Left

ఆయన వీసినా? వీళ్ళు లెక్చరర్లా?

ఉస్మానియా యూనివర్సిటీలో వాల్యూయెషన్ కి వచ్చిన లెక్చరర్లను విద్యార్ధులు చెప్పులతో కొట్టడం చానల్స్‌లో అందరూ చూసే ఉంటారు. ఇంగిత జ్గ్యానం ఉన్నవాళ్ళెవరైనా దీనిని ఖండిస్తారు. వాళ్ళ దుశ్చర్య టివీలో స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్ధ్యులు దాడి చేయలేదని కేవలం బెదిరించారని తెలంగాణా పులకేసి చెప్పుకొచ్చాడు. వారికి కనీస ఇంగిత జ్గ్యానం లేదని అందరికీ తెలిసిందే. కానీ సదరు వీసీకి కూడా మెదడు అరికాలినుండీ మోకాలుకు చేరిపోయిందదని అనిపిస్తోంది. ఎందుకంటే జరిగిన దానిని తప్పు అని చెప్పే దమ్ము లేకపోయినా, వారిపై చర్య తీసుకునెందుకు మనసు రాకపోయినా పర్వాలేదు, కానీ దీనిని మీడియా దుశ్చర్య అని మీడియా అనవసర ప్రచారం చేసిందని చెప్పడం సిగ్గుమాలిన తనం. తెలంగాణా గొడవల్లో కూడా మీడియా అదే పాత్రను పోషించింది. సదరు వీసీని ఎవరైనా చెప్పులతో సత్కరించి ఉంటే వీరికి అభిమానం అంటే ఏమిటో తెలిసి ఉండేది. పైగా విద్యార్ధులకు నష్టం జరగకుండా వీరు చూస్తారుట. అంటే దీని అర్ధం ఆంధ్రా ప్రాంతం నుండీ వచ్చిన లెక్చరర్లు వీరికి నష్టం కలుగ చేశారనా వీరి ఉద్దేశ్యం? తోటి లెక్చరర్లను చెప్పులతో కొడితే సానుభూతి తెలపవల్సింది పోయి విద్యార్ధులపై కేసులనెత్తి వేయాలని అక్కడి లెక్చరర్లు ఆందోళన చేశారట. వీళ్ళు లెక్చరర్లా? వీళ్ళ బతుకులు చెడ! వీసి పదవికి, లెక్చరర్ మాటకి తలవంపులు తీసుకు వచ్చారు. ఇంతకన్న వెధవలు ఉండరేమో? చదువుకున్నవాళ్ళే ఇలా చస్తే, చదువు లేనివాళ్ళు మరింత మూర్ఖంగా ప్రవర్తించడం పెద్దవిషయం కాదేమో? ఇది కేవలం కాష్టాని రగిలించడానికి చేసిన ప్రయత్నమేగానీ మరోటి కాదని అనిపిస్తోంది. దానిలో కిరాయి విద్యార్ధులతోబాటు లెక్చరర్లు చేరడమే మారుతున్న విలువలకు నిదర్శనం.
Categories: Left

ఫొటో జవాబు

http://srikaaram.wordpress.com/feed - Tue, 08/31/2010 - 00:41

ఏండ్ర్యూ స్ట్రాస్

సరైన సమాధానం ఇచ్చిన వారు:

karthik
karthikeya.iitk@gmail.com


Categories: Left

త్వరణానికి గురుత్వానికి ఏంటి సంబంధం?





కనుక వేదిక మీద ఉన్న భౌతిక పరిస్థితులకి, వేదిక బయట ఉన్న పరిస్థితులకి మధ్య తేడా ఏంటని ఆలోచిస్తే, వేదిక మీద కేంద్రం నుండి దూరంగా నెట్టి వేస్తూ, పరిధి వైపుగా ఆకర్షిస్తూ ఏదో బలం పనిచేస్తోందని అర్థమవుతుంది. వేదిక మీద కనిపించే విచిత్రమైన ఫలితాలన్నిటికీ ఆ బలమే కారణం అని అనుకోవడంలో ఆశ్చర్యం లేదు.

కాని ఆలోచిస్తే ఇది నిజంగా ఏదో కొత్త బలం అని అనుకోవాలా? అలాంటి బలం వేదిక బయట, నిశ్చలంగా ఉన్న నేల మీద ఉండదనా? గురుత్వం అనే బలం వల్ల భూమి కేంద్రం దిక్కుగా భూమి మీద ఉన్న వస్తువులన్నీ ఆకర్షింపబడతాయని మనకి తెలిసిందే. అయితే వేదిక విషయంలో వేదిక పరిధి దిక్కుగా ఆ ఆకర్షణ పని చేస్తోంది, భూమి విషయంలో భూమి కేంద్రం దిక్కుగా ఆ ఆకర్షణ పని చేస్తోంది – అంతే తేడా. రెండు సందర్భాల్లోను బల క్షేత్రం యొక్క విస్తరణలో తేడా ఉందంతే. బలం యొక్క లక్షణంలో కాదు. సమవేగంతో సాగని చలనం వల్ల గురుత్వ క్షేత్రాన్ని పోలిన ఓ “కొత్త బలం” పుట్టుకొస్తుందని చెప్పడానికి మరో ఉదాహరణ ఇవ్వొచ్చు.

తారాంతర యాత్రల కోసం రూపొందించిన ఓ అధునాతన వ్యోమనౌక అంతరిక్షంలో ఎక్కడో ఒంటరిగా, దరిదాపుల్లో తారలు లేని శూన్య ప్రాంతంలో ఉందని అనుకుందాం. చుట్టు పక్కల పెద్ద వస్తువులేమీ లేవు కనుక ఆ నౌకలో గురుత్వమే తెలియదు. నౌకలో ఉన్న వస్తువులు, సిబ్బంది, పరిశీలకులు అంతా అలా శూన్యంలో తేలిపోతూ ఉంటారు. అసలు వాళ్ల బరువు వాళ్లకే తెలీదు! ఇలాంటి పరిస్థితినే ప్రఖ్యాత కాల్పనిక విజ్ఞాన రచయిత జూల్స్ వెర్న్ తన ’చంద్రయానం’ పుస్తకంలో వర్ణిస్తాడు.

ఇప్పుడు ఉన్నట్టుండి వ్యోమనౌక ఇంజెన్లని ’ఆన్’ చేశాం అనుకుందాం. రాకెట్ కదలడం మొదలెడుతుంది. క్రమంగా వేగం పుంజుకుంటుంది. అప్పుడు నౌకలోని వస్తువులన్నీ నౌక కదులుతున్న దిశకి వ్యతిరేక దిశలో కదలడం మొదలెడతాయి. మరోలా చెప్పాలంటే నౌకలోని నేల పైకి, అంటే ఆ వస్తువుల దిక్కుగా కదులుతున్నట్టు అనిపిస్తుంది. అలాంటి నౌకలో నేల మీద నించున్న ఒక పరిశీలకుడు, తన చేతిలో ఓ ఆపిల్ పండుని పట్టుకుని, ఉన్నట్టుండి ఆ పండుని వదిలేశాడని అనుకుందాం. నౌక సమవేగంతో కదులుతున్నట్లయితే, పండు కూడా నౌకతో బాటు కదులుతూ ఉంటుంది. కాని నౌక త్వరణం చెందుతోంది కనుక, దాని వేగం పెరుగుతూ ఉంది కనుక, పండు నేల దిక్కుగా కదలడం కనిపిస్తుంది. దీన్నే నౌక పరంగా వర్ణించాలంటే, నౌక యొక్క నేల వేగం పెరిగి పెరిగి ఒక దశలో పండుని చేరుకుని దాన్ని ఢీ కొంటుంది. అలా నేలని ఢీ కొన్న (లేదా నేల చేత ఢీ కొట్టబడని) ఆపిల్ పండు, ఒకటి రెండు సార్లు వెనక్కి తుళ్లినా, కాసేపయ్యాక నేలకి అదమబడి, నేల మీదే “నిశ్చలంగా” ఉండిపోతుంది.

