Left

కాషాయ తీవ్రవాదం - కారణాలు

మొన్నామధ్య చిదంబరం కాషాయ తీవ్రవాదం అంటూ తీవ్రవాదులైన హిందువులకు నామకరణం చేయటమే కాకుండా, దేశానికి దానివల్ల వాటిల్లే ముప్పు గురించి కూడా బానే కబుర్లు చెప్పాడు. ఎప్పుడూ ఎవరికీ హాని తలపెట్టని హిందు జాతి మనది. అటువంటి హిందువులు ఇప్పుడు తీవ్రవాదంవైపు మొగ్గు చూపటానికి కారణాలేమిటనే విశ్లేషణలేవీ చేయకుండా, ప్రపంచమంతా గర్హిస్తున్న ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాదుల పక్కన హిందువులను చేర్చటం ఆక్షేపణీయం. హిందు తీవ్రవాదం తలెత్తటానికి దోహదపడుతున్న ముఖ్యమైన సామాజికాంశాలు రెండు.
  • మైనారిటీ సంక్షేమం పేరుతో ముస్లీములను, క్రైస్తవులను నెత్తిన పెట్టుకోవటం.
  • దళితోద్ధరణ పేరుతో, దళితులను హిందువులకు వ్యతిరేకంగా బ్రెయిన్ వాష్ చేయటం.

జాతీయ గేయాన్ని ఆలపించము అని, రిపబ్లిక్ డే  వేడుకలు బహిష్కరిస్తామనే ధైర్యం ప్రపంచంలోని ఏ దేశంలో ఏ మతస్థులకి ఉంటుంది? వారికి ఆ ధైర్యాన్ని నూరిపోస్తున్నదెవరు? అమెరికాతోటో, ఇజ్రాయిల్ తోటో  చేసుకొనే ఏ వ్యాపార ఒప్పందమైనా ముస్లీములకు వ్యతిరేకం అని, మైనారిటీల ఓట్ల కోసం వెంపర్లాడే సిగ్గులేని రాజకీయ జాతులు ఏ దేశంలో ఉంటాయి? హిందు బూచిని చూపించి పాకిస్తాన్ జాతి పిత ఐన జిన్నాకు, అదే హిందు బూచిని చూపించి ఓట్లు దండుకోవాలని చూసే ములాయంలకు, మాయావతిలకు, లాలులకు, కాంగ్రెస్, కమ్యూనిస్టులకు తేడా ఏముంది? మత ప్రమేయంలేని రాజ్యంగా జబ్బలు చరుచుకునే మన దేశంలో, మతాధారిత రిజర్వేషనులు ఎవరి బులపాటం తీర్చడానికో రహస్యమేమీ కాదు. ఆ రాజకీయ జిత్తులు గమనించక వారి చేతుల్లో పావులై సోదర హిందువుల మీద ద్వేషభావంతో జిహాదులు చేసే ముస్లీములకు, మత మార్పిడులకు పాల్పడే క్రైస్తవ మిషనరీలకు ఈ లౌకిక రాజ్యం అడ్డుకట్ట వేయదే!

అసలు దేశానికి ఈ కాషాయ తీవ్రవాదం వల్ల కలిగే కీడు కన్నా, ఇప్పటికే పడగవిప్పి, బుసలు కొడుతున్న కొత్త తీవ్రవాదంతోనే ముప్పు పొంచి ఉంది. నియో మోడర్నిజం పేరిట, నియో దళితిస్టు భావజాలంతో హిందువులపై విషం కక్కే కామెడీగాళ్ళు సోదర దళితుల మనసుల్లో విషబీజాలు నాటి, హిందువులకు వారిని వ్యతిరేకంగా చేసి, చాప క్రింద నీరులా ఈ దళిత తీవ్రవాదానికి చేయూత నిస్తున్నారు. ఓట్ల కోసం ఏమీ అనలేని దౌర్భాగ్యంలో మన రాజకీయాలు వాళ్ళకి ఆసరాగా నిలుస్తున్నాయి.

దళిత సంక్షేమం కోసం చేసిన చట్టాలను, తాము చేసే క్రిమినల్ పనులనుండి తమను కాపాడుకునే పాచికలుగా వాడటం వీరివల్లే సాధ్యం. ఇటువంటి కుహానా కామెడీ మేధావుల వల్ల, ప్రజల మధ్య అనైక్యత ప్రబలిపోతున్నది. ముందుగా ఈ "దళిత తీవ్రవాదాన్ని" ఆపాల్సిన అవసరం మన ప్రభుత్వాలు ఇంకా గుర్తించకపోవటం ఆశ్చర్యం.
Categories: Left

పెళ్ళి రిసెప్షనులో గెంతులాడిన గీతిక

ఆ మధ్య ఆట ప్రొగ్రాములో గీతిక మరియు ఇతర చిన్నపిల్లల డ్యాన్సుల గురించి ఏవో వివాదాలు వచ్చాయి కదా. ఇండియాలో మా బంధువుల అమ్మాయి పెళ్ళి రెసెప్షనుకి వెళ్ళాను. అది చాలా గ్రాండ్ గా జరిగింది. ఒక వైపు రిసెప్షను జరుగుతుండగా మరో వైపు సాంస్కృతిక కార్యకరమాలు ఏర్పాటు చేసారు. మాటివి, ఇతర టివి ఆర్టిస్టులూ, ఏంకర్లూ, మిమిక్రీ ఆర్టిస్టులూ గట్రా వచ్చారు. వారితో పాటే గీతిక కూడా వచ్చింది. జానపద గీతాలకి నృత్యం చేసింది. రిసెప్షనుకి వచ్చిన ఆహూతులు మిగతా అన్ని కార్యక్రమాలకంటే గీతిక డ్యాన్సులనే ఎక్కువగా చూసారు. నేను కూడా 'నలుగురితో నారాయణా, పది మందితో గోవిందా' అన్న సామెతల ప్రకారం ఆ పాప డ్యాన్సులను చూసి ఆనందించాను కానీ...ఆ గీతిక డ్యాన్సులు ఏమయినా చైల్డ్ లేబరు క్రిందికి వస్తాయేమోనని నా మనస్సు గొణుగుతూనేవుంది. ఆ పాప మాత్రం ఆనందంగా, హుశారుగా గంతులు వేసింది మరి.
Categories: Left

