జీవితం అంటే నిరంతర పోరాటమే

 

ఒక వివేకానంద కోట్:

మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.

 

అప్పటి రోజుల్లో కూడా ఒకే లక్ష్యం వైపు పయనిస్తూ ఆదిపత్యం కోసం గ్రూపులు, ముఠాలు అంటూ కొట్టుకున్నారని వింటుంటే  మార్పుఎప్పటికీ రాదు అనిపిస్తుంది.

 

ఇంకో వివేకానంద కోట్:

పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.

 

మనలో నిజాయితీ వుంది అని అనుకున్నప్పుడు ఎవరికీ భయపడ వలసిన పని లేదు. మన కోసం కానీ, సమాజం కోసం  కానీ, జీవితం అంటే నిరంతర పోరాటమే.

 

మరొక వివేకానంద కోట్:

ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.

 

నిరంతర ప్రయత్నంతో ఏదైనా సాధించవచ్చు.

Syndicate content