ఈ తంతంతా చూస్తున్న పరిశీలకుడి దృష్టిలో ఆపిల్ కేవలం “కింద పడిపోయింది” అంతే. ఆపిల్ కి బదులుగా వివిధ వస్తువులని చేతిలోంచి వొదిలేసి చూసుకుంటాడు పరిశీలకుడు. అన్ని వస్తువులూ ఒకే త్వరణంతో నౌక యొక్క నేల దిశగా “పడుతున్నాయని” అర్థం చేసుకుంటాడు. వస్తువు బరువు ఎక్కువైనా, తక్కువైనా దాని త్వరణం మాత్రం ఒకలాగే ఉంటుంది. అది చూసిన పరిశీలకుడికి వెనకటికి గెలీలియో గెలీలీ చేసిన ప్రయోగం గుర్తొస్తుంది. (గెలీలియోకి పూర్వం అరిస్టాటిల్ చేసిన బోధల ప్రభావం వల్ల బరువైన వస్తువులు వేగంగాను, తేలికైన వస్తువులు నెమ్మదిగా పడతాయని అనుకునేవారు. కాని అలాంటి తేడాలు కేవలం గాలి ప్రభావం వల్లనే వస్తున్నాయని, గాలి లేకపోతే అన్ని వస్తువులూ ఒకే వేగంతో, లేదా త్వరణంతో పడతాయని గెలీలియో ఓ ప్రయోగం చేసి నిరూపిస్తాడు – అనువాదకుడు).

(సశేషం...)
Categories: Left

మనసున్న ప్రేమ Part 9

***        ***        ***        ***
         ఒక రోజు మధ్యాహ్నం ఇల్లు సర్దుతుండగా ఎవరో తలుపు కొట్టిన చప్పుడు అయ్యి కావ్య తలుపు తీసింది. ఎదురుగా సన్నగా పొడుగ్గా ఒక యువకుడు నిల్చుని ఉన్నాడు. 

         "మాస్టారు రమ్మని చెప్పారు అండీ" అన్నాడు. 

         "ఒక్క నిముషం ఉండండి" అని లోపలకు వెళ్ళి తల్లిని పిలవడానికి వెళ్ళింది. 

         "ఇంట్లో ఫాన్ పాడయ్యింది. బాగు చెయ్యడానికి ఎవరినో పంపిస్తాను అన్నారు నాన్నగారు. అతనే అయ్యుంటాడు. గదిలో ఫాన్ చూపించు" అంది అమ్మ. 

         "రండి మీరు బాగు చెయ్యాల్సిన ఫాన్ చూపిస్తాను" అని కావ్య అనేసరికి కంగారు పడిపోయాడు. 

         "అది కాదండి... మాస్టారు గారు అసలు" అని ఏదో చెప్పబోయాడు. తిరిగి చూసేసరికి కావ్య వెళ్ళిపోయింది. 

         తండ్రి రావడంతో బయటకు వచ్చింది కావ్య. తండ్రి ఆ వచ్చినతనితో చాలా సన్నిహితంగా మెలగడం నవ్వడం చూసి ఆశ్చర్యంగా చూసింది. 



 "ఏమ్మా కావ్య ఇతను ఎవరు అనుకున్నావు? నా స్నేహితుడు రాజారాం కొడుకు కిరణ్. ఊద్యోగ రీత్యా ఇక్కడకు వచ్చాడు. నేనే ఒక మంచి ఇల్లు చూసి పెడతాను అన్నాను. నువ్వూ అమ్మా కలిసి హడలు కొట్టేసారు కదమ్మా" అని నవ్వేసారు.

         అది విన్న కావ్య చిన్నగా నెత్తి మీద కొట్టుకుని "ఇప్పుడే కాఫి తెస్తాను" అని లోపలకు పరుగెత్తుకెళ్ళింది.

         "అయ్యో నువ్వైనా చెప్పచ్చు కదా బాబు. ఏమి అనుకోకు" అని వచ్చింది కావ్య తల్లి.

         "అదేం లేదండి పర్వాలేదు. పనిలో పని నాకు తెలిసినంతలో ఆ ఫాన్ బాగు చేస్తాను" అన్నాడు నవ్వుతూ కిరణ్.

         "భలేవాడివేనయ్యా"అని భుజం మీద తట్టి, "ఈ పూటకు ఇక్కడే ఉంటాడు వంట చెయ్యి. రేపు ఇల్లు చూపించి దింపి వస్తాను" అన్నారు కావ్య తండ్రి.

         కిరణ్ చూపులు కావ్య వైపు వెళ్ళాయి. కావ్య తప్పుగా అనుకున్నందుకు సిగ్గుతో తల దించుకొంది. కానీ కిరణ్ చూపులు మాత్రం కావ్యను వదిలి పెట్టలేదు.

         "మీ నాన్న ఎప్పుడు వస్తాడు? ఎన్ని రోజులయ్యిందో? పోనిలే నాకు ఒక మంచి కాలక్షేపం" అని కావ్య తండ్రి అన్న మాటలకు ఉలిక్కి పడి వెంటనే చూపులు మరల్చుకున్నాడు.

         "రిటైర్మెంట్ సంబంధించి అన్ని విషయాలు చూసుకొని ఇంకో వారంలో వస్తారు " అన్నాడు కావ్య కోసం వెతుకుతూ.

         రాజారాం, కావ్య తండ్రి చిన్ననాటి స్నేహితులు. చాలా రోజులు ఇద్దరు కలిసి పనిచేసారు కూడా. ఆ తరువాత వేరే ఉద్యోగాలలో చేరి దూరమయ్యారు. కిరణ్ చిన్నతనంలోనే అతని తల్లి పోయింది. అప్పటి నుండి తండ్రీ కొడుకులే ఒకరికి ఒకరై జీవిస్తున్నారు. కిరణ్ మొదటి సారిగా ఉద్యోగంలో చేరడానికి వచ్చాడు. స్నేహితులు ఇద్దరు ఈ విధంగా మళ్ళీ కలుసుకోబోతున్నారు అని కావ్య తండ్రి ఆనందానికి అవధుల్లేవు. రాజారాంకి కొడుకు పుట్టినప్పుడు కూడా తనకి కూతురు పుడితే రాజారాంకే కొడలిని చేస్తాను అని చమత్కారం కూడా చేసుకున్నారు.

         కొద్ది రోజుల్లోనే కిరణ్ కావ్య ఇంట్లో వాళ్ళకి దగ్గరయ్యి పోయాడు. చాలా హడావుడి మనిషి. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. కావ్య తండ్రి చూసిన ఇంటిలోకి కావ్య చేతి మీదుగా దీపం వెలిగించి చేరాడు. 



రెండు వారాల్లో తండ్రి రావడంతో రెండు ఇళ్ళళ్ళో రాకపోకలు ఎక్కువయ్యాయి. ఒక కుటుంబంలా కలిసిపోయారు. కిరణ్, రాజారాం రాక వల్ల కావ్య తండ్రిలో,ఇంట్లో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. కిరణ్ వచ్చి అందరి ముఖాల్లో చిరునవ్వు తెప్పించాడు, ఒక్క కావ్య ముఖంలో తప్ప.

         "ఎందుకు ఎప్పుడూ మీ అమ్మాయి ఆర్ట్ సినిమాలో హీరోయిన్ లా అలా మూతి ముడుచుకొని ఉంటుంది" అని కావ్య తల్లితో అంటూ ఉంటే కావ్య కోపంగా చూసేది.

         కొంచెం అతిగా చొరవ తీసుకోవడం, వచ్చిరాగానే సొంత ఇల్లులాగా తిన్నగా వంటింట్లోకి వెళ్ళడం, తన గురించి తెలిసినట్టు మాట్లాడం కావ్యకు బొత్తిగా నచ్చలేదు.

         కానీ కిరణ్ ఇవేమి పట్టించుకోలేదు. దేనినైనా తేలికగా తీసుకునే మనస్తత్వం అయిన వాడు కావడం వల్ల కావ్య దూరంగా ఉండాలని ప్రయత్నించినా కావ్య చుట్టూనే తిరిగాడు. అతనిలో తెలియకుండానే కావ్య అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది.