గురుత్వం, త్వరణం సరిసమానం


('సుబ్బారావు సాపేక్ష లోకం' యొక్క తరువాయి భాగం...)
ఆ విధంగా త్వరణం చెందుతున్న గదికి, మనకి మామూలుగా అనుభవమయ్యే గురుత్వ క్షేత్రానికి మధ్య తేడాయే ఉండదని తెలుస్తుంది. అలా త్వరణం చెందుతున్న గదిలో లోలకాన్ని గడియారంలా ఉపయోగించుకోవచ్చు. షెల్ఫ్ లో పుస్తకాలు పెడితే అవి ఎగిరిపోతాయని భయపడనక్కర్లేదు. గోడకి నిశ్చింతగా ఆల్బర్ట్ ఐనిస్టయిన్ పటం తగిలించుకోవచ్చు. గురుత్వానికి, త్వరణానికి మధ్య సారూప్యాన్ని, సమానత్వాన్ని సూచించినవాడు ఆల్బర్ట్ ఐనిస్టయిన్. ఈ సూత్రం ఆధారంగానే ఆయన సామాన్య సాపేక్షతా సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది.

అయితే ఇక్కడ గురుత్వాన్ని అధ్యయనం చేసిన న్యూటన్ కి, గెలీలియో కి తెలియని వాస్తవం ఒకటుంది. గదిలో ఒక గోడ నుండి బయలుదేరిన కాంతిరేఖ అవతలి గోడ మీద ఎక్కడ పడుతోంది అన్నది త్వరణం యొక్క విలువ మీద ఆధారపడుతుంది. త్వరణం తక్కువగా ఉంటే, కాంతి సూటిగా ప్రయాణిస్తే ఎక్కడ పడుతుందో ఆ బిందువుకి దగ్గరగా పడుతుంది. త్వరణం ఎక్కువగా ఉంటే కాంతి రేఖ సరళ మార్గం నుండి మరింత ఎక్కువగా మళ్లుతుంది. బయటి నుండి చూసే పరిశీలకుడికి ఈ పరిణామం కాంతి రేఖ యొక్క సరళ మార్గం మీద గది యొక్క త్వరణాన్ని అధ్యారోపించడం (superimposition) వల్ల జరుగుతోందని అనిపిస్తుంది.

కాంతి మార్గంలో మార్పు వచ్చిందంటే అసలు జ్యామితే మారిపోయింది అన్నమాట. త్వరణం చెందుతున్న గదిలో మూడు కాంతి రేఖల వల్ల ఏర్పడ్డ త్రిభుజంలో కోణాల మొత్తం 180 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుంది. అలాగే వృత్తం యొక్క చుట్టుకొలతకి, వ్యాసానికి మధ్య నిష్పత్తి విలువ pi కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు త్వరణం చెందుతున్న వ్యవస్థలకి అతి సరళమైన ఉదాహరణలని మాత్రమే చూశాం. కాని పైన చెప్పుకున్న సారూప్యతా సూత్రం ప్రామాణిక వ్యవస్థల యొక్క ఎలాంటి చలనాలకైనా వర్తిస్తుంది.

గురుత్వానికి, త్వరణానికి మధ్య సమానత్వానికి పర్యవసానాలు ఏంటో ఇప్పుడు చూడొచ్చు. త్వరణం చెందుతున్న వ్యవస్థలో సామాన్య గురుత్వ క్షేత్రంలో కనిపించని ఎన్నో పరిణామాలు కనిపించాయి. కాంతిరేఖ వంగడం, గడియారాలు నెమ్మదించడం మొదలైన ఈ పరిణామాలన్నీ గురుత్వ క్షేత్రంలో కూడా కనిపిస్తాయా? త్వరణానికి, గురుత్వానికి మధ్య పోలిక ఉండడమే కాదు, రెండిటి పరిణామాలు సరిసమానం అని అనుకోవచ్చా?

కేవలం తార్కికంగా చూస్తే ఈ రెండు పరిణామాలు సరిసమానం అనే అనుకోవాలని అనిపిస్తుంది. కాని ఆ విషయం కచ్చితంగా తేల్చుకోవాలంటే ప్రత్యక్ష ప్రయోగం చేసి తీరాల్సిందే. మన చుట్టూ కనిపించే భౌతిక పరిణామాలన్నీ, ఏ మినహాయింపులు లేకుండా, ఓ ఇంపైన సైద్ధాంతిక నిర్మాణంలో ఇమిడిపోవాలని మానవ మేధస్సు ఆశిస్తుంది. మనం ఆశించినట్టుగానే గురుత్వానికి ఈ కొత్త లక్షణాలన్నీ ఉన్నట్టు ప్రయోగాలు సాక్ష్యం చెబుతున్నాయి. అయితే త్వరణానికి, గురుత్వానికి మధ్య ఈ సమానత్వం యొక్క పర్యవసానాలు అత్యల్పమైనవి. అందుకే వాటి కోసం ప్రత్యేకంగా వెతికితే తప్ప వాటిని కనిపెట్టడం వీలుపడలేదు.

ఆ పరిణామాలు ఎంత అల్పంగా ఉంటాయో ఒక అవగాహన రావడానికి ఓ చిన్న ఉదాహరణ చూద్దాం.

