి చూసే దృశ్యం.
-’ఏది మతం, మనకేది హితం’ పాట తీసిన విధానం. మనకెన్నో సమస్యలున్నాయి అని చూపుతూ, ఇప్పుడు మతం అంత ముఖ్యమైన సమస్యా? మిగితావి పట్టించుకోవచ్చుగా అని ప్రశ్నించే సన్నివేశం
-జనం అమాయకత్వాన్ని, మూడభక్తిని ఆసరాగా తీసుకుని ఈ సినిమాలో రెండు పాత్రలు – కొత్త దేవుణ్ణి సృష్టించే దృశ్యం.
(ఈ సినిమా వచ్చి ఇరవైఏడేళ్ళైనా ఇంకా పై రెండూ జరుగుతూనే ఉన్నాయంటే ఏమనాలో తెలియట్లేదు!!)
-తులసి మతం మార్చుకునే దృశ్యం. మొదటిసారి ఈ దృశ్యం చూసినప్పుడు అవాక్కయ్యా. కొన్ని సెకన్లు పట్టింది ఆ దృశ్యాన్ని జీర్ణించుకోడానికి. (అప్పటికి నాకు ఇరవైలోపే. ఒక పట్టాన ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాన్లెండి.)
-’కనుబొమ్మల పల్లకిలోన’ పాట తీసిన విధానం ( ఈ సినిమాలో పిక్చరైజేషన్ పరంగా నాకు నచ్చిన ’ప్రేమ’ పాట ఇదొక్కటే!)
-సినిమా టైటిల్స్ సమయంలో – నటీనటుల పేర్లు వేస్తూ, ఒక దగ్గర మీ … జంట అని రాసి మధ్యలో సుత్తి బొమ్మ పెట్టేరు నవ్వొచ్చింది. అలాగే, ఈ సినిమాలో వేలు వీరభద్రరావుకి మేకులు దించడం – రోల్ రివర్సల్ బాగుంది.
నచ్చని సంగతులు మరియు పిడకలవేట:
-ఈసినిమాకి సుత్తి ద్వయం అనవసరం అనిపించింది. ఏదో హాస్యం కావాలి కనుక పెట్టినట్లుంది. అంతమటుకు బానే ఉంది కానీ, చివరాఖర్లో ’ఈగొడవకి కారణం మనమని తెలిస్తే, మనల్ని బ్రతకనివ్వరు’ అనుకుని సుత్తివేలు ఊరు వదలాలనుకుంటున్నట్లు చూపడం అనవసరం ఏమో అనిపించింది. ఒక కామెడీ ట్రాక్ గా అంతా బానే ఉంది కానీ, ఈ సినిమాలో భాగంగా నాకేమిటో అంత నచ్చలేదు.
-ఇక ’ఏది మతం …’ పాట సోమయాజులు, ఇతర ముస్లిం సోదరులు ఈ అసలు ఊర్లోకొచ్చేసి ఎలా పాడారో ఏమిటో. అప్పుడు కథ ప్రకారం వీళ్ళంతా చెరువుదాటి ఈవలి తీరానికి రాకూడదు కదా?
-తులసి ప్రియుడి పాత్రకు ఆ కుర్రాడు కాక ఎవర్నో పెట్టి ఉండాల్సింది.
-ఎందుకోగానీ, జంధ్యాల గారు పాటల చిత్రీకరణపై అంత శ్రద్ధ పెట్టరనిపిస్తుంది. ఆ కుర్రాడు (పైలైను వాడు) – వాడికి చేతకానప్పుడు వాడి చేత డాన్సులూ అవీ వేయించి ఎందుకు మన ప్రాణాలు తీయడం – అని చిరాకేసింది (ఏమిటో లెండి, అతన్ని తల్చుకుంటేనే నచ్చట్లేదు నాకు!!) పాటల ఐడియాలు బానే ఉన్నా – చిత్రీకరణ నచ్చలేదు నాకు. సంగీతం వినసొంపుగానే ఉండింది.
-ఇక సినిమాని గుమ్మడి-సోమయాజులు ల మరణ దృశ్యంతో ఆపేసి ఉండాల్సిందనిపించింది. మళ్ళీ మన రాజేషు ఆవేశపడి జనాల్ని ఆవేశపెట్టే మాటలనడం – అనవసరం ఏమో. (మన్లోమన మాట -నాకు ఇతగాడు కూడా పెద్దగొప్పగా అనిపించలేదు)
కొన్ని డైలాగులు:
“”వెళ్ళుబాబూ వెళ్ళు. మందిస్తారు. వెళ్ళి నీ అదృష్టాన్ని పరీక్షించుకో” - సుత్తివేలు వద్ద మందు తీస్కోడానికి వచ్చిన వ్యక్తితో వీరభద్రరావు
సుత్తివేలు “సుత్తి” మొదలు పెట్టగానే వీరభద్రరావు: “దించకండి. మెదడులో మేకులు దించకండి…” అంటాడు. ఇంతలో, ఒక పేషంటు అరుస్తాడు మందుకోసం. దానితో ఇతను: “బాబూ, మేకలా అరిచి, మేకుల బారినుంచి కాపాడావు..” అంటాడు.
“మా ముందు తరం వాళ్ళు చెప్పిన మాట నిజంకాదని తెలిసినా అబద్ధమనలేము. మీ తరం వారు చెప్పిన మాట అబద్దం కాదని తెలిసినా నిజమనలేము” -తరాల అంతరం గురించి గుమ్మడి డైలాగ్.
“ఎక్కడున్నాడయ్యా దేవుడు? ఉన్నాడనుకున్నవాడి మనసులోనూ, లేడనుకున్న వాడి మాటలోనూ ఉన్నాడు దేవుడు”
“’రహీం శారదా అని పెరెట్టాడా?” - గుర్రానికి రహీం శారద అని పేరుపెట్టడం గురించి గురవయ్య వ్యాఖ్య.
“తూ ఆకే ఖానా ఖావో రే..” సినిమా మొదట్లో సోమయాజుల్ని వాళ్ళమ్మ (ఆవిడ పేరు గంగారత్నం ట, వికీ చెప్పింది) పిలిచే పద్ధతి – నాకు తెగ నచ్చేసింది. నవ్వుకుంటూనే రాస్తున్నా ఈ వాక్యం కూడా.
“శివుని జటను వెలిసినది..మా జెండా నిలిపినదీ…ఒకటే నెలవంక
ఇక మన చూపులేల నేలవంక…” (ఏది మతం, మనకేది హితం – పాటలోని వాక్యం)
- మీరెవరన్నా చూడకుంటే తప్పక చూడండి. మన సినిమా దురదృష్టం – ఈసినిమాని అప్పట్లో ప్రేక్షకులు ఆదరించలేదట!! ఎందుకని ఈ సినిమా ఎక్కువ మందికి తెలీకుండా పోయిందో మరి! పులగం చిన్నారాయణ గారి ’జంధ్యామారుతం’లో కూడా ఈపుస్తకాన్ని గురించి ఎక్కువ రాయలేదనుకుంటాను… (నేను పొరబడి ఉండవచ్చు. ఆ పుస్తకం చివరిసారి చూసి చాలారోజులైంది).