         కొద్ది రోజుల్లోనే కావ్యను చూడడానికి వచ్చిన సంబంధం వాళ్ళు కబురు పంపడంతో కావ్య తండ్రి వాళ్ళతో మాట్లాడేందుకు వెళ్ళారు. నెలరోజుల్లో నిశ్చితార్ధం చేయాలని నిశ్చయించారు.

         కావ్య తండ్రి తెలిసిన వాళ్ళందరికి చెప్పుకొని మురిసిపోయారు. ఈ విషయం రాజారాం,కిరణ్ కూ చెప్పాలని ఆత్రుతగా బయలుదేరారు. విషయం తెలియగానే రాజారాం సంతోషించినా కిరణ్ ముఖంలో మాత్రం నిరాశ కనిపించింది. "ఈ పెళ్ళి మీరే ముందుండి జరిపించాలి. నాకు నిన్ను మించి ఆత్మీయిలు ఎవరున్నారు? ఈ పెళ్ళి కాస్తా మంచిగా జరిగిపోతే నేను కన్ను మూసినా నాకు బాధ లేదు" అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు.

         "ఏమిట్రా ఇది చిన్న పిల్లాడిలా? దీనికే డీలా పడితే ఎలా? ఇదిగో చూడు మేము మీ కుటుంబమే. అంతా మంచే జరుగుతుంది. సంతోషంగా ఉండాల్సింది పోయి ఇలా బాధపడతారా?" అని దైర్యం చెప్పారు రాజారం.

         ఇంటి దగ్గర దింపి రమ్మని చెప్పడంతో కిరణ్ కావ్య తండ్రిని దింపడానికి వెళ్ళి బయటే నిలబడిపోయాడు.

         "ఎం కిరణ్ అక్కడే ఉండిపోయావు. లోపలకు రా" అని పిలిచారు కావ్య తండ్రి.


         "లేదండి మళ్ళీ ఇంకో రోజు వస్తాను" అన్నాడు కిరణ్ ఆలోచిస్తూ.

         "ఏమిటో కొత్తగా మొహమాటపడుతున్నావు. నువ్వు రాకుండా వెళ్ళిపోతే మా ఆవిడ గొడవ చేస్తుంది" అని నవ్వారు తేలికగా.

         లోపలకు వెళ్ళిన కిరణ్ ముభావంగా ఉండడం చూసి కావ్య తల్లి "ఏం బాబూ ఒంట్లో బాగోలేదా నీరసంగా ఉన్నావు?" అని అడిగింది.

         "అదేం లేదు బాగానే ఉంది" అని మాట దాటవెయ్యడానికి చూసాడు కిరణ్.

         వెళ్ళొస్తాను అని బయలుదేరిన కిరణ్ కు డాబా మెట్లు దిగుతూ కావ్య కనిపించింది. కొంచెం సేపు అలానే చూస్తూ ఉండిపోయాడు.

         "ఏమండీ కిరణ్ గారూ కాస్త తప్పుకుంటారా" అని గట్టిగా కావ్య అనడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. తను దారికి అడ్డంగా నిలిచి ఉన్నది గమనించి పక్కకు జరిగాడు.

         "మీకు ఎదో చెబుదామని అనుకున్నాను" అని ఆగిపోయాడు కిరణ్.

         "మీరు మెట్లు దిగి మీ ఇంటికి వెళ్తునట్టున్నారు" అంది కావ్య నవ్వుతూ.

         "మీ తెలివికి సంతోషించాం కానీ, అది కాదు మీకు పెళ్ళిట కదా. నేను పది రోజులు ముందే వచ్చి మాస్టారు గారికి అన్నీ సహాయం చేస్తాను" అన్నాడు కిరణ్.

         "పది రోజులా ?" అంది కావ్య కళ్ళు పెద్దవి చేసి.

         "ఎం తక్కువంటారా? పోనీ నెల రోజులు ఉంటాను సరేనా? మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారు" అన్నాడు కావాలని ఆటపట్టిస్తూ.

         "చాలా సంతోషం. త్వరగా ఇంటికి చేరుకోండి. లేదంటే మా సందు చివర కుక్కలు వెంట పడతాయి పది దాటితే. అప్పుడు నెల రోజులు పడక వెయ్యాలి మీరు" అంది కిందకు చూపిస్తూ.

         ముఖంలో భయం నటిస్తూ "వెళ్ళొస్తాను" అని గేట్ దాటాడు కిరణ్. కాస్త దూరం వెళ్ళి మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసాడు. కావ్య వచ్చే నవ్వు ఆపుకుంటు కిరణ్ వైపే చూస్తోంది. కిరణ్ మనసులో ఎక్కడో చిన్న అలజడి. 




         "ఇలా పెళ్ళి కాబోయే ఆడపిల్లవైపు చూడడం తప్పురా కిరణ్ " అని తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు.






***        ***        ***        ***
         నిశ్చితార్థం రోజు రానే వచ్చింది. రాజారాం, కిరణ్ అన్నిటికి దగ్గరుండి సహాయం చేసారు. చుట్టు పక్కల వాళ్ళని కొంతమందిని పిలిచారు. అబ్బాయి తరుఫు వారితో కలిపి ఒక ఏభై మందికి భోజనాలకి ఏర్పాటు చేసారు. కట్న కానుకలు ఏమి లేవు కాబట్టి నిశ్చితార్థం, పెళ్ళి కాస్త బాగా చెయ్యాలని ఆనుకున్నారు. ఎదురు చూస్తుండగానే పెళ్ళి వారు వచ్చారు రెండు కార్లలో.


         వచ్చిన వాళ్ళని ఆహ్వానించడానికి అందరూ బయలుదేరారు. కిరణ్ చెప్పినట్టుగానే సొంత కొడుకులా అన్ని బాధ్యతలు తీసుకొని అందరిని దగ్గరుండి చూసుకున్నాడు. వచ్చిన వాళ్ళలో పెళ్ళి కొడుకు కనిపించలేదు. నిశ్చితార్థానికి రాకపోడానికి కారణం ఏమిటా అని పెద్దవాళ్ళను వాకబు చేసారు కావ్య తండ్రి. అతనికి ఆరోగ్యం బాగోలేదు అని ఒకరు, అతనికి తెలిసినవాళ్ళకి ఏదో అవసరమొచ్చి వెళ్ళాడని ఒకరు చెప్పారు. నిశ్చితార్థం పెద్దవాళ్ళని దగ్గరుండి జరిపించమన్నాడు అని చెప్పారు. ఇదంతా వింటూ ఉంటే ఏదో అనుమానం కలిగింది. మనసు కీడు శంకించింది. కానీ మనసుని అదుపులో పెట్టుకోవాలని కావ్య తండ్రి అందరికి అన్నీ అందించడంలో నిమగ్నమయిపోయారు.


         ఇటు కావ్యను అలంకరించి కూర్చో పెట్టారు. ఏమీ తోచక కావ్య కిటికి లో నుండి బయటకు తొంగి చూసింది. కిరణ్ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు.


         "రెండు గంటల నుండి ఇలాగే ఎక్కడికి కదలనివ్వకుండా కూర్చోపెట్టారు" అని విసుక్కుంది కావ్య.


         కావ్య నానమ్మ మూతి ముడుచుకొని ఒక మూల కూర్చుంది ఈ పెళ్ళిలో తనకేమి ఇష్టం లేదు అన్నట్టు.


         "అమ్మా ఏదో జరిగినట్టు అలా కూర్చోకపోతే నలుగురు పెద్దవాళ్ళని పలకరించి మాట్లాడొచ్చు కదా? వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు?" అని మందలించారు కావ్య తండ్రి.


         "బాగానే ఉందిరా. ముసలిదాన్ని కూర్చున్నా కూర్చోనివ్వవా? నీ పెత్తనం నీ కూతురు మీద చెల్లుతుందేమో కాని నా దగ్గర కాదు చూసుకో" అని బెదిరించింది నానమ్మ.