(సశేషం...)
Categories: Left

ఫొటో జవాబు

http://srikaaram.wordpress.com/feed - Sun, 09/05/2010 - 22:50

బాస్క్, స్పెయిన్

సమాధానం ఇచ్చిన వారు:

madhav
madahv@madhav.com


Categories: Left

ఇ.వి.ఎం లలో మోసం ఎలా ఉండగలదో చూద్దాం…

http://srikaaram.wordpress.com/feed - Sun, 09/05/2010 - 11:53

అమెరికాలో 2004 లో జరిగిన ఎన్నికలలో ఎన్నికల అధికారి స్వయంగా మోసం చేయగలిగే ప్రక్రియను పరీక్షించి ఒప్పుకున్న వీడియో ఒకటి చూద్దాం.2009 లో మన దేశంలో జరిగిన ఎన్నికలలో ఇ.వి.ఎం ల ద్వారా మోసాలు జరిగినట్లు వివాదాలు రావటం, ఎన్నికల సంఘం తోసిపుచ్చటం మనం చూసాం.మెమొరీ కార్డ్ ద్వారా మోసం చేయవచ్చు అన్నది, కంప్యూటర్ ద్వారా వెనక్కి లెక్క పెట్టించగలిగే పని కూడా చేయించవచ్చన్నది వాస్తవం.మోసం జరిగింది, జరగనిదీ విచారణ ద్వారా కానీ తెలియదు.కానీ ఎట్టి పరిస్థితులలో జరగటానికి వీలు లేదు అని మాత్రం చెప్పటం చాలా తప్పు!

ప్రజాస్వామ్యం యొక్క హాకింగ్!

ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలలో ఒక పార్టీకి ఒక్క వోటు కూడా రాకపోవటం అనేది చూసాక ఎక్కడో తేడా ఉన్నదని పలువురూ భావిస్తున్నారు. అలాంటి నియోజకవర్గాలలో నెగెటివ్ నంబర్ల ద్వారా ముందరే మైనస్ లో ఆ అభ్యర్థికి వోట్లు ఉండటం వలన లెక్కలు అలా వస్తాయని అర్థమవుతోంది…

~~~***~~~


Categories: Left

ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్

నా డైరీ నుండి...
02-12-81
'ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్' అన్న ఇంగ్లీషు హాలీవుడ్ టెక్నికలర్ సెక్స్ సైన్స్ సైంటిఫిక్ సినిమాను ఉదయం మార్నింగ్ షో లో చూసాను. అంతా చాలా ధైర్యంగా చిత్రించాడు. 4,5 ఆపరేషన్లు, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన సమాచారం, వాళ్ళు 'చేసు'కోవడానికి 6 పొజిషన్లు, పిల్లలు బయటకి రావడం మొదలైనవి ఈ సెక్స్ సైన్స్ సినిమాలో చూపించారు. స్త్రీలు కూడా ఈ సినిమాకు బాగానే వచ్చారు. ఇది నా జీవితంలో అదృష్టవంతమయిన సంఘటన అని పేర్కొనవచ్చు.   -----------------------   ఆ సినిమాకు సంబంధించి ఇంకో విషయం నాకు గుర్తుకువుంది. ఆ సినిమాలో బాగా జూం ఇన్ చేసి ఏవో చూపించేవాడు. అంత దగ్గరగా, మరీ క్లోజప్లో చూపించేసరికి అదేంటో మాకు అర్ధం అయ్యేది కాదు. జూం అవుట్ చేసేసరికి అదేంటో తెలిసి సినిమా హాలు అంతా ఘొల్లున నవ్వులు. మరి మేము బ్లూ ఫిల్ములు చూడని కాలం అది. అలాంటప్పుడు మరి ఏవయినా అంత దగ్గరగా చూపిస్తే మనస్సుకు చక్కిలిగింతలు కావూ!
Categories: Left

తస్మయ్ శ్రీ గురవే నమః...

Wish you a very Happy Teachers' Day wishes....

Teachers’ Day in India is celebrated on September 5th of every year to commemorate the birthday of Dr. Sarvepalli Radhakrishnan. He was the first Vice President of India (1952-1962), and the second President of India (1962-1967). Radhakrishnan was one of India's most acclaimed scholars of comparative religion and philosophy. He is considered through his efforts to have built a bridge between East and West by having shown the philosophical systems of each tradition to be comprehensible within the terms of the other. He wrote authoritative exegesis/journal of India's religious and philosophical literature for the English speaking world.

When he became President, some of his students and friends requested him to allow them to celebrate his birthday, September 5th. He replied, "Instead of celebrating my birthday, it would be my proud privilege if 5th September is observed as Teachers' Day". His birthday has since been celebrated as Teachers' Day in India. Teachers’ Day is also celebrated in various other countries across the world on various dates, a day which is intended to be a special day for the appreciation of teachers. Also, World Teachers' Day is held annually on 5th October since 1994 to commemorate teachers’ organizations worldwide.

Its aim is to mobilize support for teachers and to ensure that the needs of future generations will continue to be met by teachers. According to UNESCO, World Teachers' Day represents a significant token of the awareness, understanding and appreciation displayed for the vital contribution that teachers make to education and development. Education International (EI), the global union federation that represents education professionals worldwide, strongly believes that World Teachers' Day should be internationally recognized and celebrated around the world. Every year, EI launches a public awareness campaign to highlight the contributions of the teaching profession.

On this day, students show their appreciation to the teachers by wishing them and presenting the gifts including cards and flowers. Also, at some schools/institutions on this day, the responsibility of teaching is taken up by the senior students as an appreciation for their teachers.

Many many happy returns of the day.

Categories: Left

ఫొటో జవాబు

http://srikaaram.wordpress.com/feed - Sat, 09/04/2010 - 22:41

ఈ అండర్ వాటర్ ఫాషన్ షో ఇటీవల దక్షిణ కొరియా లో జరిగింది