         "అయ్యో ఎలా చెప్పేది? ఏదో ఒకటి చెయ్యి. కానీ వచ్చేవాళ్ళ కాళ్ళకి అడ్డం పడకుంటే చాలు" అని వెళ్ళిపోయారు కావ్య తండ్రి.


         "ఏమిటండి బామ్మగారు ఏమయ్యింది? మీలో అసలు సంతోషం కనిపించడం లేదు?" అని కిరణ్ వచ్చాడు.


         నానమ్మ ఏదో చెప్పబోయేలోపు కావ్య ఆవిడ మూతిని తన చేతితో మూసి లోపలకు లాక్కెళ్ళింది. కిరణ్ కూడా ఆవిడ వెనకాలే వెళ్ళాడు.





         "అయ్యో నానమ్మ అక్కడ అందరూ తిరుగుతుంటే నీ సోది మొదలుపెట్టావు?" విసుక్కున్నట్టుగా అంది కావ్య.

         "సరిపోయిందే తండ్రీ కూతుళ్ళ వరస. ఒక చోట కూర్చో నివ్వరు, ఒక మాట మాట్లాడనివ్వరు" అంది నాన్నమ్మ కోపంగా.

         కిరణ్ ఇదంతా విచిత్రంగా చూస్తూ నిల్చొన్నాడు. "ఏమిటి బామ్మగారు ?నాకు చెప్పండి మీ బాధ" అన్నాడు ఆవిడ దగ్గరగా కూర్చొని.

         "ఏం చెప్పను బాబు? నాకు నీలాగే ఒక మనవడు ఉన్నాడు. ఎంతో బుద్దిమంతుడు. అతనికి కావ్యను ఇచ్చి చెయ్యాలి అని నా ఆశ. కాని నా కొడుకు, అల్లుడు కలిసి జరగనివ్వలేదు" అని చెప్తుంటే కావ్య కోపంగా చూసింది ఇప్పుడిదంతా అవసరమా అని.

         "సరేలే నాకెందుకు రేపో మాపో పోయేదాన్ని? కావ్య సంతోషంగా ఉండాలి అని అనుకున్నా అంతే" అంది మొహం తిప్పుకొని.

         "ఓహో మీకు ఇంకో కథానాయకుడు కూడా ఉన్నాడు అన్నమాట చెప్పనే లేదు" అన్నాడు కావ్య వంక చూసి.

         "అదేం లేదు" అని ఏదో చెప్పబోయింది.

         బయట ఏదో గొడవ వినిపించడంతో ఏమిటా అని కంగారు పడ్డారు. "నేను చూసి వస్తాను మీరు ఇక్కడే ఉండండి" అని చెప్పి బయటకు వెళ్ళాడు కిరణ్.

         ఎంత సేపటికీ కిరణ్ రాకపోవడంతో కంగారు పడుతోంది కావ్య.

         కొంత సేపటికి కిరణ్ లోపలకు వచ్చాడు.

         "కావ్యా నువ్వు కంగారు పడకు ఏది జరిగినా అంతా మన మంచికే" అన్నాడు.

         
  "ఏం చెప్తున్నారు మీరు? నాకేమి అర్థం కావడం లేదు. ఏమయ్యింది కిరణ్ గారూ" అంది కావ్య బయటకు వెళ్ళబోతూ. 


  "నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇప్పుడే పోలీసులు వచ్చారు పెళ్ళి కొడుకు తరుఫు పెద్దవాళ్ళను అరెస్ట్ చెయ్యడానికి. పెళ్ళి కొడుకుకి ఇంతకు ముందే పెళ్ళి అయ్యిందిట. పిల్లలు కలగలేదని భార్యకు తెలియకుండా ఈ పెళ్ళికి సిద్ధం అయ్యాడు. ఇప్పుడు ఆవిడకు తెలిసి అందరి మీదా కేస్ పెట్టింది. మాస్టారు, మా నాన్నగారు కూడా స్టేషన్ దాకా వెళ్ళారు" అన్నాడు బాధగా. 


 కావ్యకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అయోమయంగా ఉండిపోయింది.

         "బామ్మగారు కాస్త కావ్యను చూసుకోండి. నేను వెళ్ళి చూసి వస్తాను" అని వెళ్ళిపోయాడు కిరణ్.

         "కావ్యా" అంటూ కావ్య తల్లి కంగారుగా లోపలకు వచ్చింది.

         మతి భ్రమించినట్లు కూర్చుంది కావ్య.

         "నేను అప్పుడే చెప్పాను మనిషి అదో రకంగా ఉన్నాడు అని. కనీసం పెళ్ళికి ముందు తెలిసింది లేదంటే దాని గోంతు కోసేవారు" అని కావ్య నానమ్మ ఏదో చెప్తున్నా కావ్య వినే స్థితిలో లేదు.

         ఎక్కడ వస్తువులు అక్కడే పడేసి ఉన్నాయి. అంత మందికి చేసిన భోజనాలు కాకులకు విందు అయ్యింది. చుట్టు పక్కల వాళ్ళందరు ఏం జరిగిందా అని తొంగి తొంగి చూడడం ప్రారంభించారు. ఒకరిద్దరు ఇంటిలోకి వచ్చి వాకబు చేసుకెళ్ళారు. అందరికి సమాధానం చెప్పుకోలేక కావ్య తల్లి నానా అవస్థ పడింది.

         తిండి తిప్పలు లేకుండా అందరూ వెళ్ళిన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. రెండు మూడు గంటలకు ఆటో శబ్ధం విని ఆత్రుతగా బయటకు వచ్చారు. అలసిపోయిన ముఖాలతో కిరణ్, రాజారాం, కావ్య తండ్రిని తీసుకొచ్చారు. అందరి ముఖాలలో ఆందోళన, బాధ తాండవించింది.

         కావ్య తండ్రిని విశ్రాంతి తీసుకోమని కిరణ్, రాజారాం ఎక్కడి సామాన్లు అక్కడికి పంపించి అంతా సవ్యంగా సర్దించేసారు. ఎవ్వరూ ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయారు. కావ్య ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కిరణ్ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. కావ్య తండ్రి అవమానం తట్టుకోలేక క్రుంగిపోయారు.

         "ఎందుకిలా జరిగింది? కావ్యకే ఎందుకు ఇలా జరగాలి?" అని పదే పదే ప్రశ్నించుకున్నారు.

         చివరకు రాజారాం పెదవి విప్పడంతో అప్పటివరకు ఉన్న వాతావరణం మారింది.

         "ఏమిటిది ఎవరో పోయినట్టు ఇలా కూర్చోవడం? ఏది జరిగినా మంచికే జరిగింది. కావ్యకు అదృష్టం ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం తప్పింది" అన్నారు భుజం మీద చెయ్యి వేసి.

         "అది కాదురా ఇంత మందిలో మా పరువు పోయింది. మంచివాళ్ళు అని నమ్మి ఎంత మోసపోయాము. ఎవరికి ముఖం చూపించుకోలేని స్థితిలో వదిలేసారు" అని కావ్య తండ్రి తల పట్టుకొని కూర్చున్నారు.

         "నువ్వేం తప్పు చేసావు అని తల వంచుకోడానికి? వాళ్ళకి ఇంకా ప్రాముఖ్యం ఇవ్వబట్టే నీకు ఈ బాధ. అదొక పీడ కలలా మర్చిపో. కావ్యకు అంతా శుభం జరుగుతుంది" అని చెప్పినా ఎవ్వరు వినే స్థితిలో లేరు. 



 కావ్య తండ్రిని విశ్రాంతి తీసుకోమని చెప్పి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వారి వారి ఆలోచనలలో మునిగిపోయారు. నడి రాత్రి ఎవరో బాధగా మూలుగుతున్న శబ్ధం విని అందరూ లేచారు. కావ్య తండ్రి గుండె పట్టుకొని బాధతో మెలికలు తిరగడంతో అప్పటికప్పుడు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆయనకి ఏవేవో పరీక్షలు చేసాక మళ్ళీ గుండెపోటు రావడంతో ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పారు. అప్పటివరకు భ్రమించినట్లు ఉన్న కావ్య ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఏదైతే జరగకూడదు అని అనుకుందో అదే కళ్ళ ముందు జరుగుతుంటే తట్టుకోలేకపోయింది. ఎవరినీ ఎవరూ ఓదార్చలేని పరిస్థితిలో కావ్యకు ధైర్యం కోల్పోడానికి ఇది సమయం కాదు అని అనిపించింది.