Categories: Left

కిట్టిగాడు loves ఎదురింటి అమ్మాయి - 4


జన్మభూమి ఎక్స్ ప్రెస్ కిట్టిగాడి జన్మభూమిని దాటి వైజాగ్ వైపు పరుగులు తీస్తుంది...కిట్టిగాడు మూతిబిగించి మూడంకె వేసి ఓ మూలాన కుర్చుని కిటికీలోంచి వెనక్కి పరుగులు తీసే చెట్టూచేమలను చూస్తూ ఏవో ఆలోచనలలో మునిగిపోయాడు...
"ఎస్...కిరణ్ అంటే నాకిష్టం...హీ ఈజ్ జెమ్ ఆఫ్ ఎ గై...""అంటే...నువ్వతన్ని లవ్ చేస్తున్నావా?""అనుకుంటా....ఏమో...నాకే తెలిదు...కానీ, తను నన్ను లవ్ చేస్తున్నాడు..అది నాకు తెలుసు..""..........""ఏంటో...ఆ ఫీలింగ్ కొత్తగా ఉంది...తను నాకు ఒక వారం పది రోజుల్లో ఖచ్చితంగా ప్రపోస్ చేస్తాడు.."".........""సారీ...సుత్తి చెప్తున్నానా?...ఏంటి సైలెంట్ గా ఉన్నారు??...""ఏం లేదు....తలనొప్పిగా ఉంది...మళ్ళీ వస్తాను ...""జావా లాజిక్స్ ఎప్పుడు చెప్తారు నాకు ??"కిట్టిగాడికి ఏడుపు తన్నుకుంటూ వస్తుంది లోపలి నుంచి...జావా రాకపోయినా ఎంత కష్టపడి మేనేజ్ చేశాను..అంతా సుస్మీ కోసమే కదా...ఇప్పుడు ఇంకెవరి కోసం జావాలాంటి జావా చదవాలి..."రేపు చెప్తాను..." అంటూ వచ్చేశాడు...
ఆలోచనల్లోంచి బైటకి వచ్చి కిటికీ బైటకి చూశాడు ...ట్రైన్ అనకాపల్లి స్టేషన్ లో ఆగింది...ఎవరో  అమ్మాయి ఎక్కి తన ఎదురుగా కూర్చుంది..ఎక్కీ ఎక్కడంతోనే బ్యాగ్ లోంచి "జావా కంప్లీట్ రిఫరెన్స్" బుక్ తీసి చదివేస్తుంది...ఆ బుక్ చూడగానే ఇవి అని చెప్పలేని ఎన్నో ఫీలింగ్స్ కలిగాయి కిట్టిగాడికి....జావా పుస్తకం కవర్ పేజ్ మీద సుస్మీ ముఖమే కనిపిస్తుంది ...
"ఏంట్రా సడన్ గా ఊరి ప్రయాణం ..ఇంకా వారం రోజులు సెలవులు ఉన్నాయిగా.." అడిగింది కిట్టూ వాళ్ళమ్మ.."వెళ్ళాలమ్మా...సప్లీ రాసే వాళ్ళకి జావా క్లాసులు మొదలెట్టారంట...ఈ సారైనా గట్టెక్కాలిగా...""ఏంటో ఎర్రి నాగన్న...పాపం నీకు ఈ జావా కష్టాలెంటో?..సరే వెళ్ళు...అయినా జావా రానివాడివి ఆ పిల్లకేం చెప్పావురా?""తెలిసింది చెప్పాలేమ్మా...ఊరికే ఆ అమ్మాయి వచ్చినప్పుడు, నాకు జావా రాదనీ...అరియర్స్ ఉన్నాయని చెప్పకు...ప్లీజ్..""హుమ్...వీటికేం తక్కువ లేదులే....వెళ్లి బట్టలు సర్దుకో..."
ఆలోచనల్లో ఉండగానే ట్రైన్ వైజాగ్ స్టేషన్ చేరింది...కిట్టు ఎదో పరధ్యానంలో ఉన్నట్లుగా హాస్టల్ రూమ్ కి చేరాడు...వచ్చీ రావడంతోనే బెడ్ మీద వాలాడు..హాస్టల్ మొత్తం ఖాళీగా ఉంది...ఇంకా ఎవరూ ఊర్ల నుంచి రాలేదు....మనసంతా అదేదో విధంగా...పరాగ్గా..చిరాగ్గా ఉంది కిట్టిగాడికి..రాజు గాడికి డైల్ చేసాడు ...
"హలో కిట్టిగా...ఏట్రా సంగతి..."
"ఏంలేదు...హాస్టల్ కి వచ్చాను ఇందాకే...ఈవెనింగ్ భీమిలి రోడ్ దెగ్గరికిరా...నీతో మాట్లాడాలి ..." "హాస్టల్ కి వచ్చావా...అదేంట్రా సడన్ గా...ఏమైంది...సుస్మీకి సంగతి చెప్పవా...?"ఫోన్ కట్ చేసిన శబ్దం....
సముద్రం ప్రక్కగా సాగే భీమిలి రోడ్ ఆహ్లాదంగా..ప్రశాంతంగా ఉంది...ఇద్దరూ సముద్రపు ఒడ్డున చెరొక రాయి మీద కూర్చున్నారు...నిముష నిముషానికి తాకి వెళ్ళే అలలు..ముఖానికి చల్లగా తాకుతూ పలుకరించే చిరుగాలులు...ఎంతో ప్రశాంతమైన వాతావరణం...కాని కిట్టిగాడి మనసులో మాత్రం అందుకు పూర్తి విరుద్ధమైన వాతావరణం...
"సో...అయితే...ఆ అమ్మాయి ఆల్రడీ ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తుందనమాట...""........""హుమ్...ఈ అమ్మాయిలు ఇంతేరా..వంటి మీదకి వయసు వచ్చిందని తెలిసేలోపే, ప్రక్కన బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనుకుంటారు...మనలాగా లేట్ గా ప్రేమించే వాళ్ళకి ఆప్షన్స్ తక్కువ...ఈ కాలంలో టెన్త్ క్లాస్ నుంచే ఉంటున్నారు అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్...మరి, అసలు లవ్ చెయ్యడానికి సరైన వయసేంటో..కాలమే డిసైడ్ చెయ్యాలి...టెన్త్ క్లాస్ లో లవ్ చేస్తే, ఆ వయసులో లవ్ అంటేనే ఏంటో తెలీదు..అదంతా అట్రాక్షన్ అంటారు...సరే అని సెటిల్ అయ్యాక లవ్ చేద్దామంటే, ఒక్కటంటే ఒక్క అమ్మాయి ఫ్రీగా ఉంటే ఒట్టు...ఏమంటావు ?"".......""ఒరేయ్...నేనే వాగుతున్నాను...నువ్వేంటి మౌన ముని వేషం వేసావు...సరేలేరా, బాధపడకు.. సుస్మీ కాకపోతే...రాష్మీ..అది కాకపోతే దాని అక్క నూకాలమ్మ..."చిరాగ్గా చూశాడు కిట్టిగాడు రాజు గాడి వైపు ...."ఏంటి అలా చూస్తున్నావ్..పేరేంటి అలా ఉందనా?...ఆ పిల్ల నూకాలమ్మ తల్లి దయ వల్ల పుట్టిందని పాపం దాని పేరు, రాయబోయే పరిణామాలు కూడా ఆలోచించకుండా నూకలమ్మా అని ఎట్టేసారు...దాని చెల్లి కేమో రాష్మి...ఎమన్నా పొంతనుందా అసలు...పాపం ఆ పిల్ల నూకాలమ్మ అనే పేరుతో ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసురా..అందరూ ఎగతాళి చెయ్యడమే..అందుకే కాలేజీకి వచ్చాక, ఆ పిల్లని ఎవరన్నా పేరు అడిగితే "అయాం నూకల్ అని చెప్తుంది..."..ఈ నాకోడుకులేమో అదేదో నార్త్ పెరనుకని "వావ్ వాట్ ఏ స్వీట్ నేమ్ యు హావ్" అని దాని ముందు కటింగు..."


"ఒరేయ్...ఏంట్రా నీ సుత్తి..అసలే మనసు అదోలా ఉంటే ...""సుత్తి కాదురా...అంచేత నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మనకేదో లేదని ఫీల్ అయ్యే కన్నా..ఉన్న దాన్నే మనకి అనుగుణంగా మార్చుకుంటే సరి...నూకాలమ్మ నుండి మిస్.నూకల్ లాగా...""అర్థం కాలేదు...""ఓరినీ...ఇదేమన్నా జావా ప్రోగ్రామా...అది కాదురా...సుస్మీ దక్కలేదు అని బాధపడేకన్నా..మనకి అందుబాటులో ఉన్న నూకాలమ్మనో..నాంచారమ్మనో లైన్ లో పెట్టుకోవచ్చు...నువ్వేం దిగులు పడకు...సెట్ చేద్దాంలే...""ఏంట్రా సెట్ చేసేది...నువ్వు తేలిగ్గానే చెప్తావ్...నీకేంటి...మూడు రోజుల్లోనే ఆ పిల్లతో ఎన్నెన్నో ఊహలు...ఎంత కష్టపడి నేనెంటే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసానో తెలుసా...ఈష్టు గోదావరి కేట్ విన్ స్లెట్ రా ఆ పిల్ల...అసలు ఆ నవ్వు ఉంటుంది..వెన్నెల్లో మల్లెపూల జల్లులు కురిసినట్లుగా ఉంటుందిరా...""వెన్నెల్లో మల్లెపూలు కురిసినా...అమావస్యలో అరిటాకులు రాలినా...ఆ పిల్లని నువ్విప్పుడు మరచిపోవాలి..You have to get over her and keep going...""..............."
                                               **********"కిట్టూ ఊరెళ్ళాడమ్మా...." చెప్పింది కిట్టూ వాళ్ళమ్మ ఆ మరునాడు సుస్మీ కిట్టూ కోసం రాగానే..."అవునా...ఎప్పుడు వెళ్లాడు ఆంటీ...కనీసం నాకు మాట కూడా చెప్పలేదు...""నిన్నే వెళ్లాడు...ఏవో క్లాసెస్ ఉన్నాయని అర్జెంటుగా వెళ్లాడు...చెప్పకుండా వెళ్ళాడని ఏమీ అనుకోమాకమ్మ...ఆడో తింగరోడు..ఏ ధ్యాస పడితే ఆ ధ్యాసే...""అబ్బే అదేం లేదంటీ....సరే వెళ్ళొస్తాను...""అలాగేనమ్మా..."                                              ***********
రోజులు గడుస్తున్నాయి...కిట్టూకి తరచూ సుస్మీ గుర్తొస్తున్నా, కావాలనే తనని తను వేరే వ్యాపకాల్లో బిజీగా ఉంచుకుంటూ, క్రమంగా తన ఆలోచనలను సాధ్యమైనంత వరకు తగ్గించేశాడు...సెలవులు వస్తున్నా ఇంటికి వెళ్ళడం మానేసాడు..ఇంటికి వెళ్తే మళ్ళీ పరిస్థితి ఎక్కడ మొదటికి వస్తుందో అని భయం....ఎప్పటికప్పుడు వాళ్ళమ్మ ఫోన్ చేస్తూ అడుగుతూనే ఉంది, ఏంట్రా ఇంటికి రావడమే మానేసావు అని...కిట్టిగాడు అప్పటికప్పుడు ఎదో ఒక వంక చెప్పి కుదరడం లేదు అని చెప్పెసేవాడు...వాళ్ళమ్మ ఫోన్ చేసిన ప్రతీసారీ సుస్మీ ఎలా ఉంది అనే మాట గొంతుదాకా వచ్చి ఆగిపోయేది...ఎందుకో పాపం అప్పుడు వాడికే ఏడుపు వచ్చేది....

                                          *************
రోజులు గిర్రున తిరిగాయి...సంవత్సరం గడించింది...కిట్టిగాడు ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమ్ లో ఉన్నాడు...వెనకేసుకున్న పద్నాలుగు రాళ్ళు ఒక్కొక్కటీ ఏరి వేసే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు...అన్నిఅరియర్స్ చివరి సెమ్ అయ్యేలోగా పూర్తి చెయ్యాలని ధృడంగా అనుకున్నాడు...మరొక విశేషమేమిటంటే, మనోడు జావాలో పాస్ అయ్యాడు...సెవెంత్ అటెంప్ట్ లో...కిట్టిగాడి దృష్టిలో అటెంప్ట్ ఎన్నోది అనేది కాదు ముఖ్యం, పాస్ అయ్యామా లేదా...అంతే...
ఈ సంవత్సర కాలంలో ఇంటికి వాడు ఒక్కసారి కూడా వెళ్లలేదు...పాపం కుర్రోడు ఎంత ఇరగ పొడుస్తున్నాడో ఇంటికి కూడా రావడం మానేసాడు అని...కిట్టిగాడి అమ్మగారే ఓ రెండు సార్లు వచ్చి వెళ్లారు వాడి దెగ్గరికి...ఆమె వచ్చినప్పుడు సుస్మీ గురుంచీ వాడూ అడగలేదు...ఆమె కూడా చెప్పలేదు...
ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ లో మళ్ళీ బిజీ అయ్యాడు కిట్టిగాడు...ఒక నెలరోజులు ఏవేవో కుస్తీలు పడి, చివరికి వల్లకాక ఒక మూడువేలు పెట్టి బైట మార్కెట్ లో రడీగా చేసిపెట్టిన ప్రాజెక్టు కొనేసి...సబ్మిట్ చేసేసి...వైవా ఎదో అలా కానిచ్చేసాం అనిపించేసుకొని ఊపిరిపీల్చుకున్నాడు...
తరువాత మళ్ళీ పద్నాలుగు సబ్జెక్టుల మీద దండయాత్ర కొనసాగించాడు...ఎలాగైనా అన్ని అరియర్స్ క్లీన్ స్వీప్ చెయ్యాలని అనుకున్నాడని ప్రతి సబ్జెక్టు నీతి నిజాయితీగా రాయడానికి మన కిట్టిగాదేమైనా హరిశ్చంద్రుడా? ధర్మరాజా??...అందుకనే అప్పటిదాకా అమలుచేయ్యని నానా విధానాలు అమలు చేసాడు....ఎగ్జాంకి ముందు ఆ సబ్జెక్టుకి సంబంధించిన హై-టెక్ సిరీస్ గైడ్..స్పెక్ట్రం సిరీస్ గైడ్..రెండిటినీ మొత్తం జంబో జిరాక్స్ తీయిస్తాడు...ఎగ్జాం రోజున, ఆ సబ్జెక్ట్ జంబో జిరాక్స్ గైడ్ రాజు గాడికి ఇచ్చి బాత్రూంలో ఒక అరగంట వెయిట్ చెయ్యమని చెప్తాడు...వీడు ఎగ్జాంకి వెళ్లి..పేపర్ లో ఉన్న ప్రశ్నలు ఒక యాభై మార్కులకి సరిపడా చేతి మీద రాసుకొని, అర్జెంట్ అని చెప్పి బాత్రూంకి వస్తాడు...ఆ కంపులో అప్పటికే పాపం అరగంట వెయిట్ చేసిన రాజుగాడు..వీడి రాకకి సంతోషించి, ఆ వచ్చిన ప్రశ్నలకి సంబంధించిన ఆన్సర్లు ఆ జంబో జిరాక్స్ గైడ్ లో నుంచి చించి వాడికి ఇస్తాడు...వాడి అది షర్ట్ స్లీవ్స్ లో పెట్టుకొని ఎగ్జాం హాల్లోకి వెళ్తాడు...