         వెంటనే వెళ్ళి డాక్టర్ని కలిసి ఆపరేషన్ చెయ్యడానికి ఆమోదం చెప్పి వచ్చింది. మరునాడు ప్రొద్దున్న ఆపరేషన్ చేసి రెండు మూడు రోజులు పర్యవేక్షణలో ఉంచాలి అని సగం డబ్బు కట్టమని బిల్లు అందించారు. కావ్య చేతిలో నుండి బిల్లుని కిరణ్ తీసుకొన్నాడు.

         "నేను కట్టి వస్తాను" అని వెళ్ళబోయాడు.

         "కిరణ్ గారూ ఒక్క నిముషం. ఆ బిల్లుని నేనే కడతాను. ఇప్పటికే మిమ్మలిని చాలా ఇబ్బంది పెట్టాము. ఇప్పుడు బిల్లు కూడా మీ చేత కట్టిస్తే నాన్నగారికి బాధ కలుగుతుంది. ఆయనకు నచ్చని విషయం నేను ఎప్పుడూ చెయ్యలేదు. బ్యాంక్ లో ఎంతో కొంత డబ్బు ఉంచారు. ఇప్పుడే అమ్మా నేను వెళ్ళి తీసుకు వస్తాము" అని సూటిగా కిరణ్ కళ్ళల్లోకి చూసింది తన నిర్ణయం మారదు అన్నట్టు.

         "పరాయి వాళ్ళను చేస్తున్నారు మమ్మలని. ఇప్పుడు నాకీ డబ్బు అవసరం లేదు. మంచి పనికి అవసరపడితే నాకూ సంతోషం" అన్నాడు కిరణ్.

         "మిమ్మలిని ఆత్మీయులుగా భావించాను కాబట్టే నిర్మొహమాటంగా చెప్పగలిగాను. నాకు నిజంగా ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే ముందుగా మీ దగ్గరకే వస్తాను, సరేనా?" అనేసి వెళ్ళిపోయింది కావ్య.

         కిరణ్ ఆరాధనగా కావ్య వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు.



***        ***        ***        ***
         కావ్య తల్లిని తీసుకుని ఆటోలో డబ్బు కోసం బయలుదేరింది.

         "కావ్యా ఇది నాన్న నీ పెళ్ళి కోసం దాచిపెట్టిన డబ్బు. దానినెందుకు తియ్యడం? నా బంగారం అమ్మేసి..." అని ఎదో చెప్పబోయి కావ్య తల్లి కన్నీళ్ళను ఆపలేక ఆగిపోయింది.

         "అమ్మా?" అని ఆవిడ చుట్టూ చేతులు వేసింది కావ్య.

         "నాన్నకి ఇలా ఉన్నా నా పెళ్ళి కోసమే ఆరాటపడుతున్నావు. నా పెళ్ళి కోసం ఎందుకంత ఆరాటం? మీ ఇద్దరి కన్నా నా పెళ్ళి ముఖ్యం కాదు. ఎప్పుడూ మీతోనే ఉండిపోయినా నాకు సంతోషమే. ఏదొక ఉద్యోగం చేసైనా మిమ్మలిని చూసుకోగలను" అంది కావ్య ఆవిడ కళ్ళు తుడుస్తూ. 



(ఇంకా ఉంది )
Categories: Left

బహుజనుల ‘కొమ్రన్న ’

Normal 0 false false false EN-US X-NONE TE MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin:0in; mso-para-margin-bottom:.0001pt; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:"Times New Roman"; mso-fareast-theme-font:minor-fareast; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi;}

(కొమ్రన్న మరణాన్ని జీర్ణించుకోలేక నేను రాసిన వ్యాసాన్ని సూర్య దినపత్రిక 30.8.2010 న ప్రచురించారు. ఆ వ్యాసానికి నేను పెట్టిన పేరు తోనే దీన్ని ఇక్కడ అందిస్తున్నాను..దార్ల)

అర్ధాంతరంగా ఆరిపోయిన బహుజనుల ఆశాజ్యోతి ‘కొమ్రన్న ’

‘‘ ఈదేశంలో అన్ని భాషల్లో కలిపి సంవత్సరానికి ముప్పైవేల పై చిలుకు వ్యాసాలు రాయబడుతున్నాయి. అందులో కనీసం ఒక్కశాతం కూడ తొంబైశాతం వున్న చిన్న కులాల గురించి గాని, వారు చేస్తున్న అస్తిత్వపోరాటాలు, సాహితీ సంఘర్షణల గురించి పట్టించుకోవడం లేదు. ఈ సాంస్కృతిక విగతజీవుల అస్తిత్వ ఉద్యమాలను రోజూ వ్యాసాలు రాసే ఆధునిక వ్యాసులూ పట్టించుకోరు. సాహిత్యం, దాని ధోరణులు సమాజానికి భిన్నమైనవి కావు.’’ ఇవి బహుజన మేథావి ఆచార్య కొమ్రన్న అభిప్రాయాలు. కొమ్రన్న ఎవరని ఏ మాత్రం చైతన్యం ఉన్న బహుజనుణ్నడిగినా వెంటనే చెప్పేస్తాడు ` ఆయనొక ఉద్యమకారుడని, పీడిత వర్గానికి ఆశాజ్యోతని.ఆయన మెదడు సంబంధవ్యాధితో హఠాత్తుగా శుక్రవారం రాత్రి ( 20 `08`2010) చనిపోయారు.

ఈ వార్త తెలిసినవారంతా వారంతా ఆశ్చర్యపోయారు. విషాధంలో మునిగిపోయారు. ఆయనకేమాత్రం బి.పి. గాని, షుగర్‌ గాని లేదా మరేదైనా అనారోగ్యం ఉందని ఎవరూ ఊహంచనైనా ఊహించలేరు. అంత బలంగా కనిపించేవారు.సభలో ఆయన ఎంతో సంయమనంతో మాట్లాడేవాడు.ఆయన మాటగాని, రాత గాని బహుజన తత్త్వంతో నిండి ఉంటుంది. కుల ద్వేషంతో కాకుండా, కుల నిర్మూలన దిశగా బలహీన కులాలన్నీ ఏకంకావాలనే ఆశయం గలవారు.

ఆయన కూడా మనం పుట్టక ముందే నిర్ణయమైన ఒక కులంలోనే పుట్టారు.అది వెనుకబడిన తరగతులకు చెందిన ఒక ఉపకులం.వర్గపోరాటాల్ని విద్యార్ధి దశలో సమర్ధించినా, తర్వాత కాలంలో భారతదేశ పరిస్థితుల్ని బట్టి కులం కూడా దానికి తోడైనప్పుడే సమాజంలో అసమానతలు పోతాయనే నమ్మకం ఉన్న మేధావి. ఆయన స్వగ్రామం వరంగల్‌ జిల్లా, స్టేషన్‌ఘనాపూర్‌ మండలం కొండమీది. ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఒక పి.జి. కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసరుగా పనిచేస్తూ, హఠాత్తుగా చనిపోయారు.ఆయన పూర్తి పేరు కేశరాజు కుమార్‌. కానీ ఆయన్ని అందరూ ‘‘ కొమ్రన్న’’ అని పిలుస్తారు. రచనల్ని కూడా ‘‘ కొమ్రన్న’’ పేరుతోనే రాసేవారు.చాలా పత్రికల్లో రాసినా, సూర్య దినపత్రిక ఆయన రచనలకు అత్యధిక ప్రాధాన్యాన్నిచ్చిందనీ, తన భావజాలాన్ని ప్రకటించగలిగే చక్కని వేదిక దొరికిందని మాటల సందర్భంలో చెబ్తుండేవాడాయన. వృత్తిరీత్యా ఆంగ్ల ఆధ్యాపకుడైనా, తెలుగు ప్రజలకు తన భావాలు చేరువకావాలని తెలుగులోనే సాహిత్య, సామాజిక వ్యాసాల్ని అనేకం రాశారు.వివిధ పత్రికల్లో జరిగే చర్చల్లో పాల్గని బహుజనవాణిని బలమైన గొంతుతోనే వినిపించేవారు.

కొమ్రన్న పత్రికల్లో రాసిన వ్యాసాల్ని నాలుగు రకాలుగా విభజించవచ్చు. తన కులం ఒకటిగా ఉన్న వెనుకబడిన తరగతుల అభివృద్ధి గురించి రాసిన వ్యాసాలు.రెండు బహుజన వాదానికి బలం చేకూర్చే ఉద్యమంలో భాగంగా అణగారిన, అణచివేతకు గురౌతున్న కులాల గురించి, మూడు ప్రాంతీయ అసమానతలను పోగొట్టడానికి శాస్త్రీయమైన వాదనలను ముందుకి తీసుకురావడం, నాలుగవది, అత్యంత ముఖ్యమైంది, రాజ్యాధికార దిశగా బలహీన వర్గాలు అనుసరించాల్సిన వ్యూహాల్ని వివరించడం. ఈ దిశగా సాహిత్యాన్ని కూడా సామాజిక చైతన్యానికి ఒక మార్గంగా ఎన్నుకున్నారు. ‘‘ మా బోనులోకి మరో సింహం’’ పేరుతో ముస్లిం రిజర్వేషన్లను ఆహ్వానిస్తూ శ్రమ గౌరవ ఉత్పత్తి కులాల వారి కవితలను 2008 లో ఒక కవితా సంకలనంగా తీసుకొచ్చారు. దీనిలో ఎంపిక చేసిన కవితల్ని, వారి వ్యాసాల్ని, వారి ఉపన్యాసాల్ని, వారి రాజకీయ ఆచరణను పరిశీలించిన వారికి ఆయనొక బహుజనతాత్త్వికుడుగాస్పష్టమవుతుంది. ఇప్పుడెంతో బలంగా కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమం గురించి కూడా ఒక సామాన్యుడిలా కాకుండా, గొప్ప మేధావిగా కొమ్రన్న తన భావజాలాన్ని వ్యక్తీకరించారు. నిజాం నవాబుల పాలన, ఆపేరుతో జరిగిన అకృత్యాల పట్ల ఎవరేమనుకున్నా, ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు మాట్లాడకుండా వాదించాడు. షెడ్యూల్డు కులాల్లోని వర్గీకరణ వాదాన్ని సమర్ధించాడు. దళితులై ఉండి మళ్ళీ దళితుల్లో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తూ వచ్చినకైతునకల దండెం గురించి నిష్పాక్షికంగా పెద్ద సమీక్ష రాసిన ఏకైక రచయిత కొమ్రన్న. తెలంగాణ కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన సురేంద్ర మాదిగ పై వచ్చిన పుస్తకాన్ని సమీక్షించింది కూడా కొమ్రన్న. ఆశ్రిత కుల వ్యవస్థలో గల కొత్తకోణాల్ని బహిర్గతం చేసిన వాడు కొమ్రన్న. ముస్లింల రిజర్వేషన్లను సమర్ధించారు. ప్రతి ముస్లింనీ ఒక బిన్‌ లాడెన్‌గా ముద్ర వేయడం మంచిది కాదన్నారు. దళిత స్త్రీవాదాన్ని సమర్ధవంతంగా ప్రొతహించిన వారు. ఆయన సంకలనం చేసిన ‘‘ మా బోనులోకి మరో సింహం’’ పుస్తకానికి రాసిన ముందుమాటలో అభ్యుదయనిరోధక శక్తుల్ని బలంగా తిప్పికొట్టేప్రయత్నం చేశారు. ఈ కవితా సంకలనంలో కొమ్రన్న రాసిన ‘‘ తురకై, దేశ సమగ్రతకే సవాలై...’’ కవితలో ఒకప్పుడు మాతోనే కలిసిమెలిసి జీవించిన ముస్లిం ఉగ్రవాదం జడలువిప్పిన తర్వాత ఒక్కసారిగా దేశసమగ్రతకే ముప్పువాటిల్లిన వాడిగా ఒక్కసారిగా ఎలా మారిపోయాడని నిలదీశారు.

‘‘ నా చిన్నప్పటి నుండి ఒక్క కంచంలో తిని ఒక్క మంచంలో పన్నోడు/ ఇపుడు సడన్‌గా తురకై, దేశసమగ్రతకే సవాలైండు.../ పనిపాటల్లో, ఎండవానల్లో నాతో జీవితం పంచుకున్నోడు/ నేను మడుగులు గుప్పుతుంటే, వాడు జెల్లలు, పరుక పిల్లలు ఏరినోడు/ వాని సున్తిపండుగకు అబ్బ చేసిన బిర్యాని దాచి నాకిచ్చినోడు/హోళీ పండుగకు నా గుంపులో తిరుగుతు మోదుగుపూల రంగు జల్లుకున్నోడు/ మా అవ్వ సద్దులకు చేసిన అప్పాలని అడిగి అడిగి తిన్నోడు/ వాళ్ళ అమ్మి చేసిన ఆప్యాయపు సేమ్యా పాపడాలు నాకు పెట్టినోడు/ ఇపుడు సడన్‌గా తురకై, దేశసమగ్రతకే సవాలైండు..’’ అని మతసమైక్యత పేరుతో జరుగుతున్న కుట్రను వ్యంగ్యంగా బహిర్గతం చేశారు కొమ్రన్న. నిజమైన సామాజిక న్యాయాన్ని సమర్ధించే దార్శినిక దృష్టిని మరింత వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఉత్సాహంగా పనిచేస్తున్న తరుణంలోనే బలహీన వర్గాల ఆశాజ్యోతి అర్ధంతరంగా ఆరిపోయింది.

దళితుల్లో చైతన్యం తేవడానికి తీవ్రంగా ప్రయత్నించిన వాళ్ళెందుకిలా హఠాత్తుగా చనిపోతున్నారో అనిపిస్తుంది. మాదిగ సాహిత్యాన్ని ఒక కెరటంలా ఎగిసిపడేలా చేసిన నాగప్పగారి సుందర్రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ప్రాంతం నుండి చిన్న వయసులోనే గొప్ప ప్రభావాన్ని వేసిన వాగ్గేయకారుడు గ్యార యాదయ్య హఠాత్తుగా చనిపోయాడు. క్రైస్తవ జీవితంలో ఉంటూనే దానిలోనూ ప్రవేశించిన కులాన్ని ప్రశ్నించిన అంబేడ్కస్ట్‌ మద్దెల శాంతయ్య అనారోగ్యంతో చనిపోయాడు. వర్గ పోరాటంతో సమసమాజం వస్తుందని ఆశించి, ఆ పోరాటంలో భాగస్వామిగా మారిన తర్వాత అనుభవంలో కులాధిక్యతను గమనించి, దాన్ని నిలదీసిన శంబుక ( పత్తిపాటి మల్లేశ్వరరావు)ని హత్య చేశారు. ఈటెల్లా, తూటాల్లా దళిత కవితల్ని అల్లిన మద్దూరి నగేష్‌బాబు అనారోగ్యంతో చిన్న వయసులోనే చనిపోయాడు. ఇంకా ఇలాగే చాలా మంది స్ఫూర్తిని రగిలించి, బలహీన వర్గాల్లో కొత్త ఆశను కలిగించిన వాళ్ళు ఇలా హఠాత్తుగా చనిపోవడం బాధాకరం. ఇలాంటి పరిస్ధితి అన్నల శిభిరంలో నిత్యం విషాదమై అలముకుంటుంది. కొంచెం కన్నీళ్ళో , పిడికెడు పుష్పాలో, ఒక పాటో, ఒక కవితో, కాస్త నిట్టూర్పో, గడ్డ కట్టిన కన్నీళ్ళుగా నిలిచిపోవడమో జరుగుతుంటుంది. ‘‘ బతుకంతా/ స్మృతి గీతాలు రాయడమే అయ్యింది/ గట్టుకు కట్టెలు మొయ్యడమే అయ్యింద’’ని కవి హిమజ్వాల అన్నట్లు వీరి జీవితాల గురించి దు:ఖించే పరిస్ధితి దాపరించడానికి కారణమేంటిని ఆలోచించాల్సిన సమయమాసన్నమైంది. ఇంత వరకూ పైన చెప్పుకున్న వాళ్ళంతా దళితుల్లో ఇంచుమించు మొదటితరానికి చెందిన కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే. ఒక్కసారిగా ఆయా రంగాల్లో జరుగుతున్న అన్యాయాల్ని కళ్ళారా చూసిన వాళ్ళే. ఆ అన్యాయానికి కదిలిపోయిన వాళ్ళే. ఆ అన్యాయాన్ని తమదైన రీతిలో స్పందించిన వాళ్ళే. ‘‘పుట్టరాని చోట’’ పుట్టి తమ ప్రతిభాపాటవాల్ని ప్రదర్శించలేని నిస్సహాయస్థితిలోకి నెట్టబడ్డవాళ్ళే. అందుకే ఆ ఆవేదన, ఆ సంఘర్షణ తమని మనశ్శాంతిగా ఉండనివ్వని పరిస్థితిల్లోకి నెట్టేస్తుంది. చాలా మంది పేరు ప్రఖ్యాతులచ్చిన తర్వాత వ్యక్తిగతమైన ప్రతిష్టలకు పోయి, వ్యవస్థ నిర్మాణాన్ని విస్మరించడం వల్ల కూడా ఇలాంటి అనర్ధాలకు కారణంగానే భావించాలేమో అనిపిస్తుంది. ఈ దిశగా దళితులు, బహుజనులు సత్వరమే ఆలోచించకపోతే మరింతమంది మేథావుల్ని కోల్పోకతప్పదు.కొమ్రన్న మరణం యావత్తు బహుజన, శ్రామిక వర్గాలకు తీరని లోటు.