హాల్లోకి వెళ్ళాక ఆ స్లిప్స్ లాఘవంగా తీసి ఆన్సర్ పేపర్ మీద ఎక్కిస్తాడు...ఆ టాలెంట్ అంత ఈజీగా రాలేదు కిట్టిగాడికి..అసలు స్లిప్స్ ఎలా రాయాలి...ఇన్విజిలేటర్ చూడకుండా స్లిప్స్ ఎలా తియ్యాలి అనే దాని మీద ఒక మూడు నెలల కఠోర శిక్షణ పొందాడు సీనియర్స్ దెగ్గర నుంచి...
మొత్తానికి పద్నాలుగు ఎగ్జామ్స్ తన జూనియర్స్, సబ్ జూనియర్స్ తో కూడా కలిసి రాసి...దిగ్విజయంగా ముగించాడు...అన్నీ క్లియర్ అవుతాయి అనే ధీమా తోణకిసలాడింది కిట్టిగాడిలో...ఫేర్-వెల్ పార్టీ అయిపొయింది...అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు...కిట్టిగాడు కూడా ఇక ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు...తను దాదాపుగా సుస్మీ ఆలోచనల నుంచి బయట పడ్డాడు...ఒక వేళ ఇప్పుడు తను ఎదురుపడినా ఇంతకుముందులా తను ఫీల్ అవ్వడు...రియాక్ట్ కాదు...ఆ నమ్మకం తనకి కలిగింది...
                                            *******దాదాపు సంవత్సరంన్నర తరువాత మళ్ళీ రాజమండ్రిలో అడుగుపెట్టాడు....సుస్మీ తనకి ఎదురుపడుతుంది...తను సుస్మీని కలవబోతున్నాడు అన్న ఉద్వేగం ఏమాత్రం లేదతనిలో...నెమ్మదిగా ఇంటికి చేరాడు....అలసటగా అనిపించడంతో కాసేపు పడుకొని లేచి...భోజనం చేసి...అలా బయటకి వచ్చాడు...ఎదురు ఇంట్లో ఎదో సందడిగా ఉంది...తను ఇప్పటిదాకా గమనించలేదు...బయట షామియాన వేసి ఉంది..కుర్చీలు వేసి ఉన్నాయి...చాలా మంది బంధువులు ఉన్నారు...మెల్లిగా సన్నాయి కూడా వినిపిస్తుంది....
వెంటనే లోపలికి వచ్చి "అమ్మా...ఏంటి ఎదురింట్లో ఎదో సందడిగా ఉంది ..." అన్నాడు"అదా...వాళ్ళ అమ్మాయి పెళ్లి...ఎల్లుండే...ఈ రోజు పెళ్లి కూతురిని చేసినట్లున్నారు...""పెళ్ళా...ఆ అమ్మాయికి అప్పుడే పెళ్ళా...ఇంకా ఇంజినీరింగ్ కూడా పూర్తి కాలేదు కదా...పైగా ఆ అమ్మాయి..." అంటూ ఆగిపోయి..."అవునూ... ఆ అమ్మాయి చేసుకోబోయేది కిరణ్ అనే అబ్బాయినే కదా ..." అన్నాడు"కిరణా??...కాదే..ఆ అబ్బాయి పేరు కిషెన్ అని చెప్పినట్లు గుర్తు...చెన్నైలో జాబ్ చేస్తున్నాడట ...""అవునా..." ఒక్కసారిగా ఆశ్చర్యం..బాధ..కోపం..అన్ని ఎమోషన్స్ వచ్చాయి..."కిరణ్ ని లవ్ చేసి...కిషెన్ ని ఎలా పెళ్లి చేసుకుంటుంది....ఈ అమ్మాయిలంతా ఇంతేనా..." అంటూ మనసులోది బయటకి వెళ్ళగక్కాడు...వాళ్ళమ్మ విస్తుపోయి..."ఒరేయ్...కిట్టిగా...అయినా ఈ పిల్ల గురుంచి నీకెలా తెలుసురా??..కిరణ్ అంటావ్..లవ్ అంటావ్...""ఎలా తెలిసేది ఏంటమ్మా!!...ఒక సంవత్సరం ఇంటికి రాకపోయేసరికి...ఎదురింటి సుస్మీని ఎలా మరచిపోతాను..." అన్నాడు ఆవేశంగా..."ఓరినీ...ఏడ్చినట్లే ఉంది నీ తెలివి...అయినా నేను కూడా నీకు చెప్పడం మరచిపోయానులే..." అందామె"ఏంటది..." అడిగాడు ఆత్రుతగా "సుస్మీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఆరునెలలు కావస్తుంది...వాళ్ళ తాతగారికి వొంట్లో బాగుండటం లేదట..చివరి రోజుల్లో మనవరాలు కూతురు తన దెగ్గర ఉండాలని ఆయన కోరికట...అందుకే వాళ్ళు కాకినాడ షిఫ్ట్ అయిపోయారు...తరువాత వీళ్లోచ్చారు...వాళ్ళ అమ్మాయిదే ఇప్పుడు పెళ్లి...ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ కూడా చేస్తుంది...""అవునా...సుస్మీ వాళ్ళు వెళ్లిపోయినట్లు కనీసం నువ్వు ఒక్క మాటైనా చెప్పలేదేంటమ్మా..."ఎదో చిన్న దిగులు కిట్టిగాడిలో..."ఏంటో సమయానికి గుర్తురాలేదురా..నువ్వా హాస్టల్ నుంచి కదలకపోతివి...నీకు ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వెలా వున్నావో అన్న దిగులుతో మిగతా విషయాలు ఏమీ గుర్తుకురాలేదు... నువ్వెళ్ళిన మరుసటి రోజు నీకోసం వచ్చింది..కనీసం నువ్వు తనకి మాటైనా చెప్పకుండా వెళ్లిపోయినందుకు నొచ్చుకుంది...పాపం..మంచి పిల్లరా..."ఆ మాటలు వింటుంటే కిట్టిగాడికి ఎందుకో మళ్ళీ సుస్మీ మీద కొంచెం మనసు లాగడం స్టార్ట్ చేసింది...కానీ అలాంటి ఆలోచనని వెంటనే తుడిచేసాడు...."నేను ఒక వారంలో హైదరాబాద్ వెళ్తున్నానమ్మా...జాబ్స్ కి ట్రై చెయ్యాలి...."
                          ****** (రెండు సంవత్సరాల తరువాత)********ఇన్ఫోసిస్ క్యాంపస్, హై-టెక్ సిటీ, హైదరాబాద్...