-డా॥ దార్ల వెంకటేశ్వరరావు

Address:

Dr.Darla Venkateswara Rao
Assistant Professor,
Department of Telugu
School of Humanities,
UNIVERSITY OF HYDERABAD
Gachibowli, Hyderabad. A.P.,India
Phone: 040-23133563 (O),
Mobile: 09989628049

Categories: Left

‘బాస’కొత్త పత్రిక ప్రారంభం - జూన్ 2010

‘బాస Promise to the 85% పేరుతో ఒక మాస పత్రిక జూన్ 2010లో ప్రారంభమైంది. ప్రముఖ సాహితీ వేత్త, ఉద్యమనాయకుడు శ్రీ ఎన్. జె. విద్యాసాగర్ దీనికి ప్రధాన సంపాదకుడుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని మన పాఠకుల సౌకర్యార్ధం పి.డి.ఎఫ్. ప్రతి లింక్ అందిస్తున్నాను.
http://www.scribd.com/doc/36608838/Basa-May-June-2010
Categories: Left

ఫొటో జవాబు

http://srikaaram.wordpress.com/feed - Mon, 08/30/2010 - 03:26

బైమా సీ-వైట్ హార్స్ బౌధ్ధ దేవాలయం, చైనా.భారతదేశం నుండి బౌధ్ధ సూత్రాలను ఇక్కడికి మొదటి సారి గుర్రాల మీద తెచ్చినందుకు ఆ పేరు పెట్టారు.ఇది చైనాలోని మొదటి బౌధ్ధ ఆలయం .


Categories: Left

ఆకాశానికి పందిరి గుంజలు![భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 22]

ప్రభుత్యోద్యోగుల నుండి నేను సహాయ సహకారాలని అందుకున్న అనుభవాలలో మరొకటి -

ఒక రోజు నేను ‘ఇన్స్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్’ వాళ్ళ ఆఫీసుకి వెళ్ళాను. నా ఫ్యాక్టరీ లైసెన్సును రెన్యూవల్ చేయించవలసి ఉంది. అప్పటికే తేదీ దాటిందన్నది నేను గుర్తించుకోలేదు. పనుల ఒత్తిడితోనూ, హైదరాబాద్ గట్రా నగరాలకి పనుల నిమిత్తం వెళ్ళటంతోనూ బిజీగా ఉండి మర్చిపోయాను. దాంతో ఫైను పడ్తుందని అనుకోలేదు.

తీరా ఫైలు తీసాక, తేదీ దాటిందని క్రింది గుమస్తా చెప్పాడు. అప్పట్లో అక్కడ [నాకు గుర్తుండి] ఫకృద్దీన్ అనే అధికారి ఉండేవాడు. చిన్న వయస్సు వాడే! అతడు "ఫర్లేదమ్మా! విదిన్ డేట్, మీ లైసెన్స్ నేను రెన్యూవల్ చేసాను. ఫీజు నా జేబు నుండి కట్టాను. కాబట్టి మీరు ఫైను కట్టక్కర్లేదు. బహుశః మీరు మరిచిపోయి ఉండొచ్చునను కున్నాను. ఎటూ మీరు (camp) ఊరు నుండి వచ్చాక, మా ఆఫీసుకి వస్తారని నేను expect చేసాను. ఇదిగోండి మీ లైసెన్సు రెన్యూవల్" అంటూ పేపర్ ఇచ్చాడు.

ఆ యువ అధికారి పట్ల నాకెంత కృతజ్ఞత కలిగిందో! అతడిచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పి, రెన్యూవల్ ఫీజు కట్టేసి, లైసెన్సు కాపీ తీసుకున్నాను. ఇలాంటి ఒక్క సంఘటన, ఒక ప్రోత్సాహం... తర్వాత పదిమంది అవినీతి ఉద్యోగుల్ని డీల్ చేసేందుకు శక్తినిచ్చేది.

ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ‘ఆకాశానికి పందిరి గుంజలు’ కథ గుర్తుకొచ్చేది. ‘దేశమంతా అవినీతి పరులే ఉంటే... ఈ పాటికి ప్రపంచపటంలో భారతదేశం మిగిలి ఉండేది కాదు’ అన్పించేది. ఆ కథ చందమామ లోనిది. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను కాబట్టి, రచయిత ఎవరో తెలీదు. ఇంతకీ కథేమిటంటే -

అనగా అనగా...

ఒక ఊరిలో రంగన్న అనే అమాయక యువకుడుండేవాడు. వాడు తల్లి దండ్రులు లేని అనాధ. ఏదో పనిపాట చేసుకొని పొట్టపోసుకుంటూ ఒంటరిగా జీవిస్తుండేవాడు.

ఓ రోజు రాత్రివేళ వాడు భోజనం చేసి, గుడిసె బయట నులక మంచం వేసుకుని పడుకున్నాడు. ఆరు బయట చల్లగాలినీ, ఆకాశంలో చంద్రుడూ, చుక్కలతో మబ్బులు సయ్యాటలనీ ఆనందించసాగాడు.

హఠాత్తుగా వాడికి, ఆకాశం పెద్ద పందిరిలాగా తోచింది. కానీ ఎటు చూసినా దానికి గుంజలు లేవు. అలాంటప్పుడు ఆకాశం భూమ్మీద పడకుండా ఎలా ఉంది?

అమాయకుడైన రంగన్నకు ఆకాశం గురించి ఇలా సందేహం రాగానే.... ఏ క్షణమైనా ఆకాశం భూమ్మీద కుప్పకూలుతుందని భయం వేసింది.

వాడు వీధిన బడి గట్టిగా "పారిపొండి! పారిపొండి! ఆకాశం భూమ్మీద కూల బోతుంది. ప్రాణాలు దక్కించుకొండి. పరుగెత్తండి, పరుగెత్తండి" అని గావుకేకలు వేస్తూ పరిగెత్తసాగాడు.