"వేర్ ఈజ్ చైతూ...." అప్పటికి నాలుగోసారి అడిగాడు మేనేజర్ కందసామి...."ఇంకా రాలేదు సర్..." చెప్పింది శ్వేత "అయ్యయ్యో కడవులే...ఇంద చైతూతో పెట్టుకుంటే..మన పని తిరుప్పతి బాలాజీ నామమే...ఎంగాప్పా ఇంద పయ్యన్...""కాల్ చేశాను సార్...లిఫ్ట్ చెయ్యడం లేదు....""ఎందుకు చేస్తాడు...చెయ్యడు...డెలివెరీ దా ఉండాది...గమ్మున రమ్మని నిన్న సిలక్కి సొల్లినట్లు కదా సొల్లాను...""మీరు టెన్షన్ పడకండి సర్...మేమంతా ఉన్నాం కదా..." అన్నాడు రమేష్ మధ్యలో కలుగజేసుకుంటూ..."ఎందప్పా ఉండేది మీరు...డెలివరీ టైంకి ఏదన్నా ప్రాబ్లం వస్తే...పైకి కిందకీ సూస్తారు..చైతూ ఉంటేనే కదా,సాఫీగా డెలివరీ అయ్యేది..."..అందరూ ముసి ముసి నవ్వులు..."అదేనప్పా ప్రాజెక్ట్ డెలివరీ...జావాలో కింగ్ అంటే చైతూనే నప్పా...అందుకే చైతూ ఏంత లేట్ గా వచ్చినా...చెప్పకుండా సెలవు పెట్టినా నేనేమి అనను...అంద పయ్యన్ కి జావా మీద గ్రిప్ అట్టాంటిది..కింగ్ ఆఫ్ జావా అప్పా..."
పల్సర్ 180CC బండి ఒక్కసారిగా దూసుకు వచ్చింది పార్కింగ్ లాట్ లోకి...ఒక్క ఉదుటున దిగి...లిఫ్ట్ లాబీకి వచ్చి, ఆఫీస్ లో అడిగుపెట్టాడు...కృష్ణ చైతన్య...అలియాస్ చైతూ...అలియాస్ మన కిట్టిగాడు...
కిట్టిగాడికి చూడగానే, మేనేజర్ ముఖం వెలిగిపోయింది..."ఎన్నప్పా చైతూ....ఇంత లేట్ గా వస్తే ఎలా...డెలివరీ ఎవరు సేస్తారు...నువ్వుదా సేయ్యాలి...""డెలివరీ గురుంచి మీరు మర్చిపోండి...నొప్పులు లేకుండా..సారీ బగ్గులు లేకుండా సాఫీగా చేస్తాను...చైతూ ఈజ్ హియర్..జావా అయినా దాని అబ్బ అయినా మన ముందు సలాం చెయ్యాల్సిందే మిస్టర్ కందాజి...""గుడ్...గుడ్...నాకు తెలుసప్పా చైతూ నీ గురుంచి...""తెలుసు కదా...ఇక మీరు కాబిన్ కెళ్ళి రిలాక్స్ అవ్వండి..." అంటూ సీట్ లో కూర్చున్నాడు....కందసామి వాడి కాబిన్ లోకి వెళ్ళాక..."అరవోడు చంపేస్తున్నాడు...రమేష్...శ్వేతా...పదండి అలా కాంటీన్ కెళ్ళి కాఫీ తాగుదాం..." అన్నాడు కిట్టూ లేస్తూ..."చైతూ...రిలీజ్ అయ్యేదాకా మనం సీట్ నుంచి లేస్తే..శివతాండవం చేసేలా ఉన్నాడు కందసామి...""వాడి బొంద...డెలివరీకి ఇంకా అయిదు గంటల టైం ఉంది...దానికి నాకు గంట చాలు...పదండి..."
"చైతూ...జస్ట్ రెండేళ్ళ అనుభవంతో జావాలో ఇంత ప్రోఫిషియన్సీ ఎలా సాధ్యం అయింది...ఒక ఏడు ఎనిమిదేళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు చెయ్యలేని ప్రోగ్రామ్స్ మీరు అవలీలగా చేసేస్తున్నారు..." అడిగింది శ్వేత"కసి...జావా మీద కసి...అది నాతో ఎంత ఆడుకుందో...దానితో ఇప్పుడు నేను డబుల్ ఆడుకుంటున్నాను...ఒకప్పుడు జావా అంటే అదొక గొరిల్లా...ఇప్పుడు అదొక గండు చీమ...తొక్కి అవతల పడేస్తా...దీని వల్ల లైఫ్ లో ఒకటి నేర్చుకున్నా...దేన్నయినా చూసి దడుచుకోకూడదు...దాన్ని జయించాలి...వీలు అయితే మన ముందు తోకలేపకుండా తొక్కి పడెయ్యాలి అని..." అన్నాడు ధీమాగా..."వావ్...వే టు గో చైతూ..." అంది అభిమానపూర్వకంగా.."చైతూ..రేపు మన టీమ్ లో ఒక ఫ్రెషర్ జాయిన్ అవ్వబోతుంది...బాస్ చెప్పాడు..." అన్నాడు రాజేష్...
"అవునా...ఎవరు?""ఏమో...ఆ అమ్మాయికి జావాలో నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలంట...""హుమ్....చూద్దాం..."
                                              ************"చైతూ వీ హావ్ గాట్ ఎ న్యూ జయినీ ఇన్ అవర్ టీం....""ఓహ్...హూ ఈజ్ దట్ కందాజీ..." అన్నాడు చైతూ "ఎ ఫ్రెషర్....నీకు పరిచయం చేస్తానప్పా..ఆమెని మన టీమ్ కి అసైన్ చేసారు కాబట్టి, నువ్వే ఆమెని జావాలో ట్రైన్ చెయ్యాలి..." అన్నాడు కందసామి..."ఐ విల్ డూ మై బెస్ట్ కందాజీ..."కందసామి ఫోన్ తీసి డైల్ చేసి..."శ్వేతా...న్యూ జయినీ వచ్చిందా....""ఓ.కె...గుడ్...ఆస్క్ హర్ టు కం టు మై కాబిన్.."
ఒక రెండు నిముషాల్లో ఒక అమ్మాయి లోపలి వచ్చింది...కిట్టు వెనుకగా నిల్చుని ఉంది..."హలో యంగ్ గర్ల్....వాట్స్ యువర్ నేమ్...." "సుస్మితా...."ఆ పేరు వినగానే చివాలున తల వెనక్కి తిప్పి చూశాడు.... తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు...కొయ్యబొమ్మలా ఆ అమ్మాయినే చూస్తూ ఉండి పోయాడు...ఒక్కసారిగా కిట్టూ మెదడు మొత్తం మొద్దుబారినట్లు అయింది...అప్రయత్నంగా అతని నోటి నుంచి వచ్చింది ..."సు..స్మీ..." అని...
                                       --- To be continued in the 5th part.
[ఆలస్యంగా మీ ముందుకు వచ్చినందుకు క్షమించాలి...కొన్ని పర్సనల్..కొన్ని ప్రొఫెషనల్ పనుల్లో బిజీగా ఉండి ఒక మూడు వారాలుగా బ్లాగు జోలికి రాలేదు...ఇక నుండి టపాలు త్వరగానే అందిస్తాను...మీ అభిమానం ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తాను....ఇట్లు మీ --- కిషెన్ రెడ్డి ]
Categories: Left
Syndicate content