ఇలా అరుస్తూ గ్రామపు వీధుల్లో అడ్డదిడ్డంగా పరుగెట్టి, ఊరి చివరికి వచ్చేసాడు. వాణ్ణీ, వాడి అరుపులనీ గ్రామస్తులెవరూ పట్టించుకోలేదు. వాడి అమాయకత్వం వాళ్ళకి తెలుసు మరి!

మనవాడు మాత్రం పరుగాప లేదు. అప్పటికే ఊరుదాటి, అడవి దారి బట్టాడు. మధ్యలో ఎప్పుడు తలపైకెత్తి చూసినా, ఆకాశం వాడి నెత్తిమీదే ఉన్నట్లు కన్పించేది. దాంతో రెట్టించిన భయానికి గురై, మరింత వేగం పెంచి పరిగెత్త సాగాడు.

అలా పరిగెత్తి పరిగెత్తి... చివరికి అడవి మధ్యలో ఓ ముని ఆశ్రమానికి చేరాడు. ముని ధ్యానంలో ఉన్నాడు.

రంగన్న... అలసటతో, ఆయాసంతో రొప్పుతూ పోయి, ముని పాదాల మీద పడ్డాడు. కళ్ళు తెరిచిన ముని రంగన్నని జాలిగా చూశాడు.

రంగన్న భయంతో మాట తడబడుతుండగా "స్వామీ! ఆకాశం భూమ్మీద పడబోతోంది. పరిగెత్తండి. ఇక్కణ్ణుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి" అన్నాడు.

ముని కరుణతో చూస్తూ "నాయనా! ఎందుకలా అనుకుంటున్నావు?" అనడిగాడు.

"ఎందుకేమిటి స్వామీ! ఆకాశం చూడండి, పందిరి లాగే లేదూ? మరి దానికి స్థంబాలెక్కడ ఉన్నాయి? గుంజల్లేని పందిరి కూలిపోదా? కాబట్టి - ఏ క్షణమైనా ఆకాశం భూమ్మీద పడిపోగలదు" అన్నాడు రంగన్న వగరుస్తూ!

మునికి రంగన్న ఎంత అమాయకుడో అర్ధమయ్యింది. వాడి మీద కనికరం కలిగింది. చిరునవ్వుతో "లేదు నాయనా! ఆకాశపు పందిరికి భూమ్మీద గుంజలున్నాయి. అందుకే అదలా ఏళ్ళ తరబడి నిలిచి ఉంది" అన్నాడు కరుణ నిండిన కంఠంతో!

రంగన్న పట్టలేనంత ఆశ్చర్యంతో "ఎక్కడున్నాయి?" అనడిగాడు. ముని శాంతంగా, "తప్పకుండా నీకు చూపిస్తాను. ఇప్పుడు నువ్వు అలిసి పోయి ఉన్నావు. ఈ రాత్రికి ఆశ్రమంలో నిదురపో! రేపు నేన్నీకు ఆకాశానికి పందిరి గుంజల్ని చూపిస్తాను" అన్నాడు.

అప్పటికి రంగన్నకి భయం తగ్గింది. దెబ్బకి అలసట గుర్తొచ్చింది. దాంతో ప్రశాంతంగా అక్కడే నిద్రపోయాడు.

మర్నాటి ఉదయం, ముని "చూడు నాయనా! దాపులనున్న పల్లెకు పోయి భిక్షమడుగు. అయితే అన్నం పెట్టినా, పెట్టకపోయినా, ఆ ఇంటి వాళ్ళను మాత్రం బాగా తిట్టు. సాయంత్రం వెనక్కి తిరిగి రా! అప్పుడు నీకు ఆకాశపు పందిరికి గుంజల్ని చూపిస్తాను" అన్నాడు.


రంగన్న బుద్దిగా తలూపాడు. ప్రక్కనున్న గ్రామానికి పోయి బిచ్చమడిగ ప్రారంభించాడు. ఏ ఇంటి గడప దగ్గర కబళమడగ బోయాడో, ఆ గృహిణీనీ, గృహస్తునీ బండతిట్లు తిట్టసాగాడు. అది చూసిన ప్రతి వారు వాణ్ణి తిట్టారు, కొట్ట బోయారు, అక్కడి నుండి తరిమేసారు.

సాయంత్రానికి కూడా వాడికి పిడికెడు అన్నం దొరక లేదు. వాడికప్పటికే బాగా ఆకలిగా, అలసటగా ఉంది. నీరస పడి పోయాడు. కానీ బిచ్చమడగ బోయిన చోటనల్లా తిట్టడం మాత్రం ఆపలేదు. ముని చెప్పిన దాన్ని ఆ విధంగా విధేయంగా ఆచరిస్తున్నాడు.

చివరికి, ఓ ఇంటి ముంగిట నిలబడి గట్టిగా బిచ్చమడుగుతూ, తిట్టసాగాడు. కాస్సేపటికి ఆ ఇంటి ఇల్లాలు ఓ విస్తరాకు నిండా, అన్నం పప్పూ కూరా తెచ్చి యిస్తూ, "అన్నం తీసుకో నాయనా! పాపం, ఎంత ఆకలితో ఉన్నావో, ఇంతగా వివేకం కోల్పోయి గృహస్తుల్ని తిడుతున్నావు! అన్నం పరబ్రహ్మ స్వరూపం. కడుపునిండితే కోపం పోతుంది. ముందు ఈ అన్నం తిని ఆకలి చల్లార్చుకో!" అంది.

రంగన్నకి కళ్ళ నిండా నీళ్ళు ఉబికాయి. అన్నం నిండిన ఆకు అందుకొని, ఆ తల్లికి తలవంచి అభివాదం చేసాడు. గిరుక్కున వెనుదిరిగి, అడవిలో ఆశ్రమానికి చేరాడు. ముని ముందు విస్తరి ఉంచి, జరిగిదంతా చెప్పాడు.

ముని మనోహరంగా నవ్వుతూ "ముందు అన్నం తిను" అన్నాడు. రంగన్న ఆవురావురు మంటూ అన్నం తిని స్థిమిత పడ్డాడు.

ముని రంగన్న సందేహం తీరుస్తూ "నాయనా! బిచ్చమడగబోయిన చోట, నోటి కొచ్చిన తిట్లు తిడితే, అందరూ నిన్ను కొట్టబోయారు. అలాంటి చాలా మందిలో, ఒక్క గృహిణి, నీకు అన్నం పెట్టింది. సహనంగా నీ తప్పుకి కారణాన్ని చెబుతూ అన్నం తినమంది. తనని తిట్టిన నీమీద కోపం తెచ్చుకోలేదు. లక్షలు, కోట్లలో... అలాంటి వాళ్ళు ఒక్కరుంటారు. వాళ్ళు... శాంతం, సహనాలు కలిగి, తమ ధర్మం తాము నెరవేరుస్తారు. వాళ్ళనే పందిరి గుంజలుగా ఆకాశానికి నిలబెట్టాడు భగవంతుడు. కాబట్టి - ఆకాశం భూమ్మీద పడనుందని భయపడకు!" అన్నాడు.

అమాయక రంగన్నకి అంతా అర్ధమైందనిపించింది. మంచితనం మీద మరింత నమ్మకం పెరిగింది. మునికి నమస్కరించి, తిరిగి తన గ్రామానికి బయలు దేరాడు.

ఇదీ కథ!

ఏ వృత్తిలో ఉన్నాసరే.... అ తమ ధర్మం తాము పాటించే వాళ్ళు ఆకాశానికి పందిరి గుంజలే!

అన్నిరంగాలలో, అవినీతి పరులున్నట్లే... నిజాయితీగా తమ ధర్మం తాము పాటించే ఇలాంటి పందిరి గుంజలు కూడా ఉన్నారు. కాబట్టే ఇంకా ఈ దేశం, ప్రపంచం మనగలుగుతున్నాయి. నా అదృష్టం కొద్దీ, నేను అలాంటి కొందరిని చూసాను కాబట్టే, మంచితనం మీద నమ్మకాన్ని కోల్పోలేదు.

పారిశ్రామిక వేత్తగా నా కెరీర్ లో ఇలాంటి పందిరి గుంజల్ని మరికొంత మందిని చూశాను.


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left
Syndicate content